భళారే.. భారత్‌ | Manu Bhaker And Saurabh Wins Gold | Sakshi
Sakshi News home page

భళారే.. భారత్‌

Published Tue, Sep 3 2019 3:09 PM | Last Updated on Tue, Sep 3 2019 3:19 PM

 Manu Bhaker And Saurabh Wins Gold - Sakshi

రియో డి జనీరో(బ్రెజిల్‌): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ అదరగొట్టింది.  మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌ మరో స్వర్ణ పత​కాన్ని సాధించింది. భారత్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడి మను బాకర్‌-సౌరవ్‌ చౌధురీలు పసిడిని ఖాతాలో వేసుకున్నారు. దాంతో రియో డి జనీరో పర్యటనను స్వర్ణంతో భారత్‌ ముగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.  ఈ టోర్నమెంట్‌లో భారత్‌ మొత్తంగా ఐదు స్వర్ణ పతకాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది.

ఫలితంగా ఈ ఏడాది వేర్వేరు వేదికల్లో జరిగన నాలుగు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్‌, పిస్టల్‌ వరల్డ్‌కప్‌ ఈవెంట్లలోనూ భారత్‌ టాప్‌ను దక్కించుకుంది. మను బాకర్‌-సౌరవ్‌ చౌధరీలు స్వర్ణాన్ని సాధించే క్రమంలో మరో భారత జోడి యశస్విని దేశ్వాయ్‌-అభిషేక్‌ వర్మలపై పైచేయి సాధించారు. మనుబాకర్‌-సౌరవ్‌లు 17-15 తేడాతో యశస్విని- అభిషేక్‌లపై విజయం సాధించి పసిడి కైవసం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement