న్యూఢిల్లీ: ఆద్యంతం సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శుభాంకర్ డే తన కెరీర్‌లో నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. జర్మనీలోని సార్‌బ్రకెన్ నగరంలో ఆదివారం ముగిసిన సార్లార్‌లక్స్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్‌లో 25 ఏళ్ల శుభాంకర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 64వ ర్యాంకర్ శుభాంకర్ 21–11, 21–14తో ప్రపంచ 37వ ర్యాంకర్, ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.
అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన శుభాంకర్ ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌పై సంచలన విజయం సాధించాడు. అదే జోరును టోర్నీ చివరిదాకా కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలిచిన శుభాంకర్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షల 10 లభించింది. గతంలో శుభాంకర్ 2014లో బహ్రెయిన్ ఓపెన్, 2017లో పోర్చుగల్ ఓపెన్, ఐస్‌ల్యాండ్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment