
బీజింగ్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మూడో రోజు భారత యువ షూటర్లు అదరగొట్టారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రెండు స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్–సౌరభ్ చౌధరీ ద్వయం ఫైనల్లో 16–6తో పాంగ్ వె–జియాంగ్ రాన్‌జిన్ (చైనా) జంటను ఓడించి పసిడి పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్–దివ్యాంశ్ సింగ్ జోడీ 17–15తో లియు రుజువాన్–యాంగ్ హావోరన్ (చైనా) ద్వయంపై గెలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment