Guangzhou
-
Archery World Cup: కాంస్యం బరిలో అభిషేక్ జోడీ
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో అభిషేక్ వర్మ–అవ్నీత్ కౌర్ (భారత్) జంట కాంస్య పతకం కోసం పోరాడనుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో అభిషేక్ వర్మ–అవ్నీత్ కౌర్ జోడీ 156–158 పాయింట్ల తేడాతో లిజెల్ జాట్మా–రాబిన్ జాట్మా (ఎస్తోనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో బెరా సుజెర్–ఎమిర్కాన్ హనీ (టర్కీ) జంటతో అభిషేక్–అవ్నీత్ తలపడతారు. -
చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు
బీజింగ్: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు, వైద్య సామగ్రి గురువారం ఉదయం బయలుదేరిందని బీజింగ్‌లోని భారత రాయభారి విక్రమ్ మిశ్రి పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో మరో 20 లక్షల వైద్యసామగ్రి భారత్‌కు చేరుకోనుందని తెలిపారు. రాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లు, ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్లు గ్వాన్గ్జూ విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరాయని ట్విటర్లో పోస్ట్ చేశారు. కరోనాపై రెండు నెలల యుద్దం అనంతరం చైనాలోని ఫ్యాక్టరీలు తిరిగి తమ విధులను ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో కరోనా వైద్యసామగ్రికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వాటిని తయారు చేస్తూ ఎగుమతులపై చైనా దృష్టి సారించింది. ముఖ్యంగా వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాల కోసం వివిధ దేశాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా చైనాకు వస్తున్నాయి. భారత దేశంలో ప్రస్తుత లాక్డౌన్ సమయంలో హాట్ స్పాట్లలో ప్రత్యేకంగా పరీక్షలను వేగవంతం చేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న వైద్యసామగ్రి ఉపయోగపడనుంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైద్య సామాగ్రికి ఉన్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, సకాలంలో భారతదేశానికి రావడానికి విమాన అనుసంధానాలను సమన్వయం చేయడంతో పాటు వాణిజ్య సేకరణలను భారత రాయభార కార్యాలయం సులభతరం చేస్తోందని విక్రమ్ మిశ్రి తెలిపారు. -
‘పిజ్జా’కు తాత్కాలిక విముక్తి
బీజింగ్: ధ్రువపు ఎలుగుబంటి 'పిజ్జా'కు కష్టాలు తాత్కాలికంగా తప్పాయి. బందిఖానా నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా ముద్రపడిన 'పిజ్జా'కు విముక్తి లభించింది. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలో ఉన్న గ్రాండ్ వ్యూ షాపింగ్ మాల్ నుంచి దాన్ని బయటికి తరలించారు. ఆదివారం వీడ్కోలు విందు తర్వాత దాన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎక్కడికి తరలించారనేది షాపింగ్ మాల్ నిర్వాహకులు వెల్లడించలేదు. ‘ఫేర్ వేల్ పార్టీ తర్వాత బందోబస్తు నడుమ అక్వేరియం నుంచి పిజ్జాను తరలించామ’ని తెలిపారు. ‘పిజ్జా’ జన్మస్థలం టియన్ జిన్ కు దాన్ని తరలించివుంటారని చైనా మీడియా పేర్కొంది. షాపింగ్ మాల్ లోని మిగతా అరుదైన జంతువులకు విముక్తి లభించలేదు. అయితే జంతువులను ఉంచిన ఎన్ క్లోజర్లు నవీకరిస్తున్నామని, ఈ పనులు పూర్తైన తర్వాత ‘పిజ్జా’ను తిరిగి తీసుకొస్తామని షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించారు. అరుదైన జంతువులను వ్యాపార ప్రయోజనాల కోసం ఇరుకైన గదుల్లో బంధించి హింసించడం పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చేయడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు దిగివచ్చారు. ‘పిజ్జా’కు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. చదవండి: చైనాలో మరో వ్యాపార వికృతం -
మొసలితో ముద్దూ ముచ్చట..
ఈ కాలంలో ఉద్యోగం దొరకడమంటే మాటలా? ఎన్ని పరీక్షలు రాయాలి? తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాలి? అయితే, చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఇవన్నీ ఎందుకు.. సింపుల్‌గా మొసలిని ముద్దెట్టుకోండి చాలు అని చెబుతోంది. అంతేకాదు.. బుధవారం గువాంగ్జౌలో మహిళా సిబ్బంది ఎంపిక కోసం చిన్నపాటి మొసలిని రోడ్డుపైకి దించింది. దీన్ని ముద్దెట్టుకున్న మగువులు మొదటి రౌండ్ పాసైపోయినట్లేనని.. నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లిపోవచ్చని చెప్పింది. దీంతో కొందరు అమ్మాయిలు ఇలా మొసలితో ముద్దూముచ్చట్ల కార్యక్రమానికి దిగారు. పైగా.. ముద్దు పెట్టుకున్నవారికి సదరు కంపెనీ వారు ప్రోత్సాహకం కింద రూ.10 వేలు కూడా ఇచ్చారు. ఇదంతా ఎందుకని కంపెనీ వారిని ప్రశ్నిస్తే.. తమ సిబ్బంది ధైర్యాన్ని పరీక్షించేందుకే అని చెప్పారు. ఇంకో విషయం.. ఈ కంపెనీ అమ్మేవి కూడా మొసలి నుంచి తయారుచేసిన ఆరోగ్య ఉత్పత్తులేనట! -
ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు
అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. మొదటి రౌండ్లో ‘బై’ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో రౌండ్లో సునాయాస విజయం నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధు శ్రమించి గెలుపొందగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గాయంతో వైదొలగడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రస్తుతం బరిలో మిగిలిన ఈ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కావడం విశేషం. గ్వాంగ్జూ (చైనా): మూడు విజయాలు... రెండు పరాజయాలు... మెరుగైన ప్రదర్శన చేస్తారనుకున్న డబుల్స్‌లో నిరాశ... పతకంపై ఆశల రేకెత్తిస్తున్న సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు... వెరసి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు ఇదీ భారత ప్రదర్శన. ఎలాంటి తడబాటు లేకుండా ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత స్టార్ సైనా నెహ్వాల్... తీవ్ర ప్రతిఘటన ఎదురైనా సంయమనంతో ఆడిన తెలుగు అమ్మాయి పి.వి.సింధు... గాయంతో ప్రత్యర్థి మధ్యలోనే చేతులెత్తేయడంతో పారుపల్లి కశ్యప్ విజయాలు నమోదు చేసి ఈ మెగా ఈవెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 21-5, 21-4తో ఓల్గా గొలొవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. స్మాష్‌లు, డ్రాప్ షాట్లు, వైవిధ్యభరిత సర్వీస్‌లు... ఇలా అన్ని విభాగాల్లో సైనా తన ఆటతీరును పరీక్షించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓల్గా నెగ్గిన తొమ్మిది పాయింట్లలో ఎక్కువగా సైనా చేసిన అనవసర తప్పిదాలతో వచ్చినవే కావడం గమనార్హం. తొలి గేమ్‌లో స్కోరు 8-5 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా 13 పాయింట్లు నెగ్గి 10 నిమిషాల్లో గేమ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం 13 నిమిషాలపాటు జరిగిన రెండో గేమ్‌లో సైనా రెండుసార్లు వరుసగా ఏడేసి పాయింట్లను సాధించింది. కవోరి ఇమబెపు (జపాన్)తో జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతోన్న సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు 42 స్మాష్‌లు సంధించడం విశేషం. జయరామ్ పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ ముందంజ వేయగా... అజయ్ జయరామ్ ఓడిపోయాడు. పీటర్ కౌకుల్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ తొలి గేమ్‌లో 14-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో కౌకుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కశ్యప్‌ను విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ను ఓడించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్ నిరాశపరిచాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ పాబ్లీ ఎబియన్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 9-21, 17-21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట 15-21, 21-13, 17-21తో మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్‌లోని డబుల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. సింగిల్స్‌లో సైనా, సింధు, కశ్యప్ మిగిలి ఉన్నారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్; రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు; ఆరో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో కశ్యప్ తలపడతారు. తమ ప్రిక్వార్టర్ ఫైనల్స్ ప్రత్యర్థులతో ముఖాముఖి రికార్డులో సైనా 5-0తో ఆధిక్యంలో ఉండగా... సింధు 0-1తో; కశ్యప్ 0-2తో వెనుకబడి ఉన్నారు.