భారత్ గురి అదిరింది | Indian shooters win three gold medals in ISSF Junior World Cup | Sakshi
Sakshi News home page

భారత్ గురి అదిరింది

Published Mon, Sep 19 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

భారత్ గురి అదిరింది

భారత్ గురి అదిరింది

 గబాలా (అజర్‌బైజాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల గురికి మూడు స్వర్ణాలు లభించాయి. ఆదివారం జరిగిన పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో శుభాంకర్ ప్రమాణిక్... 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో సంభాజీ పాటిల్... ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి.
 
  ఫైనల్లో బెంగాల్‌కు చెందిన శుభాంకర్ 205.5 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం సొంతం చేసుకోగా... ఫిలిప్ నెపెచాల్ (చెక్ రిపబ్లిక్-205.2 పాయింట్లు) రజతం, ద్రగోమిర్ లార్డెచె (రొమేనియా) కాంస్యం సాధించారు. టీమ్ విభాగంలో శుభాంకర్, ఫతే సింగ్ ధిల్లాన్, అజయ్ నితీశ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. స్టాండర్డ్ పిస్టల్ ఫైనల్లో సంభాజీ పాటిల్ 562 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో సంభాజీ, గుర్మీత్ సింగ్, రితురాజ్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement