Cultural programs
-
అలరించిన పేరిణి శివతాండవం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిశాక శనివారం రాత్రి హెచ్ఐసీసీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరీంనగర్ జిల్లా కళాకారుడు జరుకుల రతన్‌కుమార్ ప్రదర్శించిన పేరిణి శివ తాండవం అందరినీ ఆకట్టుకుంది. రతన్‌కుమార్ ప్రదర్శన పూర్తయిన వెంటనే ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఇతర వీఐపీలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సొంతమైన పేరిణి శివ తాండవం కాకతీయ రాజుల కళాసృష్టికి నిదర్శనం. అంతరించిపోతున్న ఈ కళకు నటరాజ రామకృష్ణ పునః ప్రతిష్ట చేయగా.. రతన్‌కుమార్ ఆయన వద్ద శిష్యరికం చేసి, నేర్చుకున్నారు. గతంలోనూ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. -
సింగపూర్ లో దిగ్విజయంగా ప్రారంభమైన "శ్రీమద్ భాగవత సప్తాహం"
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలోఅంతర్జాల వేదికపై నిర్వహిస్తోన్న "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. అవధాన సామ్రాట్ డాక్టర్ మేడసాని మోహన్ ఆధ్వర్యంలో భాగవత ప్రవచన కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. శృంగేరి పీఠాధిపతులు విధుశేఖరానంద భారతి స్వామి, కుర్తాళం పీఠాధిపతిలు సిద్దేశ్వరానంద భారతి స్వామిలు శుభాకాంక్షలు వీడియో సందేశం రూపంలో అందించారు, ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, అమెరికా నుండి మల్లిక్ పుచ్చా, ఆస్ట్రేలియా నుండి విజయ తంగిరాల, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, థాయిలాండ్ నుంచి రవికుమార్ బొబ్బ, మలేషియా నుండి డా అచ్చయ్య రావు, సౌదీ అరేబియా నుండి దీపిక రావి తదితరులు, భారత్ నుండి తెలుగు భాగవత ప్రచార సమితి అధ్యక్షుడు ఊలపల్లి సాంబశివరావు దంపతులు మరియు వివిధ దేశాల తెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు. -
సాహితీ పరిమళం.. సౌ'భాగ్య' ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతుల్ని ఒక వేదికపైకి తెచ్చే హైదరాబాద్ సాంస్కృతిక ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్)కు రాజధాని ముస్తాబైంది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటికే హెచ్ఎల్ఎఫ్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తొమ్మిదో ఎడిషన్ వేడుకలకు చైనా అతిథి దేశంగా హాజరుకానుండగా..గుజరాతీ భాషా సాహిత్యాన్ని ఈ ఏడాది భారతీయ భాషగా ఎంపిక చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాది కావడంతో ఆయన తత్వ్త చింతన, సిద్ధాంతాలు, ఆయనపై రూపొందిన సినిమాలపై ఈ వేడుకల్లో చర్చలు, సదస్సులు జరగనున్నాయి. పెద్దనోట్ల రద్దు, ఆధార్ గుర్తింపు, ‘మీ టూ’ఉద్యమం, సమాజంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు, తదితర అంశాలపైన ఈ వేడుకల్లో లోతైన చర్చలు జరగనున్నాయి. చైనా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మొత్తం మూడు వేదికలపైన 30 వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ‘కావ్యధార’కు శ్రీకారం ఈ ఏడాది హైదరాబాద్ సాహిత్యోత్సవంలో సరికొత్తగా ‘కావ్యధార’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కావ్యధారలో ప్రతిరోజూ 12 గంటల పాటు నిరంతర కవితా పఠనం ఉంటుంది. ఈ కవి సమ్మేళనంలో తమ కవిత్వాన్ని చదవడమే కాకుండా దానికి వివిధ కళారూపాలను జోడించి ప్రదర్శించడం ఈ కావ్యధార ప్రత్యేకత. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలకు చెందిన కవులు ఈ వేదికను పంచుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కవిత్వానికి సైతం ఇక్కడ చోటు ఉంటుంది. ఈ కావ్యధారలో ఆచార్య ఎన్.గోపీ, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, యాఖూబ్, షబానా ఆజ్మీ, మంగళాభట్, రాజ్‌రావు, ఈల అరుణ్, చైనా రచయిత బైటా తదితరులు పాల్గొంటారు. అలాగే ‘జోష్ – జోష్–ఇ–హైదరాబాద్’పేరుతో దక్కనీ, హిందూస్తానీ కవిత్వ ప్రదర్శనతో పాటుగా లక్నోకు చెందిన కళాకారుల గ్రూపు ‘లక్నవీ కల్చర్’పై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. ‘మీ టూ’, గాంధీయిజంపై చర్చలు... గత ఏడాది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ‘మీ టూ’ఉద్యమంపై హెచ్ఎల్ఎఫ్లో మరోసారి చర్చ జరగనుంది. వైరముత్తు నుంచి ఎదురైన వేధింపులను బయటపెట్టిన చిన్మయి శ్రీపాద, ఎంజే అక్బర్ లైంగిక వేధింపులను బహిర్గతం చేసిన దీదీ’పుస్తక రచయిత, ప్రముఖ జర్నలిస్టు షుతపాపల్, బెంగళూర్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ లైంగిక వేధింపులను బయటి ప్రపంచానికి చెప్పిన సంధ్య మీనన్‌లు తమ అనుభవాలను ఆవిష్కరించనున్నారు. ‘గాంధీ ఇంపాజిబుల్–పాజిబిలిటీ’, ‘ది మహాత్మా అండ్ మూవీస్’పై పలువురు ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని ప్రసంగిస్తారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ప్రభావం అనే అంశంపైన చర్చ ఉంటుంది. ప్రముఖ రచయిత సుధీర చంద్ర, నిర్మాత సురేశ్ జిందేల్, గోవింద్ నిహ్లానీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ‘పెద్దనోట్ల రద్దు’పై చాల్స్ ఎస్సెస్సీ, రామ్మనోహర్రెడ్డి (ఈపీడబ్ల్యూ) ప్రసంగిస్తారు. ‘ది ఆధార్ స్టోరీ’పైన చాల్స్ ఎస్సెస్సీ, కళలు, కళాకారులు, రచయితలు, మేధావులు, తదితర వర్గాలపైన కొనసాగుతున్న దాడులు, వివిధ వర్గాల్లోంచి వస్తోన్న ఆందోళనలపైన నిఖిలా హెన్సీ (హిందూ), రష్మీ సక్సేనా, తదితరులు ప్రసంగిస్తారు. ముస్కాన్‌కు సన్మానం హెచ్ఎల్ఎఫ్, ఫుడ్ ఫర్ థాట్ ఆధ్వర్యంలో భోపాల్‌లో ‘బాల పుస్తకాలయ’గ్రంథాలయాన్ని నడిపిస్తున్న 11 ఏళ్ల చిన్నారి ముస్కాన్‌ను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. జగర్నాట్ పబ్లిషింగ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఆకాష్జోషి రచనకు పుస్తక ప్రచురణ అవకాశం కల్పిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా 12 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. పదేళ్ల చిన్నారి కృతి మునగాల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనుంది. కైఫే ఆజ్మీ, మృణాళిని సారాభాయిల శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా నివాళులర్పించనుంది. ఈ సందర్భంగా వారిపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడు వేదికలు–ముప్పై వర్క్‌షాపులు ఈ వేడుకల్లో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేస్తారు. ఒక వేదిక ప్రత్యేకంగా కవిత్వం కో సం కేటాయించగా మిగతా రెండు వేదికలపైన చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో 30 వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చె ప్పారు. మట్టి వస్తువుల తయారీ, స్టోరీ టెల్లింగ్, హౌ టూ రైట్ ఏ ఫిల్మ్, క్విజ్ పోటీలు, సినిమా దర్శకత్వంపై చర్చలు, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చైనా నుంచి ఎనిమిది మంది రచయితలు - అతిథి దేశంగా పాల్గొంటున్న చైనా నుంచి 8 మంది రచయితలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. చైనాకు చెందిన ప్రముఖ రచయిత ఎలాయ్ సమకాలీన చైనా సాహిత్యంపై ప్రసంగిస్తారు. - చైనా సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శిస్తారు. - మొదటి రోజు ప్రారంభోత్సవంలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత సితాన్షు యశస్చంద్ర కీలకోపన్యాసం చేస్తారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొంటారు. -
కేరళలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ సి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. -
ఐదు వేదికలు.. ఆరు ప్లీనరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం నుంచి 3 రోజులపాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 3 రోజులపాటు 5 వేదికలపైన ఆరు ప్లీనరీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. తొలిరోజు ఉదయం ‘కన్నడ సాహిత్యం అప్పుడు– ఇప్పుడు’ అనే అంశంపై ప్రముఖ రచయిత్రి ప్రతి భానందకుమార్ ప్రధాన ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం ‘లైఫ్ ఇన్ ఏ డ్యాన్స్’పై ప్రముఖ నృత్యకారిణి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతారు. 27న ‘సిటిజన్’ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’పై ప్రసంగించనున్నారు. బాలీవుడ్ నటుడు శశికపూర్ కూతురు సంజనా కపూర్ నాటక రంగం, థియేటర్ ఆర్ట్ తదితర అంశాలపై తన అనుభవాలను వివరిస్తారు. 28న ‘మీడియా టుడే’ పై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడతారు. సాయంత్రం జరిగే ప్లీనరీలో సమా చార హక్కు చట్టం కార్యకర్త అరుణారాయ్ ప్రసం గించనున్నారు. వీటితోపాటు విభిన్న సామాజిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలు, కళలపై మరో 30కిపైగా సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక జీవితాన్ని ప్రతి బింబించే కళారూపాలనూ ప్రదర్శించనున్నారు. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా నగరంలో సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నా రు. ఈసారి స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసర వల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’, శశికపూర్ ‘షేక్సిపీరియానా’, ‘టామాల్టన్’ సినిమాలు ప్రదర్శిస్తారు. వంట చేస్తూ చెప్పే ఉ.సరస్వతి రామాయణం కథ, ‘నన్న నుక్కడ్’ (చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితాసమ్మేళనం, ‘బాంబే బైరాగ్’, వికలాంగుడైన కళాకారుడు బందే నవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముస్తాబవుతున్న వేదికలు పబ్లిక్ స్కూల్లోని ‘తెలంగాణ టూరిజం పెవిలియర్’ వేదికపై 6 ప్లీనరీలు, కార్వే క్యానోసీ, టాటా, గోథె గ్యాలరీల్లో పలు రకాల కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలకు స్పెయిన్ అతిథిగా హాజరుకానుంది. సాహిత్యోత్సవాలకు ఆ దేశ మేధావులు, రచయితలు, కళాకారులు, అమె రికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ ప్రతినిధులు తరలిరానున్నారు. ఉత్సవాలకు ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ కంబారా హాజరుకానున్నారు. బెంగ ళూర్‌లో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతి నాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త ఉ.సరస్వతి, దివంగత పాత్రికేయు రాలు గౌరీ లంకేష్ స్నేహితురాలు, ఆర్టిస్టు పుష్పమేలా పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ దిగ్గజం శశికపూర్, మరో నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌లను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. -
జీఈఎస్ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
-
ఝుమ్మంది నాదం ...సయ్యంది పాదం..!
హోరెత్తిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల వేదిక సాక్షి, హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ –2016 వేదిక సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగింది. ఆదివారం ఫిల్మ్‌నగర్ – జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కూచిపూడి మువ్వల సవ్వడులతో ఘల్లుమంది. కళాకారుల నత్య విన్యాసాలు కనువిందు చేశాయి. తొలుత అంతర్జాతీయ కూచిపూడి నర్తకీ దీపికా రెడ్డి తన శిష్య బృందంతో ‘కూచిపూడి ... వందనం’నృత్య ప్రదర్శన చేశారు. నృత్యకారుల పాద మంజిర రవళులై ప్రేక్షక జగతని పులకింప చేసింది. మంత్రముగ్దుల్ని చేసిన ప్లేట్ డ్యాన్స్.. కూచిపూడి వందనంలో భాగంగా ఇత్తడి పల్లెంపై తకిట... తకిట... విజయ గణపతి... వందే లోకపాలకం నృత్యం పులకింపజేసింది. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ తొలుత వినాయక స్తుతితో ప్రారంభమైన నృత్యం బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర అంశాలతో ముగిసాయి. ఈ అంశాలను పల్లెంపై దీపకా రెడ్డి చేసిన వివిధ రకాల భంగిమలు శిలాక్షరాలు అయ్యాయి. చప్పట్లతో ప్రాంగణం మారుమోగిపోయింది. ఆలోచింపజేసిన జానపద సందేశం... సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండో అంశంగా జానపద సందేశం నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రకృతిని ఎలా కాపాడాలి..? అనే ఇతివృత్తంగా జానపద సందేశమిస్తూ సాగిన నృత్యహోరు అందరినీ పరవశింపజేసింది. ఈ సందర్భంగా దీపికా రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకైన సాక్షి దినపత్రిక ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ గీతంతో ప్రారంభమైన కార్యక్రమం జ్యోతి ప్రకాశనం, కూచిపూడి వందన నృత్యం, అవార్డుల ప్రదానోత్సవంతో ముగిసింది. -
స్వాతంత్య్రం.. సాంస్కృతికం
-
శంకుస్థాపనకు సినీ హంగులు
వేదిక నిర్మాణం నుంచి కార్యక్రమాల వరకూ దర్శకుల సూచనల మేరకు ఏర్పాట్లు! సాయికుమార్ యాంకరింగ్, శివమణి సంగీతం విజయవాడ : అమరావతి శంకుస్థాపనను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ కోసం సినీ హంగులు అద్దుతోంది. తారల తళుకు బెళుకులు, పాటలు, సంగీత కార్యక్రమాలు, నవ్వులు పండించే స్కిట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభకు వచ్చిన వారిని కట్టి పడేసే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిసింది. వేదిక నిర్మాణం నుంచి కార్యక్రమాల వరకు అన్నీ వారి సూచనల మేరకే రూపొందించారు. సాధ్యమైనంత వరకు వారిని నేరుగా కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, ప్రముఖ గాయని సునీత సభలో యాంకరింగ్ చేయనున్నారు. ప్రధానమంత్రి రావడానికి ముందు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలను వీరితో నిర్వహించడం ద్వారా ఉదయమే వచ్చిన వారిని ఆకట్టుకోవడంతో పాటు, వారు తిరిగి వెళ్లిపోకుండా ఉండేందుకు కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ సంగీత వాయిద్య కళాకారుడు శివమణి డ్రమ్స్ ప్రోగ్రాం, భవిరి రవి స్కిట్స్ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రముఖ దర్శకుల కోసం యత్నాలు వేదికను కూడా సినిమా సెట్టింగ్ మాదిరిగా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మొదట్లో ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిని సంప్రదించింది. బాహుబలి సినిమాలో అదిరిపోయే సెట్టింగ్‌లు వేసిన రాజమౌళిని వేదిక రూపకల్పన ఏర్పాట్లు చేయాలని కోరినా ఆయన స్పందించలేదు. దీంతో గోదావరి పుష్కరాల్లో హారతి ఏర్పాట్లు చేసిన మరో దర్శకుడు బోయపాటి శ్రీనుతో మాట్లాడారు. పుష్కరాల్లో పనిచేసినప్పుడు వివాదం ఏర్పడడంతో ఈసారి ఆయన ముందుకు రాలేదు. దీంతో ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ రాజీవ్ సేథీని చంద్రబాబు రంగంలోకి దించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ప్రాచీన కళారూపాలు, సాంస్కృతిక వైభవం గురించి పరిశోధన చేసిన సేథీకి అమరావతి ప్రాచీనత ఉట్టిపడేలా వేదికను నిర్మించే బాధ్యత అప్పగించారు. ఇందుకోసం ఆయనకు కోటి రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా వేదిక నిర్మాణంలో పాలుపంచుకుంటాయి. కళాత్మకతతో పాటు అందరినీ ఆకర్షించేలా సినిమా సెట్టింగ్‌లను కూడా వేదిక నిర్మాణానికి పరిశీలిస్తున్నారు. వీటితో పాటు కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కొద్దిసేపు కూచిపూడి కళాకారులు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఈ రూపకాన్ని ప్రదర్శించనున్నారు. -
రియాద్‌లో తెలుగువాళ్ల సందడి
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో గల తెలుగు కళా క్షేత్రం ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగాయి. తెలుగువారికోసం ఈ సంస్థ ఏర్పాటుచేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్య అతిథులుగా భారత్ నుంచి ప్రముఖ తెలుగు గాయకుడు సింహా, కమేడియన్ వేణు(జబర్దస్త్), మిమిక్రీ కళాకారుడు నర్సింహామూర్తి హాజరై అతిథులందరిని అలరించారు. స్థానిక గాయకుడు అంజద్ హుస్సేన్ కూడా కొద్ది సేపు పాటలతో హుషారెత్తించారు. ప్రత్యేక అతిథులుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్ధా(తాజ్) అధ్యక్షుడు మస్తాన్, మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, అంజద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు కళాక్షేత్రం అధ్యక్షుడు పీ వేణుమాదవ్ మాట్లాడుతూ గత పదేళ్లలో వారు చేసిన వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు వివరించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో పసందైన విందు కూడా ఏర్పాటు చేశారు. వందలాది ప్రవాసీ తెలుగు కుటుంబాలు వినోద కార్యక్రమాల్లో పాల్గొని సరదాగా గడిపారు. -
తెలంగాణ అవతరణ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవతరణ వేడుకలు జూన్ 1 రాత్రి 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా పేలుళ్లతో ప్రారంభమవుతాయన్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి నగదు అవార్డులను ఉత్సవాల్లో ప్రదానం చేస్తారని తెలిపారు. జిల్లాలో మండలస్థాయి, నగర పంచాయతీ/మున్సిపాల్టీ, మున్సిపల్ కార్పొరేషన్‌స్థాయి, జిల్లాస్థాయిల్లో మొత్తం 775 అవార్డులను అందజేస్తామన్నారు. వెంటనే అవార్డు గ్రహితలను ఎంపిక చేయాలని ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, సర్కస్ గ్రౌండ్లో వేడుకుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిర్వహణ కమిటీలు వేడుకల విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, అసిస్టెంట్ కలెక్టర్ అద్వైత్‌సింగ్, జిల్లా పరిషత్ సీఈవో సూరజ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, డీపీఆర్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మనోహరం..
-
సందడే.. సందడి
-
అభాగ్యుల సేవే సాయి తత్వం
‘సత్యసాయి’ జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్ పుట్టపర్తి: అర్థించే అభాగ్యులకు సేవ చేయడమే సత్యసాయి తత్వమని అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల జోన్-3 దేశాల చైర్మన్ నెవెల్లి ఫెడ్రిక్స్ పేర్కొన్నారు. సత్యసాయి 89వ జయంతి వేడుకలలో భాగంగా మూడవరోజు గురువారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన సభ్యులు సత్యసాయి మహాసమాధి చెంత పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. ఈ సంధర్బంగా నెవెల్లి ఫెడ్రిక్స్ మాట్లాడుతూ సత్యసాయి భోదించిన ప్రేమ, శాంతి, సేవా మార్గాలు మానవాళిని శాంతి జీవనం వైపు పయనింప జేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాలలో సత్యసాయి సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. -
చాంగ్ భళా
కూచిపూడి నాట్య భంగిమలతో అచ్చమైన భారతీయాన్ని ఆవిష్కరించారు విదేశీయులు. గచ్చిబౌలి హెచ్‌సీయూలో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్టడీ ఇండియా ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫెస్ట్‌లో కోర్సు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థినులు నాట్యంతో పాటు సితార ప్లే చేశారు. భారతీయ గీతాలు ఆలపించి, హిందీ కవితలు వినిపించి అబ్బుర పరిచారు. జపాన్, సౌదీ, అమెరికా, జర్మనీ, స్వీడన్, ఇరాన్‌లకు చెందిన 200 మంది తమ టాలెంట్ చూపి ఆకట్టుకున్నారు. - సెంట్రల్ యూనివర్సిటీ -
నేడు అంకురార్పణ
మైసూరు దసరా ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు ప్రారంభించనున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీశ్ కర్నాడ్ చాముండి కొండపై చాముండేశ్వరి మాత సన్నిధిలో శ్రీకారం తొలి రోజు నుంచే పలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యుద్దీపాల వెలుగులో సాంస్కృతిక నగరి 25 కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలంకరణ మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ గిరీశ్ కర్నాడ్ గురువారం ప్రారంభించనున్నారు. దీనికి వేదిక కూడా సిద్ధమైంది. ఉదయం 8.37 గంటల నుంచి 9.05 లోగా శుభ తులా లగ్నంలో చాముండి కొండపై చాముండేశ్వరి మాత సన్నిధిలో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం సాయంత్రమే రాచ నగరికి చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్, మంత్రులు డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప, హెచ్ఎస్. మహదేవ ప్రసాద్, టీబీ. జయచంద్రలు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యుడు జీటీ. దేవెగౌడ అధ్యక్షత వహిస్తారు. కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్లు కూడా పాల్గొంటారు. తొలి రోజు వివిధ కళా ప్రాంగణాల్లో నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి. చాముండి ఆలయం చుట్టూ తోరణాలు, పూల అలంకరణలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. చలన చిత్రోత్సవాలు, ఆహార మేళా, ఫల, పుష్ప ప్రదర్శన, యువ దసరా, వస్తు ప్రదర్శన, పుస్తక మేళా, బొమ్మల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తొలి రోజు నుంచే ప్రారంభమవుతాయి. దేదీప్యమానంగా... ఉత్సవాల నేపథ్యంలో సాంస్కృతిక నగరి ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాలంకరణలతో వెలుగొందుతున్నాయి. ఇప్పటికే నగరంలోని ప్రముఖ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్‌ను ఆదా చేయడానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. కొత్త పరిజ్ఞానంతో తక్కువ ధరకు ఎక్కువ వెలుగు నిచ్చే, వివిధ రకాల అలంకరణ దీపాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది తొలిసారిగా పూర్తిగా ఎల్ఈడీలను ఉపయోగించారు. హార్డింగ్ సర్కిల్ నుంచి ఫైవ్ లైట్స్ వరకు, బీఎన్ రోడ్డు నుంచి శివరామ్ పేట వరకు, రేస్ కోర్సు సర్కిల్ నుంచి టీఎన్. పుర జంక్షన్ వరకు, లలిత మహల్ నుంచి రామస్వామి సర్కిల్, రైల్వే స్టేషన్ సర్కిల్ వరకు, జేఎల్బీ రోడ్డులలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య సౌహార్ద్రతకు సంకేతంగా దీపాలను అలంకరించారు. మొత్తం 42 సర్కిళ్లలో 25 కిలోమీటర్ల దూరం మేర విద్యుత్ దీపాలను అలంకరించారు. -
ఎగసిన ఉత్సాహం
-
సంబురాల ‘కోట’
ఖిలావరంగల్‌లో అంబరాన్నంటిన స్వాతంత్య్ర వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన ప్రభుత్వ శకటాల ప్రదర్శన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఖిలా వరంగల్, హన్మకొండ అర్బన్ : స్వాతంత్య్ర వేడుకలతో చారిత్రక ప్రాంతమైక ఖిలావరంగల్ కోట పులకించింది. గతంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, కళాకారులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది ఎక్కువగా ఉండేవారు. కానీ.. జిల్లా చరిత్రలో మొదటిసారిగా ఖిలావరంగల్ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో సామాన్యులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మధ్య కోటలోని ఖుష్‌మహల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు ఘనంగా నివాళులర్పించారు. మామునూరు డీఎస్పీ, పరేడ్ కమాండెంట్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో 53 మంది పోలీసులు చేపట్టిన గౌరవ వందనాన్ని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అందుకున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ అధికారులు, సేవా సంస్థ ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. కోట కళకళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల రాకపోకలతో కోట ప్రాంగణం కళకళాడింది. ఉదయం 10.05 నుంచి 11 గంటల వరకు ప్రభుత్వ శకటాల ప్రదర్శన కొనసాగింది. ఐటీడీఏ శకటం ముందు ఏర్పాటు చేసిన బంజారా నృతం, గ్రామీణాభివృద్ధి శాఖ శకటం ముందు ఏర్పా టు చేసిన బోనాల పండుగ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ సిబ్బంది వంద మీటర్ల త్రివర్ణపతాకంతో చేసిన పరేడ్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ పోలీసులకు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన వాహనాలతో ప్రత్యేక పరేడ్ చేయించారు. ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు ఇన్నోవా వాహనాలతో జరిగిన పరేడ్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకిం చారు. అయితే వేడుకల ప్రాంగణంలో మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శకటానికి ప్రథమ బహుమతి ఉత్సవాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు తమతమ కార్యక్రమాలను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయ శాఖ, వైద్యారోగ్యం, డ్వామా, పర్యాటక, సర్వశిక్షాభియాన్, 108, ఆర్డబ్ల్యూఎస్, మైనర్ ఇరిగేషన్, బిందుసేద్యం, పశుసంవర్థక, డీఆర్డీఏ, అటవీ శాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నారుు. వీటిలో వ్యవసాయశాఖకు ప్రథమ, ఏపీఎంఐపీకి ద్వితీయ, సర్వశిక్షాభియాన్‌కు తృతీయ బహుమతులు దక్కాయి. కట్టిపడేసిన సాంస్కృతిక ప్రదర్శనలు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిద పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మొత్తం 900మంది విద్యార్థులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముందుగా ధర్మసాగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు జయ జయహే తెలంగాణ గేయూనికి బృంద నృత్యం చేశారు. అనంతరం హన్మకొండ సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, వరంగల్ రిషి హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన తీజ్ సంప్రదాయ నృత్యం ఉత్సాహపరిచింది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల ప్రదర్శన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మడికొండ సాంఘిక సంక్షేమ గురుకులం, వాగ్ధేవి హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శనలో భాగస్వాములయ్యూరు. వల్లంపట్ల నాగేశ్వరరావు అధ్వర్యంలో వివిధ భాషలకు చెందిన దేశభక్తిగీతాలను విద్యార్థులు ఆలపించారు. ముగ్ధుం వ్యాఖ్యానం ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. మల్లికాంబ విద్యార్థులు ప్రథమ, ఫాతిమా ప్రభుత్వ సహాయక పాఠశాల విద్యార్థులు ద్వితీయ, ధర్మసాగర్ కస్తూర్బా విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారు. మడి కొండ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలవగా... వీరికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. వేడుకలకు పటిష్ట బందోబస్తు స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఖిలావరంగల్ కోటను పోలీసుల స్వాధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నగర డీఎస్పీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వేడుకల బందోబస్తులో ముగ్గురు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు. 20మంది ఎస్సైలతోపాటు 500 మంది కానిస్టేబుళ్లు బం దోబస్తులో పాల్గొన్నారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్‌బాస్కర్, అరూరి రమేష్, కలెక్టర్ జి.కిషన్, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళి దాసు, వెంకటేశ్వర్రావు, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన బోనాల ఫుడ్ ఫెస్టివల్
-
చట్టాలకు పదును పెట్టాలి
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో బాల కార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదను పెట్టాల్సిన అవసరం ఉందని, అలాగే నూతన చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కంఠీరవ స్టేడియం గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం చట్టంలో ఉన్న లొసుగుల వల్ల బాల కార్మిక వ్యవస్థను అరికట్టలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా 2017 నాటికి రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనంరతం ప్రభుత్వ వసతి గృహల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న పలువురు చిన్నారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి కెంపయ్యకు రాష్ట్ర నిఘా విభాగం సలహాదారుగా నియమించనున్నట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడి ఫ్రీడం పార్కు నుంచి కంఠీరవ స్టేడియం వరకూ రాష్ట్ర కార్మికశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘వాకథాన్’ నిర్వహించింది. ఇందులో మంత్రి పరమేశ్వర్ నాయక్‌తో పాటు గతంలో బాలకార్మికులుగా ఉంటూ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ వసతి పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులు, ఎమ్మెల్సీ, శాండిల్‌వుడ్ నటి తారతో పాటు పలువురు సామాజిక వేత్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన డోలు కుణిత, బాల కార్మిక వ్యవస్థను నిరసిస్తూ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. -
తెలంగాణ సాధనలో జిల్లా ప్రజలది ప్రత్యేకపాత్ర
కలెక్టర్ వీరబ్రహ్మయ్య కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో జిల్లా ప్రజలది ప్రత్యేక పాత్ర అని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అరవై ఏళ్ల కల సాకారమైందన్నారు. ఉద్యమంలో అశువులు బాసిన అమరులకు పేరుపేరున నివాళులర్పించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మెప్మా పీడీ విజయలక్ష్మి, డీఈవో లింగయ్య, డీపీఆర్వో ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు శ్వేత, శాతవాహన కళాజ్యోతి కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ జానపద నృత్యాలు, రేణికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, జేఎన్ఎంహెచ్ స్కూల్, అల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థుల నృత్యాలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్భం లేని స్వాగత నృత్యం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రదర్శించిన స్వాగత నృత్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాతవాహన కళోత్సవాల కోసం ఆరేడేళ్ల క్రితం సినీగీతా రచయిత గుండేటి రమేశ్ రాసి స్వరపరిచిన గీతాన్ని ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాన్ని స్వాగతిస్తూ సంబురాలు చేస్తే జిల్లా యంత్రాంగం మాత్రం శాతవాహన కళోత్సవాల స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది. -
నూతనోత్సాహం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జెండావిష్కరణ చేపట్టారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయపార్టీలు, ఉద్యోగసంఘాల కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తన క్యాంపు కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం కలెక్టరేట్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యోగులు, జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. శాంతికపోతాలను ఎగురవేశారు. కలెక్టరేట్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మహిళా ఉద్యోగినులు బతుకమ్మలు, బోనాలు, గంగిరెద్దుల ఆటలతో ఆకట్టుకున్నారు. కోలాట నృత్యాలతో సందడి చేశారు. ఈ ప్రదర్శనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీ సురేంద్రమోహన్, అదనపు జేసీ బాబూరావు, జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణలు ఓపెన్‌టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుకు సాగారు. పోలీసులు కవాతు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన కలెక్టరేట్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్, బస్టాండ్‌మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. అక్కడ వేద పండితులు పూర్ణకుంభంతో కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగానికి స్వాగతం పలికారు. కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో జిల్లా అన్ని రంగాల్లో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరుతూ బెలూన్లను గాలిలోకి వదిలారు. తన క్యాంపు కార్యాల యంలో జేసీ జెండా ఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌లో తెలంగాణ సంబురాలు మిన్నంటాయి. ఉద్యోగులు స్వీట్లు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జెడ్పీ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి సీఈవో జయప్రకాష్‌నారాయణ, ఏవో ఇంజం అప్పారావు, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజులు పూలమాలలు వేశారు. సీఈవో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లయ్య, శ్రీనివాస్, నాయకులు రవీందర్‌ప్రసాద్, రామకృష్ణారెడ్డి, కిషోర్‌రెడ్డి, వాణిశ్రీపాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో దివ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో అమయ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో డెరైక్టర్ (ఆపరేషన్స్) రమేష్‌కుమార్, జిల్లా పోలీస్ కేంద్రంలో డీటీసీ డీఎస్పీ గంగారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. పం చాయతీ రాజ్ ఎస్ఈ కార్యాలయం లో గంగారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డీఈ మహేష్‌బాబు, ఈఈ రాం బాబు, శివగణేష్ పాల్గొన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ బి.శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, కోడి లింగయ్య, కోటేశ్వరరా వు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఆర్డీవో సం జీవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దుమ్ముగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చిరంజీవులు, బాబూరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల్, హసన్, రామారావు, రంగయ్య పాల్గొన్నారు. ట్రెజరీ కార్యాలయంలో డీడీ నీలిమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖాజామియా, కృష్ణారావు, వేలాద్రి, వల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు, ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీవో మెహిమిన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు రవీందర్, ఈశ్వరయ్య, ఏవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డీఆర్డీఏలో పీడీ శ్రీనివాస్‌నాయక్ జాతీయజెండాను ఆవిష్కరించారు. డ్వామాలో పీడీ వెంకటనర్సయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అప్పారావు, మీరా, రాజేష్ పాల్గొన్నారు. -
జననీ.. జయకేతనం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్, డప్పుల దరువులు..కళాకారుల ఆటాపాటలతో యువత ఊర్రూతలూగింది. చిందుయక్షగానం..శ్రీకృష్ణార్జునయుద్ధం ఇక్కడి సాంస్కృతిక వైభవం చాటగా.. మరోవైపు నోరూరించే ఫుడ్‌కోర్టు భోజనప్రియులను ఆహ్వానించింది. ఇదీ..జిల్లాకేంద్రంలోని ఎన్జీకాలేజీలో జరుగుతున్న తెలంగాణ సంబురాలలో శుక్రవారం రాత్రి నెలకొన్న సందడి. అంతకుముందు ఉత్సవాలలో భాగంగా కలెక్టర్ టి.చిరంజీవులు జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించింది ఈ అపురూప క్షణం కోసమే అని పేర్కొన్నారు. తెలంగాణకు గొప్ప సాంస్కృతిక, సాహితీ వైభవం ఉందని, ఇక్కడి సంప్రదాయాలు పేరెన్నికగన్నవన్నారు. తెలంగాణ సాకారమైన సందర్భంగా వాటన్నింటినీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతోపాటు ఇక్కడి వంటలతో ఫుడ్‌కోర్టును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని, ఇంత పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రెవెన్యూశాఖకు అభినందనలు తెలిపారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లలిత సుమాంజలి గణపతి ప్రార్థన, కూచిపూడి నృత్యం, జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం పాటకు పాలబిందెల బాలు బృందం ఆధ్వర్యంలో ఉషారాణి, జిషిత, పాలబిందెల సాత్విక తదితరులు నృత్యం చేశారు. హైదరాబాద్‌కు చెందిన కళానృత్యనికేతన్ బిందు, అభినయ్ బృందం వారి రాచలీల, అన్నమాచార్య కీర్తన, ‘‘వచ్చెను అలివేలు మంగా, బ్రహ్మమొక్కటే’’ అంశాలు ప్రదర్శించారు. నల్లగొండ న్యూస్ స్కూల్ నుంచి గౌస్‌బాబా బృందం ఆధ్వర్యంలో భారత వేదమున నృత్యం పేరిట వెంకట్ బృందంతో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..., శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన చింతల చెర్వునాగభూషణం బృందం చిందు యాక్షగానం.. శ్రీకృష్ణార్జున యుద్ధం నిర్వహించారు. ఆహా ఏమిరుచి... అంతకుముందు జిల్లా కలెక్టరు చిరంజీవులు కళాశాల మైదానం రెండవ భాగంలో నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన వంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాల్స్‌లో చికెన్, మటన్ దమ్‌బిర్యాని, చేపల పులుసు, సకినాలు, కారపప్పలు, పుల్లట్లు, సర్వపిండితో పాటు లడ్డూలు వగైరా అందుబాటులో ఉంచారు. పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు బారులు తీరి బిర్యాని, చేపల వంటకాలను ఆహా ఏమి రుచీ అంటూ ఆరగించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఏజేసీ వెంకట్రావు, ఆర్డీఓ జహీర్, కొండకింది చినవెంకట్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సినీ దర్శకుడు ఎన్.శంకర్, టీజేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ కార్యదర్శి వై.వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు ఖలీమ్, ఆదిరెడ్డి, శంకరమ్మ, రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రముఖులకు సన్మానం 60 ఏళ్ల కళ సాకారమైన సందర్భంగా జిల్లాలోని ప్రముఖులకు సన్మానించనున్నట్టు కలెక్టర్ చిరంజీవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సన్మానం పొందే వారిలో హైకోర్టు జడ్జి ఈశ్వరయ్యగౌడ్, ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ సెక్రటరీ చోల్లెటి ప్రభాకర్, ప్రభుత్వ ఉద్యోగి కిషన్‌రెడ్డి, స్కాడ్రన్ లీడర్ ఆర్.జయసింహ, సినిమా డెరైక్టర్ ఎన్.శంకర్, సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ, పద్మ అవార్డు గ్రహీత గజం అంజయ్య, గజం గోవర్ధన్, పారిశ్రామికవేత్త మీలా సత్యనారాయణ. విద్యావేత్త కె.చినవెంకట్‌రెడ్డి, పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీకర్‌రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ మహాముద్ అలీ, ఐబీసీ న్యూస్ ఛానల్ అధినేత ఏచూరి భాస్కర్, కళాకారులు వివేక్, ప్రముఖ సేవకులు జగిని కుశలయ్య, సాహితీ ప్రముఖులు కూరేళ్ల విఠలాచారి, సాంస్కృతిక ప్రముఖలు చల్లం పాండురంగారావు (ప్రజాన్యాటమండలి), సినిమా కమేడియన్ ఆర్టిస్టు వేణుమాధవ్, కార్టూనిస్ట్ శంకర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి సురేందర్ ఉన్నారు. -
భక్తులకు పాద భాగ్యం
పాడేరు,న్యూస్‌లైన్: నేటి నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా ఆలయం అలంకరించారు. ఈ నెల 13న అనుపు ఉత్సవం ఉంటుంది. ఉత్సవ విగ్రహం, పాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్సవాల సమయంలో విగ్రహం, పాదాలను నెత్తిన పెట్టుకొని మోసే భాగ్యం ఉంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం పూర్వం నుంచి భక్తుల్లో నెలకొంది. అయితే వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో సామాన్య భక్తులు ఉత్సవ విగ్రహం, పాదాలను తాకేందుకు కూడా వీలు లేని పరిస్థితి వారిని బాధిస్తోంది. లక్షలాది మంది భక్తులు ఉత్సవానికి తరలి వస్తున్నా అందరికి మోసే భాగ్యం మాత్రం లేదు. కానీ ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంతో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఉత్సవ కమిటీ వీఐపీలుగా గుర్తించడం లేదు. సామాన్య భక్తులే తమకు వీఐపీలని, అందరికీ ఉత్సవ విగ్రహం, పాదాలను మోసే అవకాశం కల్పిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణలు ప్రకటించారు. పోలీసుశాఖ కూడా రోప్‌వే ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహం, పాదాలను భక్తులు తాకే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. దీంతో భక్తులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన టెక్నో ఫెస్టు-2014 వేడుకలు
మాక్లూర్, న్యూస్‌లైన్ : మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్నో ఫెస్టు-2014 వేడుకలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని హంగామా చేశారు. అంత్యాక్షరి, క్విజ్, జామ్, ఫైల్, హరీల్, ట్రైజరి, నృత్యాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడియా సంస్థ వారు స్లోబైక్ రైడింగ్ నిర్వహించి విద్యార్థులను చైతన్య పరిచారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ విక్రమ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు తమ గమ్యం చేరే వ రకు క్రమశిక్షణతో ముందుకుపోవాలన్నారు. అనంతరం విద్యార్థులను ఆయన అభినందించి, నగదు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు -
దుమ్మురేపిన 'నాసా' ఉత్సవాలు
-
హక్కుకు దిక్సూచి బొజ్జా తారకం
నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ రోజు ఉదయం నుంచే ఆ ఊరి జనం మాట్లాడ్డం మానేశారు. ఒకరితో ఒకరు కాదు.. తమలో తాము కూడా. వీధి అరుగులు నిర్మానుష్యం. ఊరి జనం చుట్టూ చీకటి ఆవరించింది. నిజానికి ఆ రోజు ఆ ఊరికి అది చీకటి రోజే. అయితే ఆ చీకటి దళితవాడది. దళితవాడలో అలుముకున్న ఆ దట్టమైన చీకటి గురించి దళితులు కానీ, దళితేతరులు కానీ నోరువిప్పి మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు ఆ పల్లెలో జరిగిన దారుణం గురించి మాట్లాడితే, ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని నిలదీస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే అంతా అసలేమీ జరగనట్లుగానే ఉండిపోయారు. అప్పటికి చాలారోజులుగా ఆ ఊరి భూస్వామి పొలంలో పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజే శవమయ్యాడు. ఒంటిమీద ఉన్న గాయాలు చెబుతూనే ఉన్నాయి. అది హత్య అని. భూస్వామి కొట్టిన దెబ్బలకే అతడు చనిపోయాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలా ఒక దారుణం శాశ్వతంగా సమాధి అవుతున్న తరుణంలో ఆ ఊళ్లోకి ప్రవేశించాడు ఒక న్యాయవాది. ఆ హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చాడు. న్యాయపోరాటంలో విజయం సాధించాడు. ఆయనే ప్రముఖ న్యాయవాది, దళిత హక్కుల ఉద్యమనేత, రచయిత బొజ్జా తారకం. దళిత విద్యార్థి నేతగా, హక్కుల ఉద్యమాలకు కేంద్రబిందువుగా, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆ పోరాటయోధుడి అంతరంగ ఆవిష్కరణే ఈ వారం ‘లెజెండ్’... ‘మా తాత బొజ్జా గోవిందదాసు. అంటరానిత నం ఒక మహమ్మారిలా సమాజాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఆయన కులాన్ని జయించారు. జీవితంలోని బాధలను, కష్టాలను, కడగళ్లను, వైరాగ్యాన్ని తత్వాల రూపంలో బోధిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఆయన తత్వాలు, పాటలు, బోధనలు అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆకట్టుకున్నాయి. మానవత్వాన్ని, మానవసంబంధాల్లోని గొప్పతనాన్ని తన బోధనల ద్వారా చాటుతూ కుల రహిత సమాజాన్ని కాంక్షించిన వ్యక్తి. మా నాన్న బొజ్జా అప్పలస్వామి. దళితుల భూమికోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం జీవితాంతం ఉద్యమించిన వ్యక్తి. వీరిద్దరి ప్రభావం నాపై చాలా ఉంది. అంబేద్కర్‌తో కలిసి నాన్న.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్ప మా ఊరు. మాది మాలపల్లె. దళితుల అజ్ఞానానికి, వెనుకబాటుతనానికి, వారిపై కొనసాగుతున్న అణిచివేత, అంటరానితనానికి కారణం చదువు లేకపోవడం, వాళ్ల చేతుల్లో భూమి లేకపోవడమేనని గ్రహించిన మా నాన్న ‘ఆదిఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దళితుల చదువుల కోసం పిఠాపురం మహారాజా వారి సహాయ సహకారాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా రఘుపతి వెంకటరత్నంనాయుడు నేతృత్వంలో పనిచేసిన బ్రహ్మసమాజం మా నాన్నకు స్ఫూర్తిప్రదాతలు. ఈ క్రమంలోనే ఆయన లంక భూములు దళితులకే దక్కాలనే లక్ష్యంతో కోనసీమలో భూపోరాటాలు చేపట్టారు. 1942లో కాకినాడ పర్యటనకు విచ్చేసిన అంబేద్కర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అంబేద్కర్‌తో కలిసి పనిచేశారు. ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1952లో ఫెడరేషన్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. దళితుల కోసం పోరాడే క్రమంలో సహజంగానే అగ్రవర్ణాలతో ఘర్షణలు, కొట్లాటలు తప్పలేదు. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే నేను పుట్టి పెరిగాను. నా చదువంతా కాకినాడలోనే సాగింది. మెక్లారిన్ హైస్కూల్లో, పీఆర్ కాలేజీలో చదువుకున్నాను. అంటరానితనానికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో చుట్టుపక్కల ఊర్లలో నాటకాలు వేసేవాళ్లం, పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేవాళ్లం. ఆ విద్యార్థి ఉద్యమానికి నేను నాయకుడిని. ఎస్సీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజుల్లోనే ఎస్సీ విద్యార్థుల సమస్యలపై 30 రోజుల పాటు పెద్దఎత్తున ఆందోళన చేసి సమస్యలను పరిష్కరించుకున్నాము. లాయర్ అవుతాననుకోలేదు బీఏ(మ్యాథ్స్) చదివిన నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (మ్యాథ్స్)లో చేరాలని హైదరాబాద్ వచ్చాను. అప్పటికి మా నాన్న ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటున్నారు. ఎంఏలో సీటు రాలేదు. దాంతో నగరం నుంచి తిరిగి వెళ్లడం ఇష్టం లేక ఎల్ఎల్బీలో చేరాను. చదువు పూర్తయిన తరువాత తిరిగి కాకినాడకు వెళ్లిపోయాను. అక్కడే లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాను. కానీ ఎంతో కాలం కొనసాగలేదు. 1968లో విజయభారతి(బోయి భీమన్న కుమార్తె)తో వివాహమైంది. ఆమె నిజామాబాద్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. అలా నిజామాబాద్ వచ్చేశాను. నిజామాబాద్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొట్టమొదటి ఎస్సీ లాయర్‌ను నేను. అలాంటి రోజుల్లో పాలెం అనే ఊర్లో ఆ ఊరి భూస్వామి తన దగ్గర పని చేసే వ్యక్తిని కొట్టి చంపాడు. దీనిపై ఎవ్వరూ నోరు మెదప లేదు. అందరూ భయపడ్డారు. ‘ఇలాంటి దారుణాలను ప్రశ్నించకపోతే, దోషులకు శిక్షపడకపోతే మరిన్ని సంఘటనలు జరుగుతాయి. అమాయకులైన దళితులు బలవుతారు.’ అనే ఆలోచన నాలో కలిగింది. వెంటనే నిజామాబాద్‌లోనే ఒకలారీ మాట్లాడుకొని, నాకు తెలిసిన 50 మంది విద్యార్థులను వెంటేసుకొని పాలెం బయలుదేరాను. ఆ ఊరి దళితులు చాలా భయపెట్టారు. వెనుదిరిగివెళ్లమన్నారు. ఆ భూస్వామి చంపేస్తాడని హెచ్చరించారు. నా వెంట వచ్చిన వాళ్లకు కూడా భయం మొదలైంది. ‘చావాల్సివస్తే మొట్టమొదట నేను చస్తాను. మీరేం భయపడొద్దు రండి’అన్నాను. ఊర్లో ర్యాలీ ప్రారంభించాము. ఆ హత్యను నిరసిస్తూ పెద్దఎత్తున నిరసన సభ నిర్వహించాము. అప్పటి వరకు భయంగా ఉన్న దళితులంతా కదిలి వచ్చారు. ఈ సంఘటన వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్నిచ్చింది. ఆ భూస్వామిపై న్యాయపోరాటానికి దిగాము. ఒకవైపు ఈ పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు ‘అంబేద్కర్ యువజన సంఘాన్ని’ స్థాపించి అగ్రవర్ణాల దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనే లక్ష్యంగా పోరాటాలు చేశాం. జిల్లా అంతటా అంబేద్కర్ యువజన సంఘం కార్యకలాపాలు విస్తరించాం. వర్గ, కుల పోరాటాల్లో.. దోపిడీ, పీడన, అసమానతలు అంతరించిపోవాలంటే వర్గ, కుల పోరాటాలు రెండూ ముఖ్యమైనవని ఆర్మూర్ ‘పచ్చల్నడుకుడ’ భూపోరాటం నిరూపించింది. రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు, వెనుకబడిన వర్గాలకు పంపిణీ చేసేందుకు ఈ పోరాటం చేపట్టాం. భూమి ఆ ఊరి అగ్రకులాలకు చెందిన వ్యక్తుల చేతుల్లో ఉంది. దానిని మేం స్వాధీనం చేసుకుని సాగులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో అంబేద్కర్ యువజన సంఘంతో కలిసి పనిచేసేందుకు సీపీఐ(ఎంఎల్) అనుబంధ రైతు కూలిసంఘం ముందుకు వచ్చింది. పోరాటం నడిచే రోజుల్లో ఎస్సీలు ఒక చోట, బీసీలు ఒక చోట వేరు వేరుగా కూర్చొని మధ్యాహ్న భోజనాలు చేసేవారు. పోరాటం కొనసాగిన కొద్దీ వాళ్ల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఒకే చోట కలిసి కూర్చోవడంతో మొదలైంది. ఆ తరువాత ఒకరి కూరలు ఒకరు వడ్డించుకున్నారు. కలిసి అన్నం తిన్నారు. ఆ తరువాత అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేయడంతో ఎస్సీలు, బీసీలు ఒక్కటయ్యారు. ఇండియాలో విప్లవం విజయవంతం కావాలంటే మార్క్సిజం ఎంత కీలకమైందో అంబేద్కరిజం కూడా అంతే కీలకమైందన్న నా అవగాహన ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. ఆ తరువాత అనేక సంఘటనల్లోనూ రుజువైంది. చీకటి రోజుల్లో ఆ భూపోరాటం తరువాత నిజామాబాద్‌లో జరిగిన అనేక పోరాటాల్లో అంబేద్కర్ యువజనసంఘం, రైతుకూలి సంఘం కలిసి పనిచేశాయి. స్వతహాగా రచయితనైన నేను విరసంలో చేరాను. చైనా-ఇండియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్లోనూ, పౌరహక్కుల సంఘంలోనూ క్రియాశీలకమైన బాధ్యతలు చేపట్టాను. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చాయి. నిజామాబాద్‌లో ఉండగానే నన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడాది పాటు జైలు జీవితం. ఆ రోజుల్లోనే ‘నది పుట్టిన గొంతుక’ కవిత్వం రాశాను. ‘పోలీసులు అరెస్టు చేస్తే’ అనే పుస్తకం కూడా రాశాను. ఒక విప్లవకారుడి జీవితాన్ని నవలగా అక్షరీకరించాను. కానీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు దాన్ని తీసుకురావడం సాధ్యపడలేదు. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్) మద్దతుతో పోటీ చేశాను. కానీ ఓడిపోయాను. అప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశాను. ఎమర్జెన్సీకి ముందు, తరువాత జరిగిన అన్ని కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పదిరికుప్పం, కారంచేడు నుంచి లక్షింపేట ఘటన వరకు అన్ని ఆందోళనల్లో నేను ఉన్నాను. దళితుల ఊచకోత జరిగినా.. ఎన్కౌంటర్ పేరిట పోలీసులు నక్సలైట్లను హతమార్చినా.. ఒక నిజనిర్ధారణ కమిటీని వేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యమ నిర్మాణం చేపట్టాము. ఒకసారి హయత్‌నగర్ సమీంపలోని ఊర్లో ఒక దళిత వర్గానికి చెందిన కుర్రాడ్ని చంపి పొలంలో పాతిపెట్టారు. అంబేద్కర్ యువజన సంఘం ఈ దారుణాన్ని నా దృష్టికి తెచ్చింది. నేను వెళ్లి శవాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించాను. అలా పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన సంఘటన రాష్ట్రంలో అదే మొదటిది. అప్పట్లో ఇదొక పెద్ద సంచలనం. నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపైన హత్యానేరం మోపుతూ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేయాలన్న నా వాదన ప్రకంపనలు సృష్టించింది. ఆ తరువాత ఐదుగురు సభ్యుల హైకోర్టుధర్మాసనం నా అభిప్రాయాన్ని బలపరిచిన సంగతి తెలిసిందే. ‘పోలీసులు అరెస్టు చేస్తే’.. ఎమర్జెన్సీలో రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే..’ పుస్తకం 1980 తరువాత పబ్లిష్ అయింది. హక్కుల ఉద్యమానికి అది మార్గదర్శకంగా నిలిచింది. ప్రతి ఒక్కరికి ప్రశ్నించడం నేర్పించింది. ఆ పుస్తకం ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు 40 వేల కాపీలను తగలబెట్టారు. ‘కమాండో’పబ్లిషర్స్ దగ్గర ఉన్న మరో 30 వేల కాపీలను కొనుగోలు చేశారు. ఎవరి దగ్గరైనా ఆ పుస్తకం కనిపిస్తే చాలు కేసులు పెట్టేవాళ్లు. దాంతో ఆ పుస్తకాన్ని చాలా రహస్యంగా చదవాల్సి వచ్చేది.’అని ముగిం చారు. వ్యక్తి‘గతం’ పేరు: బొజ్జా తారకం పుట్టిన తేదీ: 27 జూన్, 1939 తల్లిదండ్రులు: బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామి సొంతఊరు: అమలాపురం సమీపంలోని కందికుప్ప భార్య: విజయభారతి పిల్లలు: డాక్టర్ మహిత, రాహుల్ బొజ్జా (ఐఏఎస్) రచనలు: ‘పోలీసులు అరెస్టుచేసే’్త ‘ కులం-వర్గం’, ‘నేల-నాగలి-మూడెద్దులు’ ‘పంచతంత్రం’ (నవల) ‘నది పుట్టిన గొంతుక’ -
ఉత్సాహంగా టెక్నో ఫెస్టివల్
-
విద్యార్థులే గైడ్లు
సాక్షి, బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల్లోని అన్ని దేశాల నుంచి పర్యాటకులు హాజరవుతూ ఉంటారు. అందుకే విదేశీ పర్యాటకులను ఈ ఉత్సవాలకు మరింత ఎక్కువగా ఆకర్షించే దిశగా మైసూరు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర టూరిజం శాఖ కూడా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే విదేశీ పర్యాటకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద ప్రత్యేక సీటింగ్ సదుపాయం వంటి ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తె చ్చిన జిల్లా అధికారులు ఇప్పుడు మరో కార్యక్రమాన్ని కూడా విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే విదేశీ పర్యాటకులకు ‘ద యూనివర్సిటీ ఆఫ్ మైసూరు ఇంటర్నేషనల్ సెంటర్’లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులను గైడ్లుగా వ్యవహరించనున్నారు. మైసూరు దసరా ఉత్సవాలకు హాజరయ్యే విదేశీయుల్లో ఎక్కువ మంది ఫ్రాన్స్, జర్మనీ దేశీయులున్నారు. వీరికి వారి జాతీయ భాషలు తప్ప మరే భాషలూ తెలియవు (ఇంగ్లీష్‌తో సహా). ఇలాంటి సమయంలో ఆ ఇబ్బందిని పరిష్కరించేందుకు మైసూరు జిల్లా యంత్రాంగం ‘ద యూనివర్సిటీ ఆఫ్ మైసూరు ఇంటర్నేషన ల్ సెంటర్’ సహాయాన్ని తీసుకుంటోంది. ఈసెంటర్లో 50దేశాలకు చెందిన 1,200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్, డచ్ భాషల్లో చక్కగా మాట్లాడగలరు. వీరి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి గైడ్లుగా ఎలా వ్యవహరించాలనే విషయంపై రాష్ట్ర టూరిజం శాఖ శిక్షణ ఇస్తోంది. మైసూరు చరిత్ర, ఇక్కడి ప్రసిద్ధ వంటకాలు, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వారిలో మొదటగా అవగాహన కల్పిస్తోంది. శిక్షణ తీసుకున్న విద్యార్థులు మైసూరు దసరా ఉత్సవాల సమయంలో రాచనగరికి వచ్చే ఫ్రాన్స్, జర్మనీ దేశాల పర్యాటకులకు గైడ్లుగా వ్యవహరించనున్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు... స్వదేశీ, విదేశీ పర్యాటకుల కోసం రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా రూపొందించింది. ‘మైసూరు-బెళిగిరి-రంగహిల్స్-కె.గుడి’లటూర్కు ఒక్కో వ్యక్తికి రూ.395, మైసూరు-నంజనగూడు-హిమవాదగోపాలస్వామి హిల్స్-బండీపుర నేషనల్ పార్క్ టూర్‌కు రూ.390 ఇలా ఈ ప్యాకేజీలు రూ.450వరకు కొనసాగనున్నాయి. -
హోరెత్తిన జనగర్జన
సమైక్య నినాదాలతో చిత్తూరు మార్మోగింది.రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా శనివారం నిర్వహించిన సమైక్య జనగర్జన హోరెత్తింది. అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. నగర వీధులన్నీ సమైక్యవాదులతో కిక్కిరిసి పోయాయి. ఉద్యమాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎండను సైతం లెక్కచేయక గంటల తరబడి జనం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ తీవ్రతను ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తామని వక్తలు స్పష్టం చేశారు. చిత్తూరు (కలెక్టరేట్),న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ చిత్తూరులో శనివారం జరిగిన జనగర్జనకు అశేషంగా జనం తరలివచ్చారు. చిత్తూరు నగరం సమైక్య నినాదాలతో మార్మోగింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్‌ఆర్‌పీవీ జిల్లా చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సీకేబాబు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హాజరయ్యారు. జనగర్జనకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ సమైక్యగళాన్ని ఢిల్లీ పెద్దలకు వినిపించారు. ఉద్యమస్ఫూర్తి ప్రతిబిం బించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎండను సైతం లెక్కచేయని సమైక్యవాదులు గంటల తరబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పీసీఆర్ ఉన్నత పాఠశాల సర్కిల్లోని పూలే విగ్రహం వద్ద జనగర్జన జరిగింది. వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తవత్సలంనాయుడు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, అన్ని వర్గాలకు చెందిన జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుతల్లి, శ్రీపొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమైక్యాంధ్ర కోసం ఆశువులు బాసిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. జిల్లా అధికారుల జేఏసీ, సాస్ జేఏసీ, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యాశాఖ, ప్రైవేటు పాఠశాలలు, నాల్గొవ తరగతి, కార్మిక, కర్షక, విద్యుత్, న్యాయవాదుల, విద్యార్థి జేఏసీ నాయకులు సభావేదికపై సమైక్య అభివాదం చేశారు. తెలుగువారి సమైక్యతను చాటేందుకు వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వేదికపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా అధికారులు, రవాణా శాఖ ఉద్యోగులు, అన్ని వర్గాల జేఏసీ కన్వీనర్లు నల్లటోపీలు ధరించారు. ఏపీఎంఐపీ ఉద్యోగులు చేతపట్టిన గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీకేబాబు, గెజిటెడ్ జేఏసీ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, సాస్ జేఏసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రవాణా శాఖ ఉప కమిషనర్ బసిరెడ్డి ప్రజల చేత సమైక్య నినాదాలు చేయించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటిని అందించారు. విద్యార్థులకు మజ్జిగ పాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనగర్జనకు మహిళలు, వ్యాపారులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. -
కోలాహలంగా నిమజ్జనోత్సవం
తిరుపతి, న్యూస్‌లైన్: ‘గణపతిబప్పా మోరియా.. జై గణేశ జైజై గణేశా’ నినాదాలతో తిరుపతి నగరం దద్దరిల్లింది. మూడు రోజులపాటు పూజలు అందుకున్న ఆది దేవుడి నిమజ్జన మహోత్స వం బుధవారం కోలాహలంగా జరిగిం ది. ఈ కార్యక్రమంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. తిరుపతిలో ఈ ఏడాది 320 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఆశీ స్సులు అందుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ముందుగా ప్రకటించిన రూట్ మ్యాప్ ప్రకారం విగ్రహాలను నిమజ్జనం కోసం వినాయకసాగర్‌కు తరలించారు. మేళతాళాలతో ఊరేగింపుగా విగ్రహాలను తరలించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నిర్వాహకులు ముందు సాగారు. సాయంత్రం 4 గంట ల నుంచి నిమజ్జనం ప్రారంభమైంది. సాయంత్రం 5.45 గంటల వరకు 130 విగ్రహాలు వినాయకసాగర్‌కు చేరుకున్నాయి. వాటికి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామంచి శ్రీనివాస్, జీ.భానుప్రకాష్‌రెడ్డి, మాంగాటి గోపాల్‌రెడ్డి, వరప్రసాద్ సుభాష్‌నగర్ వద్ద స్వాగతం పలికారు. నిమజ్జనం చేయడానికి వీలు గా చెరువులో రెండు నాటు పడవలను (తెప్పలు) ఏర్పాటు చేశారు. తిమ్మినాయుడుపాళెం సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను సిద్ధం చేసి ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, తుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు వినాయకసాగర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భజనలు నిర్వహించారు. ఈస్ట్ డీఎస్పీ నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ బందోబస్తును పర్యవేక్షించారు. గత ఏడాది విగ్రహం వెంట వచ్చిన వారికి మినరల్ వాటర్ ప్యాకె ట్లు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. నిమజ్జనం సాఫీగా ముగిసింది.