Government of AP
-
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
2 ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
చిరుధాన్యాల సాగుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం
-
శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీళ్లన్నీ మావే
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో లభ్యతగా ఉన్న నీళ్లన్నీ తమవేనని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రబీలో సాగు చేసిన పంటలను రక్షించుకోవడం, వేసవిలో తాగు నీటి కోసం ఆ నీటిని విడుదల చేయాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటాకంటే 38.72 టీఎంసీలను అధికంగా ఏపీ వాడుకుందని తెలంగాణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రభుత్వమే కోటాకంటే అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుందని తెలిపింది. మొత్తం కృష్ణా జలాల్లో ఏపీ కోటాలు ఇంకా 199.31 టీఎంసీలు మిగులు ఉందని తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగులు ఉన్నాయని స్పష్టంచేసింది. ఈ నీటిని మొత్తాన్ని ఏపీకి విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ♦ ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి చేరుకోక ముందే, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలు 9వ పేరాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. బోర్డు అనుమతి తీసుకోకుండా విద్యుదుత్పత్తి కోసం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలోనే కలపాలని ఆదిలోనే కోరాం. ♦ తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 392.45 టీఎంసీలు, సాగర్‌లో 295.24 టీఎంసీలను.. మొత్తం 687.69 టీఎంసీలను వాడుకుంది. ఇందులో వరద రోజుల్లో వాడుకున్న 359.76 టీఎంసీలు, బోర్డు అనుమతితో వాడుకున్న 126.86 టీఎంసీలను మినహాయిస్తే.. 201.07 టీఎంసీలు అక్రమంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలిసింది. తెలంగాణ విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే 201.07 టీఎంసీలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉండేవి. రెండు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలకు ఉపయోగపడేవి. ♦ వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసి సముద్రంలో జలాలు కలిసే సమయంలో ఏపీ ప్రభుత్వం 191.09 టీఎంసీలు, తెలంగాణ 48.488 టీఎంసీలు వాడుకున్నాయి. ఆ నీటిని ఏ రాష్ట్ర కోటాలో కలపకూడదు. ♦ రెండు రాష్ట్రాల సంయుక్త లెక్కల ప్రకారం జూరాలలో తెలంగాణ 42.22 టీఎంసీలను వాడుకుంది. కానీ, కృష్ణా బోర్డుకు మాత్రం 35.959 టీఎంసీలే వాడుకున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పింది. అంటే జూరాల నుంచి అదనంగా 6.261 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. ♦ పాకాల చెరువు, వైరా, పాలేరు, లంకసాగర్, ఆర్డీఎస్, కోయిల్‌సాగర్ వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను 2021 నుంచి బోర్డు దృష్టికి తీసుకురాలేదు. ♦ 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం), తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.71 టీఎంసీలను వాడుకున్నాయి. ఇందులో ఏపీ వాడుకున్నది 442.52 (52.2 శాతం), తెలంగాణ వాడుకున్నది 404.20 (47.8 శాతం) టీఎంసీలు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయి. తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుంది. ♦ ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉంటే.. తెలంగాణ అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుంది. ♦ తక్షణమే నీటి లెక్కలను తేల్చి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లో నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేయండి. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించండి. -
కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో
సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): పెళ్లంటే నూరేళ్ల పంట... మామిడాకులు, అరటి కొమ్మలు.. టెంకాయ పట్టలతో పెళ్లంటే పెద్ద సందడి. అయితే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టిచూడు అన్న సామెత ప్రకారం పెద్ద ఖర్చుతో కూడుకున్న తంతు. అందుకే నిరుపేదల పెళ్లిళకు ప్రభుత్వం కూడా తనవంతు సాయంగా కానుక అందించేందుకు సిద్ధమైంది. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు అయితే ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు చదువును ప్రోత్సహించడం, డ్రాపౌట్స్‌ను తగ్గించి అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన విధించింది. ఇకనుంచి కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. గతంలో టీడీపీ హయాంలో అంతంత మాత్రంగా అందిస్తుండగా, దాన్ని రెట్టింపు చేసి వైఎస్ జగన్ సర్కార్ శనివారం నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద అందించనుంది. వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్ అసిస్టెంట్(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి ) -
ముంపు ముప్పు ఉండదిక
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో ముంపు నుంచి పట్టణాలను రక్షించేందుకు పురపాలక శాఖ సమాయత్తమైంది. భారీ వర్షాలకు జనావాసాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్న దుస్థితికి చెక్ పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. పట్టణాలు కొన్ని దశాబ్దాలుగా ప్రణాళికా రహితంగా విస్తరించడంతో చిన్న చిన్న వాననీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. భారీ వర్షాలు వస్తే నీటి ప్రవాహానికి మార్గం లేక జనవాసాలు ముంపునకు గురవుతుండటం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో వరద నీటి కాలువలు నిర్మించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రూ.350 కోట్లతో రెండు దశల్లో 14 మునిసిపాలిటీలలో కాలువల్ని నిర్మించనుంది. అనంతరం దశలవారీగా లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లోనూ ఈ కాలువలు నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో 7 కార్పొరేషన్లలో.. లక్ష నుంచి 3 లక్షల జనాభా గల 32 నగరాలను అమృత్ పథకం పరిధిలోకి చేర్చారు. తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం మొదలైనవి చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం రూ.3,762.91 కోట్ల ప్రాజెక్టు ఇది. అందులో కేంద్రం వాటా రూ.1,056.62 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.436.97 కోట్లు. మునిసిపల్ కార్పొరేషన్లు/ మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో 14 పట్టణాల్లో వరద కాలువల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. అందుకోసం రూ.350.75 కోట్లతో 118 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటి దశలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం నగరాలను ఎంపిక చేసి పనులను మొదలు పెట్టింది. రెండో దశ కింద మిగిలిన 7 మునిసిపాలిటీలను త్వరలో ఎంపిక చేస్తారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. మూడేళ్లలో 32 మునిసిపాలిటీల్లో.. లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లోనూ వరద కాలువలు నిర్మిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. మరో 14 మునిసిపాలిటీలను ఎంపిక చేయనుంది. మూడేళ్లలో మొత్తం 32 మునిసిపాలిటీల్లో కాలువల నిర్మాణం పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. అత్యంత ప్రాధాన్య అంశంగా ఈ పనులు చేపట్టామని పురపాలక శాఖ ఈఎన్సీ చంద్రయ్య చెప్పారు. నీటి వనరులతో అనుసంధానం వర్షపు నీరు జనావాసాల్లోకి చేరకుండా నేరుగా ఈ కాలువల్లోకి చేరేలా డిజైన్లు రూపొందించారు. మునిసిపాలిటీ పరిధిలోని ఎత్తు ప్రదేశం నుంచి నేరుగా శివారు ప్రాంతానికి అనుసంధానిస్తూ భారీ కాలువలు నిర్మిస్తారు. ఆ కాలువలను మునిసిపాలిటీకి సమీపంలో ఉన్న నదులు/సముద్రం /ఇతర నీటి వనరులకు అనుసంధానిస్తారు. దాంతో ఎత్తు ప్రదేశాల నుంచి వర్షపు నీరు వేగంగా కిందకు ప్రవహించి నిర్దేశిత గమ్యానికి చేరుకుంటుంది. -
తుది కేటాయింపులు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. డీఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ (నాన్ కేడర్) పోస్టులకు తుది కేటాయింపులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వీరి నుంచి తాజాగా ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చని సూచించింది. ఉన్నతాధికారుల పునర్విభజన సలహా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, పునర్విభజన చట్టం నిబంధనల మేరకు కేటాయింపులు చేసి తెలంగాణ, ఏపీ హోం శాఖ, డీజీపీలకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని, ఇందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతోపాటు డీజీపీలు సహకరించాలని స్పష్టం చేసింది. తనను ఏపీకి కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ కర్నూల్ జిల్లాకు చెందిన డీఎస్పీ జి.నాగన్న దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇది ఒక్కరికి చెందింది కాదు.... తనను ఏపీకి కేటాయించాలంటూ నాగన్న పిటిషన్ దాఖలు చేసినా.. ఇరు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. తుది కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటో చెప్పాలంటూ పలు పర్యాయాలు గడువు ఇచ్చినా వాదనలు వినిపించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే ఆరువారాలు గడువు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తయారు చేసిన సీనియారిటీ జాబితాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కేంద్రం మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించే పరిధి కేంద్రానికి ఉన్నా పట్టనట్లుగా వ్యవహరించిందని పేర్కొంది. నాగన్నను విధుల్లోకి తీసుకోవాలి.... తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు కేటాయించిన డీఎస్పీ జి.నాగన్నను తుది కేటాయింపుల్లో కేంద్రం ఏపీకి కేటాయిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల్లో జాప్యంతో పదోన్నతులు, ఇతర అలవెన్స్‌లు, పదవీ విరమణ బెనిఫిట్స్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేటాయింపుల్లో జాప్యానికి కారణమైన కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు రూ.5 వేల చొప్పున నాగన్నకు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. -
క్వారంటైన్ విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు
-
ఈ క్రాప్ విధానానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
-
సామాన్యులకు ‘సంజీవని’
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 30 బస్సులను సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా టెస్ట్‌లు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
-
మారుతున్న పాఠశాలల రూపురేఖలు
-
రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
కరోనా నివారణకు ఏపీలో ఐ మాస్క్ బస్సులు
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కోవిడ్ టెస్టుల శాతాన్ని గణనీయంగా పెంచే ప్రయత్నం చేస్తోంది. త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దించింది. విజయవాడ సిటీలో ఎనిమిది చోట్ల శ్వాబ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు రెండు వేల మందికి టెస్టులు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..) ఐ మాస్క్ బస్సుల ద్వారా జరుగుతున్న కోవిడ్ టెస్టుల ప్రక్రియను కలెక్టర్ ఇంతియాజ్ శనివారం పరిశీలించారు. ప్రతీ అరగంటకు ఒకసారి హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. (బస్సులు, రైళ్లలో జర్నీకి ఝలక్ !) -
విద్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకరించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ప్రపంచ బ్యాంకు సహకారాన్ని అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్లతో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య అభివృద్ధి పథకం’ గురించి వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్‌లో విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ► రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తోంది. బడ్జెట్లో 16 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ► మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం. ► విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ► మంత్రితో పాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ∙ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
-
ప్లాస్మా థెరపీ చికిత్సకు ఏపీ ప్రభుత్వం అనుమతి
-
పేదల విద్యార్ధులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్
-
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో రికార్డు
-
పేద విద్యార్ధుల కోసమే ఇంగ్లీష్ మీడియం
-
రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..
-
టీచింగ్ ఆసుపత్రులకు కొత్త హంగులు
-
ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లు
-
అన్ని వర్గాలకు బాసటగా నిలిచిన సర్కారు
-
తొలి ఏడాదిలోనే 90 శాతం అమలు
-
కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ అగ్రస్థానం
-
సీఎం జగన్ ఏడాది పాలన..సంక్షేమ పాలన
-
ప్రజల ముంగిట పాలన
-
నేడు అర్చకులు,పాస్టర్లుకు రూ.5వేల చొప్పున సాయం
-
ఏడాది పాలన అద్బుతంగా సాగింది
-
రాష్ట్ర చరిత్రలో ఓ పార్టీ అతిపెద్ద విజయం
-
కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ రికార్డ్
-
మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
-
ఇదీ మన ప్రభుత్వ ఘనత
-
స్కూళ్ల ఫీజులపై ఏపీ సర్కారు ఆదేశం
-
పేదలకు అండగా..
-
ఏపీలో 534కి చేరిన కరోనా కేసులు
-
ప్రభుత్వం కట్టుబడి ఉంది..
-
రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఇంటికే రేషన్
-
పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
పేదలకు తోడుగా సీఎం వైఎస్ జగన్
-
విద్యార్ధులకు ఉచిత దంతవైద్యం
-
కియామోటర్స్‌పై రాయిటర్స్ కథనం అవాస్తవం
-
మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అద్దె టెండర్లలో గోల్మాల్ కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తం కావటంతో విచారణకు ఆదేశించారు. అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడా లేని విధంగా రూ.566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో/నగరాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ.22 నుంచి గరిష్టంగా రూ.40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించవచ్చనుకుంటే ఏకంగా రూ.250 నుంచి రూ.560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాన్ని 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ.1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల ఉచితంగా ఇచ్చిన స్థానికులు మరోవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల గదులకు ఎలాంటి అద్దె లేకుండా ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు అద్దె లేకుండా స్థానికులు గదుల్ని అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూపాయి అద్దె చొప్పున భవనాలు అప్పగించారు. మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వమే షాపుల్ని నిర్వహిస్తుండటంతో ఉచితంగా భవనాలు అప్పగించారు. విజయవాడలో రూ.లక్షల్లో అద్దె విజయవాడలో గతంలో లిక్కర్ మార్ట్లు నిర్వహించిన చోట ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఓ దుకాణానికి నెలకు రూ.3.50 లక్షలు, మరో షాపునకు రూ.2.70 లక్షలు చొప్పున అద్దె నిర్ణయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీటికి రివర్స్ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు. -
2021 నాటికి ‘పోలవరం’ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను(యాక్షన్ ప్లాన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసించింది. గోదావరికి వరదలు వచ్చేలోగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, నిర్వాసితుల పునరావాసం పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడింది. ఆర్థిక వనరులు సమకూర్చితే ఆ యాక్షన్ ప్లాన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు శనివారం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ నివేదికలో ఏం పేర్కొన్నారంటే.. పకడ్బందీ ప్రణాళికతో పనులు - పోలవరం స్పిల్ వేలో 18.48 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ, 15.81 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 2.67 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను జూలై 2020 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. నెలకు సగటున 33,375 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం ద్వారా వాటిని పూర్తి చేయనున్నారు. - స్పిల్ ఛానల్లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ, 13.31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5.44 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నెలకు 48,545.55 క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. - వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు చేయడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కసరత్తు సాగిస్తున్నారు. - 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే పనులు చేపట్టారు. వాటిని మే నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. - కుడి కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని.. కొత్త కాంట్రాక్టర్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి.. 2021 నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. - వచ్చే సీజన్లో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్.. కాలువలకు నీటిని సరఫరా కుడి, ఎడమ అనుసంధాలు, స్పిల్ వేకు గేట్లు బిగించే ప్రక్రియతోసహా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. నిధులు సమకూర్చితే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి సెప్టెంబరు 2019 వరకూ రూ.11,377.243 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,764.16 కోట్లు(ఇందులో పీపీఏ కార్యాలయ నిర్వహణ వ్యయం రూ.15 కోట్లు) రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2018–19లో రూ.393.51 కోట్లు .. నవంబర్ 8, 2019న రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఆ నిధులను విడుదల చేయలేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంపోగా మిగతా.. అంటే రూ.50,987.96 కోట్లు నీటిపారుదల విభాగం వ్యయం. ఆ మేరకు నిధులను సమకూర్చితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది. -
‘బీహార్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇచ్చారు’
సాక్షి, అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఏ ఫొటోల ఆధారంగా హైకోర్టు తమ వివరణ కోరిందో అందులో పలు ఫొటోలు మార్ఫింగ్ చేసినవని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు సుమోటోగా తీసుకున్న వ్యాజ్యంతో జత చేసి ఉన్న ఫొటోల్లో మార్ఫింగ్ చేసిన ఫొటోలున్నాయని తెలిపారు. బీహార్‌లో ఎప్పుడో జరిగిన ఘటన తాలూకు ఫొటోను ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల ఆందోళనతో ముడిపెట్టి మార్ఫింగ్ చేశారని కోర్టుకు వివరించారు. మిగిలిన ఫొటోల్లో చూపిన దానికి, క్షేత్రస్థాయిలో జరిగిన దానికీ చాలా తేడా ఉందని పేర్కొన్నారు. వాస్తవంగా జరిగిన ఘటన తాలూకు అసలు వీడియోలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కోర్టు ముందుంచుతామని తెలిపారు. అంతేకాక అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో తప్ప 2014 నుంచి 144 సెక్షన్ అమలు చేస్తూనే ఉన్నామన్నారు. వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తగిన వ్యవధినివ్వాలని హైకోర్టును శ్రీరామ్ కోరారు. స్పందించిన హైకోర్టు.. విచారణను 20కి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు హైకోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చింది. ఏ మహిళను కూడా సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫొటోల ఆధారంగా సుమోటో వ్యాజ్యం 144 సెక్షన్ విధించడమే కాకుండా, అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని, ఫొటోలను హైకోర్టు తనంతట తాను (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్) పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యానికి సదరు పత్రికలో ప్రచురితమైన ఫొటోలను, ఇతర ఫొటోలను హైకోర్టు జత చేసింది. అలాగే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధింపును సవాలు చేస్తూ పలువురు వేర్వేరుగా 8 పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఓ ప్రాథమిక కౌంటర్‌ను ధర్మాసనం ముందుంచారు. నిరసనకారులను కొడుతున్నట్లున్న ప్రచురితమైన ఫొటోలు మార్ఫింగ్ చేసినవని వివరించారు. రక్తం కారుతూ ఉన్న ఆ మహిళ ఫొటో బీహార్‌లోని భాగల్పూర్లో గతంలో జరిగిన ఓ ఘటనలో గాయపడ్డ మహిళ అని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2017లో ఘటనలకు సంబంధించి ఫేస్బుక్లో వచ్చిన ఫొటోలను ఇక్కడి అమరావతి ఆందోళనలతో ముడిపెట్టారని తెలిపారు. వాస్తవానికి అటువంటి ఘటనలేవీ ఇక్కడ జరగలేదన్నారు. మార్ఫింగ్ ఫొటోలను ప్రచురించడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. కోర్టు సైతం ఆ ఫొటోల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని, ఘటన పూర్తి క్రమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... నిరసనకారులు సైతం కొంత నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. -
5,000 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రాలకు(సబ్ సెంటర్లు) కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 5,000 ఉపకేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. ఇందులో 90 శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నప్పటికీ పదేళ్లుగా సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. ఈ నేపథ్యంలో 5,000 సబ్‌సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించాలని, అందులో ఏఎన్ఎంలు, మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో భవనాన్ని రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.1,150 కోట్ల వ్యయం కానుంది. ఒక్కో సబ్‌సెంటర్‌ను 5 సెంట్ల నుంచి 10 సెంట్లలో నిర్మిస్తారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని, మొత్తం 13 ప్యాకేజీలుగా విభజించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే 70 శాతం కేంద్రాలకు స్థలాల సేకరణను పూర్తిచేశారు. కొత్తగా చేపట్టబోయే సబ్‌సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్, ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చనున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆరోగ్య ఉపకేంద్రంలో అందించే సేవలు - ఇక్కడ 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. - సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను పరీక్షల కోసం ఆస్పత్రులకు తీసుకొస్తారు. - ఆశా వర్కర్ల సాయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్యసేవలు అందిస్తారు. - పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు డాక్టర్ల సూచనల మేరకు ఐరన్ ఫోలిక్ మాత్రలు, విటమిన్ మాత్రలు అందజేస్తారు. - శిశువులు, బాలలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. - క్షయ, కుష్టు వ్యాధిగ్రస్థులకు డాక్టర్ల సూచనల మేరకు మందులు ఇస్తారు. - గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తారు. - పల్స్‌పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. - సబ్‌సెంటర్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు పంపిణీ చేస్తారు. -
‘పోలవరం’పై నివేదిక ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిపై ఫొటోలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ముప్పు ఉందని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు, ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ కట్పాలియా వాదనలు వినిపించగా.. జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని ‘ప్రాజెక్టు నిర్మాణంపై మీరు స్టే అడుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ‘పనుల నిలిపివేత’ ఉత్తర్వులు అమల్లో ఉండగా.. ఏటా దీనిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తోందని కట్పాలియా నివేదించారు. బచావత్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాలని, కానీ 50 లక్షల ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం సాగుతోందని, దీనిపైనే తమ అభ్యంతరమని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. పోలవరం నిర్మాణంపై మాకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉంటుందని నివేదించారు. పదే పదే ఎందుకు అభ్యర్థించాల్సి వస్తోంది? ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం వైఖరేమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం అనుమతుల మేరకు, బచావత్ అవార్డు ప్రకారమే నిర్మాణం జరుగుతోందని ఖాద్రీ వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ప్రాజెక్టు బచావత్ అవార్డుకు లోబడి ఉన్నప్పుడు పదేపదే స్టాప్ వర్క్ ఆర్డర్‌ను పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అది పర్యావరణ విభాగానికి చెందినదని ఖాద్రీ వివరించబోగా.. ఒక్కో శాఖకు ఒక్కో న్యాయవాది వస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒడిశా, తెలంగాణ వాదనలపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి’ అని సూచించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
కోడి పందేల చరిత్రలో ఈ పరిస్థితి ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గతంలో కోడిపందేల బరుల వద్దే అనధికారంగా ఏర్పాటుచేసే షాపుల్లో మద్యం ఏరులై పారేది. దీంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి కూడా పెద్దఎత్తున సాగేవి. కానీ, గతానికి కన్నా భిన్నంగా ఈ ఏడాది పందేలు జరిగే ప్రతిచోటా మద్యం అమ్మకాలు, జూదం నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వైర్లెస్ మెసేజ్‌లు పంపించారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ సోమవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వైర్లెస్ కాన్ఫరెన్స్‌లోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరి ప్రాంతంలోనైనా మద్యం అమ్మకాలు, పేకాటలు జరిగితే అక్కడి పోలీసులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పంతం నెగ్గించుకున్న పోలీసులు కోడి పందేల చరిత్రలో తొలిసారిగా పోలీసులు భోగి రోజున ఒక పూట అయినా వాటిని అడ్డుకుని రికార్డు సృష్టించారు. ఏటా పోలీసులు హడావుడి చేయడం.. చివరికి భోగి రోజు ఉదయమే పందేలు మొదలు కావడం ఎప్పుడూ జరిగే తంతే. అయితే, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కొంతమేర వాటిని నిలువరించగలిగారు. భీమవరం, ఎదుర్లంక, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత పందేలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. కోడి పందేలు, పేకాట కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అతిథులు పోలీసు ఆంక్షల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు భీమవరం, తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమయ్యారు. ఆలస్యంగా.. అరకొరగా కోడిపందేలు మరోవైపు.. పోలీసు ఆంక్షల నడుమ తొలిరోజున పందెం కోళ్లు ఆలస్యంగా ఎగిరాయి. కోడి పందేలు జరుగుతాయో లేదోనని భోగి రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే.. పందేలను అడ్డుకుంటామంటూ పోలీసులు బరుల వద్ద పికెట్లు ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కోడి పందేల నిర్వాహకులు, కత్తులు కట్టే వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇది ఎప్పుడూ ఉండే తంతే అనుకున్న నిర్వాహకులు చివరకు భోగి రోజున కోడి పందేలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆయా బరుల వద్ద పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బరుల వద్ద పందేలు ప్రారంభించుకోవడానికి నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పలేదు. అనుమతి కోసం వారు పడిగాపులు కాసారు. చివరికి మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఒంటి గంట నుంచి మూడు గంటలలోపు అరకొరగానే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి రోజు పందేల రాయుళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీ ఉ.11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉ.10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. హెడ్ వర్క్స్.. ఎడమ కాలువ, కుడి కాలువ, కనెక్టివిటీల(అనుసంధానాలు) పనులతోపాటు నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. తద్వారా అనుకున్న సమయానికి.. అంటే 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావిస్తోంది. పోలవరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. ప్రాజెక్టు ఫలాలను 2021 నాటికి రైతులకు అందించాల్సిందేనని జనవరి 7న నిర్వహించిన సమీక్షలో జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘బిల్ డిస్కౌంట్’ విధానంలో చెల్లింపు ఒక్క పోలవరం ప్రాజెక్టుకే నెలకు సగటున రూ.1,100 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ స్థాయిలో నిధులు సమకూర్చడం కొంత కష్టతరమవుతుంది. అందుకే సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు చేసి, కాంట్రాక్టర్లకు ‘బిల్ డిస్కౌంట్’ విధానంలో బిల్లులు చెల్లించడం ద్వారా నిధుల కొరత ఎదురుకాకుండా చూసేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంలో.. కాంట్రాక్టర్లు బీజీ(బ్యాంకు గ్యారంటీ), ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్), పెర్ఫార్మెన్స్ గ్యారంటీ(పీజీ), రిటెన్షన్ అమౌంట్(ఆర్ఏ) రూపంలో బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి గ్యారంటీలను సమర్పిస్తారు. ఈ గ్యారంటీలకు సమానమైన నిధులను సంబంధిత బ్యాంకులో కాంట్రాక్టర్లు డిపాజిట్ చేయాలి లేదా అంతే విలువైన ఆస్తులను తనఖా పెట్టాలి. వాటిపై నిబంధనల మేరకు బ్యాంకు సంబంధిత కాంట్రాక్టర్‌కు వడ్డీ చెల్లిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రతినెలా చేసిన పనుల మేరకు చెల్లించాల్సిన బిల్లులను.. ఆయా కాంట్రాక్టర్లు గ్యారంటీ ఇచ్చిన బ్యాంకులకు ప్రాజెక్టు అధికారులు పంపిస్తారు. వాటిని కాంట్రాక్టర్లకు చెల్లించాలని ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఆ మేరకు బ్యాంకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాయి. బ్యాంకులు చెల్లించిన ఈ సొమ్మును 90 రోజుల్లోగా ప్రభుత్వం రీయింబర్స్ చేయాలి. గడువు దాటితే బ్యాంకు వడ్డీ వసూలు చేస్తుంది. జలయజ్ఞం ప్రాజెక్టుల పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘బిల్ డిస్కౌంట్’ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని జలవనరులశాఖ భావిస్తోంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.38,548.87 కోట్లు అవసరం విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి. కానీ, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే, ఆ తర్వాత వాటిని కేంద్రం రీయింబర్స్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పటిదాకా దాదాపు రూ.17 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో రూ.3,650 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. 2021 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటే రూ.38,548.87 కోట్లు అవసరం. -
ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి 2.68 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 2.68 లక్షల క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని ఇప్పటికే దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 60 కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి పరిధిలో రేషన్ సరుకుల సరఫరా కోసం అవసరమైన వాహనాలను వలంటీర్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటింటికీ సరుకుల పంపిణీ ప్రక్రియ ఆర్థిక భారంతో కూడుకున్నప్పటికీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వలంటీర్లు తమకు కేటాయించిన రేషన్ కార్డులను మ్యాపింగ్ చేసుకోవాలి. రహదారి సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనుల ఇళ్లకు సైతం వెళ్లి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల లబ్ధిదారులు సబ్సిడీ సరుకులు సక్రమంగా తీసుకునేవారు కాదు. రేషన్ దుకాణాలకు రావడానికి సరైన రహదారులు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి నెలా ఒకటి లేదా రెండో తారీఖుల్లో గిరిజనుల ఇళ్ల వద్దే బియ్యంతో పాటు ఇతర సరుకులు అందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు అమ్మఒడి పథకం ప్రారంభించనున్న సీఎం
-
అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీనిస్తూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి నేటికి ఏడాది. ఆ ప్రజా సంకల్పయాత్రలో తల్లులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సరిగ్గా అదే రోజున.. నేడు అమ్మఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ‘జగనన్న అమ్మఒడి’ని గురువారం చిత్తూరు నగరంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, బడిబయట ఏ ఒక్క చిన్నారి ఉండకూడదనే గొప్ప లక్ష్యంతో.. పిలల్ని బడికి పంపే ప్రతి పేదతల్లికి అమ్మఒడి పథకంలో ఏటా రూ.15 వేల చొప్పున చేయూతనందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి కార్యరూపమిస్తూ.. పిల్లల్ని బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడిలో లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఎక్కడ చదివించినా పథకం వర్తింపు అమ్మఒడి పథకంలో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్లో ఏడాదికి రూ.15 వేలు నేరుగా జమచేస్తారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. అనంతరం ఇంటర్ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా ఫరవాలేదని.. పేద పిల్లల చదువుకు ఖర్చుచేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్న మాటల్ని చేతల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా ఆ తల్లికి సాయం అందేలా పథకం అమలు చేస్తున్నారు. జాబితాలో పేరు లేకపోయినా.. అర్హులైతే లబ్ధి జాబితాలో తల్లులు/సంరక్షకుల పేర్లు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. ఎవరైనా సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందచేయకపోతే.. వారు ఆ పత్రాల్ని గ్రామ/వార్డు సచివాలయాలు, మండల విద్యాధికారుల దృష్టికి తీసుకెళితే.. వాటిని పరిశీలించి అర్హులైతే లబ్ధిదారులుగా గుర్తిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. నెరవేరుతున్న అమ్మఒడి ప్రయోజనం ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదును జమచేస్తారు. ఈ పథకం అమలుతో బడి బయట పిల్లల సంఖ్య భారీగా తగ్గింది. ఆర్థిక సమస్యలతో పిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడనుంది. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. ప్రతి స్కూల్లో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమాలు గురువారం ఉదయం 11.15 గంటలకు చిత్తూరులోని పీవీకేఎస్ గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి సీఎం చేరుకుని విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. అనంతరం స్థానికంగా అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.45 గంటలకు అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. గురువారం అర్హులైన తల్లులు/సంరక్షకులతో పాటు.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి. సీఎం ప్రారంభించే అమ్మఒడి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి. మాలాంటి వారికి అభయం.. అమ్మఒడి వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఈ ఫోటోలోని మహిళ పేరు వెంకటమ్మ. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు స్వగ్రామం.. ఐదేళ్ల క్రితం భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేంది. విధివశాత్తూ 7 నెలల క్రితం కూలికి వెళ్లొస్తూ ప్రమాదానికి గురైంది. కాలు విరగడంతో ఇప్పటికీ నడవలేని పరిస్థితి. ఆమె ఇద్దరు కుమారుల్లో సురేష్ 5 వ తరగతి, భాస్కర్ 4వ తరగతి చదివేవాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు బడి మానేసి పనిలో చేరదామనుకుంటున్న తరుణంలో అమ్మఒడి పథకం అభయంగా మారింది. అమ్మఒడి పుణ్యాన వారిద్దరూ ఇప్పుడు స్కూలుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమలాంటి నిరుపేద కుటుంబాల పిల్లల చదువుకు భరోసా అని వెంకటమ్మ ఆనందంతో చెబుతోంది. ఆసరా దొరికింది ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన వక్కలంక బుల్లియ్య, మేరీలు దంపతులు.. మేరీ క్యాన్సర్‌తో మరణించగా.. బుల్లియ్య అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వారిద్దరి పిల్లలు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. ఒకరు స్థానికంగా చదువుతుండగా.. మరొకరు రాజమహేంద్రవరంలోని ఒక స్వచ్ఛంద సంస్థ హాస్టల్లో చదువుతున్నాడు. ఇప్పడు అమ్మఒడి పథకం ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అమ్మఒడి పథకంలో రూ.15వేలు ఆర్థికసాయం రానుండడంతో.. ఇద్దరు పిల్లలను బాగా చదివించేందుకు ఆసరా దొరికిందని అమ్మమ్మ వంగా రాజేశ్వరి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ ఇద్దరు పిల్లలు చదువుకు దూరమవుతారని భయపడ్డానని.. అమ్మఒడి పథకం ఆసరాగా నిలిచిందని ఆమె అంటోంది. -
గొంతు కోస్తోంది!
సాక్షి, గుంటూరు: సంప్రదాయ క్రీడలకు ప్రతీక అయిన సంక్రాంతి సమయంలో ఏటా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. గతంలో గాలిపటాలను ఎగురవేసేందుకు నూలుతో తయారైన దారం (మాంజా) ఉపయోగించేవారు. దీనివల్ల ఎవరికీ.. ఎలాంటి గాయాలయ్యేవి కావు. ఇప్పుడు వీటి స్థానంలో రసాయనాలతో కూడిన చైనా మాంజా వాడకంతో తీవ్ర గాయాల పాలవుతున్న పాదచారులు, వాహన చోదకుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే చైనా మాంజాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించినా మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. కౌశిక్ మృతదేహం (ఫైల్) యథేచ్ఛగా విక్రయాలు చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తోంది. ఇతర గాలిపటాలను చైనా మాంజాతో సులువుగా తెంపవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీనిపట్ల మొగ్గు చూపుతున్నారు. గాలి పటాలు ఎగిరే సమయంలో ఈ మాంజా విద్యుత్ తీగలు, వృక్షాలకు చిక్కుకుని పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వీటి మనుగడకు పెనుముప్పుగా మారిన చైనా మాంజా వినియోగాన్ని పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలిపటాలను నియంత్రించే క్రమంలో ఒక్కోసారి ఎగురవేసే వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు. - గుంటూరులో సోమవారం తండ్రితో కలసి బైక్‌పై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. - గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో చైనా మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్ శర్మ (28) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. - 2018లో చైనా మాంజా కారణంగా గుజరాత్లో 16 మంది మరణించడంతో కైట్ ఫెస్టివల్‌తో పాటు ఈ మాంజా వాడకాన్ని నిషేధించారు. చట్టం ఏం చెబుతోందంటే.. రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. 2016 మార్చి 4న ఏపీ ప్రభుత్వం, 2016 జనవరిæ 13న తెలంగాణ సర్కారు వీటి విక్రయాలను నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను అమ్మటం, కొనుగోలు చేయడం నేరం. దీన్ని ఉల్లంఘించే వారికి ఐదేళ్లు, అంతకుమించి జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. చైనా మాంజా తయారీ ఇలా.. దారానికి గాజు పిండి, సగ్గు బియ్యం, గంధకం, రంగులు అద్ది ఉడికించి చైనా మాంజా తయారు చేస్తారు. తమిళనాడులోని ఆరంబాకం, చెన్నైలోని ప్యారిస్, మౌంట్‌రోడ్డు మొదలైన ప్రాంతాల్లో చైనా మాంజా ఎక్కువగా తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు సరఫరా అవుతుంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, గుంటూరు నగరంలోని పట్నంబజార్, లాలాపేటలో కూడా చైనా మంజా తయారు చేస్తారు. రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో కుటీర పరిశ్రమగా చైనా మాంజా తయారీ నడుస్తోంది. మనుగడకు ముప్పు చైనా మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు, జంతువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతోంది. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నూలు దారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవు –తేజోవంత్, కార్యదర్శి, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ ప్రజల్లో చైతన్యం రావాలి ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజాను ఎవరూ వినియోగించకూడదు. జీవోలకే పరిమితం అయిన నిషే«ధాన్ని ప్రభుత్వాలు అమలు చేసి చూపించాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. చైనా మాంజాను స్వచ్ఛందంగా నిరాకరించాలి – గోపాల్ సూరాబత్తుల, వ్యవస్థాపక కార్యదర్శి, యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఇక కఠిన చర్యలు చైనా మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై ఎవరైనా దీన్ని కొనుగోలు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులను సైతం అప్రమత్తం చేస్తాం. చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం – ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, కలెక్టర్, గుంటూరు -
ఏపీకి గొప్ప వరం ఆరోగ్యశ్రీ
సాక్షి అమరావతి: ‘పేదలు, సామాన్యులకు ఉచితంగా.. అన్ని వైద్య సేవలు అందించాలంటే గొప్ప సంకల్పం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్పులతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఆ గొప్ప సంకల్పం నాకు కనిపిస్తోంది. అన్ని ఖరీదైన చికిత్సలతో పాటు డెంగీ, మలేరియా వంటి జ్వరాలను ఈ పథకంలో చేర్చడం రాష్ట్ర ప్రజలకు గొప్ప వరంగా భావించాలి. ఇలాంటి పథకం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేందుకు ఆరోగ్యశ్రీ పథకమే ఉదాహరణ’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, యూపీఏ ప్రభుత్వంలో ఆరోగ్య సలహాదారుగా పనిచేసిన డా.కె.శ్రీనాథరెడ్డి.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా కూడా ఉన్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులపై మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సల్ హెల్త్ కవరేజీ పేరిట అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గొప్ప పథకం. ప్రస్తుత వ్యాధుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే.. ఈ పథకంతో చేకూరే లబ్ధి వల్ల అన్ని రకాల వైద్య సేవలు సామాన్యులందరికీ చేరువైనట్లే భావించాలి. పకడ్బందీగా అమలు చేస్తే పేదవారి జేబునుంచి ఏమీ ఖర్చు కాదు. ఖరీదైన చికిత్స అవసరమయ్యే వ్యాధులను ఈ పథకంలో చేర్చారు. అంత భారీ వ్యయం చేయడం సాధ్యమేనా? క్యాన్సర్, న్యూరో, గుండెజబ్బులతో పాటు వందలాది జబ్బులు జాబితాలో ఉన్నాయి. వీటికి చాలా వ్యయమవుతుంది. సామాన్యులకు వచ్చే వ్యాధులకు ఉచితంగా వైద్యమందించాలనే దృక్పథంతోనే ఈ జబ్బుల్ని చేర్చారు. భారమైనా ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే. ఆరోగ్యశ్రీలో నిబంధనల్ని సరళతరం చేశారు. ఈ మార్పులతో సామాన్యులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ప్రమాదకర రోగాల చికిత్స కోసం పేదలు డబ్బు ఖర్చు పెట్టలేక మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పథకం అందుబాటులో ఉండి, సకాలంలో వైద్యమందితే లక్షలాది మందికి ప్రాణదానం చేసినట్లే.. రూ.1000 దాటితే రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు. దీని సాధ్యాసాధ్యాల గురించి ఏమంటారు? కచ్చితంగా సాధ్యమే. 2,059 జబ్బుల పరిధిలో బిల్లు రూ. వెయ్యి దాటితే చికిత్స అందిస్తున్నారు. ఇందులో 170 వరకూ డే కేర్ జబ్బుల్ని చేర్చారు. మొదట కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే మిగతా జిల్లాల్లో అమలు చేసే సమయానికి అంతా సర్దుకుంటుంది. డెంగీ, మలేరియా వంటి జ్వరాలనూ పథకం పరిధిలో చేర్చారు. ఈ కొత్త సౌలభ్యం సామాన్యులకు ఎంతవరకూ ఉపయోగపడుతుంది.? ఇటీవలి డెంగీ వంటి జ్వరాలు సోకినప్పుడు సామాన్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లేట్లెట్స్ కోసం బాగా ఖర్చవుతుంది. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల వల్ల కూడా వేలకు వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. పైగా ఇలా జ్వరాల బారిన పడుతున్న వారు వేలల్లో ఉంటారు. కొన్ని జ్వరాలను ఈ పథకంలో చేర్చడం వల్ల అలాంటి వారికి లబ్ధి చేకూరుతుంది. మీరు ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య బీమా పథకాలు చూసుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీపై ఒక ప్రముఖ వైద్యుడిగా మీ అభిప్రాయం? సామాన్యులకు వైద్యబీమా కల్పించి అమలు చేయడంలో దేశంలో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగలను. నాకు తెలిసినంత వరకూ మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి వైద్యబీమా పథకాన్ని చూడలేదు. నిధుల వ్యయం ఒక్కటే కాదు, అమలు చేయాలంటే ప్రభుత్వాలకు గొప్ప సంకల్పం ఉండాలి. రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయం చేయడంపై మీ అభిప్రాయం? నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఇలా ఆర్థిక సాయం చేయడం చూడలేదు. కుటుంబ ప్రధాన పోషకుడు జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడమంటే సాహసోపేత నిర్ణయం. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది కాదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం ఎంత వరకూ ప్రయోజనకరం? కొన్ని చికిత్సలకు కొన్ని ప్రాంతాల్లో వైద్యం చేసే అవకాశం ఉండకపోవచ్చు. రోగులకు న్యాయం జరగాలంటే ఎక్కడ వైద్యం ఉంటుందో అక్కడ చేయించాలి. ఏపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వైద్యానికి అనుమతించడం గొప్ప పరిణామం. -
రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారం
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని, ఈ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు కలిగిస్తున్న అపోహలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం విజయవాడలో కన్నా ఆవిష్కరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ఎటువంటి జోక్యం చేసుకోదని, ఇది బీజేపీ తరఫున అధికారికంగా చేస్తున్న ప్రకటన అని జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. ‘నేనూ దానికి తేడాగా చెప్పడం లేదు కదా?’ అని కన్నా ప్రశ్నించారు. మీడియానే భిన్నంగా అర్థం చేసుకుందన్నారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, ఇప్పుడు దాన్ని మార్చే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. -
నివాస స్థలాలను స్వయంగా పరిశీలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నివాస స్థలాల పంపిణీ కోసం ప్రతిపాదించిన ప్రతి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టు మనం ఇళ్ల స్థలాలను అసైన్మెంట్ పట్టాల రూపంలో ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరఫున జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన భూముల్లో కంపచెట్ల తొలగింపు, చదును చేయడం, సరిహద్దుల నిర్ధారణ పనులను వచ్చే వారంలో చేపట్టాలని సూచించారు. తాము పంపిన నమూనాలో భూముల సమాచారాన్ని సోమవారం సాయంత్రంలోగా వాట్సాప్ నంబరు 9013133636కు గానీ, మెయిల్‌కు గానీ పంపించాలని పేర్కొన్నారు. దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం ‘‘ఇళ్ల పట్టాలు పొందిన వారు ఆ స్థలాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రుణాలు తీసుకునేందుకు వీలుగా లబ్ధిదారులందరికీ కన్వెయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తర్వాత వీటిపై విక్రయ హక్కులు కూడా కల్పిస్తోంది’’ అని ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న నివాస స్థలాల పంపిణీ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు సైతం మార్గదర్శకం అవుతుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రవీణ్ ప్రకాశ్ పంపిన సర్క్యులర్‌లోని ముఖ్యమైన అంశాలు.. - కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/సబ్ కలెక్టర్లు/ ఆర్డీఓలు వెళ్లి పరిశీలించనిదే ఆయా భూములు నివాస స్థలాలకు పనికొస్తాయా? లేదా అన్నది నిర్ధారించలేరు. కాబట్టి నివాస స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదించే ప్రతి భూమిని ఉన్నతాధికారులు తప్పకుండా పరిశీలించాలి. - నివాస స్థలాలకు ప్రతిపాదించే భూములకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కచ్చితంగా వచ్చే వారంలో అమలు చేయాలి. ప్రతి మండలంలో క్రమబద్ధంగా భూముల జాబితాను రూపొందించాలి. విభాగాల వారీగా భూముల జాబితాను రూపొందిస్తేనే ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకుని, పరిష్కరించడానికి వీలవుతుంది. ఈ విభాగాలకు సంబంధించిన భూములన్నింటినీ నివాస స్థలాల కోసం వినియోగించుకుంటాం. విభాగాల వారీగా భూముల జాబితా ఎలా ఉండాలంటే... - సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని అప్పీళ్ల కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - వివిధ ప్రభుత్వ విభాగాల అధీనంలో ఉన్న వినియోగించని భూములు - ఇతరత్రా ప్రభుత్వ భూములు -
చదువుకు భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈమె పేరు ఎం. స్వాతి. భర్త.. నాయుడు. వీరికి ఒక పాప, ఒక బాబు. కూలి పని ఉంటే ఆదాయం, లేకపోతే పస్తులు అన్నట్లుగా సాగే వీరికి పిల్లలను ప్రైవేటు–కార్పొరేట్ స్కూళ్లలో చదివించడం భారంగా మారింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. కొద్దిపాటి ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉన్నా నోటు పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామగ్రి కొనుగోలు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న అమ్మ ఒడి పథకం వీరికి ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రాష్ట్రంలోని లక్షలాది నిరుపేద తల్లులకు కొండంత అండగా నిలుస్తోంది. పేద పిల్లల చదువులపై భరోసా కల్పిస్తోంది. పిల్లల చదువులపై ఆందోళనతో ఉన్న మాతృమూర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తోంది. దీంతో ప్రతి పేద తల్లి తన పిల్లలను పనికి కాకుండా బడికి పంపి వారికి బంగారు భవిత కల్పించేందుకు అడుగులు వేస్తోంది. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా.. దేశంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హురాలైన ప్రతి తల్లికీ ఈ పథకం వర్తించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా.. ‘నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను’ అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. నవరత్నాలలోని మరో కీలక హామీ ‘అమ్మ ఒడి’ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. దీనివల్ల డ్రాపౌట్లు తగ్గడంతోపాటు పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు అభివృద్ధి సాధించగలుగుతాయన్నది పథకం లక్ష్యం. రూ.6,455.80 కోట్లు మంజూరు ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6455.80 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో ఇప్పటివరకూ 42,80,823 మంది తల్లులను సర్కారు గుర్తించింది. ఒకొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయనుంది. మలివిడత పరిశీలన కొనసాగుతున్నందున ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. 43 లక్షల మందికి పైగా తల్లులకు దీని ద్వారా మేలు చేకూరనుంది. ఈ పథకం ద్వారా 81,72,224 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు అమలుచేయాలని ముందు భావించినా తరువాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లులకూ ప్రభుత్వం వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది. అన్ని ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. 1 నుంచి 10 వరకు 72,77,387 మంది, ఇంటర్మీడియట్లో 8,94,837 మంది విద్యార్ధులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో.. సర్కారు అందిస్తున్న సాయంతో పేద తల్లులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జగనన్నకు రుణపడి ఉంటాం నాకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నాను. సీఎం జగనన్న పెట్టిన అమ్మ ఒడి పథకం మాలాంటి వారికి ఎంతో అండగా నిలుస్తుంది. ఆ పథకం సాయంతో మా పిల్లలను బాగా చదివించుకుంటాను. వారి మంచి భవిష్యత్తుకు ఈ పథకం ఓ మంచి మార్గం. జగనన్నకు మేం రుణపడి ఉంటాం. – సుహాసిని, గంగులయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం, వైఎస్సార్ జిల్లా పిల్లల ఫీజులకు ఇక బెంగ ఉండదు నా పేరు ఆదిమూలం సుజాత. నాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటుంది. కుమారుడు ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి. అమ్మ ఒడి ద్వారా జగనన్న ఇచ్చే రూ.15 వేలతో పిల్లోడి ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. ఆ భారం ఇక మాపై ఉండదు. వాడి చదువు గురించి డబ్బు బెంగ నాకు ఉండదు. – ఆదిమూలం సుజాత, శివాలపల్లె, చెన్నూరు మండలం, వైఎస్సార్ జిల్లా అమ్మఒడి ఎంతో ధైర్యాన్నిచ్చింది చదువుకోవాలనే కోరిక ఉన్నా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులవల్ల చదువుకు దూరమయ్యాం. మా అమ్మాయికి ఆ పరిస్థితి రాకుండా భార్యాభర్తలిద్దరం కష్టపడుతున్నాం. మాలాంటోళ్లకు జగనన్న అమ్మ ఒడి పథకం ఎంతో ధైర్యాన్నిచ్చింది. ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. దీంతో అమ్మాయిని బాగా చదివించుకుంటాం. – వాగు సుప్రియ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా పిల్లల చదువులకు ఊతం పేదరికం వల్ల మాకు చదువులంటే తెలియదు. మా బిడ్డలనైనా బాగా చదివించుకోవాలనే తపన ఉంది. కానీ, ఆర్థిక స్థోమతలేక అవస్థలు పడుతున్నాం. భార్యాభర్తలిద్దరం రైతుబజార్లో కూరగాయాలు అమ్ముతుంటాం. జగనన్న ప్రవేశపెడుతున్న అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల సాయం మాకు ఎంతో ఊతమిస్తోంది. – ఒడుగు నారాయణమ్మ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా ‘అమ్మఒడి’ మాలాంటి వారికి వరం నా భర్త కాటూరి లక్ష్మణరావు. మాకు ఇద్దరు మగపిల్లలు. నేను, నా భర్త కూలి పనిచేసుకుంటూ పిల్లలను చదివించుకోడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా ఇచ్చినా ఇతర ఖర్చులకు డబ్బులు సరిపోయి కావు. ఏడాది క్రితం మా ఆయన మాకు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో పిల్లలను చదువు మాన్పిద్దామనుకున్నా. అమ్మ ఒడి పథకంతో ధైర్యం వచ్చి ఆ ఆలోచన విరమించుకున్నా. – కాటూరి నాగమణి, కొండెవరం శివారు జోగిరాజుపేట, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా ఎంతో భారం తగ్గించినట్లయింది నా భర్త నాని. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు. చదువులేకే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మాలా మా పిల్లలు కావొద్దు. పెద్ద చదువులు చదివించాలన్న ఆశ ఉంది. కానీ, అంత ఆదాయం మాకు లేదనేదే ఆవేదన వెంటాడుతోంది. ఈ తరుణంలో అమ్మఒడి పథకం మాకు ఎంతో భారాన్ని తగ్గించినట్లయ్యింది. – ద్రాక్షారపు చిన్నారి, వాకతిప్ప, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా కొండంత ధైర్యం ఇచ్చింది నా భర్త గురుమూర్తి అనారోగ్యంతో మరణించాడు. నా కుమార్తెలు సౌమ్య ఒకటో తరగతి, అంజలి రెండో తరగతి చదువుతున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లల్ని చదివించడం కష్టంగా మారుతోంది. జగనన్న అమ్మ ఒడి పథకంతో నా పిల్లలిద్దర్నీ చదివించుకోవడానికి వీలుపడింది. ఎటువంటి ఆధారంలేని నాకు ఈ పథకం కొండంత ధైర్యమిచ్చింది. – సీర నాగమణి, గోకర్ణాపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా నా భర్త ముద్దుక్రిష్ణ ఇటీవల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలతో జీవితం కష్టంగా మారింది. పెద్ద కుమారుడు మూడో తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు వాసుదేవ్ అంగన్వాడీ కేంద్రంలో చేర్చా. ఎటువంటి ఆధారంలేని నేను జగనన్న అమ్మ ఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నా. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా. – రుషవ విమల, కంచిలి, శ్రీకాకుళం జిల్లా పిల్లల చదువులకు వెసులుబాటు నా భర్త నాగరాజు దూర ప్రాంతంలో కూలిపనులు చేస్తూ పంపే డబ్బులతోనే కుటుంబం నెట్టుకొస్తున్నా. మాకు ముగ్గురు పిల్లలు. కంచిలి పాఠశాలలోనే మధ్యాహ్న భోజన పథకం వంట పనిచేస్తున్నాను. ఇద్దరు పిల్లలు 5, 6 తరగతులు చదువుతున్నారు. కుటుంబం పోషణ కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అమ్మ ఒడి పథకంతో పిల్లల చదువులకు కొంత వెసులుబాటు కలుగుతుంది. – బంగారు లక్ష్మి, కంచిలి, శ్రీకాకుళం జిల్లా అమ్మ ఒడితో కష్టాలు గట్టెక్కొచ్చు ఇంట్లో అందరూ పనిచేస్తేగాని ఇల్లు గడవని పరిస్థితి. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, డ్రెస్‌లు ఉచితంగా ఇస్తున్నా ఇతర ఖర్చులు భరించలేక పోతున్నాం. అందుకే పిల్లలు పై తరగతులకు వచ్చేసరికి బడిమాన్పించాల్సి వస్తోంది. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకంతో ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. – గూడుపు లక్ష్మి, విజయనగరం పిల్లల్ని నిశ్చింతగా చదివించుకోవచ్చు మా ఆయన ఆటోడ్రైవర్. అందరం ఏదో ఒక పనిచేస్తున్నాం. మా అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. పై క్లాసులకు వచ్చిన మా పిల్లని ఈ ఏడాది చదువు మాన్పించాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం సాయం చేస్తోందని తెలిసి ధైర్యం వచ్చింది. ఇక నిశ్చంతగా పిల్లల్ని చదవించుకోవచ్చన్న భరోసా కలిగింది. – కప్పరెడ్డి సంతోషి,. విజయనగరం కంటోన్మెంట్ -
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
-
తగ్గిన మందు.. చిందు!
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఈసారి నూతన సంవత్సర వేడుకల్లో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. గతేడాది కొత్త సంవత్సర సంబరాలతో పోలిస్తే ఈదఫా 72,243 మద్యం కేసులు తక్కువగా అమ్ముడు కావడం గమనార్హం. గతేడాది 2,05,087 మద్యం కేసులు విక్రయించగా ఈసారి 1,32,844 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక బీర్ల వినియోగం సైతం అమాంతం తగ్గింది. గత ఏడాది వేడుకల్లో 1,45,519 బీరు కేసుల వినియోగం జరగ్గా ఈసారి వేడుకల్లో కేవలం 50,995 బీరు కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది కంటే 94,524 బీరు కేసుల వినియోగం తగ్గింది. సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు ఇక విక్రయాల విషయానికొస్తే గతేడాది నూతన సంవత్సర వేడుకల్లో రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగ్గా ఈదఫా రూ.105 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అమ్మకాలు రూ.15 కోట్లు మాత్రమే తగ్గగా వినియోగం భారీగా తగ్గడం గమనార్హం. మద్యం ధరలను పెంచడంతో రూ.105 కోట్ల అమ్మకాలు కనిపిస్తున్నా వినియోగంలో మాత్రం వ్యత్యాసం ఉండటంతో దశలవారీ మద్య నిషేధానికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అవగతమవుతోంది. ప్రజారోగ్యానికే పెద్దపీట మద్యం అమ్మకాల్ని సాధారణ రోజుల్లో ఎలా చేపడుతున్నారో ఈసారి డిసెంబరు 31న కూడా అదే విధానాన్ని అమలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి 1 గంట వరకు విక్రయాలు నిర్వహించి మందుబాబులతో పూటుగా తాగించి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా డిసెంబరు 31, జనవరి 1న రెండు రోజుల్లో కలిపి రూ.200 కోట్ల మద్యం ఆదాయం రాగా ఇప్పుడు 2 రోజుల్లోనూ రూ.125 కోట్లు దాటకపోవడం గమనార్హం. ఈసారి జనవరి 1న రూ.19.78 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రజలంతా కుటుంబాలతో కలసి కొత్త ఏడాది రోజు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్యాన్ని దూరం చేసింది. కృష్ణాలో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం కొత్త ఏడాది సందర్భంగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా మద్యం విక్రయించగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా విక్రయాలు నమోదయ్యాయి. కృష్ణాలో రూ.17.42 కోట్ల విలువైన మద్యం తాగగా కర్నూలులో అత్యల్పంగా రూ.3.12 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇక వినియోగం పరంగా చూస్తే గత ఏడాది వేడుకల్లో కృష్ణా జిల్లాలో 21,213 కేసుల మద్యం, 13,012 కేసుల బీరు అమ్ముడు కాగా ఈదఫా 19,553 కేసుల మద్యం, 5,824 కేసులు మాత్రమే బీరు వినియోగం నమోదైంది. -
నేటి అర్ధరాత్రికల్లా.. ‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు బుధవారం అర్ధరాత్రికల్లా ఖరారు కానున్నాయి. పంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున మొత్తం 59.85 శాతం స్థానాలను ఆయా సామాజికవర్గాలకు రిజర్వ్ చేస్తూ వారం రోజుల క్రితం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. జిల్లా, మండలాల వారీగా సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులతో పాటు ఎంపీపీ పదవులను ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై జిల్లాలో సోమవారం నుంచే కసరత్తు మొదలైంది. రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచి ఎన్నికల కన్నా ముందు పార్టీ గుర్తు ప్రతిపాదికన జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆసక్తిగా ఉండడంతో పంచాయతీరాజ్ శాఖాధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టారు. రిజర్వుడ్ స్థానాలను ఏ ప్రతిపాదికన ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాల్లో కలెక్టరు కార్యాలయ సిబ్బందితోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులందరూ రెండు రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాల వారీగా బుధవారంకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులంటున్నారు. 3న హైకోర్టుకు అందజేత ఇదిలా ఉంటే.. రిజర్వేషన్ల వివరాలను జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అందజేయనుంది. అన్ని జిల్లాల్లోనూ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ బుధవారం పూర్తికాగానే గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి శుక్రవారం హైకోర్టుకు సమర్పిస్తారు. ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీలు కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే పెద్దఎత్తున కొత్త పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, కొన్ని పంచాయతీలను విలీనం కూడా చేసింది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం ఒక్కరోజే 66 వేర్వేరు ఉత్తర్వులను జారీచేశారు. -
సజావుగా పోలవరం
పోలవరం పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం సవాలే. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలంటే ఇంకా రూ.30 వేల కోట్లు అవసరం. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదిస్తాం. ఇప్పటికే మంజూరు చేసిన రూ.1,850 కోట్లు తక్షణమే విడుదలవుతాయి. మిగతా బకాయిలు విడుదల చేసేలా కేంద్రానికి నివేదిక ఇస్తాం. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లపై ఇప్పటికే సీడబ్ల్యూసీ టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) ఆమోదముద్ర వేసింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ కూడా ఆమోదముద్ర వేయగానే ఆ మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. – కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హల్దార్ సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉంది. ప్రస్తుతం పనులన్నీ ప్రణాళిక మేరకు సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే ఆ గడువులోగా పోలవరం ఫలాలను రైతులకు అందించవచ్చు’’ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హల్దార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సీజన్లో కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, పునరావాస పనులను సమన్వయంతో చేపట్టాలని కమిటీ జలవనరుల శాఖకు సూచించింది. పెండింగ్‌లో ఉన్న 9 డిజైన్లపై చర్చించేందుకు వారంలోగా ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి సమగ్ర వివరాలతో హాజరైతే ఆమోదించేలా చూస్తామని తెలిపింది. పోలవరం ఎడమ కాలువ, హెడ్ వర్క్స్‌ను రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం కుడి కాలువను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు విజయవాడలోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. పనుల పూర్తికి ప్రణాళిక.. పోలవరాన్ని 2021లోగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని ఆదిత్యనాథ్ దాస్ కేంద్ర నిపుణుల కమిటీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన వ్యయంలో రూ.5,103 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ స్పందిస్తూ కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉందని ప్రశంసించారు. కాఫర్ డ్యామ్‌లలో వరదను దిగువకు వదలడానికి ఉంచిన ఖాళీ ప్రదేశాలను అలాగే ఉంచి.. మిగిలిన పనులు (ఎగువ కాఫర్ డ్యామ్ 42 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ 30 మీటర్లు) పూర్తి చేయాలని సూచించారు. స్పిల్‌వేలో 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉందని, 48 గేట్లను బిగించాల్సి ఉందన్నారు. ఈ పనులను మే నాటికి పూర్తి చేసి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించగలిగితే అప్పుడు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. అప్పుడు వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించి ఈసీఆర్ఎఫ్ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చన్నారు. హెడ్‌వర్క్స్‌ను పూర్తి చేసి జలాశయంలో నీటిని నిల్వ చేసినా కాలువలకు నీటిని విడుదల చేసే అనుసంధానాలు(కనెక్టివిటీస్) పూర్తి చేయకపోతే ఫలితం ఉండదన్నారు. ఎడమ కాలువ అనుసంధానం పనుల్లో 18 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం పనులు మూడు దశల్లో చేస్తుండటం వల్ల కొంత జాప్యం చోటుచేసుకుంటోందని సీఈ సుధాకర్ బాబు వివరించారు. పునరావాసమే పెద్ద సవాల్.. పోలవరంలో 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలో 1.05 లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయని నిపుణుల కమిటీకి అధికారులు వివరించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 18,620 నిర్వాసిత కుటుంబాలకుగానూ 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని, మే నాటికి మిగతా 14,698 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా వేగంగా చర్యలు చేపట్టామని, నిధుల కొరత లేకుండా చూస్తే పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర నిపుణుల కమిటీ ఛైర్మన్ హల్దార్ ఏకీభవిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి పోలవరం పనులు పూర్తి చేయవచ్చని, ఇదే అంశాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆర్కే పచౌరి, ఎస్ఎల్ గుప్తా, రంగారెడ్డి, బీపీ పాండే, డీపీ భార్గవ, భూపేందర్‌సింగ్, నాగేంద్రకుమార్, దేవేంద్రకుమార్, వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
-
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విభజన చట్టం ప్రకారం కేంద్రసాయంతో నిర్మించాల్సిన దుగరాజపట్నంలో పోర్టుకు లాభదాయకత లేదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్‌మేజర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందన్నారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందని, రామాయపట్నంలో నాన్మేజర్పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చాలంటూ ఇప్పటికీ తాము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమన్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు పోలవరం ప్రాజెక్ట్‌పై వెచ్చించిన వ్యయం రీయింబర్స్మెంట్ విషయంలో రూ.3,222.75 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని సోమవారం ప్రశ్నోత్తరాల్లో వి.విజయసాయిరెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడానికి ముందు చేసిన రూ.5 వేల కోట్ల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ జరుపుతోందని, ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల మేరకు ఆడిట్ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశం ప్రస్తుతానికి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ఇదే అంశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు జలశక్తి మంత్రి రతన్‌లాల్ కటారియా సమాధానం ఇచ్చారు. 31.03.2014 నాటికి అయిన వ్యయం రూ.5,135.87కు సంబంధించి ఆడిట్ నివేదికలు సమర్పించాలని 2018 జూలై, 2019 మే, 2019 జూలై నెలల్లో అడిగామన్నారు. ఇప్పటి వరకు రూ.3,777.44 కోట్ల మేర ఆడిటింగ్ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మధ్యంతర చర్యగా రూ.1,850 కోట్ల మేర ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు ఈ శాఖకు అనుమతి ఇచ్చిందని వివరించారు. కాగా, 26.11.2019న ఆర్థిక శాఖ ఒక లేఖ రాసిందని, దీని ప్రకారం గతంలో ఇచ్చిన షరతుల (ఆడిట్ నివేదిక సమర్పణ)ను సంతృప్తి పరచనంతవరకు తదుపరి నిధుల విడుదల ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఏపీ మొత్తం అప్పులు రూ.3.41 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.3,41,270 కోట్లుగా ఉందని, 2018–19 సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,06,010 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే తెలంగాణ అప్పులు 2018–19 చివరినాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ.1.44 లక్షల కోట్లుగా ఉందని, 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.68 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. -
ఏపీలో మాత్రమే కేజీ రూ. 25
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కేజీ ఉల్లి రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నానా యాగీ చేస్తున్న సందర్భంలో సీఎం స్పందించి మాట్లాడారు. ఇప్పటి వరకు 36,536 క్వింటాళ్ల ఉల్లిపాయలు కొనుగోలు చేసి ప్రతి రైతు బజారులోనూ కేజీ రూ.25 చొప్పున అమ్ముతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకనందున, ఎక్కడ దొరికినా కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. షోలాపూర్, ఆల్వార్ లాంటి చోట్ల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామని గుర్తు చేశారు. ‘ఇవాళ రైతులకూ మంచిరేటు లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్కువ ధరకు అమ్ముతున్నాం’ అని వివరించారు. హెరిటేజ్‌లో కిలో రూ.200 చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లి రూ.200 చొప్పున అమ్ముతున్నారని సీఎం జగన్ విమర్శించారు. వీళ్లేమో (టీడీపీ) ఇక్కడకు వచ్చి.. పేపర్లు (ప్లకార్డు) పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉల్లి ధరలపై చర్చకు తాము సిద్ధమని, అదే విధంగా మహిళల భద్రత మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘దేశంలో సంచలనాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయనే అంశంపై కూడా చర్చ జరగాలి. మహిళలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు.. వాళ్లకు భద్రత ఎలా పెంచాలన్న అంశంపైనా చర్చ జరగాలి’ అని సీఎం అన్నారు. -
21రోజుల్లో మరణ శిక్ష
నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరూ ఆడపిల్లలే. నాకూ చెల్లెలు ఉంది. భార్య ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే నేను ఎలా స్పందించాలి? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఏరకమైన శిక్షపడితే బాధిత మహిళకు, ఆ కుటుంబానికి ఉపశమనం కలుగుతుందని మనమంతా ఆలోచించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సోమవారం మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు ఉంటే 21 పనిదినాల్లో ఉరి శిక్ష పడేలా మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనసభలో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘దిశ’ లాంటి ఘటనల్లో ఎలా స్పందించాలి? ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ పరిస్థితులను మార్చాలని తపన పడుతూ.. ప్రస్తుతం ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయడానికి సూచనలు, సలహాలు అడుగుతున్నా. హైదరాబాద్‌లో దిశ ఘటన పట్ల సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాలి. 26 ఏళ్ల మహిళా డాక్టర్‌ను టోల్ గేట్‌కు సమీపంలో రేప్ చేసి, కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పడు రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? అని ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. మన చట్టాల్లో మార్పు రావాల్సిందే ‘దిశ’ ఘటనలో తప్పు జరిగిందని మీడియా విస్తృతంగా చూపించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హేట్సాఫ్ టు కేసీఆర్, తెలంగాణ పోలీసు ఆఫీసర్స్.. అని ఈ చట్టసభ సాక్షిగా చెబుతున్నాం. సినిమాల్లో హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం. సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో దమ్మున్న వాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష లేదు ఢిల్లీలో ఒక ఘటన జరిగితే.. ఇలాంటి ఘటన మున్ముందు జరగకూడదని నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చాం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్షలు పడాలని కోరుకున్నాం. 4 నెలల్లో తీర్పు నివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఉపశమనం కలిగేలా చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపల్లి ఎదురు చూస్తోంది. ఈ దిశగానే మన రాష్ట్రం కూడా ఆలోచిస్తోంది. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు.. దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు జరిగితే కొన్ని దేశాల్లో అయితే దోషులు కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి. వారంలో విచారణ పూర్తి కావాలి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు అలాంటి కేసులు వారం రోజుల్లోపు విచారణ పూర్తి కావాలి. ఆ తర్వాత డీఎన్ఎ రిపోర్టుల్లాంటివి పూర్తి కావాలి. మూడు వారాలు అంటే 21 పని రోజుల్లో దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితి రావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది. సోషల్ మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తుల మీద బురద చల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నం చేయాలి. మహిళల గురించి నెగెటివ్‌గా ఎవరైనా పోస్టింగ్ చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆ దిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చింది. ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కేసు నమోదు చేస్తున్నాం. అందుకే పర్మిట్ రూమ్‌లను రద్దు చేశాం మనిషి మద్యం తాగినప్పుడు ఇంగితం కోల్పోతాడు. ఇలాంటి వారు మరో నలుగురు కలిస్తే ఆలోచనలు మారతాయి. రాక్షసులు అవుతారు. ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూములు అన్నింటినీ రద్దు చేశాం. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామని గర్వంగా చెబుతున్నాం. స్మార్ట్ ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడి చేయలేని పరిస్థితి. పోర్నోసైట్లను బ్లాక్ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లును తీసుకొస్తాం. చట్టం రూపకల్పనకు సలహాలు అడిగితే విమర్శలా? మహిళల భద్రత కోసం తీసుకొచ్చే చట్టానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబును అడిగితే ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది.. శాంతిభద్రతలు లేకుండా పోయాయని విమర్శలు చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. చంద్రబాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను ఒకసారి చూద్దాం. ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శలే ఈ లెక్కలు. ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తాం : చంద్రబాబు మహళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తామని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం శిక్ష పడితే భయం ఉంటుందన్నారు. చట్టానికి సంబంధించి సలహాలు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. -
మహిళల భద్రతకు సరికొత్త చట్టం
సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విప్లవాత్మక చట్టాలు గత బడ్జెట్ సమావేశాల్లో పలు విప్లవాత్మక, చరిత్రాత్మక చట్టాల రూపకల్పనకు వేదికైన అసెంబ్లీ.. మరోమారు ఆ తరహాలో మరికొన్ని చట్టాలను రూపొందించడానికి సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ, మండలి సమావేశాల్లో పలు ముఖ్యమైన చట్టాలను చేసేందుకు అధికారపక్షం అడుగులు వేస్తోంది. ఈ చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించాక సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సోమవారం మహిళల భద్రతపై చర్చను ఉభయ సభల్లో చేపట్టనున్నారు. ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత ఆరు నెలల పాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసి చూపించడాన్ని సభ దృష్టికి తీసుకురానున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం, ఇచ్చిన మాట కన్నా ముందుగా, మెరుగ్గా వైఎస్సార్ రైతు భరోసా అమలు, నవరత్నాల్లోని ఇతర పథకాలు, కార్యక్రమాల అమలుపై అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానితో పాటు అజెండా అంశాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ‘అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్–2019’ను తేనుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేస్తారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రజా రవాణా శాఖ (ప్రభుత్వ) ఉద్యోగులు కానున్నారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మందికి ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. చిరు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రత్యేక బోర్డులు - ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉంది. ఇకపై వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా చట్టాలను చేయనున్నారు. - చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చట్టాలు చేయనున్నారు. - పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను ఐదేళ్ల అనంతరం విక్రయించడానికి వీలు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. - నూతన బార్ల విధానం, సగానికి పైగా మద్యం షాపుల తగ్గింపు, 40 శాతం మేర బార్ల సంఖ్య తగ్గింపునకు సంబంధిత చట్టాల్లో సవరణలు చేయనున్నారు. - అడ్వకేట్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలు - రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు – ప్రభుత్వ చర్యలు - గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు – కొత్తగా శాశ్వత ఉద్యోగాల కల్పన - వ్యవసాయ రంగం – రైతు భరోసా, మద్దతు ధర - మద్య నియంత్రణ విధానం – ప్రభుత్వ చర్యలు - ఆంగ్ల విద్య ఆవశ్యకత – అమ్మ ఒడి, నాడు–నేడు - విద్య వైద్య రంగాల్లో సంస్కరణలు - అగ్రిగోల్డ్ బాధితులు – ప్రభుత్వ చర్యలు - సంక్షేమ పథకాలు – ప్రభుత్వ చర్యలు - స్పందన కార్యక్రమం – అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన - రాజధాని – గత ప్రభుత్వ చర్యలు – అప్పులు - విద్యుత్ పీపీఏలు – ప్రభుత్వ చర్యలు - పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు – వాటర్ గ్రిడ్స్ – రివర్స్ టెండరింగ్ - విభజన హామీలు - పెట్టుబడులు – భూ కేటాయింపులు - గృహ నిర్మాణం – ఇళ్ల స్థలాల పంపిణీ - శాంతి భద్రతలు – ప్రభుత్వ చర్యలు -
గ్రాంట్ల రూపంలో రూ.2,19,695 కోట్లు కావాలి
సాక్షి, అమరావతి: విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఉదారంగా నిధుల మంజూరుకు సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో రూ.2,19,695 కోట్లను గ్రాంట్ల రూపంలో అందేలా చూడాలని కోరింది. గతంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నిధుల అవసరానికి సంబంధించి కొంత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా మరిన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. గత ప్రభుత్వం భారీగా పెండింగ్ బిల్లులను వదిలిపెట్టడాన్ని, అదే సమయంలో బడ్జెట్‌కు బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేయడాన్ని నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చేలా సిఫారసు చేయాలని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. -
బార్ల లైసెన్స్ దరఖాస్తుకు 9 వరకు గడువు
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బార్ల లైసెన్సులకు దరఖాస్తులను ఆహ్వానించగా.. స్పందన లేకపోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించి 487 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించారు. పెద్దగా స్పందన లేకపోవడంతో మళ్లీ ఒక రోజు గడువు పెంచి సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా 301 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీలు ఉండగా, అసలు 45 మున్సిపాలిటీల్లోని బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్ శాఖ రెండో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. గడువును డిసెంబరు 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ జారీ చేశారు. మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ దశల వారీగా మద్య నిషేధం వైపు అడుగులు వేయడం వల్లే దరఖాస్తులు రావడం లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రొటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధు
సాక్షి, అమరావతి: డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డీగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధును డిప్యూటీ కలెక్టర్‌గా గత ప్రభుత్వం నియమించింది. -
పకడ్బందీగా సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పాఠ్యాంశాల రూపకల్పనపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలు, ప్రణాళికపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చర్యలు చేపట్టింది. పాఠ్యాంశాలపై రూపకల్పనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలివే.. – ఎస్సీఈఆర్టీ అధికారుల బృందం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడ అనుసరిస్తున్న ఆంగ్ల మాధ్యమ ప్రణాళికలు, పాఠ్యాంశాలను పరిశీలించింది. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర విద్యార్థులకు అవసరమైన రీతిలో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో 180 మంది నిపుణులు విద్యావేత్తలు పాల్గొంటున్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో అనుభవమున్న నిపుణులు, ప్రొఫెసర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఢిల్లీ, మద్రాస్, అంబేడ్కర్, అన్నా, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (ఆర్ఐఈ)– బెంగళూరు, నవోదయ విద్యాలయ సంఘటన్‌తోపాటు పలు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ల ప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారు. – యూకే, యూఎస్ఏ, సింగపూర్, శ్రీలంక, చైనా తదితర దేశాల్లోని ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను తెప్పించి ఇక్కడి నిపుణులతో ప్రభుత్వం పరిశీలింపచేస్తోంది. అక్కడి మంచి అంశాలను కూడా చొప్పించి రాష్ట్ర సిలబస్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అనువుగా ఉండేలా రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా అనుగుణంగా ఉండేలా పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నారు. పిల్లల చదువులపై దృష్టిపెట్టలేని నిరుపేదలు, కూలి చేసుకుని జీవించే కుటుంబాల్లోని విద్యార్థులకు అనువైన రీతిలో వీటిని సిద్ధం చేస్తున్నారు. – తెలుగు సబ్జెక్టు పాఠ్యాంశాలు కూడా ఉన్నతంగా ఉండేలా మార్పులు చేపట్టారు. 1 నుంచి 6వ తరగతి వరకు 68 మంది ప్రముఖ కవులు, కథకుల రచనల్లోని అంశాలను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మాండలికాలకు సమ ప్రాధాన్యమిస్తున్నారు. కథలు, కవితలు, సంభాషణలు, పద్యాలు.. ఇలా తెలుగుకు సంబంధించి అన్ని అంశాలపై విద్యార్థులకు మరింత శ్రద్ధ పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. దేశీ, విదేశీ కలబోతతో సిలబస్ ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ దేశీ, విదేశీ కలబోతతో సిలబస్‌ను రూపొందిస్తున్నాం. ఎవరైనా సిలబస్‌ను మార్చాలనుకుంటే మన రాష్ట్రం వైపు చూసేలా చర్యలు చేపడుతున్నాం. యూకే, చైనా, సింగపూర్, శ్రీలంక, అమెరికా పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయిస్తున్నాం. అక్కడి మంచి విధానాలను తీసుకుంటాం. మన పిల్లలు వెనుకపడకుండా, అదే సమయంలో హైస్టాండర్డ్స్ లేకుండా సిలబస్‌ను సరళీకరిస్తున్నాం. -
భారం ఎంతైనా కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది. ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద రూ. 50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది. రాష్ట్రానికి షోలాపూర్ ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. షోలాపూర్ మార్కెట్‌కు ఉల్లి నిల్వలు అధికంగా వస్తున్నాయనే సమాచారం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న అక్కడికి తమ సిబ్బందిని పంపించారు. బుధవారం నుంచి అక్కడ ఉల్లిని కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉల్లి ధరల హోరు కొనసాగుతోంది. మంగళవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.10,220 పలికింది. -
రహదార్ల మరమ్మతులకు రూ.450 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు రూ.450 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర రహదారులు (స్టేట్ హైవేస్), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్)పై అన్ని రకాల మరమ్మతులకు కలిపి రూ.625 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే రూ.450 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందులో రాష్ట్ర రహదారులకు రూ.250 కోట్ల, జిల్లా ప్రధాన రహదారులకు రూ.200 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో రహదార్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో స్టేట్ హైవేస్ పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ట్రాఫిక్ ఉండే పాలకొల్లు–పూలపల్లి, నర్సాపూర్–అశ్వారావుపేట, బూర్గంపాడు–అశ్వారావుపేట, మార్టేరు–ప్రక్కిలంక రహదార్లు అధ్వానంగా ఉన్నాయి. తూర్పుగోదావరిలో సోమేశ్వరం–రాజానగరం, కాట్రేనికోన–చల్లపల్లి, కరప–చింతపల్లి, రాజమండ్రి–చినకొండేపూడి తదితర రహదార్లను వెంటనే మరమ్మతులు చేసేందుకు నిధుల్ని ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి మరమ్మతులకు, ట్రాఫిక్, జనసాంద్రత ఎక్కువగా ఉండే రహదారులపై గుంతల్ని సరిజేయడానికి నిధుల్ని ఖర్చు చేయనున్నారు. కాగా గతంలో చేసిన జాతీయ రహదార్ల మరమ్మతుల పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులున్నాయి. వీటికోసం రూ.27 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.293 కోట్ల వరకు పెండింగ్ బిల్లులుండగా క్లియర్ చేసేందుకు ఆర్ అండ్ బీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రహదార్ల రెన్యువల్‌కు రూ.700 కోట్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దీర్ఘకాలిక పనితీరు ఆధారిత నిర్వహణ కాంట్రాక్టు కింద రెండు వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లకు అనుమతులొచ్చాయి. సాధారణంగా ప్రతి ఏడాది రహదార్లను రెన్యువల్ (దెబ్బతిన్న మేర కొత్తగా లేయర్ వేయడం) చేస్తారు. -
విద్యాభివృద్ధికి ఉన్నత ప్రణాళిక
సాక్షి, అమరావతి: కేంద్రం అందచేసే నిధులను అందిపుచ్చుకుని ఉన్నత విద్యాభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 2023–24 వరకు ఉన్నత విద్యాభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం జగన్ సూచనల మేరకు ఉన్నత విద్యామండలి సన్నద్ధమైంది. ‘ఎక్విప్’ (ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) ద్వారా వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.1,72,490 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది. ఇందులో కేంద్రం వాటా రూ.1,34,564 కోట్లు కాగా రాష్ట్రాలు రూ.37,926 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ తరపున రూ.7,600 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర నిధులను గరిష్టంగా సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 16 లక్షల మందికి అవకాశం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల చేరికల శాతాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం 8,000 ‘సమ్రాస్’ (సమ్రాస్ అంటే ఐక్యతా భావనతో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హాస్టళ్లు అని అర్థం) హాస్టళ్లను వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. 16 లక్షల మందికి వీటిల్లో అవకాశం కల్పిస్తుంది. ఒకొక్కరికి ఏడాదికి రూ.30 వేల చొప్పున స్కాలర్షిప్ అందించనుంది. బ్రిడ్జి కోర్సులు, ఆన్లైన్ దూరవిద్య కోర్సులకు సంబంధించి కేంద్రం రూ.600 కోట్లు వెచ్చించనుండడంతో రాష్ట్రంలో 250 ఆన్లైన్ దూరవిద్యా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వృత్తి విద్య కళాశాలల కోసం కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 20 కాలేజీలను నెలకొల్పాలని నిర్ణయించారు. అత్యుత్తమ బోధనాభ్యసన ప్రక్రియలు బోధనాభ్యసన ప్రక్రియలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.36,429.5 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. పాఠ్య ప్రణాళికల పునర్వ్యవస్థీకరణ, జాతీయ విద్యా సంస్థల మెంటార్షిప్ సమగ్ర మూల్యాంకన విధానాల రూపకల్పన కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ.1,822 కోట్లను రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాలతో కార్యాచరణ ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర నిధులు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు, పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాం. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ద్వారా ఈ కార్యక్రమాలను త్వరలోనే చేపడతాం’ – హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) కీలక ప్రతిపాదనలు ఇవీ - అత్యుత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించే విద్యాసంస్థలకు కేంద్రం రూ. 2,500 కోట్లు చొప్పున ఇవ్వనుంది. - ఇన్స్టిట్యూట్స్ ఎమినెన్స్ కింద 15 సంస్థలకు రూ.1,000 కోట్ల చొప్పున ఇవ్వనుండగా రాష్ట్రంలో ఒక యూనివర్సిటీని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. - గ్లోబల్ ర్యాంకులు సాధించిన 6 ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు రూ.500 కోట్ల చొప్పున కేంద్రం అందించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీలను ప్రతిపాదించనున్నారు. - జాతీయ ర్యాంకులు సాధించిన 15 సంస్థలకు రూ.250 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. దీనికోసం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. - ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు కేంద్రం రూ.12,390 కోట్లను కేటాయిస్తుండడంతో రూ.329 కోట్లు రాష్ట్రానికి రాబట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిద్వారా రాష్ట్రంలోని 500 కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు, వృత్తివిద్యా సంస్కరణలు, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు అమలు చేయనున్నారు. -
బోగస్ ఇళ్లు 16,111
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో దాదాపు రూ.250 కోట్ల మేర ప్రజాధనం లూటీకి టీడీపీ నేతలు పథకం వేసినట్లు క్షేత్రస్థాయి విచారణతో వెల్లడైంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రచారం చేసింది. స్థానిక టీడీపీ నేతలు గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా 16,111 మంది అనర్హులకు ఇళ్లను మంజూరు చేయించుకున్నట్లు తాజాగా గుర్తించారు. టీడీపీ హయాంలో మంజూరై వివిధ స్థాయిల్లో ఆగిపోయిన ఇళ్ల వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ పేరుతో టీడీపీ నేతలు ఇళ్లు మంజూరు చేసుకున్నట్లు తేలటంతో గూడులేని పేదలు నివ్వెరపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు ఇప్పటికే స్థలసేకరణలో నిమగ్నమయ్యారు. అనర్హులకు ఇళ్లు ఇలా.. - ఇతరుల రేషన్‌కార్డు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి వారికి తెలియకుండా కొందరు అనర్హులు ఇళ్లు నిర్మించుకున్నారు. - ఒకే ఇంటిలో ఇద్దరి పేర్లతో ఇళ్లు మంజూరు చేయించుకుని ఉమ్మడిగా పెద్ద భవంతులు నిర్మించుకున్నవి మరికొన్ని. బిల్లులు నిలిపివేస్తాం.. ‘గత ప్రభుత్వ హయాంలో 16,111 మంది అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు క్షేత్రస్థాయి విచారణలో గుర్తించాం. ఈ బిల్లులు చెల్లించరాదని ఆదేశించాం. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ – చెరుకువాడ శ్రీరంగనాథరాజు (గృహ నిర్మాణ శాఖ మంత్రి) -
రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులు డిగ్రీ, తదితర కోర్సులు పూర్తి చేసి.. బయటకు వచ్చీ రాగానే వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చదువు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగం లేదా ఉపాధి లభించేలా చదువులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సమావేశాల్లో అధికారులకు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత విద్యా శాఖ చర్యలకు ఉపక్రమించింది. యూరప్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉద్యోగం లేదా ఉపాధికి వీలుగా ఉన్న మార్గాలపై అక్కడి సంస్థలతో చర్చలు సాగిస్తోంది. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో అత్యధిక ఉపాధి అవకాశాలు ఉండడంతో అక్కడి అధికారులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర యువత, విద్యార్థులకు ఇప్పటివరకు ఇచ్చిన నైపుణ్య శిక్షణతోపాటు భవిష్యత్తులో ఇవ్వనున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. క్యూబెక్ అధికారుల బృందం రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు మొగ్గు చూపిస్తూ తమ ప్రాధమ్యాలను వెల్లడించింది. ఐటీ, వీడియో గేమింగ్, ఇతర ఇంజనీరింగ్ డొమైన్లు, హోటల్ మేనేజ్మెంట్, టెక్స్టైల్స్ రంగాల్లో నైపుణ్యాలున్న వారిని నేరుగా ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తామని తెలిపింది. కెనడాలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ప్రాంతం క్యూబెక్ అని, నైపుణ్యాలున్న యువతకు వివిధ రంగాల్లో 113 రకాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని పేర్కొంది. అన్ని రంగాల్లో కలిపి 13 లక్షల ఉద్యోగాలకు ఆస్కారముందని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ రంగాల్లో అత్యధిక ఉద్యోగావకాశాలున్నాయని వివరించింది. ఆంగ్లంతోపాటు ఫ్రెంచ్ భాషా పరిజ్ఞానం ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి సాధనకు వీలుగా రాష్ట్రంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలను జేఎన్టీయూ–కాకినాడ, జేఎన్టీయూ–అనంతపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం వర్సిటీల ప్రతినిధులు క్యూబెక్ ప్రతినిధులకు వివరించారు. దీంతో క్యూబెక్ ప్రతినిధులు ఏయే రంగాల్లో తమకు మానవవనరుల అవసరముందో రాష్ట్రానికి తెలపనున్నారు. క్యూబెక్‌లోని సంస్థల్లో ఉద్యోగం, ఉపాధి కోరుకునేవారికి ఆంగ్లంతోపాటు ఫ్రెంచ్ భాషలో కొంత ప్రావీణ్యం ఉంటే త్వరగా అవకాశాలు దక్కుతాయి. దీంతో రాష్ట్ర యువత, విద్యార్థులకు ఫ్రెంచ్ భాషపై శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. క్యూబెక్‌లో డిమాండ్ ఉన్న రంగాలు ఇవే.. హెల్త్ అండ్ న్యూట్రిషన్, బయోఫార్మాçస్యూటికల్, యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్, టెక్నో హెల్త్, మెడికల్ ఎక్విప్మెంట్, అప్లైడ్ టెక్నాలజీస్, ఆప్టిక్స్ ఫొటోనిక్స్, జియోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ ఎమర్జన్సీ ప్రిపేర్డ్నెస్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్, వుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ అండ్ ఇంటెలిజెంట్ బిల్డింగ్స్, ప్లాస్టిక్ అండ్ కాంపోజిట్ మెటీరియల్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టూరిజమ్–కల్చర్, హెరిటేజ్, నేచర్, బిజినెస్. -
తప్పుడు ప్రచారం నమ్మొద్దు
ఆపదలో ఉన్న మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుండగా... మరోవైపు కొందరు ఆకతాయిలు, సంఘ వ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా పోలీసుల పేరుతోనే తప్పుడు సందేశాలు, ఫేక్ నంబర్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకొస్తుండడం గందరగోళానికి గురిచేస్తోంది. దీన్ని గుర్తించిన పోలీసు అధికారులు తక్షణమే స్పందించారు. తమ పేరిట ప్రచారంలోకి వస్తున్న తప్పుడు ప్రకటనలు, సందేశాలు, నంబర్ల వ్యవహారానికి తెరదించుతూ... ఆపదలో ఉన్న మహిళలు పోలీసులను సంప్రదించే విధానాన్ని మరోసారి ప్రకటించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – సాక్షి, అమరావతి ఆ నంబర్ పోలీసులది కాదు ‘‘మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచి సర్వీసు ప్రారంభించారు. మీరు ప్రయాణించే కారు, క్యాబ్ లేదా ఆటో నంబర్‌ను 9969777888కు ఎస్సెమ్మెస్ చేయండి. మీకు ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది. మీరు ప్రయాణించే వాహనం జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం అవుతుంది. మరికొంతమంది ఆడపడుచులకు ఈ సందేశాన్ని పంపండి’’ ఇదీ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి తెచ్చిన మెసేజ్. నిజానికి అది పోలీసులు ఇచ్చింది కాదు. 9969777888 నంబరు అసలు పోలీసులదే కాదు. అది ఫేక్ నంబర్ అని డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీసు శాఖ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇందుకు కారకులైన వ్యక్తులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. పోలీసు శాఖ విడుదల చేసిన నంబర్లు మినహా ఇతర నంబర్లకు ఫోన్ చేయడం లేదా ఎస్సెమ్మెస్ పంపడం వంటివి చేయొద్దని పోలీసులు కోరుతున్నారు. ఫోన్ చేయగానే పోలీసులు స్పందిస్తున్నారు హైదరాబాద్‌లో యువ డాక్టర్ హత్యోదంతం తరువాత పోలీసు నంబర్లపై చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ నంబర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? పోలీసులు తక్షణం స్పందిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ప్రజలు ఉత్సుకత చూపారు. రాష్ట్రంలో ఒక్క ఆదివారం రోజే 112 నంబరుకు 40 వేల మంది ఫోన్ చేయడం గమనార్హం. ఫోన్ చేయగానే పోలీసులు స్పందిస్తున్నారని నిర్ధారించుకున్నారు. ఆపదలో పోలీసుల సహాయం పొందడానికి ఉద్దేశించిన పోలీసు మొబైల్ యాప్‌ను ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 30 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల పేరిట తప్పుడు మెసేజ్‌లు వైరల్ చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు అధికారికంగా వెల్లడించిన 100, 112, 181 నంబర్లకు మాత్రమే మహిళలు ఫోన్ చేయాలి. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. – గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ మహిళల రక్షణకు టోల్ ఫ్రీ నంబర్లు ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన నంబర్లను డీజీపీ కార్యాలయం మరోసారి ప్రకటించింది. - 100కు ఫోన్ చేస్తే కాల్ సెంటర్లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు. - 112కు ఫోన్ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు. - 181కు ఫోన్ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కాల్ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వెంటనే అప్రమత్తం చేస్తారు. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మహిళల రక్షణ కోసం పోలీసులు ‘సైబర్–మహిళామిత్ర’ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. వాట్సాప్ నంబర్ 9121211100 అందుబాటులో ఉంచారు. ఈ నంబరుకు వాట్సాప్ చేస్తే, బాధితులు ఉన్న ప్రదేశానికి పోలీసులు వెంటనే చేరుకుంటారు. రక్షణ కల్పిస్తారు. దుండగుల ఆటకట్టిస్తారు. -
చదువుకు ఫీజు ఎంతైతే అంత చెల్లింపు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు స్థోమత లేని పేద పిల్లలు ఇకపై ఎంత వరకు చదువుకుంటే అంత వరకు అయ్యే మొత్తం ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో పాటు వసతి, మెస్ ఖర్చులకు సైతం ఏకంగా ఏటా రూ.20 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి శనివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నవరత్నాల్లో భాగంగా పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ విధానంలో మార్పులు చేస్తూ జగనన్న విద్యా దీవెన (రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు – ఆర్టీఎఫ్), జగనన్న వసతి దీవెన (మెయింటెనెన్స్ ఫీజు – ఎంటీఎఫ్) పథకాలను తెచ్చింది. ఇంటర్ మినహా పోస్టు మెట్రిక్ కోర్సులు.. ఐటీఐ నుంచి పీహెచ్డీ వరకు ఈ పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాలకు సంబంధించి అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో ‘వైఎస్సార్ నవశకం ఫీజు రీయింబర్స్మెంట్’ కార్డు జారీ చేస్తారు. విద్యార్థి ఫీజును సంబంధిత కళాశాల ఖాతాకు, వసతి సొమ్మును తల్లి లేదా సంరక్షకుని అకౌంట్‌కు జమ చేస్తారు. ఈ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది (2019–20) నుంచే అమలు చేయనుండటం అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలకనుంది. - జగనన్న విద్యా దీవెన పథకం : అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. - జగనన్న వసతి దీవెన పథకం : హాస్టల్, ఆహార ఖర్చులకు ఐటీఐ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.15 వేలు, డిగ్రీ, ఆపై వారికి (ఒక్కొక్కరికి) రూ.20 వేలు ఇస్తారు. అర్హతలు, అనర్హతలు - విద్యార్థులు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతుండాలి. - డే స్కాలర్ విద్యార్థులు, కాలేజీ అటాచ్డ్ హాస్టల్స్ (సీఏహెచ్), డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ విద్యార్థులు 75% హాజరు ఉండాలి. - కుటుంబీకులకు కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండ కూడదు. ప్రభుత్వ ప్రాయో జిత పథకాల కింద ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు తీసుకున్న వారికి మినహాయింపు ఉంది. పట్టణ ప్రాంతాల్లో (రెసిడెన్షియల్ లేదా కమర్షియల్) 1,500 చదరపు అడుగులలోపు సొంత స్థలం కలిగి ఉన్న వారు కూడా అర్హులే. - దూర విద్య, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుతున్న వారు, మేనేజ్మెంట్ కోటా కింద చేరిన వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉన్న వారు అనర్హులు. ఆదాయ పరిమితి - కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. æ కుటుంబానికి 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ అర్హత. లేదా.. మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉంటే కూడా అర్హులే. æ వార్షికాదాయంతో సంబంధం లేకుండా శానిటరీ వర్కర్స్ పిల్లలు అర్హులు. దరఖాస్తు ఇలా.. - ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హుల వివరాలను జ్ఞానభూమి వెబ్సైట్లో ఆయా విభాగాలకు అప్లోడ్ చేస్తాయి. - ఆదాయ పరిమితి పెంచినందున తహసీల్దార్ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. -
అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాపారులు తమ లాభం కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ఉల్లి ధరల మంటకు గల కారణాలను గుర్తించడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టింది. ఉల్లి వ్యాపారం అధికంగా జరిగే కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్రయవిక్రయాలు, గత మూడేళ్లుగా ఉల్లి దిగుబడులు.. తదితర అంశాలను పరిశీలించగా, విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఉల్లి దిగుబడి అధికంగా వచ్చినా.. వ్యాపారులు తమ కమిషన్ కోసం ఉల్లిని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనికితోడు కొంత సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈసారి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ఉల్లి దొరక్కపోవడానికి వ్యాపారుల అక్రమాలే కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై మెరుపు దాడులు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలోని అంశాలు.. - రాష్ట్రంలో రోజుకు 8–9 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం. నవంబరులో కర్నూలు రకం ఉల్లి ప్రధాన మార్కెట్లకు 3.83 లక్షల క్వింటాళ్లు వచ్చింది. ఇందులో దాదాపు 40 శాతం.. అంటే 1.60 లక్షల క్వింటాళ్ల ఉల్లి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయింది. మిగిలిన 2.23 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు 13 జిల్లాల్లోని వినియోగదారులకు సరిపోతాయి. - అయినప్పటికీ ట్రేడర్లు/ఏజెంట్లు కృత్రిమ కొరత సృష్టించారు. తమకు వచ్చే 4 శాతం కమిషన్ కోసం ఇక్కడి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు చేరుతుండడంతో స్థానికంగా ఉల్లి కొరత కొనసాగుతోంది. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగులు సరుకును మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే ఉల్లి కొరత ఉండదు. - ఉల్లి కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను రోజులుగా ఉల్లిని కొనుగోలు చేసి, రైతుబజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. కర్నూలు మార్కెట్లో కిలో రూ.65 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్లలో రాయితీపై వినియోగదారులకు అమ్ముతోంది. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. సబ్సిడీ ఉల్లి అమ్మకాల వల్ల ఇప్పటివరకు రూ.4.50 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడింది. దీనికితోడు ఈజిప్టు నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
గ‘లీజు’ పనులకు బ్రేక్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు చేసిన కుట్రను వైఎస్సార్ ప్రభుత్వం తిప్పి కొట్టింది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని లీజు పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు పన్నిన పన్నాగాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ జిల్లా నేతలు రూ.25 కోట్ల విలువ చేసే ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నానికి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన అప్పటి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి చ్చిన 1.96 ఎకరాల స్థలానికి ఇచ్చిన జీఓ ఎంఎస్ నెంః 514ను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు– కర్నూలు హైవే పక్కన సర్వే నంబర్ 68/8లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ)కి చెందిన 1. 96 ఎకరాల స్థలం ఉంది. దీని మార్కెట్ విలువ రూ. 25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ స్థలానికి తూర్పున ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ కార్యాలయం, పడమర వైపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్, దక్షిణం వైపున కర్నూలు– నెల్లూరు హైవే ఉన్నాయి. పక్కనే ఉన్న నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయం శిథిలావస్థకు చేరి చిన్నపాటి వర్షానికే కార్యాలయ ఆవరణ తటాకాన్ని తలపిస్తోంది. దీంతో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి 2016 మే నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ. 5.90 కోట్ల నిధులను మంజూరు చేసింది. 2016 ఆగస్టు 20వ తేదీన టెండర్లు కూడా పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్. గంగయ్య అండ్ కంపెనీ టెండర్‌ను దక్కించుకుని 2017 మార్చి 3న అగ్రిమెంట్ కూడా చేసి పనులు మొదలుపెట్టేందుకు సమాయత్తమయ్యారు. పనులకు శంకుస్థాపన చేసేందుకు పునాదులు కూడా తవ్వారు. స్థలంపై తమ్ముళ్ల కన్ను.. ఈ స్థలంపై అప్పట్లో టీడీపీ జిల్లా నేతల కన్ను పడింది. సదరు స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయానికి కావాలంటూ అక్కడ జరుగుతున్న నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనులను నిలిపి వేయించారు. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అధికారులు సైతం చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తరువాత టీడీపీ నేతలు చెప్పినట్లుగా 1.96 ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.1960 చొప్పున అద్దె చెల్లించేలా 33 ఏళ్ళపాటు లీజుకు ఇస్తూ జీఓ జారీ చేశారు. అప్పటి నుంచి ఈ స్థలం టీడీపీ నేతల ఆధీనంలో ఉన్నప్పటికీ ఏడాది దాటినా అందులో పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికితోడు సదరు స్థలం ఎన్ఎస్పీ శాఖకు అవసరమైన నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి గతంలో ఇచ్చిన జీఓ ఎంఎస్ నం 514ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. -
పోలవరానికి రూ.1,850 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు)కు కేంద్ర ఆర్థిక శాఖ అండర్ సెక్రటరీ గౌతమ్ ఫలిత్ ప్రతిపాదనలు పంపారు. బాండ్లను జారీ చేయడం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి నిధులు సేకరించి పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాలని నాబార్డుకు దిశానిర్దేశం చేశారు. దీంతో సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పరిధిలో ఈ–ఆక్షన్ ప్లాట్ ఫామ్ ద్వారా బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,850 కోట్లను నాబార్డు సేకరించనుంది. ఐదారు రోజుల్లోనే పీపీఏ ద్వారా ఆ నిధులు ప్రాజెక్టుకు అందనున్నాయి. జూలై 24, 2018 అనంతరం పోలవరానికి కేంద్రం నిధులు మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, పోలవరం పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్ టెండరింగ్ ద్వారా సీఎం వైఎస్ జగన్ రూ.841.33 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారని, పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
వితంతు, ఒంటరి మహిళల పింఛన్ నిబంధనల మార్పు
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనల నిర్వచనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌కు అర్హత నిబంధనలను మార్పుచేశారు. దీని ప్రకారం.. - వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీ–2 పెన్షన్ వయస్సును 45 ఏళ్లుగా నిర్థారించారు. - పిల్లలు లేకపోయినా, మైనర్ పిల్లలున్న వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్ లభిస్తుంది. ఈ కేటగిరీ–2 పెన్షన్ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరీ–1 పెన్షన్‌కు అర్హులైనా వారికి ఆ పెన్షన్ వర్తించదు. ఇలా కాకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. - అలాగే, కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతిచెంది.. వివాహం కాని కుమార్తె ఉంటే ఆమెకు పాతికేళ్లు వచ్చే వరకు పెన్షన్ ఇస్తారు. వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్ అందిస్తారు. వివాహ ధ్రువీకరణకు సంబంధించి రెవెన్యూ శాఖలోని గెజిటెడ్ ఆఫీసర్ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. - కుటుంబ పెన్షన్ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే.. ఆ కుమార్తె ముందుగానే అంటే 45 సంవత్సరాల వయస్సులోపే తన తల్లి మరణానంతరం పెన్షన్ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు పెన్షన్ ఇస్తారు. కాగా, మారిన నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ, పెన్షన్ పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థులకు 'ఉజ్వల భవిత'
ఇంగ్లిష్ మీడియంతో మాతృభాష మృతభాషగా మారిపోతుందని, ప్రాభవం కోల్పోతుందనే వాదనల్లో అర్థం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దిశగా ముందడుగు సాక్షి, అమరావతి: ‘బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం వెల్లడిస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్‌లో విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించడం ఉత్తమం’ అని ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు.. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా విశ్లేషించాకే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాభ్యాసం తప్పనిసరి. ప్రపంచంలో విషయ పరిజ్ఞానమంతా ఇంగ్లిష్‌లోనే ఉంది. బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం శాస్త్రీయంగా నిరూపించింది. కాబట్టి విద్యార్థులకు బాల్యం నుంచే ఇంగ్లిష్ నేర్పించాలి. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో సాగితేనే విద్యార్థుల మనోవికాసం సరిగా ఉంటుందనే వాదన సరికాదు. మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యను ఇంగ్లిష్‌లో అభ్యసిస్తే విద్యార్థులు సరైన విజ్ఞానాన్ని పొందలేరు. కొంతమంది రాద్ధాంతానికి అర్థం లేదు ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాష ప్రాభవానికి, ఉనికికి ఎలాంటి ముప్పూ లేదు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాష వైభవాన్ని కోల్పోతోందని కొందరు చేస్తున్న రాద్ధాంతానికి అర్థం లేదు. దీని వెనుక కార్పొరేట్ విద్యా సంస్థల హస్తం ఉంది. ఇంగ్లిష్ మీడియం లేదా వేరే మీడియం విద్యా బోధనతో ప్రపంచంలో ఒక మాతృభాష మృతభాషగా మారిపోయినట్టు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ సంస్థానంలో 400 ఏళ్లకుపైగా ఉర్దూనే అధికారిక భాషగా, బోధన భాషగా సాగింది. అందరూ ఉర్దూ మీడియంలోనే చదువుకునేవారు. అయితే.. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో తెలుగు భాష ఉనికికి, సాహితీ వైభవానికి ఏ మాత్రం భంగం కలగలేదు. కర్ణాటకలో తుళు భాషకు లిపి లేదు.. దాన్ని కన్నడంలోనే రాస్తారు. అయినా ఆ భాష వందల ఏళ్లుగా ప్రాభవాన్ని కోల్పోకుండా ఉంది. అలాంటిది.. 2 వేల ఏళ్లకుపైగా చరిత్ర, ఘన సాహితీ వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి మాతృభాష అయిన తెలుగు ఉనికి, వైభవం ఎందుకు కోల్పోతుంది?.. అని ప్రతాప్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. -
ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అభిప్రాయాల సేకరణకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడానికి సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. వివాదాలను పరిష్కరించి, నిరుద్యోగులలో విశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ చుట్టూ వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. కమిషన్ నిర్ణయాలపై గతంలో నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. పలు అడ్డగోలు నిబంధనలు, పరీక్షల నిర్వహణలో, ప్రశ్నపత్రాల తయారీలో తప్పిదాలు నిరుద్యోగులకు నష్టం కలిగించాయి. వీటిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా కమిషన్ పాలకవర్గం పట్టించుకోలేదు. పైగా తమను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టించడంతో పాటు ఇంటర్వ్యూల్లో వారిని బ్లాక్‌లిస్టుల్లో పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో నిరుద్యోగులు తమ సమస్యలను ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వ్యవహారాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి, నియామకాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా పలు సూచనలు చేశారు. గ్రూప్1 పోస్టులు, మరికొన్ని ప్రత్యేక కేటగిరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేశారు. క్యాలెండర్ ప్రకారం నియామకాలకు ఏటా జనవరిలో కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న పలు అంశాలను సరిచేసేలా ఇటీవల కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు అందించారు. ఇంటర్వ్యూలకు చైర్మన్ ఆధ్వర్యంలో ఒకేఒక్క బోర్డు ఉండగా దాన్ని మూడు బోర్డులుగా మార్పు చేశారు. గత ప్రభుత్వం తప్పుల మీద తప్పులు.. – టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్ అస్తవ్యస్త నిర్ణయాలతో పలు నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. – గ్రూప్1 మినహా ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష లేదు. కానీ ప్రిలిమ్స్‌ను కమిషన్ అన్నిటికీ అమలు చేస్తోంది. – ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక విధానాన్ని రద్దుచేసి 1:15కు కుదించడంతో నిరుద్యోగులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వం దీన్ని మార్పు చేసి 1:50కి మార్పు చేసింది. – గ్రూప్1, గ్రూప్2 సిలబస్‌ను 2016–17లో మార్చారు. ఏడాది తిరగకుండానే మళ్లీ మార్పు చేశారు. దీంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. – ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలలో 75 మార్కులుండగా అస్మదీయులకు ఎక్కువ మార్కులు వేసి పోస్టులు కట్టబెట్టారనే విమర్శలున్నాయి. – పలు పరీక్షల్లో ప్రశ్నలు వాటి సమాధానాల ఆప్షన్లు తప్పుల తడకగా ఇచ్చారు. ఆంగ్లం నుంచి తెలుగు అనువాదం తప్పులు అభ్యర్థులను తికమకకు గురిచేశాయి. – గతంలో ఏకంగా 42 ప్రశ్నల్లో తప్పులు రావడంతో ఏపీపీఎస్సీ వాటిని తొలగించాల్సి వచ్చింది. పారదర్శక విధానాలకు పెద్దపీట – కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఏపీపీఎస్సీ నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తాం. ఏకపక్ష నిర్ణయాలకు తావుండదు. కమిషన్‌లో గతంలోని తప్పిదాల వల్ల నిరుద్యోగులు చాలా నష్టపోయారు. వీటికి బాధ్యులైన వారు తప్పించుకునే పద్ధతి సరికాదు. దీనికి కమిషన్‌లోని వారిదే బాధ్యత అవుతుంది. అందుకే కమిషన్‌లో ఎలాంటి లోపాలున్నాయో విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజాప్రతినిధులనుంచే తెలుసుకోవాలని సోమవారం (నేడు) సదస్సు నిర్వహిస్తున్నాం. అందరి నుంచి సూచనలు తీసుకొని తప్పులు సరిదిద్దుతాం. -
అనాటమీపై అనాసక్తి
సాక్షి, అమరావతి: శరీర నిర్మాణ శాస్త్రం.. దీన్నే అనాటమీ అంటారు. ఈ కోర్సును చదవడమంటే మనిషి శరీర నిర్మాణం, అవయవాలు, వాటి విధులు, ధర్మాల గురించి తెలుసుకోవడమే. వైద్యంలో అత్యంత కీలకమైన ఈ సబ్జెక్టుకు ఇప్పుడు ఆదరణ తగ్గింది. పీజీలో అనాటమీ కోర్సు తీసుకోవడానికి విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పాటు శవపంచనామాలో కీలక పాత్ర పోషించే ఫోరెన్సిక్ మెడిసిన్ సీట్లూ మిగిలిపోతున్నాయి. మొత్తం ఎనిమిది నాన్క్లినికల్ సబ్జెక్టుల్లో (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్) ఏటా సగం సీట్లు మిగిలిపోతున్నాయంటే ఆదరణ ఎలా తగ్గుతోందో అంచనా వేయచ్చు. ఈ నాలుగేళ్లలో 1,357 సీట్లకు గాను 719 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ఈ కోర్సులు కెరియర్‌కు ఉపయోగపడడం లేదని, ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అవకాశమొస్తే చేరాలి.. లేదంటే ఖాళీగా ఉండాల్సి వస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ కోర్సుల వైపు దృష్టి సారించాల్సి వస్తోందని చెబుతున్నారు. క్లినికల్ కోర్సుల వైపే మొగ్గు మరోవైపు క్లినికల్ కోర్సుల్లో మాత్రం సీట్లు హాట్‌కేకుల్లా మారిపోయాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ వంటి పీజీ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి. ఈ కోర్సులు చదివితే ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుంటుందనేది విద్యార్థుల ఆలోచన. పైగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే క్లినికల్ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. -
నెలాఖరులోగా ‘అమ్మఒడి’ అర్హుల జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ నెలాఖరులోగా అర్హుల జాబితా రూపొందించేందుకు వీలుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే ‘చైల్డ్ ఇన్ఫో’లో నమోదైన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, సర్వీసెస్‌కు(ఏపీసీఎఫ్ఎస్ఎస్) అందించారు. ఆ సమాచారాన్ని తెల్లరేషన్‌కార్డుల సమాచారంతో అనుసంధానించి, ఆ వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు(హెచ్ఎం) అందుబాటులో ఉంచుతారు. షెడ్యూల్ ఇలా.. - నవంబర్ 24న హెచ్ఎంలకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఈలోగా హెచ్ఎం పిల్లల హాజరు శాతాన్ని సిద్ధం చేయాలి. స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి హాజరును లెక్కించాలి. ఎవరైనా విద్యార్థులు మధ్యలో చేరినట్లయితే వారు చేరిన తేదీ నుండి హాజరు శాతాన్ని లెక్కగట్టాలి. - ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి/సంరక్షకుల ఆధార్ నెంబరు, నివాస గ్రామం, బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్ సేకరించాలి. లాగిన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకోవాలి. లోపాలుంటే సరిదిద్దాలి. ఆ సమాచారాన్ని ఎంఈఓలకు అందజేయాలి. - 100 లోపు విద్యార్థులున్న పాఠశాలలు ఆన్లైన్లో వివరాల నమోదును నవంబర్ 25వ తేదీలోగా పూర్తి చేయాలి - 100 నుంచి 300 మంది పిల్లలున్న పాఠశాలలు 26వ తేదీలోగా పూర్తి చేయాలి. - 300, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలు 27వ తేదీలోగా పూర్తి చేయాలి. - ప్రధానోపాధ్యాయుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎంఈవోలు ప్రింట్ చేసి, గ్రామ సచివాలయ విద్యాసంక్షేమ సహాయకునికి అందించాలి. వారు లేకపోతే సీఆర్పీలకు ఇవ్వాలి. - విద్యాసంక్షేమ సహాయకులు క్షేత్రస్థాయిలో కుటుంబాల వారీగా పరిశీలన చేయాలి. తెల్లరేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు సేకరించాలి. రేషన్‌కార్డులు లేకుంటే ఆరు అంచెల పరిశీలన ద్వారా వారు నిరుపేదలు లేదా అమ్మ ఒడి పథకానికి అర్హులేనన్న అంశాన్ని ధ్రువీకరించుకోవాలి. నవంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామ సచివాలయ సిబ్బంది ఈ సమాచారాన్ని ఎంఈఓలకు అందించాలి. -
‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి కోల్పోకుండా ఉండేందుకు ఇతర పథకాలకు గడువు పెంచినట్లే ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం దరఖాస్తు గడువునూ రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఇప్పటివరకు పేర్లను నమోదు చేసుకోని వారు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లను సంప్రదించి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. శుక్రవారం ఈ పథకంపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ఉంచామని, అర్హతలు, దరఖాస్తు విధానాన్ని వలంటీర్ల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం కొత్త లబ్ధిదారులకు నగదు అందచేస్తామని చెప్పారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కొమానపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభోత్సవం సందర్భంగా దరఖాస్తు గడువు పొడిగింపు గురించి ప్రస్తావించలేదని, ఈ నేపథ్యంలో మత్స్యకారులందరికీ తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
బార్ల లైసెన్సుల రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్,ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేస్తారు. లాటరీ విధానంలో బార్ల కేటాయింపు పేద, సామాన్య ప్రజానీకానికి మద్యాన్ని దూరం చేసేందుకు సెప్టెంబర్ 30న మద్యం బాటిళ్ల రేట్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లే ఇప్పుడు బార్లలోనూ మద్యం ముట్టుకుంటే భారీ షాక్ కొట్టేలా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద ధరలను పెంచారు. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుంది. జనవరి 1 నుంచి ఏర్పాటయ్యే బార్లను లాటరీ విధానంలో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. బార్ల లైసెన్సుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.10 లక్షల చలానా, బార్ ఏర్పాటు చేసే ప్రదేశానికి చెందిన ప్లాన్, అద్దెకు తీసుకుంటే యజమాని నుంచి కన్సెంట్ లెటర్‌ను సమర్పించాలి. -
బీసీ విద్యార్థులకు సర్కారు బొనాంజ
వెనుకబడిన తరగతుల వారికి విదేశీ విద్య కింద అందజేసే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులతో ఎంతోమందికి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమలుకానుంది. విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసి ఇటీవల ఎంపికైన వారికి ఈ మొత్తం అందనుంది. ఆర్థిక సాయం పెంపుతో బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, అమరావతి ఎంపిక విధానం - ఏపీ ఈపాస్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. - 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. - వారు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. - బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపుల వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆర్థిక సాయానికి నిబంధనలివీ.. - పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు వీలుగా ఏటా వెయ్యి మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు.. - అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలలోపు ఉండాలి. ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, వారి సంవత్సర ఆదాయం కూడా ఆరు లక్షలకు మించకూడదు. - దరఖాస్తు చేసిన సంవత్సరం జూలై ఒకటి నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించరాదు. ఏఏ దేశాల్లో చదువుకోవచ్చు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా (ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో కేవలం మెడిసిన్ చదువుకునేందుకు మాత్రమే అనుమతి). సెలక్షన్ కమిటీలో ఎవరెవరు కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉంటారు. సభ్యులుగా ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉంటారు. స్కాలర్షిప్ ఇచ్చే విధానం - విద్యార్థి ల్యాండింగ్ పర్మిట్ చూపించగానే రూ.5లక్షలు మొదటి దఫాగా ఇస్తారు. - సెప్టెంబర్ రిజల్ట్ రాగానే రెండో దఫా రూ.5లక్షలు ఇస్తారు. - చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా.. - రూ.10 లక్షలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చేవారు. - ప్రపంచంలోని 15 యూనివర్సిటీలు, కాలేజీల్లో మాత్రమే చదువుకునేందుకు అనుమతి ఇప్పుడు ఇలా.. - రూ.15 లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇస్తారు. - రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. - సీటు రాగానే అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు అర్హులు. మెరిట్ విద్యార్థులకు సువర్ణావకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దోహదపడుతుంది. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి రూ.15లక్షల రూపాయలు అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకంలో ఆర్థిక సాయం అందిస్తాం. విదేశాల్లో అత్యున్నత వర్సిటీల్లో బీసీ విద్యార్థులకు విద్యను అందించాలని సర్కారు భావించడం గొప్ప నిర్ణయం. మెరిట్ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణావకాశం. – బి. రామారావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ -
ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో తెలుగు/ఉర్దూ భాషలను తప్పనిసరిగా విద్యార్థులు అభ్యసించాలి. ఆంగ్ల మాధ్యమం అమలు, తెలుగు/ఉర్దూ భాషల బోధనను విజయవంతంగా అమలు చేయడంపై విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు బుధవారం జీఓ 85ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం... - ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థి, టీచర్ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలి. - బోధనా నైపుణ్యాల పెంపునకు అవసరమైన హ్యాండ్‌బుక్స్, ఇతర మెటీరియల్‌ను ఎస్సీఈఆర్టీ సిద్ధం చేయాలి. - ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా టీచర్లకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో, వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. - ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, జిల్లా ఇంగ్లిష్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. - విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల ముద్రణకు పాఠ్య పుస్తక విభా గం చర్యలు చేపట్టాలి. - ఎంతమంది టీచర్లు అవసరమో ప్రభుత్వానికి నివేదించాలి. భవిష్యత్తులో ఆంగ్ల మాధ్యమ బోధనలో నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలి. -
హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
సాక్షి, అమరావతి: హజ్, జెరూసలేం యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హజ్ యాత్రకు వెళ్లేవారిలో మూడు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం ఉన్న వారికి రూ. 30 వేలు చొప్పున ప్రభుత్వం సహాయంగా అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మొహద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హజ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను పూర్తిగా చదవాలని, నిర్ధారిత ఫార్మాట్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జెరూసలేం, ఇతర బైబిల్ సంబంధిత యాత్రాస్థలాల సందర్శనార్థం వెళ్లే వారికి.. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు పెంచుతున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ వేరొక ఉత్తర్వులో పేర్కొంది. -
వడివడిగా వెలిగొండ!
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెలిగొండ మొదటి సొరంగంలో మిగిలిపోయిన 1.34 కి.మీ. పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. సొరంగ మార్గంలో కఠిన శిలలు (అబ్రాసివ్ రాక్) ఉండటంతో రోజుకు తొమ్మిది మీటర్లకు బదులుగా సగటున ఐదు నుంచి ఆరు మీటర్లు తవ్వుతున్నారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు కొత్త బుష్‌లు, కన్వేయర్ బెల్ట్‌లు అమర్చడం ద్వారా సొరంగం తవ్వకం పనులను వేగవంతం చేసి మే నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సొరంగం ద్వారా తరలించే నీటిని నల్లమల సాగర్‌లో నిల్వ చేయాలంటే 11 ముంపు గ్రామాలకు చెందిన 4,617 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈ నేపథ్యంలో మే లోగా పునరావాస పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే సీజన్లో కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులకు చేరుకోగానే మొదటి సొరంగం ద్వారా రోజుకు 85 క్యూమెక్కులు(3001.35 క్యూసెక్కులు) చొప్పున తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. వైఎస్సార్ హయాంలో సింహభాగం పనులు పూర్తి శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 11,581.68 క్యూసెక్కుల చొప్పున 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 15.25 లక్షల మంది దాహార్తి తీర్చే వెలిగొండ ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. అప్పటి నుంచి రెండు సొరంగాల్లో మిగిలిన పనులు, పునరావాసం, 2884.13 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చోటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించారు. శ్రీశైలం నుంచి వెలిగొండకు నీటిని తరలించేందుకు 85 క్యూమెక్కుల సామర్థ్యంతో మొదటి సొరంగాన్ని, 243 క్యూమెక్కుల సామర్థ్యంతో రెండో సొరంగం పనులను చేపట్టారు. మొదటి సొరంగం పనులను జూన్‌నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. రెండో సొరంగం పనులను రివర్స్ టెండర్ల ద్వారా తక్కువ ధరకే కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి రూ.61.76 కోట్లను ఖజానాకు మిగిల్చారు. రెండో సొరంగంలో మిగిలిన 7.575 కి.మీ. పనులను 2021 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. మరో రూ.3,480.16 కోట్లు అవసరం – వెలిగొండ పనులకు ఇప్పటివరకు రూ.5,107 కోట్లు ఖర్చు చేశారు. – ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇంకా రూ.3,480.16 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో తొలి దశ పనుల పూర్తికి అవసరమైన రూ.1,600 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి సూచించారు. – రెండో దశ పనుల కోసం రూ.1,880.16 కోట్లను 2020–21, 2021–22 బడ్జెట్లలో కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. – మొదటి సొరంగం పనులు వేగంగా జరుగుతుండగా, రెండో సొరంగం పనులను తక్షణమే ప్రారంభించాలని కొత్త కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. – హెడ్ రెగ్యులేటర్‌తోపాటు నల్లమలసాగర్‌లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. – నల్లమలసాగర్‌లో 11 గ్రామాల ప్రజలకు పునరావాస పనులను ప్రకాశం కలెక్టర్ పోలా భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు. – ఇప్పటికే పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. – గండికోట, పోలవరం ప్రాజెక్టుల తరహాలో నల్లమలసాగర్ నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇంటి నుంచే ఇసుక బుకింగ్
ఇసుక కావాలంటే ఇక ఎక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే చాలు కాలు కదపకుండా ఎక్కడ నుంచైనా ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. – సాక్షి, అమరావతి సాక్షి, అమరావతి: ఇసుక అక్రమార్కులకు కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ రాయితీల నిబంధనలను సవరిస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొందరు ఏపీఎండీసీ వెబ్సైట్ నుంచి నకిలీ ఐడీలతో మోసపూరితంగా ఇసుక బుక్ చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేలా నిబంధనావళిని సవరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పరిమితికి మించి ఇసుక నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తారు. అపరాధ రుసుముతోపాటు చట్ట ప్రకారం రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఇసుక బుకింగ్ ఇలా.. - ఆన్లైన్లో sand.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లగానే ‘వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ శాండ్’ అని ఉంటుంది. దాని కిందే జనరల్ బుకింగ్ / బల్క్ కన్జూమర్ లాగిన్ అని ఉంటుంది. - సాధారణ వినియోగదారులు ‘జనరల్’ అనే కాలమ్ కింద, అధిక పరిమాణంలో ఇసుక కావాల్సిన వారు ‘బల్క్ కన్జూమర్ లాగిన్’ కింద రిజిస్ట్రేషన్ అనే చోట్ల క్లిక్ చేయగానే మొబైల్ నంబరు అనే కాలమ్ ఉంటుంది. - అందులో మొబైల్ నంబరు టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆరు అంకెల వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ నంబరును పాస్వర్డ్ అనే చోట టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆధార్ నంబరు, జిల్లా, పట్టణం/ గ్రామం, చిరునామా తదితర కాలాలు కనిపిస్తాయి. - అన్ని కాలాలను సక్రమంగా భర్తీ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం వస్తుంది. వెంటనే మొబైల్ నంబరు అనే కాలమ్‌లో ఫోన్ నంబరు టైప్ చేసి దాని కింద సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే మొబైల్‌కు ఆరు అంకెల నంబరు వస్తుంది. - దీన్ని టైప్ చేసి సెండ్ ఓటీపీ అని నొక్కితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు మెసేజ్ వస్తుంది. వెంటనే యూజర్ ఐడీ, ఐపీ నంబరు కనిపిస్తాయి. ఎంత కావాలంటే అంత.. - శాండ్ ఆర్డర్‌లోకి వెళ్లి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అక్కడ ఎన్ని టన్నులు, ఎక్కడి (స్టాక్ యార్డు) నుంచి ఎక్కడకు డెలివరీ చేయాలి? వివరాలు నమోదు చేయాలి. - టన్ను రూ.375 చొప్పున ఎంత డబ్బు చెల్లించాలో కూడా వెబ్సైట్లో కనిపిస్తుంది. అన్నీ నమోదు చేసిన తర్వాత చెక్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ‘పేమెంట్ గేట్‌వే’ అని కనిపిస్తుంది. నచ్చిన విధానంలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలి. - ఈ రసీదు సంబంధిత స్టాక్ యార్డులో అందచేసి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డుల దగ్గరే వాహనాలు కూడా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే ప్రస్తుతం ఇసుక బుకింగ్ అందుబాటులో ఉంది. ఇలా ఇసుక బుక్ చేసుకున్న వారు మరుసటి రోజు ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. -
అందరికీ సంక్షేమం వైఎస్సార్ నవశకం
సాక్షి, అమరావతి: సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా వైఎస్సార్ నవశకానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్రంలోని 90 శాతానికి పైగా ప్రజలకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్సిడీ బియ్యం, పెన్షన్లు పొందేందుకు ఆదాయ పరిమితిని భారీగా పెంచారు. ప్రస్తుతం రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ కుటుంబాల వార్షిక ఆదాయం రూ.75 వేలు, పట్టణాల్లో రూ.లక్ష వరకే పరిమితి ఉండేది. దీనిని భారీగా పెంచడం ద్వారా మరింత మందికి ప్రయోజనం కల్పించనున్నారు. ప్రస్తుతం ఏ పథకానికైనా తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా ఉంది. ఇక దాంతో సంబంధం లేకుండా ప్రతి పథకానికి వేర్వేరు కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఎంపిక సంతృప్త స్థాయిలో జరుగుతుంది. అర్హతే ప్రాతిపదికగా ఎంపిక ఉండనుంది. ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. గ్రామాల్లో రోజుకు ఐదు ఇళ్లు, పట్టణాల్లో రోజుకు పది ఇళ్లను మాత్రమే సర్వే చేస్తారు. ఎంపిక పూర్తయ్యాక లబ్దిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. సామాజిక తనిఖీ కోసం ఐదు రోజుల గడువు ఇస్తారు. ఆయా గ్రామ, వార్డు పరిధిలోని ప్రజలు ఆ జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను సూచిస్తారు. సామాజిక తనిఖీలోని అంశాల వాస్తవికత ఆధారంగా లబ్దిదారుల తుది జాబితాలను రూపొందించి గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందుతారు. గ్రామ సభలను ఎంపీడీవోలు, వార్డు సభలను మున్సిపల్ కమిషనర్లు నిర్వహిస్తారు. వీటిలో ఆమోదించిన తుది జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. ఆయా పథకాలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియను డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి నేడో, రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. బియ్యం, పెన్షన్ కార్డులు పొందేందుకు అర్హతలు – బియ్యం కార్డు, పెన్షన్ కార్డు పొందగోరే గ్రామీణులైతే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో వారైతే నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారంతా అర్హులు – కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూమి.. లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు – నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు, పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు లేదా అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారు కూడా అర్హులే. – ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులు మినహా) అనర్హులు. – నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ మినహాయింపు) గలవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. జగనన్న విద్యాదీవెన.. వసతి దీవెన – జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇచ్చేందుకు విడివిడిగా కార్డులను జారీ చేయనున్నారు. – వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల్లోపు గల కుటుంబాలు అర్హులు. – 10 ఎకరాల్లోపు మాగాణి, 25 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట కలిసి 25 ఎకరాల్లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 1,500లోపు చదరపు అడుగుల సొంత భవనం ఉన్నవారూ అర్హులే – ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు) అనర్హులు – నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ మినహాయింపు) ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లు డ్వాక్రా అక్క, చెల్లెమ్మలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు వైఎస్సార్ నవశకం సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లను చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మొత్తంలో రూ.1,200 కోట్లను డిసెంబర్ నెలలో వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం వైఎస్సార్ నవశకం కాపు నేస్తం కింద 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధి కోసం ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చేందుకు విధి, విధానాలను ఖరారు చేశారు. – గ్రామాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు – కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు – పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు, అంత కన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారూ అర్హులే – ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు – నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ ఉంటే మినహాయింపు) ఉన్నవారు అనర్హులు. – ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు. – రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండి సొంత షాపు గల రజకులు, నాయీ బ్రాహ్మణలు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. మరిన్ని పథకాలు జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్దిదారులను ఇంటింటా సర్వేలో వలంటీర్లు గుర్తిస్తారు. అలాగే ఇమాం, మౌజన్, పాస్టర్, అర్చకులకు గౌరవ వేతనాలను వర్తింప చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. అందరికీ ఆరోగ్యశ్రీ – రాష్ట్రంలో 95 శాతానికి పైగా ప్రజలకు వర్తింపు – 35 ఎకరాల్లోపు భూమి, ఏడాదికి రూ.ఐదు లక్షల ఆదాయం ఉన్న వారూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. 35 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి.. కుటుంబంలో ఒక వ్యక్తిగత కారున్న వారికి సైతం పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులును జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అర్హత, మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను వైద్య, ఆర్యోగ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ పంపించి సర్వే చేయించటం ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తారు. అర్హతలు ఇవీ.. – ప్రభుత్వం కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుదారులు – వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డుదారులు – జగనన్న విద్య, వసతి దీవెన కార్డుదారులు – 12 ఎకరాల్లోపు మాగాణి, 35 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు – మాగాణితోపాటు మెట్ట కలిపి 35 ఎకరాల్లోపు భూమి గలవారు – వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు (రుజువు కోసం వేతన సరి్టఫికెట్) – రూ.ఐదు లక్షల లోపు, వరకు ఆదాయం గలవారు (రుజువు కోసం ఆదాయపు పన్ను రిటరŠన్స్) – పట్టణాల్లో 3 వేల లోపు చదరపు అడుగులకు (334 చదరపు గజాలు) ఆస్తి పన్ను కట్టేవారు – రూ.ఐదు లక్షల లోపు, రూ.ఐదు లక్షల వరకు వార్షిక ఆదాయం గల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైమ్, పారిశుద్ధ్య కార్మికులు, గౌరవ వేతనం పొందే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులందరూ – కుటుంబానికి వ్యక్తిగతంగా ఒక కారు ఉన్నా అర్హులే -
సామాజిక పెట్టు‘బడి’!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్కూళ్లను చక్కటి సదుపాయాలతో తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 45,329 ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన బోధన అందించేందుకు ఉద్దేశించిన ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం నేడు ప్రారంభం కాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలిసారిగా చదువులపై భారీ వ్యయం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా వ్యయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యారంగంపై చేసే వ్యయం సామాజిక పెట్టుబడిగా మారి మానవ వనరుల అభివృద్ధి జరగనుంది. దీని ద్వారానే మెరుగైన సమాజం సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ దృఢంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘మనబడి నాడు– నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. విప్లవాత్మక నిర్ణయం మూడేళ్లలో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమానికి రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనాలు ఇంకా పెరగవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక సీఎస్ పీవీ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్లపై వ్యయం చేయడం అంటే ఇదంతా సామాజిక పెట్టుబడేనని తెలిపారు. తద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాలు విద్యను ప్రైవేట్ పరం చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం వెనుక సామాజిక బాధ్యత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్కూళ్ల అభివృద్ధి ఇలా - నాడు–నేడు తొలి దశ కార్యక్రమం కింద 15,715 స్కూళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.3.627 కోట్లు అవసరమని అంచనా వేశారు. – తొలిదశలో గ్రామీణ, గిరిజన, పట్టణ, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధి. - జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కలెక్టర్లు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపడతారు. - ఇప్పటికే రాష్ట్రంలోని 45,329 సూళ్ల పరిస్థితికి సంబంధించి 20.19 లక్షల ఫొటోలను కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. - మౌలిక వసతుల కల్పన అనంతరం స్కూళ్ల ఫొటోలు మరోసారి తీసి తాజాగా ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలిసేలా వెబ్ పోర్టల్‌లో పొందుపరుస్తారు. - మన బడి పేరుతో నాడు–నేడు కింద చేపట్టనున్న పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు పబ్లిక్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక, మద్యం పాలసీల అమలుతీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబరు ఖరారయ్యింది. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు.. మద్యం అక్రమ విక్రయాలపై ఫిర్యాదులకు ‘14500’ నెంబర్‌ను కేంద్ర టెలికం శాఖ కేటాయించింది. దీంతో దీనిని టోల్‌ఫ్రీ నంబరుగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తగు ఏర్పాట్లుచేసిన తర్వాత ఈ నంబర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. ఆ సమాచారం త్వరలో ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. -
సబ్సిడీ రుణాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాల కోసం ఈ ఏడాది మొత్తం 20,67,509 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 10వ తేదీ ఆదివారంతో ముగిసింది. మొత్తం 1,94,582 మందికి రుణాలివ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారుకు 20లక్షలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ మొత్తం దరఖాస్తులు ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టం (ఓబీఎంఎంఎస్) ద్వారా 20 కార్పొరేషన్లకు దరఖాస్తులు అందాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఎంబీసీ, క్రిస్టియన్ మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగుల కార్పొరేషన్‌తో పాటు మరికొన్ని ఉన్నాయి. ప్రధానంగా బీసీ కార్పొరేషన్‌కు 6,93,914 దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్‌కు 3,07,473, కాపు కార్పొరేషన్‌కు 2,08,007, మైనార్టీ కార్పొరేషన్‌కు 2,56,922 దరఖాస్తులు వచ్చాయి. కాగా, మండల స్థాయిలో ఎంపీడీఓలతో ప్రభుత్వం నియమించిన కమిటీలు.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మునిసిపల్ కమిషనర్లతో నియమించిన కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3,405.79 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలివ్వనుంది. ఇందులో సబ్సిడీ కింద రూ.1,678.50 కోట్లు ఇవ్వనుంది. -
విశిష్ట సేవకులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు
సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన.. ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. కాగా, ఏయే రంగాల్లో వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించింది. అవి.. ఏయే రంగాల్లో... ఏయే రంగాల్లో విశిష్ట ప్రజాసేవలు అందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారో కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ముఖ్యమైనవి. సోషల్ వర్క్: సామాజిక, సేవా రంగాలు, సామాజిక ప్రాజెక్టులకు అందించిన సేవలు. ప్రజావ్యవహారాలు: న్యాయ, రాజకీయ, ప్రజాసేవలు సైన్స్, ఇంజినీరింగ్: స్పేస్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాల్లో పరిశోధన, అభివృద్ధి. వ్యాపార వాణిజ్య రంగాలు : బ్యాకింగ్, ఆర్థిక వ్యవహారాలు, టూరిజం, వాణిజ్య నిర్వహణ, విస్తరణ. ప్రింట్ మీడియా: విశిష్ట సేవలు అందించిన ఎడిటర్స్, జర్నలిస్టులు. ఎలక్ట్రానిక్ మీడియా: విశిష్ట సేవలు అదించిన వారు వైద్య రంగం: ఆయుర్వేద, హోమియో, సిద్ధ, అల్లోపతి, ప్రకృతి వైద్యం (నేచురోపతి) రంగాల్లో పరిశోధకులు. కళలు, సాహిత్యం, విద్య: జర్నలిజంతో సహా కళలు, సాహిత్యం, విద్యా రంగాల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధన, విద్యా విస్తరణ, సంస్కరణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు ప్రజాసేవ: పరిపాలన రంగంలో ప్రజలకు అత్యుత్తమ, అసాధారణ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు. క్రీడారంగం: ప్రసిద్ధ కీడ్రలు, అథ్లెటిక్స్, పర్వతారోహకులు, యోగా, క్రీడల విస్తరణకు పాటుపడ్డ వారు. వీటితోపాటు ఇందులో ప్రస్తావించని సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని కూడా ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. కమిటీ ద్వారా ఎంపిక పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరిస్తారు. ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు. కాగా, 2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు.. నేడు డిపాజిట్ల పంపిణీ
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: మరికొద్ది గంటల్లో అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. ఐదేళ్ల వారి పోరాటం ఫలించే రోజు రానే వచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచరణలోకి తీసుకువచ్చారు. తొలివిడతలో 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా.. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ముందుగా రూ.10వేలలోపు డిపాజిటర్లకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్లోనే వారికి రూ.1,150 కోట్లు కేటాయించారు. మరోవైపు.. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ ప్రక్రియకు సంబంధించిన వివాదాలు కొనసాగున్నా, నిబంధనలకు లోబడి ప్రభుత్వం బాధితులకు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ముందుగా రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గతనెల 18న రాష్ట్ర ప్రభుత్వం రూ.263.99 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కెఆర్ఎం కిశోర్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి సాంత్వన కలుగుతుంది. దీంతో అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కాగా, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ (డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును అందజేయనున్నారు. అలాగే, రూ.20 వేలలోపు వున్న మరో 4 లక్షల మంది డిపాజిటర్లకు కూడా త్వరలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు అధికారులు తెలిపారు. అధిక వడ్డీల ఆశచూపి.. విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’.. అనతి కాలంలోనే రోజువారీ కష్టం చేసుకునే వారితోపాటు.. చిన్నా, మధ్య తరగతి వర్గాలకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల ఆశచూపి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లను సేకరించింది. వీటి ద్వారా పెద్దఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంల ద్వారా సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని నిర్ణీత గడువులోగా అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించడంతో ఏపీతో పాటు పలుచోట్ల అగ్రిగోల్డ్ యాజమాన్యంపై పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ ఆస్తులపై గద్దల కన్ను ఈ నేపథ్యంలో.. అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి వారికి స్పందన కరువైంది. మరోవైపు.. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో వున్న అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించారు. దీనిని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేసి అప్పటి చంద్రబాబు సర్కార్ కుట్రలను అడ్డుకుంది. ఇదే క్రమంలో ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ బాధితులు అడుగడుగునా వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని దోచుకోవాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. దీంతో తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతా క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ నాడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నేడు నెరవేరుస్తున్నారు. సీఎం సభకు ఏర్పాట్లు పరిశీలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉ.11 గంటలకు గుంటూరు నగరానికి రానున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో రూ.10వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మొహ్మద్ ముస్తఫా, విడదల రజని, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్ తదితరులు పరిశీలించారు. సీఎం సభకు బుధవారం సాయంత్రానికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనందకుమార్, అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, జేసీ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపురెడ్డి మంత్రులకు వివరించారు. చరిత్రలోనే తొలిసారి.. ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవని.. పేద ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమానికి పెద్దఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ అన్ని విభాగాల నాయకులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఇక ఇంగ్లిష్ మీడియం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఎనిమిది తరగతులను వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి, తొమ్మిదో తరగతికి 2021–22 నుంచి, పదో తరగతికి 2022–23 నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మం గళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని స్కూ ళ్లలో ఇంగ్లిష్ మీడియంను అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు అప్పగించి అందుకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఇంగ్లిష్ మీడియం అమలుకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తీసుకోవాల్సిన చర్యలు.. – టీచర్, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో అవసరమైన ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి. – ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వడం, హ్యాండ్ బుక్స్ రూపకల్పన, వాటిని అభివృద్ధి చేయడం, తరగతి గదుల్లో ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, టీచర్లకు అవసరమైన బోధన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) నిర్వహిస్తుంది. – ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న ఇంగ్లిష్ నైపుణ్య స్థాయిని ఆన్లైన్లో అంచనా వేయడం, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం పెంచేందుకు టీచర్లకు ఇవ్వాల్సిన శిక్షణా తరగతుల రూపకల్పన గురించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌తో సమన్వయం చేసుకోవాలి. – వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు (1 నుంచి 8 తరగతి వరకు) ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ, 2020 వేసవిలోనూ టీచర్లకు విస్తృతంగా శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించి.. వారి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. – టీచర్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు, వారు బోధన మెళకువలు నేర్చుకునే వరకు సంబంధిత సబ్జెక్టు, సాధారణ అంశాలపై వారికి ఎక్కువ శిక్షణ ఇవ్వాలి. – ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్ల (డీఈసీలు)ను డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డీఐఈటీ)లుగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి. – పాఠ్యపుస్తకాల ముద్రణ డైరెక్టర్ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నమోదైన విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు వీలుగా కచ్చితమైన ఇండెంట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలి. – వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిది తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తున్న దృష్ట్యా అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్య, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపాలి. – ఇంగ్లిష్ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అర్హులైన అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే టీచర్ల నియామకాల్లో నియమించుకోవాలి. -
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విప్లవం
-
గ్రామాల్లో మురుగుకి చెక్
సాక్షి, మచిలీపట్నం: గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని పంచాయతీల్లో ఓపెన్ డ్రెయిన్స్ నిర్మించాలని సంకల్పించింది. రాష్ట్రంలో ఐదువేల జనాభాకు పైబడిన పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని గత ప్రభుత్వం హంగామా చేసింది. నిరంతరం మురుగు నీరు పారే పరిస్థితి లేనప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వలన ప్రయోజనం ఉండదని అప్పట్లో ఉన్నతాధికారులు మొత్తుకున్నా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున అంచనాలు వేసి పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ మేలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లోనూ అమలు... అన్ని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.1,897.50 కోట్లతో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎల్‌డబ్ల్యూఎం) ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరిట చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టులో 30 శాతం స్వచ్ఛాంధ్ర మిషన్, 70 శాతం ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ మేరకు రూ.577.50 కోట్లు స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి, మిగిలిన రూ. 1,320 కోట్లు ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.11.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారుల్లో ఒక వైపు, మెయిన్ రోడ్లలో ఇరువైపులా నిర్మించనున్నారు. తొలుత నియోజకవర్గానికో గ్రామ పంచాయతీని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మిగిలిన పంచాయతీల్లో అమలు చేస్తారు. స్థలం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇళ్ల వద్ద సోక్ పిట్స్ నిర్మిస్తారు. అలాగే సోక్ పిట్ లేదా డ్రైన్లకు అనుసంధానిస్తూ బట్టలు, వంట సామాగ్రి శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్లాట్ ఫామ్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇళ్లల్లో వినియోగించే నీటిలో 80 శాతం డ్రైన్స్ ద్వారా వెళ్లే విధంగా డిజైన్ చేయనున్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఓపెన్ డ్రైన్స్ రాష్ట్రాన్ని నూరు శాతం మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని గ్రామాల్లో సంతృప్త స్థాయిలో ఓపెన్ డ్రైన్స్ నిర్మించేందుకు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు చేపట్టాం. ఇందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశాం. –సంపత్‌కుమార్, ఎండీ, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ -
ఐదేళ్లలో టాప్–5లోకి..
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతమున్న 2.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రధాని లక్ష్యంతో స్ఫూర్తి పొందిన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ లక్ష్యాలను నిర్దేశించుకొని కీలక రాష్ట్రంగా ఎదగాలనే కృతనిశ్చయంతో ఉంది. వచ్చే ఐదేళ్లలో టాప్–5లో చేరాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం దేశ ఆరి్థక వ్యవస్థలో కేవలం 9 రాష్ట్రాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మహారాష్ట్ర అత్యధికంగా రూ.26 లక్షల కోట్ల జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (రూ.16.64 లక్షల కోట్లు), ఉత్తరప్రదేశ్ (రూ.15.42 లక్షల కోట్లు), కర్ణాటక (రూ.15.35 లక్షల కోట్లు), గుజరాత్ (రూ.13.14 లక్షల కోట్లు) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రూ.9.33 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మహారాష్ట్ర, ఢిల్లీలు మొదటి రెండు స్థానాల్లో ఉంటే మన రాష్ట్రం రూ.2.20 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉంది. జీడీపీ, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉండటం గమనార్హం. కీలక రాష్ట్రాలపై కేంద్రం దృష్టి ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే పట్టుదలతో ఉండటంతో జీడీపీలో కీలక రాష్ట్రాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోర్టు ఆధారిత బ్లూ ఎకానమీ, ఫార్మా, పెట్రోకెమికల్స్ వంటి రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండంకెల వృద్ధిరేటుతో పయనిస్తున్న రాష్ట్రం వచ్చే ఐదేళ్లలో సగటున 25 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తే కానీ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)పై అత్యధికంగా దృష్టిపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర జీడీపీలో ప్రస్తుతం సుమారు 15 శాతంగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగ వాటాను వచ్చే ఐదేళ్లలో 30–35 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా క్లస్టర్ విధానంలో ప్రతి జిల్లాలో కనీసం 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను నిర్మించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా భావనపాడు, బందరు, రామాయపట్నం పోర్టులకు స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా త్వరితగతిన ఈ మూడింటినీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఆక్వా ఎగుమతులను పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా 46 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలో విడుదల చేసే నూతన పారిశ్రామిక పాలసీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో కీలక రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం దేశ జీడీపీలో మన రాష్ట్రం ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో టాప్–5లో చోటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనికి కేంద్రం ఎలాంటి సహాయసహకారాలు అందిస్తుందో తెలుసుకునేందుకు త్వరలో కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించనున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా గత ప్రభుత్వం చెల్లించని పారిశ్రామిక రాయితీల బకాయిలను తీర్చాలని నిర్ణయించాం. అదేవిధంగా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందించడానికి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంతోపాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.24 వేల కోట్లతో స్వర్ణ చతుర్భుజి పేరుతో మొదలుపెట్టిన జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్ట్ దేశ జీడీపీని పరుగులు పెట్టించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కేంద్రం భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను చేపడితే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి -
దివ్యాంగులకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(యూడీఐడీ) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు రాయితీ పొందడానికి ఈ స్మార్ట్ కార్డును చూపిస్తే సరిపోతుంది. అర్హుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించి, ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్, ఎంపవర్మెంట్(సదరమ్) సర్టిఫికెట్లు కలిగిన వారు మళ్లీ ఇందుకోసం వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ‘సెర్ప్’ వద్ద ఉన్న డేటాను వినియోగించుకోనున్నారు. దివ్యాంగులకు స్వావలంబన కార్డు పేరిట స్టాండర్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూడీఐడీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దివ్యాంగులు తమ వైకల్యాన్ని రుజవు చేసేందుకు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటారు. అంగవైకల్యం వివరాలను కార్డు రీడర్ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. -
మూడు నెలల్లో నిర్వహిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు బుధవారం నివేదించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈ వివరాలను లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించట్లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన వేణుగోపాల కృష్ణమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. దీంతో ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
తప్పుడు వార్తలు రాస్తే కేసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై నిరాధారమైన తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా ఇక చర్యలు తప్పవు. సర్కారుపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్య, నిరాధార వార్తలను ప్రసారం చేసిన, ప్రచురించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలపై కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దురుద్దేశ పూర్వకంగా ప్రభుత్వానికి లేనివి ఆపాదిస్తూ అసత్య ప్రచారం చేసే సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌కు అధికారాలు కల్పిస్తూ 2007 ఫిబ్రవరి 20న సాధారణ పరిపాలన శాఖ జీఓఆర్టీ నెంబరు 938 జారీ చేసిన విషయం విదితమే. దీని ప్రకారం ప్రభుత్వానికి చెడ్డపేరు ఆపాదించడమే లక్ష్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తే స్పందించి ఖండనలు ఇవ్వడంతోపాటు ఆయా సంస్థలు, ఎడిటర్లపై న్యాయపరమైన చర్యల కోసం కేసులు నమోదు చేయాలని తాజాగా ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు ప్రతిష్టను మంట గలిపే కుట్ర నేపథ్యంలో... సర్కారు ప్రతిష్టను మంటగలపాలని, ప్రజల్లో చెడ్డపేరు తేవాలనే దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు కుట్రపూరితంగా పెద్దఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారీ వర్షాలవల్ల ప్రధానమైన నదుల్లో వరదనీరు ప్రవహిస్తున్నందున ఇసుక రీచ్‌లన్నీ నీటిలో మునిగిపోవడంవల్ల ఇసుక కొరత ఏర్పడితే ఆ విషయం ప్రస్తావించకుండా విపక్షాల ప్రేరేపణతో కొన్ని వార్తా సంస్థలు సర్కారు ప్రతిష్టను మంట గలపాలనే కుట్రతో అసత్య ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరహా సర్కారుకు మచ్చ తెచ్చే, పరువు నష్టం కలిగించే వార్తలు ఏ శాఖపై వచ్చినా తక్షణమే ఆశాఖ కార్యదర్శి స్పందించి పూర్తి సమాచారంతో ఖండనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఖండన వార్తలను ప్రధానంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. -
పింఛన్ల పండుగ
సాక్షి, అమరావతి: సంతృప్త (శాచ్యురేషన్) స్థాయిలో రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ.. తదితర పింఛన్లు మంజూరుకోసం నవంబర్ 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 25వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హులనుంచి వారి ఇంటివద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. అదే సమయంలో ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్ని సైతం వలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పింఛన్లకోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డులవారీగా జాబితాలు తయారుచేసి, వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1–14వ తేదీల మధ్య సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్టు వారు వివరించారు. నవంబర్ 5 నుంచి అధికారులకు శిక్షణ.. కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్ ప్రక్రియపై నవంబర్ 5 నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. 5న జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ ఇస్తారు. నవంబర్ 7, 8 తేదీల్లో ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఇద్దరేసి చొప్పున అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ అందజేస్తారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో నవంబర్ 12, 13, 14 తేదీల్లో స్థానిక సిబ్బందికి శిక్షణ ఇస్తారు. నవంబర్ 15–20 తేదీల మధ్య గ్రామ, వార్డు వలంటీర్లకు ఈ ప్రక్రియపై శిక్షణ ఇస్తారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు మరింత ఊరట
-
ఇసుకతో పార్టీల విషరాజకీయం
-
పంచాయతీరాజ్ శాఖలో రివర్స్ టెండరింగ్ సక్సెస్
-
ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్ మాటున కొందరు సాగిస్తున్న ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోసపూరిత మార్గాలను అనుసరించిన వ్యక్తుల నుంచి ఇసుకను, వాహనాలను స్వాదీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు బనాయించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా పూర్తి పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే, కొందరు దళారులు అక్రమార్జనే లక్ష్యంగా వేర్వేరు వ్యక్తులు, చిరునామాలతో ఐడీలు సృష్టించి పెద్ద పరిమాణంలో ఇసుక బుక్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక లోడుతో వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఇసుక బుకింగ్‌లో అక్రమాలు సాగుతున్న వైనం బట్టబయలైంది. తప్పుడు ఐడీల స్కాన్ కాపీ - గుంటూరుకు చెందిన బి.కిషోర్ అనే వ్యక్తి వేర్వేరు పేర్లతో గుంటూరులోని వేర్వేరు చిరునామాలతో, వేర్వేరు ఐడీ నంబర్లతో ఆన్లైన్ ద్వారా రూ.1.27 లక్షల విలువైన ఇసుక బల్క్ బుకింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను సీజ్ చేసి అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. - కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. బినామీ పేర్లతో రూ.3.80 లక్షల విలువైన ఇసుకను అతడు ఆన్లైన్లో బుక్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. మీ–సేవ కేంద్రం ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు. దొరికిందిలా.. సబ్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీను సిబ్బందితో కలిసి గన్నవరంలోని కొనాయి చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీని రోడ్డు పక్కన నిలిపేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. గన్నవరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బొజ్జగాని వీరాస్వామి, దావాజీగూడెంలోని మసీదు ఎదురుగా ఉన్న ‘మీసేవ’ సెంటర్ ఆపరేటర్ సింగలపల్లి దుర్గారావు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఐపీ నంబర్లు సృష్టించి ఇసుక బుక్ చేసుకుని లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని డ్రైవర్, క్లీనర్ అంగీకరించారు. ‘మీసేవ’ ఆపరేటర్ దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇసుకను మోసపూరితంగా బుకింగ్ చేసినందుకు బ్రోకర్లు, లారీ యజమానుల నుంచి దుర్గారావు రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేసినట్లుగా తేలింది. -
సీఎం ఆదేశాలు తక్షణమే అమలు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజనార్థం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి/సీఎం కార్యాలయం (సీఎంవో) పంపించే ఆదేశాలపై ఉత్తర్వుల(జీవో) జారీకి నిర్ధిష్ట గడువు (టైమ్‌లైన్) విధించింది. ముఖ్యమంత్రి/సీఎంవో ఈ–ఆఫీసు రూపంలో పంపించే ఫైలు సంబంధిత శాఖలకు చేరిన తర్వాత నిర్ధిష్ట గడువులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర్వులు జారీ కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం ఆదేశాల తక్షణ అమలే లక్ష్యంగా ఉత్తర్వుల జారీ కోసం బిజినెస్ రూల్స్‌ను సవరించింది. దీనిప్రకారం ముఖ్యమంత్రి/సీఎంవో అధికారులు ఎండార్స్మెంట్ చేసిన ఫైళ్లను ఔట్టుడే, మోస్ట్ ఇమ్మీడియట్ (అత్యంత తక్షణం), ఇమ్మీడియట్ (తక్షణం) అనే విభాగాల్లో ఈ–ఆఫీసు ద్వారా సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపుతారు. ఇవి సంబంధిత విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి చేరిన తర్వాత ఒక్క రోజులోనే ఉత్తర్వులు జారీ చేయాలి. మోస్ట్ ఇమ్మీడియట్ కేటగిరీ కింద వచ్చిన ఫైళ్లకు సంబంధించిన జీవోలను 5 రోజుల్లో జారీ చేయాలి. ఇమ్మీడియట్ కేటగిరీ కింద వచ్చే ఫైళ్లకు సంబంధించిన జీఓలను 15 రోజుల్లో జారీ చేయాలి. ఇలా నిర్ధిష్ట సమయంలో సంబంధిత శాఖల అధికారులు (ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు) జీఓలు జారీ చేయడంతోపాటు చర్యల నివేదికను కూడా సీఎం/సీఎంఓకు తెలియజేయాలి. ఈ టైమ్‌లైన్ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు జారీచేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్‌లోని సెక్షన్ 4, రూల్ 20కి సవరణలు చేసినట్లు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం జీవో జారీ చేశారు. గడువు ఉల్లంఘిస్తే.. జీఓల జారీలో ఎవరైనా నిర్ధిష్ట గడువు పాటించకుండా ఉల్లంఘిస్తే సీఎం సంబంధిత ఫైలును వెనక్కు తెప్పించుకుని, జాప్యానికి కారణాలు పరిశీలించి, సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి ఈ జీఓ జారీ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి గానీ, ఇతర ఏ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శికి గానీ అప్పగించవచ్చు. సీఎం అప్పగించిన బాధ్యతల ప్రకారం వారు ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం జీఓ జారీ చేస్తారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తుందని భావించే జీఓలు, అంతర్గత ఆదేశాలు (మెమో) జారీ చేయాలంటే ముందుగా ముఖ్యమంత్రి/ముఖ్య కార్యాలయ అధికారులకు పంపించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
సచివాలయాల్లోనూ సూపర్ ‘రివర్స్’
సాక్షి, అమరావతి: అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజాధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన డెస్క్‌టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్, ప్రింటర్ల కొనుగోళ్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టింది. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్, ప్రింటర్లకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ఎల్–1, ఎల్–2, ఎల్–3గా నిలిచిన సంస్థలతో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీంతో మొత్తం రూ.65.47 కోట్ల ప్రజాధనం ఆదా కావడం గమనార్హం. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్ కొనుగోళ్లలో.. రాష్ట్రంలోని 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలకు అవసరమైన 29,888 డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 14,944 యూపీఎస్ సిస్టమ్స్ కొనుగోలుకు ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. ఒక సంస్థ రూ.191.10 కోట్లు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. మరో సంస్థ రూ.235.58 కోట్లు కోట్ చేసి ఎల్–2గా, ఇంకో సంస్థ రూ.326.58 కోట్లు కోట్ చేసి ఎల్–3గా నిలిచాయి. ఈ మూడు సంస్థలతో రివర్స్ టెండరింగ్‌ను నిర్వహించారు. ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధర రూ.191.10 కోట్ల కంటే ఇంకా తక్కువ ధరకు వచ్చేందుకు రివర్స్ టెండరింగ్‌ను చేపట్టారు. ఇందులో తొలుత ఎల్–2గా నిలిచిన సంస్థ రూ.139.95 కోట్లు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. అంటే డెస్క్‌టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్ కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ వల్ల రూ.51.15 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. 26.77 శాతం తక్కువ ధరకే ఆయా పరికరాలు గ్రామ, వార్డు సచివాలయాలకు అందనున్నాయి. ప్రింటర్ల కొనుగోళ్లలో.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 ప్రింటర్ల కొనుగోళ్ల కోసం తొలుత ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ టెండర్లు పిలిచింది. ఒక సంస్థ రూ.38.92 కోట్లు కోట్ చేసి ఎల్–1గా, మరో సంస్థ రూ.47.12 కోట్లు కోట్ చేసి ఎల్–2గా నిలిచాయి. ఎల్–1 కోట్ చేసిన రూ.38.92 కోట్ల కంటే తక్కువ ధరకు వచ్చేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, తొలి టెండర్లో ఎల్–2గా నిలిచిన సంస్థ కేవలం రూ.24.60 కోట్లు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. తద్వారా రూ.14.32 కోట్ల నిధులు ఆదా అయ్యాయి. 36.80 శాతం తక్కువ ధరకే ప్రింటర్లు లభిస్తున్నాయి. -
పోలవరం ‘సవరించిన అంచనాల కమిటీ’ నేడు భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలోని సవరించిన అంచనాల కమిటీ(ఆర్ఈసీ) గురువారం ఢిల్లీలో సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు వ్యక్తం చేసిన అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివృత్తి చేసిన నేపథ్యంలో.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ‘ఆర్ఈసీ’ ఆమోదముద్ర వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రతిపాదనలపై ఆర్ఈసీ ఆమోదముద్ర వేసి కేంద్ర మంత్రిమండలికి పంపుతుంది. సవరించిన అంచనాల ప్రకారం నిధులివ్వాలి రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ’ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వంద శాతం నిధులతో ఆ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తొలిసారిగా 2015 మార్చి 12న సమావేశమైంది. ప్రాజెక్టు పనులను 2004–05 స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ప్రకారం చేపట్టడం, భూసేకరణ చట్టం–2013 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరుగుతుందని.. ఆ ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, అప్పటి టీడీపీ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. కేంద్ర జల్ శక్తి శాఖ, పీపీఏ పదేపదే లేఖలు రాయడంతో 2017 ఆగస్టు 16న సవరించిన అంచనా వ్యయ (రూ.57,940.86 కోట్లు) ప్రతిపాదనలు పంపింది. అందులో అవతవకలను ప్రస్తావించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) రూ.2,391.99 కోట్ల మేర కోత పెట్టింది. చివరకు రూ.55,548.87 కోట్లకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పోలవరం ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటికే రూ.841.33 కోట్లు ఆదా చేయడంతో కేంద్ర సర్కారు వ్యవహార శైలిలోనూ మార్పు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఆర్ఈసీలో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్దీప్సింగ్ చౌదరితో సెప్టెంబరు 6న.. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి యూపీ సింగ్‌తో సెప్టెంబర్ 15న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు భేటీ అయ్యారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు కొలిక్కి రావడంతో గురువారం ఢిల్లీలో ఆర్ఈసీ భేటీని ఛైర్మన్ జగ్మోహన్ గుప్తా ఏర్పాటు చేశారు. -
2,252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షి, అమరావతి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 2,252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖరీఫ్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,815, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,765 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధరను కేంద్రం మరికొంత పెంచొచ్చని ఓ అధికారి తెలిపారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే రైతులు బయట కూడా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యానికి తేమ శాతం కొలిచే మీటర్లు, బరువు తూచే యంత్రాలు, టార్పాలిన్లు, తూర్పారపట్టే యంత్రాలు, తదితర వాటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు 9.63 లక్షల మంది రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు –కోన శశిధర్, ఎక్స్అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి. దీనివల్ల రైతులకు మద్దతు ధర కూడా లభిస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2,252 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. అవసరమైతే కేంద్రాలను పెంచుతాం. ఎక్కువ ధర ఇస్తామని చెప్పి కొందరు దళారులు తూకాల్లో మోసం చేసే ప్రమాదం ఉంది. మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలపాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం. -
ఇళ్ల స్థలాలపై కసరత్తు ముమ్మరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నివాస గృహ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వచ్చే ఉగాది సందర్భంగా ఇంటి స్థలం పట్టా జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన భూమి సేకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే నివాస స్థల పట్టాల జారీకి 22 లక్షల మంది అర్హులను అధికారులు ఖరారు చేశారు. వీరి జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టారు. నాలుగైదు రోజులుగా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో గ్రామసభలు కూడా నిర్వహించి లబ్ధిదారుల జాబితాలకు ఆమోదం తెలిపారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదన్న మాట ఉండరాదని, సంతృప్త స్థాయిలో లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో అర్హుల జాబితాలో పేర్లు లేని వారు జనవరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివాదం లేని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారికి (రెండు సెంట్ల లోపు) పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి కేవలం రూపాయికే వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఏదైనా కారణాల వల్ల ఎవరి పేరైనా అర్హుల జాబితాలో లేకపోతే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి వరకూ వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులందరి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి నివాస స్థల పట్టాలు ఇచ్చే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్.. జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఈ మొత్తం ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 21,948.72 ఎకరాలు సిద్ధం గ్రామీణ ప్రాంతాల్లో 19,389.05 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,559.67 ఎకరాలు ఇప్పటి వరకు మొత్తం 21,948.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గుర్తించారు. ఇది కాకుండా ఇంకా అవసరమైన భూమిని గుర్తించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. అవసరాలకు సరిపడా ప్రభుత్వ భూమి లేని ప్రాంతాల్లో సంప్రదింపుల ద్వారా సేకరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)భూ సేకరణకు పరిశ్రమల శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నంబరు 181 (తేదీ 19–12–2016), పీఎంఏవై కింద ఇళ్ల నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నంబరు 214 (తేదీ 9–7–2018) ప్రకారం జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ భూ యజమానులతో సంప్రదించి భూమిని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ నెల 22వ తేదీ నాటికి సుమారు 22 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
డొక్కు బస్సులకు చెక్..
ఎప్పుడాగిపోతాయో తెలియదు.. ఎక్కడాగిపోతాయో అంతు బట్టదు. ప్రయాణికులు గమ్యానికి చేరతారో లేదో అంతుబట్టదు. ఆర్టీసీలో ఆలాంటి డొక్కు బస్సులను పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలం చెల్లిన బస్సులకు మోక్షం లభించనుంది. సంస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో రూ.వెయ్యి కోట్ల రుణసాయంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి వీలవుతుందని కార్మిక సంఘాలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఆ నిధులను కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సంస్థ మనుగడ మెరుగుపడుతుంది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్టీసీ నార్ట్ ఈస్ట్ కోస్ట్ రీజియిన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కాలం చెల్లిన బస్సులు 100 వరకు ఉన్నాయి. మోటారు చట్ట నిబంధనల మేరకు ప్రయాణికుల రవాణా భారీ వాహనాలకు జీవిత ప్రయాణ పరిమితులుంటాయి. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల బస్సుల జీవితకాలం 8 లక్షల కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే. ఇంకా సామర్థ్యం ఉంటే పాసింజర్ బస్సు సర్వీసులుగా నడపవచ్చు. కానీ పాసింజర్ సర్వీసులకు 12 లక్షల కిలోమీటర్ల దూరంగా నిర్ధేశించారు. ఆ పరిధి దాటితే రోడ్డు మీద అవి తిరగడానికి వీల్లేదు. అంతవరకు 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఎక్స్‌ప్రెస్‌లను పాసింజర్ సర్వీసులుగా తిప్పుతారు. తరువాత 12 కిలోమీటర్లు తిప్పాక కాలం చెల్లిన బస్సులుగా మూలకు చేర్చుతారు. తాజాగా నెక్ పరిధిలో మొత్తం 789 బస్సుల్లో ఒక్కొక్క డిపోల్లో 8 నుంచి 10 బస్సులను పూర్తి స్థాయిలో సామర్థ్యం లేనివిగా గుర్తించి వాటిని రోడ్డుపైకి పంపుతున్నారు. వాటిలో అధిక శాతం ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నట్టు వివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విఖాఖ నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ రఘు ఇంజనీరింగ్ కాలేజీ జంక్షన్లో ఆగిపోయింది. విశాఖ – విజయనగరం మధ్య జాతీయ రహదారిపై వారానికి కనీసం నాలుగు బస్సులైనా బ్రేక్‌డౌన్ అవుతూ దర్శనమిస్తాయి. రెండురోజుల క్రితం విజయనగరం నుంచి జామి మీదుగా వెళ్లే రూట్లో పల్లెవెలుగు బస్సు నిలిచిపోయింది.ఔ అయిదేళ్లుగా కాలక్షేపం.. సామర్థ్యం లేని బస్సులను ఏటా గుర్తించి వాటి స్థానంలో ప్రత్నామ్నాయంగా కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు అలాంటి చర్యలేవీ చేపట్టకుండా సామర్థ్యం లేని పాత బస్సులనే కొనసాగించిందన్న విమర్శలున్నాయి. సంస్థ కార్మిక సంఘాలు ఈ విషయాన్ని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ నార్త్ ఈస్టు కోస్ట్ (నెక్) రీజయన్ పరిధిలోని తొమ్మిది డిపోలలో 789 బస్సులున్నాయి. వీటిలో 587 బస్సుల సంస్థవి కాగా మిగిలినవన్నీ అద్దె ప్రాతిపదికన ఉన్నవే. అయితే సంస్థ బస్సుల్లో 208 వరకూ సుమారు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినవని సమాచారం. మోటారు చట్టం ప్రకారం 11 నుంచి 12 లక్షల కిలోమీటర్ల మధ్య రవాణా చేసిన బస్సులను సర్వీసుల నుంచి తొలగించాల్సి ఉంది. సంస్థ మెకానికల్ విభాగం ద్వారా తనిఖీ చేశాక వాటి సామర్థ్యం మెరుగ్గా ఉందనిపిస్తే కొన్నాళ్ల వరకూ తిప్పుకొనే అవకాశం ఉంది. కానీ అలాంటి చర్యలేవీ చేపట్టకుండా గత పాలకులు కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా రోజుకు 300 కిలోమీటర్లు మాత్రమే తిరగాల్సిన బస్సుల్ని 400 కిలోమీటర్ల వరకూ నడిపిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా శబ్ధ, వాయు కాలుష్యాలు, సమయాభావంలేని ప్రయాణం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దూర సర్వీసులలో ఇలాంటి బస్సులే ఏర్పాటు చేయడం వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కొత్త బస్సులొస్తే మెరుగైన సేవలు.. బస్సుల రవాణా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి సర్వీసులకు పంపుతాం. నెక్ రీజియన్‌లో సామర్థ్యం లేని 100 బస్సుల వరకూ తాజాగా రద్దు చేసి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేశాం. రద్దు చేసిన బస్సుల్లో 12 లక్షల కిలోమీటర్లు నడిచినవి. వాటి స్థానంలో కొత్త బస్సులు వస్తే సంస్థ సేవలు మరింత మెరుగుపడతాయి. సామర్థ్యంలో లేని బస్సులను నిర్వహించడం లేదు. సంస్థకు ప్రభుత్వం ప్రకటించిన రుణసాయం కొత్తబస్సుల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – కొటాన శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ, ఆర్టీసీ నెక్ -
వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
సాక్షి, విజయనగరం: వయో వృద్ధుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా ఏరియా ఆసుపత్రిలో వృద్ధుల వార్డును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా చేయూతనందించే దిశగా చర్యలను చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఇస్తున్న పింఛను మొత్తాలను పెంచడంతో పాటుగా.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలను అందించనున్నామని వెల్లడించారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వార్డులో వయో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలను కేటాయించి అవసరమైన చికిత్సలను అందిస్తామని తెలిపారు. సేవలను సీనియర్ సిటిజన్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు పాల్గొన్నారు -
‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో ఎలా దోపిడీకి పాల్పడ్డారో ‘రివర్స్’ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే చూశారు. అన్నిట్లోనూ అందినకాడికి కాజేసిన టీడీపీ పెద్దలు పేదల ఇళ్లను కూడా వదల్లేదు. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.650కి మించని పట్టణ పేదల ఇళ్లను కమీషన్ల కోసం రూ.2,000కిపైగా పెంచేయడంతో ఖజానాకు రూ.4,930 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. ప్రతి చ.అడుగులో రూ.1,350 చొప్పున కాజేసినట్లు తేటతెల్లమవుతోంది. విశాఖ జిల్లాలో హుద్ హుద్ బాధితుల కోసం 800 ఇళ్ల నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1,06,687 చొప్పున టెండర్లు పిలవగా టీడీపీ హయాంలో అంతే విస్తీర్ణంలోని ఇవే గృహాలకు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6.40 లక్షల నుంచి రూ.8.70 లక్షలుగా నిర్థారించడం గమనార్హం. ఇంత భారీ వ్యత్యాసం ఉండటాన్ని బట్టి పేదల ఇళ్ల నిర్మాణాల్లో గత సర్కారు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఖజానాకు ఆదా...పేదలకు గృహ యోగం పేదల గృహ నిర్మాణం పేరుతో గత సర్కారు చదరపు అడుగు వ్యయం రూ.2,000కిపైగా నిర్ణయించగా ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అంతే విస్తీర్ణానికి కేవలం రూ.650 చొప్పున ధర ఖరారు చేసి టెండర్లు కూడా అహ్వానించడం గమనార్హం. అంటే ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి ధరలో ఉన్న వ్యత్యాసం రూ.1,350కిపైనే. ఖజానాకు డబ్బులు ఆదా కావడంతోపాటు పేదలకు ఉచితంగా ఇళ్లు అందుతాయి. ఇక్కడ గమనించాల్సిన మరో కీలక అంశం.. నిర్మాణ విధానంలో మార్పులేదు, విస్తీర్ణంలో తేడా లేదు. ఉన్న తేడా అంతా ఒక్కటే... ప్రభుత్వం మారడం. ‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు విశాఖపట్టణంలో ఐదేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులకు చంద్రబాబు సర్కారు నాలుగున్నరేళ్లలో పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బాధితుల కోసం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గత సర్కారు షేర్వాల్ టెక్నాలజీ పేరుతో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేయడమే కాకుండా ఒక్కో పేద కుటుంబంపై రూ. మూడు లక్షలకుపైగా అప్పుల భారాన్ని మోపింది. చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.2,000కిపైగా పెంచేసింది. తద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో టీడీపీ సర్కారు దోపిడీని గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారు మోపిన అప్పుల భారం నుంచి పేదలను బయటపడేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలు, అవినీతిని నిపుణుల కమిటీ ఇటీవల వెల్లడించింది. పట్టణ పేదల ఇళ్లలో ఏకంగా రూ.4,930 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. పేదలపై రూ.17,730.88 కోట్ల భారం టీడీపీ సర్కారు హయాంలో షేర్వాల్ టెక్నాలజీ పేరుతో పట్టణ ప్రాంత పేదల ఇళ్ల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.2,000కిపైగా నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారు. 300 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయం రూ.6.40 లక్షలుగా నిర్ణయించారు. 365 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.7.60 లక్షలుగా పేర్కొన్నారు. 430 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.8.70 లక్షలుగా గత సర్కారు ఖరారు చేసింది. జీ ప్లస్ 3 పేరుతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పట్టణ పేదల ఇళ్ల లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల అప్పుల భారాన్ని చంద్రబాబు సర్కారు మోపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు హామీ ఇచ్చిన ప్రకారం వారిని అప్పుల నుంచి బయటపడేసింది. నాడు రూ.8.70 లక్షలు.. నేడు రూ.1,06,687 విశాఖ జిల్లాలో హుదూద్ బాధితుల కోసం కమ్మాడిలో సర్వే నెంబర్ 83లో 608 ఇళ్లను జీ ప్లస్ 3 విధానంలో 354 చదరపు అడుగుల్లో నిర్మించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జిల్లాలోని పరదేశిపాలెంలో సర్వే నెంబర్ 21లో జీ ప్లస్ 3 విధానంలో 192 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది. మొత్తం 800 ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 8,53,50,387 గా నిర్ధారించారు. చదరపు అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.650 చొప్పున నిర్ణయించారు. ఒక్కోఇంటి నిర్మాణ వ్యయం రూ.1,06,687గా పేర్కొన్నారు. గత సర్కారు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6.40 లక్షల నుంచి రూ.8.70 లక్షలుగా నిర్ణయిస్తే ఇప్పుడు అంతే విస్తీర్ణంలో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1,06,687గా నిర్ధారించడం గమనార్హం. -
బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో చంద్రబాబు ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుకు సంబంధించిన ఫైల్‌పై గత గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేయగా, తాజాగా అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని.. గతంలో టీడీపీ సర్కార్ ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్ లీజును రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండేళ్ల కిందటే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. (చదవండి: విశాఖ జిల్లాలో.. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు) ఐదు జీవోలు జారీ.. బాక్సైట్ తవ్వకాల అనుమతులు రద్దుకు సంబంధించి మొత్తం 5 జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ►జీవో నెంబర్ 80- విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 81- చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 82- అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్‌లీజు రద్దు. ►జీవో నెంబర్ 83 - జెర్రెల బ్లాక్–1 లో 85 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్‌లీజు రద్దు ►జీవో నెంబర్ 84- జెర్రెల బ్లాక్–2,3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్‌లీజు రద్దు ►జీవో నెంబర్ 85- చింతపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జెర్రెల బ్లాక్–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్‌లీజు రద్దు -
పనులకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: రూ.పది కోట్ల లోపు ఒప్పంద విలువ కలిగి ఇప్పటికే మొదలైన పనులన్నింటినీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు కూడా అనుమతిస్తూ ఆర్ధికశాఖ ఇటీవల మెమో జారీ చేసింది. ఈమేరకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించి ఈ ఏడాది మే 29వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మెమో జారీ చేశారు. ఒప్పందం కుదిరి, ప్రారంభం కాని రూ.పది కోట్ల లోపు విలువగల నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పనులను కూడా కొనసాగించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సహాయ పునరావాస, భూసేకరణ బిల్లుల చెల్లింపునకు కూడా ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో రూ.పది కోట్ల లోపు విలువగల పనులన్నీ ప్రారంభం కానున్నాయి. తాగునీరు, రహదారులు, ఇతర అన్ని రకాల పనులు ఇందులో ఉన్నాయి. ఈ విషయంలో అన్ని శాఖలు ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ సూచించింది. పురోగతి ఆధారంగా నిర్ణయం.. సంబంధిత శాఖలు పనుల పురోగతితోపాటు అగ్రిమెంట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఎంత పని పూర్తయిందనే అంశం ఆధారంగా పనులు కొనసాగించడమా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని మెమోలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 29 నాటికి చేసిన పనుల పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సహాయ పునరావాస ప్యాకేజీ, భూసేకరణ విషయంలో బిల్లుల చెల్లింపునకు మిన హాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమీక్షించనున్న మంత్రులు.. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నాటికి విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా మిగిలిన పనులు మంజూరై ఉంటే ప్రారంభించని వాటిని రద్దు చేయాలని మెమోలో పేర్కొన్నారు. రూ.పది కోట్లకుపైగా విలువగల విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో మంజూరై ప్రారంభించని పనులపై సంబంధిత శాఖ మంత్రులు సమీక్షించాలి. విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో రూ.పది కోట్లకు పైగా విలువగల పనులు ప్రారంభమై అగ్రిమెంట్ విలువలో 25 శాతం తక్కువ వ్యయం అయిన పనులను కూడా సంబంధిత శాఖల మంత్రులు సమీక్షించాలని ఆర్థిక శాఖ సూచించింది. సమీక్ష సమయంలో అంచనాల వ్యయ ప్రతిపాదనలు సక్రమంగా ఉన్నాయా? సింగిల్ బిడ్లు ఏమైనా దాఖలయ్యాయా? అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ కోట్ చేశారా? టెండర్లతో నిమిత్తం లేకుండా పనులేమైనా ఇచ్చారా? అనే అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పనుల అవసరం ఉందా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అనంతరం అనుమతి కోసం ఆర్థికశాఖ మంత్రికి పంపాలని మెమోలో సూచించారు. -
మద్య నిషేధంతో సిండికేట్లకు చెక్: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నిషేధం ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో మద్యపాన నిషేధం విఫలమయిందని.. ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు నిర్వహించడానికి ముందుకొచ్చిందని.. దీంతో సిండికేట్లకు చెక్ పెట్టగలిగామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. సూపర్ వైజర్లకు 17,500 జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. బీటెక్ చదివిన వారికి కూడా ఇంత జీతం రావడం లేదని..ఉద్యోగం పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని తెలిపారు. -
నేడు లేదా రేపు ‘సచివాలయ’ ఫలితాలు
సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందలేదు. భర్తీ చేస్తున్న మొత్తం 19 రకాల ఉద్యోగాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, రూరల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వారి సర్వీస్ కాలం ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఉంటాయని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. అందులో రెండు రకాల ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. దీంతో గురువారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తయితే, సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్చార్జి మంత్రులతో గ్రామ సచివాలయాలు ప్రారంభం అక్టోబరు 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే గ్రామ సచివాలయాల కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఏదో ఒక మండలంలోని ఒక గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిపించాలని అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి తగిన ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా అధికారులను బుధవారం ఆదేశించారు. -
ఆరువారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక
-
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజధానితోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతోపాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించడానికి విశేష అనుభవం ఉన్న నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహావీర్, అర్బన్, రీజనల్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, అహ్మదాబాద్ సెప్ట్ ప్రొఫెసర్ శివానంద స్వామి, చెన్నై చీఫ్ అర్బన్ ప్లానర్ (రిటైర్డ్) కె.వి అరుణాచలంను ప్రభుత్వం సభ్యులుగా ఎంపిక చేసింది. అదేవిధంగా పర్యావరణం, వరద నియంత్రణ అంశాలపై ఒక నిపుణుడిని సభ్యుడిగా చేర్చుకునే అధికారాన్ని ఈ కమిటీకే అప్పగించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన సమీక్ష చేయడమే కాకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కమిటీ రూపొందించాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. -
మౌలిక వసతులకే పెద్దపీట
సాక్షి, అమరావతి: కొత్త పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం 2020 – 25 తయారీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీల కంటే స్థానికంగా కల్పించే మౌలిక వసతులు, నిపుణులైన మానవ వనరుల కల్పన వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి రాయితీలు ప్రకటించడం కంటే కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఒకేచోట కల్పిస్తే కంపెనీలు వాటంతట అవే వస్తాయన్నది అధికారుల అంచనా. గత ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించినా సరైన మౌలిక వసతులు లేకపోవడంతో కంపెనీలు రాని విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 100 ఎకరాల్లో తక్కువ కాకుండా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ దగ్గర నుంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. ఇంతకాలం కేవలం ఐటీ రంగానికే పరిమితమైన ప్లగ్ అండే పే విధానాన్ని ఈ పార్కుల ద్వారా తయారీ రంగంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో నిపుణులైన మానవ వనరుల లభ్యత ప్రధానమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలకు అవసరమైన నిపుణులను ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. ఒక కంపెనీ శంకుస్థాపన చేసిన రోజున ఎటువంటి మానవ వనరుల నిపుణులు కావాలో చెబితే ఆ కంపెనీ ప్రారంభించే నాటికి ఆ మేరకు సమకూరుస్తారు. ఇదే విషయాన్ని నూతన పారిశ్రామిక విధానంలో స్పష్టంగా పేర్కొననున్నారు. ఈ నెలాఖరుకు ముసాయిదా సిద్ధం ప్రస్తుత పారిశ్రామిక విధానం వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో 2020 ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా రూపొందిస్తున్నారు. ఇది రెండు వారాల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత అన్ని రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా పాలసీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పులపై చర్చించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని, అందరికీ ఆమోదయోగ్యమైన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుందని చెప్పారు. అన్నిటికీ కలిపి ఒకే పాలసీ ఇప్పటి వరకు పారిశ్రామిక, ఐటీ, మెరైన్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం అంటూ రకరకాల పాలసీలు ఉండటం వల్ల ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఏ పాలసీలో ఏ రాయితీలు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళానికి ఫుల్స్టాప్ పెడుతూ ఏయే రంగాలకి ఎటువంటి రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామో తెలియచేస్తూ ఒకే పారిశ్రామిక పాలసీ విడుదల చేయాలని పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదే విధంగా ఒక రంగానికి చెందిన కంపెనీలకు పోటీ పేరుతో ఇష్టమొచ్చిన విధంగా రాయితీలు ప్రకటించే వారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేస్తూ ఒకే రంగానికి చెందిన కంపెనీలకు ఒకే రకమైన రాయితీలు ఇవ్వనున్నారు. ఈ దిశగా నూతన పారిశ్రామిక విధానంలో కీలక మార్పు తేనున్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్
సాక్షి, అమరావతి : మోసపూరిత, డబుల్ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇటీవల కాలంలో మొత్తం 282 తప్పుడు/డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లాలోనే 84 ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉండగా ఆరింటిలో ఎలాంటి ఫిర్యాదుల్లేవు. మిగిలిన 20 రిజిస్ట్రేషన్ జిల్లాలను పరిశీలిస్తే విజయవాడలో 84, విశాఖపట్నంలో 39, ఒంగోలులో 27, చిత్తూరులో 24, అనంతపురంలో 20 అక్రమ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఫిర్యాదులున్నాయి. ఈ మొత్తం ఫిర్యాదులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ జరిపింది. 44 కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్ సాగుతోంది. కొన్ని పెండింగులో ఉండగా.. మరికొన్నింటిని రకరకాల మార్గాల్లో పరిష్కరించారు. స్థిరాస్తుల విలువ పెరగడంతో.. భూములు, స్థలాలు తదితర స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగినందువల్లే భారీ మోసాలు జరుగుతున్నాయి. తమది కాని భూమిని యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాల ద్వారా అక్రమార్కులు విక్రయిస్తున్న సంఘటనలు కోకొల్లలు. దీంతో బాధితులు లబోదిబోమంటూ తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలంటూ ఫిర్యాదు చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. సివిల్ కోర్టుల ఆదేశాలు లేనిదే రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల్లోనూ స్థిరపడిన వారి భూములు, స్థలాలపై మాఫియా గ్యాంగులు కన్నేసి నకిలీ ఆధార్, ఇతర పత్రాలు సృష్టించి వాస్తవ యజమానులకు తెలియకుండానే విక్రయించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఈ మోసాలు ఎక్కువ. వాస్తవ యజమానులు వీటిని విక్రయించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లే వరకూ తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీచేయనుంది. ప్రాసిక్యూషన్ చేయిస్తాం ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిస్తే ప్రాసిక్యూషన్ చేయించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు ‘సాక్షి’కి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్లు తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా మోసాల నియంత్రణకు ఆయన పలు సూచనలు చేశారు. అవి.. - తమ స్థిరాస్తులను వేరేవారు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే ఛీటింగ్ కేసులు పెట్టాలి. - తమ భూమిని వేరేవారు అమ్మేసినట్లు తెలియగానే భూ యజమాని మ్యుటేషన్ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేయవద్దని తహసీల్దారుకు ఫిర్యాదు చేయాలి. అప్పుడా రిజిస్ట్రేషన్‌కు విలువ ఉండదు. - వెబ్‌ల్యాండ్‌లో మోసాలు జరగకుండా భూ యజమానుల ఆధార్ నంబరు, ఫోన్ నంబరు కూడా పక్కాగా నిర్వహించడం ద్వారా ఎలాంటి మోసాలకు అవకాశంలేకుండా చేయొచ్చు. మోసాలివీ.. - రాజమహేంద్రవరానికి చెందిన రామకృష్ణమ్మకు భర్త చిన్న సూర్యనారాయణ ద్వారా బహుమతి రూపంలో 15.14 ఎకరాల భూమి లభించింది. కానీ, రామకృష్ణమ్మ 20.78 ఎకరాలను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. అంటే.. ఆమె తనకున్న భూమి కంటే 5.64 ఎకరాలు అదనంగా అమ్మేశారు. తనను మోసగించిన బాధ్యుల (రామకృష్ణమ్మ, సబ్ రిజిస్ట్రారు)పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వెంకట సుధామయి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. లేని భూమిని విక్రయించిన రామకృష్ణమ్మ చనిపోయారు. ఆమె పిల్లల పేరుతో బహుమతి కింద చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదు. - గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పయనీర్ ఫాస్పేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 3.66 ఎకరాల భూమిని మాజీ డైరెక్టర్లు తప్పుడు మార్గంలో విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. వారు డైరెక్టర్ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రికార్డులు చూపించి భూమిని అమ్మేశారు. - అమెరికాలో నివాసం ఉంటున్న కాకినాడకు చెందిన మహిళ స్థలాన్ని ఆమెకు తెలియకుండా వేరే వారు విక్రయించారు. ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి తనకు న్యాయం చేయాలని ఆమె ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటన
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి చికాగోనుంచి హైదరాబాద్ బయలుదేరారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 15న అమెరికా బయలుదేరిన ఆయన వారం రోజుల పాటు అక్కడ పర్యటించారు. కాగా, సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలికారు. ముఖ్యంగా డాలస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రవాసాంధ్రులకు ఆయన భరోసా ఇచ్చారు. చదవండి : పెట్టుబడులకు రండి..అండగా ఉంటాం : సీఎం జగన్ -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగానే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని చెప్పారు. ఆయా ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల పరిధిలో గల జిల్లాలన్నీ అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్టణం) ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేబినెట్ ర్యాంకుతో చైర్మన్ల నియామకం ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్ నియామకం ఉంటుంది. వ్యవసాయం (ఫుడ్ ప్రాసెసింగ్–అగ్రి మార్కెటింగ్) నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి – మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి – సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. అవసరమైన సిబ్బందిని కూడా ఇస్తారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా మండలిని రద్దు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. విధివిధానాలు ఇలా.. ⇔ ఏయే ప్రాంతాల్లో ఏ రంగాల్లో, ఏ గ్రూపు జనాభాపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందో గుర్తించాలి. ⇔ ప్రాంతీయ, జిల్లా అభివృద్ధి నివేదికలను రూపొందించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ⇔ ప్రాంతీయ అభివృద్ధికి ఏ స్థాయిలో నిధులు వ్యయం చేయాలో అంచనా వేసి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలి. ⇔ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అంచనా వేస్తూ.. ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి కృషి చేయాలి. మొత్తం ప్రాంతం సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ⇔ జిల్లా సమీక్షా కమిటీల సమావేశాలకు ప్రాంతీయ ప్రణాళిక బోర్డు చైర్మన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్తారు. ⇔ నీటి నిర్వహణ ప్రణాళికలను రూపొందించడంతో పాటు నీటి సంరక్షణ, ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు స్థానికంగా మారుమూల ప్రాంతాల్లో నివశించే ప్రజలకు ప్రయోజనం కలిగేలా కరువు నివారణ చర్యలు చేపట్టాలి. ⇔ వ్యవసాయ ఉత్పత్తుల ప్రణాళికను రూపొందించడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించి రైతుల పంటలకు సరైన ధర కల్పించాలి. ⇔ సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి మాస్టర్ ప్రణాళికను రూపొందించడంతోపాటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. తగిన పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ⇔ ఆర్థిక వనరులు, మౌలిక వసతుల ప్రణాళికలను రూపొందించాలి. రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి. మౌలిక సదుపాయాల వ్యత్యాసాలను పూరించడంతో పాటు స్థానిక సహజ వనరుల ద్వారా జిల్లాలను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ⇔ సామాజిక మౌలిక సదుపాయాలు ⇔ సంక్షేమ రంగాలకు ప్రణాళికలను రూపొందించాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు ఉపాధి హామీ, ఆర్ఐడీఎఫ్ నిధులతో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రవాణా రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. -
కల్తీపై కత్తి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ, నకిలీ, నాణ్యత లేని ఎరువులు, విత్తనాల మాటే వినపడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల అమలు దిశగా వ్యవసాయ శాఖ ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే డీఏపీ, యూరియా తదితర ముడి సరుకుల్ని తీసుకుని కొందరు వ్యాపారులు తమ సొంత మిక్సింగ్ ప్లాంట్లలో కలగలిపి నైట్రోజన్ (ఎన్), పాస్పరస్ (పీ) పొటాషియం (కె)– (ఎన్పీకే) గుళికల్ని తయారు చేసి రైతులకు విక్రయించే వీలు లేకుండా వ్యవసాయ శాఖ డీ నోటీఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్పీకే గుళికల వ్యాపారానికి కళ్లెం పడనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయానికి ముగింపు పలికేలా వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత లేని ఎన్పీకే ఎరువుల గుళికల తయారీకి రాష్ట్రంలో ఇక తెర పడినట్టేనని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంప్లెక్స్ ఎరువులు సమృద్ధిగా తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు అవే రసాయన మిశ్రమాలుండే ఎన్పీకే గుళికల్ని కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సిన అవసరం ఉండబోదని తేల్చి చెబుతున్నారు. గుళికల అసలు కథ ఇదీ.. సుదీర్ఘ కాలం పాటు దేశంలో కాంప్లెక్స్ ఎరువులు– అంటే డై అమోనియం పాస్పేట్, నైట్రోపాస్పేట్, అమోనియం పాస్పేట్ వంటి ద్వితీయ శ్రేణి వృక్ష సంబంధ పోషకాలు లేవు. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత ప్రముఖ ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులు– మూడు 17 (17–17–17), మూడు 19 (19–19–19) వంటి వాటి తయారీని చేపట్టాయి. అయితే ఈ కంపెనీల నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసి కొన్ని వ్యాపార సంస్థలు ఎన్పీకే గుళికల తయారీని చేపట్టాయి. కాంప్లెక్స్ ఎరువుల్లో ఎటువంటి పోషకాలు ఉంటాయో అటువంటి పోషకాలే ఉండే మిశ్రమ గుళికల్ని తయారు చేయడం ఎందుకు అనే వాదన మొదలైంది. పైగా ఎన్పీకే గుళికల్లో నాణ్యత, ప్రమాణాలు ఉండడం లేదని, వినియోగించాల్సిన పాళ్లలో నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం ఉండడం లేదని, ధర కూడా ఆయా సంస్థల ఇష్టానుసారంగా ఉంటోందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2011లోనే మిక్సింగ్ ప్లాంట్లలో ఎన్పీకే గుళికల తయారీని ఆపాలని అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు ఎక్కువగా ఉన్న తరుణంలో మిక్సింగ్ గుళికల తయారీకి అనుమతులు ఆపాలనుకుంది. అయితే వివిధ కారణాలతో అది ఇంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. డీ నోటిఫై చేసింది ఈ గుళికలనే.. 1985 నాటి ఎరువుల నియంత్రణ (ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, మిక్సిడ్) ఉత్తర్వు 13వ క్లాజ్‌లోని రెండవ సబ్ క్లాజ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎన్పీకే గుళికల మిశ్రమ ఎరువుల తయారీని డీ నోటిఫై చేసింది. వాటిల్లో 20–20–00, 15–15–15, 17–17–17, 19–19–19, 14–28–14, 14–35–14, 10–26–26, 20–10–10 (చెరకు) ఉన్నాయి. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన రెడ్డి పేరిట ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ తరహా మిశ్రమ గుళికలన్నింటినీ ప్రముఖ ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల పేరిట విక్రయిస్తున్నాయి. మార్కెట్లో అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. పైగా కాంప్లెక్స్ ఎరువులు బాగా పని చేస్తాయనే హామీ ఉంటుంది. అదే మిశ్రమ గుళికలకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఎలా పని చేస్తాయో కూడా చివరి వరకు తెలిసే అవకాశం లేదు. మిశ్రమ గుళికలు తయారు చేస్తే చర్యలు వ్యవసాయ శాఖ డీ నోటిఫై చేసిన మిశ్రమ గుళికల్ని మిక్సింగ్ ప్లాంట్లు తయారు చేయకూడదు. చేస్తే చర్యలు తీసుకుంటారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో 20కి పైగా మిక్సింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడు సంస్థలు తమ లైసెన్సులను రెన్యువల్ చేయించుకోలేదు. 17 మాత్రం పని చేస్తున్నట్టు చెబుతున్నా వీటిల్లోనూ పది మాత్రమే చురుగ్గా పని చేస్తున్నాయని వ్యవసాయాధికారులు చెప్పారు. అయితే అనధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 19 మిక్సింగ్ ప్లాంట్లు పని చేస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువులకు, మిశ్రమ ఎన్పీకే ఎరువులకు బస్తాకు 70, 80 రూపాయల తేడా ఉంటుంది. రైతుకు దక్కాల్సిన సబ్సిడీ మిక్సింగ్ ప్లాంట్లకు పోతే ఎలా? మిశ్రమ ఎన్పీకే ఎరువుల తయారీని నిలువరించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ప్రముఖ ఎరువుల కంపెనీలో కీలక బాధ్యతను నిర్వర్తించిన వ్యవసాయ ఇంజినీరింగ్ నిపుణుడు ఎం.సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన పాళ్లలో నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్ కలపకుండా చెత్తా చెదారాలన్నీ కలిపి అందంగా గుళికల్ని తయారు చేసి రంగు రంగు సంచుల్లో పెట్టి రైతుల్ని నట్టేట ముంచుతున్న మిక్సింగ్ ప్లాంట్లకు ఈ నిర్ణయం ఊహించని విఘాతమే. రైతులకు మాత్రమే దక్కాల్సిన సబ్సిడీ ఎరువును కొందరి లాభాలకు ఉపయోగపడకుండా ముకుతాడు వేసినట్టవుతుంది. నిజానికి ఈ సంస్థలు– నాన్ ఫెర్టిలైజర్ ప్రాడక్ట్ కింద కొనుక్కుని మిక్సింగ్ చేసి అమ్ముకోవాలి. కానీ ఆ పని చేయడానికి బదులు లాభాల వేటలో రైతుల్ని దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడా పరిస్థితి ఉండదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. సుద్ద, మట్టి, పేడ కలిపి గుళికల తయారీ మిక్సింగ్ ప్లాంట్లలో జరుగుతున్న తతంగం అందరికీ తెలిసినా ఇంతవరకు ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వ్యవసాయ శాఖ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్‌తో చాలా మిక్సింగ్ ప్లాంట్లు మూత పడడమో లేక కొత్త ఉత్పత్తులు తయారు చేసుకోవడమో జరుగుతుందన్నారు. పెద్ద కంపెనీల నుంచి ముడి పదార్థాలు కొనుక్కొని వచ్చి.. వాటికి మట్టి, సుద్ద, పేడ కలిపి.. అందంగా గుళికల్ని తయారు చేసి కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరకు విక్రయించిన ఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆటలు చెల్లవు. రైతులకు ఉపయుక్తం కాంప్లెక్స్ ఎరువుల లభ్యత ఉన్న చోట అదే తరహా మిశ్రమాల తయారీని చేయకుండా ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ నిలువరిస్తుంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా కీలకం. కాంప్లెక్స్ ఎరువుల్లో సమపాళ్లలో పోషకాలు ఉంటాయి. అదే విడివిడిగా కలిపితే ఆ ఎరువులు పంటలపై అంతగా ప్రభావాన్ని చూపలేవు. ఎన్పీకే మిశ్రమ గుళికల్లో నాణ్యత లేకపోవడం వల్ల రైతులు ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కాంప్లెక్స్ ఎరువులు లభ్యత లేని చోట మాత్రమే వ్యవసాయ శాఖ అనుమతితో వేరే ఫార్ములా ప్రకారం మిశ్రమ ఎరువుల్ని తయారు చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ సలహా. ఈ మేరకు ఇక్కడ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎన్పీకే మిశ్రమ ఎరువుల తయారీని డీ నోటిఫై చేసింది. – అజేయ కల్లం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సాహసోపేత నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభీష్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం ఇది. ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాతే ఎరువులైనా, పురుగు మందులైనా, విత్తనాలైనా విక్రయించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఈ దిశగా పడిన తొలి అడుగు ఇది. తూతూ మంత్రంగా ఎన్పీకే పాళ్లను కలిపి సొమ్ము చేసుకోవాలనుకునే మిక్సింగ్ ప్లాంట్ల యాజమాన్యాల ఆశలు ఇకపై నెరవేరవు. కాంప్లెక్స్ ఎరువులు విరివిగా దొరుకుతున్నప్పుడు మళ్లీ ఈ గుళికలు అవసరం లేదు. వ్యవసాయ శాఖాధికారులు ఇకపై చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారనే దానికి ఈ నిర్ణయమే సంకేతం. – ఎంవీఎస్ నాగిరెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ -
అమెరికాలో అద్భుత స్పందన
డాలస్ (అమెరికా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికా పర్యటనలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా డాలస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు ఈ సమావేశానికి అంచనాలకు మించి హాజరు కావడం విశేషం. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి) డాలస్ విమానాశ్రయానికి సైతం పెద్దఎత్తున తరలి వచ్చిన ప్రవాసాంధ్రులు జై జగన్ అంటూ కేరింతల మధ్య ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడే అమెరికాలోని తెలుగు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధులు కూడా జగన్‌ను అక్కడే కలుసుకున్నారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి హచిన్సన్ ప్రాంతం చేరుకున్నప్పుడు ఆహూతులను అదుపు చేయడానికి అమెరికన్ భద్రతా సిబ్బంది బాగా ప్రయాస పడాల్సి వచ్చింది. సభా హాలులో నవరత్నాలుపై రూపొందించిన గీతంతో, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ‘నాకొక కల ఉంది...’ అని మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ఉటంకించినప్పుడు మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తున్నప్పుడు హర్షామోదాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా–భారత్ రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అమెరికాలో భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ అనంతరం నేరుగా డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ స్థానిక ప్రవాసాంధ్రులంతా ఘనంగా వీడ్కోలు పలికారు. కెనడాలోని టొరాంటో, మాంట్రియల్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, పిట్స్బర్గ్, డెట్రాయిట్, షికాగో, ఓహియో, ఆరిజోనా, సియాటెల్, కాలిఫోర్నియా బే ఏరియా, ఎల్ఏ, నార్త్ కాలిఫోర్నియా, సెంట్ లూయిస్, ఓక్లహామా, అట్లాంటా, ఫ్లోరిడా, ఆస్టిన్, హ్యూస్టన్, డాలస్ నుంచి ప్రవాసులు హాజరయ్యారు. కాగా, ‘స్వాగత సుమాంజలి’ పేరుతో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్మానపత్రాన్ని బహూకరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, పలు కంపెనీల ప్రతినిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. (చదవండి: ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి) -
చంద్రబాబుకు 97 మందితో భద్రత
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం భద్రతను కుదించలేదని, ఆయనకు పరిమితికి మించే భద్రతను కల్పిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 58 మంది భద్రత సిబ్బందిని ఇవ్వాల్సి ఉండగా, 97 మంది సిబ్బందితో చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఆమోదించింది. ఇదే సమయంలో ప్రధాన భద్రతా అధికారి (సీఎస్‌వో)గా భద్రయ్యనే నియమించాలన్న చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సీఎస్‌వోగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తేల్చి చెప్పింది. అలాగే చంద్రబాబు కాన్వాయ్‌కు జామర్ సదుపాయాన్ని కల్పించాలంది. ఇక చంద్రబాబుకు క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీం (సీపీటీ)ను ఏర్పాటు చేసే విషయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), రాష్ట్ర భద్రతా విభాగం (ఎస్‌ఎస్‌డబ్ల్యూ) మధ్య భేదాభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో, సీపీటీ బాధ్యత ఎవరిదో గరిష్టంగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్ఎస్జీ, ఎస్‌ఎస్‌డబ్ల్యూలు ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత దానిని చంద్రబాబుకు తెలియజేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం తీర్పు వెలువరించారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి జోక్యం చేసుకుంటూ, మూడు నెలలంటే చాలా ఎక్కువ సమయమని, ఈ లోపే నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆదేశాలు అవసరం లేదని, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పులో చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న భద్రతను కుదించిందని, గతంలో ఉన్న విధంగా తనకు భద్రత పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
కొత్తగా లా కాలేజీలకు అనుమతులు లేవు
సాక్షి, అమరావతి: కొత్తగా లా కాలేజీలకు అనుమతులను నిషేధిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, వర్సిటీలకు సూచించింది. ఈనెల 11న జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో కొత్త కాలేజీలకు అనుమతులపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే దేశంలో పుట్టగొడుగుల్లా లా కాలేజీలు ఏర్పాటయ్యాయని, పరిమితికి మించి లా పట్టభద్రులున్నందున కొత్త కాలేజీల ఏర్పాటును మూడేళ్ల పాటు నిలిపివేయాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటికి అనుమతులు ఇవ్వవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015లో కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్ల పాటు కొత్త కాలేజీల ఏర్పాటుపై మారటోరియం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మారటోరియం 2017–18తో ముగిసింది. మళ్లీ కొత్త కాలేజీలకు అనుమతులకోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు పలు దరఖాస్తులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. కొత్తగా లా కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించబోరు. రాష్ట్రంలో కాలేజీల వివరాలు.. మూడేళ్ల లా కోర్సు నిర్వహిస్తున్న కాలేజీలు రాష్ట్రంలో 31 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 4 ఉండగా తక్కినవన్నీ ప్రైవేటు కాలేజీలే. వర్సిటీ కాలేజీల్లో 300 సీట్లుండగా ప్రైవేటు కాలేజీల్లో 5,360 సీట్లున్నాయి. ఇక అయిదేళ్ల లా కోర్సు నిర్వహించే కాలేజీలు 27 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 3 కాగా తక్కినవి ప్రైవేటు కాలేజీలు. వర్సిటీ కాలేజీల్లో 200 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 2660 సీట్లు ఉన్నాయి. -
ఏపీకి 300 విద్యుత్ బస్సులు
సాక్షి, అమరావతి: ఏపీకి 300 విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఫేమ్–2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద దేశంలో 64 నగరాలకు 5,595 విద్యుత్ బస్సులను కేటాయించగా.. ఏపీలోని విశాఖకు వంద బస్సులు, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున మంజూరు చేశారు. ఇప్పటికే విశాఖకు బస్సులు చేరుకుంటున్నాయి. అతి త్వరలో విశాఖలో విద్యుత్ బస్సుల్ని తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో బస్సు ఖరీదు రూ. కోటి వరకు ఉండగా, కేంద్రం 40 శాతం రాయితీ ఇవ్వనుంది. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2019–20)లోనే వెయ్యి విద్యుత్ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ గతంలోనే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ బస్సుల స్థానంలో కాలుష్య రహిత విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ విలీన కమిటీ కూడా నిర్ణయించింది. వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ (డీహెచ్ఐ)కు జూన్ నెలలోనే ఆర్టీసీ ప్రతిపాదనలు సమర్పించింది. విద్యుత్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యూ అండ్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సహకారం అందిస్తాయి. ఇప్పటికే 300 బస్సులను కేటాయించడంతో మిగిలిన 700 బస్సుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తగ్గనున్న నిర్వహణ ఖర్చు డీజిల్ బస్సులు నడపడం వల్ల కిలోమీటరుకు డ్రైవర్ జీతభత్యంతో కలిపి రూ. 38 వరకూ ఖర్చవుతోంది. అదే విద్యుత్ బస్సు నిర్వహణ ఖర్చు కిలోమీటర్‌కు రూ. 19 వరకే అవుతుందని తేల్చారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రూ. 10 వేల కోట్లను బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఒక్కో విద్యుత్ బస్సు 2 గంటల చార్జింగ్‌తో 8 గంటలు ప్రయాణిస్తుంది. -
‘గ్రామ, వార్డు సచివాలయ’ పరీక్షలు అభ్యర్థులకు అనుకూలంగా..
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అర్హులైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనేకమంది అభ్యర్ధులు తమ విద్యార్హతలకు తగ్గట్టుగా నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పరీక్షలన్నిటికీ హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అనుకూలంగా వేర్వేరు తేదీలను నిర్ణయిస్తోంది. అలాగే, ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కూడా వీలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వారికి వేర్వేరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే, మధ్యాహ్నం పరీక్షకు సకాలంలో చేరుకోడానికి అభ్యర్థులు అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం ఉన్నందున అలాంటి వారు రెండు పరీక్షలను ఒకే కేంద్రంలో రాసేలా చర్యలు తీసుకుంటోంది. రెండు మూడ్రోజుల్లో పరీక్షల షెడ్యూలు కాగా, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు నిరుద్యోగులు అనూహ్యంగా స్పందించారు. శనివారం నాటికి 21,96,171 దరఖాస్తులు రావడంతో పరీక్షల నిర్వహణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ జె.విజయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు ఇదిలా ఉంటే.. అభ్యర్థులు అరగంటకు ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేదిలేదని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. దరఖాస్తుల గడువు పొడిగింపు రాష్ట్రంలో వరదల కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 10వ తేదీ శనివారం అర్ధరాత్రి 11.59 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించారు. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ముంపు ప్రాంతాలలో యువత విద్యుత్ అంతరాయాల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వలంటీర్ పోస్టులకు 26న రెండో నోటిఫికేషన్ ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 26న రెండో నోటిఫికేషన్ జారీచేసే ఆలోచనలో ఉన్నామని విజయకుమార్ తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే కేంద్రస్థాయిలో నియామక ప్రక్రియ జరుగుతుందని, ఆ తరువాత నుంచి ఏర్పడే ఖాళీలను జిల్లా కలెక్టర్లు, పురపాలక శాఖలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులు భర్తీచేస్తారని చెప్పారు. -
‘ప్రైవేట్’కు పట్టని ‘నో బ్యాగ్ డే’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించే కార్యక్రమాల అమలులో ప్రైవేటు పాఠశాలలు బేఖాతరుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడిలేని చదువులు కొనసాగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరిగా నెలలో రెండు శనివారాలు ఆనంద వేదిక పేరుతో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను చేపట్టాలని నిర్దేశించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో అకడమిక్ వ్యవహారాలకు సంబంధించి ఏ యాజమాన్య పాఠశాల అయినా ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఎస్సీఈఆర్టీ రూపొందించే పాఠ్య ప్రణాళికలు, ఇతర అంశాలను ప్రైవేటు పాఠశాలలు సైతం అమలుచేయాల్సిందే. కానీ, ప్రభుత్వం ప్రకటించిన ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను ప్రైవేటు పాఠశాలలు అమలుచేయడంలేదు. దీనిపై పాఠశాల విద్యా శాఖ కూడా పెద్దగా దృష్టి సారించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమ్మ ఒడి వంటి పథకాలను తమకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేసిన ప్రైవేటు పాఠశాలలు ఆనంద వేదికను అమలుచేయకపోవడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ సిలబస్ కూడా బేఖాతర్ ఇదిలాఉంటే.. ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌లోని పుస్తకాలను కాకుండా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను ప్రైవేట్ స్కూళ్లు పిల్లలతో చదివిస్తున్నాయి. ఆటపాటలు, ఇతర కృత్యాలు ఇక్కడ లేనేలేవు. ఎస్సీఈఆర్టీ కూడా ప్రస్తుతానికి ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేసింది. హైస్కూలు విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బోధనకు ఆటంకం ఏర్పడుతుందేమోనన్న భావనతో వారికి ప్రస్తుతానికి ఈ ఆనందవేదిక కార్యక్రమాలను అమలుచేయడంలేదు. సమగ్ర నిరంతర మూల్యాంకనం కింద నిర్వహించే కృత్యాలనే కొనసాగిస్తోంది. ప్రాథమిక పాఠశాలలకే ఆనంద వేదిక కింద ‘సృజన’, ‘శనివారం సందడి’ కార్యక్రమాలను పరిమితం చేసినా ప్రైవేటు పాఠశాలలు వాటిని కూడా పాటించకపోవడం గమనార్హం. కాగా, రాష్ట్రంలోని దాదాపు 61 వేల పాఠశాలల్లో 70 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుతుండగా అందులో 42 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లోనే ఉన్నారు. ఒకటి, రెండు వారికి ఆనంద వేదిక ఇలా.. ఒకటి, రెండు తరగతులకు సంబంధించిన విద్యార్థులతో ఒకటి, మూడు శనివారాల్లో పాఠ్యపుస్తకాలు లేకుండా అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు పాడించడం, కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టితో బొమ్మలు చేయడం వంటి కార్యక్రమాలు అమలుచేయాలి. 3, 4, 5 తరగతుల్లో ఇలా.. - బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బొమ్మలు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఏకపాత్రాభినయం, నాట్యం చేయడం వంటివి చేపట్టాలి. - పాఠశాలల్లో తోటల పెంపకం, పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి. - పాఠశాలను, తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా నేర్పాలి. - పుస్తకాల పఠనం, కథలు రాయడం, చెప్పడం వంటివి చేపట్టించాలి. - అలాగే గ్రామంలోని ముఖ్యమైన అధికారులు, ఇతర ముఖ్యులను పిలిచి వారితో మాట్లాడించాలి. - కానీ, ఇవేవీ ప్రైవేటు పాఠశాలల్లో అమలుచేయడంలేదు. ఇవే కాకుండా ఎస్సీఈఆర్టీ ఇచ్చే ఇతర ఆదేశాలను కూడా అవి పట్టించుకోవడంలేదు. -
మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. ప్రతి మండలం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి, ఎన్ని ప్రాథమిక ఆస్పత్రులున్నాయి, ఏరియా ఆస్పత్రులెన్ని, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులు ఇలా ప్రతి ఆరోగ్య సంస్థను గుర్తించి, వాటికి మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. దీనివల్ల ప్రతి ప్రాంతంలోనూ ఆస్పత్రుల స్థితిగతులు తెలుసుకునే వీలుంటుంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 40 వేల మంది ఉంటున్నారు. కొన్ని చోట్ల 20 వేల మందికే ఒక పీహెచ్సీ ఉంది. కొన్ని పీహెచ్‌సీల్లో రోగుల తాకిడి లేకపోయినా ఇద్దరు చొప్పున మెడికల్ ఆఫీసర్లున్నారు. మరికొన్నింటికి రోగులు వస్తున్నా డాక్టర్లు లేరు. ప్రధానంగా ప్రతి చిన్న ఆస్పత్రి నుంచి పెద్దాస్పత్రి వరకూ సిబ్బంది వివరాలు ఈ మ్యాపింగ్ ప్రక్రియలో వెల్లడి కానున్నాయి. ఇక సంస్కరణలు వేగవంతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆరోగ్య సంస్థల వివరాలు, వాటి పరిధిలో జనాభా, ఆస్పత్రి ఉన్న ప్రాంతం, సిబ్బంది ఇలా అన్నింటినీ కలిపి మ్యాపింగ్ ప్రక్రియలోకి తెస్తారు. త్వరలోనే ఇ–హెల్త్ రికార్డులను రూపొందించనున్న నేపథ్యంలో ఇలా మ్యాపింగ్ చేపడితే ఏ ప్రాంతంలో ఏ జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆస్పత్రి ఉందో, ఆ జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారో ఆ జిల్లాలో అధికారులను అడిగి తెలుసుకోవడం, లేదా స్థానికంగా వచ్చిన సమాచారం మేరకే తెలిసేది. ఇకపై అలా కాకుండా మండలాల వారీగా వీటన్నిటినీ మ్యాపింగ్ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. ఈలోగా మ్యాపింగ్ పూర్తి చేస్తే సంస్కరణలకు సులువుగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల్లో పరిస్థితులన్నిటినీ మ్యాపింగ్ ప్రక్రియ కిందకు తీసుకొస్తే సంస్కరణలు వేగవంతమవుతాయని అంటున్నారు. -
సెప్టెంబర్ 8న కూడా సచివాలయాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్ శాఖ భర్తీ చేసే లైన్మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌లో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులతో బుక్‌స్టాళ్లు రద్దీగా మారిపోయాయి. విజయవాడ లెనిన్ సెంటర్లోని పుస్తకాల షాపులు యువతీయువకులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి.. – సాక్షి, విజయవాడ పంచాయతీరాజ్ కమిషనర్‌తో నేడు సాక్షి టీవీ లైవ్ షో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం శనివారం ‘సాక్షి’ టీవీ ప్రత్యేక లైవ్ షో కార్యక్రమం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌తో ‘సాక్షి’ టీవీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే లైవ్ షో ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు: 040–23310680, 23310726. కేటగిరీ–1 1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్(లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4. వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 ఉదయం కేటగిరీ– 2 (గ్రూప్–ఏ) 1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్–2 2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్–2 కేటగిరీ–2 (గ్రూప్–బి) 1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్–2 2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం కేటగిరీ–3 1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 4. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు 6. ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) 7. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం 8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) 9. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2) 10. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రాత పరీక్ష: సెప్టెంబర్ 8 ఉదయం 11. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పరీక్ష: సెప్టెంబర్ 8 సాయంత్రం -
పోలవరం మరింత వేగవంతం
-
కొలువుల జాతర
-
చంద్రబాబుకున్న ‘జెడ్ ప్లస్’ను కుదించలేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబుకున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరినీ కూడా తగ్గించలేదని, కాన్వాయ్‌కు జామర్ సదుపాయం కూడా కల్పించామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నిర్ధిష్టంగా ఫలానా వ్యక్తినే ప్రధాన భద్రత అధికారి (సీఎస్ఓ)గా నియమించాలని కోరుతున్నారని, అది ఆచరణ సాధ్యం కాదని ఏజీ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు కోరిన అధికారినే సీఎస్ఓగా నియమిస్తే భవిష్యత్తులో మరికొందరు ఇదే రకమైన అభ్యర్థనలు చేసే అవకాశం ఉందని, దీనివల్ల పలు సమస్యలు వస్తాయన్నారు. చంద్రబాబుకు ఏర్పాటు చేసిన సీఎస్ఓ విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న భద్రతను కుదించిందని, గతంలో ఉన్న విధంగానే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్ మరోసారి విచారించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు భద్రతను కేంద్రం పునః సమీక్షించిందని, ప్రస్తుతం ఆయనకున్న ఎన్ఎస్జీ భద్రతను అలాగే కొనసాగించాలని నిర్ణయించిందని చెప్పారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మూడు షిప్టుల్లో ఐదుగురు చొప్పున కానిస్టేబుళ్లను ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. సీఎస్‌వోలను ఇద్దరిని ఇవ్వాల్సి ఉండగా, ఒక్కరినే ఇచ్చారని చెప్పారు. ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ భద్రతే ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో జామర్ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. -
అప్పు బారెడు.. ఆస్తి మూరెడు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలనలో గత ఐదేళ్లలో చేసిన అప్పులన్నీ నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించారు తప్ప ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, పెద్ద ఎత్తున వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లతో పాటు ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లిందని నివేదిక స్పష్టం చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అకౌంట్ల నివేదికను మంగళవారం అసెంబ్లీకి సమర్పించారు. ప్రతీ ఏడాది బడ్జెట్‌లోపల బహిరంగ మార్కెట్ నుంచి ప్రభుత్వం అప్పు చేస్తుంది. అలా చేసిన అప్పులను ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు గత ఐదేళ్లలో చేసిన అప్పులను అరకొరగా ఆస్తుల కల్పనకు మాత్రమే వినియోగించారు. అంతే కాకుండా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 22,800 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు అనుమతించగా రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా అప్పు చేసినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు చంద్రబాబు సర్కార్ వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 259 రోజులు, 2016–17లో 250 రోజులు, 2017–18లో 188 రోజులు వేస్ అండ్ మీన్స్కు వెళ్లింది. 2017–18లో ఏకంగా 43 రోజల పాటు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది. అలాగే 14వ ఆర్థిక సంఘం, ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 25.09 శాతం ఉండాల్సి ఉండగా 2017–18లో ఏకంగా 32.30 శాతం అప్పులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2017–18 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 2,59,670.02 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. -
సీఎంతో జపాన్ కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, అమరావతి: చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరొ ఉచియామ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో ఇరువురు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్‌లో పర్యటించాలంటూ సీఎంను ఉచియామ ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతియుత వాతావరణం కూడా అవసరమని, ఇందులో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి ఉన్న మానవ వనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ వివరించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలని సీఎం కోరారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమల కోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్ వ్యవసాయశాఖ మిజుహో ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోందని ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పెట్టుబడులు సీఎస్‌తో సమావేశమైన కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామ ఏపీ ప్రభుత్వం తగిన భూమిని సమకూర్చితే డెడికేటెడ్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అభివృద్ధి చెందిన ఓడరేవులకు తగిన మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో తోడ్పడేందుకు జపాన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఆయన భేటీ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారం అంశంలో ఆంధ్రప్రదేశ్‌ను జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యతా డెస్టినేషన్ పాయింట్‌గా భావిస్తున్నట్టు ఉచియామ తెలిపారు. రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, సోర్సింగ్ కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్, తదితర మౌలిక సదుపాయాలకు తోడ్పాటును అందించేందుకు జపాన్ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వివరించారు. ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్‌కు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే జపాన్ కంపెనీలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. -
అపూర్వ ‘స్పందన’
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘స్పందన’కు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తారు. ప్రధానంగా ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు కావాలని ప్రజలు దరఖాస్తులు అందించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో 1125 రాగా, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు 4,852 అర్జీలు రాగా 3,235 సమస్యలను పరిష్కరించారు. విశాఖ కలెక్టరేట్లో 1062 దరఖాస్తులు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 6 వేల దరఖాస్తులొచ్చాయి. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనులు భారీగా తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజల ఫిర్యాదులపై స్వయంగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు మార్కెట్ యార్డులో ‘స్పందన’కు 4,165 అర్జీలొచ్చాయి. ఇళ్ల స్థలాల కోసం ఏకంగా 3,111 మంది దరఖాస్తు చేశారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’కు 1627 ఫిర్యాదులొచ్చాయి. ఒంగోలులోని జిల్లా కంట్రోలు రూములో నిర్వహించిన ‘స్పందన’కు 499 అర్జీలు అందాయి. నెల్లూరు కలెక్టరేట్లో కార్యక్రమానికి 10 మందికి పైగా అంధులు రావాడంతో కలెక్టర్ వెంటనే స్పందించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్‌కు నాలుగు వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చి సమస్యలపై వినతిపత్రాలిచ్చారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 17,116 దరఖాస్తులు రాగా 12,064 పరిష్కరించారు. చిత్తూరు జిల్లాలో భూమి సమస్యలపైఎక్కువ దరఖాస్తురాగా, అనంతలో 2,023 అర్జీలు అందాయి. చెల్లెల్ని చేరదీస్తే.. వీధినపడేసింది.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పసుపులేటి పార్వతి సంగీత కళాకారిణి.. భర్త దూరమయ్యాడు. వయసు మళ్లాక నాటకాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇడ్లీ, దోసెలు అమ్ముకుంటూ జీవిస్తోంది. తన చెల్లెలు బండారు పాప, ఆమె ఇద్దరు కుమారులను చేరదీసి తన ఇంట్లోనే ఉంచుకుంది. తన చెల్లెలి రెండో కుమారుడు కిశోర్‌ను సీఏ కూడా చదివించింది. పార్వతికి ఆరోగ్యం బాగోకపోవడంతో తన తదనంతరం ఇల్లు తన చెల్లెలు పెద్ద కుమారుడైన బండారు సురేశ్‌కు దక్కాలని వీలునామా రాసింది. వయోభారంతో ఇడ్లీ, దోసెలు అమ్మే శక్తి లేదని తన చెల్లెలికి చెప్పినప్పట్నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భౌతిక హింసకు పాల్పడటంతోపాటు పిచ్చెక్కిందంటూ చెల్లెలు ఇంట్లోంచి గెంటేసింది. దీంతో పార్వతి సోమవారం ‘స్పందన’లో భాగంగా ఆర్డీవోను కలిసి తనకష్టాలు చెప్పుకుంది.