ST Commision
-
వికారాబాద్ జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్
-
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్‌ను, సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా మెదక్‌కు చెందిన బక్కి వెంకటయ్య నియామకమయ్యారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(కరీంనగర్), జిల్లా శంకర్ (నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్ (ఆదిలాబాద్)ను నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. -
గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్ కుంభా రవిబాబు పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. ఆయనను ప్రతి గిరిజనుడు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారన్నారు. గిరిజనులకు రక్షణగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఉంటుందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దన్నారు. గిరిజనుల సాధికారత సాధించడానికే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని పుష్ప శ్రీవాణి అన్నారు. చదవండి: రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు -
గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి
-
చంద్రబాబు గిరిజన ద్రోహి: కుంభా రవిబాబు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుని గిరిజనుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆదివాసీలు పడుతున్న కష్టాలను చూసి, వారి సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్టీ కమిషన్ బిల్లు ప్రవేశపెడితే.. శాసన మండలిలో చంద్రబాబు అడ్డుతగిలారని అన్నారు. ఎస్టీ కమిషన్‌ను, ఎస్సీ కమిషన్ నుంచి వేరుచేసి గిరిజనులకు మేలు జరుగాలని చూస్తే.. దానిని అడ్డుకున్న చంద్రబాబు చరిత్రలో గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారని, ఎస్టీకి సంబంధించి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎస్టీకి సంబంధించి అన్ని అసెంబ్లీ స్దానాలు, ఎంపీ స్దానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోవడంతో.. ఓర్వలేకే ఎస్టీ కమిషన్ బిల్లుకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. కేంద్రంలోలానే రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ప్రత్యేకంగా ఉంటే.. ఎస్టీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజనులు లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మాత్రమే అని విమర్శించారు. టీడీపీకి గిరిజనులు ఓట్లేయలేదు, ఎందుకు పని చేయాలని అడిగిన వ్యక్తి చంద్రబాబు అని, అరుకు నియోజకవర్గంలో ఆయన దతత్త తీసుకున్న గ్రామాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇక కిడారి శ్రావణ్ తండ్రి చనిపోవడం, త్వరలో ఎన్నికలు వస్తుండడంతో .. సానుభూతి ఓట్లు పడుతాయని మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. అలానే గిరిజన కార్పోరేషన్ ను కూడా ప్రభుత్వం పడిపోతుందని తెలిసి నెలరోజుల ముందు ఇచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కుంభా మండిపడ్డారు. ఆదివాసిల గుండెల్లో ఎక్కడ జగన్ శాశ్వతంగా నిలిచిపోతారోనని చంద్రబాబు నాయుడు ఈర్ష్య పడుతున్నారని అన్నారు. -
ఇంత దారుణమా చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: దళితుల విషయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి దళితుల గురించి చంద్రబాబు గతంలో చులకనగా మాట్లాడారని, దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ నాడు సీఎం హోదాలో చంద్రబాబు పేర్కొన్నారని, ఒక సీఎం స్థాయి వ్యక్తులే ఈరకంగా మాట్లాడితే ఇక కిందిస్థాయి వ్యక్తులు ఎలా దళితులను గౌరవిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాబు కేబినెట్లోని మంత్రే దళితులు స్నానం చేయరు, వారి వద్ద వాసన వస్తుందని అనుచితంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చంద్రబాబు ఏరకంగా అన్యాయం చేశారో గణాంకాల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ సభకు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లుపై సభా నాయకుడిగా, సీఎంగా వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. అయితే, ఈ సమయంలో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ.. సీఎం ప్రసంగిస్తుండగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. తన మాటలు ప్రజల వద్దకు వెళ్లవద్దనే దురుద్దేశంతోనే టీడీపీ సభ్యులు అరుస్తున్నారని, ఇటువంటి దారుణమైన పనులు చేయిస్తున్న వ్యక్తి చంద్రబాబు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండబోరేమోనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే మాటలు రావని, ఏపీ స్టేట్ కమిషన్ గురించి బాబు మాట్లాడుతూ.. 2003లోనే తాము ఎస్సీ కమిషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్ 1992లోనే వచ్చిందని, 1994-95 మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను తీసుకొచ్చారని, 1992లో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వస్తే.. 200 3దాకా రాష్ట్రంలో అలాంటి కమిషన్ తీసుకురావాలన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు అప్పట్లో పరిపాలించారని మండిపడ్డారు. ‘ఎంచి చూడగా మనుషులందున మంచిచెడులు రెండే కులములు మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనవుతాను’ అని వంద సంవత్సరాల కిందట గురజాడ అప్పరావు అంటే.. దళితులుగా పుట్టాలని ఎవరునుకుంటారంటూ ఇప్పడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు సీఎం అయిన తర్వాత పేర్కొన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు. రాజధాని కోసం సీఆర్డీఏ సేకరించిన భూముల విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు చంద్రబాబు దారుణమైన అన్యాయం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు ఎక్కువ భూమి కేటాయించి.. దళిత, బీసీ, మైనారిటీలకు సంబంధించిన అసైన్డ్‌భూములకు మాత్రం తక్కువ భూమి పరిహారంగా కేటాయించిన విషయాన్ని వివరించారు. దళిత, బీసీ, మైనారిటీలపై ఇంత దారుణమైన వివక్ష చూపించడం వల్లే.. రాష్ట్రంలో 36 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో ఒక్కటి మాత్రమే టీడీపీ గెలుచుకుందని తెలిపారు. రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీల కోసం తమ ప్రభుత్వం మరో విప్లవాత్మక బిల్లును తీసుకొచ్చిందని సీఎం జగన్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల మీద సమగ్ర అధ్యయనం చేసి.. పరిష్కారం దిశగా కృషిచేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర కేబినెట్లో 60శాతం మంత్రి పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీలే ఉన్నారని, రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీ వర్గాలకు చెందిన వారని, ఇది తమ ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా ఒక దళిత మహిళ ఉందని, గత హయాంలో ఎన్నికలు వచ్చే వరకు కనీసం ఒక్క ఎస్టీకి మంత్రి పదవి కూడా చంద్రబాబు ఇవ్వలేదని, ఇప్పుడు ఒక ఎస్టీ మహిళను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశామని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినెటెడ్ పనుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. గ్రామ సెక్రటేరియట్లలో లక్షా28వేలకుపైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించగా.. అందులో 82.5శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీ ఉద్యోగులే ఉన్నారని వివరించారు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు విప్లవాత్మక అడుగులు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలు, ఎస్టీల కోసం ఇంకొక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు దిక్కుమాలిన రీతిలో, సిగ్గులేనిరీతిలో ప్రవర్తిస్తున్నారని, వారిని సస్పెండ్ చేసినా తప్పులేదని అన్నారు. -
మాకు న్యాయం చేయండి..
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసిన యడవల్లి ఎస్సీలు చిలకలూరిపేట రూరల్ : యడవల్లి వీకర్స్ లాండ్ సొసైటీలో సభ్యులమైన తమ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోకుండా న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎస్సీలు బుధవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ కమలమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ భూముల విషయమై గతంలోనే యడవల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్‌కు అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ సంబంధిత నివేదికలతో హాజరు కావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు లేఖలు పంపారు. ఈ విషయమై కమిషన్ చైర్‌పర్సన్‌ను ఢిల్లీలోని కార్యాలయంలో యడవల్లి గ్రామస్తులు, న్యాయవాది ప్రసన్నకుమార్, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు బి.శ్రీనునాయక్ కలిశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఫోన్ ద్వారా సాక్షికి తెలిపారు. కష్ణా పుష్కరాల నేపథ్యంలో వివిధ పనుల్లో ఉన్నామని సంబంధిత ప్రభుత్వ అధికారులు విన్నవించారని, మరో విడత వారు హాజరయ్యేలా లేఖలు పంపుతామని కమిషన్ చైర్పర్సన్ తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.