caste case
-
హైకోర్టు తీర్పు: పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందినవారే..
జియ్యమ్మవలస: మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వారంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఆమె శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో జరిగిన ఎన్నిల బరిలో నిలిచిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేసింది. డీఎల్ఎస్సీ కమిటీ రిపోర్టు, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో నంబర్ 6ను పరిగణనలోకి తీసుకుని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిగా కోర్టు అభిప్రాయపడింది. పదేళ్లుగా ఓ వర్గం తను ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మా మకుటం... సత్యమేవ జయతే! -
దారుణం: ప్రేమ, ఆపై వివాహం.. ఆమెది తన కులం కాదని తెలియడంతో..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కులం విషయంలో భార్య అబద్ధం చెప్పిందని దారుణంగా హత్య చేశాడో కిరాతక భర్త. ఈ సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. కనకపురలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న లోకేశ్, హావేరి జిల్లా హానగల్లు తాలూకా ఓంకణ గ్రామానికి చెందిన గీతలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. ఇటీవల తన కులం గురించి అబద్ధం చెప్పిందని, ఆమెది తన కులం కాదని భావించిన లోకేశ్.. ఈనెల 1న ఆమెను హింసించి కొట్టి, తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. శవాన్ని గోనెసంచిలో కట్టి శివారులోని తన తాతకు చెందిన పొలంలో పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఇంట్లో డబ్బు, నగలు తీసుకుని ఎవరితోనో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గీత తల్లిదండ్రులను విచారించగా లోకేశ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు లోకేశ్‌ను తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. గీత శవాన్ని వెలికితీయించి పోస్టు మార్టానికి తరలించారు. చదవండి: మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్ అరెస్ట్ -
కులం పేరుతో దూషించారంటూ డీలర్‌పై ఫిర్యాదు
శెట్టూరు : తమ గ్రామంలోని ప్రభుత్వ చౌక ధాన్యపు డిపో డీలర్ కురబ రాజు తనను కులం పేరుతో దూషించి, చెయ్యి చేసుకున్నట్లు శెట్టూరు మండలం లింగదీర్లపల్లికి చెందిన ఎరుకుల ఇందిరమ్మ ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం స్టోర్‌కు వెళ్లగా కిందపడ్డ బియ్యాన్ని తీసుకెళ్లాల్సిందిగా డీలర్ ఆదేశించాడన్నారు. అందుకు తాను అభ్యంతరం తెలపడంతో మాటామాటా పెరిగిందన్నారు. డీలర్ కులం పేరుతో దూషించగా, ఆయన భార్య త్రివేణి, అతని సోదరుడు మర్రిస్వామి తన చెంపపై కొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ భర్త నీలాంజితో కలసి డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్‌రెడ్డి సహా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తహశీల్దార్ వాణిశ్రీ దృష్టికి ఫోన్లో తీసుకెళ్లగా.. ఆర్ఐని గ్రామానికి పంపి విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.