
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో కలిసి సురేఖ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బరిలోకి దిగనుంది.
సీజన్‌లో జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో (షాంఘై, అంటాల్యా, సాల్ట్‌లేక్ సిటీ, బెర్లిన్) సురేఖ–అభిషేక్ జంట నిలకడగా రాణించి నాలుగు కాంస్య పతకాలు గెలిచింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబరు 29, 30 తేదీల్లో టర్కీలోని సామ్‌సన్ నగరంలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment