International Shooting Championship
-
Shooting World Cup: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
చాంగ్వాన్ (దక్షిణకొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకంపై గురిపెట్టాడు. జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన ప్రతాప్‌కు సీనియర్ స్థాయిలో ఇది రెండో స్వర్ణం. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ మధ్యప్రదేశ్ షూటర్ విజేతగా నిలిచాడు. పురుషుల ఈవెంట్లో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 52 మంది తలపడగా... ప్రతాప్ సింగ్ 593 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇద్దరు భారత షూటర్లు చైన్ సింగ్ (586), సంజీవ్ రాజ్‌పుత్ (577)లు కూడా పోటీపడినప్పటికీ పతకం బరిలో నిలువలేకపోయారు. -
భారత షూటర్ల పసిడి గురి
బీజింగ్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మూడో రోజు భారత యువ షూటర్లు అదరగొట్టారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్–సౌరభ్ చౌధరీ ద్వయం ఫైనల్లో 16–6తో పాంగ్ వె–జియాంగ్ రాన్‌జిన్ (చైనా) జంటను ఓడించి పసిడి పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్–దివ్యాంశ్ సింగ్ జోడీ 17–15తో లియు రుజువాన్–యాంగ్ హావోరన్ (చైనా) ద్వయంపై గెలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. -
రజతం నెగ్గిన హీనా
న్యూఢిల్లీ: హ నోవర్ అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు హీనా సిద్ధూ, అభినవ్ బింద్రా రజత, కాంస్య పతకాలతో రాణించారు. జర్మనీలో జరిగిన ఈ టోర్నీలో హీనా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 199.1 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన సాండ్రా హార్నంగ్ 199.4 పాయింట్లతో స్వర్ణాన్ని నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతను 184.5 పాయింట్లు స్కోరు చేశాడు. జాన్ లాచ్బిలర్ (స్విట్జర్లాండ్-206.2 పాయింట్లు), నికోలస్ స్కాలెన్బెర్గర్ (జర్మనీ- 204.5) స్వర్ణ, రజత పతకాలు సాధించారు.