సాక్షి, హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుస్తక ప్రతిని డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డికి వెంకయ్యనాయుడు అందించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment