
బ్రహ్మానందం, యడవల్లి
కథలో అయినా, సినిమాలో అయినా హాస్య రసం లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప హాస్యనటులు ఉన్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రేక్షకులకు కితకితలు పెట్టి నవ్వించారు... నవ్విస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని హాస్య నటులపై రచయిత యడవల్లి ‘తెలుగు చలన చిత్రాల్లో హాస్యం’ (50 సంవత్సరాల పరిశీలన) అనే పుస్తకాన్ని రచించారు. ప్రముఖ హాస్యనటులు, పద్మశ్రీ పురస్కారగ్రహీత డాక్టర్ బ్రహ్మానందం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బ్రçహ్మానందం స్వగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వంశీరామరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు.