
సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నిషేధం ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో మద్యపాన నిషేధం విఫలమయిందని.. ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు నిర్వహించడానికి ముందుకొచ్చిందని.. దీంతో సిండికేట్లకు చెక్ పెట్టగలిగామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. సూపర్ వైజర్లకు 17,500 జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. బీటెక్ చదివిన వారికి కూడా ఇంత జీతం రావడం లేదని..ఉద్యోగం పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని తెలిపారు.