
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కులం విషయంలో భార్య అబద్ధం చెప్పిందని దారుణంగా హత్య చేశాడో కిరాతక భర్త. ఈ సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. కనకపురలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న లోకేశ్, హావేరి జిల్లా హానగల్లు తాలూకా ఓంకణ గ్రామానికి చెందిన గీతలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. ఇటీవల తన కులం గురించి అబద్ధం చెప్పిందని, ఆమెది తన కులం కాదని భావించిన లోకేశ్.. ఈనెల 1న ఆమెను హింసించి కొట్టి, తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు.
శవాన్ని గోనెసంచిలో కట్టి శివారులోని తన తాతకు చెందిన పొలంలో పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఇంట్లో డబ్బు, నగలు తీసుకుని ఎవరితోనో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గీత తల్లిదండ్రులను విచారించగా లోకేశ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు లోకేశ్‌ను తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. గీత శవాన్ని వెలికితీయించి పోస్టు మార్టానికి తరలించారు.
చదవండి: మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment