Indian shooters
-
భారత ట్రాప్ షూటర్లకు నిరాశ
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో తొలిరోజు భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల, పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగాల్లో భారత షూటర్లెవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి 113 పాయింట్లతో 8వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–6లో నిలిచినవారు ఫైనల్ చేరుకుంటారు. భారత్‌కే చెందిన భవ్య 19వ ర్యాంక్‌లో, మనీషా 24వ ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్‌లో భౌనీష్ 17వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
భారత షూటర్లకు మరో రెండు ఒలింపిక్ బెర్త్‌లు
కువైట్ సిటీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య 19కు చేరుకుంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నమెంట్లో మహిళల స్కీట్ విభాగంలో రైజా ధిల్లాన్... పురుషుల స్కీట్ విభాగంలో అనంత్ జీత్ సింగ్ నరూకా రజత పతకాలు సాధించారు. తద్వారా ఈ రెండు కేటగిరీల్లో భారత్‌కు రెండు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేశారు. ఫైనల్స్‌లో 19 ఏళ్ల రైజా 52 పాయింట్లు స్కోరు చేయగా... అనంత్ 56 పాయింట్లు సాధించాడు. ఈ రెండు బెర్త్‌లతో ఈసారి భారత షూటర్లు ఒలింపిక్స్‌లో అన్ని మెడల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించడం జరిగింది. -
Asia Olympic Qualifiers: భారత షూటర్ల పసిడి వేట
జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత షూటర్ల ఖాతాలోకి రెండు స్వర్ణ పతకాలు చేరాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ యోగేశ్ సింగ్ (572 పాయింట్లు) పసిడి పతకం నెగ్గాడు. యోగేశ్, అమిత్, ఓం ప్రకాశ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1690 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్‌ఫాఫుమ్ (థాయ్‌లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత షూటర్లకు ఐదు పతకాలు
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజూ భారత షూటర్లు ఐదు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నాన్సీ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఇలవేనిల్ వలారివన్ రజత పతకం దక్కించుకుంది. నాన్సీ, ఇలవేనిల్, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు 1897.2 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. వ్యక్తిగత ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 252.7 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందింది. చైనా షూటర్ షెన్ యుఫాన్ 231.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం సాధించగా... రుద్రాంక్ష్ , అర్జున్ బబూటా, శ్రీకార్తీక్లతో కూడిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది. వ్యక్తిగత ఫైనల్లో రుద్రాం„Š 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. టీమ్ విభాగంలో రుద్రాం„Š , అర్జున్, శ్రీకార్తీక్ బృందం 1885.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
ఇషా డబుల్ ధమాకా
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్‌లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. -
శ్రియాంక గురికి 13వ బెర్తు
న్యూఢిల్లీ: భారత షూటర్లు పారిస్ ఒలింపిక్సే లక్ష్యంగా ఆసియా షూ టింగ్ చాంపియన్‌షిప్‌లో రాణిస్తున్నారు. తాజాగా శ్రియాంక సదాంగి ఒలింపిక్స్ బెర్తు సంపాదించింది. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో నాలుగో స్థానంలో నిలిచింది. పతకం చేజారినా... ‘పారిస్’ గురి కుది రింది. ఆమె 440.5 స్కోరుతో నాలుగో స్థానంలో తృప్తిపడింది. ఆమెతో పాటు ఈ ఈవెంట్లో సిఫ్త్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సీ, ఆయుషి పొడెర్లు కూడా క్వాలిఫయింగ్ మార్క్ దాటారు. షూటింగ్లో భారత్‌కిది 13వ ఒలింపిక్ బెర్తు కావడం విశేషం. -
Asian Shooting Championships 2023: అనీశ్ డబుల్ ధమాకా
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు. ఈ ప్రదర్శనతో అనీశ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్లో భారత్‌కు 12 ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 30 పతకాలు సాధించింది. -
సూపర్ కైనన్...
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. షూటింగ్ క్రీడాంశం చివరిరోజు భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం కలిపి మూడు పతకాలు వచ్చాయి. ఓవరాల్‌గా భారత షూటర్లు ఈ క్రీడల్లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలు గెలిచారు. ఆఖరి రోజు పురుషుల, మహిళల ట్రాప్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరిగాయి. పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టు 361 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల కొత్త రికార్డును నెలకొల్పింది. క్వాలిఫయింగ్‌లో కైనన్ 122 పాయింట్లు, జొరావర్ 120 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌కు అర్హత పొందారు. వ్యక్తిగత విభాగంలో ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొరావర్ 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... కైనన్ 32 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 337 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. రజతంతో ముగింపు... ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించే అవకాశాన్ని భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 22–20, 14–21, 21–18 తో షి యుకీపై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–15, 21–18తో లియాంగ్ వెకింగ్–చాంగ్ వాంగ్ జంటను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్–సాయిప్రతీక్ ద్వయం 6–21, 15–21 తో లియు యుచెన్–జువాన్యి ఒయు జోడీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గాయంతో ఫైనల్‌కు దూరమైన భారత నంబర్‌వన్ ప్రణయ్ స్థానంలో మిథున్ ఆడాల్సి వచ్చింది. మిథున్ 12–21, 4–21 తో హాంగ్యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు. -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్‌కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్‌లో విజయ్‌వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్‌లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్‌వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్‌వీర్, అనీశ్ -
భారత్ బంగారు గురి
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత షూటర్లు అద్వితీయ ప్రదర్శనతో అలరించారు. రెండు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను ఖరారు చేశారు. తెలంగాణ షూటర్ ఇషా సింగ్, హరియాణా అమ్మాయిలు రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం అందించింది. రిథమ్, ఇషా సింగ్, మనూ భాకర్ జట్టు 1,744 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో రిథమ్ 583 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్ 581 పాయింట్లతో 16వ స్థానంలో, మనూ 580 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రిథమ్ ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అఖిల్ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం మొత్తం 1750 పాయింట్లు స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్ ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఎనిమిది మంది మధ్య షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ 450 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను అందించాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. అనాహత్ అదరహో డాలియన్ (చైనా): భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. 15 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3–1తో ఇనా క్వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ టోరీ్నలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. అండర్–19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్–19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్–15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. చాంపియన్ వృత్తి అగర్వాల్ భువనేశ్వర్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోరీ్నలో తెలంగాణ స్విమ్మర్లు ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు. హైదరాబాద్ అమ్మాయి వృత్తి అగర్వాల్ గ్రూప్–1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించింది. వృత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. చివరిరోజు శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది. గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని శిక్షణ తీసుకుంటోంది. నిత్యశ్రీ సాగి రెండు రజతాలు, ఒక కాంస్యం, సుహాస్ ప్రీతమ్ రెండు కాంస్యాలు నెగ్గారు. -
పసిడి పతకాలతో ముగింపు
చాంగ్వాన్ (కొరియా): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత షూటర్లు పసిడి పతకాలతో ముగించారు. ఈ టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం లభించాయి. పురుషుల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కమల్జీత్ 544 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కమల్జీత్, అంకిత్ తోమర్, సందీప్ బిష్ణోయ్‌లతో కూడిన భారత జట్టు 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో 1617 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. మహిళల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో టియానా 519 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. టియానా, యశిత షోకీన్, వీర్పాల్ కౌర్‌లతో కూడిన భారత జట్టు మహిళల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో 1498 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత షూటర్లు ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 17 పతకాలతో రెండో స్థానంలో నిలిచారు. 28 పతకాలతో చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. -
Shooting World Cup: చరిత్ర సృష్టించిన భారత షూటర్లు
అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు చరిత్ర సృష్టించారు. మహిళల స్కీట్ ఈవెంట్లో భారత్‌కు తొలిసారి రజత, కాంస్య పతకాలు లభించాయి. ఆరుగురు షూటర్ల మధ్య మంగళవారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గనీమత్ ‘షూట్ ఆఫ్’లో గురితప్పి రజత పతకం సాధించగా... దర్శన కాంస్య పతకాన్ని సంపాదించింది. 60 షాట్ల ఫైనల్లో అసెమ్ ఒరిన్బే (కజకిస్తాన్), గనీమత్ 50 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. స్వర్ణ, రజత పతకాల కోసం రెండు షాట్ల ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఒరిన్బే రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకోగా... గనీమత్ ఒక పాయింట్ సాధించి రజతం దక్కించుకుంది. దర్శన 39 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో దర్శన 120 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్‌లో, గనీమత్ 117 పాయింట్లు స్కోరు చేసి నాలుగో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందారు. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్ నుంచి ముగ్గురు షూటర్లు మేరాజ్ అహ్మద్ ఖాన్, గుర్జోత్ ఖాంగురా, అనంత్‌జీత్ సింగ్ వరుసగా 17వ, 19వ, 23వ స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. -
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
ISSF Shooting World Cup 2022: షూటర్ల జోరు.. భారత ఖాతాలో 14వ పతకం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ ఏడాది అంతర్జాతీయ షూటింగ్ సీజన్‌లోని మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో 14వ పతకం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో అనీశ్ భన్వాలా–రిథమ్ సాంగ్వాన్ ద్వయం భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. కాంస్య పతక పోరులో అనీశ్–రిథమ్ జోడీ 16–12 పాయింట్లతో అనా దెడోవా–మార్టిన్ పొదరాస్కీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఆరు జోడీలు పాల్గొన్న క్వాలిఫికేషన్ స్టేజ్–2లో అనీశ్–రిథమ్ 380 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందారు. అనీశ్–రిథమ్ జంటకిది రెండో ప్రపంచకప్ పతకం. ఈ ఏడాది మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అనీశ్–రిథమ్ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో బరిలోకి దిగిన రెండు భారత జోడీలు త్రుటిలో పతక మ్యాచ్‌లకు దూరమయ్యాయి. సంజీవ్ రాజ్‌పుత్–అంజుమ్ మౌద్గిల్ జంట ఐదో స్థానంలో, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్–ఆశీ చౌక్సీ జోడీ ఆరో స్థానంలో నిలిచాయి. తాజా ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 14 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. చదవండి: Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
Shooting World Cup 2022: భారత్‌కు మరో స్వర్ణం, రజతం
దక్షిణకొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ గురువారం మరో స్వర్ణం, రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం లభించింది. అర్జున్ బబుటా, తుషార్ మానే, పార్థ్ మఖీజా సభ్యులుగా ఉన్న భారత బృందం ఫైనల్లో 17–15 తేడాతో ఆతిథ్య కొరియా టీమ్‌పై విజయం సాధించింది. అదే విధంగా.. మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం లభించింది. ఎలవెనిల్ వలరివన్, మెహులీ ఘోష్, రమిత సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో కొరియా చేతిలోనే 10–16తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం లభించింది. -
Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు అర్జున్ బబూటా, పార్థ్ మఖీజా ఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలపై గురి పెట్టారు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. 53 మంది షూటర్ల మధ్య ఆదివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌లో అర్జున్ 630.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో, పార్థ్ 628.4 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారి మధ్య నేడు ఫైనల్ జరగనుంది. -
స్వర్ణ పతకంపై ఇలవేనిల్ బృందం గురి
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో ఇలవేనిల్, రమిత, శ్రేయాలతో కూడిన భారత బృందం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. అజర్బైజాన్ లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ స్టేజ్–1లో ఇలవేనిల్, రమిత, శ్రేయ జట్టు 944.4 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో... క్వాలిఫయింగ్ స్టేజ్–2లో 628.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. నేడు జరిగే ఫైనల్లో డెన్మార్క్‌తో భారత జట్టు ఆడుతుంది. చదవండి: French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు -
Tokyo Olympics: షూటర్ల గురి కుదిరేనా!
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన తొలి రోజు నుంచి భారత షూటర్లపై క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా 15 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం... కొంతకాలంగా అంతర్జాతీయస్థాయి టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తుండటం... ఈ నేపథ్యంలో సహజంగానే మన షూటర్లు రియో ఒలింపిక్స్ వైఫల్యాన్ని మరిచిపోయేలా పతకాలతో అదరగొడతారని ఆశించారు. కానీ మూడు రోజులు గడిచినా భారత షూటర్లు పతకాల బోణీ కొట్టలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సౌరభ్ చౌదరీ ఒక్కడే కాస్త నయమనిపించి ఫైనల్ చేరుకున్నాడు. కానీ తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను ఒత్తిడికి తడబడి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే విభాగంలో మరో షూటర్ అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఇలవేనిల్, అపూర్వీ చండేలా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో దివ్యాంశ్, దీపక్ కుమార్... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మనూ భాకర్, యశస్విని... పురుషుల స్కీట్ ఈవెంట్లో అంగద్, మేరాజ్ అహ్మద్ ఖాన్ కూడా క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించారు. దాంతో యేటా ప్రపంచకప్ టోర్నీలలో కనబరిచే ప్రదర్శనను విశ్వ క్రీడలు వచ్చేసరికి భారత షూటర్లు పునరావృతం చేయలేక చతికిల పడతారని విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విమర్శకుల నోళ్లు మూయించడానికి భారత షూటర్లకు మంచి అవకాశం లభించనుంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్డ్ ఈవెంట్లో భారత్ నుంచి నాలుగు జోడీలు బరిలోకి దిగనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ; యశస్విని–అభిషేక్ వర్మ... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో ఇలవేనిల్–దివ్యాంశ్; దీపక్ కుమార్–అంజుమ్ మౌద్గిల్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ స్టేజ్–1లో మొత్తం 20 జోడీలు బరిలో ఉన్నాయి. ఇలవేనిల్, దివ్యాంశ్ సింగ్ స్టేజ్–1లో టాప్–8లో నిలిచిన ఎనిమిది జంటలు క్వాలిఫయింగ్ స్టేజ్–2కు అర్హత సాధిస్తాయి. స్టేజ్–2లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ స్టేజ్–1లో 29 జోడీలు పోటీపడతాయి. టాప్–8లో నిలిచిన జంటలు క్వాలిఫయింగ్ స్టేజ్–2కు అర్హత పొందుతాయి. స్టేజ్–2లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో సౌరభ్–మనూ జంట స్వర్ణం... యశస్విని–అభిషేక్ జోడీ కాంస్యం సాధించాయి. ఒలింపిక్స్‌లో ఈ జోడీలు ఏం చేస్తాయో వేచి చూడాలి. గెలిస్తే సాత్విక్–చిరాగ్ జంట ముందుకు... బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో బెన్ లేన్–సీన్ వెండీ (బ్రిటన్) జంటపై కచ్చితంగా గెలవాలి. ఈ గ్రూప్ నుంచి వరుసగా రెండు విజయాలతో గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జంట ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: ఉదయం గం. 8:30 నుంచి బాక్సింగ్ ♦మహిళల 69 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్: లవ్లీనా బొర్గోహైన్ (భారత్)–నాదినె ఎపెట్జ్ (జర్మనీ) ♦ఉదయం గం. 11.33 నుంచి టేబుల్ టెన్నిస్ ♦టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్: శరత్ కమల్–మా లాంగ్ (చైనా) ♦ఉదయం గం. 8:30 నుంచి సెయిలింగ్ ♦మహిళల లేజర్ రేడియల్ రేసు: నేత్రా కుమనన్ (ఉదయం గం. 8:35 నుంచి); పురుషుల లేజర్ రేసు: విష్ణు శరవణన్ (ఉదయం గం. 8:45 నుంచి); పురుషుల స్కిఫ్ 49ఈఆర్ ♦రేసు: కేసీ గణపతి–వరుణ్ ఠక్కర్ (ఉదయం గం. 11:50 నుంచి) పురుషుల హాకీ ♦పురుషుల హాకీ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్: భారత్–స్పెయిన్ ♦(ఉదయం గం. 6:30 నుంచి) 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ♦క్వాలిఫయింగ్ స్టేజ్–1: ఉదయం గం. 5:30 నుంచి; క్వాలిఫయింగ్ స్టేజ్–2: ఉదయం గం. 6:15 నుంచి; కాంస్య పతకం మ్యాచ్: ఉదయం గం. 7:30 నుంచి; స్వర్ణ–రజత పతక మ్యాచ్: ఉదయం గం. 8:37 నుంచి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ ♦క్వాలిఫయింగ్ స్టేజ్–1: ఉదయం గం. 9:45 నుంచి; క్వాలిఫయింగ్ స్టేజ్–2: ఉదయం గం. 10:30 నుంచి; కాంస్య పతకం మ్యాచ్: ఉ. గం. 11:45 నుంచి; స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:22 నుంచి. -
Tokyo Olympics: శుభవార్త వింటామా!
టోక్యో: విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు ముగిశాయి. నేటి నుంచి క్రీడాకారులు పతకాల వేటను మొదలుపెట్టనున్నారు. తొలి రోజు మొత్తం 7 క్రీడాంశాల్లో 11 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. ఈ ఏడు క్రీడాంశాల్లో నాలుగింటిలో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెడల్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు క్వాలిఫయింగ్ రౌండ్ మొదలవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫైనల్ జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎనిమిది గంటల వరకు భారత్‌కు పతకం ఖాయమైందో లేదో తేలిపోతుంది. షూటింగ్‌లోనే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ మెడల్ ఈవెంట్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ ప్రారంభమవుతుంది. ఫైనల్లో భారత షూటర్లు ఉంటే అరగంటలోపు భారత షూటర్ల గురికి పతకం ఖాయమైందో లేదో తెలిసిపోతుంది. మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 5:00 నుంచి; ఫైనల్: ఉదయం గం. 7:15 నుంచి పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 9:30 నుంచి; ఫైనల్: మధ్యాహ్నం గం. 12 నుంచి నాలుగు పతకాలపై షూటర్ల గురి... కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో భారత షూటర్లు నిలకడగా పతకాలు సాధిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం క్రొయేషియాలో ప్రత్యేకంగా రెండు నెలలపాటు సాధన చేశారు. తొలి రోజు రెండు విభాగాల్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇలవేనిల్ వలారివన్, అపూర్వీ చండేలా పోటీపడనున్నారు. 48 మంది షూటర్లు పాల్గొనే క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇలవేనిల్, అపూర్వీ తొలి లక్ష్యం ఫైనల్ చేరడమే. అనంతరం ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు స్కోరు చేస్తేనే ఇలవేనిల్, అపూర్వీ పతకాలను ఖాయం చేసుకుంటారు. పురుషుల 10 ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ బరిలో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సౌరభ్ రెండో స్థానంలో, అభిషేక్ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. 36 మంది పాల్గొనే క్వాలిఫయింగ్‌లో రాణించి టాప్–8లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు సాధిస్తే సౌరభ్, అభిషేక్‌ల నుంచి పతకాలు ఆశించవచ్చు. దీపిక–ప్రవీణ్ జోడీ అద్భుతం చేస్తేనే... ♦ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: ఉదయం గం. 6 నుంచి ♦ కాంస్య పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:55 నిమిషాల నుంచి ♦ స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 1:15 ని. నుంచి ఆర్చరీలో శుక్రవారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్లు జరిగాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ దీపిక కుమారి 663 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లు స్కోరు చేసి 31వ ర్యాంక్‌లో... అతాను దాస్ 653 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో... తరుణ్‌దీప్ రాయ్ 652 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ విభాగంలో భారత్ తరఫున దీపిక కుమారి–ప్రవీణ్ జాదవ్ జోడీ బరిలోకి దిగనుంది. భార్యాభర్తలైన దీపిక, అతాను దాస్ జతగా ఈ విభాగంలో పోటీపడుతుందని ఆశించినా... ర్యాంకింగ్ రౌండ్లో అతాను దాస్ వెనుకంజలో ఉండటం... ప్రవీణ్ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో... దీపికకు భాగస్వామిగా ప్రవీణ్‌నే ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం స్పష్టం చేసింది. నేడు మిక్స్డ్ డబుల్స్‌లో మెడల్ ఈవెంట్ జరగనుంది. దీపిక–ప్రవీణ్ సంయుక్త స్కోరు (1319) ఆధారంగా తొలి రౌండ్లో ఈ జంటకు తొమ్మిదో సీడ్ లభించింది. నాకౌట్ పద్ధతిలో జరిగే మిక్స్డ్ ఈవెంట్లో తొలి రౌండ్లో లిన్ చియా ఇన్–టాంగ్ చి చున్ (చైనీస్ తైపీ) ద్వయంతో దీపిక–ప్రవీణ్ జంట తలపడుతుంది. తొలి రౌండ్ దాటితే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఆన్ సాన్–కిమ్ జె డియోక్ (దక్షిణ కొరియా)లతో దీపిక–ప్రవీణ్ తలపడే అవకాశముంది. కొరియా అడ్డంకిని అధిగమిస్తే దీపిక–ప్రవీణ్ సెమీఫైనల్ చేరతారు. మీరాబాయి మెరిసేనా... ప్రపంచ మాజీ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే పతకం మోసుకొస్తుంది. ఎనిమిది మంది పోటీపడే ఫైనల్లో మీరాబాయికి చైనా లిప్టర్ జిహుయ్ హు, డెలాక్రుజ్ (అమెరికా), ఐసా విండీ కంతిక (ఇండోనేసియా) నుంచి గట్టిపోటీ లభించనుంది. గత ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మీరాబాయి అదే ప్రదర్శనను పునరావృతం చేసి, స్నాచ్‌లోనూ రాణిస్తే ఆమెకు కనీసం కాంస్యం దక్కే అవకాశముంది. మహిళల 49 కేజీల విభాగం ఫైనల్: ఉదయం గం. 10.20 నిమిషాల నుంచి సుశీలా ‘పట్టు’ ప్రయత్నం మహిళల జూడో 48 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుశీలా దేవి పోటీపడనుంది. తొలి రౌండ్లో ఆమె ఇవా సెర్నోవిక్జీ (హంగేరి)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫునా తొనాకి (జపాన్)తో సుశీలా తలపడుతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుశీలా 33వ ర్యాంక్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో సుశీలా పతకం రేసులో నిలిస్తే అద్భుతమే అవుతుంది. తొలి రౌండ్: ఉదయం గం. 7: 30 తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ్ఠ యాంగ్ లీ–చి లిన్ వాంగ్ (చైనీస్ తైపీ); ఉదయం గం. 8:50 నుంచి. పురుషుల సింగిల్స్ లీగ్ మ్యాచ్: సాయిప్రణీత్ ్ఠ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్); ఉదయం గం. 9:30 నుంచి బాక్సింగ్ పురుషుల 69 కేజీల తొలి రౌండ్: వికాస్ కృషన్ ్ఠ మెన్సా ఒకజావా (జపాన్); మధ్యాహ్నం గం. 3:55 నుంచి. హాకీ పురుషుల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS న్యూజిలాండ్ (ఉదయం గం. 6:30 నుంచి). మహిళల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS నెదర్లాండ్స్ (ఉదయం గం. 5:15 నుంచి) రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ హీట్–2: అర్జున్ లాల్–అరవింద్ సింగ్ (ఉదయం గం. 7:30 నుంచి) టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: శరత్ కమల్–మనిక బత్రా VS యున్ జు లిన్–చింగ్ చెంగ్ (చైనీస్ తైపీ) ఉదయం గం. 8:30 నుంచి మహిళల సింగిల్స్ తొలి రౌండ్: మనిక బత్రా VS టిన్ టిన్ హో (బ్రిటన్); మధ్యాహ్నం గం. 12:15 నుంచి; సుతీర్థ ముఖర్జీ ్ఠ లిండా బెర్గ్స్టోరెమ్ (స్వీడన్); మధ్యాహ్నం గం. 1:00 నుంచి టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: సుమిత్ నగాల్ ్ఠ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్); ఉదయం గం. 7:30 నుంచి నేడు అందుబాటులో ఉన్న స్వర్ణాలు (11) ఆర్చరీ (1) రోడ్ సైక్లింగ్ (1) ఫెన్సింగ్ (2) జూడో (2) షూటింగ్ (2) తైక్వాండో (2) వెయిట్‌లిఫ్టింగ్ (1) అన్ని ఈవెంట్స్ ఉదయం గం. 6:00 నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Covid-19: గంటల వ్యవధిలో తండ్రీకూతురు మృతి
భారత షూటింగ్ జట్టు కోచింగ్ బృందంలో భాగంగా ఉన్న మోనాలీ గోర్హె (44) కన్నుమూశారు. కోవిడ్–19 నుంచి కోలుకున్నా...ఆమె బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా పిస్టల్ కోర్ గ్రూప్‌కు మోనాలీ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నాసిక్‌లో ఆమె ‘ఎక్సెల్’ పేరుతో సొంత షూటింగ్ అకాడమీ కూడా నిర్వహిస్తున్నారు. మోనాలీ చనిపోవడానికి కొన్ని గంటల ముందే ఆమె తండ్రి కూడా కరోనాతో మరణించడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చదవండి: ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’ కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ -
‘పసిడి’తో ముగింపు
న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత షూటర్లు ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను స్వర్ణ పతకాలతో ముగించారు. టోర్నీ చివరి రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. ఓవరాల్‌గా భారత్ 15 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 30 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ టోర్నీ ల చరిత్రలో ఒకే ఈవెంట్లో ఒక దేశానికి 15 స్వర్ణాలు రావడం ఇదే ప్రథమం. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో గుర్ప్రీత్ సింగ్, విజయ్‌వీర్ సిద్ధూ, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 2–10తో సాండెర్సన్, హాబ్సన్, టర్నర్లతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. మహిళల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో శ్రేయసి, రాజేశ్వరి, మనీషాలతో కూడిన భారత జట్టు 6–0తో మరియా, ఐజాన్, సర్సెన్‌కుల్‌లతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, పృథ్వీరాజ్, లక్షయ్‌లతో కూడిన భారత పురుషుల ట్రాప్ జట్టు టీమ్ ఫైనల్లో 6–4తో స్లామ్‌కా, అడ్రియన్, మరినోవ్‌లతో కూడిన స్లొవేకియా జట్టుపై గెలిచి స్వర్ణాన్ని నెగ్గింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 8 పతకాలతో అమె రికా రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో 53 దేశాల నుంచి 294 మంది షూటర్లు పాల్గొన్నారు. -
25 పతకాలతో టాప్‌లో..
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. టోర్నీ ఎనిమిదో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్–తేజస్విని సావంత్ జంట పసిడి పతకం నెగ్గగా... ఐశ్వరీ ప్రతాప్‌సింగ్–సునిధి ద్వయం కాంస్యం గెలి చింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ పురుషుల టీమ్ ఈవెంట్లో స్వప్నిల్, చెయిన్ సింగ్, నీరజ్ లతో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్‌వీర్‌కు రజతం దక్కింది. ప్రస్తుతం భారత్ 12 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
పిస్టల్‌లో క్లీన్‌స్వీప్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్నీ ఆరో రోజు బుధవారం భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అందుబాటులో ఉన్న మూడు పతకాలను నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు. ఈ ఫైనల్లో చింకీ యాదవ్‌కు స్వర్ణం దక్కగా... రాహీ సర్నోబత్ రజతం, మనూ భాకర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మనూ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. చింకీ యాదవ్, రాహీ 32 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ నిర్వహిం చగా... చింకీ యాదవ్ 4 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. 3 పాయింట్లు స్కోరు చేసిన రాహీకి రజతం దక్కింది. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఈ ముగ్గురు భారత మహిళా షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రతాప్ సింగ్ ఘనత మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రతాప్ సింగ్ ఘనత వహించాడు. 20 ఏళ్ల ప్రతాప్ సింగ్ 462.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్తవన్ పెనీ (హంగేరి–461.6 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా... స్టీఫెన్ ఒల్సెన్ (డెన్మార్క్–450.9 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు తేజస్విని సావంత్ 12వ స్థానంలో, అంజుమ్ మౌద్గిల్ 16వ స్థానంలో, సునిధి చౌహాన్ 17వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో సోమవారం భారత షూటర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ (భారత్) జోడీ 16–12తో గొల్నూష్–జావేద్ ఫరూఖ్ (ఇరాన్) జంటపై నెగ్గి పసిడి పతకం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ (భారత్) ద్వయం 16–10తో డెనిస్ ఎస్టర్–ఇస్తవన్ పెనీ (హంగేరి) జోడీని ఓడించి బంగారు పతకం దక్కించుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గుర్జోత్, మేరాజ్ అహ్మద్‌ఖాన్, అంగద్ వీర్‌బజ్వాలతో కూడిన భారత జట్టు 6–2తో నాసిర్, అలీ అహ్మద్, రషీద్ లతో కూడిన ఖతర్ జట్టుపై గెలిచి స్వర్ణ పతకం సాధించింది. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో పరీనాజ్, కార్తీకి సింగ్, గనీమత్‌లతో కూడిన భారత జట్టు 4–6తో జోయా, రినాటా, ఓల్గాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
కైనన్ షెనాయ్ పసిడి గురి
కువైట్: ఆసియా ఆన్లైన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. కువైట్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 11 పతకాలు గెల్చుకున్న భారత్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ చాంపియన్‌గా నిలిచాడు. 34 మంది షూటర్లు పాల్గొన్న ట్రాప్ ఈవెంట్లో 30 ఏళ్ల కైనన్ 150 పాయింట్లకుగాను 145 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ హైదరాబాద్ షూటర్ ఆరు రౌండ్లలో వరుసగా 24, 24, 24, 25, 24, 24 పాయింట్లు సాధించాడు. నసీర్ (కువైట్–144 పాయింట్లు) రజతం, పృథ్వీరాజ్ (భారత్–143 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత్‌కే చెందిన సౌరభ్ (10 మీ. ఎయిర్ పిస్టల్), దివ్యాంశ్ (10 మీ. ఎయిర్ రైఫిల్), రాజేశ్వరి (మహిళల ట్రాప్ ఈవెంట్) కూడా బంగారు పతకాలు నెగ్గారు. 22 దేశాల నుంచి 274 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ముంబై సిటీ జట్టుకు షాక్ బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై సిటీ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో ముంబై జట్టును ఓడించింది. 30 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ టోర్నీలో ఎదురైన రెండు పరాజయాలు నార్త్ ఈస్ట్ జట్టు చేతిలోనే రావడం గమనార్హం. నవంబర్ 21న తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లోనూ ముంబై 0–1తో నార్త్ ఈస్ట్ జట్టు చేతిలో ఓడింది. -
ఇలవేనిల్ పసిడి గురి
న్యూఢిల్లీ: షేక్ రసెల్ అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ప్రపంచ నంబర్‌వన్ ఇలవేనిల్ వలరివన్ పసిడి పతకం నెగ్గగా... పురుషుల విభాగంలో తుషార్ మానే రజతం దక్కించుకున్నాడు. ఇలవేనిల్ 627.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 1000 డాలర్ల (రూ. 73 వేలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. షియోరి హిరాట (జపాన్) రెండో స్థానంలో... విద్య తోయిబా (ఇండోనేసియా) మూడో స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో జపాన్ షూటర్ నయోయ ఒకాడ 630.9 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకోగా... తుషార్ 623.8 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని పొందాడు. తుషార్‌కు 700 డాలర్లు (రూ. 51 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అబ్దుల్లా (బంగ్లాదేశ్) మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది. -
భారత్ తీన్మార్
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆదివారం భారత షూటర్లు అద్భుతమే చేశారు. ఏకంగా మూడు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకున్నారు. పురుషుల స్కీట్ విభాగంలో అంగద్ సింగ్ బాజ్వా స్వర్ణం, మేరాజ్ అహ్మద్ ఖాన్ రజతం సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్య పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తాజా ప్రదర్శనతో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా 15 మంది షూటర్లు బరిలోకి దిగనున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 12 మంది... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 11 మంది భారత షూటర్లు పాల్గొన్నారు. ►స్కీట్ విభాగం క్వాలిఫయింగ్‌లో 44 ఏళ్ల మేరాజ్ నాలుగో స్థానంలో, 23 ఏళ్ల అంగద్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో నిరీ్ణత 60 షాట్ల తర్వాత అంగద్, మేరాజ్ 56 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య షూట్ ఆఫ్‌ను నిర్వహించగా... అంగద్ 6 పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... 5 పాయింట్లు స్కోరు చేసిన మేరాజ్‌కు రజతం దక్కింది. ►పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 449.1 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, పారుల్ కుమార్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ విభాగంలో కాంస్యం లభించింది. ►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్–అభిõÙక్ వర్మ జంట 16–10తో భారత్‌కే చెందిన సౌరభ్–యశస్విని జోడీపై గెలిచి పసిడి పతకం సాధించింది. ►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సరబ్‌జ్యోత్ సింగ్ (భారత్) ద్వయం 16–10తో మిన్సియో కిమ్–యున్హో సుంగ్ (కొరియా) జోడీని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. -
సౌరభ్, రాహీ డబుల్ ధమాకా
మ్యూనిక్ (జర్మనీ): భారత షూటర్లు మళ్లీ బంగారు గురితో భళా అనిపించారు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ రెండు స్వర్ణాలను అందించారు. ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ చౌధరీ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన షాజర్ రిజ్వీ 177.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 586 పాయింట్లు, షాజర్ రిజ్వీ 583 పాయింట్లు సాధించి వరుసగా రెండు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో రాహీ 586 పాయింట్లు, మను 585 పాయింట్లు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. -
భారత్‌కు పతకాల పంట
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తా చాటుకున్నారు. పోటీలకు ఆఖరి రోజైన సోమవారం భారత్ ఐదు స్వర్ణాలు గెలుచుకుంది. దీంతో పసిడి పతకాల సంఖ్య 16కు చేరుకుంది. ఓవరాల్‌గా భారత్ 25 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. యశ్వర్ధన్, శ్రేయ అగర్వాల్ వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లను కలుపుకొని మూడేసి స్వర్ణాలు గెలుపొందారు. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకం నెగ్గిన యశ్... కెవల్ ప్రజ్పతి, ఐశ్వర్య్ తోమర్లతో కలిసి టీమ్ ఈవెంట్లో మరో పసిడి చేజిక్కించుకున్నాడు. శ్రేయతో కలిసి మిక్స్డ్ ఈవెంట్లోనూ స్వర్ణం నెగ్గాడు. జూనియర్ మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ ఈవెంట్‌తో పాటు మెహులీ ఘోష్, కవి చక్రవర్తిలతో కలిసి టీమ్ ఈవెంట్లోనూ శ్రేయ అగర్వాల్ బంగారు పతకాల్ని గెలిచింది. 10 మీ. ఎయిర్‌రైఫిల్ పోటీలో మెహులీ మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకోగా... కవి చక్రవర్తి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్ ముగిసిందో లేదో మరో చాంపియన్‌షిప్‌కు భారత షూటర్లు సిద్ధమయ్యారు. యూఏఈలో 5 నుంచి జరుగనున్న ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత్ పాల్గొంటుంది. -
భారత షూటర్లు భళా
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. చైనీస్‌తైపీలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్లు దివ్యాన్‡్ష సింగ్ పాన్వర్, ఎలవెనీల్ వలరియవన్ పసిడి పతకాల్ని క్లీన్‌స్వీప్ చేశారు. పురుషుల వ్యక్తిగత ఈవెంట్లో దివ్యాన్‡్ష, మహిళల ఈవెంట్లో ఎలవెనీల్ చెరో స్వర్ణం గెలిచారు. వీళ్లిద్దరు సహచరులతో కలిసి బరిలోకి దిగిన టీమ్ ఈవెంట్లోనూ బంగారు పతకాలు నెగ్గారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్లో దివ్యాన్‡్ష, రవికుమార్, దీపక్ కుమార్ల బృందం విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్లో ఎలవెనీల్, అపూర్వీ, మేఘనలతో కూడిన భారత జట్టు బంగారు పతకం సాధించింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య డజనుకు చేరింది. 14 పసిడి పతకాలకు గాను 12 స్వర్ణాలను భారత షూటర్లే చేజిక్కించుకోవడం విశేషం. వీటితో పాటు భారత్ ఖాతాలో నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు కూడా ఉన్నాయి. నేడు జరిగే జూనియర్ ఈవెంట్ పోటీలతో ఈ టోర్నీ ముగియనుంది. -
మను–సౌరభ్ జంట బంగారు గురి
న్యూఢిల్లీ: టీనేజ్ భారత షూటర్లు మను భాకర్–సౌరభ్ చౌధరీ ద్వయం ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. చైనీస్ తైపీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను–సౌరభ్ ద్వయం విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 17 ఏళ్ల మను, 16 ఏళ్ల సౌరభ్ జతగా 784 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు విటాలినా బత్సరష్‌కినా–అర్తెమ్ చెర్ముసోవ్ (రష్యా–782 పాయింట్లు) పేరిట ఉండేది. ఫైనల్లో మను–సౌరభ్ జంట 484.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. హవాంగ్ సియోన్‌జెయున్–కిమ్ మోస్ (కొరియా–481.1 పాయింట్లు) జంట రజతం... వు చియా యింగ్–కు కువాన్ టింగ్ (చైనీస్ తైపీ–413.3 పాయింట్లు) జోడీ కాంస్యం గెల్చుకున్నాయి. ఇషా–విజయ్‌వీర్ జంటకు స్వర్ణం ఇదే టోర్నీ జూనియర్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ తన భాగస్వామి విజయ్‌వీర్ సిద్ధూతో కలిసి స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఇషా–విజయ్‌వీర్ ద్వయం 478.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్‌లో ఇషా–విజయ్‌వీర్ జంట 769 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన హర్షద–అర్జున్ సింగ్ చీమా జోడీ 755 పాయింట్లతో ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఈ ద్వయం 375 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. -
మళ్లీ గురి తప్పారు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత స్టార్ షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఒత్తిడికి లోనై గురి తప్పారు. ఫలితంగా అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, అనురాధ, హీనా సిద్ధూ, వరుసగా 14వ, 22వ, 25వ స్థానాల్లో నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో గాయత్రి 36వ స్థానంలో, సునిధి చౌహాన్ 49వ స్థానంలో నిలిచారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ఆదర్శ్ సింగ్, అర్పిత్ గోయల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరగ్గా... 16 ఏళ్ల అనీశ్ భన్వాలా ఫైనల్‌కు చేరినా పతకం నెగ్గలేదు. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అనీశ్ భన్వాలా 14 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఒలింపిక్ చాంప్ క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–35 పాయిం ట్లు) స్వర్ణం... ప్రపంచ చాంపియన్ జున్మిన్ లిన్ (చైనా–31 పాయింట్లు) రజతం... కిమ్ జున్హోంగ్ (కొరియా–22 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. -
భారత షూటర్లకు నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి రెండు రోజుల్లో ప్రపంచ రికార్డులు సృష్టించడంతోపాటు పసిడి పతకాలను సొంతం చేసుకున్న భారత షూటర్లకు మూడో రోజు మాత్రం నిరాశ ఎదురైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షూటర్లు దీపక్ కుమార్, రవి కుమార్, దివ్యాంశ్ సింగ్ పన్వర్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. 95 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో దివ్యాంశ్ 627.2 పాయింట్లు స్కోరు చేసి 12వ స్థానంలో... రవి కుమార్ 627 పాయింట్లు సాధించి 14వ స్థానంలో... గతేడాది ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన దీపక్ కుమార్ 624.3 పాయింట్లు స్కోరు చేసి 34వ స్థానంలో నిలిచారు. ఫైనల్లో సెర్గీ కామెన్స్కీ (రష్యా–249.4 పాయింట్లు), యుకున్ లియు (చైనా–247 పాయింట్లు), జిచెంగ్ హుయ్ (చైనా–225.9 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు. మంగళవారం మూడు ఈవెంట్స్‌లో భారత షూటర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో సునిధి చౌహాన్, గాయత్రి... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిద్ధూ, మను భాకర్, శ్రీనివేథ... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భావేశ్ షెకావత్, గుర్ప్రీత్ సింగ్, ఆదర్శ్ సింగ్, అర్పిత్ గోయల్, అనీశ్ పోటీపడనున్నారు. ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వీ చండేలా... రెండో రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌధరీ ప్రపంచ రికార్డులు సృష్టించడంతోపాటు పసిడి పతకాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే. -
భారత షూటర్లకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో గురిపెట్టి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలనుకున్న భారత షూటర్లకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ షూటర్లకు ప్రభుత్వం వీసాలు నిరాకరించడంతో భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ షూటింగ్లో ఒలింపిక్స్ కోటాను రద్దు చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) అధ్యక్షుడు వ్లాదిమిర్ లిసిన్ గురువారం వెల్లడించారు. ‘ఢిల్లీ ఈవెంట్లో ఒలింపిక్స్ కోటా రద్దు చేసినట్లు ఐఓసీ తెలిపింది. క్రీడల్లో వివక్షకు తావులేదని చెప్పింది. ఇక్కడ కేటాయించిన 16 ఒలింపిక్స్ బెర్తుల్ని మరో ప్రపంచకప్‌కు తరలించింది. ఐఓసీలో భాగమైన మేం కమిటీ ఆదేశాలను పాటించక తప్పదు’ అని లిసిన్ తెలిపారు. మరోవైపు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్ మాత్రం తాము ఇంకా ఐఓసీ తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. -
రజతాలు నెగ్గిన షూటర్లు లక్షయ్, దీపక్
