
సాక్షి, విజయవాడ: ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. (చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్)
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.(చదవండి: నా ఇంటి నెంబరు 305..)
Comments
Please login to add a commentAdd a comment