book release
-
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు.. ప్రధాని మోదీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుస్తక ప్రతిని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డికి వెంకయ్యనాయుడు అందించారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. -
Ishaa Vinod Chopra: నీకు నువ్వే సాయం చేసుకో
‘లెట్ ఈషా హెల్ప్ ఈషా’ అనుకుందామె. 16 ఏళ్ల వయసులో తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని డాక్టర్లు చెప్పాక ఈషా వినోద్ చోప్రా తనకు తనే సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డిజార్డర్‌తో పోరాటం చేస్తూనే స్త్రీల మానసిక సమస్యల పై చైతన్యం కలిగిస్తోంది. దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమార్తె అయిన ఈషా మానసిక సమస్యతో తన పోరాటంపై తాజాగా ‘ఫైండింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ పుస్తకాన్ని వెలువరించింది. అందరూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి.భారతదేశంలో 2023 సంవత్సరంలో జరిగిన అంచనా ప్రకారం 7 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం తక్కువ కాదు. మానసిక సమస్యలు 14 ఏళ్ల వయసు నుంచి కనిపిస్తాయి. 25 ఏళ్ల వయసుకు పూర్తిగా వ్యక్తమవుతాయి. కాబట్టి 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని పరిశీలిస్తూ వారి సమస్యను తల్లిదండ్రులు గుర్తించగలిగితే చాలా వరకూ ఆ పిల్లలకు తమ సమస్య అర్థమయ్యి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. కాని దురదృష్టవశాత్తు ఈ ఎరుక ఉన్న తల్లిదండ్రులు తక్కువ. స్కూల్ టీచర్లు తక్కువ. ‘అందుకే నేను ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌గా నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. అందుకు అవసరమైన కోర్సును కెనడాలో పూర్తి చేసే దశలో ఉన్నాను. పిల్లల మానసిక సమస్యలనే కాదు... పిల్లలు నార్మల్‌గా ఉండి తల్లిదండ్రులు మానసిక సమస్యలతో బాధ పడుతున్నా పిల్లల జీవితం పెను ఒత్తిడికి లోనవుతుంది. స్కూల్ టీచర్లు ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాలి. అయితే స్కూల్ టీచర్లకు అలాంటి ట్రయినింగ్ ఉండటం లేదు’ అంటుంది ఈషా వినోద్ చోప్రా.సుప్రసిద్ధ దర్శకుడు విధు వినోద్ చో్ప్రా, అతని రెండవ భార్య షబ్నమ్ సుఖదేవ్‌ల సంతానం ఈషా. వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. ‘మా తాతగారు (అమ్మ తండ్రి) ఎస్.సుఖదేవ్ గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఆయనకు మానసిక సమస్యలు ఉండేవని తర్వాత తెలిసింది. నా సమస్యకు మూలం అక్కడే ఉండొచ్చు’ అంటుంది ఈషా.➡️బైపోలార్ డిజార్డర్ఉన్నట్టుండి బోలెడంత ఉత్సాహం రావడం, భారీ పనులు సంకల్పించడం, అతిగా మాట్లాడటం, నిద్ర పోలేక పోవడం, అయినప్పటికీ ముఖం తాజాగా ఉండటం... ఇది బైపోలార్ డిజార్డర్‌లో ‘మేనియా’ దశ. మరి కొన్నాళ్లకు హటాత్తుగా దేనిమీదా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత, నిద్ర లేమి, ఏ పనీ సరిగా చేయలేకపోవడం.. ఇది ‘డిప్రెషన్’ దశ. ఈ రెండు దశల మధ్య ఊగిసలాడుతూ మధ్యలో నార్మల్‌గా ఉంటూ మానసికంగా అవస్థ పడే స్థితే ‘బైపోలార్ డిజార్డర్’. ‘నా పదహారవ ఏట డాక్టర్లు దీనిని గుర్తించారు. దీనిని ఎదుర్కొనడానికి సిద్ధమవమన్నారు’ అని తెలిపింది ఈషా.➡️నీకు నువ్వే సాయం చేసుకో‘మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మొదట తమ మీద తాము విశ్వాసం నిలుపుకోవాలి. పెద్ద కొంపలేం మునగలేదు.. నేనూ అందరిలాంటి వ్యక్తినే... ఇది ఉన్నట్టుగానే గుర్తించక నీ పనిలో పడు అని ధైర్యం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైద్య చికిత్సను పూర్తిగా విశ్వసించి డాక్టర్లు చెప్పినట్టు వినాలి. ఇవేవి సరిగా చేయకపోయినా ఇబ్బందిలో పడతాం’ అంటుంది ఈషా. ‘నాకు డిజార్డర్ ఉందని తెలిశాక దాన్ని ఆర్డర్లో పెట్టడానికి నాలోని సృజనాత్మక శక్తులన్నీ వెలికి తీశాను. కథక్ నేర్చుకున్నాను. పెయింటింగ్ నేర్చుకున్నాను. మానసిక సమస్యలకు సంబంధించిన రీసెర్చ్ చేశాను. మానసిక సమస్యల చైతన్యానికై ప్రచార కర్తగా మారాను. ఈ పనులన్నీ నా సమస్యను అదుపు చేయగలిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బైపోలార్ డిజార్డర్ నా జీవితాన్ని ఆర్డర్లో పెట్టుకునే శక్తి నాకు ఇచ్చింది. అందుకే నా అనుభవాల గురించి రాసిన పుస్తకానికి ‘ఫైడింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ అనే పేరు పెట్టాను’ అంటోంది ఈషా.➡️గట్టి బంధాలు‘హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం గట్టి మానవ సంబంధాలు ఉన్నవారు ఎక్కువ ఆయుష్షుతో ఉంటున్నారట. మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లను చూసుకునే తల్లిదండ్రులు, కేర్గివర్లు ఎంత ప్రేమగా ఉంటే పేషంట్లకు అంత ధైర్యం దక్కుతుంది. సాధారణ జీవితంలో కూడా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలే మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ గట్టి బంధాలు ఉండటం లేదు. ఒక మనిషి ఉన్నాడనే ధైర్యమే నేడు కావలసింది. నేను నా మానసిక సమస్యను దాదాపుగా జయించడంలో నా భర్త, నా తోబుట్టువుల మద్దతు చాలా ఉంది’ అని ముగించింది ఈషా. -
Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
ఇప్పుడు డీప్‌ఫేక్‌ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్‌ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్‌ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్‌ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్‌ఫేక్‌లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్‌లో నడుస్తుంటే బీచ్‌లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు. మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్‌ఫేక్‌లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్‌ఫేక్‌తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్పర్ట్.బ్రిటిష్ ఇండియన్ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్‌గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్‌గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్‌ను గెలుచుకుంది.ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్‌ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.చెడు ఎంతో ఉంది:‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు. మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత. -
ఈ నెల 27న విజయవాడలో 'మూడు దారులు' పుస్తక ఆవిష్కరణ
-
తూర్పు తీరంలో వెల్లివిరిసిన ‘ తెలుగు రేఖలు’
ప్రపంచానికి తూర్పు వైపున ఉన్న ఆస్ట్రేలియాలో వైభవోపేతంగా తెలుగు వెలుగులీనుతోంది. ఆరు దశాబ్దాలుగా ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలుగు భాషా,సాహిత్యాలను, తెలుగు వారి అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన వారు ఎందరో ప్రముఖులు తమ మేధాసంపత్తితో, ప్రతిభాపాటవాలతో ఆస్ట్రేలియా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. విశ్వవిపణిపైన తెలుగు కీర్తి బావుటాను ఎగురవేస్తున్నారు.సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఎన్నో కష్టాలను,బాధలను అనుభవించారు. కానీ ఆ ఆరవై ఏళ్లల్లో వందలు, వేలు,లక్షలుగా తెలుగు వారి ప్రస్తానం సాగింది. ఆస్ట్రేలియాదేశంలోనే మన భాషకు ఒక సామాజిక గుర్తింపు, హోదా లభించాయి. ఈ 60 ఏళ్ల పరిణామాలపైన ప్రముఖ రచయిత, మెల్బోర్న్లో నివసిస్తున్న కొంచాడ మల్లికేశ్వరరావు రచించిన అద్భుతమైన పుస్తకం ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. మొదటి తరం అనుభవించిన కష్టాలను మొదలుకొని నేటి తరం చేరుకున్న ఉన్నతమైన విజయ శిఖరాల వరకు సమగ్రంగా చర్చించింది. మల్లికేశ్వరరావు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో తెలుగుభాష అభివృద్ధి కోసం విశేషకృషి చేస్తున్నారు. భువనవిజయం వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి నాటకాలను, కవిసమ్మేళనాలను, సాహిత్య చర్చలను నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు భాష గుర్తింపు కోసం ఆస్ట్రేలియా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అక్కడి తెలుగు సంఘాలతో కలిసి పని చేశారు. తెలుగు భాషాసంస్కృతులను ప్రాణప్రదంగా భావించే ఆయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ల తెలుగు వసంతాల ప్రస్తానం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం. అంతేకాదు. ఆస్ట్రేలియాకు వెళ్లే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుంది. -
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకం "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" అనే పుస్తకాన్ని ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం హై కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బిఎన్‌లు కలిసి రచించారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి ? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది. ఈ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరమని, దీంతో ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత ఉండాలని సూచించారు. తప్పుడు రిపోర్టింగ్, తప్పుడు సమాచారంతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారని, ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్‌ను ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా భావిస్తున్నానన్నారు. ఈ పుస్తకం పోలీసు, న్యాయస్థానాల వంటి వ్యవస్థల మధ్య, మధ్యవర్తులు అందుబాటులో ఉంటే, అది బాధితునికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ మాట్లాడుతూ.. అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్స్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారని చెప్పారు. -
స్థూల జాతీయ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అగ్రగామి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కనపడకుండా అడ్డుపడే దురదృష్ట ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని ఆంద్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. జర్నలిస్టు ఆంగ్ల మాస పత్రిక సంపాదకులు వీవీఆర్ కృష్ణం రాజు రూపొందించిన ‘దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర’ సర్వే నివేదిక విడుదల సందర్భంగా స్థానిక సీఆర్ మీడియా అకాడమీ కార్యాలయం ఏర్పాటైన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పక్షాలు, పత్రికలు తమ రాజకీయ, పత్రికా ప్రాయప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తూన్నారని అన్నారు. అయితే, ప్రజల మనోభావాలతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందన్న సంగతిని ఈ వర్గాలు పూర్తిగా పక్కన పెట్టేయడం విచారించ దగ్గ అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సందర్భాల్లో వెలువరించిన అధికారిక సమాచారం సేకరించి, దాన్ని ఒక క్రమ పద్దతిలో ఉంచి ఆంద్ర ప్రదేశ్ వృద్ధి రేటును కళ్లముందుంచే ప్రయంత్నం చేసిన వీవీఆర్ కృష్ణంరాజు అభినందనీయులని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామంటే 6 వేలపై చిలుకు ఆసుపత్రులు, 86 వేల ఆసుపత్రి పడకలు ప్రభుత్వ రంగంలోనే ఉండడం కారణమన్నారు. వీవీఆర్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. తాము సమీకరించిన గణాంకాలన్నీ నీతి ఆయోగ్, భారతీయ రిజర్వు బ్యాంక్, వివిధ రాష్ట్రాలు విడుదలచేసిన సామాజిక ఆర్ధిక సర్వేల నుంచి సేకరించినవే అన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలనే తలంపుతోనే ఈ నివేదిక రూపొందించామని, ఇందులో ప్రత్యేకించి మరే ఉద్దేశ్యం లేదని వివరించారు. స్థూల జాతీయ వృద్ధి రేటు 16.25 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో 25. 58 శాతం, వృద్ధి రేటు ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో రాష్ట్రంలో 16,924 పరిశ్రమలున్నాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: రజనీకాంత్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం: కొమ్మినేని శ్రీనివాసరావు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంద్ర ప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతుండడాన్ని అందరూ ఖండించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 10వేల కోట్లు వివిధ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిందని, ఇలా వెళ్లిన నగదు పదే పదే సర్క్యూలేట్ అయ్యి సమాజంలోని సేవారంగం, నిర్మాణ రంగం ల లో వృద్ధి కి కారణమైందన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రం లో ఇంత పెద్ద ఎత్తున ప్రత్యక్ష నగదు బదలీ జరగలేదని ఆయన అన్నారు. లఖంరాజు సునీత మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహనరెడ్డి పాలనలో మొదటి 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా కొనసాగించారని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని ఆ ప్రయాజనాలు తక్షణమే కనిపించేవి కాదని అన్నారు. రామరాజు శ్రీనివాస రాజు మాట్లాడుతూ గత నాలుగేళ్ల పాలన లో అద్భుత ప్రగతి కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పధకాలు కొనసాగిస్తామని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర స్వంత టాక్స్ లు విషయం లో దేశంలో మన రాష్ట్రం 6 వ స్థానంలో ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు జంపా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ.. 45వేల 396 కోట్లు సామాజిక రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలు కొత్తవి రాకుండా సైతం కొన్ని వర్గాలు పారిశ్రామిక వర్గాల వద్ద రాష్ట్ర పరిస్థితులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఈ విషయం తమ పరిశీలన లో వెల్లడైందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన లో దేశం లోనే మన రాష్ట్రం 3 వ స్థానం లో వుందని అన్నారు.పేదరిక నిర్మూలనలో గత ప్రభుత్వం తో పోల్చితే 60 పాయింట్లు ఆధిక్యతతో ప్రస్తుతం 81 పాయింట్లకు చేరుకుందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ధి సరిగా జరిగితేనే జనాభా పెరుగుదల రాష్ట్రానికి, దేశానికి మేలుచేస్తుందని అన్నారు. హైకోర్టు న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ పత్రికలు, పార్టీలు ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రం లోని వాలంటీర్ల వ్యవస్థ పై అధ్యయనానికి బెంగాల్, మహారాష్ట్ర బృందాలు పర్యటించాయన్నారు. లాంప్ ఎన్జీవో అధినేత సాల్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంస్కరణలతో కూడిన అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలు అందుకుంటారని అన్నారు. మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం బాలగంగాధర తిలక్ మాట్లాడుతూ.. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమం గొప్ప విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభత్వాలు పెట్టె పెట్టుబడులు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు. ప్రచారంలో ఉన్నా అసత్యాలు ప్రజలు తిరస్కరిస్తున్నారని అధ్యాపక విభాగం, రాష్ట్ర అధ్యక్షులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాజకీయ, కుల, మత ప్రాంతీయ భేదాలకతీతంగా పత్రికలూ పనిచేయాలని ఆయన అన్నారు. జర్నలిస్టు ఆంగ్ల మాస పత్రిక సంపాదకులు వీవీఆర్ కృష్ణం రాజును ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు. -
హరనాథ్ మంచి మనసున్న వ్యక్తి
‘‘నేను, హరనాథ్ కలిసి చాలా సినిమాల్లో నటించాం. అతను నిజమైన అందాల నటుడు.. అలాగే మంచి మనసున్న వ్యక్తి. నేను హీరోగా నటించిన ‘మా ఇంటి దేవత’ చిత్రాన్ని కూడా నిర్మించారు హరనాథ్’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. 1936లో సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 167 సినిమాల్లో నటించారు. 1989, నవంబర్ 1న మరణించారాయన. కాగా హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో డా.కంపల్లి రవిచంద్రన్ రచించారు. శుక్రవారం హరనాథ్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. ఈ పుస్తకావిష్కరణలో హరనాథ్ కుమార్తె జి. పద్మజ, అల్లుడు జీవీజీ రాజు (‘తొలి ప్రేమ, గోదావరి’ చిత్రాల నిర్మాత), మనవళ్లు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు, పుస్తక రచయిత కంపల్లి రవిచంద్రన్ పాల్గొన్నారు. -
ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. ఐదేళ్ల అమావాస్య చంద్రపాలన పుస్తకాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని మాజీ సీపీఆర్వో విజయ్ కుమార్ రచించారు. -
‘గోపీచంద్ మరిన్ని విజయాలు అందించాలి’
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడారంగంలో ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొందరు మాత్రమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆట కోసమే శ్రమించారని... వారిలో పుల్లెల గోపీచంద్‌ది ప్రత్యేక స్థానమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ప్రశంసించారు. బ్యాడ్మింటన్ పట్ల గోపీచంద్‌కు ఉన్న అంకితభావం నేడు ప్రపంచం గర్వించదగ్గ చాంపియన్లను తయారు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్లేయర్‌గా, కోచ్‌గా గోపీచంద్ కెరీర్‌లోని కొన్ని కీలక అంశాలు, విశేషాలతో రాసిన ‘షట్లర్స్ ఫ్లిక్: మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్’ పుస్తకాన్ని శుక్రవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గోపీచంద్ శ్రమ, ప్రణాళిక కారణంగానే బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత భారత క్రీడాకారులు సాధించిన విజయాలన్నీ వ్యక్తిగత ప్రతిభతోనే వచ్చాయని, ప్రభుత్వ వ్యవస్థ ఎవరినీ తయారు చేయలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్వయంగా తమ ప్రభుత్వం కూడా క్రీడలను ప్రాధాన్యత అంశంగా గుర్తించలేదని, ఇకపై పరిస్థితి మారుతుం దని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గోపీచంద్ ఆలోచనలకు రచయిత్రి ప్రియా కుమార్ పుస్తక రూపం ఇచ్చారు. ఇది పూర్తిగా తన ఆటోబయోగ్రఫీ కాదని గోపీచంద్ స్పష్టం చేశారు. ‘ఇది జీవిత చరిత్రలాంటి పుస్తకం కాదు. ఆటగాడిగా, కోచ్‌గా కెరీర్లో విభిన్న రకాల అనుభవాలు ఎదుర్కొన్నాను. ఇందులో పలు సవాళ్లు కూడా ఉన్నాయి. వాటిని ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యవహరించి ఎలా అధిగమించానో, వాటిలో స్ఫూర్తిగా నిలిచే అంశాలు ఈతరం క్రీడాకారులకు పనికొస్తాయనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాం. ఇది బ్యాడ్మింటన్‌కు సంబంధించింది మాత్రమే కాదు. అన్ని రకాల క్రీడాంశాలకు కూడా ఈ పుస్తకంలో తగిన సమాధానాలు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. శిక్షకుడిగా నా వృత్తిలో పలువురు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచే ఎదురైన ప్రశ్నలకు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను’ అని ఆయన వెల్లడించారు. రచయిత్రి ప్రియా కుమార్ మాట్లాడుతూ... ‘ఒక సాధారణ వ్యక్తి విజేతగా నిలిచేందుకు ఎంత గా కష్టపడ్డాడో, దాని నుంచి ఎలా స్ఫూర్తి పొంద వచ్చో అనే విషయాన్నే ఇందులో ప్రముఖంగా ప్రస్తావించాం. రచనా శైలి కూడా అంశాల వారీగా ఉంటుంది. అనేక అంశాలపై గోపీచంద్ ఆలోచనలను పుస్తకంగా మార్చేందుకు మూడేళ్లు పట్టింది’ అని పేర్కొంది. సైమన్ అండ్ షుస్టర్ పబ్లిషర్స్ ఈ ‘షట్లర్స్ ఫ్లిక్’ను ప్రచురించింది. -
మీ కోసం పుస్తకం రాశాను
తారలు గర్భం దాల్చే విషయంలో చాలా వొత్తిడి ఉంటుంది. కెరీర్‌కు వచ్చే బ్రేక్ వల్లా శరీరంలో వచ్చే మార్పు వల్లా ఆ వొత్తిడి వారికి యాతన అవుతుంది. కరీనా కపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నటిగా టాప్ లెవల్లో ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం... ఇవి తన మీద చూపే వొత్తిడి ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా కలగవచ్చని ఆమెకు అనిపించింది. అసలు గర్భధారణ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం రాసి ఆమె విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఇది కచ్చితంగా ఉపయుక్తమే. 2018లో భారతదేశంలో హైయెస్ట్ సెల్లింగ్ ఫిమేల్ ఆథర్ ఎవరో తెలుసా? ఊహించండి. నటి ట్వింకిల్ ఖన్నా. ఆమె రాసిన ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ పుస్తకం రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమె సినీ నటి అనో, అక్షయ్ కుమార్ భార్య అనో ఆ పుస్తకం అమ్ముడుపోలేదు. దానిలో ఉన్న సరదా విషయాలు, వాటిని రాసిన ట్వింకిల్ ఖన్నా శిల్పం ఆ పుస్తకానికి పేరు తెచ్చాయి. బాలీవుడ్లో పుస్తక రచనను ఒక ప్రవృత్తిగా పెట్టుకున్న నటి ట్వింకిల్. ‘మిసెస్ ఫన్నీబోన్’, ’ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ ఆమె ఇతర పుస్తకాలు. నటి శిల్పా శెట్టి రాసిన ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకం కూడా హిట్ అయ్యింది. ‘ఆషికీ’ సినిమాలో నటించి ఆ తర్వాత ప్రమాదం బారిన పడి అదృశ్యమయ్యి తిరిగి చాలా ఏళ్ల తర్వాత జనం ముందుకు వచ్చిన అనూ అగర్వాల్ రాసిన ‘అన్యూజ్వల్’ పుస్తకం పాఠకులు పెద్ద ఎత్తున కొన్నారు. నటి ప్రియాంక చోప్రా తన రచనలను, వ్యాసాలను ‘అన్ఫినిష్డ్’ పేరుతో పుస్తకంగా తెచ్చింది. ఇలా బాలీవుడ్ లోని మహిళా సెలబ్రిటీలు తాము నటనలోనే కాదు కలం పట్టి రాయడంలోనూ ప్రతిభ ఉన్నవాళ్లం అని నిరూపించారు. అదే వరుసలో ఇప్పుడు కరీనా కపూర్ కూడా చేరింది. ఆమె గతంలో ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ డైరీ’ అనే పుస్తకం తెచ్చింది. అందులో స్త్రీలకు అలంకరణ కిటుకులు తన అనుభవాల నుంచి చెప్పింది. ఇప్పుడు ఆరోగ్య రహస్యాలు చెప్పేందుకు కొత్త పుస్తకంతో వచ్చింది. దాని పేరే ‘ప్రెగ్నెన్సీ బైబిల్’. వేడి వేడి పుస్తకం కొన్నిరోజుల క్రితం కరీనా కపూర్ తన చేతిలో ఒక ఆల్ట్రాసౌండ్ రిపోర్ట్ పట్టుకుని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ‘ఒక పని మీద ఉన్నా. అయితే మీరు ఊహించేదే కాదు. విశేషాల కోసం ఎదురు చూడండి’ అని ఆ పోస్ట్‌లో క్యాప్షన్ రాసింది. అది చాలా వైరల్ అయ్యి బోలెడన్ని ఊహాగానాలు వచ్చాయి. దాని కొనసాగింపుగా తాజా పోస్ట్ వచ్చింది. అందులో కరీనా ఒక బేకింగ్ ట్రే నుంచి తన తాజా పుస్తకాన్ని బయటకు తీసి ‘వేడి వేడిగా ఇప్పుడే బయటకు వచ్చింది’ అని చూపించింది. ‘ఇది నా మూడోబిడ్డ. ఇన్నాళ్లూ దీని పనిలోనే ఉన్నా’ పుస్తకాన్ని తేవడం కూడా బిడ్డను కనడంతో సమానం అని వ్యాఖ్యానించింది. అందుకే ఆమె తన మునపటి పోస్ట్‌లో ఆల్ట్రాసౌండ్ స్కాన్ చూపింది. గర్భిణుల సర్వస్వం గర్భధారణ గురించి, గర్భం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రసవం గురించి గతంలో అనేక పుస్తకాలు వచ్చాయి. అవి ఎక్కువ భాగం వైద్యనిపుణులు రాసినవి. అయితే ఇప్పుడు కరీనా రాసిన పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ కొంత భిన్నమైనది. ఒక ప్రసిద్ధ నటి తన సహజమైన సందేహాలకు తెలుసుకున్న సమాధానాలను, పాటించిన జాగ్రత్తలను, అందులో ఎప్పటికప్పుడు ఎదురైన సమస్యలను తన దృష్టికోణం నుంచి చెప్పడమే ఈ పుస్తకం ప్రత్యేకత. అంతే కాదు ఉద్యోగం/కెరీర్లో ఏదైనా సాధించాం లేదా సాధిస్తున్నాం అనుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో ఆ పని విరామం వల్ల ఎటువంటి వొత్తిడికి, భావాలకు లోనవుతారో కూడా ఈ పుస్తకంలో తన అనుభవాల నుంచి ఆమె తెలియచేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది. ఆమె ఈ పుస్తకాన్ని తన జ్ఞానంగా కాక గైనకాలజిస్ట్‌ల సాయంతో చేశానని వారి పేర్లు కూడా ప్రస్తావించింది. ఈ పుస్తకాన్ని ఎఫ్.ఓ.జి.ఎస్.ఐ (ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) కూడా ఆమోదించడంతో ఇందులో ఉన్నది అథెంటిక్ సమాచారం అని చెప్పవచ్చు. మంచి చెడ్డా ‘నా తోటి హీరోయిన్లు పనిలో దూసుకుపోతుంటే నేను మంచం మీద నుంచి దిగలేని స్థితిలో ఉన్నాను. గర్భధారణ సమయంలో కొన్ని మంచి అనుభూతులు కలుగుతాయి. కొన్ని చెడు చిరాకులు రేగుతాయి. ఎన్నో సందేహాలు ఉంటాయి. మానసికంగా భౌతికంగా నేను ఎదుర్కొన్న సమస్యలకు పొందిన సమాధానాలను వ్యక్తిగత దృష్టికోణం నుంచి నేను తెలియచేశాను’ అని కరీనా తెలియచేసింది. ‘దీని ఆలోచన నుంచి పుస్తకం బయటకు రావడం వరకూ కూడా ఒక జననం లాంటిదే. అందుకే ఇది నా మూడో బిడ్డ’ అని ఆమె అంది. ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం, ఇంటి పెద్దలు కలవడానికి వీలైన కుటుంబ జీవనం లేకపోవడం, బిజీ లైఫ్... ఇవన్నీ ఇప్పుడు గూగుల్ ద్వారానో పుస్తకాల ద్వారానో సందేహాలు తీర్చుకునే స్థితికి తీసుకెళ్లాయి. ఆ విధంగా చూసినప్పుడు కాబోయే తల్లుల కోసం ఈ పుస్తకం రాసి ఇక్కడ కూడా కరీనా హిట్ కొట్టినట్టే లెక్క. ఉద్యోగం/కెరీర్లో ఏదైనా సాధించాం లేదా సాధిస్తున్నాం అనుకునే స్త్రీలు గర్భధారణ సమయంలో ఆ పని విరామం వల్ల ఎటువంటి వొత్తిడికి, భావాలకు లోనవుతారో కూడా ఈ పుస్తకంలో తన అనుభవాల నుంచి ఆమె తెలియచేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అనుభవం అనేక విషయాలను తెలిపే అవకాశం ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
ఆడపిల్లలకు చెబుదాం
9 నుంచి 13 ఏళ్ల వయసులో ఉండే అమ్మాయిలకు ఎన్నో సందేహాలు. తమ శరీర మార్పుల గురించి. వాటికి సమాధానం మనం చెప్పం. వారే తెలుసుకోవాలి. ఆ వయసు తర్వాత వాళ్లు ‘ఆడపిల్లలు’ గా సమాజం నుంచి ప్రత్యేకం కాబడతారు. ఎందుకు అలా? వారిని వారికి తెలియచేద్దాం... వారిని సమాజంలో ఒక భాగం చేద్దాం అంటున్నారు నటి టిస్కా చోప్రా. తొమ్మిదేళ్ల కూతురు ఉన్న టిస్కా బాలికల కోసమే ‘వాట్స్ అప్ విత్ మీ’ పుస్తకం రాసి వెలువరించారు. ‘వాట్స్ అప్ విత్ మీ’ అనేది టిస్కా చోప్రా రాసిన పుస్తకం పేరు. దాని కింద ప్యూబర్టీ, పిరియడ్స్, పింపుల్స్, పీపుల్, ప్రాబ్లమ్స్ అండ్ మోర్ అనే ట్యాగ్‌లైన్. దీనిని బట్టి ఆ పుస్తకం ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. 47 ఏళ్ల టిస్కా ‘తారే జమీన్ పర్’ నటిగా దేశానికి తెలుసు. ఆమె చేసిన ‘చట్నీ’ అనే లాంగ్ షార్ట్‌ఫిల్మ్ ఆమెకు విపరీతమైన ఖ్యాతి తెచ్చి పెట్టింది. బాలీవుడ్లో, టెలివిజన్‌లో, నాటక రంగంలో టిస్కా చాలా భిన్నమైన పాత్రలనే చేయడానికి ఇష్టపడుతుంది. అదీగాక ఆమె రచయిత్రి కూడా గతంలో ఆమె ‘యాక్టింగ్ స్మార్ట్: యువర్ టికెట్ టు షోబిజ్’ పుస్తకం రాసింది. ‘వాట్స్ అప్ విత్ మీ’ ఆమె రెండోపుస్తకం. కూతురి కోసం ‘ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు. ‘రెడ్ పాండా’ పబ్లికేషన్స్ ఎడిటర్ విధి భార్గవ నా బుర్రలో వేసింది. లాక్డౌన్లో నేను ఇంట్లో ఉండటం కూడా ఈ ఆలోచన పెరగడానికి కారణమైంది. ఇక తొమ్మిదేళ్ల నా కూతురు మరో ముఖ్యకారణం. నా చిన్నప్పుడు పిరియడ్స్ గురించి అడిగితే అదొక అసహ్యకరమైన విషయంగా మా పెద్దలు ఆ విషయాన్ని చర్చించేవారు కాదు. దాని గురించి రకరకాలుగా సమాచారం సేకరించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా కన్ఫ్యూజన్ని, ఆందోళనని కలిగించేది. నా కూతురును మాత్రం అలా నేను చేయదలుచుకోలేదు. మా ఇంట్లో లైంగిక అవయవాలను సంకేతపదాలతో మాట్లాడము నేను కాని నా భర్త కాని. వాటికి సంకేత పదాలు వాడటం వల్ల వాటి చుట్టూ నిగూఢత ఏర్పడుతుంది. దాని నుంచే సందేహాలు అన్నీ వచ్చేస్తాయి. అమ్మాయిలకు అమ్మాయిల గురించి, అబ్బాయిలకు అబ్బాయిల గురించి ఇద్దరికీ పరస్పరం సమాచారం ఉండాలి. దాని గురించి మనమంతా ఆలోచించాలి. నా పుస్తకం ఒక మేరకు జరిగిన ప్రయత్నంగా భావిస్తాను’ అంటోంది టిస్కా. సరదాగా సమచారం ‘నా పుస్తకంలో సమాచారాన్ని సరదాగా ఉండేలా చూశాను. చాలా బొమ్మలు ఉంటాయి. వాటి ద్వారా ఆడపిల్లలకు తమ శరీరాల్లో జరిగే మార్పులు, తద్వారా వచ్చే ఆందోళనల గురించి తెలుస్తుంది. పిరియడ్స్ గురించి జరిగే షేమింగ్ తెలుస్తుంది. దాని గురించి భయపడేది సిగ్గుపడేదీ ఏమీ లేదని చెబుతాను. అవి వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ప్యాడ్స్ గురించి కప్స్ గురించి సమాచారం ఉంటుంది. అసలు ఆడపిల్లలు ధైర్యంగా మెడికల్ షాప్‌కు వచ్చి ప్యాడ్స్‌ని కొనే, అలాగే మెడికల్ షాప్ వాడు దానిని న్యూస్‌పేపర్ లో చుట్టకుండా ఇచ్చే రోజులు రావాలి. ఆడపిల్లల తండ్రులు తమ కుమార్తెల కోసం శానిటరీ పాడ్ కొనగలగాలి. నా పుస్తకం తండ్రులకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆడపిల్లల తండ్రులు కూడా తమ కుమార్తెల మనసుల్లో ఏముందో ఏం సందేహాలున్నాయో తెలుసుకుని వారిని తేలిక పరచాలి. మన ఇళ్లల్లో తల్లికి ఈ బాధ్యత అప్పజెబుతారు. తల్లి వాటికి రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు’ అంటారు టిస్కా. నిపుణుల సహాయంతో... టిస్కా ఈ పుస్తకం టీనేజ్‌ను దాటిన ఒక స్త్రీ అవగాహనతో రాసినా, నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా అరోరా (గైనకాలజిస్ట్), కెనడాలో ఉంటున్న మాళవిక వర్మ (సైకాలజిస్ట్) తమ ఇన్పుట్స్ ఇచ్చి బాలికల భౌతిక, మానసిక మార్పులకు సంబంధించి వారికి వచ్చే సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ‘టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు సరైన అవగాహన కల్పించడం వల్ల మెన్స్ట్రువల్ హైజీన్ తెలుస్తుంది. లైంగిక అవయవాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోగలుగుతారు. టీనేజ్ ప్రెగ్నెన్సీల బారిన పడకుండా ఉంటారు’ అని డాక్టర్ మాలా అరోరా అంటారు. ఏమైనా టిస్కా అరోరా రాసిన ఈ పుస్తకం లాంటి పుస్తకాల అవసరం చాలా ఉంది. తెలుగులో ఇలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి... స్కూల్ పిల్లలకు చదువుకునే విధంగా వారికి ఏ మేరకు అందుతున్నాయన్నది సందేహాస్పదం. మన సెలబ్రిటీలు ఇలాంటి ఆలోచనలు చేస్తే వారి స్టేటస్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ పుస్తకాలను చేరవేయవచ్చు. సమాజంలో జరుగుతున్న దుష్పరిమాణాలు చూసినప్పుడు బాలికల శారీరక, లైంగిక చైతన్యం గురించి ఎంతో పని సాగాలని తెలుస్తోంది. ఆ పని టిస్కా చేసినందుకు ఆమెకు తప్పకుండా అభినందనలు తెలిపి తీరాల్సిందే. – సాక్షి ఫ్యామిలీ -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్‌కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్‌కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్‌లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్‌కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
‘ఒక్కగానొక్కడు’ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాడు, నేడు.. కేసీఆర్ తిరుగులేని నేత అని వక్తలు పేర్కొన్నారు. బీసీ కమిషన్ పూర్వసభ్యుడు జూలూరు గౌరీశంకర్ రచించిన ‘ఒక్కగానొక్కడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఇక్కడి మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జరిగింది. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలంలో, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, పాలనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్ర మరవలేనిదని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, కాలె యాదయ్య, బీసీ కమిషన్ పూర్వ సభ్యులు ఈడిగ ఆంజనేయులు గౌడ్, రామానంద తీర్థ సంస్థ డైరెక్టర్ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఒక్కగానొక్క ఆడబిడ్డ అన్నట్లుగా..
‘ఒక్కగానొక్క ఆడబిడ్డ’ అన్నట్లుగా కమలా హ్యారీస్‌ను అమెరికాలో అందరూ తమ కుటుంబ సభ్యురాలిని చేసుకున్నారు! ఆమె ‘పరిపూర్ణమైన అమెరికన్’ అయుంటే ఇంకా బాగుండేదనే భావన తెల్లజాతి స్థానికుల్లో ఉన్నప్పటికీ, తమ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా ఆమెను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. మహిళలైతే ఆమెతో ఏమైనా చెప్పాలని ఉత్సాహపడుతున్నారు కూడా. ఆ ఉత్సాహం ఒక్క అమెరికన్ మహిళల్లోనే కాదు, యావత్ ప్రపంచ మహిళల్లో వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్ని న్యూయార్క్‌లోని ఆఫ్రో–అమెరికన్ రచయిత్రి డాక్టర్ పెగ్గీ బ్రూక్స్ కనిపెట్టారు. కమలపై తనొక పుస్తకం వేస్తున్నాననీ, ఆమెకు ఏదైనా చెప్పదలచినవారు ఉత్తరం రాసి తనకు పంపిస్తే ఆ ఉత్తరాలను పుస్తకంగా వేస్తానని ప్రకటించారు. వేల ఉత్తరాలు వచ్చాయి. వాటిలోంచి 120 ఉత్తరాలు ఎంపిక చేసి పుస్తకంగా విడుదల చేశారు పెగ్గీ బ్రూక్స్. పెగ్గీ బ్రూక్స్ వేసిన ఆ పుస్తకం పేరు ‘డియర్ కమల: ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్’. ఆ పుస్తకాన్ని ఒక వ్యక్తి తప్పకుండా చదవాలని బ్రూక్స్ కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. కమలా హ్యారిస్! ఇప్పటికే ఒక కాపీని ఆమె యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్‌కి పంపించారు కనుక కమల ఆ పుస్తకాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. పైగా అందులోనివి వివిధ మహిళలు తనకు రాసిన ఉత్తరాలు! నేడు, రేపట్లో కమల నుంచి బ్రూక్స్‌కి ఒక సందేశం వచ్చినా రావచ్చు..‘బ్రూక్స్.. మీ ప్రయత్నం నాకెంతగానో ఉపకరిస్తుంది’ అని. మంచి విషయానికి స్పందించకుండా ఉండలేకపోవడం కమల స్వభావం. పుస్తకంలో కేవలం ఉత్తరాలు మాత్రమే లేవు. ఆ ఉత్తరాలను సమన్వయం చేస్తూ కమలా హ్యారిస్‌తో ఒక రచనా ప్రక్రియగా రచయిత్రి బ్రూక్స్ పంచుకున్న మనోభావాలూ ఉన్నాయి. ‘‘ఉత్తరాల్లో ఎక్కువ భాగం.. సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను తొలగించమని కోరుతూ చేసిన విజ్ఞప్తులే ఉన్నాయి’’ అంటున్నారు బ్రూక్స్. ∙∙ బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు, ఆయన భార్య, ‘ఫస్ట్ లేడీ’ అయిన మిషెల్ ఒబామా మీద కూడా ఇదే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు బ్రూక్స్. ఆ పుస్తకం పేరు ‘గో, టెల్ మిషెల్’. అయితే రాజకీయాల్లో ఉన్న మహిళలు, రాజకీయ నేతల భార్యల మీద మాత్రమే పుస్తకాలు రాసే స్పెషలిస్టు కారు బ్రూక్స్. ప్రధానంగా ఆమె ఆఫ్రో–అమెరికన్ మహిళల జీవిత వైవిధ్యాలకు, వారి జీవన వైరుధ్యాలకు ప్రామాణికత కల్పించే చరిత్రకారిణి. కవయిత్రి, నాటక రచయిత్రి. ఆమె రాసిన ‘వండర్ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్’ గ్రంథం జగద్విఖ్యాతి చెందినది. కుషైట్లది ఈజిప్టులోని ఇరవై ఐదవ రాజవంశం. డెబ్బై ఎనిమిదేళ్ల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్‌లో జన్మించారు. భర్త yð న్నిస్తో కలిసి 1986లో న్యూయార్క్ వెళ్లి స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. పుస్తకాలు, నాటికలు ఆమె జీవనాసక్తులు. ఆమె చదివేవీ, రాసేవీ అన్నీ కూడా స్త్రీల సంబంధ సామాజికాంశాలే. పొలిటికల్ సైన్స్ బి.ఎ. చదివారు. ప్రజారోగ్యంపై రెండు డాక్టరేట్లు చేశారు. అవి కూడా ఉమెన్ హెల్త్ పైనే. కుటుంబ బంధాలపై, ముఖ్యంగా తల్లీబిడ్డల అనుబంధాలపై ఆమె రచనలకు అవార్డులు కూడా వచ్చాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడితే సమాజం, సామాజిక సంబంధాలు మెరుగుపడితే స్త్రీల స్థితిగతులు మెరుగుపడతాయని బలంగా నమ్ముతారు పెగ్గీ బ్రూక్స్. -
నిర్మాత వి.దొరస్వామిరాజు బుక్ రిలీజ్ ఫంక్షన్ ఫోటోలు
-
ప్రామిస్డ్ ల్యాండ్: ‘సారా పాలిన్ ఎవరు?’
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన రాజకీయ అనుభవాల గురించి వెల్లడించిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం మార్కెట్లోకి రాకముందే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల గురించి ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయాలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో ఈ పుస్తకంలోని మరి కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున ఒబామా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ని తన సహచరుడిగా ఎన్నుకోవడం పట్ల పడిన ఆందోళన గురించి ఇందులో రాసుకొచ్చారు. ఎక్కువగా మాట్లాడడు.. స్వీయ అవగాహన లేదు.. ఇద్దరం చాలా వేర్వేరుగా ఉండే వాళ్లం. కానీ అతడి మంచి మనసు, విదేశాంగ విధానం, కష్టపడి పని చేసే స్వభావం అనతి కాలంలోనే అతడిపై నా అభిప్రాయాన్ని మార్చేశాయి అనితెలిపాడు. ఇక 2008లో రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటి పడిన సారా పాలిన్ గురించి కూడా ఒబామా తన పుస్తకంలో వివరించారు. (రాహుల్ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా) ‘డెమొక్రాట్ల తరఫున జో బైడెన్‌ని ఉపాధ్యక్షుడిగా ప్రకటించాము. ఇక రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి ఎవరు బరిలో నిలవబోతున్నారో తెలుసుకునేందుకు నేను, బైడెన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇంతలో జాన్ మెక్కెయిన్ ఉపాధ్యక్ష పదవికి సారా పాలిన్‌ని ఎన్నుకున్నట్లు తెలిసింది. దీని గురించి బైడెన్‌కి మెసేజ్ చేశాను. సారా పాలిన్ ఎవరు అంటూ బైడెన్ నన్ను అడిగారు’ అని తన పుస్తకంలో వివరించారు ఒబామా. ఇక పాలిన్‌ని ఉపాధ్యక్షురాలిగా ప్రకటించడం పట్ల తాను కొంత ఇబ్బంది పడినట్లు ఒబామా వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో పాలిన్ ఎంతో ఆసక్తి క్రియేట్ చేశారని.. ఆమె ఎందరో ఓటర్లని ప్రభావితం చేయగలదని మొదట తాను భావించానన్నారు ఒబామా. అయితే అతి త్వరలోనే పాలిన్ గురించి తాము మరీ అంత కలత చెందాల్సిన అవసరం లేదని.. దేశాన్ని పాలించే అంశాల గురించి ఏ మాత్రం అవగాహన లేదనే విషయం పాలిన్ మాటల్లో ధ్వనించేది అన్నారు ఒబామా. ‘పాలిన్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడంలో అత్యంత ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే ఇది దేశ రాజకీయాల దిశను మార్చింది. పాలిన్ అసమర్థత రిపబ్లికన్ పార్టీని "లోతైన స్థాయిలో ఇబ్బంది పెడుతోంది ... అయితే దీని గురించి చాలా మంది రిపబ్లికన్లకు పట్టింపు లేదు." ఆమె సమస్యల పరిజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తే "ఉదారవాద కుట్రకు రుజువుగా" ప్రచారం చేశారు’ అని ఒబామా తన పుస్తకంలో వెల్లడించారు. (ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్) అయితే దీనిపై స్పందిస్తూ పాలిన్ శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో ఒక కామెంట్ పోస్ట్ చేశారు. ఇక దీనిలో ఆమె రిపబ్లికన్ రాజకీయాలను తీర్చిదిద్దినందుకు ఒబామాకు కృతజ్ఞతలు తెలుపుతూ, "గత పన్నెండు సంవత్సరాలుగా నేను మీ తలలో అద్దె లేకుండా ఉచితంగా జీవించానని తెలుసుకోవడం ఆనందంగా ఉంది" అన్నారు పాలిన్. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. -
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
బరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..? ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్ గాంధీని బరాక్ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. అందం ఆమె సొంతం ‘‘చార్లీ క్రైస్ట్, రామ్ ఎమ్మాన్యుల్ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. నిష్పాక్షికత..చిత్తశుద్ధి దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్‌ను బరాక్ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు. కండల వీరుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు కష్టమే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్ అయిన బరాక్ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్‌తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్‌లో నల్లవాడిని చూసి భయపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌ స్లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్‌హౌస్‌లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు. ఇలాంటి వారందరికీ డొనాల్డ్ ట్రంప్ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు. వైవాహిక జీవితంపై.. అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్‌హౌస్ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్లో కనిపించేదని తెలిపారు. ‘‘జీవితంలో మిషెల్ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. మైక్రోఫోన్, జాక్స్ లేని ఫోన్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తెలిపారు. ఆ ఫోన్ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. – సాక్షి, హైదరాబాద్ -
రేపు దుబ్బాకలో ‘పారగమ్యత’ పుస్తకావిష్కరణ
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో 20వ తేదీన ‘పారగమ్యత’ పుస్తకాన్ని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీయూడబ్లుజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘సాక్షి’తో పాటు పలు పత్రికల్లో రాసిన వ్యాసాలను ‘పారగమ్యత’ అనే పేరుతో పుస్తకంగా అచ్చువేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం దుబ్బాక పట్టణంలోని నీలకంఠ పంక్షన్ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంట చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, వడితల సతీష్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సెన్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో పాటు పలు ప్రముఖ దినపత్రికల ఎడిటర్లు, పత్రికా ప్రతినిధులు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా కో ఆర్డినేటర్ వర్ధెల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ సీఎం పీఆర్వో రమేశ్ హజారితో పాటు పలువురు మేధావులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు, మేధావులు, ఉద్యమకారులు, సాహితి అభిమానులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముందుగా మెదక్ జిల్లా చేగుంటలో అనుకున్నారని కొన్ని కారణాల వల్ల ఈ వేదికను దుబ్బాకకు మార్చినట్లు తెలిపారు. -
దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది
సాక్షి, న్యూఢిల్లీ : ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివద్ధికి పునాది పడుతుందని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో..‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్లైన్ వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21 శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు) -
రేపు ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకావిష్కరణ
-
‘మోదీ జీవిత చరిత్ర’ విడుదల వాయిదా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత చరిత్ర ‘నరేంద్ర మోదీ హార్బింగర్ ఆఫ్ ప్రాస్పరెటీ అండ్ అపోస్టల్ ఆఫ్ వరల్డ్ పీస్’ పుస్తకం విడుదల వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడినట్లు పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్ అదీశ్ సి.అగ్రావాలా తెలిపారు. ప్రత్యేకమైన సైజు, జపనీస్ కాగితంపై ముద్రించిన ఈ పుస్తకాన్ని ముందుగా ఇంగ్లిషులో ముద్రించారు. ఆ తరువాత అరబిక్, డచ్, ఫ్రెంచ్లతోపాటు, పది భారతీయ భాషల్లోకి అనువదించినట్లు రచయిత డాక్టర్ అదీశ్ తెలిపారు. -
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి
‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్– ది లెజెండ్’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్‌గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం. చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
జైట్లీ సంస్కరణలు ప్రశంసనీయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి చివరిదాకా అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మాట్లాడారు. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. అలాంటి జైట్లీ ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా’అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. పుస్తకాన్ని వెంకయ్య కొడుకు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్‌సభ స్పీకర్ బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
రారండోయ్
రాణీశర్మ ఈమని, ఉణుదుర్తి సుధాకర్ పుస్తకం ‘తథాగతుని అడుగుజాడలు’ ఆవిష్కరణ అక్టోబర్ 26న సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ లైబ్రరీ, ద్వారకానగర్, విశాఖపట్నంలో జరగనుంది. ఆవిష్కర్త: సి.ఆంజనేయరెడ్డి. అధ్యక్షత: కె.తిమ్మారెడ్డి. వక్త: సి.ప్రజ్ఞ. నిర్వహణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. కుడికాల వంశీధర్ ‘నానీల వసంతం’ ఆవిష్కరణ నవంబర్ 3న సాయంత్రం 6 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్ క్రియేషన్స్. నారంశెట్టి బాలసాహిత్య పీఠం వారి 2019 బాలసాహిత్య పురస్కారాలను డి.కె.చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణకు ప్రదానం చేయనున్నారు. నవంబర్ 14న పార్వతీపురంలో జరిగే సభలో ప్రదానం ఉంటుంది. నిర్వహణ: నారంశెట్టి ఉమామహేశ్వరరావు. -
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
-
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచించిన ‘వైయస్సార్ ఛాయలో’ అనే పుస్తక ఆవిష్కరణ వేడుక అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
మాజీ ప్రధానుల కోసం మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానులందరి సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ఓ భారీ మ్యూజియంను ఏర్పాటు చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేలా కొత్త రాజకీయ సంస్కృతిని తాము తీసుకొస్తామని ఆయన అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌పై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ రాసిన ఓ పుస్తకాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఓ కుటుంబానికి చెందిన మాజీ ప్రధాన మంత్రుల జ్ఞాపకాలు తప్ప మిగిలిన ప్రధానుల వివరాలు ఏ మాత్రం లేకుండా చెరిపేసేందుకు ఓ వర్గం రాజకీయ నాయకులు ప్రయత్నించారు. చంద్రశేఖర్ నాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడితే, దానికి వ్యాపారవేత్తలు డబ్బులిచ్చారని ఆ వర్గం రాజకీయ నాయకులు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలని చూశారని మోదీ గుర్తుచేశారు. ఇలాగే బీఆర్.అంబేడ్కర్, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ తదితర అనేక మంది గొప్ప నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు కూడా స్వాతంత్య్రానంతరం కుటిల ప్రయత్నాలు జరిగాయని మోదీ అన్నారు. ఈనాటి యువతరంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లంతా మొదట ప్రజల మెదళ్ల నుంచి అదృశ్యమయ్యారు. ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉండొచ్చు కానీ ఓ వర్గం రాజకీయ నేతలే అలా చేశారు. కానీ మీ అందరి ఆశీస్సులతో మాజీ ప్రధానులందరికీ కలిపి ఓ పెద్ద మ్యూజియంను నిర్మించాలని నేను నిర్ణయించాను. ఆనాటి నుంచి ఇటీవలి ఐకే గుజ్రాల్, దేవె గౌడ, మన్మోహన్ సింగ్‌ల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దేశాభివృద్ధికి కృషి చేశారు. వారి సేవలను మనం గుర్తించాలి. గౌరవించాలి’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ను కాదని జవహర్లాల్ నెహ్రూను తొలి ప్రధానిగా నియమించిన విషయాన్ని మోదీ హాస్యంతో చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతనేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. -
‘చిగురుమళ్ల’కు అరుదైన గౌరవం
భద్రాచలంటౌన్: ఒకే కవి 101 పుస్తకాలను రచించడం, వాటిని ముద్రించడం, ఒకే వేదికపై అన్నింటినీ ఆవిష్కరించడం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఇది భద్రాచలం వాసి అయిన కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌కు సాధ్యమైంది. ఈ పుస్తకాలను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఒకే కవి రాసిన వంద పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించిన దాఖలాలు లేవు. సుమారు ఐదేళ్ల కఠోరశ్రమ, దీక్షతో ఆయన ఈ పుస్తకాలను ముద్రించారు. ఒక్కో సామాజిక అంశంపై ఒక్కో పుస్తకం చొప్పున ప్రచురించడం విశేషం. అంతేకాక జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా 101 శతక పుస్తకాలను 101 వేదికలపై ఒకే రోజు ఆవిష్కరించబోతుండడం మరో విశేషం. శ్రీనివా స్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మానవీయ విలువలు చాటి చెప్పడం కోసం అమ్మ శతకం, నాన్న శతకం, మేలుకొలుపు, చద్దిమాట వంటి శతకాలను రచించారు. సామాజిక రుగ్మతలపై కూడా తన కలాన్ని ఎక్కుపెట్టారు. మద్యపాన శతకం, ధూమపాన శతకం, గడ్డి శతకం, హారితహారంపై శతకాలు రాయడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. యువతలో దేశభక్తిని ప్రేరేపించేలా స్వాతంత్య్ర శతకం, భరతబిడ్డ, భరతవీర, వీరభారతి, వీరభూమి, జయభారతి, జాతీయ సమైక్య త, జై జవాన్ వంటి శతకాలను రచించారు. ఇవేకాకుండా అన్నదాత శతకం, పంట పొలము శతకం, సొంత ఊరు శతకం, ఆడపిల్ల శతకం, స్వచ్ఛభారత్ శతకం వంటి గొప్ప సామాజిక ప్రయోజనంతో కూడిన విషయాలపై ఆదర్శవంతమైన కవిత్వం రచించారు. కాగా, ఇంతటి మహోన్నత శతకాలను రచించిన శ్రీనివాస్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. -
మహానటుడు ఎస్వీ రంగారావు పుస్తకావిష్కరణ
-
తెలుగువాడిగా పుట్టడం అదృష్టం
‘‘నేను అభిమానించే నటుల్లో ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ ముఖ్యులు. వారి నటన సహజంగా ఉంటుంది. ఎస్వీఆర్ నటునిగా ఒక ఎన్సైక్లోపీడియా’’ అని నటుడు చిరంజీవి అన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటునిగా చిర కాలం గుర్తుండిపోయె నటుడు ఎస్వీ రంగారావు. ఆయనపై రచయిత, జర్నలిస్ట్, ‘సంగం’ అకాడమీ వ్వవస్థాపకుడు సంజయ్‌కిషోర్ రచించిన ‘మహానటుడు’ పుస్తకాన్ని చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానటుడు’ పుస్తక రచయిత సంజయ్ కిషోర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే పుస్తకం రచించడం ఆషామాషీ కాదు. ఎంతో నిబద్ధతతో చేయాల్సిన పని. ఎస్వీఆర్గారిపై నాకు అంత అభిమానం కలగటానికి కారణం మా నాన్నగారు. ఆయనకి నటనంటే ఎంతో ఇష్టం. అప్పట్లో ఆయన డ్రామాలు వేస్తూ ఉండేవారు. సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా అప్పటి ఆర్థిక స్తోమత దృష్ట్యా చేయలేక పోయారు. కానీ నాన్నగారు బాపట్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ‘జగత్ కిలాడీ’, ‘జగత్జంత్రీలు’ సినిమాల్లో ఎస్వీఆర్‌గారితో నటించే అవకాశం మా నాన్నకు వచ్చింది. అది ఆయన చేసుకున్న అదృష్టం. షూటింగ్ నుండి నాన్న ఇంటికి వచ్చిన తర్వాత.. సెట్లో ఎస్వీఆర్‌గారు ఎలా మాట్లాడతారు? ఎలా నటిస్తారు? అని చెప్పేవారు. ఆ విధంగా రంగారావుగారి మీద నాకున్న అభిమాన బీజాన్ని నాన్నగారే వేశారేమో. రామ్‌చరణ్ సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఎస్వీఆర్‌గారి గురించి చెప్పి, ఆయన సినిమాలు చూపించేవాడిని. మానాన్న గారి దగ్గరి నుండి నేను, నా నుంచి రామ్‌చరణ్ ఎస్వీఆర్‌గారి నుంచి స్ఫూర్తి పొందాం. అలాంటి మహానటుడు, గొప్పనటుడు తెలుగు వాడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. నేను నటుడు కావటానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిని ఒక్కసారి కూడా నేను చూడలేకపోయానే, ఒక్క ఫొటోగ్రాఫ్ కూడా లేదే అనేది తీరని కోరికగా మిగిలింది. అలాంటిది ఆయనపై వచ్చిన ఈ çపుస్తకాన్ని ఆవిష్కరించటంతో ఆ బాధ తీరింది’’ అన్నారు. కాగా ‘మహానటుడు’ తొలి ప్రతిని హరనా«ద్‌బాబు లక్షా వేయి నూటపదహారు రూపాయలకు కొనుగోలు చేశారు. నటులు రావికొండలరావు, రోజారమణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీతో పాటు, కిమ్స్ హాస్పిటల్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య, మండలి బుద్ధ ప్రసాద్, ఎస్పీ రంగనా«ద్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు హాస్యం
కథలో అయినా, సినిమాలో అయినా హాస్య రసం లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప హాస్యనటులు ఉన్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రేక్షకులకు కితకితలు పెట్టి నవ్వించారు... నవ్విస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని హాస్య నటులపై రచయిత యడవల్లి ‘తెలుగు చలన చిత్రాల్లో హాస్యం’ (50 సంవత్సరాల పరిశీలన) అనే పుస్తకాన్ని రచించారు. ప్రముఖ హాస్యనటులు, పద్మశ్రీ పురస్కారగ్రహీత డాక్టర్ బ్రహ్మానందం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బ్రçహ్మానందం స్వగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వంశీరామరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. -
ఆ పాటకు 20 ఏళ్లు
జగద్గిరిగుట్ట: ప్రజా కళాకారుడు, బహుజన యుద్ధనౌక ‘ఏపూరి సోమన్న’ కళాకారుడిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేని పేరు. రాష్ట్రంలోని ప్రతి పల్లెను తన పాటతో చైతన్యం చేస్తున్న ఆ గొంతు ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమన్న అభిమానులు, శ్రేయోభిలాషులు ‘ఇరవై ఏళ్ల పాటల ఊట’ పుస్తకావిష్కరణ సభను గురువారం జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ప్రజా పోరాటాలే తన పాటకు ఊపిరిగా జీవిస్తున్న ఏపూరి సోమన్న బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు సోమన్న మాటల్లోనే.. ‘నా 14వ ఏట తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో ‘పల్లె నా పల్లె తల్లి.. నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్లుంద’నే పాట పాడాను. పాఠశాల అనంతరం పశువుల దగ్గరకు వెళ్లినప్పుడు, పొలాల దగ్గర పాట పాడడం ఓ అలవాటుగా మారిపోయింది. నాకు, నా పాటకు మారోజు వీరన్న స్ఫూర్తి, ఆయన మాటలు, పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు ఏకలవ్య శిష్యుడిని. ఆయన పాటలను టేప్ రికార్డుల్లో వింటూ పాటలు నేర్చుకున్న రోజులున్నాయి. కళాకారుడిగా ప్రజా చైతన్య పాటలు పాడడం మొదలు పెట్టినప్పటి నుంచి నాపై నిర్బంధాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. అంతేకాదు.. వరంగల్, నల్లగొండ, సూర్యాపేటల్లో జైలు జీవితం కూడా గడిపాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాక కూడా నాపై నిర్బంధాలు తప్పడం లేదు. బతుకంతా కష్టాలు..కన్నీళ్లు.. ప్రజల పక్షాన నిలబడి పాటలు పాడడం మొదలు పెట్టాక నాకంటూ ఏమీ లేదు. కడుపు నిండా దుఖం ఉంది.. ప్రజల కోçసం పాడుతున్న పాటల్లో అవన్నీ మరిచిపోతున్నా. నా పాటకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఎనలేని సంతోషం కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో నన్ను సంస్కృతి కళామండలికి ఎంపిక చేశారు. కానీ ప్రజల కోసం ఆ అవకావాన్ని వదులుకున్నాను. అమర వీరుల త్యాగలకు ప్రస్తుతం గుర్తింపు లేకుం డా పోయింది. అయితే, ఎన్ని కష్టాలు వచ్చినా పాటను వదిలేయలన్న ఆలోచన కలలో కూడా రాలేదు.. ఎప్పుడూ రాదు. నా బాల్యంలోనే తల్లితండ్రులు దూరమయ్యారు. ఒంటరి నా జీవితంలో పాటే తోడైంది. ఈ పాటే ప్రపంచ పటంపై నన్ను నిలబెట్టింది. అలాంటి పాటను ప్రాణం పోయేంత వరకు వదిలి పెట్టను. ఎందుకంటే పాటతోనే నాకు గుర్తింపు వచ్చింది. కోటీశ్వరులను కూడా పక్కన వీధిలోని వారు గుర్తు పట్టలేరు. కానీ కూటికి లేని నన్ను రోడ్డు మీదకు వస్తే ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. నాతో సెల్ఫీలు దిగేందుకు ఇష్ట పడతారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే గుర్తింపు ఇంకేం కావాలి..? నేను పాడిన ప్రతి పాటా నాకు గుర్తింపు తెచ్చింది. అందులో ‘ఎవడి పాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ’.. పాట మరింతగా పేరు తెచ్చిపెట్టింది’ అంటూ ముగించారు. -
సీఎం కేసీఆర్ ప్రసంగాలే ప్రేరణ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపన్యాసాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలం గాణ ఉద్యమంలో, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రసంగా లను తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసి ‘సమ్మోహనాస్త్రం’పేరుతో ముద్రించిన పుస్తకాన్ని కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మాట తుపాకీ తూటా కంటే శక్తివంతమైనదని ప్రజలను కదిలించే ఉపన్యాసానికి యుద్ధ ట్యాంకుల కంటే తిరుగులేని శక్తి ఉంటుందన్నారు. కేసీఆర్ తన మాటలతో, ఉపన్యాసాలతో రాష్ట్ర సాధ న ఉద్యమాన్ని నడిపి గెలిపించిన తీరును జూలూరు గౌరీశంకర్ సమ్మోహనాస్త్రంలో వివరించారని కేటీఆర్ అన్నారు. ఆయన ఉపన్యాసాల్లోని ముఖ్యమైన మాటలను పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన అభినందనీయమని కొనియాడారు. అతి క్లిష్టమైన ఆర్థిక అంశాలను తన మాటలతో జనానికి సులభంగా అర్థమయ్యేలా కేసీఆర్ వివరించిన తీరును దీనిలో పొందుపరిచారన్నారు. ఎన్నికల వేళ 82 సభల్లో కేసీఆర్ ఉపన్యాసాలతో పాటుగా 51 నెలల ఆయన పాలన సారాన్ని రచయిత ప్రజల ముందు నిలిపారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శాసన మండలి సభ్యులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరక్టర్ నారా కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ బుక్ రిలీజ్
-
శ్రీదేవి గొప్పతనం అది
‘‘ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా ఇండియాలోనే ఒక నంబర్ 1 స్టార్‌గా ఎదిగిన శ్రీదేవిగారిపై రామారావుగారు పుస్తకం రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్ రామారావుగారితోనే ఆగిపోతాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ అయిపోయారు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. రకుల్‌ప్రీత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రథమప్రతిని మాదాల రవి అందుకున్నారు. తొలిప్రతిని శివాజీరాజా కొనుగోలు చేశారు. యువకళావాహిని–సియోటెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘అతిలోకసుందరి అనే టైటిల్ ఒక్క శ్రీదేవిగారికే సూట్ అవుతుంది. ఇండియాలో సూపర్‌స్టార్ శ్రీదేవిగారు. దురదృష్టవశాత్తు ఆమె మనకు దూరమయ్యారు. కానీ ఎప్పటికీ గుర్తు ఉంటారు. శ్రీదేవిగారిపై పుస్తకం రాసిన రామారావుగారికి శుభాకాంక్షలు’’ అన్నారు రకుల్. దర్శక–నిర్మాత– నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారు మరణించినప్పుడు ప్రపంచమంతా కన్నీరు కార్చింది. ఆమె గొప్పతనం అలాంటిది. ఆమెపై పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి సెల్యూట్’’ అన్నారు. సినిమాల సెన్సార్ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ– ‘‘నా సినిమా సెన్సార్ సమస్య వల్ల ఓసారి ముంబై వెళ్లాను. శ్రీదేవిగారు ఏ తెలుగువారు అక్కడ కనిపించినా ఆత్మీయంగా మాట్లాడేవారు. నన్ను అక్కడ చూశారు. ‘బాగున్నారా? ఏంటి.. ఇలా వచ్చారు’? అన్నారు. ‘సెన్సార్ ఇబ్బందుల్లో పడ్డాను’ అన్నాను. ‘మీ విప్లవ సినిమాలు బాగుంటాయి. నాకు కూడా అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది’ అన్నారు. ఇప్పుడు ఆ శ్రీదేవిగారు ఉంటే.. సెన్సార్ పరంగా ఇప్పుడు ఏవేం జరుగుతున్నాయో చూసి కన్నీరు పెట్టుకునేవారు. ఎంత దుర్మార్గమండి.. రామ్‌గోపాల్ వర్మగారు ఓ సినిమా (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఉద్దేశించి) తీశారు. సెన్సార్ చేయరా? ఎవరెవరో వచ్చి ఎగిరిపడితే ఆపేస్తారా? పోసానిగారు ఓ సినిమా (‘ముఖ్యమంత్రిగారూ మీరు మాట ఇచ్చారు’ చిత్రాన్ని ఉద్దేశించి) చేశారు. దాన్ని సెన్సార్ చేయరా? అసలేం జరుగుతోంది. ఏం ప్రజాస్వామ్యం ఇది? సెన్సార్‌బోర్డ్ వాళ్లు చెబుతారా ఏ సినిమా చూడచ్చో, ఏది చూడకూడదో. ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే ఎలా? ఎన్.టీ రామారావుగారి మీద ‘మండలాదీశుడు’ సినిమా తీస్తే... ‘రామారావుగారూ.. మీ గురించి ఇలా తీశారు’ అంటే.. ‘మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు. తిట్టినా చూస్తారు బ్రదర్’ అన్నారు. అదీ ఆయన సంస్కారం. 1962లో మనకు, చైనాకు యుద్ధం వచ్చిన సమయంలో నెహ్రూగారి విధానాలను తప్పుపడుతూ జర్నలిస్ట్, కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు వేశారు. కొందరు రాజకీయనాయకులు ఆర్కే లక్ష్మణ్‌పై వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘‘కళాకారులు, జర్నలిస్టులు ప్రజలపక్షం. మనం వారి వాదనలను వినాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి’’ అని నెహ్రూ అన్నారు. ఇప్పుడేంటండీ.. మనం సినిమా తీస్తాం. సెన్సార్ ఆగిపోవడమా? అమరావతి వెళ్లి వివరణ ఇచ్చుకోవడమా? ఎవరో కోర్టుకు వెళితే సినిమాను ఆపేయాలా? అలాంటప్పుడు సెన్సార్ బోర్డ్ పర్పస్ ఏంటి? ఇలాంటి సెన్సార్ విధానాన్ని ముక్తకంఠంతో ఖండించాలి’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారు పాత్రికేయులను బాగా గౌరవించేవారు’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
తెలుగు సినిమాకి బహూకరిస్తున్నాం
‘‘ఒక వివాహ వేడుకలా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అందమైన విషయాలతో కూడిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఇంత మంచి గ్రంథాన్ని మాకు అంకితం చేసినందుకు రచయిత డా. కె.ధర్మారావుకు అభినందనలు’’ అని ‘తెలుగు సినిమా గ్రంథం’ స్వీకర్తలు కృష్ణ, విజయనిర్మల అన్నారు. సినీ లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్’ (ఫాస్), డా. కె.ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ గ్రంథం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. విశిష్ట అతిథి, దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘484 పేజీల్లో విషయం, మరో 24 పేజీల రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను ఈ గ్రంథంలో బాగా ఆవిష్కరించారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా చరిత్రను ధర్మారావు చక్కగా విశదీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు’’ అన్నారు నటుడు నరేశ్. ఈ సమావేశానికి ముందు గాయకులు టి.లలితరావు, డా. టీవీ రావు కలిసి కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి అలరించారు. రచయిత కె.ధర్మారావు, రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా.కీమల ప్రసాదరావు, ఫాస్ గౌరవాధ్యక్షులు ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య ఆదుర్తి సూర్యకుమారి పాల్గొన్నారు. -
‘సేవారత్న’ పుస్తకావిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిపై ‘సేవా రత్న’ (ప్రేరణ, ప్రాణం, వైఎస్ అనేది ట్యాగ్ లైన్)అనే పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి, వైఎస్ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందని.. ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో ప్రచురించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజద్‌బాషా పాల్గొన్నారు. -
‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని అవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు 6లక్షల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఆధారాలతో సహా ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో రాసిన పుస్తకాన్ని ఆదివారం ఆయన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ఈ పుస్తకాన్ని అవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారంలో వచ్చినప్పటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన అవినీతిని, అన్యాయాలను సాక్ష్యాధారాలతో, జీవో నంబర్లతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచ్చనట్టు తెలిపారు. అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, ఎంపీలకు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, అన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయనున్నట్టు వెల్లండించారు. చంద్రబాబు ఏపీకి చేసిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబు 6 లక్షల 17 వేల 585 కోట్ల రూపాయల సొత్తును దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఖండించాలి చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి అని వైఎస్సార్ సీపీ నాయకులు తమ్మినేని సీతారాం ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఈ పుస్తకాన్ని ఖండించాలని అన్నారు. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలోనివి అవాస్తవాలైతే శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఈ పుస్తకం చార్జీ షీట్ అని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. -
నా చెడు ప్రవర్తన కారణంగానే ..
సినిమా: ఏదైనా అనుభవంలోకి వస్తేగానీ తెలియదంటారు. చాలా మంది పాశ్చాత్య సంస్కృతి పేరుతో విచ్చలవిడి ప్రవర్తనతో జీవితాన్ని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అది తప్పని తెలిసే సరికి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఇది సినిమా వాళ్లకూ వర్తిస్తుంది. ఉదాహరణకు నటి మనీషా కోయిరాలానే తీసుకుంటే ఈ నేపాలీ బ్యూటీ హిందీ, తమిళం, తెలుగు అంటూ పలు భాషల్లో నటించి 1990లో క్రేజీ కథానాయకిగా వెలిగింది. ముఖ్యంగా తమిళంలో బొంబాయి, ఇండియన్, ముదల్వన్, బాబా వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి అందమైన నటి కేన్సర్ వ్యాధికి గురైంది. ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి ఎట్టకేలకు జయించింది. మనీషాకోయిరాలా కేన్సర్ మహమ్మారి బారిన పడటానికి కారణం విచ్చల విడి ప్రవర్తన, కట్టుబాట్లను మీరడమే. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకుంది. కేన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న మనీషాకోయిరాలా తన జీవిత చరిత్రను పుస్తకంగా రాసుకుంది. ‘హీల్డ్’ పేరుతో రాసిన ఆ పుస్తకంలో... ‘కేన్సర్ నాకు జీవితంలో చాలా ధైర్యాన్నిచ్చింది. నా చెడు ప్రవర్తన కారణంగానే కేన్సర్ వ్యాధి బారిన పడ్డాను. నేను పలు చీకటి రోజులను, ఏకాంత రాత్రులను గడిపాను. వాటి నుంచి ఎలా బయట పడ్డానన్నది తలచుకుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రపంచమే నా కాలు కింద ఉందని విర్రవీగాను. క్షణం తీరక లేని షూటింగ్‌ల కారణంగా 1999లో శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యాను. అందులోంచి బయట పడటానికి మద్యం ఒక్కటే మంచి మార్గం అని భావించాను. శ్రేయోభిలాషులు ఎంత హితబోధ చేసినా పెడ చెవిన పెట్టాను. కేన్సర్ నా జీవితంలో ఒక బహుమతిగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఆలోచనలు మారాయి. నా మనసుకు బోధ పడింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఇంతకు ముందు చాలా కోపంగానూ, అభద్రతాభావంతోనూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అని మనీషా కోయిరాలా పేర్కొంది. -
నవ్యాంధ్రతో నా నడక పుస్తకం ఆవిష్కరణ
-
సినిమా.. ఒక మాయ..నేను వాస్తవాన్ని!
సాక్షి,సిటీబ్యూరో: ‘సినిమా.. ఒక మాయ ఒక అబద్దం. యాభై మూడేళ్ల జీవితంలో నటుడిగా అబద్ధాలు మాట్లాడుతూ ఒక సినీ‘మాయా’ ప్రపంచంలో ఉండిపోయాను. కానీ రాయడం ప్రారంభించాక కొత్త జీవితాన్ని ఆస్వాధిస్తున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను’.. ప్రముఖ సినీనటుడు, ప్రజాస్వామిక వాది, ‘దోసిట చినుకులు’ పుస్తక రచయిత ప్రకాష్‌రాజ్ అభివ్యక్తి ఇది. ఆయన కన్నడంలో రాసిన దోసిట చినుకులు పుస్తకాన్ని ‘మిసిమి’ పుస్తకప్రచురణ సంస్థ తెలుగులో ప్రచురించింది. తన అనుభవాలను, ఆలోచనలను, భావోద్వేగ క్షణాలను, ఆకాంక్షలను ప్రకాష్‌రాజ్ ఈ పుస్తకంలో వ్యక్తీకరించారు. దోసిట చినుకులు తెలుగు పుస్తక ఆవిష్కరణ ఆవిష్కరణ సభ సోమవారం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో జరిగింది. కార్యక్రమానికి రచయిత ప్రకాష్ రాజ్ హాజరై మాట్లాడారు. ‘నా జీవితంలో ఏదీ నేను అనుకున్నట్లుగా జరగలేదు. పుస్తకం రాస్తాననుకోలేదు, కానీ రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నా జీవిత ప్రయాణమే నా కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. బాగా చదివే అలవాటు ఉంది. కానీ రాయడంలోని అలసట ఇప్పుడిపుడే తెలుస్తోంది. నేను రాసిన మొదటి పుస్తకం ఇది. రాయడం నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇక రాయకుండా ఉండలేను’ అని చెప్పారు. ఎంతో ఎత్తు నుంచి జీవితాన్ని చూసే అవకాశం లభించిందని, కానీ ఆ ఎత్తు మాత్రం తనది కాదని.. అది ఎంతోమంది రచయితలు, కవులు, మేధావులు, కర్షకుల నుంచి నేర్చుకున్న అనుభవంగా పేర్కొన్నారు. తాను పొందిన అనుభవాలు, అవగాహన ప్రపంచాన్ని సూక్ష్మంగా పరిశీలించే శక్తిని ఇచ్చిందని, అలాంటి అనుభవాలనే పుస్తకరూపంలో పంచుకున్నానన్నారు. ‘మౌనం మనల్ని మింగేస్తుంది. ఒక నటుడిగా నాకు అప్పగించిన క్యారెక్టర్లో నటించాను. కానీ అదంతా అబద్ధం.. మాయ. అది నా జీవితం కాదు. నా చుట్టూ ఘనీభవించిన ఆ మౌనంలోంచి బయటకు రావాలనిపించింది. నేనెవరో తెలుసుకోవాలి. ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. నేను ఒక మాయను కాదు. నేను ఒక వాస్తవాన్ని. ఆ నిజాన్ని అక్షరాల్లో ఆవిష్కరించాను. ఇప్పుడు నాకు గొప్ప సంతృప్తిగా ఉంది. ఇక నేను ఏ మాత్రం రహస్యం కాదు’ అంటూ తన ‘దోసిట చినుకులు’ పుస్తక రచన వెనుక నేపథ్యాన్ని ప్రకాష్ రాజ్ వివరించారు. కన్నడంలో రాసిన పుస్తకం ఇప్పటికే పలు భాషల్లోకి అనువాదమైందన్నారు. ప్రముఖ కవి, విమర్శకుడు సీతారామ్ పుస్తకాన్ని సమీక్షించారు. ఇది ఒక ధర్మాగ్రహమని, సత్యాన్ని సత్యంగా ప్రకటించడమని చెప్పారు. ఒక్కొక్క అనుభవం ఒక్కో భావశకలమై పాఠకులను స్పృశిస్తుందన్నారు. మనిషికి, ప్రకృతికి ముడిపడిన అనుబంధాన్ని గుర్తుచేసే గ్రీన్ లిటరేచర్ అని అభివర్ణించారు. ప్రముఖ సినీనటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ప్రకాష్‌రాజ్ గొప్ప నటుడైన అతి సామాన్య వ్యక్తిగా చెప్పారు. బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీ దర్శకుడు కృష్ణవంశీ, ప్రముఖ వ్యాఖ్యాత ఓలేటి పార్వతీశం, మిసిమి సంపాదకులు వల్లభనేనిఅశ్వినీకుమార్, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
ఈ నెల 25న ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ
సాక్షి, విజయవాడ: తాను రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 25న జరగనుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన పరిణామాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించానని పేర్కొన్నారు. అంతే కాకుండా సీఎం, చీఫ్ సెక్రటరీల మధ్య ఉండాల్సిన అదేవిధంగా ఉండే బాధ్యతల గురించి కూలంకషంగా వివరించానన్నారు. అనేక భూ సంబంధ అంశాలు, వాటి చర్యల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించానని తెలియజేశారు. ‘ఎవరి రాజధాని అమరావతి?’ గతంలో ‘ఎవరి రాజధాని అమరావతి?’ అంటూ రాసిన పుస్తకంలో కూడా ఐవైఆర్ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలిపారు. ఇక ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. ‘అమరావతి ఏ రకంగానూ ప్రజా రాజధాని కాదు. ఇది ఎక్లూజివ్ రాజధాని. తన జాతి బలమైన సమర్థన ఉండటం వల్లే చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారు. ప్యూహాలు పన్ని కుటిలనీతి ఉపయోగించారు. మాదాపూర్ హైటెక్ సిటీ రియల్ ఎస్టేట్ తరహా నమునాలా అమరావతిని ఎంపిక చేశారు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఘనంగా నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం) గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం డాక్టర్ కేవీ రమణ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ‘నిత్యాన్వేషణం’ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘మూసీ’ సాహిత్య ధ్వార ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ రవీందర్, ఆచార్య డీ సూర్యా ధనుంజయ్ విశిష్ట ఆతిథులుగా హాజరయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు రవీందర్ కృతిని స్వీకరించారు. వక్తలు మాట్లాడుతూ నిత్యాన్వేషణ సాగిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా అద్భుతమైన సాహిత్య వ్యాసాలను నిత్యానందరావు వెలువరించారని, ఆయన నిరంతర సాహిత్య కృషికి, పరిశీలనా, అనుశీలనా దృష్టికి ‘నిత్యాన్వేషణం’ గ్రంథం నిదర్శనమని కొనియాడారు. -
ఆత్మహత్య ఆలోచన వెంటాడింది
ముంబై: పాతికేళ్ల వయస్సు వచ్చేవరకూ రోజూ తనను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్(51) తెలిపారు. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోవడంతో తాను జీవితంలో విఫలమయ్యానన్న భావన కలిగేదని వెల్లడించారు. రచయిత కృష్ణ త్రిలోక్ రాసిన ‘నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకాన్ని ఆదివారం నాడిక్కడ రెహమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన తండ్రి చనిపోవడం, కెరీర్లో తొలి అడుగులు, పనిచేసే విధానం సహా పలు అంశాలపై ఆయన మీడియాతో ముచ్చటిం చారు. ‘25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ నేను ప్రతిరోజూ ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించేవాడిని. ఆ వయస్సులో విజయవంతం కాలేకపోయామన్న భావన మనలో చాలామందికి ఉంటుంది. నాన్న ఆర్కే శేఖర్ చనిపోవడంతో నాలో శూన్యత ఏర్పడింది. అప్పుడు నాలో ఎక్కువ సంఘర్షణ చోటుచేసుకుంది. కానీ అవే నన్ను ధైర్యవంతుడిగా మార్చాయి. అందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ప్రతీదానికి తుది గడువు అంటూ ఉన్నప్పుడు ఇక భయపడటం దేనికి?’ అని రెహమాన్ వ్యాఖ్యానించారు. ‘రోజా’కు ముందే మతం మారాను ‘నాన్న మరణం తర్వాత నేను పనిపై దృష్టి పెట్టలేకపోయా. ఆయన పనిచేసే విధానం చూశాక నేను ఎక్కువ సినిమాలను తీసుకోలేదు. 35 చిత్రాలకు పనిచేయాలని ఆఫర్లు వస్తే కేవలం రెండింటినే అంగీకరించా. అప్పుడు ప్రతిఒక్కరూ ‘ఇలా అయితే నువ్వు ఎలా బతుకుతావు? వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు. కానీ అప్పటికి నా వయస్సు కేవలం 25 సంవత్సరాలే. కానీ చెన్నైలోని నా ఇంటివెనుక సొంత రికార్డింగ్ స్టూడియోను నిర్మించుకోవడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. వచ్చిన అన్ని సినిమా ఆఫర్లను నేను అంగీకరించలేదు. ఆఫర్లు అన్నింటిని అంగీకరించడం అంటే అందుబాటులో ఉన్న ప్రతీదాన్ని తినేయడమే. అలా చేస్తే నిస్తేజంగా మారిపోతాం. మనం కొద్దికొద్దిగా తిన్నా దానిని పూర్తిగా ఆస్వాదించాలి. నా జీవితంలో 12 నుంచి 22 ఏళ్ల మధ్య అన్నింటిని పూర్తిచేసేశా. పాతికేళ్లు ఉన్నప్పుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాకు పనిచేశా. ఆ సినిమాకు కొన్నిరోజుల ముందు నా పేరును, మతాన్ని మార్చుకున్నా. ఎందుకో నా గతాన్ని, దిలీప్ కుమార్ అనే నా పేరును విపరీతంగా ద్వేషించేవాడిని. అదెందుకో నాకు ఇప్పటికీ తెలియదు. సినిమాలకు సంగీతం సమకూర్చడానికి మనలోమనం లీనమైపోవ డం చాలాముఖ్యం. అందుకే నేను ఎక్కువగా రాత్రిపూట, తెల్లవారుజామున ప్రశాంత వాతావరణంలో పనిచేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కుటుంబంతో గడపడం ద్వారా నా పనిఒత్తిడి నుంచి బయటపడతాను’’ అని రెహమాన్ పేర్కొన్నారు. రచయిత కృష్ణ త్రిలోక్ రాసిన ఈ పుస్తకాన్ని ల్యాండ్‌మార్క్ అండ్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రచురించింది. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’లో భాగంగా నవంబర్ 9న సా.6 గం. కు పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ కావ్యంపై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగిస్తారు. వేదిక: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేవిప్రియ ‘బహుముఖ’(కవిత్వం, పత్రికారచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం) ఆవిష్కరణ నవంబర్ 10న సాయంత్రం 6 గంటలకు సమాగమం హాల్, రెండో అంతస్తు, ది ప్లాజా, పర్యాటక భవన్, బేగంపేట, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ప్రకాశ్ రాజ్. ఇ–బుక్ ఆవిష్కర్త: పల్లా రాజేశ్వరరెడ్డి. అధ్యక్షత: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: సాహితీ మిత్రులు. పి.సత్యవతి ఇంగ్లిష్ పుస్తకం ‘హేర్ ఐ యామ్’, అనువదించిన పుస్తకం ‘పలు రామాయణాలు’ ప్రచురణ అయిన సందర్భంగా ‘మీట్ టుగెదర్’ నవంబర్ 11న ఉదయం 10:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. సీతా సుధాకర్ ‘పూనాలో పూచిన నానీలు’ ఆవిష్కరణ నవంబర్ 11న ఉదయం 10:30కు కొరటాల మీటింగ్ హాల్, బ్రాడీపేట, గుంటూరులో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం. ‘ఈ సంవత్సరం నుండి ఒక్కో సంవత్సరం వరుసగా కథ, కవిత, నవల, సాహిత్య వ్యక్తిత్వం అంశాలపై విశేష ప్రతిభ కనబర్చిన సాహిత్యవేత్తలకు’ ఇవ్వదలచిన రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని కథా ప్రక్రియకుగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు నవంబర్ 25న వరంగల్‌లో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథులు: కె.శివారెడ్డి, తనికెళ్ల భరణి. కామిశెట్టి జాతీయ పురస్కారం–2018కి గానూ 2015, 16, 17ల్లో ముద్రించబడిన సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానించగా, వచ్చిన వాటిలోంచి డాక్టర్ ఎస్.రఘు ‘సమన్వయ’ ఎంపికైనట్టు కామిశెట్టి సాహిత్య వేదిక (భద్రాచలం) అధ్యక్షులు తెలియజేస్తున్నారు. విజేతకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో రూ.10,116 ప్రదానం చేస్తారు. -
సితారలు దిగి వచ్చిన వేళ...!
సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సమ్మోహనం’. జూన్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. చిన్నపిల్లల సృజనాత్మకత పెరుగుదల కోసం సుధీర్‌బాబు ఈ సినిమాలో ‘తారలు దిగి వచ్చిన వేళ’ పుస్తకాన్ని రాస్తారు. ఈ పుస్తకాన్ని ప్రచురించే ‘అనగనగా’ సంస్థ అధిపతిగా ఉన్న తనికెళ్ల భరణి కంటెంట్‌ను చదు వుతారు. ఈ సీన్ సినిమాలో హైలైట్. నిజంగా కూడా ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు రావాలనుకున్నారు. ముందుగా ఈ పుస్తకాన్ని నటుడు చిరంజీవికి చిత్రబృందం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. చిల్డ్రన్ కామిక్ నేపథ్యంలో రూపొందిన ఈ పుస్తకం తొలి కాపీని శుక్రవారం మహేశ్ బాబు కుమార్తె సితారకు చిత్రబృందం ఇచ్చింది. శుక్రవారం సితార పుట్టినరోజు. ‘‘సితార’లు దిగివచ్చిన వేళ.. మార్కెట్లోకి ఈ బుక్ రిలీజైంది. సితారకు జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ సితార ఆ బుక్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సుధీర్‌బాబు. ‘‘సమ్మోహనం’ టీమ్ తరఫున సితారకు ఆరవ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను తనికెళ్ల భరణిగారు చదివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు పీయస్ చారిగారు వేసిన అద్భుతమైన బొమ్మలు, ‘సమ్మోహనం’ సినిమా క్లైమాక్స్‌లోని నటన, సంగీతం.. అన్నీ కుదిరాయి. ఈ కథ, బొమ్మలూ చిన్న పిల్లలకీ, పెద్దలకీ బాగా నచ్చుతాయనే నమ్మకంతో పుస్తకంగా అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి. -
తారలు దిగి వచ్చిన వేళ
‘సమ్మోహనం’ సినిమా చూసినవారందరికీ ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకం గుర్తుండే ఉంటుంది. సుధీర్ బాబు గీసిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని సినిమాలో హీరోయిన్ అదితీరావ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడీ ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా రిలీజ్ చేయించారు చిత్రబృందం. సుధీర్ బాబు, అదితీరావ్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా టీజర్‌ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పటానికి చిరంజీవిని కలిశారు చిత్రబృందం. ఈ సందర్భంగా ‘తారలు దిగి వచ్చిన వేళ..’ బుక్ రిలీజ్ చేశారు చిరంజీవి. ‘‘సమ్మోహనం’ చిత్రం గుర్తుగా ఈ పుస్తకాన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తే బావుంటుందని భావించాం. ఈ కథల పుస్తకాన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. -
ప్రజాస్వామ్య బలోపేతానికి నెహ్రూ కృషి: ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లోనే పునాది వేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. నెహ్రూ జీవిత చరిత్రపై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎ.గోపన్న రాసిన ‘జవహర్లాల్ నెహ్రూ–యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలకు తొలి ప్రతులను అందజేశారు. ఈ పుస్తకానికి ముందుమాటను ప్రణబ్ రాశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ గురించి ఆధ్యయనం, పరిశీలన భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, వంద కోట్ల జనాభాను నడిపించగల ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మించాలన్న సంకల్పంతో ఆయన అప్పట్లోనే విశేష కృషి చేశారని, ఫలితంగా ఆధునిక ప్రజాస్వామ్య దార్శనికుడిగా నిలిచారని కొనియాడారు. దేశంలో భిన్న మతాలు, భాషలు ఉన్నా భారతీయులంతా ఒకటే అన్న స్ఫూర్తి కలిగేలా ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు నెహ్రూ కృషిచేశారని కీర్తించారు. నెహ్రూ జీవిత చరిత్రపై గోపన్న రాసిన పుస్తకాన్ని అభినందిస్తూ సోనియా గాంధీ సందేశం పంపారు. అంతకుముందు, నెహ్రూ 54వ వర్ధం తి సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, అన్సారీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు యమునా నది ఒడ్డున ఉన్న శాంతివన్ నెహ్రూ స్మారకం వద్ద నివాళులర్పించారు. ‘భార త తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళులు’ అం టూ ప్రధాని మోదీ ట్విటర్లో పోస్టు చేశారు. -
భగీరథ విలక్షణమైన రచయిత
‘‘జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత ఉన్నాడు. ఆయన రచించిన ‘భగీరథ పథం’ చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా. ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నా’’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘భగీరథ పథం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ –‘‘నా జీవితాన్ని ‘జమునాతీరం’ పేరుతో భగీరథ రచించారు. ఆ పుస్తకం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘భగీరథ పథం’ పుస్తకంలో చాలా విషయాలను నిష్పక్ష పాతం గా రాశారు. ఎన్టీ రామారావు జాతీయ అవార్డు నాకు రావడానికి భగీరథే కారణం’’ అన్నారు. ‘‘స్వరూపా నందేంద్ర స్వామివారి చేతుల మీదుగా నా ‘భగీరథ పథం’ పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తా’’ అన్నారు భగీరథ. నిర్మాత రమేష్ ప్రసాద్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, రచయిత సాయినాథ్, రచయిత్రి పల్లవి, సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు. -
ఆయన సేవలు అజరామరం
భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి 105వ వర్ధ్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ చెన్నైలో ఆవిష్కరించారు. తమిళసినిమా: నాగిరెడ్డి సేవలు అజరామరం అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే చిత్రాలు రూపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సినీ పితామహుడు, దివంగత ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత, వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను శుక్రవారం చెన్నైలో ఆవిష్కరించారు. భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి విజయా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ఎన్నో అద్భుత కళాఖండాలను నిర్మించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఆ పాత మధుర చిత్రాలతో పాటు నమ్‌నాడు, ఎంగవీట్టు పిళ్లైవంటి పలు జనరంజక తమిళ చిత్రాల నిర్మించారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వాహినీ స్టూడియో నిర్మాణ కర్త బి.నాగిరెడ్డినే. విజయా వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అయిన నాగిరెడ్డికి ఈ నెల 25న 105వ వర్ధంతి రోజు. ఈ రోజును పురçస్కరించుకుని ఆయన పేరుతో తపాలాబిళ్లను విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోíహిత్ హాజరయ్యారు. బి.నాగిరెడ్డి రూ.5 తపాలాబిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బి.నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బి.నాగిరెడ్డి అన్నా, ఆయన చిత్రాలన్నా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలనే నాగిరెడ్డి రూపొందించారని కీర్తించారు. ఆయన చిత్రాల్లో భాషకు, యాసకు ప్రాముఖ్యత ఉండేదన్నారు. శృంగారం లాంటి అసభ్య దృశ్యాలు లేకుండానే నాగిరెడ్డి ఎన్నో గొప్పగొప్ప ప్రేక్షకాదరణ పొందిన మంచి సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించారని, ఇప్పుడు శృంగారం పేరుతో అపహాస్యం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఇప్పటి చిత్రాల్లో శృంగారం కంటే, అంగారమే కనిపిస్తుందని అన్నారు. అలా కాకుండా సమాజానికి మంచి చేసే కథా చిత్రాలతో భావితరానికి మంచి సందేశాన్ని అందించే బాధ్యత నేటి దర్శక నిర్మాతలపై ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృంతి, సంప్రదాయాలను పెంపొందించే చిత్రాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భాష ఏదైనా మనందరం భారతీయులమని వ్యాఖ్యానించారు. మాతృభాష తల్లిపాలు లాంటిదని, ఇతర భాషలు అద్దం లాంటివని పేర్కొన్నారు. అలాంటి తెలుగు భాషను మనమే చెడగొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్ని గూగుల్స్ వచ్చినా మన గూగుల్ (ఉపాధ్యాయులు)లను మరవరాదని అన్నారు. నాగిరెడ్డి సినిమాలతోనే కాకుండా రియల్ లెజెండ్ అని వ్యాఖ్యానించారు, ఆయన సేవలు అజరామరం అని, సినీమారంగానికే కాకుండా వైద్య, విద్యారంగాల్లోనూ ఉత్తమ సేవలను అందించిన గొప్ప మానవతావాది ఆయన అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి ఎంతో సాధించారని పేర్కొన్నారు. అందుకే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డులాంటి ఎన్నో గొప్పగొప్ప అవార్డులతో సత్కరింపబడ్డారని గుర్తు చేశారు.నాగిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ తరం దర్శక నిర్మాతలు చిత్రాలు చేయాలని హితవు పలికారు. నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను విడుదల చేసిన తపాలా శాఖకు, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ తపాలాబిళ్లను తన చేతులమీదగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగి ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నాగిరెడ్డి అని శ్లాఘించారు. చందమామ హిందీ పత్రికను తాను చిన్నతనంలోనే చదివాననని, అయితే ఆ పత్రిక సంపాదకుడు బి.నాగిరెడ్డి అన్న విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి బి.భారతీదేవి, రాష్ట్ర మంత్రి అన్భళగన్, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం.శరవణన్ వేదికనలంకరించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.నాగిరెడ్డి మనువడు వినయరెడ్డి వందన సమర్పణ చేశారు. నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు -
వీఆర్ గుండె చప్పుళ్లు ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ‘సాక్షి’ దినపత్రికలో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్న పట్నాయకుని వెంకటేశ్వరరావు రచించిన ‘వీఆర్ గుండెచప్పుళ్లు’ కవితా సంపుటిని బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ వి.మురళి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, అసోసియేట్ ఎడిటర్ రాజమహేందర్‌రెడ్డి, క్వాలిటీసెల్ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనిషి దైనందిన జీవితంలోని అనేక పరిణామాలపై వెంకటేశ్వర్రావు ఎప్పటికప్పుడు స్పందిస్తూ అక్షరీకరించారు. ఇటీవల అనంతపురంలో జరిగిన కవి సమ్మేళనంలో ఆయన రాసిన ‘ఉరితాడు వరిస్తానంటావేంటి’ కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. -
ముస్లింల అభ్యున్నతికి వైఎస్ అహర్నిశలు శ్రమించారు
♦ వైఎస్ చేసిన సేవలను కొనియాడిన నేతలు ♦ రిజర్వేషన్లపై షబ్బీర్ అలీ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సాక్షి, న్యూఢిల్లీ: ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని నేతలు కొని యాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయ డంవల్ల కలిగిన ప్రయోజనాలపై తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రచించిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించారు. ‘ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్’ పేరుతో షబ్బీర్ అలీ రచించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఏపీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌లు రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ సమాన హక్కులు లభించినప్పుడే సబ్కా సాత్, సబ్కా వికాస్ సాధ్యమవుతుందన్నారు. అందరూ కలసి అభివృద్ధి చెందాలనేదే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. తాను పార్టీ ఇన్చార్జ్గా ఉన్నప్పుడు వైఎస్‌తో కలసి రిజర్వేషన్లు తీసుకొచ్చామని గులాంనబీ ఆజాద్ గుర్తు చేసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిబద్ధతను దిగ్విజయ్‌సింగ్, జైపాల్‌రెడ్డిలు కొనియాడారు. ముస్లింల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 58 రోజుల్లో ఉస్మానియా వర్సిటీ, మైనారిటీ కమిషనరేట్ల సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా జీవో నంబర్ 33 విడుదల చేసి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారని షబ్బీర్ అలీ తన పుస్తకంలో వివరించారు. తదనంతరం పలు సమస్యల వల్ల రిజర్వేషన్ల నిలుపుదల.. అనంతరం బీసీ ఈని ప్రవేశపెట్టి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ముస్లింలకు కలుగుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. రిజర్వేషన్ల అమలు వల్ల 2004–2014 మధ్య కాలంలో 12 లక్షల మంది ముస్లిం విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం పొందారని ఆయన పేర్కొన్నారు. కేవలం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగానూ ముస్లింల సాధికారతకు రిజర్వేషన్ ఫలాలు తోడ్పడ్డాయని వివరించారు. -
సుద్దాల కలం చెక్కిన ‘శ్రమ కావ్యం’
అనంతపురం సిటీ : మనిషి పరిణామ క్రమంలో శ్రమ పాత్రను గుర్తిస్తూ ప్రముఖ సినీకవి, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘శ్రమ కావ్యం’ నేటి తరం యువతను ఆలోచింపజేస్తుందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ‘శ్రమ కావ్యం’ పుస్తకావిష్కరణ సభను చీఫ్ విప్ కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కవి తూమచర్ల రాజారాం అధ్యక్షత వహించగా ముఖ్య అథితులుగా సినీకవి, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల ఆశోక్‌తేజ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా పరిషత్ చైర్మఽన్ చమన్, సీఈఓ రామచంద్ర, ప్రముఖ కవులు అధికార భాషా సంఘం అధ్యక్షుడు హరికృష్ణ, ప్రజా గాయకులు లెనిన్‌బాబు, మల్లెల నరసింహులు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో లెనిన్‌బాబు అలరించిన ‘నేలమ్మ నేలమ్మ.. నేలమ్మా.. నీకు వేల వేల వందనాలమ్మా..’ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సమాజ హితాన్ని కోరుతూ పుస్తక రచన చేసే వారి సంఖ్య చాలా తక్కువన్నారు. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్‌తేజ ‘శ్రమ కావ్యం’ వంటి పుస్తకాలు రచించడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. కరువు నేలపై మనిషి మనుగడ, కులవృత్తులు, మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి కదలిక, కలయిక, కష్టంపై ఈ కావ్యాన్ని రాశానన్నారు. ఎక్కువగా నన్ను అభిమానించే వ్యక్తుల మధ్య ఈ పుస్తకావిష్కరణ జరుపుకోవాలని భావించానని చెప్పారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు. తనపై అనంత వాసులు చూపిన.. చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా కవులు, రచయితల సంఘం నేతలు, నగర ప్రముఖులు, పలు పార్టీల నేతలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. -
పుస్తకంగా ‘ఆచ్చీ’ జీవితగాధ
కొరుక్కుపేట(చెన్నై): ప్రముఖ మసాల ఉత్పత్తి సంస్థ ఆచ్చీ వ్యవస్థాపకుడు ఏడీ పద్మాసింగ్ ఐజక్ జీవిత గాథను పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. తోల్వియై రుసియింగల్.. వెట్రియయ్ రసియింగల్ (ఓటమిని స్వీకరిద్దాం... గెలుపును ఆస్వాదిద్దాం) పేరుతో ఈ పుస్తకాన్ని ఎస్.బాలఅముదా రచించారు. తమిళనాడు కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఆచ్చీ సంస్థ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉంది. ఈ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఏడీ.పద్మాసింగ్ ఐజక్ వ్యవహరిస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు అంచులకు ఎదిగిన ఆయన జీవితం మరెందరికో మార్గదర్శకం కావాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని అముదా సిద్ధం చేసినట్లు అముదా తెలిపారు. తమిళంలోనే కాకుండా, ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోనూ అనువదించారు. చెన్నైలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని(తమిళం) తమిళనాడు విద్యాశాఖ మంత్రి కే.పాండియరాజన్, ఆంగ్ల వర్షెన్ వీజీపీ గ్రూప్ ప్రతినిధి డాక్టర్ వీజీ సంతోషం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మాసింగ్ ఐజక్, ఆయన భార్య తెల్మా ఐజక్, కుమారుడు అశ్విన్పాండియన్ పాల్గొన్నారు. -
ఘనంగా రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలు
-
ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి
విజయవాడ కల్చరల్ : అనంతమైన సాíß త్య, సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. ఆయా పుస్తకాలను పునర్ముద్రించి ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. శ్రీరాఘవేంద్ర పబ్లిషర్స్ ప్రచురించిన వీరభద్ర విజయం, వందే వాల్మీకి కోకిలం పుస్తకాలను ఆదివారం స్వామి ఆవిష్కరించారు. అనంతరం స్వామి అనుగ్రహభాషణం చేస్తూ సాహిత్య అధ్యయనం ద్వారా నాటి చరిత్ర అవగతమవుతుందన్నారు. వారసత్వ విలువల్ని కాపాడాల్సిన అవసరం తెలుస్తుందన్నారు. వావిళ్ల సంస్థ తర్వాత 56 సంవత్సరాలకు పోతన రాసిన వీరభద్ర విజయం కావ్యాన్ని వ్యాఖ్యానంతో సహా తీసుకొచ్చిన ప్రచురణకర్తలను స్వామి అభినందించారు. ఎస్ఆర్ పబ్లిషర్స్ అధినేత దిట్టకవి రాఘవేంద్రరావు, మాగంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
పుస్తకావిష్కరణ సభలో సంజయ్ బారు సాక్షి,న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయుడు సంజయ్ బారు రచించిన ‘1991: హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకాన్ని ఢిల్లీలో మంగళవారం కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబం ఆధిపత్యానికి గండికొట్టి పీవీ అధికారాన్ని చేపట్టినందుకే ఆయన చనిపోయినపుడు పార్థివ దేహాన్ని లోపలికి తీసుకురానీయకుండా పార్టీ కార్యాలయ ద్వారాలు మూసేశారని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలూ నిర్వహించలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పీవీ పాలనలో చూపిన దక్షతకు భారతరత్న ప్రకటించాలని, కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబంవారే కాక ఇతరులూ ప్రధానులు కావొచ్చన్న ఆశలు నింపిన వ్యక్తి పీవీ అని సంజయ్ అన్నారు. భారత చరిత్రలో 1991 సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉందనీ, అత్యంత అవసరమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమేకాక, రాజకీయ సుస్థిరతను పీవీ పునరుద్ధరించారని గుర్తుచేశారు. -
ఇది హృదయావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవ్వరో ఈ బిడ్డలూ... నింగిలో నెలవంకలూ’ అనే పాటతో జయరాజు తన హృదయాన్ని ఆవిష్కరించారని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. కవి, గాయకుడు జయరాజు రాసిన ‘వసంతగీతం’, ‘జ్ఞాపకాలు’ పుస్తకాలను గురువారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ తేజ మాట్లాడుతూ సూర్యచంద్రులు కలిస్తే జయరాజేనని కొనియాడారు. సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ జయరాజు సింగరేణి నల్లబంగారమని ప్రస్తుతించారు. ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ చివరి వరకు ఎర్ర జెండాను మోసిన నిజమైన విప్లవకారుడు జయరాజని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, విమలక్క, పోటు రంగారావు, మోహన్, రాయల రమ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్' పుస్తక ఆవిష్కరణ
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాష్ రాసిన 'హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ మోహన్ రెడ్డి గోలి, శ్రీనివాస్ రావు కొట్టె ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత, ప్రకాష్‌ను సత్కరించారు. భావితరాలకు తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రకాష్ వివరించారు. ఉద్యమసమయంలో ఎన్నో సందర్భాల్లో తన వెన్నంటి నిలిచిన మోహన్ రెడ్డి టీంకు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాసిన పుస్తకాలను కొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. పుస్తకం అమ్మగా వచ్చిన మొత్తం జయశంకర్ ఫౌండేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు చెందుతుందని తెలిపారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ..గత దశాబ్దకాలంగా ప్రకాష్‌తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమాన్ని దిశానిర్దేశం చేయడంలో ప్రకాష్ తన వంతు కృషి చేశాడని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ చరిత్రపై ప్రకాష్ రాసిన పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వక్తలు కొనియాడారు. బార్బీక్యూ నేషనల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభాకర్ పుల్లెల, రఘు చిట్టిమల్ల, సురేందర్ చింతల, డాక్టర్ హనుమంత్ బెజ్జెంకి, నారాయణ రెడ్డి తౌడ, బాబు పెరక్, మహిపాల్ రెడ్డి యెల్ల, కిషోర్ కుమార్ చీడల్ల, అనిల్ మౌటోజ్, శ్రీనివాస్ శ్రీవెంకట, మధుకర్ కోలగని, శ్రీనివాస్ కోమురవల్లి, మల్లిక్, పవన్ గంగాధర, ప్రదీప్ కంది, ప్రవీణ్ బిల్ల, అజయ్ రెడ్డి ఏలేటి, రఘువీర్ బంధర్, ప్రమోద్ సుజన్లతో పాటూ భారీ ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. -
ఒక అరవై!
