ban liquor
-
పోలీసుల అత్యుత్సాహం.. నవ వధువు బెడ్రూమ్లోకి చొరబడి మద్యం కోసం
పాట్నా: బిహారలో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తూ 2016లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్‌లో లో గుజరాత్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలు మద్యపాన నిషేధం విధించగా.. నాలుగో రాష్ట్రంగా బిహార్ నిలిచింది. తాజాగా సీఎం నితీష్ కుమార్ మద్యపాన నిషేదంపై శుక్రవారం మధుబనిలో జరిగిన ఓ సభలోనూ ప్రసంగిస్తూ.. మహిళల డిమాండ్ మేరకే తాను మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకున్న రాష్ట్ర పోలీసులు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల బీహార్ పోలీసుల బృందం పాట్నాలోని నవ వధువు గదిలోకి వెళ్లి మద్యం కోసం వెతికారు. ఆ సమయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా రాష్ట్రంలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరోసారి కొత్తగా పెళ్లైన వధువు గదిలోకి చొరబడి పోలీసులు దాడులు నిర్వహించారు. వైశాలి జిల్లా పోలీసులు హాజీపూర్ నగరంలోని హతసర్గంజ్ ప్రాంతంతో ఉన్న శీల దేవీ ఇంటిపై గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు. చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు! అయిదు రోజుల క్రితం తన కొడుకుతో వివాహం చేసుకున్న ఆమె కోడలు బెడ్‌రూమ్‌పై దాడి చేశారు. శీలా కుమారి కోడలు పూజా కుమారి తన బెడ్ రూమ్‌లో ఉండగా.. మహిళా పోలీసుల లేకుండానే పోలీసుల బృందం అక్కడికి వచ్చారు. తన గదిలోకి వెళ్లి ప్రతి చోట వెతికారు. బెడ్, అల్మారా, సూట్‌కేసులతో సహా రూమ్ అంతా సెర్చ్ చేశారు. తన గదిలో ఏం వెతుకుతున్నారని కోడలు పూజా పోలుసులను ప్రశ్నించగా.. సైలెంట్‌గా ఉండాలని పోలీసులు అసభ్యంగా మాట్లాడారు. చదవండి: ఒక్క నెలలో కోటిమందికి పైగా.. ఎయిర్‌లైన్స్ చరిత్రలో మరో రికార్డు ఈ విషయంపై పూజా మాట్లాడుతూ..గదిలో దాచిపెట్టిన మద్యం బాటిళ్ల కోసం వెతుకున్నారని పోలీసులు చెప్పినట్లు తెలిపింది. అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఆమె అత్త స్పృహ తప్పి పడిపోయినప్పటికీ పోలీసులు తమ సోదాలు కొనసాగించారని వెల్లడించింది. పోలీసుల దాడుల అనంతరం స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపింది. తమ కుటుంబంలో ఎప్పుడూ మద్యం సేవించిన దాఖలాలు లేవని, అయినా పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేశారని వాపోయింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్పందించేందుకు వైశాలి ఎస్ఎస్పీ మనీష్ కుమార్ నిరాకరించారు. చదవండి: జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం -
దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..
సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నిషేధం అమలు చర్యలు శరవేగంగా సాగుతోన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు ప్రధాన విభాగాల ఉన్నతాధికారులు శుక్రవారం గుంటూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గుంటూరు అర్బన్ ప్రత్యేకాధికారి కరిముల్లా షరీఫ్, గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. బాలకృష్ణన్ తో కలిసి మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎస్ఈబీ ప్రత్యేకాధికారి షరీఫ్ కి లక్ష్మణరెడ్డి అభినందనలు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణాను నిరోధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ శాఖలు సమన్వయంగా పనిచేయాలి.. మద్య నిషేధం అమలులో భాగంగానే ఎస్ఈబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలంటే ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలు సమన్వయంగా పనిచేసి తమ సత్తాను చాటుకోవాలని సూచించారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లల్లో మద్యం దుకాణాలు తెరవనందున ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తరలించే ప్రమాదాన్ని పసిగట్టి నిరోధించాలన్నారు. రాష్ట్ర,జిల్లాల సరిహద్దుల్లో మద్యం అక్రమరవాణాకు పటిష్ట బందోబస్తును మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను లక్ష్మణరెడ్డి కోరారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, రాపాక వరప్రసాద్ ల నేతృత్వంలో నాటు సారా కేంద్రాల్ని మూసేయించడం అభినందనీయమన్నారు. ('ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు') సరికొత్త శుభ పరిణామం.. నాటు సారా తయారీదారులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేంద్రాలను అప్పచెప్పారని.. ముఖ్యమంత్రి సంకల్పమే తమలో మార్పునకు కారణమని చెప్పడం సరికొత్త శుభ పరిణామంగా లక్ష్మణరెడ్డి వివరించారు. ఇలాంటి సంఘటనల ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా పూనుకొని ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో నాటుసారా తయారీ కేంద్రాల్ని మూత వేయించాలన్నారు. రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు.. దశలవారీ మద్య నిషేధ చర్యలతో రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదని.. అలాంటప్పుడే ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నాటుసారా తయారీ, కల్తీకల్లు, గంజాయి ఇతర మత్తుపదార్ధాల ఉత్పత్తి జరగకుండా ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఈబీలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందితోనూ.. ఎక్సైజ్ శాఖ 30 శాతం సిబ్బందితో సమర్ధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరుశాఖల అధికారులు చెప్పారు. మద్య విమోచన ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ తమ శాఖల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయా శాఖల అధికారులు హామీనిచ్చారు. -
‘అందుకే మద్యం షాపులు తగ్గింపు’
సాక్షి, విజయవాడ: దశల వారి మద్యపాన నిషేధాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందులో భాగంగానే మద్యం షాపులు తగ్గిస్తూ నేడు ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో మహిళల కష్టాలు తీరుస్తానని మాట ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే 33 శాతం మద్యం షాపులు ఏడాదిలోనే తొలగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 44వేల బెల్టు షాపులు, 40 శాతం బార్లు తొలగించామని చెప్పారు. కచ్చితంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి చూపిస్తారని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం ఆలోచిస్తున్నారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. (ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు) -
దిశ చట్టం,మద్యపాన నిషేధం పై హర్షం
-
మద్యపాన నిషేధం కోసం రెండురోజుల దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మద్యం కారణంగానే మనుషులు మృగాలుగా మారుతున్నారన్నారని అన్నారు. మద్యం తాగిన మత్తులో అనాగరికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిశ ఘటనతోపాటు మరో రెండు ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధితులైన సమత, మానస కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మద్యం అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనికోసం గురు, శుక్రవారాల్లో రెండురోజుల దీక్ష చేపడతానన్నారు. ఈ దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు. -
గ్లాసు సారా రూ.20..!
సాలూరు: రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధానికి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించింది. మద్యం ధరలు పెంచి అమ్మకాలకు కట్టడివేసింది. ఇప్పుడు.. ఈ నిర్ణయాన్ని సారా వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. సారా ధరలను అమాంతం పెంచేశారు. ఇన్నాళ్లూ రూ.10 పలికిన గ్లాసు సారా ఇప్పుడు రూ.20కి పెంచేశారు. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుని గిరిజన గ్రామాల్లో గుట్టు చప్పుడుగా విక్రయిస్తున్నారు. తెలిసిన వారికి, నిరి్ధష్ట వేళల్లో (ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య, రాత్రి కూడా అదే సమయంలో) మాత్రమే అమ్మకాలు సాగిస్తున్నారు. వలంటీర్లకు బెదిరింపులు గ్రామాల్లో అక్రమ బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నా, సారా విక్రయాలపై పోలీసులు, ప్రొహిబిషన్ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఈ సమాచారాన్ని వలంటీర్లే అధికారులకు చేరవేస్తున్నారని బెల్ట్‌షాపులు, సారా విక్రయదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాచిపెంట మండలంలోని గురివినాయుడుపేట గ్రామంలో ఈ విషయంపై వలంటీర్లుపై బెదిరింపులు రాగా వారు పోలీసులను ఆశ్రయించారు. వలంటీర్లకు అండగా ఎస్ఐ గంగరాజు నిలబడి చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని, వలంటీర్లపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని సదరు బెల్ట్‌షాప్ నిర్వాహకులకు హెచ్చరించారు. పట్టణంలోని ఓ వార్డులో ఈ మాదిరి సంఘటనలే జరిగాయి. అయితే, పోలీసులు మాత్రం దాడులు కొనసాగిస్తున్నారు. గతనెల 18న పాచిపెంట మండలం కంకణాపల్లి సమీపంలో సారా బట్టీలపై దాడులుచేసి సుమారు 2 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పద్మాపురం, చాపరాయివలస తదితర గ్రామాల్లో దాడులు చేసి విక్రయదారులపై కేçసులు నమోదు చేశారు. ఒడిశా నుంచి దిగుమతి... సారా ముడిసరుకు అమ్మోనియా, నల్ల బెల్లం తదితర పదార్థాలు ఒడిశా నుంచి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. పాచిపెంట మండలానికి ఒడిశా నుంచి లారీ ట్యూబ్లలో సారాను తీసుకువస్తున్నారు. కొందరు వ్యాపారులు మా త్రం నల్లబెల్లాన్ని నిశిరాత్రి వేళ సాలూరు పట్ట ణం నుంచి తరలిస్తున్నట్టు భోగట్టా. తయారైన సారాను పాచిపెంట మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు పరిసర ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లోను, సాలూరు మండలంలోని నార్లవలస, కురుకూటి, కందులపదం, తోణాం, సారి క తదితర పంచాయలీల్లోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. సారాకు బలవుతున్న మధ్య, పేదతరగతి కుటుంబాలు.. సారా తయారీలో అమ్మోనియం అధిక శాతం వినియోగించడం, మత్తు ఎక్కించే పదార్థాలు వాడుతున్నారు. ఇది తాగిన వారు కొద్ది సేపటికే స్పృహ కోల్పోతున్నారు. నెలల్లోపై అనారోగ్యానికి గురవుతున్నారు. సారాకు ఎక్కువుగా పేద, మధ్యతరగతి కుటుంబాలవారు బలవుతున్నార ని వైద్యులు చెబుతున్నారు. కొందరు తక్కువ వయసులోనే మరణిస్తున్నారని, సారాకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. సారా తయారీ, విక్రయాలు చేయవద్దని జాగృతి కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం. తరుచూ దాడులు జరుపుతూ బెల్లం ఊటలను ధ్వంసం చేస్తున్నాం. నిబంధనల మేరకు కేసులు నమోదు చేస్తున్నాం. – ఎం.విజయలక్ష్మి,సాలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ (94409 02374) ధ్వంసం చేశాం.. ఇటీవల కంకణాపల్లి సమీపంలో సారా బట్టీలపై దాడులు చేశాం. 2 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశాం. పద్మాపురం, చాప రాయివలస తదితర గ్రామాల్లోనూ వరుస దాడులు చేశాం. గురివినాయుడుపేటలో అక్రమ మద్యం విక్రయాల సమాచారం వలంటీర్లే ఇస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలియడంతో గ్రామంలో అవగాహన కలి్పంచాం. హెచ్చరికలు జారీ చే శాం. సారా తయారు చేసినా, విక్రయించినా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. – గంగరాజు, ఎస్ఐ, పాచిపెంట (91211 09474) -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
మద్య నిషేధంతో సిండికేట్లకు చెక్: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నిషేధం ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో మద్యపాన నిషేధం విఫలమయిందని.. ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు నిర్వహించడానికి ముందుకొచ్చిందని.. దీంతో సిండికేట్లకు చెక్ పెట్టగలిగామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. సూపర్ వైజర్లకు 17,500 జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. బీటెక్ చదివిన వారికి కూడా ఇంత జీతం రావడం లేదని..ఉద్యోగం పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని తెలిపారు. -
నోట్లరద్దే కాదు.. వాటినీ టార్గెట్ చేయలి!
పట్నా: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ ఆందోళనబాట పడుతుండగా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మాత్రం దృఢంగా కేంద్రానికి అండగా నిలుస్తున్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నానని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన కేంద్రానికి సూచించారు. పెద్దనోట్ల రద్దే కాదు.. బినామీ ఆస్తులు, మద్యపానాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, బినామీ ఆస్తులపై కొరడా ఝళిపించడంతోపాటు, మద్యపాన నిషేధం విధించాలని ఆయన సూచించారు. నల్లధనానికి ప్రధాన మౌలిక వనరుగా బినామీ ఆస్తులు, మద్యపానం నిలుస్తున్నాయని అన్నారు. గతంలోనూ పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా నితీశ్‌కుమార్ బాహాటంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అయినా నితీశ్ పెద్దనోట్ల రద్దును ఆది నుంచి స్వాగతిస్తుండటం గమనార్హం. -
చాలిక నిషేధించండి