మాకు న్యాయం చేయండి..
Published Wed, Jul 20 2016 8:43 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసిన యడవల్లి ఎస్సీలు
చిలకలూరిపేట రూరల్ : యడవల్లి వీకర్స్ లాండ్ సొసైటీలో సభ్యులమైన తమ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోకుండా న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎస్సీలు బుధవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్ కమలమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ భూముల విషయమై గతంలోనే యడవల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్‌కు అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ సంబంధిత నివేదికలతో హాజరు కావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు లేఖలు పంపారు. ఈ విషయమై కమిషన్ చైర్‌పర్సన్‌ను ఢిల్లీలోని కార్యాలయంలో యడవల్లి గ్రామస్తులు, న్యాయవాది ప్రసన్నకుమార్, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు బి.శ్రీనునాయక్ కలిశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఫోన్ ద్వారా సాక్షికి తెలిపారు. కష్ణా పుష్కరాల నేపథ్యంలో వివిధ పనుల్లో ఉన్నామని సంబంధిత ప్రభుత్వ అధికారులు విన్నవించారని, మరో విడత వారు హాజరయ్యేలా లేఖలు పంపుతామని కమిషన్ చైర్‌పర్సన్ తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
Advertisement
Advertisement