అభిషేక్‌–దివ్య జంటకు కాంస్యం | India's compound mixed pair secure bronze in Archery World Cup | Sakshi
Sakshi News home page

అభిషేక్‌–దివ్య జంటకు కాంస్యం

Published Sun, Jun 11 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

అభిషేక్‌–దివ్య జంటకు కాంస్యం

అభిషేక్‌–దివ్య జంటకు కాంస్యం

ప్రపంచకప్‌ ఆర్చరీ
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నమెంట్‌లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, దివ్య దయాళ్‌లతో కూడిన భారత జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. అభిషేక్‌ వర్మ–దివ్య దయాళ్‌ ద్వయం 154–153తో సెర్గియో పాగ్ని–మార్సెల్లా టోనియోలి (ఇటలీ) జంటపై గెలిచింది. టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, చిన్నరాజు శ్రీధర్, గుర్విందర్‌ సింగ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 227–228తో ఒక్క పాయింట్‌ తేడాతో ఫ్రాన్స్‌ చేతిలో... తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ, దివ్య దయాళ్, స్నేహల్‌లతో కూడిన భారత మహిళల జట్టు 222–227తో ఇటలీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలను చేజార్చుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement