
దక్షిణకొరియాలోని చాంగ్వాన్‌లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ గురువారం మరో స్వర్ణం, రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం లభించింది.
అర్జున్ బబుటా, తుషార్ మానే, పార్థ్ మఖీజా సభ్యులుగా ఉన్న భారత బృందం ఫైనల్లో 17–15 తేడాతో ఆతిథ్య కొరియా టీమ్‌పై విజయం సాధించింది. అదే విధంగా.. మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం లభించింది. ఎలవెనిల్ వలరివన్, మెహులీ ఘోష్, రమిత సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో కొరియా చేతిలోనే 10–16తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment