
గ్వాంగ్‌జు (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో అభిషేక్ వర్మ–అవ్‌నీత్ కౌర్ (భారత్) జంట కాంస్య పతకం కోసం పోరాడనుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో అభిషేక్ వర్మ–అవ్‌నీత్ కౌర్ జోడీ 156–158 పాయింట్ల తేడాతో లిజెల్ జాట్మా–రాబిన్ జాట్మా (ఎస్తోనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో బెరా సుజెర్–ఎమిర్కాన్ హనీ (టర్కీ) జంటతో అభిషేక్–అవ్‌నీత్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment