Deputy Collector
-
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..!
ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతోనే ఆమె లైఫ్ టర్న్ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..ఆమె పేరు ప్రియాల్ యాదవ్. ఇండోర్‌కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్‌లో దారుణంగా ఫెయిల్ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.అందుకే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(ఎంపీపీఎస్సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్‌ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి.. తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్ నియమితురాలయ్యింది. తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూనే ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్. ప్రస్తుతం ఆమె ఇండోర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్‌ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్‌కి మారుపేరుగా నిలిచింది. అందరి చేత శెభాష్ ప్రియాల్ అని అనిపించుకుంది. (చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!) -
రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్.. అలా చేస్తే కోచింగ్ అనసవరం: షేక్ అయేషా
‘ఓటమి ఎదురైనప్పుడే మరింత శ్రమించడం అలవాటవుతుంది... అప్పుడే విజయం ముంగిటకు వచ్చి వాలుతుంది. పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యమైనా ఇదిగో ఇట్టే మన సొంతమవుతుంది..’ ఇదీ ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న మదనపల్లెకు చెందిన షేక్ ఆయేషా చెప్పిన మాటలు. పేదరికంలో పుట్టినా.. కష్టాలు పలకరించినా వెనుదిరగలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయేషా విజయప్రస్థానం ఆమె మాటల్లోనే.. అన్నమయ్య : లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకసారి వైఫల్యం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి విజయానైన్నా ఇట్టే సాధించవచ్చు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, ఇంటర్నెట్ లాంటి సాధనాలు అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ప్రతి రోజు దినపత్రికలు చదివి , కరెంట్ ఎఫైర్స్ నోట్స్ సొంతంగా తయారు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలం. దానికి నేనే ఉదాహరణ. లక్షసాధనకు ఐదేళ్లు తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. బీటెక్ పూర్తి చేసిన తరువాత పినాకా ఆర్గనైజేషన్ నిర్వాహకులు యాదగిరి ,ముంబైలోని ఆర్బిఐ గ్రేడ్–బి మేనేజర్ మిథున్ల సూచనలు, సలహాలతో సివిల్స్ వైపు దృష్టి సారించా. 2018లో బీటెక్ పూర్తి చేసే సమయంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో, టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యా. అయినా నా లక్ష్యం గ్రూప్స్ కావడంతో ఉద్యోగంలో చేరలేదు. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించే పినాకా స్టూటెండ్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాట్స్ప్ గ్రూపులో చేరాను. ఇందులో గ్రూప్స్‌కు ప్రిపేర్ కావడానికి అవసరమైన మెటీరియల్ లభించేది. దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొదటి ప్రయత్నంగా 2019లో గ్రూప్–1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ పాసై ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కాని ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని కల్పించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. 2022 సెప్టెంబర్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ కాగా ఆత్మస్థైర్యంతో మరింత కష్టపడి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాను. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాను. ఐదేళ్ల తపస్సు నెరవేరింది. సాధారణ విద్యార్థినే.. 1 నుంచి 10 వరకు ఆరోగ్యమాత ఎయిడెడ్ ఉన్నత పాఠశాలో చదివాను. ప్రాథమిక పాఠశాలలో సాధారణ విద్యార్థిని. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, హెచ్ఎం వాసుదేవరావులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మూడో తరగతి నుంచి నాకు మంచి ఫౌండేషన్ వేశారు. పదిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో చేరాను. కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకులు గోవిందరాజులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్లో 982 మార్కులు సాధించాను. బీటెక్ తమిళనాడు తంజావూరులోని శస్త్ర యూనివర్శిటీలో చదివాను. 2018లో బీటెక్ పూర్తి చేశాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా... తమిళనాడు తంజావూరు శస్త్ర యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశా. టెక్ట్స్ బుక్స్, ఎన్‌సీఈఆర్‌టి బుక్స్ చదివి సొంతంగానే నోట్స్ తయారు చేసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతి రోజూ దినపత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సాక్షి చదవడం అలవాటు చేసుకున్నా. ఆయా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్ కాలమ్స్,కరెంట్ ఎఫైర్స్ చదవడం అలవాటుగా మారింది. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివాను. తల్లిదండ్రులే కొండంత అండ: గ్రూప్స్ ప్రిపరేషన్లో తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. నాన్న షేక్ అహ్మద్‌బాషా చిరు వ్యాపారి. అమ్మ గౌసియాబేగం సాధారణ గృహిణి. నా సక్సెస్‌లో వారి ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను. ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేవారు. ఇక స్కూలు రోజుల్లో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి ,వాసు నా చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఐఏఎస్ కావాలనేది నా ఆకాంక్ష ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. అందుకు శక్తివంచన లేకుండా నా ప్రయత్నాలు చేస్తా. మహిళలను విద్యావంతులు చేయడం, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం, ఆర్థికంగా ఎదిగే విధంగా తోడ్పాటునందిస్తా. ఎక్కడ పని చేసినా అక్కడ నిరక్షరాస్యత లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతా. ఫ్రొఫైల్ పేరు : షేక్ ఆయేషా తండ్రి : షేక్ అహ్మద్‌బాషా తల్లి : షేక్ గౌసియా బేగం నివాసం : మదనపల్లె పాఠశాల విద్య : ఆరోగ్యమాత ఇంగ్లీషు మీడియం స్కూల్, మదనపల్లె కళాశాల విద్య : ఎన్ఆర్ఐ కాలేజీ, తిరుపతి బీటెక్ : శస్త్రా యూనివర్శిటీ, తంజావూరు, తమిళనాడు తన కలే మా కల ఆయిషా చిన్నప్పటి నుంచి సివిల్స్‌లో రాణించడమే లక్ష్యంగా ఎంచుకుంది. అందు కోసం నిరంతరం శ్రమించింది. తన కలను మాకలగా మార్చుకుని అన్ని విధాలుగా ప్రోత్సహించాం. ఈ సుదీర్ఘప్రయాణంలో చదువులో అవసరమైన అన్నింటిని సమకూర్చాం. దీంతో తన స్వప్నం సాకారం కావడం మాకు సంతోషాన్ని కలిగించింది. – షేక్ అహ్మద్‌బాషా, గౌసియాబేగం, తల్లిదండ్రులు -
హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ భార్యకు డీటీగా ఉద్యోగం
ఖమ్మంమయూరి సెంటర్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు భార్య భాగ్యలక్క్ష్మికి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గా ఉద్యోగం ఇచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన హరితోత్సవం సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నియామక ఉత్తర్వులు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావును చండ్రుగొండు రేంజ్లో గుత్తికోయలు హత్య చేసిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేíషియాతో పాటు ఖమ్మంలో 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పుడు శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ – తెలంగాణ చాప్టర్, అటవీ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం, అటవీ క్షేత్రాధికారుల సంఘం, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, భారత అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఆయన భార్యకు డీటీగా ఉద్యోగం ఇవ్వడంపై మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు. -
సిద్దిపేట: అడిషినల్ కలెక్టర్‌ని కరిచిన కుక్క
సిద్ధిపేట: అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్క బారిన పడినట్లు తెలుస్తోంది. శనివారం నాడే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్‌నే కరవడంతో రంగంలోకి దిగారు. శనివారం రాత్రి సమయంలో క్వార్టర్స్ వద్ద వాకింగ్ చేస్తున్న అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపై వీధికుక్క దాడి చేసినట్లు తెలుస్తోంది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు చెప్తున్నారు. కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు దిగారని విమర్శిస్తున్నారు స్థానికులు. -
డిప్యూటీ కలెక్టర్‌గా జ్యోతి సురేఖ నియామకం
సాక్షి, అమరావతి: అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న సురేఖకు క్రీడాకారుల కోటాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె నియామకం కోసం ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో ఏపీ యాక్ట్–1994ను సవరించింది. ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
AP: 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవోఎంఎస్ నంబర్ 747 జారీచేశారు. వివిధ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారుల అవసరం పెరగడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్లకు పదోన్నతులు ఇచ్చి ఈ పోస్టుల్ని భర్తీచేసింది. పదోన్నతుల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ఎంపికచేసి 198 మందితో 2022–23 సంవత్సరం అడ్హాక్ ప్యానల్ తయారు చేసింది. ఈ నెల 8వ తేదీన జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ జాబితా నుంచి 66 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికచేశారు. ఆ జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. పదోన్నతులు తాత్కాలికమని జీవోలో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులంతా వెంటనే వెలగపూడి సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఒకేసారి ఇంతమంది తహసీల్దార్ క్యాడర్ అధికారులకు పదోన్నతులు రావడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా ప్రభుత్వం పెద్దఎత్తున పదోన్నతులు ఇచ్చింది. వీటికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూడగా చివరికి వైఎస్ జగన్ ప్రభుత్వం వారి కోరిక నెరవేర్చింది. తాజాగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎంతోకాలంగా వాటికోసం ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది. -
AP: 66 డిప్యూటీ కలెక్టర్ పోస్టులపై కసరత్తు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 66 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల నియామకంపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. తమ శాఖలకు డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారులు కావాలని వివిధ శాఖలు కోరడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటవడంతో వారి అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో నెల కిందట ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం 2022–23 సంవత్సరం అడ్‌హక్ ప్యానల్‌ను సిద్ధం చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 198 మందితో ప్యానల్‌ను రెడీ చేసి పరిశీలిస్తున్నారు. అంటే ఒక్కో పోస్టుకు ముగ్గురు తహసీల్దార్ల పేర్లను పరిశీలిస్తూ వారి పనితీరు, వారిపై ఉన్న కేసులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే రెవెన్యూ శాఖ సేకరించింది. త్వరలో జరిగే డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ 198 మంది నుంచి 66 మందిని ఎంపిక చేయనున్నారు. డీపీసీ సమావేశం ఎప్పుడు జరుగుతుందా అని ప్యానల్లో ఉన్న అధికారులు ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్ల పదోన్నతులు కావడంతో రెవెన్యూ శాఖ మొత్తంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: (రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి) -
Deputy Collector Datla Keerthi: సర్కారీ కొలువులు.. కీర్తికి సలాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ బాధ్యతల వరకూ విజయనగరంతో ఆమెకు విడదీయలేని అనుబంధం... ఇటీవల వెలువడిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తరాంధ్ర టాపర్‌గా నిలిచి విద్యల నగరానికి వన్నె తెచ్చారు. ఒకవైపు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే సబ్‌కలెక్టర్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకున్నారు. విసుగు లేకుండా 11 ఏళ్ల పాటు నిర్విరామ కృషితో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. మెటీరియల్ సౌలభ్యం అంతగా లేకపోయినా గ్రూప్–1 వంటి పోటీపరీక్షల్లో భావవ్యక్తీకరణకు మాతృభాష తెలుగు తనకు కలిసిసొచ్చిందని సగర్వంగా చెబుతున్నారు దాట్ల కీర్తి. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... టీచర్ల ఫ్యామిలీ మాది... మా స్వగ్రామం అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలంలోని రాజులనగరం. మా నాన్న దాట్ల జగన్నాథరాజు తొలుత ఎస్జీటీగా తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొంది రిటైర్డ్ అయ్యారు. అమ్మ నిర్మల కూడా టీచరే. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోడపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన తర్వాత చిన్న వయసులోనే టీచర్‌ను అయ్యాను. అలా టీచర్ల ఫ్యామిలీ మాది. కానీ మా తాతగారు కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో గ్రామాల్లో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. అలా నాకు గ్రూప్–1 రాసి సబ్‌కలెక్టరు పోస్టు సాధించాలనే లక్ష్యం ఏర్పడింది. ప్రభుత్వ బడుల్లోనే చదువు... నాన్న చేయి పట్టుకొనే స్కూల్‌కు వెళ్లడంతో నా విద్యాభ్యాసం మొదలైంది. మా ఊరికి సమీపంలోనే ఉన్న వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో ఆయన టీచర్‌గా పనిచేసేటపుడు అక్కడే నన్నూ చదివించారు.ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ మాకవారిపాలెం జెడ్పీ హైసూ్కల్లో చది వాను. ఏడో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి పరీక్షలు ప్రైవేట్‌గా రాయించారు మా నాన్న. అలా 13 ఏళ్లకే 1997–98 బ్యాచ్‌లో పదో తరగతి పాస్ అయ్యాను. ఇంటర్ విద్య కోసం విజయనగరానికి... ఇంటరీ్మడియెట్ చదవడానికి తొలిసారిగా విజయనగరం వచ్చాను. శ్రీనివాస జూనియర్ కాలేజీలో బైపీసీ చదివాను. నిరీ్ణత వయసు కన్నా తక్కువ ఉండడంతో అప్పుడు ఎంసెట్ రాయడానికి నిబంధనలు అంగీకరించలేదు. బీఎస్సీ అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినా సెకండ్ ఇయర్ మళ్లీ విజయనగరం వచ్చేశాను. ఇక్కడి గాయత్రి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఆసెట్లో 3వ ర్యాంకు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీలో చేరాను. 2005లో గోల్డ్ మెడల్‌తో బయటకు వచ్చాను. అదే సంవత్సరం ఎడ్‌సెట్‌లో ర్యాంకు సాధించడం, 2005–06 బ్యాచ్‌లో బీఈడీ పూర్తి చేయడం కూడా జరిగిపోయాయి. 21 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. అధికారిగా శిక్షణ కూడా విజయనగరంలోనే... బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఎనిమిది నెలల శిక్షణ కోసం 2018లో విజయనగరం జిల్లాకే వచ్చాను. తర్వాత పోస్టింగ్ కూడా ఇక్కడికే రావడం నా అదృష్టం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా 2019 సంవత్సరంలో రెగ్యులర్ అయ్యాను. అప్పటి నుంచి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాను. ఉన్నతమైన జీవితానికి విద్య ఒక్కటే మార్గం. ప్రభుత్వం కలి్పంచిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలనేది నా సూచన. నాలుగేళ్ల ఎదురుచూపు ఫలించింది... గ్రూప్–1 నోటిఫికేషన్ 2018 సంవత్సరంలో మరోసారి వెలువడింది. ప్రిలిమ్స్ తర్వాత 2020 సంవత్సరంలో మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాల్లో 325 మంది విజేతల్లో నేనూ ఉన్నాను. వాల్యూషన్ మళ్లీ చేయడంతో వారిలో నాతో పాటు 123 మందికి మాత్రమే ఇంటర్వ్యూకు అవకాశం దక్కింది. తుది ఫలితాల్లో 9వ ర్యాంకు వచ్చింది. ఉత్తరాంధ్రలోనే టాపర్‌గా నిలిచాను. సబ్‌కలెక్టర్ అవ్వాలనే నా కల నెరవేరింది. లక్ష్యంపై గురి తప్పవద్దు... గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం... ఇవేవీ గ్రూప్–1 లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడానికి ఆటంకాలు కానేకావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యంపై గురి తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. ఈ క్రమంలో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా చేరడం మంచిది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావవ్యక్తీకరణ ప్రధానం గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో భావవ్యక్తీకరణ చాలా ప్రధానం. సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని దినపత్రికలను చదవాలి. అంశాల వారీగా క్లిప్పింగ్స్ ఉంచుకోవాలి. అయితే పరీక్షల్లో ఆ సమాచారాన్ని యథావిధిగా దించేయకూడదు. ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తూ మన విశ్లేషణ కూడా జోడించాలి. ఎగ్జామినర్‌ను ఇంప్రెస్ చేసేలా భావవ్యక్తీకరణ ఉండాలి. ఇందుకు మాతృభాష తెలుగు నాకు బాగా ఉపయోగపడింది. త్వరలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అయ్యేవారికి ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్‌తో పాటు స్వీయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.’’ సబ్‌కలెక్టర్ కావాలన్నదే లక్ష్యం... సబ్‌కలెక్టరు కావాలన్నదే లక్ష్యం. ముందు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని డీఎస్సీకి ప్రిపేరేషన్ ప్రారంభించాను. అదే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్‌తో వివాహం అయ్యింది. ఆయన ఐటీ రంగాన్ని వదిలేసి స్థిరాస్తి వ్యాపారంలోకి వచ్చేశారు. నేను 2009లో డీఎస్సీలో మూడో ర్యాంకుతో టీచర్ ఉద్యోగం పొందాను. అచ్యుతాపురం మండలంలోని గొర్లి ధర్మవరం యూపీ స్కూల్లో చేరడంతోనే హెడ్మాస్టర్గా పనిచేయాల్సి వచ్చింది. టీచర్‌గా కొనసాగుతూనే గ్రూప్–1 పరీక్షకు సిద్ధమయ్యాను. 2011లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. న్యాయవివాదాలతో ఫలితాలు వెలువడలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం 2016లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి పోస్టుకు ఎంపికయ్యాను. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. సివిల్స్ లక్ష్యంతోనే ముందుకు
సాక్షి, భీమవరం: సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమేగా లక్ష్యంగా పనిచేస్తానని గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన భీమవరం పట్టణానికి చెందిన పాలపర్తి జాన్ ఇర్విన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ఏసీఐఓ)గా పనిచేస్తున్న ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. నేరుగా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా వదులుకున్నానని, సివిల్స్ లక్ష్యంతోనే ముందుకు సాగానని చెప్పారు. సాక్షి: గ్రూప్–1కు ప్రిపేర్ కావడానికి స్ఫూర్తి ఎవరు? ఇర్విన్ : తాతయ్య జేసురత్నమే నా స్ఫూర్తి. ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ప్రజలకు నేరుగా సేవచేసే ఉద్యోగం సంపాదించాలని చెబుతుండేవారు. దాంతో సివిల్స్‌పై ఆసక్తి పెరిగింది. గ్రూప్స్ నోటిఫికేషన్ పడడంతో ఆ దిశగా ప్రయతి్నంచా. సాక్షి: విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా సాగింది? ఇర్విన్: విద్యాభ్యాసం భీమవరంలోనే సాగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. కాలికట్ నిట్‌లో ఎంటెక్ చదివాను. సాక్షి: గ్రూప్–1కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇర్విన్: గ్రూప్–1 కోసం ప్రత్యేకంగా ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. మిత్రుల సహకారం, ఆన్లైన్లో చదవడమే. సివిల్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో గ్రూప్స్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేశా. పరీక్ష బాగా రాసినా రిజల్ట్ రావడానికి ఆలస్యం కావడంతో 2015లో కేంద్ర నిఘా విభాగంలో ఉద్యోగావకాశం వచ్చింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని గ్రూప్స్‌కు ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యాను. సాక్షి: తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? ఇర్విన్: మా నాన్న బెల్తాజర్ ఉపాధ్యాయుడు, తల్లి మరియమ్మ గృహిణి. వారి ప్రోత్సహంతోనే ముందుకు సాగా. అపజయాలు ఎదురైనా వెన్నుతట్టి ముందుకు నడిపించారు. సాక్షి: మీ కుటుంబం గురించి? ఇర్విన్: భార్య కేథరినా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆమె ప్రోత్సహం మరువలేనిది. ఒక కుమారుడు ఉన్నాడు. సాక్షి: గ్రూప్–1 అధికారిగా మీ ప్రాధామ్యాలు ఏంటి? ఇర్విన్: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వారి సక్రమంగా అందేలా కృషిచేస్తా. అదే నా మొదటి ప్రాధాన్యత. -
మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్ అలకాటూరు. నగరి: మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్ గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నంబాకం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. అయితే కలెక్టర్ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్‌కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్ రాసినా మెయిన్స్ క్లియర్ కాలేదు. లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఫోన్ ద్వారా ఆన్లైన్లోని మెటీరియల్‌నే చదివారు. 2018లో సివిల్స్ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మహేష్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈయన భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్‌గా ఉన్నారు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) సాధనతోనే సాధ్యం సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్‌లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్‌గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్లైన్లో ఎన్సీటీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని చదివారు. అలాగే ఆన్లైన్లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్ సివిల్స్‌లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్ నాకు మెటీరియల్‌గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్‌పై పట్టు పెంచుకుంటే సివిల్స్‌లో రాణించవచ్చు. న్యూస్ రీడింగ్ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది. –మహేష్, నంబాకం గ్రామం, నగరి మండలం. -
జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం
మహిళా స్టార్ ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. కాగా విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలు గెలిచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో 5వ ర్యాంక్ సాధించింది. అదే విధంగా.. లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ ఘనత సాధించింది. ఇలా ఎన్నెన్నో రికార్డులు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను సీఎం జగన్ ప్రభుత్వం ఉద్యోగంతో గౌరవించేందుకు సిద్ధమైంది. చదవండి: Commonwealth Games 2022: ‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!
ఈ దొంగ చాలా డీప్‌గా హర్ట్ అయ్యాడండీ.. పాపం!! ఎంతగా నొచ్చుకున్నాడంటే సాటి ఏ దొంగకీ ఈ పరిస్థితి దాపరించకూడదని తిరిగి వెళ్తూ.. తాను వచ్చి వెళ్లినట్లు ఆనవాళ్లు కూడా వదిలివెళ్లాడు. అసలేం జరిందంటే.. దొంగన్నాక కన్నం వేయాలి.. కన్నం వేయాలంటే కష్టపడి తాళం పగలగొట్టాలి... విలువైన ధనం, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి.. మూడో కంటికి కనిపించకుండా ఉడాయించాలి! మామూలు కష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దొంగ మాత్రం కొంచెం భిన్నంగా నిజాయితీ పరుడైన డిప్యూటీ కలెక్టర్ ఇంటిని దోచుకోవడానికి ఎంచుకున్నాడు. ఐతే ఎప్పటిలాగానే దొంగగారు ఇంటితాళం పగులగొట్టాడు. లోపలికి ప్రవేశించాడు. ఎంతవెతికినా ఏమీ దొరకలేదు. చిర్రెత్తిపోయిన ఆ దొంగ వెళ్తూ వెళ్తూ ఒక ఉత్తరం ఆ ఇంట్లో రాసి పెట్టి మరీ వెళ్లాడు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందనేగా మీ సందేహం! ‘మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు కలెక్టర్?’ అని ఆ నోట్లో రాసి ఉంది. ఈ హాస్యాస్పదమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా, త్రిలోచన్ గౌర్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఇంటి సమీపంలోనే పోలీసు సూపరింటెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇంత సాహసోపేతమైన పనికి ఒడిగట్టిన దొంగ, అతను రాసిన ఉత్తరం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐతే లోకల్ అథారిటీస్ మాత్రం దీనిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, ఆ ఘరానా దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా వెతుకుతున్నారు. చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
‘ఆశ’ వదులుకోలేదు: స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
రోజూ ఎన్నో సక్సెస్ స్టోరీలు చూస్తుంటాం. వాటిలో చాలామట్టుకు చిన్నస్థాయి నుంచి పెద్ద విజయాలు అందుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. తమ కష్టపుకథలు మరికొందరిలో స్ఫూర్తి నింపాలనేదే వాళ్ల ఉద్దేశం కూడా. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా గాథ కూడా అలాంటిదే. జైపూర్: ఆశ కందారా.. మూడు రోజుల వరకు జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసిన ఒక స్వీపర్. 2016 నుంచి కాంట్రాక్ట్ సర్వీస్‌లో కొనసాగిన ఆమెకు.. పన్నెండు రోజుల క్రితమే పర్మినెంట్ ఎంప్లాయి లెటర్‌ను చేతిలో పెట్టారు అధికారులు. ఆ సంతోషం మరువక ముందే.. ఏకంగా ఆమె తన లక్క్ష్యం అందుకుంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో ప్రభుత్వాధికారి హోదాలో ఆమె బాధ్యతల్ని చేపట్టబోతోంది. నిజానికే రెండేళ్ల క్రితమే ఆమె పరీక్షలకు, ఇంటర్వ్యకు హాజరుకాగా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ చివరికి మంగళవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. घर चलाने के लिए लगाती थीं झाड़ू, लेकिन मेहनत लाई रंग और बनी SDM! सुनिए Asha Kandara के संघर्ष की ये कहानी#AshaKandara #SDM #Story pic.twitter.com/R2jekPkg0I — News Tak (@newstakofficial) July 16, 2021 భర్త వదిలేయడంతో.. 1997లో ఆశ చదువు ఆపేయించి మరీ పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు పుట్టాక మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తను అదుపులో పెట్టుకోలేకపోయిందంటూ సమాజం మొత్తం ఆశదే తప్పని నిందించింది. కానీ, ఆమె అవేం పట్టించుకోలేదు. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూనే.. పేరెంట్స్ సహకారంతో చదువును కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్లో టెంపరరీ స్వీపర్ పోస్టులకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది. మలుపు తిప్పిన సెల్యూట్ ఆశకు ప్రేరణ తన పైఅధికారులే. రోజూ వాళ్ల గదుల్ని, ఆఫీసు పరిసరాల్ని శుభ్రం చేయడం, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వాళ్లు గౌరవం అందుకోవడం ఆమెను ఆకర్షించేవట. ఓరోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పైఅధికారులు ఇన్స్పెక్షన్కు వచ్చారు. అప్పటిదాకా తనతో సరదాగా గడిపిన తోటి ఉద్యోగులు ఒక్కసారిగా నిలబడి వాళ్లకు సెల్యూట్ చేయడంతో, ఆ గౌరవం తనకూ దక్కాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా ఆమె ఆశను వదులకోలేదు. పిల్లల పోషణ కోసం ఓవైపు 10 గంటలు స్వీపర్‌గా పని చేస్తూనే.. ఆర్ఏఎస్ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్ అయ్యింది. చివరికి తన కలను నెరవేర్చుకోవడంతో పాటు త్వరలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది ఆశా కందారా. ‘ఈ విజయం నా కుటుంబానికే అంకితం. నా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడినందుకే ఈ గెలుపు సాధ్యమైంది’ అని సంతోషంగా చెప్తోందామె. మేయర్ కుంతి దియోరా నుంచి అభినందనలు అందుకుంటున్న ఆశ -
కల్నల్ సంతోష్ బాబు భార్యకు పోస్టింగ్
సాక్షి యాదాద్రి: భారత్–చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు భార్య సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. సోమవారం ఆమె కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిశారు. జూన్ 21న ప్రభుత్వం ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఉద్యోగ విధి విధానాలపై ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణ పొందిన సంతోషికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించారు. 2021 జనవరి 24 వరకు ఇక్కడ కలెక్టరేట్‌తో పాటు క్షేత్రస్థాయిలో విధులపై శిక్షణ పొందనున్నారు. (చదవండి: సయోధ్య దిశగా...) -
డిప్యూటీ కలెక్టర్ శిక్షణకు సంతోషి
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఘర్షణలో మృతి చెందిన సంతోష్‌బాబు సతీమణి బికుమల్ల సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర పాటు శాఖాపరమైన శిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ఏదేనీ జిల్లాలో క్షేత్రస్థాయి పాలనా వ్యవహారాల్లో శిక్షణకు పంపనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంసీహెచ్‌ఆర్‌సీలో జరిగే శిక్షణకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన సంతోష్ బాబు భార్య
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా నేడు బాధ్యతలు చేపట్టారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి శనివారం ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. దీంతోపాటు సంతోష్‌బాబు కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాగా, గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది సైనికులు అమరులయ్యారు. (హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం) -
డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి
సాక్షి, హైదరాబాద్ : భారత్– చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఆమెకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో నియామక ఉత్తర్వులను అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, ప్రశాంతరెడ్డి, నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగంధర్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి స్థలం అప్పగింత షేక్‌పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14లో కేబీఆర్ పార్కు ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అప్పగించారు. ఆర్డీఓ, తహసీల్దార్లతో సమక్షంలో స్థల పంచనామా నిర్వహించి స్థలాన్ని స్వాధీనం చేశారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం షేక్‌పేట మండలంలో మూడు స్థలాలను కుటుంబసభ్యులకు చూపించారు. వీటిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో స్థలం కావాలని వారు కోరగా, ఈ స్థలాన్ని కేటాయించారు. కేసీఆర్ తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కల్నల్ సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. -
సంతోష్ బాబు కుటుంబంతో కేసీఆర్ భోజనం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం, రూ. 5 కోట్ల నగదు.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతి భవన్లో సంతోషికి అందించారు. ఆమెకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలానే ఇంటి స్థలానికి సంబంధించి షేక్పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన ప్లేస్‌ను కోరుకోవాలని కేసీఆర్ గతంలోనే వారికి సూచించారు. ఈ క్రమంలో సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలం కేటాయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఉదయం ఈ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేతులు మీదుగా స్థలం కాగితాలను సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
-
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు బుధవారం విజయవాడలోని ఆమె ఇంటివద్ద అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి వీవీఎస్ఎన్ లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో మాధురిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణతో కుమ్మక్కై 3,880 చదరపు గజాలు కలిగిన పది ప్లాట్లను కేటాయించడంతో పాటు రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించి మాధురిపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం నెక్కల్లులో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ముఖ్య అనుచరుడైన రావెల గోపాలకృష్ణ ల్యాండ్ పూలింగ్‌కు 3.11 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు. అందుకుగాను 3,110 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్డీఏ ద్వారా కేటాయించారు. వాస్తవానికి ఆ భూమి నాగార్జున సాగర్ కాలువ, రెండు రోడ్లకు చెందినది. తప్పులను సరిదిద్దుకునే క్రమంలో మాధురి మరిన్ని తప్పులకు ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయారు. -
డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
సాక్షి, విజయవాడ : రాజధాని భూకుంభకోణం దర్యాప్తులో సీఐడీ తన దూకుడు పెంచింది. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకొని అనంతరం రిమాండ్‌కు తరలించారు. 2016లో రాజధాని ప్రాంతంలో గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. కాగా గోపాలకృష్ణను నెలరోజుల క్రితమే సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం రాయపూడి డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధురి 3 ఎకరాల 20 సెంట్ల భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రభుత్వానికి రూ.6 కోట్లు నష్టం కలిగించినట్టు సిట్ అధికారులు వివరించారు. కాగా మాధురిని సిట్ అధికారులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మాధురికి న్యాయమూర్తి ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు. కాగా టీడీపీ హయాంలో మాధురి నెక్కల్, అనంతవరం,రాయకల్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. -
డిప్యూటీ కలెక్టర్‌గా సుబ్రహ్మణ్యం కుమార్తె
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధును ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల నిబంధనలను అనుసరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింధు కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. (చదవండి: అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్) -
చదివింది ఎనిమిదే.. కానీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్!
భోపాల్: ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడో వ్యక్తి. అంతే కాదు నెలకు అక్షరాలా రూ. 4 వేల జీతం కూడా పొందుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాదు. మరి ఎలా టీచర్ ఉద్యోగం చేస్తున్నాడనుకుంటున్నారా..! వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ ఖర్గోనే జిల్లాలోని దేవ్లీ ఏరియాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో రామేశ్వర్ రావత్, జబ్బర్ సింగ్ అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. (కలెక్టర్‌ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది) వీరు గత కొద్ది రోజులగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పాఠశాలలో ఉన్న 23 మంది పిల్లలకు పాఠాలు చెప్పేందుకు 8వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉన్న దయాల్ సింగ్ అనే వ్యక్తిని టీచర్‌గా నియమించుకున్నారు. నెలకు రూ. 4 వేలు జీతం కూడా ఇస్తున్నారు. పదిహేను రోజులకో సారి వచ్చి ఆ ఇద్దరు టీచర్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి పోతున్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆ పాఠశాలను జిల్లా డిప్యూటీ కలెక్టర్ రాహుల్ చౌహన్ గురువారం సందర్శించారు. సమయానికి ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. దయాల్ సింగ్‌పై డిప్యూటీ కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించగా అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న డిప్యూటీ కలెక్టర్ రామేశ్వర్ రావత్, జబ్బర్ సింగ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక ఆ ఇద్దరి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (పాఠశాల పిల్లగాడా.. పశులుగాసే పోరగాడా..) -
కలెక్టర్‌ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది
భోపాల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు అనుకూలంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన మద్దతు ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మపై బీజేపీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తించారు. విధుల్లో భాగంగా ఆందోళనకారులను చెదరగొడుతున్న ఆమెను అడ్డుకుని జుట్టుపట్టి లాగారా. మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌గఢ్ జిల్లా ప్రధాన రహదారిపై సీఏఏకు మద్దతుగా ఆదివారం బీజేపీకి కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అయితే దీనికి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకారులు-పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విషయం తెలిసుకున్న డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఆందోళకారులను పట్టుకుని పోలీసు వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వెనుకనుంచి వచ్చి ఆమె జుట్టుపట్టి లాగి దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న రక్షణ సిబ్బంది కలెక్టర్‌ను చుట్టుముట్టి కాపాడారు. అయితే కొద్దిసేపటి తరువాత ఆ పోకిరిని గుర్తించిన పాలానాధికారి.. కాలర్‌పట్టి గుంజి చెంప చెల్లుమనిపించారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం చేశారు. అనంతరం ఘటనకు సంబంధించిన ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే దీనికి సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై తీవ్రంగా స్పందించింది. -
ప్రొటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధు
సాక్షి, అమరావతి: డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డీగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధును డిప్యూటీ కలెక్టర్‌గా గత ప్రభుత్వం నియమించింది. -
ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, నెల్లూరు : తెలుగుగంగ ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ నరసింహం ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేపట్టింది. లక్ష్మీనరసింహం నివాసంతోపాటు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిగాయి. నెల్లూరు, కావలి, రాజమండ్రి, ఒంగోలులో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి, ఒంగోలులో పొలాలు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్భంగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 1989 ఆగస్టు 9వ తేదీన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్)గా ప్రకాశం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన రెవెన్యూశాఖకు బదిలీ అయి నెల్లూరు జిల్లాకు వచ్చారు. 1995లో నెల్లూరు జిల్లా పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2002లో తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. నెల్లూరు, జలదంకి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో పనిచేశారు. 2011లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజేషన్ (భూ సేకరణ) విభాగంలో సోమశిలలో పనిచేశారు. 2012లో రాజంపేట, 2014–17 వరకు కావలి ఆర్డీఓగా విధులు నిర్వహించారు. 2018 నుంచి తెలుగుగంగ ప్రాజెక్ట్ రాపూరు ఎస్డీసీగా పనిచేస్తూ బుధవారం జరిగిన బదిలీల్లో చిత్తూరు జిల్లా కేఆర్ఆర్సీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు డైకస్‌రోడ్డులో నివాసం ఉంటున్నారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన వైనం రెవెన్యూ శాఖలో అడుగిడిన అనంతరం ఆయన తన అక్రమార్జనకు తెరలేపారు. పనిచేసిన ప్రతిచోట భారీగా ఆస్తులను కూడబెట్టారు. ప్రధానంగా తహసీల్దార్, ఆర్డీఓగా ఉన్న సమయాల్లో పెద్ద ఎత్తున ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు భార్గవ్ పేర్లుపై ఆస్తులను కొనుగోలు చేశారు. అక్రమ ఆస్తుల విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్‌శాంతో నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గురువారం తెల్లవారుజామున ఆరు బృందాలుగా విడిపోయి నెల్లూరు డైకస్‌రోడ్డులోని ఆయన ఇంటితో పాటు, బాలాజీనగర్‌లోని స్నేహితుడు కృష్ణారెడ్డి, జలదంకి మండలం అగ్రహారంలోని స్నేహితుడు ప్రభాకర్ ఇంట్లో, స్వగ్రామం కలవల్ల గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఆయన అత్త ఇళ్లు, నెల్లూరులోని కార్యాలయంలో ఏకకాలంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ అధికారులు విస్తుపోయారు. రూ.కోట్లలో ఆస్తులు గుర్తింపు.. ఏసీబీ సోదాల్లో లక్ష్మీనరసింహం, ఆయన భార్య, కుమారుడి పేరుపై ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం రూ.4,14,80,000 మేర ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. గుర్తించిన ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనరసింహం నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో 2008లో రూ.33,075 విలువ చేసే 252 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు ప్రకాశం జిల్లా కందుకూరులో 2006లో రూ.34 వేల వంతున ఎకరా వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. భార్య పేరుతో.. లక్ష్మీనరసింహం భార్య విజయలక్ష్మి పేరుతో 2013లో నెల్లూరు డైకస్‌రోడ్డులో రూ 26,30,200లతో జి+2 హౌస్ నిర్మాణం చేశారు. విజయలక్ష్మి పేరుతో 1999లో నెల్లూరు రూరల్ మండలం గుండ్లపాళెంలో రూ.27వేలు విలువ చేసే 33 అంకణాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. విజయలక్ష్మి పేరుతో 2018లో గుంటూరు జిల్లా తుళ్లూరులో రూ .8.55 లక్షలు విలువ చేసే ప్లాటును కొనుగోలు చేశారు. 2007లో కందుకూరులో రూ.52 వేలు విలువ చేసే వ్యవసాయభూమి కొనుగోలు చేశారు పొదలకూరు మండలం భోగసముద్రంలో 2006లో రూ.1.29 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు పొదలకూరు మండలం భోగసముద్రంలో 2007లో రెండు దఫాలుగా రూ .2.04 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు పొదలకూరు మండలం బోగసముద్రంలో 2012లో రూ. 30 వేలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. కుమారుడు పేరుతో.. లక్ష్మీనరసింహం కుమారుడు భార్గవ్ పేరుపై కావలిలో రూ. 2,98,57,000 విలువతో 605 గజాల స్థలంలో జి+5 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షలు అడ్వాన్స్‌ను సైతం చెల్లించారు. 2013లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.18.20 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 2013లో నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో రూ.2.14 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 2012లో రూ. 6 లక్షలు వెచ్చించి టాటా ఇండికా విస్టా కారు కొన్నారు. అదే ఏడాది రూ.45 వేలు వెచ్చించి మహీంద్ర డ్యూరో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించి వాటి తాలుకు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 18 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, రూ.4.50 లక్షల నగదు, రూ.15 లక్షలు విలువ చేసే 650 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంక్‌లో రూ.2 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో సంచలనం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బదిలీ ఉత్తర్వులు అందుకునే లోపే.. ఇదిలా ఉంటే ఈ నెల 9వ తేదీన జరిగిన బదిలీల్లో లక్ష్మీనరసింహం చిత్తూరు జిల్లా కేఆర్ఆర్సీకి బదిలీ అయ్యారు. గురువారం ఆయన బదిలీ ఉత్తర్వులు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో దాడులు చేయడం, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ సోదాల్లో నెల్లూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ బి.రమేష్‌బాబు, తిరుపతి ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రెడ్డి, విజయశేఖర్, ప్రకాశం ఇన్స్పెక్టర్ ఎన్. రాఘవరావు, తూర్పుగోదావరి ఇన్స్పెక్టర్ తిలక్, తిరుపతి ఎస్సై విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
నాన్నే స్ఫూర్తి
నాకు బచ్చల కూర పప్పు అంటే భలే ఇష్టం. వంట కూడా బాగా వండుతా. చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. సెల్ఫ్ కుకింగ్‌తో రిలాక్స్ కావొచ్చు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర నేనే వండుతా. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మమ్మీ కంటే డాడీనే బాగా వంట చేస్తారని మా పిల్లలు అంటుంటారు. మా నాన్న.. మా టీచర్.. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్. మా నాన్నే నాకు స్ఫూర్తి అని.. ఆయన అండ, సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. బుక్స్ రీడింగ్ అంటే ఇష్టమని, సమయం దొరికితే కవితలు రాస్తుంటానని, కామెడీ, కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయని చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య విధుల్లో తలమునకలైన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపిగుర్తులు, మరుపురాని సంఘటనలు, ఇష్టమైన వంటకాలు, సినిమాలు, ఆటలు, స్నేహబంధంపై నగేష్ పర్సనల్ టైం ఆయన మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మా నాన్న రాంరెడ్డి రిటైర్డ్ టీచర్.. అమ్మ పద్మ హౌస్ వైఫ్. నాకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని తొర్లికొండకు చెందిన మమతతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాకు ఇద్దరు సంతానం. అబ్బాయి ధీరజ్ బీటెక్ తృతీయ సంవత్సరం.. అమ్మాయి లాస్య బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. విద్యాభ్యాసం.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్‌లో నాలుగో తరగతి వరకు చదివాను. హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని చందూర్‌లో తొమ్మిది, పదో తరగతి విద్యనభ్యసించాను. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ఉన్న మధుమలంచ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్.. నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఎల్ఐసీ, ఎంఏ–తెలుగు విద్యనభ్యసించాను. అది నాకు చేదు, తీపి జ్ఞాపకం వెల్కటూర్‌లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన నన్ను మార్చేసింది. మా నాన్న ఆ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడు. 30 ఏళ్లు అక్కడే టీచర్‌గా పనిచేశారు. సిన్సియర్ టీచర్‌గా పేరు సంపాదించారు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు తెలుగు నెలల పేర్లు చెప్పమంటే.. చెప్పాను. వరుస క్రమంలో చెప్పకపోవడంతో అందరి ముందు బెత్తంతో బాదారు. ఆ తర్వాతే నేను చదువు మీద దృష్టిసారించాను. ఇది నాకు చేదు, తీపి జ్ఞాపకంగా మిగిలింది. గాంధీ ఆటోబయోగ్రఫీ మరువలేను నేను హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్నా. స్కూల్లో ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో నేనే ఫస్ట్ వచ్చా. నాకు జాతిపిత మహాత్మాగాంధీ ఆటో బయోగ్రఫీ ఉన్న పుస్తకం, ఒక డిక్షనరీ ప్రజెంట్ చేశారు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను. హ్యాపీ మూమెంట్.. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో నాకు గ్రూప్–3 ఉద్యోగం వచ్చింది. 1994లో నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా నా తొలి పోస్టింగ్. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రోజు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ చేసుకున్నాం. ఓ హోటల్లో అందరం భోజనం చేసి.. స్వీట్లు తిన్నాం. అది నాకు హ్యాపీ మూమెంట్. మూడు సంఘటనలు మరిచిపోలేనివి కామారెడ్డిలో ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించాను. ఓ సంధులోని పాత ఇంట్లో ఆ స్కూల్ ఉంది. గాలి, వెలుతురు రాకపోవడంతోపాటు వసతులు సరిగా లేవు. పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకుంటే చాలా బాధేసింది. వెంటనే మార్చాలని నిర్ణయానికి వచ్చా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఏఎస్‌డబ్ల్యూ ఆఫీస్‌లోకి మార్చా. ఈ ఆఫీస్‌ను అంతకు మునుపే కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనంలోకి తరలించారు. దీంతో కేజీబీవీని అక్కడికి తరలించేలా దగ్గరుండి పర్యవేక్షించా. ఏడు, ఎనిమిది గదులను అప్పటికప్పుడు శుభ్రం చేసి బాలికల విద్యాలయాన్ని అక్కడికి మార్చాం. ఒక్క రోజులోనే ఇదంతా చేశాం. ఈ ప్రాంతం జనావాసాలకు కొంత దూరంగా ఉండడంతో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు సూచించా. ఇందుకోసం పోలీసులు ప్రతి రాత్రి సంతకం చేసేలా బుక్ పెట్టాం. ఈ నేపథ్యంలో విద్యార్థినులు చాలా హ్యాపీగా ఫీల్ కావడం.. నాకు సంతోషాన్నిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. 2015–16 అనుకుంటా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ అనే అమ్మాయి అప్పుడు అక్కడే చదువుతోంది. ఈ పాఠశాల గుట్టమీద ఉండడంతో తాగునీటికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. వెంటనే గుట్ట కింద ఉన్న బావి వారితో మాట్లాడి పూడిక తీయాలని సంకల్పించా. వెంటనే జేసీబీతో బావి పూడిక తీయడంతోపాటు గుట్టపైకి పైపులైన్ వేసి విద్యార్థుల నీటి కష్టాలు తీర్చాను. విద్యార్థులు వచ్చి థ్యాంక్స్ సర్ అని చెప్పడంతో ఆనందమేసింది. కామారెడ్డిలో ఆర్డీఓగా ఉన్న సమయంలో 2016లో సుమారు పది వేల మందికి పౌతి చేసి రికార్డ్ సృష్టించాం. చనిపోయిన వారి వారసులకు సంబంధించిన భూములను గ్రామ సభలు నిర్వహించి గుర్తించాం. సుమారు పదేళ్లుగా వారు పట్టాపాస్ బుక్కుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి వారి గ్రామాల్లో చెట్ల కింద పౌతి ప్రక్రియ పూర్తి చేసి వారి ఇంటి వద్దకు వెళ్లి పాస్‌బుక్కులు అందజేశాం. దీనికి సంబంధించి ఆయా గ్రామస్తులు అభినందించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను. బుక్స్ రీడింగ్ ఇష్టం నాకు బుక్స్ చదవడమంటే ఇష్టం. ఇప్పటివరకు సుమారు 1000 నుంచి 1,200 వరకు బుక్స్ కలెక్ట్ చేశాను. దీంతోపాటు సాహిత్యం, కవితలపై ఇంట్రస్ట్ ఎక్కువ, అప్పడప్పుడు కవితలు రాస్తుంటా. సినిమాలు చాలా తక్కువగా చూస్తా. హిట్ టాక్వచ్చి.. ఫ్యామిలీ సినిమా అయితేనే వెళతాం. రెండు, మూడు నెలలకోసారి ఫ్యామిలీతో సహా సినిమా చూస్తాం. మా ఇంట్లో కామెడీ సినిమాలే ఇష్టపడతారు. నేను చూసిన వాటిలో ‘కిక్’ సినిమా చాలా బాగుంది. స్నేహబంధంలో ప్రత్యేక అనుభూతి.. స్నేహ బంధంలో మరపురాని అనుభూతి ఉంటుంది. చిన్న నాటి స్నేహితులతోపాటు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఇటీవల ఎస్సెస్సీ బ్యాచ్ వాళ్లు గెట్ టుగెదర్ పెట్టారు. నేను బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయా. దసరా వంటి పండుగలకు ఊరెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌ను తప్పనిసరిగా కలుసుకుంటా. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి.. పుస్తకాలు చదివించడం నేర్పించాలి. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేలా వారిలో తల్లిదండ్రులు స్ఫూర్తి నింపాలి. విధులు ఇలా.. నా తొలి పోస్టింగ్ నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌గా.. నిజామాబాద్‌లో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా, భువనగిరిలో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. అనంతరం కామారెడ్డి ఆర్డీఓగా, నిర్మల్ డీఆర్వోగా, ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్‌గా 2017 నవంబర్ నుంచి పని చేస్తున్నాను. -
ప్రథమ సేవకుడిగా పనిచేస్తా
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చెంత నూతన ఈఓ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రథమ సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా భీమవరమని చెప్పారు. తాను 20 డిగ్రీ పట్టాలు అందుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. ప్రశ్న: భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? జవాబు: శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడూ.. వసతి దొరకాలని, సంతృప్తికరమైన దర్శనం కలగాలని కోరుకుంటాడు. ప్రధాన సేవకుడిగా వారి కోరికలను నెరవేర్చడం నా బాధ్యత. మల్లన్న దర్శనానికి వచ్చే దివ్యాంగులు, గర్భిణిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. వీరి కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తాను. ఇంత ముందులా కాకుండా నేరుగా స్వామి అమ్మవార్లను త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. ప్ర: వసతి గదులను ఏమైనా నిర్మిస్తున్నారా? జ: సాధారణ భక్తుల కోసం రింగ్‌రోడ్డు సమీపంలో 200 వసతి గదులను నిర్మిస్తున్నాం. భక్తులకు అవసరమైన డార్మెంటరీలను నిర్మిస్తాం. అలాగే అతి తక్కువ ధరతో లాకర్ బాత్రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్ర: గతంలో ఏ ఆలయంలో ఈఓగా పనిచేశారు? జ: నేను శ్రీకాళహస్తి ఈఓగా 2010 నుంచి 2012 వరకు పనిచేశాను. అక్కడ ఉన్న సమయంలో 50 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. శ్రీశైల దేవస్థానానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా అవసరం ఉంది. ఇక్కడ అన్నదానానికి రూ.43 కోట్ల వరకు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. త్వరలో మరి కొన్నింటిని చేసే దశగా ప్రయత్నం చేస్తాను. ప్ర: పుష్కరిణి సమస్య మీ దృష్టికి వచ్చిందా? జ: వచ్చింది. పుష్కరిణిలోకి కంచిమఠం వారికి సంబంధించిన డ్రైనేజీ నీరు ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. కంచిమఠం నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఆలయానికి దగ్గరలో ఉడడంతో భక్తుల ఇక్కడే స్నానాలు చేయాలని చూస్తారు. వారి కోరిక మేరకు త్వరలో పూర్తి స్థాయిలో పుష్కరిణి అందుబాటులోకి తేస్తాను. ప్ర: భక్తులకు మినరల్ వాటర్ అందిస్తారా? జ: కచ్చితంగా.. క్షేత్రంలో శివగంగ జల ప్రసాద పథకం ద్వారా ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చింది. త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు అందుబాటులోకి తెస్తాను. ప్ర: మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయనున్నారు? జ: క్షేత్రాభివృద్ధికి నా వంతుగా మాస్టర్ ప్లాన్‌లోని పనులను త్వరగతిన అమలు చేస్తాను. ఇందులో ప్రధానంగా వసతి గదులపై దృష్టి సారించాను. నందిసర్కిల్ ప్రాంతంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్.. ఆలయ ప్రధాన పురవీధిలోని దుకాణాలను తొలగించి షిప్ట్ చేయాలే ఉద్దేశంతో నిర్మించారు. వర్షాలు పడిన సమయంలో లికేజీ కాకుండా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. -
గుంటూరు డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీకాంత్
గొల్లపూడి(విజయవాడ రూరల్): భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియామక పత్రాలు అందుకున్నాడు. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో పాటు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకున్న శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. గురువారం గొల్లపూడిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనిల్ చంద్ర పునీత ఈ స్టార్ షట్లర్‌కు నియామక పత్రాలు అందజేశారు. శ్రీకాంత్ స్పందిస్తూ... ‘రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమించడం ఆనందంగా ఉంది. దీనికి నా కృతజ్ఞతలు’ అని అన్నాడు. నంబర్‌వన్ నుంచి ఐదో స్థానానికి... భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ వారం రోజుల ముచ్చటే అయింది. గురువారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ ఐదో స్థానానికి పడిపోయాడు. గత వారం శ్రీకాంత్ తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. 2017 సింగపూర్ సిరీస్‌లో ఫైనల్ చేరడం ద్వారా పొందిన 7800 పాయింట్లను ఇప్పుడు కోల్పోవడంతో శ్రీకాంత్ ర్యాంక్‌లో మార్పు వచ్చింది. భారీగా పాయింట్లు చేజారడంతో అతను నాలుగు స్థానాలు కోల్పోయాడు. ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన మరో తెలుగు తేజం సాయిప్రణీత్ 9200 పాయింట్లు కోల్పోవడంతో నాలుగు స్థానాలు దిగజారి 19వ స్థానంలో నిలిచాడు. ఆ సిరీస్‌లో పాల్గొనని హెచ్ ఎస్ ప్రణయ్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడో స్థానంలో, సైనా నెహ్వాల్ 12వ స్థానంలోనే కొనసాగుతుండగా... యామగుచి (జపాన్) అగ్రస్థానం దక్కించుకుంది. -
డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి బాధ్యతలు
విజయవాడ: బ్యాడ్మింటన్ వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాంత్ ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని డిప్యూటీ కలెక్టర్ హోదాతో గౌరవించింది. గత ఏడాది విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాంత్‌ను గ్రూప్-1 సర్వీసెస్‌లో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఈ నియామకం చేపట్టారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గొల్లపూడిలో భూ పరిపాలన కమిషనర్ అనిల్ చంద్ర నుంచి శ్రీకాంత్ నియామక పత్రాలు స్వీకరించారు. దీనిలో భాగంగా అనిల్ చంద్ర మాట్లాడుతూ.. శ్రీకాంత్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారుడు తమ శాఖ పరిధిలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకాంత్ క్రీడల్లో రాణించినట్లే ఉద్యోగంలో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఇక తన పోస్టింగ్‌పై శ్రీకాంత్ స్పందిస్తూ తనను ప్రోత్సహించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను కోరినట్లే గుంటూరులో పోస్టింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు. ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌తోపాటు డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరిస్‌లను నెగ్గిన శ్రీకాంత్.. ఒకే ఏడాది నాలుగు టైటిళ్లు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా వ్యక్తిగత విభాగంలో శ్రీకాంత్ రజత పతకం సాధించారు. -
డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి శ్రీకాంత్
సాక్షి, అమరావతి : బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఇకపై డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీకాంత్, చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులను సీఎం అందించారు. పద్మశ్రీ అవార్డు సాధించడం పట్ల శ్రీకాంత్‌ను అభినందించిన చంద్రబాబు భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు. Congratulated @srikidambi on being awarded with Padma Shri award and gave him posting orders to take charge as a Deputy Collector. Extended warm wishes to his mentor Sri. Pullela Gopichand as well. pic.twitter.com/spmAEgwjFL — N Chandrababu Naidu (@ncbn) March 29, 2018 -
చంద్రబాబును కలిసిన కిదాంబి శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు సాధించిన శ్రీకాంత్‌ను చంద్రబాబు అభినందించారు. శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోస్టింగ్ ఆర్డర్‌ను సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ గోపిచంద్ కూడా పాల్గొన్నారు. -
కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా..
‘‘అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడడం మంచి పద్ధతి కాదు. కొడుకైనా, కూతురైనా ఒక్కటే. కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. వారి అభిరుచిని గుర్తించి సహకరిస్తే విజయాలు సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది’’ – నెల్లూరు ఆర్డీఓ హరిత మనోగతం నెల్లూరు(వేదాయపాళెం): మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, చిన్నతనం నుంచే ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతూ కష్టపడి చదివి గ్రూప్ – 1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌గా విజయం సాధించారు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువుకు చెందిన డీ హరిత. కడపలో ఆర్డీఓగా తొలిసారి ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం జిల్లాకు బదిలీ పై వచ్చారు. డ్వామా పీడీగా, నెల్లూరు ఆర్డీఓగా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ పలువురి మ న్ననలు పొందుతున్నారు. ఆర్డీఓ హరిత మహిళా సాధికారత సాధన కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎప్పటికైనా ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో విధి నిర్వహణలోనూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు సాక్షితో శనివారం తన మనోగతాన్ని పంచుకున్నారు. ప్ర: జీవితాశయంలో మీకు ఆదర్శప్రాయులు ఎవరు..? జ:మా నాన్నే నాకు ఆదర్శం. చిన్నతనం నుంచి ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన ఆశయం. అయన ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నా. మా నాన్న విశ్రాంత తహసీల్దార్ దామలచెరువు చిన్నయ్య, తల్లి నిర్మల న్యాయవాది. ప్ర: మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది..? జ: తిరుపతిలోని లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు, తిరుపతిలోని క్యాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఎంటెక్ చదివా. ప్ర: మీ కుటుంబ నేపథ్యం..? జ:అన్నయ్య హరికిశోర్ టాటా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండగా, తమ్ముడు హరికృష్ణ వ్యాపారంలో స్థిరపడ్డారు. 2012లో పెద్దల సమక్షంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా. భర్త అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాపారంలో రాణిస్తున్నారు. కుమారుడి పేరు ప్రణయ్ కార్తికేయ. ప్ర: అందుకున్న అవార్డులు, సత్కారాలు..? జ: తొలుత కడప ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన 2013– 14లో ఉత్తమ అధికారి గా అవార్డును అందుకున్నా. నెల్లూరులో డ్వామా పీడీగా చేస్తున్న సమయంలో పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విజయవాడలో ప్రశంసపత్రాన్ని పొందా. నెల్లూరు ఆర్డీఓ గా ఇటీవల జన్మభూమి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు మంత్రి నారాయణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నా. ప్ర: మహిళా సాధికారతపై మీ అభిప్రాయం..? జ: కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలకు ఆయా రంగాల అభిరుచికి తగ్గట్లుగా కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మంచి విజయాలను సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడటం మంచి పద్ధతి కాదు. కొడుకైనా.. కూతురైనా ఒక్కటే. మహిళలు ఉద్యోగాలు చేయకూడదనే భావన కొన్ని కుటుంబాల్లో నేటికీ ఉంది. ఇది పోవాలి. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్ర: నెల్లూరు ఆర్డీఓగా మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు..? జ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను అన్ని వర్గాల మహిళలకు సక్రమంగా అందేలా చూస్తున్నా. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతు కృషిని ఎల్లవేళలా అందిస్తా. ప్ర: కుటుంబంలో ప్రోత్సాహం ఎలా ఉంది..? జ: భర్త అనిల్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహం ఎంతో బాగుంది. దీనికి తోడు మా అత్తగారింట్లో ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేందుకు ఎంతగానో ప్రో త్సాహం అందిస్తున్నారు. -
10 మంది డీసీలకు ఐఏఎస్ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 10 మంది డిప్యూటీ కలెక్టర్ల(డీసీ)లకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న కొర్రా లక్ష్మి, కె.ధర్మారెడ్డి, చిట్టెం లక్ష్మి, టి.వినయ్ కృష్ణారెడ్డి, సీహెచ్ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, ఎం.హనుమంతరావు, డి.అమయ్‌కుమార్, కె.హైమవతి, ఎం.హరితకు ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్ ఐఏఎస్) కల్పిస్తూ సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రమోషన్ కోటాలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఖాళీల్లో వీరిని భర్తీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ఈ ప్రమో షన్ల జాబితాలను విడుదల చేసింది. 2014 బ్యాచ్ ఖాళీలకు అర్హులెవరూ లేరని, అందుకే ఆ జాబితాను తయారు చేయలేదని సెలెక్షన్ కమిటీ ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2015 సంవత్సరపు ఖాళీల్లో కొర్రా లక్ష్మి, కె.ధర్మారెడ్డి, 2016 ఖాళీల్లో మిగతా 8 మందిని ఎంపిక చేసింది. ఐఏఎస్ పదోన్నతులకు సంబం ధించి ఎ.వాణీప్రసాద్, వి.కరుణ, ఎం.ప్రశాంతి దాఖలు చేసిన కేసుల్లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (సీఏటీ) ఇచ్చిన తీర్పుపై కేంద్రం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ సిఫారసులు హైకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ గెజిట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
షట్లర్ శ్రీకాంత్ ఇక డిప్యూటీ కలెక్టర్!
సాక్షి, అమరావతి: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఖాయమైంది. అతనికి ఈ ఉద్యోగం ఇవ్వడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం, నియంత్రణ, వేతన చట్టం–1999ను సవరించారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బిల్లును శనివారం శాసనసభ ఆమోదించినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో దుబాయ్‌లో జరగనున్న సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు కూడా అతను అర్హత సాధించాడు. -
డిప్యూటీ కలెక్టర్.. పీవీ సింధు
♦ విధుల్లో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ♦ శిక్షణ కోసం కృష్ణా జిల్లాకు కేటాయింపు సాక్షి, అమరావతి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో ఆమె బుధవారం శుభఘడియల్లో విధుల్లో చేరారు. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేతా సెలవులో ఉండటంతో సీసీఎల్ఏ జాయింట్ కమిషనర్ జగన్నాథం, సీసీఎల్ఏ కార్యదర్శి రామారావులకు ఆమె జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెకు నియామక పత్రాన్ని అందజేసిన విషయం విదితమే. సీసీఎల్ఏకు వచ్చిన సందర్భంగా అక్కడి ఉద్యోగులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. డిప్యూటీ కలెక్టర్‌గా నియమించడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు. గోపీచంద్ అకాడమీలో మంచి శిక్షణ పొందుతున్నానని, రాబోయే ప్రపంచ చాంపియన్ షిప్లో విజయం సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. సింధు విజ్ఞప్తి మేరకు సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేత ఆమెను శిక్షణ నిమిత్తం కృష్ణా జిల్లాకు కేటాయించారు. కృష్ణా జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతంకు బుధవారం సాయంత్రం రిపోర్టు చేశారు. సింధు వెంట ఆమె తండ్రి రమణ ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ విధులు, బాధ్యతలపై ఆమె కృష్ణా జిల్లాలో శిక్షణ పొందనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సింధుకు వైద్య ధృవీకరణ పత్రాలు విధుల్లో చేరే ముందు పీవీ సింధుకు వైద్యవిద్యా సంచాలకులు వైద్య ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలంటే నిబంధనల ప్రకారం మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల సింధు బుధవారం తన తండ్రితో కలసి వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయానికి వచ్చారు. ఆమెకు వైద్య విద్య సంచాలకులు డా.ఎన్.సుబ్బారావు, అకడెమిక్ వైద్యవిద్యా సంచాలకులకు డా.కె.బాబ్జీ సాదర స్వాగతం పలికారు. సింధుకు సిద్ధార్థ వైద్య బృందం పరీక్షలు చేశారు. -
డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సింధు
-
ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన పీవీ సింధు
- డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ విజయవాడ: బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగినిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిటీలోని గొల్లపూడిలో గల ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన(సీసీఎల్ఏ) కమిషనర్ కార్యాలయానికి వచ్చిన సింధు.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ పునేఠాకు రిపోర్ట్ చేశారు. అయితే, ఆమెకు ఎలాంటి పనులు అప్పగిస్తారనేది ఇంకా తెలియాల్సిఉంది. కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశంఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభకనబర్చిన సింధు.. బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించారు. అందుకుగానూ ఆమెను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించింది. ఇటీవల సింధూను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. మంచిరోజు కావడంతో నేడు సింధు విధుల్లోకి చేరారు. -
డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధు
ఏపీ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుని డిప్యూటీ కలెక్టరుగా నియమి స్తూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా నిబంధనలు సడలించింది. దీంతో సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనింగ్ పోస్టింగ్ కోసం 30 రోజు ల్లోగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఆమె రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. నియామక పత్రం అందజేసిన సీఎం గ్రూప్–1 అధికారిణిగా పీవీ సింధుకు సీఎం చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పీవీ సింధు మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధు
నియామకానికి ఏపీపీఎస్సీ ఆమోదం సాక్షి, అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్‌లో దేశానికి రజతం సాధించి పెట్టిన తెలుగమ్మాయి పీవీ సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం ఆమోదం తెలిపింది. చైర్మన్ ఉదయభాస్కర్ అధ్యక్షతన గురువా రం జరిగిన ఏపీపీఎస్సీ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చిం చి ఆమోద ముద్ర వేశారు. వెంటనే ప్రభుత్వానికి సంబంధిత ఫైల్‌ను పంపించారు. ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో దీనిపై నియామక ఉత్తర్వులు ఇవ్వనుంది. -
ఎస్సీ శాఖలో రెవెన్యూ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు డిప్యూటీ కలె క్టర్లను ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులుగా నియమించడం వివాదానికి దారి తీసింది. వారి నియామకంపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శాఖాపరంగా పదోన్నతులిచ్చి ఈ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలు కూడా తీసుకోకుండా నియామకా లు చేపట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాత 10 జిల్లాల్లో ఉప సంచాలకులు(డీడీ) జిల్లా ఎస్సీ అధికారులు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి సహా యకులుగా జిల్లాకొకరు చొప్పున (హైదరా బాద్‌లో ఇద్దరు) 11 మంది జిల్లా సాంఘిక సంక్షేమాధికారులు(డీఎస్‌డబ్ల్యూవో) పనిచే స్తున్నారు. తాజాగా జిల్లాల సంఖ్య 31కి చేరడంతో పాత జిల్లాల్లోని డీడీలను అలాగే కొనసాగిస్తూ 11 మంది డీఎస్డబ్ల్యూవోలను కొత్త జిల్లాలకు ఎస్డీడీవో(ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి)గా నియమించింది. ఇలా 21 జిల్లాలకు అధికారులను సర్దుబాటు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ మిగతా పది జిల్లాలో ఏఎస్‌డబ్ల్యూవో (సహాయ సాంఘిక సంక్షే మాధికారి)ని ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. తాజాగా రెవెన్యూ శాఖకు చెందిన ఐదుగురు డిప్యూటీ కలెక్టర్లను నల్లగొండ, పెద్దపల్లి, వనపర్తి, సూర్యాపేట, జనగామ జిల్లాలకు ఎస్డీడీవోలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చిం ది. మరోవైపు బీసీ సంక్షేమ శాఖలోనూ మరో డిప్యూటీ కలెక్టర్‌ను జిల్లా సంక్షేమాధి కారిగా నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్లు, ఏఎస్డబ్ల్యూవోల పదో న్నతులకు సంబంధించిన ఫైలు వద్ద పెండిం గ్లో ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్లను నియమించడంపై తెలంగాణ ఏఎస్‌డబ్ల్యూ వో, సంక్షేమ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీసీ సంక్షే మశాఖ మంత్రి జోగు రామన్నలకు విజ్ఞాపన లిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే ఒక ట్రెండు రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలంగాణ సహాయ సాంఘిక సంక్షేమాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు. -
36 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఎంతో కాలంగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 36 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. రెవెన్యూశాఖతో పాటు పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, క్రీడలు, గిరిజన, వికలాంగుల, మైనార్టీ సంక్షేమం.. తదితర శాఖలలో ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ హోదా పోస్టుల్లో వారిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, బదిలీ అయిన ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్‌ల నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌మీనా ఆదేశించారు. -
సింధు ఇక డిప్యూటీ కలెక్టర్!
-
సింధు ఇక డిప్యూటీ కలెక్టర్!
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్లు జరిగితే... బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు భవిష్యత్‌లో ఐఏఎస్ అధికారిణి కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ చేసిన డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్–1) ఉద్యోగానికి సింధు అంగీకరించడంతో... యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఆమె మరో ఎనిమిది, తొమ్మిదేళ్లలో కన్ ఫర్డ్ ఐఏఎస్ అవుతుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధును ఏపీ సీఏం చంద్రబాబు విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. ఉన్నత ఉద్యోగాన్ని కూడా అప్పట్లోనే ఆమెకు ఆఫర్ చేశారు. ఇటీవలే అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా... ఏపీ ప్రభుత్వ ఆఫర్‌కు తన సమ్మతిని తెలియజేస్తూ సింధు ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని ఆమె తల్లి విజయ వెల్లడించారు. ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ (స్పోర్ట్స్)గా వ్యవహరిస్తోంది. రియో నుంచి వచ్చిన ఆమెకు ఏపీ సర్కారు కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. రూ. 5 కోట్ల నజరానాతో పాటు హైదరాబాద్‌లో 1000 గజాల నివాస స్థలాన్ని ఇచ్చింది. తెలంగాణ సీఏం కేసీఆర్ ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చే గ్రూప్–1 పోస్ట్‌కు అంగీకారం తెలిపింది. -
రెవెన్యూ శాఖలో భారీగా పదోన్నతులు
80 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఒకేసారి 80 మంది రెవెన్యూ అధికారులు పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన రెవెన్యూ శాఖ.. సిద్ధమైన జాబితాను గురువారం సీసీఎల్ఏ రిమార్క్ కోసం పంపింది. అక్కడి నుంచి సమాచారం రాగానే పదోన్నతుల ఉత్తర్వు జారీ కానుంది. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కసారిగా జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టులు ఖాళీ అయ్యాయి. పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. జాయింట్ కలెక్టర్లుగా నాన్ కేడర్ రెవెన్యూ అధికారులను సర్దుబాటు చేయటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో డీఆర్ఓ సహా సర్వే సెటిల్మెంట్స్, భూసేకరణ తదితర విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. పాత జిల్లాల్లో మూడు చోట్ల మినహా మిగతా జిల్లాల డీఆర్వోలంతా జాయింట్ కలెక్టర్లు అయ్యారు. వీరు సరిపోక వివిధ పోస్టులు, డిప్యుటేషన్లలో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకూ జేసీలుగా పదోన్నతి కల్పించి నియమించారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఈ ఖాళీలను భర్తీ చేయకపోతే పాలన పడకేసే ప్రమాదం ఉండటంతో వెంటనే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కసరత్తు ప్రారంభించారు. -
చిక్కుల్లో చెంపపగులగొట్టిన ఎమ్మెల్యే
ముంబయి: డిప్యూటీ కలెక్టర్‌పై చేయిచేసుకున్న ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న ఓ అధికారిని బెదిరించడం, హింసకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం, అధికారిపై చేయిచేసుకోవడంవంటి ఆరోపణలు ఆయనపై నమోదు అయ్యాయి. ఓ ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశానికి ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ కూడా వెళ్లారు. తమకు భూమే కావాలని అక్కడ రైతులు ఆందోళన చేసిన క్రమంలో సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యే సురేశ్ డిప్యూటీ కలెక్టర్ మరో అధికారిని చొక్కాలు పట్టుకొని లాగి చేయిచేసుకున్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తాయి. పైగా ఘటన జరిగి 24గంటలైనా కనీసం కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చిన వెంటనే ఆయనపై కేసులు పెట్టారు. -
ఆ డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులేవీ?
♦ నెల రోజులుగా ఖాళీగా ఉన్న 33 మంది అధికారులు ♦ ప్రమోషన్లు ఇచ్చి ఖాళీగా ఉంచిన సర్కారు సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా కూర్చోబెట్టింది. ఓవైపు అధికారుల కొరతతో సతమతం అవుతున్నా, జిల్లాల్లో పాలన కుంటుపడుతున్నా.. 33 మందికి పోస్టింగులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా రెగ్యులర్ డిప్యూటీ కలెక్టర్లలో 8 మంది, గత నెల 12న తహసీల్దారు నుంచి పదోన్నతి పొందిన 25 మంది డిప్యూటీ కలెక్టర్లు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. హైకోర్టుకు భయపడి పదోన్నతులు! హైకోర్టు అక్షింతలు వేస్తుందేమోనన్న ఆందోళనతోనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా 25 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందినవారందరూ వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు రిపోర్ట్ చేశారు. ఇవి రాష్ట్రస్థాయి పోస్టులు కావడంతో.. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన వెంటనే తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. కొంతమందైతే వ్యక్తిగత కారణాలను తెలుపుతూ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే నియమించాలని వినతిపత్రాలు సమర్పించారు. కానీ నెలరోజులు దాటినా పోస్టింగుల ఊసెత్తకపోవడంతో నిరాశ చెందుతున్నారు. -
డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్
తుర్కయాంజల్(రంగారెడ్డి జిల్లా): స్వాతంత్య్ర సమరయోధుడికిచ్చిన భూమిపై తప్పుడు నివేదిక ఇచ్చినందుకు గాను దేవాదుల డిప్యూటీ కలెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 2005-06 సంవత్సరాల్లో హయత్‌నగర్ మండల డిప్యూటీ తహశీల్దార్‌గా సముద్రాల రామచంద్రయ్య పనిచేశారు. మండలంలోని తుర్కయాంజల్ గ్రామం సర్వేనంబర్-52లోని పదెకరాల భూమిని బండారు లింగయ్య అనే స్వాతంత్య్ర సమరయోధునికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఆ భూమిని లింగయ్య స్వాధీనం చేసుకోలేదు. ఆ మేరకు పొజిషన్లో లేనట్లు రికార్డులున్నాయి. అయితే, ఆయన పొజిషన్లో ఉన్నట్లు 2005లో రామచంద్రయ్య ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు తేలటంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకురామచంద్రయ్యఅరెస్టు చేశారు. -
నేడు సీఆర్డీఏ రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ
తుళ్లూరు : ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకోబోయిన ముసునూరు మండల తహశీల్దార్ దోనపల్లి వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో జరిగిన దాడికి నిరసనగా తుళ్లూరు సీఆర్డీఏ రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం విధులు బహిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, సీఆర్డీఏ తహశీల్దారు జి.కేశవనాయుడు ఆధ్వర్యంలో గురువారం రాత్రి సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. ప్రభుత్వ స్పందన చూసి తదుపరి కార్యాచరణకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ త్రిమూర్తులు, తుళ్లూరు డెప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నకిలీ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు
జలదంకి: డిప్యూటీ కలెక్టర్‌నంటూ మోసానికి పాల్పడిన వ్యక్తి, అతనికి సహకరించిన ఇద్దరి గుట్టును పోలీసులు రట్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఎస్సై క్రిష్ణబాబు కథనం మేరకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న మెగలాల ప్రసాద్, ఉదయగిరి ట్రెజరీలో పని చేస్తున్న కిషోర్‌కుమార్, ప్రభాకర్ అనే మరో వ్యక్తి జూన్ 14న తిమ్మసముద్రం ఆరోగ్య కేంద్రానికి ఎంతో మేలు చేస్తున్న వానపాములను కొంతమం ది అక్రమార్కులు తీర ప్రాంత గ్రామాల్లోని కూలీ లను ప్రోత్సహించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వానపాములు తీసేందుకు తవ్వకాలు చేస్తుండటంతో సరస్సు ఉనికిని కోల్పోయే ప్రమా దం వుంది. సున్నపుగుల్ల కోసం తవ్వకాలు చేస్తున్న వారే గత మూడేళ్లుగా వానపాముల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. ముఖ్యంగా తడ మండ లం వేనాడు, ఇరకం దీవులకు చుట్టూరా వానపాముల తవ్వకాలు ఒక పరిశ్రమలాగా తయారైంది. వేనాడు, ఇరకం దీవులే కేంద్రాలు వేనాడు, ఇరకం దీవుల కూలీలు ఎక్కువగా వానపాములను పట్టే పనికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. తవ్వి తీసిన వానపాములను మట్టికుండలు, ప్లాస్టిక్ బక్కెట్లు ద్వారా, పాలిథిన్ కవర్లలో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఒక భార్యాభర్త నాలుగైదు గంటలు పనిచేసి వానపాములు పడితే సుమారు రూ. 1,500 వస్తుండడంతో ఈ రెండు దీవుల్లోని గిరిజన కూలీలు ఇబ్బడిముబ్బడిగా వానపాముల తవ్వకాలకు వెళ్తున్నారు. పులికాట్ సరస్సులో దొరికే వానపాములకు రొయ్యల హేచరీల్లో మంచి డిమాండ్ వుండడంతో చాలామంది ఈ అక్రమ వ్యాపారాన్ని చేస్తున్నారు. కిలో వానపాములు పడితే కూలీకి రూ.500 నుంచి రూ.750 ఇస్తున్నారు. వీటిని హేచరీలకు తరలించి విక్రయిస్తే సైజును బట్టి కిలోకు సుమారుగా రూ. 3 వేలు నుంచి రూ. 6 వేలు వస్తోంది. వానపాములను జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలో ఉన్న హేచరీలకు తరలించి విక్రయిస్తున్నారు. సూళ్లూరుపేట, తడ, తమిళనాడులోని పలు ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లు కూలీలను ప్రోత్సహించి ఈ పని చేయి స్తూ లక్షలు గడిస్తున్నారు. గతంలో ఆటోల్లో, బైక్‌లపై తరలించే స్థాయి నుంచి ఇప్పుడు ఖరీదైన కార్లులో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఇటీవల తడ, కావలి వద్ద కారుల్లో తరలిస్తున్న వానపాములను పట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తే అక్రమ రవాణా ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వానపాములు ఇబ్బడిముబ్బడిగా తీసేయడం వల్ల సరస్సులో గుల్ల తేలిపోవడమే కాకుండా మత్స్య సంపద కూడా భారీగా తగ్గిపోయే ప్రమాదం వుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పులికాట్ సరస్సులో రొయ్యలు, చేపలు, పీతల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఎలా తీస్తారంటే...: సరస్సులో నీళ్లు లేకుండా అడుసుగా వున్న ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. ఒక మీటరు నుంచి రెండు మీటర్లు వ్యాసార్థాన్ని చూసుకొని చుట్టురా కాళ్లతో బాగా లోతుగా తొక్కుతూ వస్తారు. ఈ రెండు మీటర్లు వ్యాసార్థంలో మట్టి అంతా ఒక దగ్గరకు చేరుతుంది. వెంటనే పోగుగా పడిన మట్టిని తీసి పక్కకు నెట్టగానే దానికింద ఐదు నుంచి ఏడు కిలోలు వానపాములు దాకా దొరుకుతాయి. దాడులు శూన్యం : ఇంత జరుగుతున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులు దాడులు చేస్తున్న దాఖలాలు లేవు. అందిన కాడికి దండుకుని కార్యాలయానికి పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో వానపాముల తవ్వకాలు ఇబ్బడిముబ్బడిగా జరుగుతూనే ఉన్నాయి. కొందరు యథేచ్ఛగా వానపాములను తవ్వేస్తుండటాన్ని పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారే గాని వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం లేదు. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన అవసరముంది. -
డివైడర్ని ఢీకొట్టిన జాయింట్ కలెక్టర్ కారు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మామిడ మండలం ముండిగుట్ట సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు..హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశాన్ని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఆదిలాబాద్ జిల్లా జేసీ సుందర్ అబ్నారీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో ఆయనకు తీవ్రగాయలు కాగా, డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
16 మంది డిప్యూటీ కలెక్టర్ల నిరీక్షణకు తెర!
సాక్షి, హైదరాబాద్: 16 మంది డిప్యూటీ కలెక్టర్ల నిరీక్షణకు తెర పడనుంది. ఆరు నెలల ఎదురుచూపులు ఫలించనున్నాయి. వెయిటింగ్ జాబితా లో ఉన్న 16 మందికి పోస్టింగులు దక్కనున్నా యి. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఫైళ్లను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం కోసం పంపారు. సోమవారం పోస్టింగ్ ఉత్తర్వు లు వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం‘సాక్షి’కి తెలిపారు. ఎందుకింత జాప్యం.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే (జూన్ 3న) డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 26 మందిని బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పైరవీలు చేసి కీలకపోస్టులు దక్కించుకున్నారని కొందరిని, తెలంగాణ ప్రాంతం వారు కాదని మరికొందరిని ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆరోపణలొచ్చాయి. అధికారుల కొరత ఏర్పడడంతో.. వెయింటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లలో తొమ్మిదిమంది ఆంధ్రా, మిగిలిన ఏడుగురు తెలంగాణకు చెందినవారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారులతోపాటు తెలంగాణకు చెందిన డిప్యూ టీ కలెక్టర ్లను కూడా వెయిటింగ్లో ఉంచడంపట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలు, పథకాలను అమ లు చేసేం దుకు తగినంత మంది అధికారులు లేకపోవడం, అరకొరగా ఉన్న అధికారులపైనే పనిభారం పడ డం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్లకు వెంటనే పో స్టుంగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నేటి నుంచి నష్టం అంచనా
ఎన్యూమరేషన్‌కు 176 బృందాలు జోనల్ ఆఫీసర్లుగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, డిప్యూటీ కలెక్టర్లు ఒక్కొక్కరికి ఆరు వార్డులు/ మండలం బాధ్యత వీరిపై పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు విశాఖ రూరల్: హుదూద్ తుపాను నష్టం అంచనా గురువారం నుంచి చేపడుతున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం భావి స్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 176 బృందాలను ఏర్పాటు చేసింది. నష్టం అంచనా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఇతర జిల్లాల అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులుండే వీటిల్లో స్థానిక తహశీల్దార్, వీఆర్వో కూడా ఉంటారు. పం టలు, గృహాలు, మరణాలతో పాటు ఇతర నష్టాలను గురువారం నుంచి ఈ బృందాలు వారికి కేటాయించిన మండలాలు, వార్డుల్లో సర్వే చేయనున్నాయి. జోనల్ అధికారులుగా ఐఏఎస్‌లు ఈ 176 బృందాల పనితీరును పరిశీలించేందుకు జోన ల్ అధికారులుగా 35 మంది ఐఏఎస్‌లను నియమిం చారు. వీరితో పాటు ఐఎఫ్ఎస్, డిప్యూటీ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆ బాధ్యతలను అప్పగించా రు. ఒక్కో జోనల్ అధికారికి జీవీఎంసీ పరిధిలో అయితే ఆరు వార్డులు, గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక మం డలాన్ని కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 24 వార్డులను లేదా రూరల్‌లో ఏడు మండలాలను కలిపి ఒక జోన్‌గా విభజించారు. ఒక్కో జోన్లో నష్టం అంచనాల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ను నియమించారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం, శ్యాంబా బు, అనిల్చంద్రపునీఠా, మన్మోహన్సింగ్, చొత్రాయ్, ఉషారాణి, కృష్ణయ్య(రిటైర్డ్)లు ఎన్యూమరేషన్‌ను పర్యవేక్షించనున్నారు. వారం రోజుల్లో పూర్తి నష్టం అంచనాలను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాప్యం జరిగే కొద్దీ బాధితులు మరింత నష్టపోతారని భావిస్తున్నారు.గత ఏడాది తుఫాన్ నష్టాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. అంచనాల రూపల్పనకు జాప్యంవల్లే ఇలా జరిగిందని అధికారుల మాట. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర బృందం వచ్చేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఆ అంచనాలను కేంద్రం ముందుంచి భారీగా పరిహారాన్ని రాబట్టాలని యోచిస్తున్నారు. -
భూదాన్ భూముల చిట్టా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ యజ్ఞబోర్డు మాజీ పాలకవర్గం పాపాల పుట్టను తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చేతులు మారిన భూదాన్ భూముల చిట్టాను విప్పేందుకు ప్రత్యేక అధికారులను రంగంలోకి దించింది. భూదాన్‌బోర్డు ముసుగులో చేసిన అక్రమాలను వెలికితీసేందుకు జిల్లాకు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ఓ.జే మధు, లింగయ్యనాయక్, జి.రమేశ్, కె.సీతారామారావు, ఎం.శేఖర్‌రెడ్డి, కె.ప్రదీప్‌కుమార్‌లను నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 11,744 ఎకరాల మేర భూదాన్ భూములు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్క తేల్చింది. ఇందులో 7,363 ఎకరాలు భూమిలేని పేదలకు పంపిణీ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంట్లో మూడు వేల ఎకరాలు లబ్ధిదారుల ఆధీనంలో ఉన్నట్లు తేల్చగా, సుమారు 1,600 ఎకరాల మేర ఎన్ ఎస్జీ, ఆక్టోపస్, ఎన్ఐఏ, ఎన్పీఏ సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. ఇవి పోగా, మిగతా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే అంశంపై స్పష్టత రావడంలేదు. వినోభాబావే పిలుపుమేరకు భూదానోద్యమంలో చాలామంది దాతలు విరివిగా భూ వితరణ చేశారు. ఈ భూములను కాపాడాల్సిన యజ్ఞబోర్డు కంచె చేను మేసిన చందంగా కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే భూదాన్ బోర్డు పాలకవర్గం నిర్వాకంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బోర్డు ప్రతినిధులు చేసిన అక్రమాలను లోతుగా విచారించి సమగ్ర నివేదికను సర్కారుకు అందజేసే బాధ్యతను డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించారు. ఫర్ సేల్..! పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్ధేశంతో దాతలు దానం చేసిన భూములు వక్రమార్గంలో పరాధీనమయ్యాయి. శివార్లలో విలువైన భూములు రియల్టర్ల గుప్పిట్లోకి వెళ్లాయి. భూములను పరిరక్షించాల్సిన బోర్డు ప్రతినిధులు.. రియల్టర్లుగా అవతారమెత్తారు. దీంతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, హయత్‌నగర్, కీసర తదితర మండలాల్లోని భూదాన్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో భూదాన్ యజ్ఞబోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కేసీఆర్ సర్కా రు.. పాలకవర్గాన్ని రద్దు చేసింది. రికార్డులను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భూదాన్ భూముల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం 3,060, యాచారం 1,300, మొయినాబాద్ 470, మహేశ్వరం 506, కందుకూరు 530, శంషాబాద్ 564, కీసర 51 ఎకరాల మేర భూదాన్ భూములున్నట్లు లెక్క తేలింది. అయితే, రికార్డులకు అనుగుణంగా భూముల లెక్కలు తేలకపోవడంతో యంత్రాంగం జుట్టుపీక్కుంటోంది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణంకంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం, కొన్నిచోట్ల భూమిని దానం చేసినట్లు ప్రకటించినప్పటికీ, దాతల కుటుంబాల పోజిషన్‌లోనే భూములు ఉన్నట్లు స్పష్టమైంది. మరికొన్ని చోట్ల ఒరిజినల్ పట్టాదారుల స్థానే ఇతరులు సాగు చేసుకుంటున్నట్లు యంత్రాంగం పసిగట్టింది. -
ఆంధ్ర అధికారుల బదిలీలు షురూ
భద్రాచలం : జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బదిలీల పర్వం వేగవంతమైంది. కీలక పోస్టుల్లో తెలంగాణకు చెందిన అధికారులే పనిచేసేలా చర్యలు చేపట్టిన రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదా గల ఏడుగురు అధికారులను బదిలీ చేసింది. మంగళవారం ఈ మేరకు జీవో నంబర్ 6 పేరుతో ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేసింది. దీనిలో భాగంగా భద్రాచలం, పాల్వంచ ఆర్డీవోలు కాసా వెంకటేశ్వర్లు, ఎన్.సత్యనారాయణలను బదిలీ చేస్తూ... ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యే క ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆర్.అంజయ్యను భద్రాచలం ఆర్డీవోగా బదిలీ చేశారు. అందరి మన్ననలు పొందిన వెంకటేశ్వర్లు భద్రాచలం ఆర్డీవోగా కాసా వెంకటేశ్వర్లు 2013 డిసెంబర్ 4న బదిలీపై వచ్చారు. గతంలో భద్రాచలం తహశీల్దార్‌గా పనిచేసిన అనుభవం దృష్ట్యా శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ ఏడాది జరిగిన ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు పాత్రను ప్రముఖంగా చెప్పవచ్చు. అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి, ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ చిన్నపాటి లోపాలు కూడా లేకుండా విజయవంతం చేయించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. -
కొత్త ఆర్డీవోలు వీరే..
- హైదరాబాద్‌కు నిఖిల.. సికింద్రాబాద్ కు శర్మ - కొత్త ఆర్డీవోల నియామకం త పలువురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు సాక్షి, సిటీబ్యూరో : కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండ్రోజుల్లోనే కీలకమైన రెవెన్యూ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు పాత డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం తప్పలేదు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌లు దక్కని డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్ నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగరంలో జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఇలా ఉన్నాయి. -
డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
నర్సీపట్నం ఆర్డీవోగా సత్యశారదా దేవి యూఎల్సీ ఎస్ఓగా ఎల్.రమేష్‌గుప్తా విశాఖ రూరల్, న్యూ స్లైన్: జిల్లాలో భారీ గా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఎన్నికల సంఘం ని బంధనల మేరకు కొం త మందికి స్థాన చల నంకలగగా, గత కొద్ది కాలంగా ఖాళీగా ఉన్న స్థానాలను ప్రభుత్వం భర్తీ చేసింది. నర్సీపట్నం ఆర్డీవోగా హైదరాబాద్‌లో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫీస్‌లో భూ భారతి డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎం.సత్య శారదా దేవిని నియమించింది. అలాగే అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్సీ) స్పెషల్ ఆఫీసర్‌గా రంగారెడ్డి జిల్లాలో పీఆర్ అండ్ ఆర్డీ జిల్లా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఎల్.రమేష్గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంత కాలంలో ఖాళీగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ భూసేకరణ ఎస్డీసీగా కాకినాడలో కెఎస్ఈజెడ్ ఎస్డీసీగా ఉన్న ఎస్.మల్లిబాబు రానున్నారు. జిల్లాలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీస్(ఎఫ్ఎస్వో) డిప్యూటీ కలెక్టర్ సీతామహాలక్ష్మికి కర్నూల్ జిల్లాలో రైల్వేస్ బీజీ కన్వర్షన్ భూసేకరణ ఎస్డీసీగా బదిలీ అయింది. ఇక్కడ ఎఫ్ఎస్వోగా తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం స్పెషల్ కలెక్టర్ పీఏగా ఉన్న ఎం.జ్యోతిని నియమించారు. జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ(కేఆర్సీ) ఎస్డీసీ విజయసారధిని జ్యోతి స్థానంలో నియమించారు. కేఆర్సీ ఎస్డీసీగా ఏలూరులో డుమా ఏపీడీగా ఉన్న సి.హెచ్.వెంకటేశ్వరరావు రానున్నారు. హెచ్పీసీఎల్లో వీవీఎస్పీఎల్ కాంపిటెంట్ అథారిటీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎస్.జె.మాధవి హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి శాఖ విజిలెన్స్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో పెద్దాపురంలో పీఎల్‌ఐఎస్ యూనిట్-2 ఎస్డీసీ కె.పద్మ వస్తున్నారు. ఏపీఐఐసీ భూసేకరణ ఎస్డీసీగా ఉన్న పి.వి.ఎల్.నారాయణ తూర్పుగోదావరి జిల్లా ఏపీడీ(ల్యాండ్)గా స్థానచలనమైంది. కాకినాడ ఆర్డీవో జి.జవ హర్లాల్ నెహ్రూ జిల్లా సివిల్ డిఫెన్స్ కంటోన్మెంట్ డిప్యూటీ కంట్రోలర్‌గా నియమితులయ్యారు. డీఆర్డీఏ ఏపీడీ(ల్యాండ్) జి.సుజాత శ్రీకాకుళం డీఆర్డీఏ ఏపీడీ(ల్యాండ్)గా బదిలీ జరగగా అక్కడ ఉన్న కె.ధర్మారావు ఈమె స్థానంలోకి రానున్నారు. రాజమండ్రిలో గెయిల్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎన్.సుగుణకుమారిని యలమంచిలిలో ఐఎస్పీఎల్ యూనిట్-2 ఎస్డీసీగా నియమించారు. -
పోరాట ప్రభంజనం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తుండగా తాజాగా ఉన్నతాధికారులు సైతం ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా మిగిలిన అన్ని శాఖల ఉన్నతాధికారులు సైతం ఉద్యమ బాట పట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఉన్నతాధికారులు కూడా ఉద్యమిస్తుండడంతో అత్యవసర పనులు కూడా నిలిచిపోనున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు సైతం సమైక్యాంధ్ర కోసం కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా ఉన్నతాధికారులంతా ఏపీఎన్జీఓలు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ డి.వెంకటరెడ్డి, డీఆర్డీఏ పీడీ మహేశ్వరరెడ్డి, డీఎస్ఓ జ్వాలాప్రకాష్, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ షరీఫ్, డీపీఆర్ఓ బాబ్జీ, ఇతర ఉన్నతాధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరో వైపు మంగళవారం నుంచి నగర పరిధిలోని ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రహదారుల దిగ్బంధం : మంగళవారం రహదారుల దిగ్బంధం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉదయం 7 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వందల మంది ఉద్యోగులు చేరుకొని కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న తరువాత హైవేను దిగ్బంధించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జాతీయ రహదారిలో ఎటువంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపచేయాలని భావిస్తున్నాయి. 21 బహిరంగ సభ : ఈ నెల 21 ఉదయం 11 గంటలకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భారీ సభను నిర్వహించడానికి ఏపీఎన్జీఓలు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులతో జరిగే ఈ సభకు ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నంలో కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.