Shooting World Cup
-
WC: ఏపీ షూటర్ ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణం
గ్రనాడా (స్పెయిన్): ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. సోమవారం జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఉమామహేశ్ బంగారు పతకం నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కూడా పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఉమామహేశ్–ఇషా తక్సాలె (భారత్) జోడీ 16–8 పాయింట్ల తేడాతో అన్వీ రాథోడ్–అభినవ్ షా (భారత్) జంటను ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్‌కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
స్కీట్‌లో గనీమత్ జాతీయ రికార్డు సమం
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో మహిళల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ జాతీయ రికార్డును సమం చేసింది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల గనీమత్ క్వాలిఫయింగ్‌లో 125 పాయింట్లకుగాను 120 పాయింట్లు స్కోరు చేసింది. అయితే ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. షూట్ ఆఫ్‌లో గనీమత్ గురి తప్పి టాప్–8లో నిలువలేకపోయింది. భారత్‌కే చెందిన దర్శన రాథోడ్ 117 పాయింట్లతో 25వ స్థానంలో, మహేశ్వరి చౌహాన్ 116 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచారు. -
‘మిక్స్డ్’లో పసిడి కాంతులు
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్‌లో భారత జోడీలు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాయి. ఎయిర్ రైఫిల్ విభాగంలో నర్మద నితిన్ రాజు–రుద్రాం, బాలాసాహెబ్ పాటిల్ జోడీ... ఎయిర్ పిస్టల్ విభాగంలో వరుణ్ తోమర్–రిథమ్ సాంగ్వాన్ జోడీ విజేతగా నిలిచాయి. ఎయిర్ రైఫిల్ టీమ్ మిక్స్డ్ ఫైనల్లో తమిళనాడుకు చెందిన నర్మద, మహారాష్ట్రకు చెందిన రుద్రాం„Š జోడీ 16–6తో ఎస్తెర్ డెనిస్–ఇస్త్వాన్ పెని (హంగేరి) ద్వయంపై గెలిచింది. క్వాలిఫయింగ్ రౌండ్లో నర్మద–రుద్రాం, 635.8 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఫైనల్లో వరుణ్–రిథమ్ ద్వయం 16–10తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) జోడీని ఓడించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో వరుణ్–రిథమ్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వరుణ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
Shooting World Cup: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
చాంగ్వాన్ (దక్షిణకొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకంపై గురిపెట్టాడు. జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన ప్రతాప్‌కు సీనియర్ స్థాయిలో ఇది రెండో స్వర్ణం. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఈ మధ్యప్రదేశ్ షూటర్ విజేతగా నిలిచాడు. పురుషుల ఈవెంట్లో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 52 మంది తలపడగా... ప్రతాప్ సింగ్ 593 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇద్దరు భారత షూటర్లు చైన్ సింగ్ (586), సంజీవ్ రాజ్‌పుత్ (577)లు కూడా పోటీపడినప్పటికీ పతకం బరిలో నిలువలేకపోయారు. -
Shooting World Cup 2022: భారత్‌కు మరో స్వర్ణం, రజతం
దక్షిణకొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ గురువారం మరో స్వర్ణం, రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం లభించింది. అర్జున్ బబుటా, తుషార్ మానే, పార్థ్ మఖీజా సభ్యులుగా ఉన్న భారత బృందం ఫైనల్లో 17–15 తేడాతో ఆతిథ్య కొరియా టీమ్‌పై విజయం సాధించింది. అదే విధంగా.. మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం లభించింది. ఎలవెనిల్ వలరివన్, మెహులీ ఘోష్, రమిత సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో కొరియా చేతిలోనే 10–16తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం లభించింది. -
భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌లో భారత్ గురి కుదిరింది. మరో పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ మెహులి ఘోష్– షాహు తుషార్ మనే జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో ఓడినా... కనీసం రజతమైనా దక్కుతుంది. 60 షాట్ల క్వాలిఫయర్స్‌లో భారత జోడీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 30 జంటలు ఇందులో గురిపెట్టగా... మెహులి–తుషార్ ద్వయం 634.4 స్కోరుతో టాప్‌లేపింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, హంగేరి జోడీలు పసిడి పతకం కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శివ నర్వాల్–పాలక్ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత పొందింది. -
ఇషా పసిడి గురి.. షూటింగ్ వరల్డ్ కప్‌లో మూడో స్వర్ణం సాధించిన హైదరాబాదీ
న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ తన ఖాతాలో మరో స్వర్ణ పతకం వేసుకుంది. జర్మనీలో మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది. ఇదే టోర్నీలో ఇషా సింగ్ మిక్సడ్ టీమ్ పిస్టల్ ఈవెంట్‌తో పాటు మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పంకజ్ ముఖేజా, సిఫ్ట్ కౌర్ సమ్రా (భారత్) జట్టు రజతం సాధించింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
ఇషా సింగ్–సౌరభ్ జోడీకి స్వర్ణం
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సౌరభ్ చౌదరీ (భారత్) ద్వయం 16–12తో పలక్–సరబ్‌జ్యోత్ (భారత్) జంటను ఓడించి స్వర్ణ పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రమిత–పార్థ్ (భారత్) జంట 13–17తో జూలియా–విక్టర్ (పోలాండ్) జోడీ చేతిలో ఓడి రజతం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పలక్ స్వర్ణం, మనూ రజతం గెల్చుకున్నారు. -
ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పతకం లభించింది. ఇటలీలో శనివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, వివాన్ కపూర్, పృథ్వీరాజ్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో భారత్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. -
షూటింగ్ ప్రపంచ కప్ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక షూటింగ్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు కోవిడ్–19 వైరస్ అడ్డుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుండటంతో పాటు... దేశంలో కూడా పలు కేసులు నమోదు కావడంతో ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 25 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో 31 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం... కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్ దేశాలపై భారత ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించడంతో టోర్నీని ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) తెలిపింది. అంతేకాకుండా టోర్నీలో పాల్గొనే 22 దేశాలు కూడా చివరి నిమిషంలో వైదొలిగాయని పేర్కొంది. అయితే షూటింగ్ ప్రపంచ కప్‌ను రెండు దశల్లో నిర్వహించే విషయమై పరిశీలిస్తున్నామని ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంది. మే 5 నుంచి 12 మధ్య రైఫిల్, పిస్టల్ ఈవెంట్లను... జూన్ 2–9 మధ్య షాట్‌గన్ షూటింగ్ పోటీలను నిర్వహించాలని ఎన్ఆర్ఏఐ తమను కోరినట్లు ఐఎస్ఎస్ఎఫ్ తెలిపింది. దీంతో పాటు ఏప్రిల్ 16 నుంచి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ కూడా రద్దు అయింది. బయోమెట్రిక్‌కు ‘బ్రేక్’ ఇచ్చిన ‘సాయ్’ అథ్లెట్లు, సిబ్బంది హాజరు కోసం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తెలిపింది. బయోమెట్రిక్ ద్వారా కోవిడ్–19 ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘సాయ్’ తెలిపింది. అనుకున్న సమయానికే ఐపీఎల్: గంగూలీ కోవిడ్ దెబ్బకు ఒక్కో టోర్నీ వాయిదా పడుతున్నా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ సీజన్–13 అనుకున్న తేదీనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశాడు. వైరస్ ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని... దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభమవుతుంది. -
షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
న్యూఢిల్లీ: సైప్రస్ వేదికగా మార్చి 4 నుంచి 13 వరకు జరిగే ప్రపంచ షూటింగ్ ప్రపంచ కప్ నుంచి భారత్ వైదొలిగింది. కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో భార త షూటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని దేశాలకు భారతీయులు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిదంటూ ఈ నెల 26న తెలిపింది. ఆ దేశాల జాబితాలో సైప్రస్ ఉండటంతో భారత షూటర్లు షూటింగ్ ప్రపంచ కప్ ఈవెంట్‌కు దూరమయ్యారు. -
మను భాకర్ స్వర్ణ సంబరం
పుతియాన్ (చైనా): షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత్ ఘనంగా ముగించింది. పోటీల చివరి రోజు శుక్రవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరీ, షాజర్ రిజ్వీ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివాన్ష్ సింగ్ స్వర్ణం, అపూర్వీ చండేలా రజతం గెల్చుకున్నారు. ఫైనల్లో మను (భారత్)–చెర్నూసోవ్ (రష్యా) ద్వయం 17–13 పాయింట్లతో సౌరభ్ (భారత్)–అన్నా కొరాకకీ (గ్రీస్) జోడీపై విజయం సాధించింది. కాంస్య పతకం మ్యాచ్‌లో రిజ్వీ (భారత్)–జొరానా (సెర్బియా) జంట 17–15తో వు జియావు (చైనా)–వితాలినా (రష్యా) జోడీపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో దివాన్ష్ (భారత్)–నెజానా (క్రొయేషియా) ద్వయం 16–14తో జాంగ్ చాంగ్‌హోంగ్ (చైనా)–అపూర్వీ చండేలా (భారత్) జంటపై గెలిచి స్వర్ణం గెలిచింది. -
భళారే.. భారత్
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ అదరగొట్టింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్ మిక్స్డ్ డబుల్స్ జోడి మను బాకర్-సౌరవ్ చౌధురీలు పసిడిని ఖాతాలో వేసుకున్నారు. దాంతో రియో డి జనీరో పర్యటనను స్వర్ణంతో భారత్ ముగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తంగా ఐదు స్వర్ణ పతకాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. ఫలితంగా ఈ ఏడాది వేర్వేరు వేదికల్లో జరిగన నాలుగు ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్‌కప్ ఈవెంట్లలోనూ భారత్ టాప్‌ను దక్కించుకుంది. మను బాకర్-సౌరవ్ చౌధరీలు స్వర్ణాన్ని సాధించే క్రమంలో మరో భారత జోడి యశస్విని దేశ్వాయ్-అభిషేక్ వర్మలపై పైచేయి సాధించారు. మనుబాకర్-సౌరవ్లు 17-15 తేడాతో యశస్విని- అభిషేక్‌లపై విజయం సాధించి పసిడి కైవసం చేసుకున్నారు. -
అభిషేక్‌కు స్వర్ణం, సౌరభ్‌కు కాంస్యం
రియో డి జనీరో: ప్రపంచ కప్ షూటింగ్లో భారత్ జోరు కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అయిన అభిషేక్ వర్మ బంగారు పతకంతో మెరవగా, 17 ఏళ్ల సౌరభ్ చౌదరికి కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో అభిషేక్ 244.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 221.9 పాయింట్లు స్కోర్ చేసిన సౌరభ్‌కు మూడో స్థానం దక్కింది. టర్కీకి చెందిన ఇస్మాయిల్ కెలెస్ 243.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. ప్రస్తుతం భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అభిషేక్, సౌరభ్ ఇద్దరూ గత క్వాలిఫయింగ్ టోర్నీలోనే రాణించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచిన చింకీ యాదవ్ త్రుటిలో ఫైనల్ అవకాశం చేజార్చుకుంది. -
భారత్‌కు మరో స్వర్ణం
రియో డి జనీరో(బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ అభిషేక్ వర్మ పసిడితో మెరిశాడు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది తుది పోరుకు అర్హత సాధించగా అభిషేక్ వర్మ టాప్‌లో నిలిచాడు. మొత్తంగా ఫైనల్లో 244.2 పాయింట్లతో అభిషేక్ స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇక ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ సౌరభ్ చౌధరీ కాంస్యతో సరిపెట్టుకున్నాడు. చౌధరి 221.9 పాయింట్లతో కాంస్య సాధించాడు. రజత పతకాన్ని టర్కీకి చెందిన ఇస్మాయిల్ కీల్స్ చేజిక్కించుకున్నాడు. 243.1 పాయింట్లతో ఇస్మాయిల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేణి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్ పతకాల పట్టికలో టాప్కు చేరింది. -
సంజీవ్‌కు రజతం
రియో డి జనీరో (బ్రెజిల్): ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మరో పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. దాంతోపాటు భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో సంజీవ్ 462 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. పీటర్ గోర్సా (క్రొయేషియా-462.2 పాయింట్లు) స్వర్ణం, జాంగ్ చాంగ్‌హాంగ్ (చైనా-449.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఆఖరి షాట్ వరకు పాయింట్ ఆధిక్యంలో ఉండి పసిడి రేసులో నిలిచిన సంజీవ్ చివరి షాట్లో 8.8 పాయింట్ల షాట్ కొట్టి మూల్యం చెల్లించుకున్నాడు. పీటర్ గోర్సా చివరి షాట్లో 10 పాయింట్ల షాట్ కొట్టి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేనిల్ వలరివాన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అభిషేక్ వర్మ, సౌరభ్ చౌధరీ ఫైనల్‌కు చేరుకున్నారు. -
ఇలవేనిల్‌కు స్వర్ణం
రియో డి జనీరో (బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెం ట్లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలరివాన్ స్వర్ణ పతకాన్ని సాధించింది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఇలవేనిల్ 251.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. సియోనైడ్ మెకంటోష్ (బ్రిటన్–250.6 పాయింట్లు) రజతం, యింగ్ షిన్ లిన్ (చైనీస్ తైపీ–229.9 పాయింట్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన అంజుమ్ మౌద్గిల్ (166.8 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది. -
భారత షూటర్లకు నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి రెండు రోజుల్లో ప్రపంచ రికార్డులు సృష్టించడంతోపాటు పసిడి పతకాలను సొంతం చేసుకున్న భారత షూటర్లకు మూడో రోజు మాత్రం నిరాశ ఎదురైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షూటర్లు దీపక్ కుమార్, రవి కుమార్, దివ్యాంశ్ సింగ్ పన్వర్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. 95 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో దివ్యాంశ్ 627.2 పాయింట్లు స్కోరు చేసి 12వ స్థానంలో... రవి కుమార్ 627 పాయింట్లు సాధించి 14వ స్థానంలో... గతేడాది ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన దీపక్ కుమార్ 624.3 పాయింట్లు స్కోరు చేసి 34వ స్థానంలో నిలిచారు. ఫైనల్లో సెర్గీ కామెన్స్కీ (రష్యా–249.4 పాయింట్లు), యుకున్ లియు (చైనా–247 పాయింట్లు), జిచెంగ్ హుయ్ (చైనా–225.9 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. మంగళవారం మూడు ఈవెంట్స్‌లో భారత షూటర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో సునిధి చౌహాన్, గాయత్రి... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిద్ధూ, మను భాకర్, శ్రీనివేథ... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భావేశ్ షెకావత్, గుర్ప్రీత్ సింగ్, ఆదర్శ్ సింగ్, అర్పిత్ గోయల్, అనీశ్ పోటీపడనున్నారు. ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వీ చండేలా... రెండో రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌధరీ ప్రపంచ రికార్డులు సృష్టించడంతోపాటు పసిడి పతకాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే. -
వరల్డ్ రికార్డుతో ‘తొలి’ స్వర్ణం
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత పసిడి వేట కొనసాగుతోంది. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఆదివారం భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి పసిడి పతకం సాధించాడు. తొలిసారి సీనియర్ విభాగంలో వరల్డ్‌కప్‌లో పాల్గొన సౌరభ్.. వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 245.0 పాయింట్లతో సౌరభ్ చౌదరి వరల్డ్ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: ప్రపంచ రికార్డు... పసిడి పతకం) ఫైనల్లో పొడియం పొజిషన్‌ను సాధించిన సౌరభ్ కడవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే సెర్బియాకు చెందిన స్టార్ షూటర్ దామిర్ మికెక్పై వెనుక్కినెట్టి పసిడితో మెరిశాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఫలితంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తును ఖాయం చేసుకున్నాడు. గతేడాది జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో కూడా వరల్డ్ రికార్డు సౌరభ్ చౌదరి పేరిటే ఉంది. నిన్న మొదలైన ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. -
ప్రపంచ రికార్డు... పసిడి పతకం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ కొత్త సీజన్‌ను భారత్ పసిడి పతకం, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. శనివారం మొదలైన ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ టోర్నీలో రుజు జావో 251.8 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గగా... హాంగ్ జు (చైనా–230.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ అయినప్పటికీ గతేడాదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖాయం చేసుకోవడంతో అపూర్వి తాజా ప్రదర్శనకు ఒలింపిక్ బెర్త్ రాలేదు. క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానం... మొత్తం 101 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అపూర్వి 629.3 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు 24 షాట్లతో కూడిన ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వి కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. నిబంధనల ప్రకారం తొలి 12 షాట్లు పూర్తయ్యాక ఎనిమిది మందిలో తక్కువ స్కోరు ఉన్న షూటర్ నిష్క్రమిస్తారు. ఆ తర్వాత ప్రతి రెండు షాట్లకు తక్కువ స్కోరుతో ఉన్న షూటర్ పతకం రేసు నుంచి వెనుదిరిగారు. స్వర్ణం–రజతం కోసం చివరి రెండు షాట్లు మిగిలే సమయానికి అపూర్వి (231.6), రుజు జావో (230.8) మధ్య తేడా 0.8 మాత్రమే ఉంది. చివరి రెండు షాట్లలో అపూర్వి వరుసగా 10.8; 10.5... రుజు జావో 10.5; 10.5 స్కోరు చేశారు. దాంతో 1.1 స్కోరు తేడాతో అపూర్వికి స్వర్ణం ఖాయమైంది. భారత్‌కే చెందిన ఎలవెనిల్ వలరివాన్ (628 పాయింట్లు) 12వ స్థానంలో... అంజుమ్ మౌద్గిల్ (625.3 పాయింట్లు) 30వ స్థానంలో నిలిచారు. ► 3 ప్రపంచకప్ టోర్నీల్లో అపూర్వి నెగ్గిన పతకాలు. కొరియాలో 2015 జరిగిన ఈవెంట్లో ఆమె కాంస్యం, అదే ఏడాది వరల్డ్ కప్ ఫైనల్స్ టోర్నీలో రజతం సాధించింది. -
రాహీ పతకం త్రుటిలో చేజారింది
చాంగ్‌వొన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ షూటింగ్లో రెండో రోజూ భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. రాహీ సర్నోబాత్ పతకం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 600 పాయింట్లకుగాను రికార్డు స్థాయిలో 588 పాయింట్లు సాధించిన ఆమె... 8 మంది పోటీపడిన ఫైనల్లో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మిగతా భారత షూటర్లలో హీనా సిద్ధు 37వ, అనురాజ్ సింగ్ 41వ స్థానంలో నిలిచారు. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రవికుమార్–అపూర్వీ చండీలా జోడీ ఐదో స్థానం పొందింది. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన దీపక్ కుమార్–మెహులీ ఘోష్ జంట ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో షగున్ చౌదరి 26వ, శ్రేయసి సింగ్ 33వ స్థానాల్లో నిలిచారు. -
సొంతగడ్డపై భారత్ ‘గురి’ అదిరేనా
► నారంగ్, జీతూరాయ్లపై ఆశలు ► నేటి నుంచి ప్రపంచకప్ షూటింగ్ న్యూఢిల్లీ: రియోలో నిరాశపరిచిన భారత షూటర్లు సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్లో పతకాలపై గురిపెట్టారు. శుక్రవారం నుంచి జరిగే ప్రపంచకప్ షూటింగ్లో సత్తాచాటేందుకు సిద్ధమయా్యరు. ఇక్కడి డాక్టర్ కర్నిసింగ్ షూటింగ్ రేంజ్లో పది రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. భారత మేటి షూటర్లు గగన్ నారంగ్, జీతూరాయ్, హీనా సిదు్ధలపై భారత్ ఆశలు పెట్టుకుంది. 1999 తర్వాత... ఒలింపిక్ చాంపియన్ , భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా లేకుండా భారత బృందం తలపడుతున్న తొలి ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం. ప్రయోగాత్మక ఈవెంట్లకు ఈ ప్రపంచకప్ వేదికైంది. మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సిఫార్సు చేసిన మిక్స్డ్ జెండర్ (మహిళా, పురుషులు కలిసి ఆడే పోటీలు) ఈవెంట్లను తొలిసారిగా ఈ టోర్నీలోనే పరిశీలించనున్నారు. 50 దేశాలకు చెందిన 452 మంది షూటర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. ఆతిథ్య భారత్ నుంచి 63 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయా్యరు. భారత్‌లో గతంలోనూ ప్రపంచకప్ షూటింగ్ ఈవెంట్లు (1997, 2000, 2003) జరిగినప్పటికీ ఈ ఈవెంట్ మాత్రం ప్రత్యేకవైుంది. ఇప్పటిదాకా భారత్‌లో జరిగిన మెగా ఈవెంట్లన్నీ కేవలం షాట్‌గన్ పోటీల (ట్రాప్, డబుల్ ట్రాప్, స్కీట్)కు మాత్రమే పరిమితం కాగా... తాజా ప్రపంచకప్‌లో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఇలా అన్ని కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ (2020)కు ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడం మరో విశేషం. ఈ ఈవెంట్లలో చివరిసారిగా... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య త్వరలోనే కొన్ని ఈవెంట్లను ఒలింపిక్ క్యాలెండర్ నుంచి తొలగించనుంది. పురుషుల డబుల్ ట్రాప్, 50 మీ. పిస్టల్, 50 మీ. ప్రోన్ ఈవెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. మును్మందు ఇందులో పోటీపడే అవకాశం లేదని తెలిసినా... ఆఖరి సారిగా ప్రపంచకప్‌లో ఆయా ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు షూటర్లు బరిలోకి దిగుతున్నారు. కొత్తగా మిక్స్డ్ జెండర్ ఈవెంట్స్ యూరోపియన్ పియన్ ప్, జూనియర్ ప్రపంచకప్, యూత్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్డ్ జెండర్ పోటీలను తొలిసారిగా ఓ మేజర్ టోర్నమెంట్లో ఆడిస్తున్నారు. ఇందులో భాగంగా 10 మీ. ఎయిర్ రైఫిల్, 10 మీ. ఎయిర్ పిస్టల్, ట్రాప్, స్కీట్ ఈవెంట్లలో పురుషులు, మహిళలు కలిసి గురిపెటా్టల్సి వుంటుంది. అయితే ఇది పూర్తిస్థాయి పోటీలు కాకపోవడం... ప్రయోగాత్మక పరిశీలన నేపథ్యంలో ఇందులో గెలిచిన వారికి పతకాల బదులు బ్యాడ్జిలు అందజేస్తారు. -
అపూర్వి.. అదుర్స్
ప్రపంచకప్ షూటింగ్లో రజతం మునిచ్ : భారత యువ షూటర్ అపూర్వి చండేలా... ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ అండ్ పిస్టల్ ఈవెంట్లో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి 206.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణం నెగ్గిన అహ్మది ఎల్హాన్ (ఇరాన్-207.5)కు ఈమెకు మధ్య తేడా కేవలం 0.6 పాయింట్లు మాత్రమే. ఆండ్రియా (సెర్బియా)కు కాంస్యం దక్కింది. ఫైనల్లో చండేలా ఆరంభం నుంచే ఆధిపత్యం చూపెట్టింది. రెండుసార్లు 10.8 పాయింట్లు సాధించి సిరీస్-1లో మొత్తం 30.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే రెండో సిరీస్‌లో నిలకడ లేకపోవడంతో ఒక్క స్థానం కిందకు పడిపోయింది. ఫైనల్ షాట్లో చండేలా 10.2 పాయింట్లు నెగ్గితే.... ఎల్హాన్ 10.4 పాయింట్లు సాధించింది.