
చాంగ్వాన్ (దక్షిణకొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్‌లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకంపై గురిపెట్టాడు. జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన ప్రతాప్‌కు సీనియర్ స్థాయిలో ఇది రెండో స్వర్ణం. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ మధ్యప్రదేశ్ షూటర్ విజేతగా నిలిచాడు.
పురుషుల ఈవెంట్‌లో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 52 మంది తలపడగా... ప్రతాప్ సింగ్ 593 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇద్దరు భారత షూటర్లు చైన్ సింగ్ (586), సంజీవ్ రాజ్‌పుత్ (577)లు కూడా పోటీపడినప్పటికీ పతకం బరిలో నిలువలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment