
సాక్షి, అమరావతి: డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్‌డీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్‌డీగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధును డిప్యూటీ కలెక్టర్‌గా గత ప్రభుత్వం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment