Yadavalli
-
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ రచయిత కన్నుమూత
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సింగర్ వాణీ జయరాం మృతి చెందగా.. తాజాగా మరో సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి వెంకట లక్ష్మి నరసింహశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిత్రసీమలో యడవల్లిగా పేరుగాంచారు. పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకు రచనలు చేశారాయన. నెల్లూరులో జన్మించిన యడవల్లి ఆయన స్వస్థలం నెల్లూరు కాగా.. విజయవాడలో స్థిరపడ్డారు. చిన్న వయసులోనే 'నక్షత్రాలు' పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే 'విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు' పేరుతో నవల రాశారు. విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన 'తరం మారింది' అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. వెంకయ్య నాయుడు ప్రశంసలు తెలుగు సినిమాల్లో హాస్యం, తెలుగు సినీ దర్శక మాలిక - విజయ వీచిక, 'తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు' లాంటి పుస్తకాలను ఆయన రచించారు. పలు టీవీ సీరియల్‌కు కథలు - మాటలు సమకూర్చారు. వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయంలో తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ) సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు ముగిశాయి. -
సీఎం జగన్‌కు యడవల్లి దళిత రైతులు సత్కారం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేశారని గుంటూరు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున రూ.30 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా.. ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో యడవల్లి దళిత రైతులు సోమవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌ను సత్కరించారు. -
మాట నిలబెట్టుకున్నారు
చిలకలూరిపేట: టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన గుంటూరు జిల్లా యడవల్లి దళిత రైతులకు సీఎం వైఎస్ జగన్ న్యాయం చేశారు. వారి భూములకు ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీనిపై యడవల్లి దళిత రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోమవారం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ భూముల రక్షణ కోసం యడవల్లి దళితులు అలుపెరుగని పోరాటం చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యను తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీకి చెందిన ఈ భూములను ప్రభుత్వం ఏపీఎండీసీకి కేటాయించింది. ఈ భూముల్లో కొందరు దళిత రైతులు సాగు చేసుకుంటున్నారని.. వీరికి నష్టపరిహారమివ్వాలని స్థానిక ఎమ్మెల్యే విడదల రజని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఏపీఎండీసీ సోమవారం నాటికి 99 శాతం మందికి నష్టపరిహారం కింద రూ.25 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసింది. దీంతో రైతులు సోమవారం చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే విడదల రజనికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్ వల్ల యడవల్లి దళిత రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల భూములు కాజేసేందుకు అనేక కుట్రలు జరిగాయని చెప్పారు. టీడీపీ నాయకుల వల్ల ఇబ్బందులు పడిన యడవల్లి రైతులందరికీ సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. మొత్తం 120 కుటుంబాలకు చెందిన 233 మందికి లబ్ధి కలిగేలా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించిందని తెలిపారు. -
సొసైటీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
చిలకలూరిపేటటౌన్: యడవల్లి సొసైటీ భూములు ప్రభుత్వం తీసుకోవడాన్ని దళిత రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చేసిన వ్యాఖ్యలపై యడవల్లికి చెందిన రైతులు మండిపడ్డారు. భూముల వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మధును స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా చిలకలూరిపేట పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌కు ర్యాలీగా చేరుకొని సీపీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన పారితోషికం ఇప్పించాలంటూ తాము సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు విన్నవించామని, అది నచ్చని మధు నాటకాలాడొద్దంటూ తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని వివరించారు. గత నెలలో ఎస్సీ కమిషన్ గుంటూరు వచ్చినప్పుడు తాము భూములు ఇస్తామని వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు. 99 శాతం మంది రైతులు భూములు ఇవ్వటానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించి భూములను ప్రభుత్వం తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే భూములు స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇస్తారన్న భరోసాతో ఉన్నామని, ఈ సమయంలో ఏ రాజకీయపార్టీ కూడా జోక్యం చేసుకోవద్దని కోరారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యడవల్లి సొసైటీ భూముల రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ హామీలో భాగంగా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు ముందడుగు వేసిందని, దీన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తమ భూములు స్వాధీనం చేసుకుంటే ప్రతి కుటుంబానికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని వివరించారు. సమావేశంలో ఈపూరి రాంబాబు, పరిశపోగు శ్రీనివాసు, వేల్పుల సాంబయ్య, రమేష్, అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్నను వెంటనే తరలించాలి
సాక్షి, మధిర: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని కరోనా రహితంగా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి పల్లెకు, ప్రతిగడపకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో పర్యటించిన ఆయన.. స్థానికంగా ఉన్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సమయంలో పలువురు రైతులు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోని సమస్యలను భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. లారీలు లేకపోవడంతో మొక్కజొన్నలు, ధాన్యం అక్కడి ఉండిపోయిందని వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతామని వారు భట్టివి వివరించారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క.. కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్నలను వెంటనే తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాక రైతులకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాస్కులు, శానిటైజర్ల పంపిణీ ఎడవల్లి గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో హమాలీలు, కూలీలకు మాస్కులు, శానిటైజర్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనాపై వారికి అవగాహన కల్పించారు. ముదిగొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పండ్లు, కూరగాయల అమ్మకం దార్లకు, పోలీసులు, వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. -
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు షాక్!
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యడవల్లి సొసైటీని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్ అథారిటీ తీర్పునిచ్చింది. కాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 381లో 416 ఎకరాల భూమి ఉంది. దీనిని 1975లో 250 మంది పేదలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో ఆ భూమిలో 2వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉందంటూ.. దాన్ని కాజేయటానికి పుల్లారావు.. భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు తెలియకుండా వారి సొసైటీని రద్దు చేయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. పేదల తరపున రివిజన్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో యడవల్లి సొసైటీ రద్దు కరెక్టు కాదని, దాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్ అథారిటీ గురువారం తీర్పునిచ్చింది. ఈ విషయం గురించి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రత్తిపాటి పుల్లారావుకు చెంపపెట్టు. పేదల భూములను లాక్కోవాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగింది’’ అని పేర్కొన్నారు. (చదవండి: బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..) అప్పట్లో మంత్రిగా చక్రం తిప్పిన ప్రత్తిపాటి పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఆ భూమిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ, గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. -
తెలుగు హాస్యం
కథలో అయినా, సినిమాలో అయినా హాస్య రసం లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప హాస్యనటులు ఉన్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రేక్షకులకు కితకితలు పెట్టి నవ్వించారు... నవ్విస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని హాస్య నటులపై రచయిత యడవల్లి ‘తెలుగు చలన చిత్రాల్లో హాస్యం’ (50 సంవత్సరాల పరిశీలన) అనే పుస్తకాన్ని రచించారు. ప్రముఖ హాస్యనటులు, పద్మశ్రీ పురస్కారగ్రహీత డాక్టర్ బ్రహ్మానందం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బ్రçహ్మానందం స్వగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వంశీరామరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. -
మాకు న్యాయం చేయండి..
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసిన యడవల్లి ఎస్సీలు చిలకలూరిపేట రూరల్ : యడవల్లి వీకర్స్ లాండ్ సొసైటీలో సభ్యులమైన తమ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోకుండా న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎస్సీలు బుధవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ కమలమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ భూముల విషయమై గతంలోనే యడవల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్‌కు అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ సంబంధిత నివేదికలతో హాజరు కావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు లేఖలు పంపారు. ఈ విషయమై కమిషన్ చైర్‌పర్సన్‌ను ఢిల్లీలోని కార్యాలయంలో యడవల్లి గ్రామస్తులు, న్యాయవాది ప్రసన్నకుమార్, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు బి.శ్రీనునాయక్ కలిశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఫోన్ ద్వారా సాక్షికి తెలిపారు. కష్ణా పుష్కరాల నేపథ్యంలో వివిధ పనుల్లో ఉన్నామని సంబంధిత ప్రభుత్వ అధికారులు విన్నవించారని, మరో విడత వారు హాజరయ్యేలా లేఖలు పంపుతామని కమిషన్ చైర్పర్సన్ తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.