
'హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్' పుస్తక ఆవిష్కరణ
డల్లాస్:
అమెరికాలోని డల్లాస్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాష్ రాసిన 'హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ మోహన్ రెడ్డి గోలి, శ్రీనివాస్ రావు కొట్టె ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత, ప్రకాష్ను సత్కరించారు. భావితరాలకు తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రకాష్ వివరించారు. ఉద్యమసమయంలో ఎన్నో సందర్భాల్లో తన వెన్నంటి నిలిచిన మోహన్ రెడ్డి టీంకు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాసిన పుస్తకాలను కొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. పుస్తకం అమ్మగా వచ్చిన మొత్తం జయశంకర్ ఫౌండేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు చెందుతుందని తెలిపారు.
మోహన్ రెడ్డి మాట్లాడుతూ..గత దశాబ్దకాలంగా ప్రకాష్తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమాన్ని దిశానిర్దేశం చేయడంలో ప్రకాష్ తన వంతు కృషి చేశాడని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ చరిత్రపై ప్రకాష్ రాసిన పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వక్తలు కొనియాడారు.
బార్బీక్యూ నేషనల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభాకర్ పుల్లెల, రఘు చిట్టిమల్ల, సురేందర్ చింతల, డాక్టర్ హనుమంత్ బెజ్జెంకి, నారాయణ రెడ్డి తౌడ, బాబు పెరక్, మహిపాల్ రెడ్డి యెల్ల, కిషోర్ కుమార్ చీడల్ల, అనిల్ మౌటోజ్, శ్రీనివాస్ శ్రీవెంకట, మధుకర్ కోలగని, శ్రీనివాస్ కోమురవల్లి, మల్లిక్, పవన్ గంగాధర, ప్రదీప్ కంది, ప్రవీణ్ బిల్ల, అజయ్ రెడ్డి ఏలేటి, రఘువీర్ బంధర్, ప్రమోద్ సుజన్లతో పాటూ భారీ ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరయ్యారు.