సాక్షి, హైదరాబాద్: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెల్లి అధికారంలోకి వచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ పాలన రేపటికి వంద రోజులు కానున్న సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ వంద రోజుల పరిపాలన నాకు సంతృప్తినిచ్చింది. కానీ ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సిఉంది. 8 లక్షల కుటుంబాలు 500 గ్యాస్‌ను వాడుకోగా..ఇప్పటికే నగదు బదిలీ చేశాం. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయం పెంచాం. నిషేదిత ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాం. సచివాలయంలోకి సాధారణ ప్రజలు వచ్చేందుకు స్వేచ్ఛను ఇచ్చాం.
ధర్నా చౌక్‌ను రద్దు చేసిన బీఆర్ఎస్, అదే ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ ధర్నా చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం. భేషజాలకు పోకుండా ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర హక్కు రావాల్సిన వాటిని రాబట్టగలిగాం. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా పాలన సాగుతుంది. వైబ్రెంట్ తెలంగాణ 2050తో ముందుకు వెళ్తున్నాం.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు. ఈ అరెస్ట్ సీరియల్ లాంటిది. అరెస్ట్‌తో ఈ డ్రామా పతాక స్థాయికి వచ్చింది. సానుభూతి కోసం బీజేపీ,బీఆర్ఎస్ పాకులాడుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తుంటె తండ్రిగా కేసీఆర్ ఎందుకు రాలేదు. పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్ట్‌ను కేసీఆర్ ఎందుకు ఖండించలేదు. తెలంగాణకు ఈడీ, మోదీ కలసే వచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి మోదీ ఎందుకు మాట్లాడడం లేదు. కాంగ్రెస్ దెబ్బతీయడానికి బీజేపీ,బీఆర్ఎస్‌లు నాటకం ఆడుతున్నాయి. మోదీ, కేసీఆర్ ఇద్దరు కవిత అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు’ అని సీఎం రేవంత్ అన్నారు.
బీఆర్ఎస్‌లో ఎవ్వరూ మిగలరు..
తమ కుటుంబంలోని గందరగోళాన్ని హరీశ్‌రావు పరోక్షంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ పెద్దలు మన ప్రభుత్వమే రాబోతుందని వాళ్ల ఎమ్మెల్యేలకు చెప్తున్నారట. ఈ విషయాన్ని నన్ను కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు నాకు చెప్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవులు పంచేస్తున్నారట. మేము జాయినింగ్స్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే బీఆర్ఎస్ నలుగురు, అయిదుగురు కంటే మిగలరు. మమ్మల్ని మా పనిచేసుకోనిస్తే..ప్రతిపక్షం పని ప్రతిపక్షం పని ప్రతిపక్షం పని చేసుకోనిస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బీఆర్ఎస్‌లో ఎవ్వరూ మిగలరు.
మా దగ్గర వ్యూహం ఉంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. నల్లగొండ సభలో నన్ను విమర్శించిన విషయం మర్చిపోయారా. భాష గురించి కేసీఆర్‌కు ఇప్పుడైనా గుర్తుకు రావడం మంచిదే. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మా ప్రభుత్వంకు రెఫరెండం. మా పరిపాలనను చూసి ఓటేయాలని ప్రజలను కోరుతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment