Jyothi Surekha
-
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది.సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో ర్యాంక్ లో నిలిచింది. గత ర్యాంకింగ్స్‌లో సురేఖ మూడో ర్యాంక్‌లో ఉంది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి 103 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.ఇవి చదవండి: Archery: 'టాప్స్'లోకి దీపికా కుమారి -
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌లో రెండో ర్యాంక్‌లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
డిప్యూటీ కలెక్టర్‌గా జ్యోతి సురేఖ నియామకం
సాక్షి, అమరావతి: అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న సురేఖకు క్రీడాకారుల కోటాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె నియామకం కోసం ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో ఏపీ యాక్ట్–1994ను సవరించింది. ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు ఆర్చర్ సురేఖ...
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్లోనే ఉత్తమ ర్యాంక్‌ను అందుకుంది. ప్రపంచ ఆర్చరీ తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా కాంపౌండ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్న భారతీయ ఆర్చర్‌గా ఆమె గుర్తింపు పొందింది. విజయవాడకు చెందిన 25 ఏళ్ల సురేఖ ఇటీవల ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. -
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మిక్స్డ్ ఫైనల్లో సురేఖ జంట..
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంపౌడ్ మిక్స్డ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ-రిషభ్ యాదవ్ (భారత్) జంట 156-154తో రొక్సానా-ఖిరిస్టిచ్ (కజకిస్తాన్) జోడీపై గెలిచింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రియాలతో కూడిన భారత జట్టు 220-227తో ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Indonesia Masters Open: సింధు శుభారంభం.. -
‘ఖేల్‌రత్న’ బరిలో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ రేసులోకి తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, భారత మహిళా టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురేఖ పేరును... హాకీ ఇండియా (హెచ్ఐ) రాణి పేరును... టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) మనిక బత్రాను నామినేట్ చేశాయి. క్రీడా అవార్డుల నామినేషన్లకు గడువు నేటితో ముగియనుంది. విజయవాడకు చెందిన 23 ఏళ్ల సురేఖకు 2017లో ‘అర్జున’ అవార్డు లభించింది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో సురేఖ ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్, వరల్డ్‌కప్‌లలో కలిపి 33 పతకాలను సాధించింది. హాకీ నుంచి ‘అర్జున’ కోసం వందన కటారియా, మోనిక, హర్మన్‌ప్రీత్ సింగ్‌లను హెచ్ఐ సిఫారసు చేసింది. ‘ఖేల్‌రత్న’ పురస్కారానికి గడిచిన నాలుగేళ్ల ప్రదర్శనను పరిగణిస్తారు. జనవరి 1, 2016 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు ఆటగాళ్ల ప్రతిభను అవార్డుల కమిటీ పరిశీలిస్తుంది. రాణి రాంపాల్ 2017లో మహిళల ఆసియా కప్ విజయంలో, 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచేందుకు కీలకపాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌కు జట్టు అర్హత పొందడంలో రాణి పాత్ర ఎంతో ఉంది. ఆమె ఇదివరకే 2016లో అర్జున, ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాల్ని అందుకుంది. టేబుల్ టెన్నిస్‌లో మనిక బత్రా కూడా నిలకడగా రాణిస్తోంది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె 2 స్వర్ణాలు సహా 4 పతకాలు గెలిచింది. మధురిక, మానవ్ ఠక్కర్, సుతీర్థ ముఖర్జీలను ‘అర్జున’కు టీటీఎఫ్ఐ సిఫారసు చేసింది. ‘అర్జున’కు సాత్విక్... మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున’కు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్‌తో కలిసి గతేడాది థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలిచాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం సాధించారు. ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం హైదరాబాద్‌కు చెందిన ‘సాయ్’ కోచ్ భాస్కర్ బాబుతోపాటు ఎస్.మురళీధరన్ (కేరళ) పేర్లను సిఫారసు చేశారు. -
సురేఖ రెండు జాతీయ రికార్డులు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్‌ను ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నమెంట్‌తో మొదలుపెట్టనుంది. మే 11 నుంచి 17 వరకు టర్కీలోని అంటాల్యాలో జరిగే రెండో ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ కాంపౌండ్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగనుంది. గ్వాటెమాలా సిటీలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరిగే తొలి వరల్డ్ కప్‌లో మాత్రం భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపించనుంది. ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం హరియాణాలో సోమవారం ముగిసిన సెలక్షన్ ట్రయల్స్‌లో సురేఖ రెండు కొత్త జాతీయ రికార్డులు నమోదు చేయడంతోపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తొలుత నిర్వహించిన ట్రయల్స్‌లో మొత్తం 720 పాయింట్లకుగాను సురేఖ 709 పాయింట్లు స్కోరు చేసి గతంలో 707 పాయింట్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. డబుల్ ఫిఫ్టీ రౌండ్ విభాగంలో 1440 పాయింట్ల కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో సురేఖ 1411 పాయింట్లు సాధించి ఈ విభాగంలోనూ గతంలో 1405 పాయింట్లతో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసింది. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (ఢిల్లీ) ద్వయం ఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట 159–154తో సో చేవన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–అభిషేక్ క్వార్టర్ ఫైనల్లో 158–155తో ఆదెల్ జెన్‌బినోవా–అక్బర్ అలీ కరబయేవ్ (కజకిస్తాన్)లపై నెగ్గారు. బుధవారం జరిగే స్వర్ణ పతక పోరులో చెన్ యి సువాన్–చెన్ చెయి లున్ (చైనీస్ తైపీ)లతో సురేఖ–అభిషేక్ తలపడతారు. దీపిక–అతాను దాస్ జంటకు కాంస్యం రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భార్యభర్తలైన దీపిక కుమారి–అతాను దాస్ జంట కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో దీపిక–అతాను దాస్ ద్వయం 6–2తో యిచాయ్ జెంగ్–వె షావోజువాన్ (చైనా) జోడీపై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో దీపిక–అతాను దాస్ 3–5తో లె చియెన్ యింగ్–సు యు యాంగ్ (చైనీస్ తైపీ)ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం కొనసాగుతుండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. -
జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నెదర్లాండ్‌లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆర్చరీ పోటీల్లో జ్యోతీ సురేఖ కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ఏపీ సీఎం అన్నారు. మునుముందు మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకరావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
జ్యోతి సురేఖకు సన్మానం
సాక్షి, అమరావతి: నెదర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఘనంగా సన్మానించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో పతకాలు సాధించిన జ్యోతిసురేఖ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, జ్యోతిసురేఖ క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లాకు చెందిన సురేఖ ఆర్చరీలో పతకం సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారన్నారు. సురేఖను క్రీడల పట్ల ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా అభినందించడం సముచితమన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత వెన్నం జ్యోతిసురేఖ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో 32 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించానని చెప్పారు. భవిష్యత్‌లో జరగబోయే మరిన్ని అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్నొన్నారు. -
అర్చరీ క్రీడకారిణి జ్యోతి సురేఖకు గన్నవరంలో ఘనస్వాగతం
-
‘పసిడి’పై భారత ఆర్చరీ జట్ల గురి
ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225–222తో చైనీస్ తైపీపై గెలిచింది. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 230–227తో చైనీస్ తైపీ బృందంపై నెగ్గింది. మంగళవారం పసిడి పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్లతో భారత పురుషుల, మహిళల జట్లు తలపడతాయి. -
సురేఖ జోడీ ఓటమి
ఆర్చరీ రికర్వ్, కాంపౌండ్ మిక్స్డ్ విభాగాల్లో భారత పోరు ముగిసింది. మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో ఈ ఏడాది వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో కాంస్య పతకాలు సాధించి జోరు మీదున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట ఆసియా క్రీడల్లో మాత్రం విఫలమైంది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జంట 153–155తో గొర్బానీ–మహబూబీ (ఇరాన్) ద్వయం చేతిలో ఓడింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి–అతాను దాస్ జంట క్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో 4–5తో బిషిండి–బాతర్ఖుయా (మంగోలియా) జోడీ చేతిలో ఓడింది. -
భారత ఆర్చరీ కాంపౌండ్ టీమ్ కొత్త చరిత్ర
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖతో కూడిన భారత కాంపౌండ్ టీమ్ కొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, లిలీ చాను, ముస్కాన్ కిరార్, దివ్య, మధుమితాలతో కూడిన కాంపౌండ్ జట్టు తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల బెర్లిన్‌లో ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్ కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టు రజతం గెలుచుకుంది. దీంతో 342.6 పాయింట్లతో అగ్రస్థానానికి చేరి నయా చరిత్ర లిఖించింది. చైనీస్ తైపీ టీమ్ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఘనతలో తెలుగు తేజం జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో పాల్గొన్న ఆమె నాలుగింటిలోనూ పతకాలు నెగ్గింది. -
ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీకి సురేఖ–అభిషేక్ జంట
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో కలిసి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో బరిలోకి దిగనుంది. సీజన్లో జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో (షాంఘై, అంటాల్యా, సాల్ట్‌లేక్ సిటీ, బెర్లిన్) సురేఖ–అభిషేక్ జంట నిలకడగా రాణించి నాలుగు కాంస్య పతకాలు గెలిచింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబరు 29, 30 తేదీల్లో టర్కీలోని సామ్సన్ నగరంలో జరుగుతుంది. -
సురేఖ గురి అదిరింది
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో రెండు అంతర్జాతీయ పతకాలను జమ చేసుకుంది. బెర్లిన్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్లో సురేఖ కచ్చితమైన గురితో ఓ రజతం, ఒక కాంస్యం సాధించింది. కాంపౌండ్ టీమ్ విభాగంలో త్రిషా దేబ్, ముస్కాన్ కిరార్‌లతో కలిసి సురేఖ రజత పతకం సొంతం చేసుకోగా... మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ జతగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది జరిగిన నాలుగు ప్రపంచకప్ లలో సురేఖ రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించడం విశేషం. బెర్లిన్ (జర్మనీ): వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కొల్లగొట్టింది. శనివారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్‌లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 228–229తో సోఫీ డోడ్‌మోంట్, అమెలీ సాన్సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది. నాలుగు రౌండ్లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్లో భారత్ 59–57తో పైచేయి సాధించగా... రెండో రౌండ్లో 57–59తో, మూడో రౌండ్లో 53–58తో వెనుకబడిపోయింది. చివరిదైన నాలుగో రౌండ్లో భారత్ 59–55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్‌గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్ దూరంలో ఉండిపోయింది. మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో సురేఖ–అభిషేక్ వర్మ జంట 156–153తో యాసిమ్ బోస్టాన్–డెమిర్ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీపై విజయం సాధించింది. నాలుగు రౌండ్లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్లో ఒక్కో జోడీ నాలుగేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్లో 39–40తో వెనుకబడ్డ సురేఖ–అభిషేక్ జంట... రెండో రౌండ్లో 40–36తో... మూడో రౌండ్లో 40–39తో పైచేయి సాధించింది. 119–115తో నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నాలుగో రౌండ్లో భారత జంట 37–38తో వెనుకబడ్డా ఓవరాల్‌గా మూడు పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇటీవలే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ పదో స్థానానికి చేరుకున్న సురేఖ ఈ సీజన్లో... షాంఘై ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం... అంటాల్యా ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం... సాల్ట్‌లేక్ సీటీ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం సాధించింది. -
ప్రపంచకప్ ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం
బెర్లిన్‌లో జరుగుతోన్న ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లో తెలుగుతేజం వెన్నం జ్యోతిసురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల బృందం ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ, త్రిషాదేబ్, ముస్కాన్ కిరార్‌లతో కూడిన భారత కాంపౌండ్ జట్టు 231–228 స్కోరుతో టాప్ సీడ్ టర్కీ జట్టుపై విజయం సాధించింది. శనివారం జరిగే ‘పసిడి’ పోరులో ఫ్రాన్స్ జట్టుతో భారత్ తలపడనుంది. -
ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో ఆర్చర్ జ్యోతి సురేఖకు చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆగస్టు 19 నుంచి ఇండోనేసియాలోని జకర్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో బరిలో దిగనుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనడం ఆమెకు ఇది రెండోసారి. ఆసియా క్రీడలకు ముందు సురేఖ జూన్ 19 నుంచి అమెరికాలో జరిగే ప్రపంచకప్ స్టేజ్–3, జూలై 16 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్–4 పోటీల్లో పాల్గొననుంది. -
కాంస్య పతక పోరులో సురేఖ–వర్మ ద్వయం
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ మరో పతకంపై దృష్టి పెట్టింది. కాంపౌండ్ ఈవెంట్ మిక్స్డ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం రేసులో నిలిచింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ–వర్మ ద్వయం 153–155తో సోఫీ–జూలియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో భారత జోడీ 155–152తో నెదర్లాండ్స్ ద్వయంపై నెగ్గింది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో బెల్జియం జంటతో సురేఖ– వర్మ జోడీ తలపడుతుంది. శుక్రవారమే జరిగే కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చైనీస్ తైపీతో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఆడనుంది. -
ఫలించిన ఆర్చర్ జ్యోతి సురేఖ దీక్షాస్త్రం
-
ప్రభుత్వ ప్రోత్సాహాకాల్లోను వాటాలు అడుగుతున్నారు
-
మూడో రౌండ్లో జ్యోతి సురేఖ
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌడ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో సురేఖ 145–140తో లెక్సీ కెల్లర్ (అమెరికా)పై విజయం సాధించింది. -
లక్ష్యరేఖ
చాలా సందర్భాల్లో లక్ష్యానికి, విజయానికి మధ్య విభజన రేఖ చిన్నదిగా కనిపిస్తుంది. వింటిని గట్టిగా లాగి సూటిగా వదిలిన బాణంలా అలుపెరగక దూసుకుపోతే లక్ష్యం చిన్నదవుతుంది. ఆ సన్నని గీత చెరిగిపోయి విజయరేఖగా మారుతుంది. చివరకు తనపేరులోని రేఖను విజయ రేఖగా మార్చుకున్న జ్యోతి సురేఖలా ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. అవమానాలకు కళ్లెంవేస్తూ అవాంతరాలపై స్వారీ చేస్తూ ప్రపంచ ఆర్చరీ పటంలో తానొక పుటగా ఆవిష్కృతమవుతుంది. ప్రతిభను వెతుక్కుంటూ వచ్చే పద్మశ్రీ అవార్డులకు, ఆదర్శ పాఠాలు నేర్చుకునే వర్ధమాన క్రీడాకారులకు అర్జున అవార్డు గ్రహీత జ్యోతిసురేఖ చిరునామాగా మారుతుంది. ♦ అప్పుడు ఆ చిన్నారి పాప వయస్సు నాలుగేళ్ల 11 నెలలు. ఆ వయసులో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిని చూడటానికే భయపడతారు. అలాంటిది నదిలో 5 కిలోమీటర్ల దూరాన్ని చేపపిల్లలా మూడుసార్లు అటూ ఇటూ 3 గంటల 6 నిమిషాల వ్యవధిలో ఈదేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించేసింది. ♦ ఇప్పుడు ఆమె వయస్సు 23 సంవత్సరాలు. విలువిద్యలో ఏకలవ్యుడి శిష్యురాలిలా దూసుకుపోతోంది. విల్లు చేతబూని విలువిద్యలో తనకు సాటిలేరని నిరూపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. దేశంలోనే కాంపౌండ్ ఆర్చరీలో తొలిసారిగా, జిల్లాలో తొలి అమ్మాయిగా అర్జున అవార్డు సాధించి వర్ధమాన క్రీడాకారులకు లక్ష్యరేఖగా మారింది. ఆమె పేరే జ్యోతి సురేఖ. విజయవాడ స్పోర్ట్స్: జ్యోతి సురేఖ 1996, జూలై 3వ తేదీన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో వెన్నం సురేంద్రకుమార్, శ్రీదుర్గకు జన్మించారు. కేవలం క్రీడల్లోనే కాదు.. చదువులోనూ టాపే. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) పాసై అదే యూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. తొలుత పిన్నవయసులోనే స్విమ్మింగ్‌లో రాణించి.. అనంతరం ఆర్చరీని ఎంచుకుంది. అయితే, ఆర్చరీ ప్రాక్టీస్‌కు అవకాశం కుదరలేదు. స్థానికంగా ప్రోత్సాహం లభించలేదు. అయినా కుంగిపోకుండా, పట్టువిడవక తల్లిదండ్రులు, స్నేహితులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో ప్రాక్టీస్ చేసి ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి రాష్ట్ర, దేశఖ్యాతిని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది. ఘనత ♦ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో ప్రపంచ స్థాయిలో 14వ ర్యాంకులో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 30 పోటీల్లో పాల్గొంటే, 8 స్వర్ణ, 8 రజత, 5 కాంస్య పతకాలు కైవసం ♦ 2015ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 80కి 80 పాయింట్లు సాధించి వరల్డ్ రికార్డు సమం. ♦ 2017లో 20వ ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 720 పాయింట్లకు 703 పాయింట్లు సాధించిన తొలి ఇండియన్ కాంపౌండ్ ఆర్చరర్‌గా ఘనత. ♦ ఒకే ఏడాది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో చాంపియన్. అవార్డులు ♦ 2017లో అర్జున అవార్డు, 2014లో అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ అవార్డు, 2013లో వరల్డ్ ఆర్చరీ ఫిటా గోల్డెన్ టార్గెట్ అవార్డు, 2002లో భారత ప్రభుత్వం నుంచి ఎక్స్‌సెప్షనల్ అచీవ్మెంట్ అవార్డు. 2016 సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు ♦ 2017 ఢాకాలో 20వ ఏషియన్ ఆర్చరీ చాంపిన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో కాంస్య, టీమ్ విభాగంలో స్వర్ణ, మిక్స్డ్ విభాగంలో రజత పతకాలు సాధించింది. కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఆర్చరీ అంటే ఇష్టపడటంతో చేర్పించాం. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం ఆనందంగా ఉంది. – వెన్నం సురేంద్రకుమార్, జ్యోతి సురేఖ తండ్రి -
అభిషేక్ ‘పసిడి’ బాణం
ఢాకా: గురి తప్పని లక్ష్యంతో రాణించిన భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. బుధవారం జరిగిన పోటీల్లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌గా అవతరించగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా)తో జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో విజయం సాధించాడు. ఇద్దరికీ ఐదు రౌండ్లలో నాలుగు చొప్పున బాణాలు సంధించే అవకాశం ఇచ్చారు. ఐదు రౌండ్ల తర్వాత స్కోరు 147–147తో సమఉజ్జీగా నిలిచింది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో అవకాశం ఇచ్చారు. ఇద్దరూ కొట్టిన షాట్ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లింది. అయితే కిమ్ జాంగ్‌హో సంధించిన బాణంతో పోలిస్తే అభిషేక్ వర్మ సంధించిన బాణం ‘బుల్స్ ఐ’కు అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌ను విజేతగా ప్రకటించారు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ గుర్విందర్ సింగ్ 145–148తో సంగ్ హో హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో అభిషేక్ 149–146తో సంగ్ హో హాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 148–141తో అబుల్ ఖాషిమ్ మామున్ (బంగ్లాదేశ్)పై, మూడో రౌండ్లో 146–145తో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై, రెండో రౌండ్లో 149–141తో థు రైన్ జిన్ (మయన్మార్)పై గెలిచాడు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ 146–142తో వు టింగ్ టింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి సురేఖ 138–144తో చోయ్ బోమిన్ (కొరియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఈ ఇద్దరూ జోడీగా బరిలోకి దిగి మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి విదితమే. ఫైనల్లో ధీరజ్ మరోవైపు ఆసియా చాంపియన్‌షిప్‌తోపాటు నిర్వహిస్తున్న యూత్ ఒలింపిక్స్ ఆసియా కాంటినెంటల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన సెమీస్‌లో 16 ఏళ్ల ధీరజ్ 6–2తో సూరజ్ (భారత్)పై గెలిచాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ (విజయవాడ)కి చెందిన ధీరజ్ గురువారం జరిగే రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం భారత్‌కే చెందిన ఆకాశ్‌తో తలపడతాడు. -
జ్యోతి సురేఖ ఓటమి
బెర్లిన్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ పోరాటం ముగిసింది. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ 145–147తో సారా సోనిషెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది.