ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి
విజయవాడ కల్చరల్ : అనంతమైన సాíß త్య, సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. ఆయా పుస్తకాలను పునర్‌ముద్రించి ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. శ్రీరాఘవేంద్ర పబ్లిషర్స్ ప్రచురించిన వీరభద్ర విజయం, వందే వాల్మీకి కోకిలం పుస్తకాలను ఆదివారం స్వామి ఆవిష్కరించారు. అనంతరం స్వామి అనుగ్రహభాషణం చేస్తూ సాహిత్య అధ్యయనం ద్వారా నాటి చరిత్ర అవగతమవుతుందన్నారు. వారసత్వ విలువల్ని కాపాడాల్సిన అవసరం తెలుస్తుందన్నారు. వావిళ్ల సంస్థ తర్వాత 56 సంవత్సరాలకు పోతన రాసిన వీరభద్ర విజయం కావ్యాన్ని వ్యాఖ్యానంతో సహా తీసుకొచ్చిన ప్రచురణకర్తలను స్వామి అభినందించారు. ఎస్‌ఆర్ పబ్లిషర్స్ అధినేత దిట్టకవి రాఘవేంద్రరావు, మాగంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.