నేడు ఆవిష్కరణ 2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనబడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ ‘‘కవిత్వం 2015’’ సంకలనాన్ని తీసుకొస్తున్నాను, ఇష్టంగా, ఒక అవసరంగా, ఒకింత సాంస్కృతిక కర్తవ్యంగా. అరవై అనే లెక్క ఎందుకంటే - సంకలనం బిగువుగా వుండాలని. తెలుగు సంస్కృతికీ అరవైకీ వున్న అనుబంధం కూడా దీనికి ఓ అనుబంధ కారణం. ఒక సంవత్సరంలో వివిధ పత్రికల్లో (వెబ్ సంచికల్తో సహా) అచ్చయే తెలుగు కవితలు కొన్ని వేలల్లో వుంటాయి. వాటిలోంచి ఓ అరవై కవితల్ని ఎంచుకోవడం కష్టతరమైన పనే అని నా అనుభవం చెబుతున్నది. ఐతే దేశంలోనూ, బయటా వున్న అన్ని ప్రాంతాల్లోని తెలుగుకవుల కవిత్వానికి స్థూలంగా ఈ సంకలనంలో ప్రాతినిధ్యం వుండాలని భావించాను. 2015వ సంవత్సర కాలంలో మానవ జీవన ప్రస్థానంలోని ప్రధాన ఘటనలకు కవుల ప్రతిస్పందనను రికార్డు చేయడం ద్వారా కాలఛాయను సంకలనంలో చూపించాలని ప్రయత్నించాను. ఘటనలకే పరిమితం కాకుండా, మానవానుభవానికున్న అనేక పార్శ్వాల్నీ, చింతనల్నీ ఒక చోటికి చేర్చడం కూడా అత్యావశ్యకమని భావించాను. సామాజిక దృక్కోణం నుంచి వచ్చినవి కొన్నీ, ఆత్మగత అనుభవాల్నీ, అనుభూతుల్నీ ఆవిష్కరించినవి కొన్నీ, మానవ సంబంధాల్ని వ్యాఖ్యానించినవి కొన్నీ, జీవన తాత్విక సారాంశాన్ని వడగట్టినవి కొన్నీ, స్థానికతను నిర్దిష్టంగా వెల్తురులోకి తెచ్చినవి కొన్నీ, సౌందర్య చింతనలోంచి రూపుదిద్దుకున్నవి కొన్నీ, ఉద్యమాల నేపథ్యం నుంచి గొంతెత్తినవి కొన్నీ, ప్రకృతిని కవితా ప్రాంగణంలోకి ఆహ్వానించినవి కొన్నీ- వెరసి ఈ సంకలనం. 2015లో కవయిత్రి శివలెంక రాజేశ్వరీదేవి, 2016లో ప్రముఖ కవి, విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావు మరియు అరుణ్ సాగర్ ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. 2015లో అచ్చయిన వారి కవితల్ని ఈ సంకలనంలో చేర్చాను, వారికి నివాళిగా. -
అన్‌వీలింగ్ తెలంగాణ్ స్టేత్ పుస్తక ఆవిష్కరణ
-
'దేవ రహస్యం' పుస్తక ఆవిష్కరణ
-
సమీక్షణం: దేశీయ కతాసరిత్సాగరం
పుస్తకం : 13 భారతీయ భాషల తొలికతలు సంకలనం : స.వెం.రమేశ్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు పేజీలు: 152 వెల: 150 ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు మరియు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు 20-3-131/ఎ1, శివజ్యోతి నగర్, తిరుపతి - 517 507 విషయం : ‘తొండనాడు తెలుగు రచయితల సంగం’ ప్రచురించిన పదమూడు దేశ భాషల్లోని తొలి కతల సంకలనం ఇది. తొలికత 1870లో రాయబడిన ఉర్దూ కత అయితే, 1955లో వచ్చిన కశ్మీరి కత చివరిది. ఈ మధ్య కాలక్రమానుసారం వచ్చిన బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళ, కొంకణి, తుళు భాషల తొలి కతలు ఇందులో ఉన్నాయి. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయ సాహిత్యపు మూలమొక్కటే. కత ఒక ప్రత్యేక ప్రక్రియగా, ఏయే భాషలో ఎప్పుడు ఆవిర్భవించిందో తెల్సుకోవడం మనల్ని మనం రీ-రీడ్ చేసుకోవడం లాంటిది. గతం పునాది మీద భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపకరించే విశిష్ట ప్రయోగం ఇది. ఒక్క కశ్మీరి కత తప్ప మిగిలిన కతలన్నీ ఆయా భాషల నుంచి నేరుగా తెలుగులోకి తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం. పదేళ్ల పిల్లవాడు ఆలోచనల జర్నీలో జీవితాన్ని చుట్టి రావడం, మానవత్వం మాత్రమే చివరి వరకు మిగిలేది అనే సత్యం తెల్సుకోవడం ఉర్దూ కత ‘గుజారుహా జమాన’. టాగూరు రాసిన రేవు కథలో గంగమ్మ ఒడ్డున కూచుని పాత సంగతులు నెమరేసుకునే కతకుడు నదిలో ఆడి పాడి, నదిలోనే మునిగిపోయి ముగిసిపోయిన కుసుమ్ కత చెప్తాడు. ఈ బెంగాలీ కతను పోలినదే తమిళ కత ‘గుంటకట్ట రాగిమాను’. తొంభయ్యో నూరో ఏళ్లు ఉన్న రాగిమాను రుక్మిణి కత చెప్తుంది. తన్ను పెళ్లి చేసుకోవాల్సిన నాగరాజన్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని భావించి, నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది రుక్మిణి. తొలి తెలుగు రెండు కతల్లో (ఏది అనే ప్రశ్నని వదిలేద్దాం)నూ పోలిక కనిపిస్తుంది. ‘ధన త్రయోదశి’లో విజయలక్ష్మి భర్త వేంకటరత్నంను విశ్వాస ద్రోహం చెయ్యకుండా దిద్దుతుంది. ‘దిద్దుబాటు’లో తిరుగుళ్ల గోపాలరావుకి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది భార్య కమలిని. సమకాలిక సమస్యలు, కత నడిపించే తీరులో వైవిధ్యం, సంఘటనలు, సంభాషణలు, మెలో డ్రామా ట్విస్టులు తొలి కతల్లోనే కనబడతాయి. వివిధ భాషల కతలని తెలుగు కతలుగా మలచడానికి అసాధారణమైన కృషి చేశారు అనువాదకులు. - చింతపట్ల సుదర్శన్ మంచి సంగతులు పుస్తకం : మీడియా సంగతులు రచన : గోవిందరాజు చక్రధర్ పేజీలు: 255; వెల: 150 ప్రతులకు: అని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ. విషయం : రేపటి చరిత్రకి దినుసును అందిస్తున్న పత్రికారంగ చరిత్ర మీద మనకి ఆసక్తి తక్కువే. నిజానికి పత్రికారంగంలో వచ్చిన పరిణామాలను గమనించడమూ అవసరమే. ఆ ప్రయత్నంలో భాగమే ‘మీడియా సంగతులు’. ప్రముఖ జర్నలిస్ట్, జర్నలిజం పాఠాలు చెప్పిన మాస్టారు గోవిందరాజు చక్రధర్ ఈ పుస్తకం రాశారు. కాబట్టే పత్రికల నేపథ్యం, పత్రికల నాటి స్థానం, వర్తమానంలో ఉన్న స్థానాల గురించి చాలా లోతుగానే చర్చించారు. చక్రధర్ ప్రతికారంగంలోని వెలుగునే కాదు, చీకటిని తడమడానికి కూడా ప్రయత్నం చేశారు. ప్రింట్ మీడియా తరువాత జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం, ఇంటర్నెట్ గురించి కూడా ఇందులో చదవవచ్చు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పతనంలో కూడా పెరిగిన పోటీని ఇందులో రచయిత నిభాయింపుతోనే అయినా చర్చించారు. ఏ రంగంలో అయినా మార్పు సహజమే. కానీ మార్పునీ పతనాన్నీ వేర్వేరుగా చూడలేకపోతున్న చానెళ్ల, పత్రికాప్రచురణ సంస్థల మీద చ క్రధర్ ప్రదర్శించిన నిరసనను అర్థం చేసుకోవలసిందే. పుస్తకం చివర తెలుగు పత్రికా రచయితల ఫోటోలు ఇవ్వడం రచయిత ఉత్తమ అభిరుచికి నిదర్శనం. - కల్హణ కొత్త పుస్తకాలు అండమాన్ జైలులో స్వాతంత్య్ర వీరులు మూలం: సుధాంశుదాసు గుప్తా తెలుగు: పాటూరి రామయ్య పేజీలు: 130; వెల: 60 2. ముజఫర్ అహ్మద్ ఓ తొలి కమ్యూనిస్టు రచన: సుచేతన చటోపాధ్యాయ పేజీలు: 344; వెల: 150 3.నాదమే యోగమని (ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులు) తమిళం: కృష్ణా డావిన్సి తెలుగు: ఎజి యతిరాజులు పేజీలు: 108; వెల: 50 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 నాణాలు- నోట్లు (పుట్టు పూర్వోత్తరాలు) రచన: కొల్లు మధుసూదనరావు పేజీలు: 136; వెల: 100 ప్రతులకు: స్వెస్ పబ్లికేషన్స్, 1-6-141/19, విద్యానగర్, సూర్యాపేట-508213. ఫోన్: 9848420070 ఆరుపదుల అనంతర జీవితం రచన: తెలగరెడ్డి సత్యానందమ్ పేజీలు: 40; వెల: 30 ప్రతులకు: రేవతీ క్రియేటివ్ కమ్యూనికేషన్స్ ప్రై. లి., ఫ్లాట్ 301, మొఘల్ మేన్షన్, ఖైరతాబాద్, హైదరాబాద్-4. ఫోన్: 040-23310670 గురి (వ్యాసాలు) రచన: గుండెబోయిన శ్రీనివాస్ పేజీలు: 48; వెల: 50 ప్రతులకు: రచయిత, 3-1-74/1/ఎ, కాకతీయ కాలనీ, హన్మకొండ-506011. వరంగల్ జిల్లా. ఫోన్: 9985194697 -
విభజనపై కేంద్రం తీరు అసంబద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వం.. విధివిధానాలను పక్కనపెట్టి హడావుడి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయం గురించి తాను మాట్లాడడం లేదని.. విభజన విషయంలో అనుసరిస్తున్న పద్ధతే పూర్తి అసంబద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఏర్పాటైన అన్ని రాష్ట్రాల విషయంలో ఆయా మాతృ రాష్ట్రాల శాసనసభల తీర్మానం తీసుకున్నాకే విభజన ప్రక్రియ ప్రారంభించారని ఆయన వెల్లడించారు. పద్మనాభయ్య ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారని కేంద్రమంత్రి చిదంబరం పార్లమెంటులో రెండుసార్లు ప్రకటించారని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడేమో కేవలం బిల్లు మాత్రమే వస్తుందంటున్నారని విమర్శించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజనకు అనుసరిస్తున్న విధానం ఏమిటి? ఎందుకు విభజిస్తున్నారు? కారణాలేమిటి? విభజించకుండా ఉండాలంటే అందుకు ప్రత్యామ్నాయాలు ఏమిటి? అన్న అంశాలను కేబినెట్ నోట్లో అసలు పొందుపర్చలేదని ఆయన తప్పుపట్టారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారమైనా విభజన జరుగుతుందా అన్నది అనుమానంగా ఉందన్నారు. విభజన నిర్ణయం తరువాత రాష్ట్రంలో పెల్లుబికిన ఉద్యమం గురించి కనీసం కేబినెట్ నోట్లో ప్రస్తావించకపోవటం గర్హనీయమన్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు లేని సమయంలో సానుకూలంగా సమస్య పరిష్కరించాలని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. సమైక్యాంధ్ర అంటూ రాజకీయ నాయకులు చెప్తున్న మాటల్లో ఎంత వరకు నిజం అన్నది కూడా అనుమానాస్పదంగా మారిందన్నారు. ఉమ్మడి రాజధాని అంటే దానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, దానికి రాజ్యాంగబద్ధత కల్పించాలని, లేదంటే ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విభజన న్యాయస్థానాల ముందు నిలబడుతుందా? లేదా? అన్నది చెప్పలేమన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.రామస్వామి మాట్లాడుతూ.. పరిస్థితులే నాయకులను దృఢంగా మారుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, మంత్రి పితాని సత్యనారాయణ, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, సీనియర్ జర్నలిస్టు ఎస్.వెంకటనారాయణ, పుస్తక రచయిత భోగాది వేంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు.