జియ్యమ్మవలస: మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వారంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఆమె శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో జరిగిన ఎన్నిల బరిలో నిలిచిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేసింది. డీఎల్‌ఎస్సీ కమిటీ రిపోర్టు, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో నంబర్ 6ను పరిగణనలోకి తీసుకుని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిగా కోర్టు అభిప్రాయపడింది. పదేళ్లుగా ఓ వర్గం తను ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మా మకుటం... సత్యమేవ జయతే!
Comments
Please login to add a commentAdd a comment