రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ అభిషేక్ వర్మ పసిడితో మెరిశాడు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది తుది పోరుకు అర్హత సాధించగా అభిషేక్ వర్మ టాప్‌లో నిలిచాడు. మొత్తంగా ఫైనల్‌లో 244.2 పాయింట్లతో అభిషేక్ స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
ఇక ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ సౌరభ్ చౌధరీ కాంస్యతో సరిపెట్టుకున్నాడు. చౌధరి 221.9 పాయింట్లతో కాంస్య సాధించాడు. రజత పతకాన్ని టర్కీకి చెందిన ఇస్మాయిల్ కీల్స్ చేజిక్కించుకున్నాడు. 243.1 పాయింట్లతో ఇస్మాయిల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఇలవేణి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్ పతకాల పట్టికలో టాప్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment