అలరించిన పేరిణి శివతాండవం | Telangana Cultural Program Organised At HICC | Sakshi
Sakshi News home page

అలరించిన పేరిణి శివతాండవం

Published Sun, Jul 3 2022 1:55 AM | Last Updated on Sun, Jul 3 2022 8:22 AM

Telangana Cultural Program Organised At HICC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిశాక శనివారం రాత్రి హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరీంనగర్‌ జిల్లా కళాకారుడు జరుకుల రతన్‌కుమార్‌ ప్రదర్శించిన పేరిణి శివ తాండవం అందరినీ ఆకట్టుకుంది. రతన్‌కుమార్‌ ప్రదర్శన పూర్తయిన వెంటనే ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఇతర వీఐపీలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు.

తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సొంతమైన పేరిణి శివ తాండవం కాకతీయ రాజుల కళాసృష్టికి నిదర్శనం. అంతరించిపోతున్న ఈ కళకు నటరాజ రామకృష్ణ పునః ప్రతిష్ట చేయగా.. రతన్‌కుమార్‌ ఆయన వద్ద శిష్యరికం చేసి, నేర్చుకున్నారు. గతంలోనూ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement