సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వర్ధమాన ఆటగాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) పాలసీలో భాగంగా రాష్ట్ర క్రీడా జ్యోతి పథకం కింద 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసింది.
వీరికి రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎన్‌డీసీ) సౌజన్యంతో మొత్తం రూ.26 లక్షల మేర నగదు పురస్కారాలను అందించారు. గురువారం జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ చేతుల మీదుగా క్రీడాకారులు చెక్‌లను అందుకున్నారు.
ఇదీ క్రీడా జ్యోతి పురస్కారాల జాబితా
రూ. 2 లక్షలు: సుంకరి లావణ్య, కె.జ్యోతి సురేఖ(ఆర్చరీ), అచ్యుత కుమారి (అథ్లెటిక్స్), ఎస్.మారతమ్మ, నిఖత్ జరీన్ (బాక్సింగ్), బి.ప్రత్యూష (చెస్), మాదరి కమల్ రాజ్ (ఫెన్సింగ్), బి.అరుణ (జిమ్నాస్టిక్స్), సయీదా ఫలక్(కరాటే), ఎం.సంతోషి (వెయిట్ లిఫ్టింగ్).
రూ. 1 లక్ష: ఆర్.రాజా రిత్విక్ (చెస్), డి.ప్రేరణ షీతల్, ఎం.రవీనా (ఫెన్సింగ్),షేక్ జఫ్రీన్ (మూగ, చెవిటి-టెన్నిస్), శాంభవి దీక్షిత్ (టెన్నిస్), తేజా సింగ్ దేవీ సింగ్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్).
వర్ధమాన క్రీడాకారులకు సాయం
Published Fri, Dec 27 2013 1:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement