Pushpa Srivani
-
హైకోర్టు తీర్పు: పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందినవారే..
జియ్యమ్మవలస: మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వారంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఆమె శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో జరిగిన ఎన్నిల బరిలో నిలిచిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేసింది. డీఎల్ఎస్సీ కమిటీ రిపోర్టు, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో నంబర్ 6ను పరిగణనలోకి తీసుకుని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిగా కోర్టు అభిప్రాయపడింది. పదేళ్లుగా ఓ వర్గం తను ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మా మకుటం... సత్యమేవ జయతే! -
లోకేష్ కు పుష్ప శ్రీవాణి ఛాలెంజ్
-
ఆడుదాం ఆంధ్రా..వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి
-
వెల్లివిరిసిన గిరిజన చైతన్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంత దశను మార్చేలా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గిరిజనం జై కొట్టారు. విద్య, వైద్య రంగాలను సమూలంగా మార్చడమే గాక ప్రభుత్వ సేవలను తమ ఆవాసాలకే చేర్చినందుకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. భారీఎత్తున భూ పంపిణీతో బతుకులు మార్చిన జగనన్నకు జేజేలంటూ పాటలు పాడారు. గిరిజన పక్షపాతికి సుదూర గిరిశిఖర గ్రామాల నుంచీ తరలివచ్చి ధన్యవాదాలు చెప్పారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర దృశ్యమిది. గిరిజన చైతన్యానికి ఈ యాత్ర అద్దంపట్టింది. తొలుత కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామం నుంచి వందలాది యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయల్దేరారు. 11 గ్రామాల మీదుగా 12 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ర్యాలీకి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును ప్రజాప్రతినిధులు వివరిస్తుంటే ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రత్యేక జిల్లాతో గిరిజనులకు గుర్తింపు: ఎంపీ గొడ్డేటి మాధవి సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసి 45 లక్షల మంది గిరిజనులకు గుర్తింపు ఇచ్చారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చెప్పారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. సీఎం జగన్ దేశానికే స్ఫూర్తి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, చెప్పని పథకాలను ఎన్నింటినో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి, సాధికారత కల్పించిన సీఎం ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే 2014 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలనూ మోసం చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ మాయమాటలు చెప్పడానికి చంద్రబాబు సహా టీడీపీ మోసగాళ్లు మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. గిరిజన బిడ్డలకు పెద్దపీట: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. బాబుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ గిరిబిడ్డలను అనేక పథకాలతో ఆదరిస్తున్నారని, మంచి విద్య, అధునాతన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. గిరిజనులకు అందుబాటులో విద్య: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా గిరిజనులకు ఉన్నత విద్యను సీఎం వైఎస్ జగన్ అందుబాటులోకి తెస్తున్నారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్ వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నిలవాలని, లేదంటే నష్టపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి కౌంటర్ ఇచ్చిన పుష్ప శ్రీవాణి
-
కొన్ని స్కూల్స్ లో బాత్రూములు కూడా సరిగ్గా లేవు.. కానీ ఇప్పుడు..!
-
వైఎస్ఆర్ సీపీ ప్రతినిధుల సభలో పుష్ప శ్రీవాణి ప్రసంగం
-
పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మ ఒడి: పుష్పశ్రీవాణి
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి
-
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. -
వారం రోజుల పాటు ‘అమృత భూమి’ చిత్రం ఉచిత ప్రదర్శన
ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘అమృత భూమి’. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీ.శే. వంగపండు ప్రసాదరావు కథ, పాటలు అందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కీలక పాత్రలో నటించారు. రసాయన వ్యవసాయం వల్ల భూములు నిస్సరమ అయిపోవటమే కాకుండా.. ప్రకృతి వనరులు, మనం తినే ఆహారం కూడా రసాయనాలు మయం అవుతోంది. అందుకే మనందరం - రైతులైనా, వినియోగదారులు అయినా - ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే అమృతాహారం ఆవశ్యకతను గుర్తెరగాలి.. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని తెలిసేలా ప్రచారం చేయాలి. ఈ ఉదాత్తమైన అద్భుత సందేశాన్ని అత్యంత సృజనాత్మకంగా వెండి తెర పైకి ఎక్కించిన ఘనత ప్రముఖ స్వచ్ఛంద సేవకులు, ‘అమృతభూమి’ చిత్ర నిర్మాత పారినాయుడుకే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ శాఖకు అనుబంధ సంస్థ రైతు సాధికార సంస్థ తోడ్పాటుతో ఈ చలన చిత్రాన్ని హృద్యంగా నిర్మించారు. పిల్లలు, పెద్దలు, రైతులు.. అందరూ చూడదగిన ఈ చిత్రాన్ని నూజివీడుకు చెందిన వ్యాపారవేత్త, మూల్పూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లక్ష్మణ స్వామి నూజివీడు(కృష్ణా జిల్లా) ప్రాంత ప్రజలకు వారం రోజుల పాటు ఉచితంగా చూపించాలని సంకల్పించారు. ఇప్పుడు 7 రోజులూ .. రోజూ 4షోలకు మార్చారు. ఆగష్టు 5 నుంచి 11తేదీ వరకు రోజూ 4 ఆటలు.. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు, మాట్నీ 2 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 6 గంటలకు, సెకండ్ షో రాత్రి 9 గంటలకు ఉచితంగా సత్యనారాయణ మినీ థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఖర్చంతా లక్ష్మణ స్వామి భరిస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రకృతి సేద్యం, ప్రకృతి ఆహారం తక్షణ ఆవశ్యకతను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. -
గడపగడపలో జగన్నినాదం
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్‌ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి. అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్ అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే – పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్ జగన్ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి – నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. -
31 పథకాలు గిరిజనుల కోసమే
-
శివయ్యకు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రత్యేక పూజలు
-
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే: అప్పిలేట్ అథారటీ
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని అప్పిలేట్ అథారటీ నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు విచారణ చేపట్టిన అప్పిలేట్ అథారిటీ.. పుష్ప శ్రీవాణి గిరిజనురాలేని స్పష్టం చేసింది. ఆమె ఎస్టీ కొండదొర సామాజిక వర్గంగా తెలిపింది. కాగా అప్పిలేట్ అథారిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బుల్లెట్ బండెక్కి సందడి చేసిన డిప్యూటీ సీఎం
-
గిరిజన రైతుకు ‘హక్కు’తో పాటు ‘భరోసా’
సాక్షి, అమరావతి: అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపచేయడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు గత రెండున్నరేళ్ల కాలంలో మూడు పర్యాయాల్లో రూ.750 కోట్ల మేర నేరుగా వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్న సంగతి తెల్సిందే. సొంత భూమి కలిగిన ఆసామికే కాకుండా అటవీ హక్కుల పట్టా (ఆర్వోఎఫ్ఆర్)లను పొందిన వారికి కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2008 నుంచి 2021 నవంబర్ వరకు రాష్ట్రంలో 2,34,827 మంది గిరిజనులకు 4,79,105 ఎకరాలను పట్టాలుగా అందించడం జరిగింది. వాటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో 1,32,084 మంది గిరిజనులకు 2,44,827 ఎకరాలకు సాగు హక్కు పత్రాలు (పట్టాలు) అందించడం దేశంలోనే రికార్డుగా నిలిచింది. దీంతోపాటు సాగుకు సాయమందిస్తూ వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ను ప్రభుత్వం వర్తింపజేసింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను ప్రభుత్వం నాకు రెండెకరాల భూమికి హక్కు పత్రం (ఆర్వోఎఫ్ఆర్ పట్టా) ఇచ్చింది. దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. భూమి పట్టా ఇవ్వడంతోపాటు ‘రైతు భరోసా’ అందిస్తున్న ప్రభుత్వం నా కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. – పలాసి మోహనరావు, కోడా పుట్టు గ్రామం, విశాఖ జిల్లా. భూమి పట్టా ఇచ్చి సాగుకు ఊతం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ‘నవరత్నాలు’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పకుండా అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపజేశారు. గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడమే కాదు, ఆ పట్టాలు ఇచ్చిన భూముల్లో సాగుకు ‘రైతు భరోసా’తో ఊతమివ్వడం జరుగుతోంది. దీని వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. – పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు శాసన సభలోని కార్యాలయంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా... జీవో నంబర్ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు.. రానున్న అసెంబ్లీలో సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దీపావళి సంబరాలు
-
నేరేడుబందకు మొబైల్ ఆధార్ టీం
పాడేరు: ఆ మారుమూల గిరిజన తండా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమవుతోంది. విశాఖ జిల్లా జి.మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దులోని నేరేడుబంద గ్రామంలో పిల్లలకు ఆధార్ కార్డులు అందనున్నాయి. ఈ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, దీంతో వారు ఆధార్ కార్డులకు నోచుకోక చదువుకు దూరం కావడంపై ‘సార్.. మా ఊరే లేదంటున్నారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది. జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్నబాబు, ఇతర అధికారులు సోమవారం నేరేడుబంద గ్రామాన్ని సందర్శించారు. వారిచ్చిన నివేదికతో పీవో వెంటనే మొబైల్ ఆధార్ టీంను పంపించారు. వారు సోమవారం రాత్రికే నేరేడుబంద చేరుకున్నారు. మంగళవారం ఆ గ్రామంలోని 18 మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేయనున్నారు. ఆ గ్రామానికి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోవడంతో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని జోగుంపేట ఆధార్ కేంద్రంలో ఆన్లైన్ చేయనున్నారు. ‘సాక్షి’ కథనంతో ఎంతోకాలంగా ఉన్న తమ సమస్య పరిష్కారం అవుతోందని నేరేడుబంద గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం
-
గిరిజన సంక్షేమంలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా గిరిజనులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నావల్జిత్ కపూర్ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన–శిక్షణ మిషన్, సెంటర్ రీజనల్ స్టడీస్‌ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్న నావల్జిత్ కపూర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీలో గిరిజన ఉప ప్రణాళిక అమలుకు సహకారం అందిస్తామన్నారు. ఉప ప్రణాళిక అమలులో ముందున్నాం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన ఉప ప్రణాళిక అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, హక్కుల రక్షణలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు 2వ దఫా పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్‌బాషా, గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. థింసా నృత్యం చేసిన మంత్రి పుష్పశ్రీవాణి సీతానగరం(పార్వతీపురం)/కురుపాం/ పాడేరు: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా: విశాఖ ఏజెన్సీలోని పాడేరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కలెక్టర్ మల్లికార్జున, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నర్సింగరావు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరయ్యారు. -
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
-
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
సాక్షి, పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది :పుష్ప శ్రీవాణి