డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధు
ఏపీ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ
అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుని డిప్యూటీ కలెక్టరుగా నియమి స్తూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా నిబంధనలు సడలించింది. దీంతో సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనింగ్ పోస్టింగ్ కోసం 30 రోజు ల్లోగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఆమె రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
నియామక పత్రం అందజేసిన సీఎం
గ్రూప్–1 అధికారిణిగా పీవీ సింధుకు సీఎం చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పీవీ సింధు మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.