పాలెంబాంగ్‌లో భారత షూటర్లు దీపక్ కుమార్ 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో... లక్షయ్ షెరాన్ ట్రాప్ పోటీలో రజత పతకాలు నెగ్గారు. ఈ రెండు ఈవెంట్లలో రవి కుమార్, మానవ్‌జీత్ సింగ్ సంధు నాలుగో స్థానంలో నిలిచి పతకం అవకాశాన్ని కోల్పోయారు. ఓ మెగా ఈవెంట్ పతకాన్వేషణలో దీపక్ కుమార్‌ది సుదీర్ఘ నిరీక్షణ. ఇండోనేసియాలో రజతంతో ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడింది. ఒకట్రెండు కాదు... ఏకంగా 14 ఏళ్లుగా పతకం కోసం శ్రమించాడు. ఈ సారి మాత్రం 33 ఏళ్ల దీపక్ గురితప్పలేదు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల రైఫిల్ పోటీలో అతను 17 షాట్ల వరకు రేసులోనే లేడు. 18వ షాట్ 10.9 పాయింట్లు తెచ్చిపెట్టడంతో అనూహ్యంగా పతకం రేసులోకి వచ్చాడు. 24 షాట్లలో 247.7 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. ఇందులో యంగ్ హరన్ (చైనా; 249.1) స్వర్ణం, లూ షావోచున్ (చైనీస్ తైపీ; 226.8) కాంస్యం నెగ్గారు. రవి కుమార్ (205.2) నాలుగో స్థానం పొందాడు. సంస్కృతంలో నిష్ణాతుడైన దీపక్ పతక విజయంపై ఆధ్యాత్మిక ధోరణిలో స్పందించాడు. ‘ప్రతి ఒక్కరు తమకు దక్కేదానిపై ఆశావహ దృక్పథంతోనే ఉంటారు. నేనూ అంతే... జీవితంలో రాసిపెట్టి ఉంటే అదెప్పుడైనా దక్కుతుంది. అతిగా ఆశించి చింతించాల్సిన పనిలేదు. ఈ విషయాల్ని నేను గురుకుల్ అకాడమీలో పాఠశాల విద్యలోనే నేర్చుకున్నా’ అని దీపక్ అన్నాడు. ఢిల్లీకి చెందిన అతని తల్లిదండ్రులు నగర అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో దీపక్‌ను డెహ్రాడూన్‌లోని గురుకుల్లో చేర్పించారు. ట్రాప్ ఈవెంట్లో మరో భారత షూటర్ లక్షయ్ 43 పాయింట్లతో రజతం చేజిక్కించుకోగా, వెటరన్ షూటర్, మాజీ ప్రపంచ చాంపియన్ మానవ్‌జీత్ సింగ్ గురి తప్పింది. అతను 26 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో యంగ్ కున్పి (చైనీస్ తైపీ; 48) ప్రపంచ రికార్డును సమం చేసి బంగారు పతకం గెలువగా, డేమియంగ్ అహ్న్ (కొరియా; 30) కాంస్యం నెగ్గాడు. మహిళల విభాగంలో భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. 10 మీ. రైఫిల్ ఈవెంట్లో అపూర్వీ చండీలా ఐదో స్థానం, ట్రాప్‌లో సీమ తోమర్ ఆరో స్థానం పొందారు. -
పసిడితో ముగించారు
సిడ్నీ: ఈ నెలారంభంలో సీనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు ఓవరాల్ టీమ్ టైటిల్ నెగ్గగా... అదే జోరును జూనియర్ ప్రపంచకప్‌లోనూ కొనసాగించారు. సిడ్నీలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్ తొమ్మిది స్వర్ణాలతో రెండో ర్యాంక్‌లో నిలిచింది. చివరి రోజు భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల ముస్కాన్ గురికి భారత్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఫైనల్లో ముస్కాన్ 35 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ (18 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముస్కాన్, మను భాకర్, దేవాన్షి రాణా బృందానికి పసిడి పతకం లభించగా... అరుణిమా, మహిమా, తనూ రావల్ జట్టుకు రజతం దక్కింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, ఆయూష్ రుద్రరాజు, గుర్నీలాల్ జట్టు 348 పాయింట్లు సాధించి రజతం గెల్చుకుంది. ఓవరాల్‌గా భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలు గెలిచింది. చైనా తొమ్మిది స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 25 పతకాలు సొంతం చేసుకుంది. -
రిజ్వీ గురి అదిరె...
అంతర్జాతీయ షూటింగ్ సీజన్ తొలి టోర్నమెంట్లో తొలి రోజే భారత షూటర్లు అదరగొట్టారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో మొదటిరోజు భారత షూటర్ల గురికి మూడు పతకాలు లభించాయి. కెరీర్లో తొలి ప్రపంచకప్ ఆడుతోన్న 23 ఏళ్ల ఉత్తరప్రదేశ్ షూటర్ షాజర్ రిజ్వీ ‘ప్రపంచ రికార్డు’ ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోగా... 18 ఏళ్ల బెంగాలీ అమ్మాయి మెహులీ ఘోష్ కాంస్య పతకం కైవసం చేసుకొని ఔరా అనిపించింది. స్టార్ షూటర్ జీతూ రాయ్ తన సత్తా చాటుతూ కాంస్యాన్ని దక్కించుకొని తన ఖాతాలో మరో అంతర్జాతీయ పతకాన్ని జమ చేసుకున్నాడు. గ్వాడలహారా (మెక్సికో): ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన తొలి ప్రపంచకప్‌లోనే భారత యువ పిస్టల్ షూటర్ షాజర్ రిజ్వీ అద్వితీయ ప్రదర్శన చేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో మీరట్‌కు చెందిన రిజ్వీ 242.3 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 241.8 పాయింట్లతో తొమొయుకి మత్సుదా (జపాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రిజ్వీ బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 219 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకోగా... క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–239.7 పాయింట్లు) రజత పతకం సాధించాడు. మరో భారత షూటర్ ఓంప్రకాశ్ 198.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. 33 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో క్రిస్టియన్ రీట్జ్ (588 పాయింట్లు) తొలి స్థానంలో నిలువగా... రిజ్వీ (579 పాయింట్లు), జీతూ రాయ్ (578 పాయింట్లు), ఓంప్రకాశ్ (576 పాయింట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను పొంది ఫైనల్‌కు చేరారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్ నుంచి ముగ్గురు షూటర్లు మెహులీ ఘోష్, అపూర్వీ చండేలా, అంజుమ్ మౌద్గిల్ ఫైనల్‌కు చేరారు. తొలి ప్రపంచ కప్ ఆడుతోన్న మెహులీ ఘోష్ 228.4 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. లారా జార్జెటా కొమన్ (రొమేనియా–251.5 పాయింట్లు) స్వర్ణం... జూ హాంగ్ (చైనా–251 పాయింట్లు) రజతం సాధించారు. గతేడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మెహులీ ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించి వెలుగులోకి వచ్చింది. భారత్‌కే చెందిన అంజుమ్ 208.6 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పొందగా... అపూర్వీ 144.1 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. -
భారత షూటర్ల జోరు
వాకో సిటీ (జపాన్): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ భారత షూటర్ల గురి అదిరింది. శనివారం జూనియర్, యూత్ విభాగాల్లో ఆరు ఈవెంట్స్ జరగ్గా... ఆరింటిలోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల టీమ్ విభాగంలో శ్రేయా సక్సేనా, సమీక్ష ఢింగ్రా, మనీని కౌశిల్లతో కూడిన భారత బృందం 1238.1 పాయింట్లతో కాంస్యం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో సమీక్ష ఢింగ్రా 249.6 పాయింట్లతో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తుషార్ మానె 228.2 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ పురుషుల టీమ్ విభాగంలో తుషార్ మానె, హృదయ్ హజారికా, మోహిత్ కుమార్ అగ్నిహోత్రిలతో కూడిన భారత బృందం 1863.1 పాయింట్లతో పసిడి పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల యూత్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్ 250.5 పాయింట్లతో స్వర్ణం సంపాదించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల యూత్ టీమ్ విభాగంలో మెహులీ ఘోష్, రక్షణ చక్రవర్తి, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు 1240.5 పాయింట్లతో కాంస్యం దక్కించుకుంది. -
ఐదు పతకాలతో శుభారంభం
వాకో సిటీ (జపాన్): బరిలోకి దిగిన తొలి రోజే భారత షూటర్లు అదరగొట్టారు. ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు గెల్చుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రవి కుమార్ కాంస్యం సాధించగా... జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా రజతం దక్కించుకున్నాడు. పురుషుల, జూనియర్ పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత జట్లు మూడు రజత పతకాలు సాధించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రవి 225.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో రవి, గగన్ నారంగ్, దీపక్‌లతో కూడిన భారత జట్టు (1876.6 పాయింట్లు) రజతం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ (249.7 పాయింట్లు) రజతం నెగ్గాడు. అర్జున్, తేజస్ కృష్ణప్రసాద్, సన్‌మూన్ సింగ్‌లతో కూడిన భారత జట్టు రజతం గెలిచింది. అంజుమ్, మేఘన, పూజాలతో కూడిన భారత మహిళల జట్టు 1247 పాయింట్లతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచింది. -
స్వర్ణంతో ముగింపు
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): స్వర్ణ పతకంతో ఖాతా తెరిచిన భారత షూటర్లు తమ పోరాటాన్ని స్వర్ణంతోనే ముగించడం విశేషం. కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు సోమవారం భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం కూడా లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సత్యేంద్ర సింగ్ బంగారు పతకం సొంతం చేసుకోగా... సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన చెయిన్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు పురుషుల ట్రాప్ ఈవెంట్లో బీరేన్‌దీప్ సోధి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు దక్కడం విశేషం. క్వాలిఫయింగ్‌లో 1162 పాయింట్లు స్కోరు చేసిన సత్యేంద్ర సింగ్ ఫైనల్లో 454.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. సంజీవ్ 453.3 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. డేన్ సామ్సన్ (ఆస్ట్రేలియా)కు కాంస్యం లభించింది. -
అనీశ్‌కు రజతం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పోటీల ఆరో రోజు ఆదివారం భారత్‌కు రజతం, కాంస్యం లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా రజత పతకం సొంతం చేసుకోగా... నీరజ్ కుమార్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అనీశ్ 26 పాయింట్లు, నీరజ్ 23 పాయింట్లు సాధించి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు 18 పతకాలు వచ్చాయి. -
భారత షూటర్లకు రెండు స్వర్ణాలు
బ్రిస్బేన్: తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటూ భారత షూటర్లు కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. పోటీల రెండో రోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న మూడు పతకాలను భారత షూటర్లు షాజర్ రిజ్వీ, ఓంకార్ సింగ్, జీతూ రాయ్ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా... 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సంపాదించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజా ఘాట్కర్ స్వర్ణం, అంజుమ్ మౌద్గిల్ రజతం గెలిచారు. పూజా 249.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... అంజుమ్ 248.7 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. పురుషుల స్కీట్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో మేరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్‌వీర్ సింగ్ బాజ్వా, షీరాజ్ షేక్ 119 పాయింట్లు చొప్పున స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. పోటీల తొలి రోజు హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) స్వర్ణం... దీపక్ కుమార్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రజతం గెలిచారు. -
స్వదేశంలో భారత షూటర్లకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన భారత షూటర్లకు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. వారి దగ్గరున్న గన్స్, మందుగుండు క్లియరెన్స్ కోసం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు దాదాపు పది గంటలపాటు వారిని నిరీక్షించేలా చేశారు. చైన్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, హీనా సిద్ధూ, కైనన్ చెనాయ్ తదితరులతో కూడిన 13 మంది బృందం సైప్రస్ నుంచి మంగళవారం ఉదయం 5 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే క్లియరెన్స్ పేరిట అధికారులు వీరిని మధ్యాహ్నం 2.30కి బయటికి వదిలారు. ఈ ఉదంతంపై దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ఘాటుగా స్పందించాడు. ‘ఎయిర్పోర్ట్ అధికారులు వారి గన్లకు క్లియరెన్స్ ఇవ్వకపోవడం దారుణం. అసోసియేషన్ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడం బాధించింది. అసలు భారత క్రికెటర్లు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా?’ అని బింద్రా ప్రశ్నించాడు. -
గురి అదిరింది
జీతూ–హీనా జంటకు స్వర్ణం రజతం నెగ్గిన అంకుర్ మిట్టల్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మెరిశారు. సొంతగడ్డపై జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్‌ను ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ విభాగంలో భారత స్టార్ షూటర్లు జీతూ రాయ్–హీనా సిద్ధూ జతగా బరిలోకి దిగారు. ఫైనల్లో జీతూ–హీనా ద్వయం 5–3తో యుకారి కొనిషి–తొమొయుకి మత్సుదా (జపాన్) జోడీపై గెలిచింది. మూడో స్థానంలో నిలిచిన నఫాస్వన్ యాంగ్‌పైబూన్–కెవిన్ వెంటా (స్లొవేనియా) జంటకు కాంస్య పతకం లభించింది. షూటింగ్ రేంజ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మిక్స్డ్ ఈవెంట్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించినందుకు షూటర్లకు పతకాలు ప్రదానం చేసినా ఫలితాలకు మాత్రం అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. పతకాల పట్టిక జాబితాలో కూడా వీటిని చేర్చలేదు. పాయింట్ తేడాతో...: మరోవైపు పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో అంకుర్ మిట్టల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కేవలం పాయింట్ తేడా తో అంకుర్‌కు స్వర్ణం చేజారింది. ఫైనల్లో అంకుర్ 74 పాయింట్లు స్కోరు చేశాడు. జేమ్స్ విలెట్ (ఆస్ట్రేలియా) 75 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జేమ్స్ డీడ్మన్ (బ్రిటన్–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన సంగ్రామ్ దహియా ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కొత్త నిబంధనల ప్రకారం డబుల్ ట్రాప్ ఫైనల్ ఈవెంట్లో షాట్ల సంఖ్యను 50 నుంచి 80 షాట్లకు పెంచారు. 30 షాట్లు పూర్తయిన తర్వాత తక్కువ స్కోరు ఉన్న వారు నిష్క్రమించడం మొదలవుతుంది. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో అంకుర్ 137 పాయింట్లతో నాలుగో స్థానంలో, సంగ్రామ్ 138 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించారు. 15 ఏళ్ల శపథ్ భరద్వాజ్ 132 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టాప్–6లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో తేజస్విని సావంత్ 402.4 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ రజతం, కాంస్యం నెగ్గింది. -
భారత షూటర్లకు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజు భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ ఐదో స్థానాన్ని సాధించగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హర్వీన్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్స్‌లో సంజీవ్ 420.6 పాయింట్లు, హర్వీన్ 133.6 పాయింట్లు స్కోరు చేశారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధూ క్వాలిఫయింగ్‌లో 378 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. -
భారత షూటర్లకు మరో ఐదు పతకాలు
గబాలా (అజర్బైజాన్): జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోటీల్లో భారత్‌కు మొత్తం ఐదు పతకాలు లభించాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల, పురుషుల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత జట్లకు పసిడి పతకాలు దక్కాయి. పురుషుల వ్యక్తిగత 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అన్హద్ జవాండా భారత్‌కు మరో స్వర్ణం అందించగా... గుర్మీత్ రజతం గెలిచాడు. ప్రగతి గుప్తా, సౌమ్య గుప్తా, మనీషాలతో కూడిన భారత మహిళల జట్టుకు ట్రాప్ ఈవెంట్లో కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్‌కు 9 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు వచ్చాయి. -
భారత షూటర్ల జోరు
గబాలా (అజర్బైజాన్): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు పతకాలు లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ రుషిరాజ్ బారోట్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 19 ఏళ్ల రుషిరాజ్ 556 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఫైనల్లో రుషిరాజ్ 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... లుకాస్ స్కుర్మల్ (చెక్ రిపబ్లిక్-23 పాయింట్లు) రజత పతకాన్ని, సెర్గీ ఎవ్‌గ్లెవ్‌స్కీ (ఆస్ట్రేలియా-20 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించారు. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ప్రతీక్, అర్జున్ బబూటా, ప్రశాంత్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం లభించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో అర్జున్‌కు కాంస్యం దక్కింది. 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో అన్మోల్, నిశాంత్ భరద్వాజ్, అర్జున్ దాస్లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో దిల్రీన్ గిల్, గీతాలక్ష్మి దీక్షిత్, ఆశి రస్తోగిలతో కూడిన భారత జట్టు కాంస్యం కై వసం చేసుకుంది. -
భారత్ గురి అదిరింది
గబాలా (అజర్బైజాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల గురికి మూడు స్వర్ణాలు లభించాయి. ఆదివారం జరిగిన పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో శుభాంకర్ ప్రమాణిక్... 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో సంభాజీ పాటిల్... ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి. ఫైనల్లో బెంగాల్‌కు చెందిన శుభాంకర్ 205.5 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం సొంతం చేసుకోగా... ఫిలిప్ నెపెచాల్ (చెక్ రిపబ్లిక్-205.2 పాయింట్లు) రజతం, ద్రగోమిర్ లార్డెచె (రొమేనియా) కాంస్యం సాధించారు. టీమ్ విభాగంలో శుభాంకర్, ఫతే సింగ్ ధిల్లాన్, అజయ్ నితీశ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. స్టాండర్డ్ పిస్టల్ ఫైనల్లో సంభాజీ పాటిల్ 562 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో సంభాజీ, గుర్మీత్ సింగ్, రితురాజ్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం దక్కింది. -
స్వప్నిల్‌కు స్వర్ణం
కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్ల గురికి నాలుగు పతకాలు ఖాతాలోకి చేరాయి. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే పసిడి పతకాన్ని సాధించాడు. ఫైనల్లో అతను 453.3 పాయింట్లు స్కోరు చేశాడు. స్వప్నిల్, అఖిల్ షెరాన్, ఇషాన్ గోయెల్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ఈవెంట్లో రజతం నెగ్గింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత బృందానికి రజత పతకం లభించింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. -
గుర్‌ప్రీత్‌కు రజతం జీతూరాయ్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో గుర్ప్రీత్ సింగ్ రజతం... జీతూ రాయ్ కాంస్య పతకం గెలిచారు. ఇరాన్ షూటర్ సెఫెర్ బొరూజెని (198.7 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించాడు. గుర్ప్రీత్ 197.6 పాయింట్లు, జీతూ రాయ్ 177.6 పాయింట్లు స్కోరు చేశారు. గుర్ప్రీత్ సింగ్, జీతూ రాయ్, ఓంకార్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ ఈవెంట్లో 1734 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సుమేధ్ కుమార్ స్వర్ణం, హేమేంద్ర సింగ్ రజత పతకం నెగ్గారు. యూత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మోహిత్ గౌర్ కాంస్యం నెగ్గగా... మోహిత్ గౌర్, షైన్‌కి నాగర్, సమర్జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. -
అయోనికాకు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ భారత షూటర్ల గురి అదిరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అయోనికా పాల్ కాంస్య పతకం సాధించగా... అయోనికా పాల్, అపూర్వీ చండీలా, పూజా ఘాట్కర్లతో కూడిన భారత జట్టుకు టీమ్ ఈవెంట్లో (1241.4 పాయింట్లు) రజత పతకం లభించింది. వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి అయోనికా, అపూర్వీ, పూజా ఫైనల్‌కు చేరుకోగా... అయోనికా 185 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అపూర్వీ ఎనిమిదో స్థానంతో, పూజా ఐదో స్థానంతో సంతృప్తి పడ్డారు. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆశి రస్తోగి స్వర్ణం, ప్రాచీ గడ్కరీ కాంస్యం నెగ్గగా... జూనియర్ విభాగంలో శ్రీయాంక సాదంగి కాంస్య పతకం సొంతం చేసుకుంది. -
గగన్‌కు రెండు పతకాలు
బింద్రా, చైన్ సింగ్‌లకు కూడా... హనోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: వచ్చే వారం అమెరికాలో మొదలయ్యే ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీకి ముందు భారత షూటర్లు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, చైన్ సింగ్ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. జర్మనీలో జరిగిన హనోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీలో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్‌తోపాటు అభినవ్ బింద్రా, చైన్ సింగ్ రెండేసి పతకాలను సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో గగన్ నారంగ్ (620.3), అభినవ్ బింద్రా (628.3), చైన్ సింగ్ (626.2)లతో కూడిన భారత బృందం 1874.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌లో అభినవ్ బింద్రా (208.2 పాయింట్లు), పసిడి పతకాన్ని, చైన్ సింగ్ (206) రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో గగన్ నారంగ్ 447.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి చండేలా (188.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. -
భారత షూటర్లకు అవమానం
న్యూఢిల్లీ : ప్రపంచకప్ షూటింగ్లో పాల్గొన్న భారత షూటర్లు బ్యాంకాక్ విమానాశ్రయంలో అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి ముంబైకి రావాల్సిన హీనా సిద్ధూ, అంజలీ భగవత్ తమ దగ్గరున్న ఆయుధాలకు సరైన పత్రాలు చూపని కారణంగా అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అయితే వీరి ప్రవర్తనపై షూటర్లు అభ్యంతరం తెలిపారు. తమ దగ్గర అన్ని అనుమతులున్నా అడ్డుకున్నారని ఆరోపించారు. ‘మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా బ్యాంకాక్‌లోని జెట్ ఎయిర్వేస్ సెక్యూరిటీ మేనేజర్ మమ్మల్ని విమానంలో ఎక్కకుండా అడ్డుకున్నాడు. అతడు దీన్ని ఇగో సమస్యగా తీసుకున్నాడు. డీజీసీఏ అనుమతి, కస్టమ్స్ క్లియరెన్స్ లేఖ చూపినా పట్టించుకోలేదు’ అని హీనా సిద్ధూ తెలిపింది. అనంతరం జాతీయ రైఫిల్స్ సంఘం జోక్యంతో వారిద్దరు ఎయిరిండియా విమానంలో తిరిగి స్వదేశానికి చేరారు. -
ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్‌కు కాంస్యం
ఇంచియోన్: ఆసియా గేమ్స్‌లో భారత మహిళా షూటర్లు మెరిశారు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది. భారత షూటర్లు రాహి సర్నోబత్ (580), అనీసా సయ్యద్ (577), హీనా సిద్ధు (572) మొత్తం 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా స్వర్ణం, చైనా రజత పతకాలు సొంతం చేసుకున్నాయి. -
దూసుకెళ్తున్న భారత షూటర్లు
ఇంచియాన్: 17వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు బుల్లెట్ మీద బుల్లెట్ దించుతున్నారు. గురి తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా మరో కాంస్య పతకం సాధించి ఈ విభాగంలో గెల్చుకున్న మెడల్స్ సంఖ్య నాలుగు పెంచారు. మహిళల 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో భాతర షూటర్లు హీనా సిద్ధూ, అనీషా సయ్యద్, రహీ సర్నోబాట్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఇండియాకు నాలుగో రోజు రెండు పతకాలు దక్కాయి. స్వ్కాష్ లో దిపికా పల్లికల్ కాంస్యం గెల్చుకుంది. మొత్తం ఆరు పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ 13వ స్థానంలో నిలిచింది. స్వ్కాష్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి సౌరవ్ గోషల్ మరో పతకం ఖాయం చేశాడు. ఫైనల్లో ఓడిపోయినా అతడికి సిల్వర్ మెడల్ ఖాయం. -
భారత షూటర్లకు రెండు పతకాలు
- జీతూ రాయ్‌కు రజతం - అయోనిక ఖాతాలో కాంస్యం - షూటింగ్ ప్రపంచకప్ మారిబోర్ (స్లొవేనియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల గురి అదిరింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ రజతం... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనిక పాల్ కాంస్య పతకం సాధించారు. సోమవారం జరిగిన ఈ పోటీల ఫైనల్లో జీతూ రాయ్ 193.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించాడు. జీతూ రాయ్ ధాటికి ప్రపంచ చాంపియన్ తొమోయుకి మత్సుదా (జపాన్-172.9 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. దామిర్ మికెక్ (సెర్బియా-194 పాయింట్లు) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీతూ రాయ్‌కిది వారం వ్యవధిలో రెండో రజతం కావడం విశేషం. గతవారం మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచకప్‌లోనూ అతను రజతం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మహారాష్ట్ర అమ్మాయి అయోనిక పాల్ 185.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కెరీర్లో తొలి ప్రపంచకప్ పతకాన్ని దక్కించుకుంది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ యి సిలింగ్ (చైనా-209.6 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. షూటర్లకు అమితాబ్ చేయూత ముంబై: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యువ క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలవనున్నారు. ఇద్దరు మహిళా షూటర్లు అయోనికా పాల్, పూజా ఘట్కర్‌లను ఆయన స్పాన్సర్ చేస్తారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్రణాళికలో భాగంగా ఆటగాళ్లకు అమితాబ్ తన మద్దతు పలికారు.