
సాక్షి, అమరావతి: అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న సురేఖకు క్రీడాకారుల కోటాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె నియామకం కోసం ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో ఏపీ యాక్ట్–1994ను సవరించింది. ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment