Abhishek Verma
-
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ ద్వయం 155–151తో బెసెరా–మెండెజ్ (మెక్సికో) జంటను ఓడించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత (భారత్) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో ధీరజ్ –అంకిత 0–6తో లిమ్ సిహైన్–కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ మూడో రౌండ్లో 4–6 తో కెన్ సాంచెజ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్ క్వార్టర్ ఫైనల్లో 3–7తో టెమినో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లో 6–4తో జెన్ హన్‌యంగ్ (కొరియా)పై నెగ్గి సెమీఫైనల్ చేరింది. -
World Games 2022: సురేఖ జంటకు కాంస్యం
బర్మింగ్‌హామ్ (అమెరికా): వరల్డ్ గేమ్స్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ చేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో... శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 157–156తో ఆండ్రియా బెసెరా–మిగెల్ బెసెరా (మెక్సికో) జంటపై గెలిచింది. -
Archery World Cup 2022: భారత్ గురి అదిరింది
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో సత్తా చాటుకున్నారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్ గాంటియర్, జీన్ ఫిలిప్ బౌల్చ్, క్విన్టిన్ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును ఓడించింది. గత నెలలో టర్కీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం. అనంతరం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్ (భారత్) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్ 141–149తో ప్రపంచ నంబర్‌వన్ మైక్ షోలోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సెమీఫైనల్లో 143–141తో ప్రపంచ చాంపియన్ నికో వీనర్ (ఆస్ట్రియా)పై గెలుపొందడం విశేషం. -
Archery World Cup: కాంస్యం బరిలో అభిషేక్ జోడీ
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో అభిషేక్ వర్మ–అవ్నీత్ కౌర్ (భారత్) జంట కాంస్య పతకం కోసం పోరాడనుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో అభిషేక్ వర్మ–అవ్నీత్ కౌర్ జోడీ 156–158 పాయింట్ల తేడాతో లిజెల్ జాట్మా–రాబిన్ జాట్మా (ఎస్తోనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో బెరా సుజెర్–ఎమిర్కాన్ హనీ (టర్కీ) జంటతో అభిషేక్–అవ్నీత్ తలపడతారు. -
రెండో పసిడి పతక వేటలో వెన్నం జ్యోతి సురేఖ
యాంక్టన్ (అమెరికా): ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం రేసులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండో పసిడి పతకం కోసం పోటీపడనుంది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 159–156తో కిమ్ యున్హీ–కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సురేఖ 146–142తొ సో చేవన్ (దక్షిణ కొరియా) పై, మూడో రౌండ్లో 147–144తో ఇంగె వాన్ డెర్ వాన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. చదవండి: IPL 2021 2nd Phase MI Vs KKR: ముంబైపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం -
ఆరేళ్ల తర్వాత...
పారిస్: ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 15 షాట్ల తర్వాత ఇద్దరూ 148–148తో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇందులో క్రిస్ షాఫ్ 9 పాయింట్లు స్కోరు చేయగా... అభిషేక్ గురికి 10 పాయింట్లు వచ్చాయి. దాంతో పసిడి అభిషేక్ వశమైంది. 2015లో పోలాండ్‌లో జరిగిన వ్రోక్లా వరల్డ్‌కప్ టోర్నీలో చివరిసారి అభిషేక్ వ్యక్తిగత స్వర్ణం సాధించాడు. 2019 ఆసియా చాంపియన్‌షిప్ తర్వాత అభిషేక్ వర్మ బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో అభిషేక్ 146–138తో ఆంటోన్ బులయెవ్ (రష్యా)పై గెలుపొందాడు. -
స్వర్ణ సురేఖ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో గొప్ప ఘనత జమ చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖఅభిషేక్ వర్మ (భారత్) జంట 158151 పాయింట్ల తేడాతో యి సువాన్ చెన్చియె లున్ చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఫైనల్లో ఒక్కో జోడీకి లక్ష్యంవైపు 16 బాణాల చొప్పున అవకాశం ఇచ్చారు. విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతి సురేఖ తాను సంధించిన ఎనిమిది బాణాలకు గరిష్టంగా లభించే 80 పాయింట్లను సాధించడం విశేషం. ఆమె సంధించిన ఎనిమిది బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లాయి. అభిషేక్ వర్మ 80 పాయింట్లకుగాను 78 పాయింట్లు స్కోరు చేశాడు. ‘ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. గాలి బాగా వీస్తున్నా స్వర్ణం నెగ్గే ఆఖరి అవకాశాన్ని వదులుకోలేదు’ అని సురేఖ వ్యాఖ్యానించింది. అంతకుముందు జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో భారత జట్టు 215231తో చెవన్ సో, యున్ సూ సాంగ్, డేయోంగ్ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232233తో కేవలం పాయింట్ తేడాతో జేవన్ యాంగ్, యోంగ్హి చోయ్, యున్ క్యు చోయ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. బుధ వారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో కలిపి భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. గురువారం ఇదే వేదికపై టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 2: కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు పది ఆసియా చాంపియన్‌షిప్‌లు జరిగాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జంట స్వర్ణం నెగ్గడం ఇది రెండోసారి. 2013లో అభిషేక్ వర్మలిల్లీ చాను ద్వయం తొలి పసిడి పతకం గెలిచింది. 3: ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో జ్యోతి సురేఖ నెగ్గిన స్వర్ణాల సంఖ్య. సురేఖ 2015లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పసిడి పతకాలు సాధించింది. 30: తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన పతకాలు. ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. -
మరో స్వర్ణంపై సురేఖ గురి
బ్యాంకాక్: మిక్స్డ్ టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శనను మహిళల టీమ్ విభాగంలోనూ పునరావృతం చేయడంతో... ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణ పతకం రేసులో నిలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి ఇప్పటికే ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మంగళవారం జరిగిన మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కలిసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం ఉండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. మహిళల టీమ్ కాంపౌండ్ సెమీఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియ బృందం 229–221తో సయ్యదా, ఫార్సి, అరెజులతో కూడిన ఇరాన్ జట్టును ఓడించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 226–225తో కన్యవీ, కనోక్నాపుస్, నారెయుమోన్‌లతో కూడిన థాయ్‌లాండ్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే టీమ్ ఫైనల్లో కొరియాతో భారత్ తలపడుతుంది. ఈ ఫైనల్ తర్వాత మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తుది పోరులో సురేఖ–అభిõÙక్ వర్మ జంట చైనీస్ తైపీకి చెందిన యి సువాన్ చెన్–చియె లున్ చెన్ జోడీతో ఆడుతుంది. మూడు కాంస్యాలు... మంగళవారం భారత ఆర్చర్లు మూడు కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో అతాను దాస్ 6–5తో జిన్ హాయెక్ ఓ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. పురుషుల రికర్వ్ టీమ్ విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత జట్టు 6–2తో చైనాను ఓడించింది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంకాంస్య పతక మ్యాచ్‌లో దీపిక కుమారి, బొంబేలా దేవి, అంకితలతో కూడిన భారత జట్టు 5–1తో జపాన్‌పై గెలిచింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో భారత్ 229–221తో ఇరాన్‌పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో కొరియాతో పోరుకు సిద్ధమైంది. -
భారత్‌కు మరో స్వర్ణం
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ అభిషేక్ వర్మ పసిడితో మెరిశాడు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది తుది పోరుకు అర్హత సాధించగా అభిషేక్ వర్మ టాప్‌లో నిలిచాడు. మొత్తంగా ఫైనల్లో 244.2 పాయింట్లతో అభిషేక్ స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇక ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ సౌరభ్ చౌధరీ కాంస్యతో సరిపెట్టుకున్నాడు. చౌధరి 221.9 పాయింట్లతో కాంస్య సాధించాడు. రజత పతకాన్ని టర్కీకి చెందిన ఇస్మాయిల్ కీల్స్ చేజిక్కించుకున్నాడు. 243.1 పాయింట్లతో ఇస్మాయిల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేణి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్ పతకాల పట్టికలో టాప్కు చేరింది. -
అభిషేక్ అదరహో
బీజింగ్: ఆడుతోంది తొలి ప్రపంచకప్ ఫైనల్... బరిలో మేటి షూటర్లు... అయినా ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు... ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి ఒకే గురికి రెండు లక్ష్యాలు సాధించాడు భారత షూటర్ అభిషేక్ వర్మ. ఇక్కడ జరుగుతోన్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో అభిషేక్ వర్మ రూపంలో భారత్‌కు మూడో స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ 242.7 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెల్చుకున్నాడు. అంతేకాకుండా భారత్‌కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. అర్తెమ్ చెముస్కోవ్ (రష్యా–240.4 పాయింట్లు) రజతం... సెయుంగ్వు హాన్ (కొరియా–220 పాయింట్లు) కాంస్యం సాధించారు. హరియాణాలో న్యాయవాదిగా ఉన్న 29 ఏళ్ల అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో తొలి షాట్ నుంచి చివరి షాట్ ముగిసేవరకు అభిషేక్ ఆధిక్యంలో ఉండటం విశేషం. -
సురేఖ–అభిషేక్ జంటకు రజతం
సామ్సన్ (టర్కీ): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 152–159తో యాసిమ్ బోస్టాన్–దెమిర్ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో జరిగిన నాలుగు వరల్డ్ కప్ టోర్నీలలో కాంస్యాలు సాధించినందుకు సురేఖ–అభిషేక్ ద్వయం సీజన్ ముగింపు టోర్నీకి అర్హత సాధించింది. మరోవైపు పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 149–147తో కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. -
సురేఖ జోడీ ఓటమి
ఆర్చరీ రికర్వ్, కాంపౌండ్ మిక్స్డ్ విభాగాల్లో భారత పోరు ముగిసింది. మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో ఈ ఏడాది వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో కాంస్య పతకాలు సాధించి జోరు మీదున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట ఆసియా క్రీడల్లో మాత్రం విఫలమైంది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జంట 153–155తో గొర్బానీ–మహబూబీ (ఇరాన్) ద్వయం చేతిలో ఓడింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి–అతాను దాస్ జంట క్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో 4–5తో బిషిండి–బాతర్ఖుయా (మంగోలియా) జోడీ చేతిలో ఓడింది. -
ఏషియన్ గేమ్స్ భారత షూటర్ల హవా
-
ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీకి సురేఖ–అభిషేక్ జంట
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో కలిసి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో బరిలోకి దిగనుంది. సీజన్లో జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో (షాంఘై, అంటాల్యా, సాల్ట్‌లేక్ సిటీ, బెర్లిన్) సురేఖ–అభిషేక్ జంట నిలకడగా రాణించి నాలుగు కాంస్య పతకాలు గెలిచింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబరు 29, 30 తేదీల్లో టర్కీలోని సామ్సన్ నగరంలో జరుగుతుంది. -
అభిషేక్ ‘పసిడి’ బాణం
ఢాకా: గురి తప్పని లక్ష్యంతో రాణించిన భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. బుధవారం జరిగిన పోటీల్లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌గా అవతరించగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా)తో జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో విజయం సాధించాడు. ఇద్దరికీ ఐదు రౌండ్లలో నాలుగు చొప్పున బాణాలు సంధించే అవకాశం ఇచ్చారు. ఐదు రౌండ్ల తర్వాత స్కోరు 147–147తో సమఉజ్జీగా నిలిచింది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో అవకాశం ఇచ్చారు. ఇద్దరూ కొట్టిన షాట్ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లింది. అయితే కిమ్ జాంగ్‌హో సంధించిన బాణంతో పోలిస్తే అభిషేక్ వర్మ సంధించిన బాణం ‘బుల్స్ ఐ’కు అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌ను విజేతగా ప్రకటించారు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ గుర్విందర్ సింగ్ 145–148తో సంగ్ హో హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో అభిషేక్ 149–146తో సంగ్ హో హాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 148–141తో అబుల్ ఖాషిమ్ మామున్ (బంగ్లాదేశ్)పై, మూడో రౌండ్లో 146–145తో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై, రెండో రౌండ్లో 149–141తో థు రైన్ జిన్ (మయన్మార్)పై గెలిచాడు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ 146–142తో వు టింగ్ టింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి సురేఖ 138–144తో చోయ్ బోమిన్ (కొరియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఈ ఇద్దరూ జోడీగా బరిలోకి దిగి మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి విదితమే. ఫైనల్లో ధీరజ్ మరోవైపు ఆసియా చాంపియన్‌షిప్‌తోపాటు నిర్వహిస్తున్న యూత్ ఒలింపిక్స్ ఆసియా కాంటినెంటల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన సెమీస్‌లో 16 ఏళ్ల ధీరజ్ 6–2తో సూరజ్ (భారత్)పై గెలిచాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ (విజయవాడ)కి చెందిన ధీరజ్ గురువారం జరిగే రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం భారత్‌కే చెందిన ఆకాశ్‌తో తలపడతాడు. -
అభిషేక్–దివ్య జంటకు కాంస్యం
ప్రపంచకప్ ఆర్చరీ అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, దివ్య దయాళ్లతో కూడిన భారత జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. అభిషేక్ వర్మ–దివ్య దయాళ్ ద్వయం 154–153తో సెర్గియో పాగ్ని–మార్సెల్లా టోనియోలి (ఇటలీ) జంటపై గెలిచింది. టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, చిన్నరాజు శ్రీధర్, గుర్విందర్ సింగ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 227–228తో ఒక్క పాయింట్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో... తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ, దివ్య దయాళ్, స్నేహల్లతో కూడిన భారత మహిళల జట్టు 222–227తో ఇటలీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలను చేజార్చుకున్నాయి. -
అవన్నీ పనికిమాలిన ఆరోపణలు: వరుణ్
న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మకు రక్షణ రహస్యాలు చెప్పారనే ఆరోపణలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. అవన్నీ తప్పుడు, పనికిమాలిన ఆరోపణలని కొట్టిపారేశారు. కావాలని తన ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2009లో డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ, డిఫెన్స్ కన్సలే్టటివ్ కమిటీల్లో సభ్యుడిగా నియమితుడైనప్పటి నుంచి కన్సలే్టటివ్ కమిటీ భేటీకి ఒక్కదానికీ తాను హాజరుకాలేదని తెలిపారు. ఎడ్మండ్స్ అలెన్ అనే అమెరికా న్యాయవాది వరుణ్ కీలకమైన రక్షణ రహస్యాలను అభిషేక్ వర్మకు వెల్లడించారని పీఎంవోకు రాసిన లేఖను స్వరాజ్ అభియాన్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర విడుదల చేయడం తెలిసిందే. ఎడ్మండ్‌ను తానెప్పుడూ కలవలేదని వరుణ్ పేర్కొన్నారు. ఇక అభిషేక్ తనకు ఇంగ్లండ్‌లో కాలేజీ స్నేహితుడని, అయితే అతన్ని కలసి చాలాకాలమైందని వరుణ్ వెల్లడించారు. -
అభిషేక్‌కు స్వర్ణం
వ్రోక్లా (పోలండ్) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెం ట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అభిషేక్ 148-145 పాయింట్ల తేడాతో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై గెలిచాడు. అయితే కాం పౌండ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు నిరాశ మిగిలింది. కాం స్య పతక పోరులో అభిషేక్, కవల్‌ప్రీత్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత్ 230-233 తేడాతో ఇటలీ చేతిలో ఓడింది. -
ఫైనల్లో అభిషేక్ వర్మ
ప్రపంచకప్ ఆర్చరీ వ్రోక్లా (పోలండ్): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్ 146-145తో స్టీవ్ అండర్సన్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 147-143తో మెన్సియెని (ఇటలీ)పై గెలి చాడు. స్వర్ణ పతకం కోసం అతను ఇరాన్ ప్లేయర్ ఇస్మాయిల్ ఇబాదీతో తలపడతాడు. మరోవైపు అభిషేక్ వర్మ, కవల్‌ప్రీత్ సింగ్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు కాంపౌండ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో 231-232తో అమెరికా చేతిలో ఓడింది. దీంతో కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంది.