Subhankar
-
బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా శుభాంకర్ సర్కార్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్ నియమితులయ్యారు. సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శుభాంకర్ను నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ఆదేశాలు జారీచేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా శుభాంకర్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరంలలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. అధిర్ హయాంలో రాష్ట్రస్థాయిలో టీఎంసీతో తీవ్ర విబేధాలు ఉండేవి. -
భారత షట్లర్లకు కరోనా కష్టాలు!
సార్‌బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్ లక్స్ ఓపెన్ సూపర్–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్ జయరాం, శుభాంకర్ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం. వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ బుధవారం కరోనా ‘పాజిటివ్’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్‌తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్ వరకు ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు. నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్ ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్ తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
బ్యాడ్మింటన్‌కు వేళాయె!
ఒడెన్స్ (డెన్మార్క్): కరోనా వైరస్ కారణంగా మార్చి నెల రెండో వారం నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సందడి మొదలుకానుంది. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ జరగనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు లక్ష్య సేన్, అజయ్ జయరామ్, శుభాంకర్ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరైన సన్నాహాలు లేని కారణంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టోబీ పెంటీ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; జేసన్ ఆంథోనీ (కెనడా)తో శుభాంకర్; అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో అజయ్ జయరామ్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో లక్ష్య సేన్ ఆడనున్నారు. -
అవధ్ వారియర్స్‌ను గెలిపించిన శుభాంకర్ డే
చెన్నై: ఉత్కంఠ పోరులో అవధ్ వారియర్స్ ఆటగాడు శుభాంకర్ డే సత్తా చాటాడు. విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ బరిలో దిగిన అతను అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 4–3తో నార్త్ ఈస్టర్న్‌పై గెలిచింది. తొలుత మిక్స్డ్ డబుల్స్‌లో బొదిన్ ఇసారా–కిమ్ హన (నార్త్ ఈస్టర్న్) ద్వయం 15–8, 11–15, 14–15తో కొ సుంగ్ హ్యూన్–క్రిస్టీనా (అవధ్ వారియర్స్) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్ పోరులో లే చెయుక్ యు (నార్త్ ఈస్టర్న్) 13–15, 15–10, 15–11తో విన్సెంట్ (అవధ్ వారియర్స్)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి. దాంతో నార్త్ ఈస్టర్న్ 2–1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో మిచెల్లె లీ (నార్త్ ఈస్టర్న్) 15–13, 15–14తో బీవెన్ జాంగ్ (అవధ్ వారియర్స్)ను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్’ కార్డుతో బరిలో దిగిన అవధ్ వారియర్స్ జంట కొ సుంగ్ హ్యూన్– షిన్ బేక్ 8–15, 15–14, 15–12తో కృష్ణ ప్రసాద్– లీ యాంగ్ డే (నార్త్ ఈస్టర్న్) ద్వయంపై గెలువడంతో... ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి పోరులో సెన్సోమ్బూన్సుక్ (నార్త్ ఈస్టర్న్) 9–15, 13–15తో శుభాంకర్ డే చేతిలో ఓడటంతో... మ్యాచ్ అవధ్ వారియర్స్ వశం అయింది. నేటి మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్ తలపడుతుంది. -
సార్లార్లక్స్ ఓపెన్ విజేత శుభాంకర్
న్యూఢిల్లీ: ఆద్యంతం సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శుభాంకర్ డే తన కెరీర్లో నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. జర్మనీలోని సార్‌బ్రకెన్ నగరంలో ఆదివారం ముగిసిన సార్లార్లక్స్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో 25 ఏళ్ల శుభాంకర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 64వ ర్యాంకర్ శుభాంకర్ 21–11, 21–14తో ప్రపంచ 37వ ర్యాంకర్, ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన శుభాంకర్ ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌పై సంచలన విజయం సాధించాడు. అదే జోరును టోర్నీ చివరిదాకా కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలిచిన శుభాంకర్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షల 10 లభించింది. గతంలో శుభాంకర్ 2014లో బహ్రెయిన్ ఓపెన్, 2017లో పోర్చుగల్ ఓపెన్, ఐస్‌ల్యాండ్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు. -
భారత్ గురి అదిరింది
గబాలా (అజర్బైజాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల గురికి మూడు స్వర్ణాలు లభించాయి. ఆదివారం జరిగిన పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో శుభాంకర్ ప్రమాణిక్... 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో సంభాజీ పాటిల్... ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి. ఫైనల్లో బెంగాల్‌కు చెందిన శుభాంకర్ 205.5 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం సొంతం చేసుకోగా... ఫిలిప్ నెపెచాల్ (చెక్ రిపబ్లిక్-205.2 పాయింట్లు) రజతం, ద్రగోమిర్ లార్డెచె (రొమేనియా) కాంస్యం సాధించారు. టీమ్ విభాగంలో శుభాంకర్, ఫతే సింగ్ ధిల్లాన్, అజయ్ నితీశ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. స్టాండర్డ్ పిస్టల్ ఫైనల్లో సంభాజీ పాటిల్ 562 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో సంభాజీ, గుర్మీత్ సింగ్, రితురాజ్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం దక్కింది.