
సాక్షి, విజయవాడ: దశల వారి మద్యపాన నిషేధాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందులో భాగంగానే మద్యం షాపులు తగ్గిస్తూ నేడు ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో మహిళల కష్టాలు తీరుస్తానని మాట ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే 33 శాతం మద్యం షాపులు ఏడాదిలోనే తొలగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 44వేల బెల్టు షాపులు, 40 శాతం బార్లు తొలగించామని చెప్పారు. కచ్చితంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి చూపిస్తారని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం ఆలోచిస్తున్నారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.
(ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు)
Comments
Please login to add a commentAdd a comment