వరల్డ్ కప్‌లో వరుసగా మూడో స్వర్ణం
అంటాల్యా (టర్కీ): వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 3లో భారత మహిళల జట్టు (కాంపౌండ్ విభాగం) స్వర్ణ పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 232–229 స్కోరుతో ఎస్తోనియాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అదితి గోపీచంద్ స్వామి, పర్నిత్ కౌర్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
తుది పోరులో 4 ఎండ్‌లలో భారత్ వరుసగా 58, 57, 59, 58 పాయింట్లు సాధించగా...ఎస్తోనియా టీమ్ సభ్యులు వరుసగా 57, 57, 58, 57 స్కోర్లు చేసి ఓవరాల్‌గా 3 పాయింట్లతో వెనుకబడ్డారు. మన మహిళల జట్టు ఈ ఏడాది వరుసగా మూడో వరల్డ్ కప్‌లోనూ పసిడి పతకం గెలుచుకొని సత్తా చాటడం విశేషం.
వరల్డ్ కప్ స్టేజ్ 1 (షాంఘై), వరల్డ్ కప్ స్టేజ్ 2 (యెజియాన్)లలో కూడా టీమ్ అగ్రస్థానంతో ముగించింది. మరో వైపు పురుషుల కాంపౌండ్ విభాగం ఫైనల్లో ఓడిన భారత ఆర్చర్ ప్రియాన్‡్ష రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ప్రియాన్‡్ష 148–149 స్కోరుతో మైక్ స్కాలెసర్ చేతిలో ఓటమిపాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment