
సాక్షి, విజయవాడ: చంద్రబాబు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్ కుంభా రవిబాబు పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. ఆయనను ప్రతి గిరిజనుడు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారన్నారు. గిరిజనులకు రక్షణగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఉంటుందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దన్నారు. గిరిజనుల సాధికారత సాధించడానికే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని పుష్ప శ్రీవాణి అన్నారు.
చదవండి:
రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’
ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు