Saurabh Chaudhary
-
ISSF World Cup 2022: భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. అదరగొట్టిన సౌరభ్ చౌదరీ
Saurabh Wins Gold In ISSF World Cup In Cairo: సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ భాగంలో సౌరభ్ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్ 16–6తో మైకేల్ ష్వాల్డ్ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. చదవండి: IND vs IRE: మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
Tokyo Olympics: షూటర్ల గురి కుదిరేనా!
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన తొలి రోజు నుంచి భారత షూటర్లపై క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా 15 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం... కొంతకాలంగా అంతర్జాతీయస్థాయి టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తుండటం... ఈ నేపథ్యంలో సహజంగానే మన షూటర్లు రియో ఒలింపిక్స్ వైఫల్యాన్ని మరిచిపోయేలా పతకాలతో అదరగొడతారని ఆశించారు. కానీ మూడు రోజులు గడిచినా భారత షూటర్లు పతకాల బోణీ కొట్టలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సౌరభ్ చౌదరీ ఒక్కడే కాస్త నయమనిపించి ఫైనల్ చేరుకున్నాడు. కానీ తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను ఒత్తిడికి తడబడి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే విభాగంలో మరో షూటర్ అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఇలవేనిల్, అపూర్వీ చండేలా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో దివ్యాంశ్, దీపక్ కుమార్... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మనూ భాకర్, యశస్విని... పురుషుల స్కీట్ ఈవెంట్లో అంగద్, మేరాజ్ అహ్మద్ ఖాన్ కూడా క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించారు. దాంతో యేటా ప్రపంచకప్ టోర్నీలలో కనబరిచే ప్రదర్శనను విశ్వ క్రీడలు వచ్చేసరికి భారత షూటర్లు పునరావృతం చేయలేక చతికిల పడతారని విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విమర్శకుల నోళ్లు మూయించడానికి భారత షూటర్లకు మంచి అవకాశం లభించనుంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్డ్ ఈవెంట్లో భారత్ నుంచి నాలుగు జోడీలు బరిలోకి దిగనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ; యశస్విని–అభిషేక్ వర్మ... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో ఇలవేనిల్–దివ్యాంశ్; దీపక్ కుమార్–అంజుమ్ మౌద్గిల్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ స్టేజ్–1లో మొత్తం 20 జోడీలు బరిలో ఉన్నాయి. ఇలవేనిల్, దివ్యాంశ్ సింగ్ స్టేజ్–1లో టాప్–8లో నిలిచిన ఎనిమిది జంటలు క్వాలిఫయింగ్ స్టేజ్–2కు అర్హత సాధిస్తాయి. స్టేజ్–2లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ స్టేజ్–1లో 29 జోడీలు పోటీపడతాయి. టాప్–8లో నిలిచిన జంటలు క్వాలిఫయింగ్ స్టేజ్–2కు అర్హత పొందుతాయి. స్టేజ్–2లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో సౌరభ్–మనూ జంట స్వర్ణం... యశస్విని–అభిషేక్ జోడీ కాంస్యం సాధించాయి. ఒలింపిక్స్‌లో ఈ జోడీలు ఏం చేస్తాయో వేచి చూడాలి. గెలిస్తే సాత్విక్–చిరాగ్ జంట ముందుకు... బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో బెన్ లేన్–సీన్ వెండీ (బ్రిటన్) జంటపై కచ్చితంగా గెలవాలి. ఈ గ్రూప్ నుంచి వరుసగా రెండు విజయాలతో గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జంట ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: ఉదయం గం. 8:30 నుంచి బాక్సింగ్ ♦మహిళల 69 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్: లవ్లీనా బొర్గోహైన్ (భారత్)–నాదినె ఎపెట్జ్ (జర్మనీ) ♦ఉదయం గం. 11.33 నుంచి టేబుల్ టెన్నిస్ ♦టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్: శరత్ కమల్–మా లాంగ్ (చైనా) ♦ఉదయం గం. 8:30 నుంచి సెయిలింగ్ ♦మహిళల లేజర్ రేడియల్ రేసు: నేత్రా కుమనన్ (ఉదయం గం. 8:35 నుంచి); పురుషుల లేజర్ రేసు: విష్ణు శరవణన్ (ఉదయం గం. 8:45 నుంచి); పురుషుల స్కిఫ్ 49ఈఆర్ ♦రేసు: కేసీ గణపతి–వరుణ్ ఠక్కర్ (ఉదయం గం. 11:50 నుంచి) పురుషుల హాకీ ♦పురుషుల హాకీ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్: భారత్–స్పెయిన్ ♦(ఉదయం గం. 6:30 నుంచి) 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ♦క్వాలిఫయింగ్ స్టేజ్–1: ఉదయం గం. 5:30 నుంచి; క్వాలిఫయింగ్ స్టేజ్–2: ఉదయం గం. 6:15 నుంచి; కాంస్య పతకం మ్యాచ్: ఉదయం గం. 7:30 నుంచి; స్వర్ణ–రజత పతక మ్యాచ్: ఉదయం గం. 8:37 నుంచి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ ♦క్వాలిఫయింగ్ స్టేజ్–1: ఉదయం గం. 9:45 నుంచి; క్వాలిఫయింగ్ స్టేజ్–2: ఉదయం గం. 10:30 నుంచి; కాంస్య పతకం మ్యాచ్: ఉ. గం. 11:45 నుంచి; స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:22 నుంచి. -
మనూ–సౌరభ్ జంటకు రజతం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో పతకం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ జంటకు రజత పతకం దక్కింది. ఫైనల్లో మనూ–సౌరభ్ జోడీ 12–16తో వితాలినా బత్సారష్కినా–అర్తెమ్ చెర్నోసువ్ (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఇదే ఈవెంట్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ–యశస్విని సింగ్ (భారత్) జోడీ 7–17తో గొల్నూష్ సెబ్గతోలాహి–జావెద్ ఫరూగి (ఇరాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
భారత్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో సోమవారం భారత షూటర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ (భారత్) జోడీ 16–12తో గొల్నూష్–జావేద్ ఫరూఖ్ (ఇరాన్) జంటపై నెగ్గి పసిడి పతకం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ (భారత్) ద్వయం 16–10తో డెనిస్ ఎస్టర్–ఇస్తవన్ పెనీ (హంగేరి) జోడీని ఓడించి బంగారు పతకం దక్కించుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గుర్జోత్, మేరాజ్ అహ్మద్‌ఖాన్, అంగద్ వీర్‌బజ్వాలతో కూడిన భారత జట్టు 6–2తో నాసిర్, అలీ అహ్మద్, రషీద్ లతో కూడిన ఖతర్ జట్టుపై గెలిచి స్వర్ణ పతకం సాధించింది. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో పరీనాజ్, కార్తీకి సింగ్, గనీమత్‌లతో కూడిన భారత జట్టు 4–6తో జోయా, రినాటా, ఓల్గాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
మను భాకర్ స్వర్ణ సంబరం
పుతియాన్ (చైనా): షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత్ ఘనంగా ముగించింది. పోటీల చివరి రోజు శుక్రవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరీ, షాజర్ రిజ్వీ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివాన్ష్ సింగ్ స్వర్ణం, అపూర్వీ చండేలా రజతం గెల్చుకున్నారు. ఫైనల్లో మను (భారత్)–చెర్నూసోవ్ (రష్యా) ద్వయం 17–13 పాయింట్లతో సౌరభ్ (భారత్)–అన్నా కొరాకకీ (గ్రీస్) జోడీపై విజయం సాధించింది. కాంస్య పతకం మ్యాచ్‌లో రిజ్వీ (భారత్)–జొరానా (సెర్బియా) జంట 17–15తో వు జియావు (చైనా)–వితాలినా (రష్యా) జోడీపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో దివాన్ష్ (భారత్)–నెజానా (క్రొయేషియా) ద్వయం 16–14తో జాంగ్ చాంగ్‌హోంగ్ (చైనా)–అపూర్వీ చండేలా (భారత్) జంటపై గెలిచి స్వర్ణం గెలిచింది. -
ధనుశ్, ఆయుష్ పసిడి గురి
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ రజత పతకం గెల్చుకున్నాడు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 17 ఏళ్ల షూటర్... ఫైనల్లో 244.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ 246.5 పాయిం ట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. జావేద్ (ఇరాన్–221.8 పాయింట్లు) కాంస్యం సాధించాడు. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్లు ధనుశ్ శ్రీకాంత్, ఆయుష్ రుద్రరాజు పసిడి పతకాలతో మెరిశారు. భారత షూటింగ్ జట్టులో ఎంపికైన తొలి బధిర షూటర్‌గా గుర్తింపు పొందిన 16 ఏళ్ల ధనుశ్... శ్రేయ అగర్వాల్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో ధనుశ్–శ్రేయ ద్వయం 16–14తో వాంగ్ జెరు–జియాంగ్ జువాన్లె (చైనా) జంటపై గెలిచింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో ఆయుష్ రుద్రరాజు, గుర్నిహాల్ సింగ్ గర్చా, అభయ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 343 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో గుర్నిహాల్ రజత పతకాన్ని సాధించాడు. -
ఆసియా చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు రజతం
దోహా: ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత స్టార్ షూటర్ సౌరభ్ చౌదరి.. ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ రజత పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో మెరిసిన సౌరభ్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ పసిడి పతకాన్ని ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ గెలుచుకున్నాడు. ఫైనల్ పోరులో కిమ్ సాంగ్ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్ 221.8 పాయింట్లతో కాంస్య సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్‌తో పాటు అభిషేక్ వర్మ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినా ఐదో స్థానంతోనే సంతృప్తి చెందాడు. ఎనిమిది మంది పాల్గొన ఫైనల్లో అభిషేక్ 181.5 పాయింట్లు నమోదు చేశాడు. కాగా, అభిషేక్ వర్మ కూడా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. -
భళారే.. భారత్
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ అదరగొట్టింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్ మిక్స్డ్ డబుల్స్ జోడి మను బాకర్-సౌరవ్ చౌధురీలు పసిడిని ఖాతాలో వేసుకున్నారు. దాంతో రియో డి జనీరో పర్యటనను స్వర్ణంతో భారత్ ముగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తంగా ఐదు స్వర్ణ పతకాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. ఫలితంగా ఈ ఏడాది వేర్వేరు వేదికల్లో జరిగన నాలుగు ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్‌కప్ ఈవెంట్లలోనూ భారత్ టాప్‌ను దక్కించుకుంది. మను బాకర్-సౌరవ్ చౌధరీలు స్వర్ణాన్ని సాధించే క్రమంలో మరో భారత జోడి యశస్విని దేశ్వాయ్-అభిషేక్ వర్మలపై పైచేయి సాధించారు. మనుబాకర్-సౌరవ్లు 17-15 తేడాతో యశస్విని- అభిషేక్‌లపై విజయం సాధించి పసిడి కైవసం చేసుకున్నారు. -
సౌరభ్, రాహీ డబుల్ ధమాకా
మ్యూనిక్ (జర్మనీ): భారత షూటర్లు మళ్లీ బంగారు గురితో భళా అనిపించారు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ రెండు స్వర్ణాలను అందించారు. ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ చౌధరీ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన షాజర్ రిజ్వీ 177.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 586 పాయింట్లు, షాజర్ రిజ్వీ 583 పాయింట్లు సాధించి వరుసగా రెండు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో రాహీ 586 పాయింట్లు, మను 585 పాయింట్లు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. -
వరల్డ్ కప్ షూటింగ్ : భారత్‌కు మరో స్వర్ణం
మ్యూనిక్ (జర్మనీ) : అంతర్జాతీయ షూటింగ్ క్రిడా సమాఖ్య (ఏఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే అపూర్వి చండేలా రూపంలో భారత్‌కు ఒక స్వర్ణం రాగా.. సోమవారం మరో గోల్డ్ పతకం వచ్చి చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురి తప్పని సౌరభ్ చౌదరీ.. భారత్ కు మరో గోల్డ్ అందించాడు. ఫైనల్లో మొత్తం 246.3 పాయింట్లతో తన పాత రికార్డును(245 పాయింట్లు) బద్దలు కొడుతూ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా సౌరభ్ చౌదరి నిలిచాడు. (చదవండి : అపూర్వీ పసిడి గురి) ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అపూర్వి చండేలా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్లతో ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
భారత షూటర్ల పసిడి గురి
బీజింగ్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మూడో రోజు భారత యువ షూటర్లు అదరగొట్టారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్–సౌరభ్ చౌధరీ ద్వయం ఫైనల్లో 16–6తో పాంగ్ వె–జియాంగ్ రాన్‌జిన్ (చైనా) జంటను ఓడించి పసిడి పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్–దివ్యాంశ్ సింగ్ జోడీ 17–15తో లియు రుజువాన్–యాంగ్ హావోరన్ (చైనా) ద్వయంపై గెలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. -
మళ్లీ మెరిసిన మను
న్యూఢిల్లీ: భారత యువ షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరీలు మళ్లీ స్వర్ణంపై గురి పెట్టారు. చైనీస్ తైపీలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు తమ పసిడి పతకాల్ని డబుల్ చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో మను భాకర్ బంగారు పతకం నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో 575 పాయింట్లు స్కోరు చేసిన మను... ఫైనల్లో 239 పాయింట్లు సాధించింది. షి హో చింగ్ (హాంకాంగ్–237.9 పాయింట్లు) రజతం... అలాలీ వఫా (యూఏఈ– 216.8 పాయింట్లు) కాంస్యం సాధించారు. మను భాకర్, శ్రీనివేత, అనురాధాలతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1702 పాయింట్లతో కాంస్యం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌టీమ్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, రవీందర్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం గెల్చుకుంది. భారత బృందం మొత్తం 1742 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. సౌరభ్, అభిషేక్ వర్మ, రవీందర్ ఫైనల్ చేరుకోగా... అభిషేక్ వర్మ (240.7 పాయింట్లు) రజతం సాధించాడు. సౌరభ్ నాలుగో స్థానంలో, రవీందర్ సింగ్ ఏడో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు భారత్ ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం గెలిచింది. -
మను–సౌరభ్ జంట బంగారు గురి
న్యూఢిల్లీ: టీనేజ్ భారత షూటర్లు మను భాకర్–సౌరభ్ చౌధరీ ద్వయం ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. చైనీస్ తైపీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను–సౌరభ్ ద్వయం విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 17 ఏళ్ల మను, 16 ఏళ్ల సౌరభ్ జతగా 784 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు విటాలినా బత్సరష్‌కినా–అర్తెమ్ చెర్ముసోవ్ (రష్యా–782 పాయింట్లు) పేరిట ఉండేది. ఫైనల్లో మను–సౌరభ్ జంట 484.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. హవాంగ్ సియోన్‌జెయున్–కిమ్ మోస్ (కొరియా–481.1 పాయింట్లు) జంట రజతం... వు చియా యింగ్–కు కువాన్ టింగ్ (చైనీస్ తైపీ–413.3 పాయింట్లు) జోడీ కాంస్యం గెల్చుకున్నాయి. ఇషా–విజయ్‌వీర్ జంటకు స్వర్ణం ఇదే టోర్నీ జూనియర్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ తన భాగస్వామి విజయ్‌వీర్ సిద్ధూతో కలిసి స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఇషా–విజయ్‌వీర్ ద్వయం 478.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్‌లో ఇషా–విజయ్‌వీర్ జంట 769 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన హర్షద–అర్జున్ సింగ్ చీమా జోడీ 755 పాయింట్లతో ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఈ ద్వయం 375 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. -
స్వర్ణంతో సమాప్తం
న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్ చివరి రోజు భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో సౌరభ్ చౌధరీ–మను భాకర్ జంట పసిడి పతకం గెల్చుకుంది. దాంతో ఈ మెగా ఈవెంట్‌ను భారత్ స్వర్ణంతో ముగించింది. ఓవరాల్‌గా హంగేరి, భారత్ మూడు స్వర్ణాల చొప్పున సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువడం విశేషం. భారత షూటర్లు రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పడంతోపాటు ఒక ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకున్నారు. టోర్నమెంట్ ఆఖరి రోజు బుధవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో సౌరభ్ చౌధరీ–మను భాకర్ జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. రాన్‌జిన్ జియాన్–బోవెన్ జాంగ్ (చైనా–477.7 పాయింట్లు) జోడీ రజతం... మిన్‌జుంగ్ కిమ్–డేహన్ పార్క్ (కొరియా–418.8 పాయింట్లు) ద్వయం కాంస్యం సొంతం చేసుకున్నాయి. 39 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్–మను జోడీ 778 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డును సమం చేయడంతోపాటు అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. టాప్–5 జోడీలు ఫైనల్లోకి ప్రవేశించాయి. అంతకుముందు జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవి కుమార్–అంజుమ్ మౌద్గిల్ (భారత్) జంట క్వాలిఫయింగ్‌లో 836.3 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. -
వరల్డ్ రికార్డుతో ‘తొలి’ స్వర్ణం
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత పసిడి వేట కొనసాగుతోంది. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఆదివారం భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి పసిడి పతకం సాధించాడు. తొలిసారి సీనియర్ విభాగంలో వరల్డ్‌కప్‌లో పాల్గొన సౌరభ్.. వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 245.0 పాయింట్లతో సౌరభ్ చౌదరి వరల్డ్ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: ప్రపంచ రికార్డు... పసిడి పతకం) ఫైనల్లో పొడియం పొజిషన్‌ను సాధించిన సౌరభ్ కడవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే సెర్బియాకు చెందిన స్టార్ షూటర్ దామిర్ మికెక్పై వెనుక్కినెట్టి పసిడితో మెరిశాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఫలితంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తును ఖాయం చేసుకున్నాడు. గతేడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో కూడా వరల్డ్ రికార్డు సౌరభ్ చౌదరి పేరిటే ఉంది. నిన్న మొదలైన ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. -
మను–సౌరభ్ జంటకు స్వర్ణం
కువైట్ సిటీ: యువ షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి జోరు కొనసాగిస్తున్నారు. ఇటీవల యూత్ లో స్వర్ణాలు నెగ్గిన ఈ ఇద్దరు ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో పసిడిని చేజిక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను–సౌరభ్ జంట 485.4 పాయింట్లు స్కోరు చేసి జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. సౌరభ్‌కు ఈ టోర్నీలో ఇది మూడో స్వర్ణం. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాడు. వాంగ్ జియాయు–జీ హాంగ్ సుఖి (చైనా, 477.9 పాయింట్లు) జోడీకి రజతం, వాంగ్–హాంగ్ (చైనా, 413.5) జంటకు కాంస్యం లభించాయి. భారత్‌కే చెందిన మరో ద్వయం అభిజ్ఞ పాటిల్–అన్మోల్ జైన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో మను–సౌరభ్ 762, అభిజ్ఙ–అన్మోల్ 760 పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరారు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 11 (4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు సాధించింది. -
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు స్వర్ణం
భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో సౌరభ్ 239.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. అర్జున్ (భారత్, 237.7 పాయింట్లు) రజతం, హువాంగ్ వై టి (చైనీస్‌తైపీ, 218 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు. టీమ్ విభాగంలో సౌరభ్, అర్జున్ సింగ్ చీమా, అన్మోల్ జైన్‌లతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లతో పసిడి చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 10 (3 స్వర్ణ, 5 రజత, 2 కాంస్య) పతకాలు సాధించింది. -
పసిడి బుల్లెట్..
భారత ‘గన్’ మళ్లీ గర్జించింది. గురి చూసి మళ్లీ పసిడి పతకాన్ని కొట్టింది. మంగళవారం మను భాకర్ బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... బుధవారం సౌరభ్ చౌధరీ బుల్లెట్‌కు మరో స్వర్ణం సొంతమైంది. ఫలితంగా యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. ఓవరాల్‌గా భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం 6 పతకాలతో మూడోస్థానంలో ఉంది. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఇటీవలే ఆసియా క్రీడల్లో, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన స్వర్ణ పతకాలు గాలివాటమేమీ కాదని 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా గురి తప్పని ప్రదర్శనతో యూత్ ఒలింపిక్స్‌లోనూ అదరగొట్టాడు. ఫలితంగా బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ బంగారు పతకాన్ని కొల్లగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ ఫైనల్లో 244.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. సుంగ్ యున్హో (దక్షిణ కొరియా–236.7 పాయింట్లు) రజతం, సొలారీ జాసన్ (స్విట్జర్లాండ్–215.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. సౌరభ్, సుంగ్ యున్హో మధ్య ఏకంగా 7.5 పాయింట్ల తేడా ఉండటం భారత షూటర్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లోనూ సౌరభ్ తన జోరు ప్రదర్శించాడు. 580 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. కాంస్యం కోసం అర్చన పోరు... టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ కాంస్య పతకానికి విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో అర్చన 3–11, 7–11, 6–11, 11–1, 5–11తో సున్ యింగ్షా (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం ఆండ్రియా (రొమేనియా)తో అర్చన ఆడనుంది. హాకీ జట్టుకు తొలి ఓటమి... ఫైవ్–ఎ–సైడ్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆతిథ్య అర్జెంటీనాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడింది. భారత్ తరఫున రీత్, ముంతాజ్ ఖాన్ ఒక్కో గోల్ చేశారు. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు సాధించి 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
మళ్లీ మెరిసిన సౌరభ్ చౌదరి
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గి సంచలనం సృష్టించిన 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి అదే జోరును ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కొనసాగించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్లో అతను బంగారు పతకం సాధించాడు. ఈ పోటీలో సౌరభ్ 245.5 స్కోరుతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (243.7 పాయింట్లు)ను తానే అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. జర్మనీలో జూన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. హోజిన్ లిమ్ (243.1 పాయింట్లు; కొరియా) రజతం నెగ్గగా, అర్జున్ సింగ్ చీమా (218 పాయింట్లు; భారత్) కాంస్యం గెలిచాడు. పలు టీమ్ ఈవెంట్లలో భారత షూటర్లు పతకాలపై గురి పెట్టారు. జూనియర్ పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో అమన్ అలీ, వివాన్ కపూర్, మానవాదిత్య సింగ్ రాథోడ్‌లతో కూడిన భారత బృందం (348 పాయింట్లు) రజత పతకం గెలిచింది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ బృందం (1738 పాయింట్లు) రజతం సాధించింది. -
స్వర్ణం 'సౌరభం'...
ఒకవైపు ప్రత్యర్థులుగా మాజీ విశ్వవిజేతలు... మాజీ ఒలింపిక్ చాంపియన్లు... ప్రపంచకప్‌లో పతకాలు గెలిచినవారు.. మరోవైపు నూనుగు మీసాల కుర్రాడు... తన ప్రత్యర్థుల్లో కొందరి అనుభవమంత వయసు కూడా అతనికి లేదు... అసలే జట్టులో అతని ఎంపికపై విమర్శలు... షాట్ షాట్‌కు ఆధిక్యం తారుమారయ్యే పరిస్థితులు... ఇలాంటి స్థితిలో ఆ కుర్రాడు మాత్రం ఒక్కో బుల్లెట్‌ను లక్ష్యంలోకి దించాడు... ఒక్కోషాట్తో దిగ్గజాలను వెనక్కి నెట్టాడు... చివరకు అందర్నీ అబ్బురపరుస్తూ ‘పసిడి’ గురితో భళా అనిపించాడు. తన పిస్టల్‌తోనే అందరికీ సమాధానం ఇచ్చి ఆసియా క్రీడల వేదికపై మువ్వన్నెలను రెపరెపలాడించిన ఆ యువ షూటరే 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలీనా గ్రామానికి చెందిన సౌరభ్ మంగళవారం ఆసియా క్రీడల్లో అద్భుతమే చేశాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ‘టాప్’గా నిలిచి... అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి ఆసియా క్రీడల రికార్డు ప్రదర్శనతో స్వర్ణకాంతులు విరజిమ్మి ఈ క్రీడాంశంలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం, మూడు కాంస్యాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 10 పతకాలతో ఏడో స్థానంలో ఉంది. పాలెంబంగ్: విజయకాంక్ష ఉండాలేగానీ బరిలో ఏస్థాయి వారున్నా అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని భారత యువ పిస్టల్ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల సౌరభ్ బంగారు పతకాన్ని సాధించాడు. 24 షాట్లతో కూడిన ఫైనల్లో సౌరభ్ 240.7 పాయింట్లు స్కోరు చేసి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2010 ప్రపంచ చాంపియన్, 42 ఏళ్ల తొమోయుకి మత్సుదా (జపాన్–239.7 పాయింట్లు) రజతం నెగ్గగా... భారత్‌కే చెందిన 29 ఏళ్ల అభిషేక్ వర్మ (219.3 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత... 2010, 2014 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో టీమ్ ఈవెంట్లో పసిడి పతకాలు నెగ్గిన 38 ఏళ్ల కొరియా దిగ్గజ షూటర్ జిన్ జొంగో ఐదో స్థానంతో... 35 ఏళ్ల కజకిస్తాన్ షూటర్ వ్లాదిమిర్ ఇసాచెంకో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 40 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్ అందరికంటే ఎక్కువగా 586 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. న్యాయవాద వృత్తిలో ఉన్న అభిషేక్ వర్మ మూడేళ్ల క్రితమే ఈ క్రీడలో అడుగు పెట్టాడు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే కాంస్యాన్ని దక్కించుకున్నాడు. మిక్స్డ్ ట్రాప్ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జంట లక్షయ్ షెరాన్, శ్రేయసి సింగ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్క షాట్‌తో తారుమారు... ఫైనల్లో చివరి సిరీస్‌లోని రెండు షాట్లే సౌరభ్‌కు స్వర్ణాన్ని ఖాయం చేశాయి. 22 షాట్లు పూర్తయ్యాక మత్సుదా 220.4 పాయింట్లతో అగ్రస్థానంలో... సౌరభ్ 220.1 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 23వ షాట్లో మత్సుదా 8.9 స్కోరు చేయగా... సౌరభ్ 10.2 కొట్టాడు. దాంతో సౌరభ్ 230.3తో తొలి స్థానంలోకి రాగా... మత్సుదా 229.3తో రెండో స్థానానికి పడిపోయాడు. చివరి షాట్లో మత్సుదా 10.3 కొట్టగా... సౌరభ్ 10.4 స్కోరు చేశాడు. దాంతో సౌరభ్ పాయింట్ తేడాతో పసిడి సొంతం చేసుకోగా.. మత్సుదా రజతంతో సరిపెట్టుకున్నాడు. మూడేళ్లలో పైపైకి... సరదా కోసం 2015లో షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సౌరభ్ ఏడాది తిరిగేలోపు ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడి రజతం సాధించాడు. ఆ తర్వాతి సంవత్సరం ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు. ఈ ఏడాది జూన్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకాన్ని సాధించాడు. పోటీలు లేని సమయంలో మీరట్‌లోని అమిత్ షెరాన్ అకాడమీలో... జాతీయ శిబిరాల సమయంలో భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో సౌరభ్ శిక్షణ తీసుకుంటాడు. సౌరభ్ తండ్రి జగ్మోహన్ సింగ్ చెరకు రైతు. ఖాళీగా ఉన్న సమయంలో సౌరభ్ పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ‘నేను ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఒత్తిడితో ఎలాంటి ఉపయోగం కూడా లేదు. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం’ అని సౌరభ్ అన్నాడు. ►ఆసియా క్రీడల చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన ఐదో భారతీయ షూటర్ సౌరభ్. గతంలో రణ్‌ధీర్ సింగ్ (1978), జస్పాల్ రాణా (1994, 2006), రంజన్ సోధి (2010), జీతూ రాయ్ (2014) ఈ ఘనత సాధించారు. సెకనులో వందో వంతు తేడాతో... పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత స్విమ్మర్ వీర్‌ధవల్ ఖడేను దురదృష్టం వెంటాడింది. కేవలం సెకనులో వందో వంతు తేడాతో అతడు కాంస్యం చేజార్చుకున్నాడు. ఫైనల్లో ఖడే 22.47 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. అయితే, జపాన్‌కు చెందిన షునిచి నకావ్ (22.46)... అతడి కంటే .01 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం ఎగురేసుకుపోయాడు. పతకం కోల్పోయినా, 26 ఏళ్ల ఖడే ఎనిమిదేళ్లుగా తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (22.52 సెకన్లు)ను సవరించాడు. ఇదే విభాగంలో అన్షుల్ కొఠారి (23.83 సెకన్లు)... 28వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఉద్యోగం వస్తుందని ఆశ... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత సీనియర్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తొలిసారి ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం సాధించాడు. ఫైనల్లో 37 ఏళ్ల సంజీవ్ 452.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచాడు. 18 ఏళ్లకే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందిన సంజీవ్ 2014లో హరియాణా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో అతను నేవీ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సంజీవ్‌కు ఇచ్చిన హామీ నెరవేరలేదు. రెండేళ్లు ఖాళీగా ఉన్న అతను 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో కోచ్‌గా విధుల్లోకి చేరాడు. అయితే గతేడాది అతనిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ‘సాయ్’ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ‘తాజా ప్రదర్శనతో మళ్లీ నాకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా తర్వాతి లక్ష్యం’ అని సంజీవ్ అన్నాడు. సెపక్‌తక్రాలో తొలిసారి కాంస్యం... 1990 నుంచి ఆసియా క్రీడల్లో మెడల్ ఈవెంట్‌గా ఉన్న సెపక్‌తక్రాలో తొలిసారి భారత్ కాంస్య పతకం సాధించింది. పటిష్టమైన థాయ్‌లాండ్ జట్టుతో మంగళవారం జరిగిన రెగూ ఈవెంట్ సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయి కాంస్యం ఖాయం చేసుకుంది. 2006లో తొలిసారి ఈ క్రీడలో పోటీపడిన భారత్ నాలుగో ప్రయత్నంలో పతకం నెగ్గడం విశేషం. భారత్ 21 – 0 కజకిస్తాన్ మహిళల హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21–0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఐదు, గుర్జీత్ కౌర్ నాలుగు, లల్రెమ్సియామి, వందనా కటారియా మూడేసి గోల్స్ కొట్టారు. భారత్ మరొక్క గోల్ చేసి ఉంటే... 1982 ఆసియా క్రీడల్లో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 22–0 రికార్డు స్కోరును అందుకునేది. దివ్య పట్టుకు కాంస్యం రెజ్లింగ్‌లో భారత్‌కు మరోపతకం వచ్చింది. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ కాంస్య పతకాన్ని సాధించింది. చెన్ వెన్లింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన కాంస్య పతక బౌట్లో దివ్య ఒక నిమిషం 29 సెకన్లలో విజయాన్ని అందుకుంది. మరోవైపు 76 కేజీల విభాగంలో కిరణ్ క్వార్టర్ ఫైనల్లో 2–4తో ఐపెరి మెడిట్కిజి (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత్‌కు చెందిన జ్ఞానేందర్ (60 కేజీలు)... మనీశ్ (67 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. వాల్ట్ ఫైనల్లో అరుణా రెడ్డి మహిళల జిమ్నాస్టిక్స్‌లో భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. వాల్ట్‌లో ప్రణతి నాయక్ (13.425), హైదరాబాద్ అమ్మాయి అరుణారెడ్డి (13.350)లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు వెళ్లారు. స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన ఆమె...బీమ్‌లో మాత్రం ముందడుగేసింది. టీమ్ విభాగంలో దీపా, ప్రణతి, అరుణ, ప్రణతి దాస్లతో కూడిన భారత బృందం ఏడో స్థానంలో నిలిచింది. బుధవారం టీమ్ విభాగంలో ఫైనల్స్ ను నిర్వహిస్తారు. సెమీస్‌లో కబడ్డీ జట్లు కీలకమైన విజయాలతో భారత కబడ్డీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో పురుషుల జట్టు 49–30తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్‌లో భారత్... బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలిచి, దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. కొరియా మ్యాచ్‌లు పూర్తయ్యాక.. గ్రూప్ టాపర్ ఎవరో తేలనుంది. మరోవైపు మహిళల జట్టు శ్రీలంకను 38–12తో, ఇండోనేసియాను 54–22తో ఓడించింది. అంతకుముందు జపాన్, థాయ్లాండ్లపైనా విజయం సాధించడంతో గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచినట్లైంది. సెమీఫైనల్స్ గురువారం జరుగనున్నాయి. -
ఏషియన్ గేమ్స్ భారత షూటర్ల హవా
-
ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
-
ఏషియన్ గేమ్స్: పరిమళించిన యువ ‘సౌరభం’
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. తొలి రోజు మెన్స్ విభాగంలో రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం సాధిస్తే, రెండో రోజు వుమెన్స్ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పసిడితో మెరిశారు. ఇక మూడో రోజు భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించారు. మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భాగంగా ఫైనల్ పోరులో సౌరభ్ చౌదరి 240.7 పాయింట్లు సాధించి పసిడిని ఖాతాలో వేసుకున్నారు. తొలి రౌండ్ నుంచే ఆకట్టుకున్న 16 ఏళ్ల సౌరభ్.. ఏషియన్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రికార్డు స్కోరు సాధించి స్వర్ణాన్ని ఒడిసి పట్టుకున్నాడు. కాగా, ఇదే విభాగంలో మరో భారత షూటర్ అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు క్యాంస్యలు ఉన్నాయి. చదవండి: ‘పసిడి’ కాంత బజరంగ్ బంగారం