jermany
-
వెలుగు ప్రదాత: జాన్ క్రిస్టియన్ ఫ్రెడెరిక్ హయ్యర్
ఆడపిల్లలకు చదువెందుకని ప్రశ్నించే రోజుల్లో పట్టుబట్టి బాలికలకు చదువు చెప్పడానికి విద్యాలయాలు స్థాపించిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ (1793–1873). ముఖ్యంగా తెలుగునేలపై వెలుగు నింపిన మానవతామూర్తి ఆయన. జర్మనీలోని హెల్మెస్టడ్ ప్రాంతంలో 1793 జూలై 10న జన్మించిన ఈయన అమెరికా వెళ్లి ఫిలడెల్ఫియాలో వేదాంత శాస్త్రం, యూని వర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్య విద్యలో ఎండీ పట్టా పొందాడు. మెడిసిన్ చదివే రోజుల్లోనే సంస్కృతం నేర్చుకున్నాడు. మిషనరీగా అభిషేకం పొంది దాదాపు 300 పైగా సండే స్కూల్స్ నెలకొ ల్పాడు. హయ్యర్ చురుకుదనాన్ని గమనించిన మెకానిక్స్ బర్గ్‌కు చెందిన ‘ది సెంట్రల్ మిషనరీ సొసైటీ’ వారు భారతదేశానికి మిషనరీగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా హయ్యర్ 1842 జూలై 31న గుంటూరు వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకుని తొలి పాఠశా లను 1842 నవంబరులో ప్రారంభించాడు. అదీ కేవలం బాలికలకు మాత్రమే. నెల గడిచేసరికి ఎని మిది మంది ముస్లిం బాలికలకు పాఠశాల ప్రవేశం కల్పించాడు. అనంతరం అన్ని వర్గాల వారికి ఏడు పాఠశాలలు నెలకొల్పి బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 1844 నాటికి మరో ఎనిమిది పాఠశాలలు ప్రారంభించారు.ఆ కాలంలో ప్రసూతి సమయంలో సరైన వైద్యం లభించక తల్లీ–పిల్లలు మరణించేవాళ్లే ఎక్కువ. అందుకే గుంటూరు కొత్తపేటలో 1843లో ఉచిత వైద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశాడు. 1845 నాటికి రాజమండ్రి, భీమవరంలో పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శాలలు ప్రారంభించాడు. హయ్యర్ ఒక ఆదర్శమూర్తిగా దర్శనమిస్తాడు. జీవిత భాగస్వామి ఎంపికలో ఇద్దరు పిల్లలున్న మేరీగాష్ అనే వితంతువును వివాహం చేసుకుని కొత్త జీవితం కల్పించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగులోనూ కీర్తనలు రాశాడని అంటారు. తెలుగు వారికి సేవచేసి విద్య, వైద్యంతో ప్రజల గుండెల్లో నిలిచిన హయ్యర్ 1873లో 80 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో మరణించాడు.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి -
జీ-7: జర్మన్ ఛాన్సలర్ పుట్టినరోజు.. బర్త్ డే సాంగ్‌తో శుభాకాంక్షలు
ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్‌లో తొలి రోజు దేశాధినేతల రాక.. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిచింది. జీ-దేశాల సమ్మిట్ భారత్ తరఫున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ సైతం పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే తోలి రోజు సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.యురోపియన్ కమిషన్ ప్రెజిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లడాకుంటున్నారు. అంతలోనే లేయన్ అక్కడే ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బర్త్ డే ఈరోజు అని జోబైడెన్‌తో చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ.. అయితే ఆయన కోసం మీరు బర్త్ డే సాంగ్ పాడారా? అని అడిగారు.#G7 Italia 2024: #Biden, #Meloni and other world leaders sing happy birthday song for German Chancellor Catch the day's latest news here ➠ https://t.co/mTNeb6ks1i 🗞️ pic.twitter.com/qYordDWk95— Economic Times (@EconomicTimes) June 14, 2024 బైడెన్ ఫ్యామిలీలో అయితే పుట్టినరోజు వేళ బర్త్ డే సాంగ్ పడుతామని అన్నారు. వెంటనే బైడెన్ బర్త్‌డే సాంగ్ మొదలుపెట్టగా అక్కడికి వచ్చిన దేశాధినేతలు అయనతో పాడుతూ.. ఓలాఫ్ స్కోల్జ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు ఓలాఫ్ స్కోల్జ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ వీడియో కనిపిస్తారు.ఓలాఫ్ స్కోల్జ్ 2021 డిసెంబర్ నుంచి జర్మనీ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. ఆయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD)సభ్యుడు. ఛాన్సలర్ కావడానికి ముందు.. స్కోల్జ్ 2018 నుంచి 2021 వరకు మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకీర్ణ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్, ఆర్థిక మంత్రిగా పని చేశారు. -
కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం
బెర్లిన్: జర్మనీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది. రోజుకు 76 వేలకు పైనే కోవిడ్ కేసులు నమోదు కావడం అక్కడ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు జర్మనీ ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆ కేసుల ఉధృతి ఎంతలా ఉందంటే ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ఆస్పత్రలకు తరలించే నిమిత్తం ఆఖరికి వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపింది. అంతేకాదు జర్మనీలోని దక్షిణ నగరం అయిన మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉన్న కరోనా రోగులను ఉత్తర ఓస్నాబుక్ సమీపంలోని ముయెన్స్టర్కు తరలించేందుకు జర్మనీ విమానంలో "ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు" గా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది. (చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన) అయితే ఈ విధంగా జర్మనీ విమానాలను వినియోగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బెర్లిన్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాను కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రాంతంగా ప్రకటించనుందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా జర్మనీ దేశం దక్షిణాఫ్రికా నుండి జర్మనులు జర్మనీకి రావడానికి మాత్రమే విమానాలు అనుమతిస్తామని, పైగా వ్యాక్సిన్లు తీసుకున్నవారితో సహా అందరూ 14 రోజులు క్యారంటైన్లో ఉండాలని సూచించింది. అంతేకాదు ఈ కొత్త వైరంట్ని బి.1.1.529 పిలుస్తారని, ఇది యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగల సామర్థ్యం గలదని దక్షిణాఫ్రికా శాస్రవేత్తలు ప్రకటించని సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ మరిన్ని సమస్యలను సృష్టింస్తుందన్న ఆందోళనతోనే తాము ముందుగానే తగు చర్యలు తీసుకుంటున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) -
ఫొటోషూట్‌కు వెళ్లిన మోడల్‌పై చిరుతల దాడి
జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్‌పై రెండు చిరుత పులులు దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సదరు మోడల్ పేరు జెస్సికా లీడోల్ఫ్(36). ప్రముఖ అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. తూర్పు జర్మనీ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోంను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరుతలు ఉండే బోనుకు సమీపంలో జెస్సికా ఫొటోషూట్ తీసుకుంటుండగా రెండు చిరుతలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో పేర్కొన్నారు. చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నోటీసులు రాలేదంటున్న నటులు! ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు సదరు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు రిటైర్ట్ హోం యజమాని బిర్గిట్ స్టేచ్‌ను పోలీసులు కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో యజమానిపై కేసు నమోదు చేసి, ఈ హోంను అధికారికంగా నిర్వహిస్తున్నారా లేదా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. చదవండి: బిగ్‌బాస్ : అఫిషియల్ డేట్ వచ్చేసింది.. లిస్ట్ ఇదే! -
జర్మనీకి చుక్కలు చూపించిన స్టార్ ఆటగాడెవరో తెలుసా?
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో అనుభవజ్ఞుడైన భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ జర్మనీ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని 5-4 తో విజయాన్ని భారత్‌కు అందించారు. మరోవైపు ఈ విజయంపై టీమిండియా కోచ్ , ఆస్ట్రేలియన్, గ్రాహం రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. అలాగే మ్యాచ్ మొత్తానికి హీరోగా నిలిచిన స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ విజయానందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దీనిపై తన కుటుంబం గర్వంగా ఫీలవుతోందన్నారు. ఈ ఆనందంలో అమ్మ కన్నీరు పెట్టుకుందని తనతో సరిగ్గా మాట్లాడలేకపోయిందని పేర్కొన్నాడు. తనకు ఇది పునర్జన్మ అని ఈ ఘనత కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయడంలో సహాయపడుతుందనే విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే.. అపూర్వ విజయం విజిల్ వినిపించగానే నార్త్ పిచ్‌లో శ్రీజేష్ గోల్‌పోస్ట్ పైకి ఎక్కిన ఫోటో వైరల్‌గా మారింది. ‘జీవితమంతా పోస్ట్‌తోనే గడిపాను. అది నా ప్లేస్. నా కష్టం, నష్టం...సంతోషం...దుఃఖం అన్నీ పోస్ట్‌తోనే.. అందుకే అలా ఎక్కి వేడుక చేసుకున్నా’ అని శ్రీజేష్ భావోద్వేగంతో వెల్లడించాడు. మరోవైపు లాంగ్ హాలిడే ప్లాన్ చేస్తున్నామని శ్రీజేష్ భార్య అనీషా మీడియాతో పేర్కొనడం విశేషం. కాగా భారత జట్టులోని సిమ్రంజీత్ సింగ్ (17, 34 వ నిమిషాలు) తొలి బ్రేస్ సాధించగా, హార్దిక్ సింగ్ (27 వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (29 వ) రూపిందర్ పాల్ సింగ్ (31 వ) గోల్ సాధించారు. జర్మనీ తరఫున తైమూర్ ఒరుజ్ (2 వ), నిక్లాస్ వెల్లెన్ (24 వ), బెనెడిక్ట్ ఫుర్క్ (25 వ) లుకాస్ విండ్‌ఫెడర్ (48 వ) గోల్స్ సాధించిన సంగతి తెలిసిందే. -
మోడల్ ట్రైన్.. వైన్‌గ్లాసులను తాకుతూ కొత్త మెలోడీ .. ఎక్కడంటే!
బెర్లిన్: జర్మనీ హ్యాంబర్గ్‌లోని మినియేచర్ వండర్లాండ్ మ్యూజియం బొమ్మ రైళ్లకు పెట్టింది పేరు. బొమ్మ నగరాలు, బొమ్మ అడవులు, బొమ్మ నదులను దాటుతూ ప్రయాణిస్తుంటే పిల్లలే కాదు, పెద్దలు పిల్లలై ఆనందిస్తారు. గత సంవత్సరం కరోనా వల్ల ఈ మ్యూజియంను మూసివేయవలసి వచ్చింది. ఈ ఖాళీ సమయంలో మ్యూజియం టీమ్ గోళ్లుగిల్లుకుంటూ కూర్చోకుండా వినూత్నమైన ఆలోచన చేసింది. 211 మీటర్ల ట్రాక్‌లో ప్రయాణం చేసే మోడల్ ట్రైన్‌కు అటు ఇటూ 2,840 వైన్గ్లాస్లను పెట్టి అందులో నీళ్లు పోసారు. ఇందులో వింత ఏముంది అంటారా? ఈ మోడల్ ట్రైన్ చికుబుకు... అంటూ ప్రయాణించదు. కమ్మని మెలోడిలు వినిపిస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంగీత ప్రయాణంలో వినిపించే ప్రపంచ ప్రసిద్ధ మెలోడి తరంగాలు వైన్గ్లాస్లోని నీళ్లను తాకి ప్రతిధ్వనిస్తూ కొత్త రకమైన అనుభూతి ఇస్తాయి. ‘లాంగెస్ట్ మెలోడి మోడల్ ట్రైన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ రైలుకు యూట్యూబ్‌లో వైరల్ అయిన ఒక వీడియో ప్రేరణ ఇచ్చింది. -
మత్తులో మనోళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి. టాప్–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం.. ► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ► పాకిస్తాన్‌లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు. ► ప్రపంచంలోని టాప్–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. 5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 23 మంది మృతి.. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
ఫ్రాన్స్‌లో లాక్డౌన్
పారిస్/లండన్/బెర్లిన్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ యూరప్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తి స్థాయి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే, మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఫ్రాన్స్ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని, దానికి తగ్గ స్థాయిలో ఆస్పత్రి సదుపాయాలు లేవని అన్నారు. అందుకే లాక్డౌన్ మినహా తమ ముందు మరో మార్గం లేదన్నారు. తొలి దశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్డౌన్ డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. అయితే లాక్డౌన్ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక జర్మనీలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు మూసివేశారు. క్రీడల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రకటించారు. గత పది రోజుల్లోనే జర్మనీలో ఆస్పత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలన్నీ తప్పనిసరని మెర్కల్ తెలిపారు. మిగిలిన దేశాల్లో నిబంధనలు ఇలా.. యూరప్‌లో మిగిలిన దేశాలు కూడా పలు ఆంక్షల్ని విధిస్తున్నాయి. పోర్చుగల్ ప్రభుత్వం దేశ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. వారం రోజుల పాటు ప్రయాణాలపై ఆంక్ష లు విధించింది. బెల్జియంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న దేశాల్లో బెల్జియం ముందుంది. చెక్ రిపబ్లిక్లో కర్ఫ్యూ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుని తప్పనిసరి చేశారు. ఇక బ్రిటన్‌లో కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ఆరోగ్య నిపుణులు ప్రధాని బోరిస్ జాన్సన్‌కి సూచిస్తున్నారు. ప్రభుత్వ సలహా సంస్థ సేజ్ సెకండ్ వేవ్ యూరప్‌ని ఘోరంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ కరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది. -
మనది 20.. అమెరికా 200!!
కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన జీడీపీలో ఇది 10 శాతం. ఈ 20 లక్షల కోట్లలో నిజానికి రూ.9.94 లక్షల కోట్ల ఉద్దీపనను ఇప్పటికే రకరకాలుగా అందజేసినట్లు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికిప్పుడు రూ.1.7 లక్షల కోట్లు జత చేశామన్నారు. ఇదికాక మార్చి 27 నుంచి ఆర్బీఐ రూ.8.02 లక్షల కోట్ల విలువైన వివిధ ద్రవ్య చర్యలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రూ.12.95 లక్షల కోట్లు ఆహార భద్రతకు, కూలీల నగదు పంపిణీకి (మనిషికి రూ.500 చొప్పున), గ్రామీణ ఉపాధి పథకానికి, సూక్ష్మ, మధ్యస్థ కంపెనీలకు రుణాలివ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారామె. ఈ ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మిగతా దేశాలు ఏం చేశాయో ఒక్కసారి చూద్దాం... చైనా... రూ.100 లక్షల కోట్లు ► ఉద్దీపన చర్యల నిమిత్తం జీడీపీలో 2.5 శాతాన్ని (34 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.25.5 లక్షల కోట్లు. దీన్లో రూ.12 లక్షల కోట్లమేర చర్యలను ఇప్పటికే అమలు చేసింది. మరో రూ.13 లక్షల కోట్ల మేర లోకల్ బాండ్లను కొనుగోలు చేసింది. ► రూ.32 లక్షల కోట్ల మేర వ్యవస్థలోకి నగదు పంపి లిక్విడిటీని పెంచింది. ఇంకా రుణాలున్న వారికి కొత్త రుణాలివ్వటానికి, రీ–డిస్కౌంట్ చేయడానికి మరో రూ.17 లక్షల కోట్లు కేటాయించింది. ► పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏకంగా 1.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. (డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు) జపాన్... రూ.80 లక్షల కోట్లు ► జీడీపీలో అత్యధికంగా 21.1 శాతాన్ని అత్యవసర ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.80లక్షల కోట్లు. కాకపోతే దీన్లో రూ.60 లక్షల కోట్లను వ్యాపారాలు, ఉద్యోగాల్ని రక్షించుకోవటానికే వినియోగిస్తోంది. ► చిన్న వ్యాపారాలకు రాయితీలపై రుణాలు అందిస్తోంది. లిక్విడిటీని మెరుగుపరచటానికి ప్రభుత్వ బాండ్ల సంఖ్యను పెంచటం, ఎక్కువసార్లు జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంది. జర్మనీ.. రూ.30 లక్షల కోట్లు ► కరోనా మహమ్మారిపై పోరాడటానికి జర్మనీ తన జీడీపీలో 10.7 శాతాన్ని (40 వేల కోట్ల డాలర్లు) కేటాయించింది. మన కరెన్సీలో ఇది రూ.30 లక్షల కోట్లు. దీన్లో సగం మొత్తాన్ని స్వల్పకాలిక పనులకు, ఉద్యోగాలను కాపాడటానికి వినియోగిస్తోంది. ► వివిధ వర్గాలకిచ్చే రుణాలను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 23 శాతానికి పెంచేలా (మన కరెన్సీలో 86.25 లక్షల కోట్లు) ప్రభుత్వ గ్యారంటీలను వినియోగిస్తోంది. ► ఇక అక్కడి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు దీనికి అదనం. రుణాల చెల్లింపులకు కూడా జూన్ 30 వరకూ మూడు నెలల మారటోరియం ఇచ్చింది. అమెరికా.. రూ.207 లక్షల కోట్లు పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి జీడీపీలో 2.3 శాతాన్ని (50 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.37.5 లక్షల కోట్లు. పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే... కంపెనీలు మూతబడే ప్రమాదాన్ని తప్పించడానికి అవి తమ ఉద్యోగులకిచ్చే జీతాల్లో 8 వారాల జీతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ 30 మధ్య ఏ సమయంలోనైనా ఈ 8 వారాల జీతం కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ► కరోనా వైరస్ ప్రభావం నుంచి ఉపశమనం పొందటానికి, జనానికి సాయం చేయడానికి. ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో 150 లక్షల కోట్లు) ప్యాకేజీని ఆమోదించింది. ► ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్య కరోనా వైరస్ బారినపడి సెలవులు పెట్టుకున్నవారికి పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు మరో 20.5 వేల కోట్ల డాలర్లు (రూ.15.35 లక్షల కోట్లు) కేటాయించింది. ► ఇదికాక ఫెడరల్ రిజర్వు బ్యాంకులకు తానిచ్చే సొమ్ముపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఇది ఏకంగా 1.5%తగ్గించడంతో ప్రస్తుతం వడ్డీ రేటు 0.25 శాతమే. -
జర్మనీలో మంత్రి ఆత్మహత్య
ఫ్రాంక్ఫర్ట్: కరోనా వైరస్ ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగానూ ప్రాణాలను బలిగొంటోంది. కరోనా కాటుకు ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కావడంతో దాన్ని ఎలా ఎదుర్కొవాలో అర్థం కాక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ షాఫర్(54) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన శనివారం రైలు పట్టాలపై నిర్జీవంగా కనిపించారు. జర్మనీ వాణిజ్య రాజధాని ఫ్రాంక్ఫర్ట్ నగరం హెస్సీ రాష్ట్రంలోనే ఉంది. దేశంలో ప్రముఖ బ్యాంకుల కేంద్ర స్థానం ఈ నగరమే. కరోనా వల్ల హెస్సీలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. షాఫర్ పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి సేవలందిస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితి మరింత భయానకంగా ఉండబోతోందని భావించి, తనువు చాలించినట్లు తెలుస్తోంది. -
మాధురి దీక్షిత్ పాటకు గ్రీక్ యువతి డ్యాన్స్
-
‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’
గ్రీక్ దేశానికి చెందిన ఓ యువతి బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ యువతి పేరు క్యాథరినా కొరోసిడో. ప్రస్తుతం ఆమె జర్మనీలో నివసిస్తుంది. కాగా కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడా ఈ వైరస్ బారిన పడతామోనని ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. (కరోనా కథలు ; మా ఇంటికి రాకండి) ఇక ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ యువతి తన అభిమాన నటి మాధురీ దీక్షిత్ పాపులర్ సాంగ్ ఏక్, దో, తీన్ పాటకు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె సహోద్యోగి బెలుట్చ్ అనే వ్యక్తి తన ట్విటర్లో బుధవారం షేర్ చేశాడు. ‘ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఆందోళ చెందుతుంటే నా కోలిగ్ చూడండి ఏం చేస్తుందో. కరోనా ఒత్తిడి నుంచి బయటపడటానికి తనకు ఇష్టమైన హిందీ నటి మాధురి దీక్షిత్ పాటలు వింటూ డ్యాన్స్ చేస్తోంది’ అంటూ షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 73 వేలకు పైగా వ్యూస్ రాగా.. 5వేల లైక్‌లు వచ్చాయి. (‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’) అంతేగాక వీడియోకు మాధురీ కూడా స్పందించారు. ‘ఈ వీడియో నాకు బాగా నచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజిగా ఉండే మీరు ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొండి. అంతేగాక కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కుటుంబ సభ్యులతో సరదగా గడపండి. వ్యాయమ చేయండి. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. -
విమానాన్ని పెళ్లాడుతున్న మహిళ!
ప్రేమకు హద్దులు ఉండవంటారు. ఇక ఓ అమ్మాయి ప్రేమలో పడిందంటే ఏ హ్యాండ్సమ్ కుర్రాడో, లేక చిన్ననాటి మిత్రుడు అయ్యింటాడులే అనుకుంటారు. అయితే ఇక్కడ వింతగా జర్మనీకి చెందిన ఓ మహిళా విమానంతో ప్రేమలో పడిందంట. అంతేకాదు ఆ విమానాన్ని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ప్రకటించి ప్రేమకు హద్దులు లేవని నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. బెర్లిన్‌కు చెందిన మైకేల్ కోబ్కే(30) ఆరేళ్లుగా ప్రాణపదంగా ప్రేమిస్తున్న తన కలల జెట్ బోయింగ్ 737 ఈ ఏడాది మార్చిలో నెదార్లాండ్లో పెళ్లాడుతున్నట్లు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘2014లో బెర్లిన్ టెగెల్ ఎయిర్‌పోర్టులో ఈ జెట్ విమానాన్ని మొదటిసారి చుశాను. చూడగానే ప్రేమలో పడ్డాను. దీనికి ‘స్కాట్జ్ (డార్లింగ్)’ అనే ముద్దు పేరును కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ‘గత ఆరేళ్లుగా ఈ విమానంతో డేటింగ్ చేస్తున్నా. దీన్ని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాను. 2014లో టెగెల్ ఎయిర్‌పోర్టు ఈ జేట్ బోయింగ్ విగ్స్, వింగ్లేట్స్, థ్రస్టర్లు చూడగానే ఆకర్షితురాలినయ్యాను. ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ ఈ జెట్‌ను కేవలం కిటికి దగ్గరి నుంచే కలుసుకునే దాన్ని. అలా ఆరేళ్లుగా ఈ విమానంతో ప్రేమలో ఉన్నాను’ అని మైకేల్ పేర్కొంది. 2019 సెప్టెంబర్‌లో ఈ 40 టన్నుల జెట్‌ను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నానని కూడా వెల్లడించింది. అంతేగాక ‘దీనితో ఉన్నంత సేపు నాకు సమయం తెలీదు. ఈ విమానం వింగ్‌పై నిలబడి దాన్ని ముద్దాడిన క్షణాన్ని చాలా ఆనందించాను. నా జీవితంతో అదో అందమైన క్షణం’ అని విమానంతో తనకున్నా బంధాన్నిచెప్పుకొచ్చింది. ఇక మెకేల్ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు కూడా స్వాగతించినట్లు సమాచారం. View this post on Instagram My Lover and me❤️#737 #boeing737lover #737lover #737800#boeing #boeing #sas #b737 #b738 #737ng A post shared by Michèle Köbke (@airlover737) on Dec 16, 2019 at 2:00am PST -
విదేశాల్లో మెరిసే..నూజివీడు మురిసె
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు అయిన ట్రిపుల్ ఐటీల్లో వికసించిన విద్యాకుసుమాలు నేడు ఖండాంతరాల్లో పరిమళాలు వెదజల్లుతున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌కు చెందిన కొల్లి మీనాకుమారి కూడా ఈ కోవకు చెందిన యువతే. పరదేశంలో తెలుగునేల గొప్పతనం చాటుతోంది. జర్మనీలో యువ సైంటిస్టుగా రాణిస్తూ, పుట్టిన గడ్డకు.. చదువు నేర్పిన విద్యా సంస్థకు పేరుతెస్తోంది. సాక్షి, నూజివీడు(విజయవాడ) : నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని తన ప్రతిభతో జర్మనీలోని ఫిలిప్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ సత్తా చాటుతోంది. తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన కొల్లి మీనాకుమారి స్వగ్రామం విజయనగరం జిల్లా కామన్నవలస. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చివరి అమ్మాయి అయిన మీనాకుమారి తొలి నుంచి చదువులో ముందుండేది. బాడంగి హైస్కూల్లో పదో తరగతి చదివి మెరుగైన మార్కులు తెచ్చుకోవడంతో ట్రిపుల్ ఐటీ సీటును సాధించింది. గేట్లో ర్యాంక్ తెచ్చుకొని.. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి గేట్ రాయగా వరంగల్‌లోని నిట్‌లో సీటు లభించింది. అక్కడ చేరి రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ విభాగంలో 2015–17 ఏడాదిలో ఎంటెక్ పూర్తిచేసింది. ఈ విభాగంలో వస్తున్న నూతన మార్పులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంది. అనంతరం డెహ్రాడూన్‌లోని ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేసింది. ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేస్తుండగానే జర్మనీలో, థాయ్‌లాండ్‌లో పీహెచ్డీ చేసేందుకు అవకాశాలు వచ్చాయి. జపాన్ ప్రభుత్వ ఉపకార వేతనంతో థాయిలాండ్‌లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏఐటీ)లో పరిశోధన చేయడానికి ఎంపికైంది. ప్రస్తుతం ఫిలిప్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ ట్రిపుల్ ఐటీ ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటుతోంది. ఆమె చేసిన పీహెచ్డీ పరిశోధకు మార్బర్గ్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ పురస్కారం సైతం లభించింది. గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం. ట్రిపుల్ ఐటీలే లేకుంటే వేలాది మంది విద్యార్థులు నేడు ఉన్న గొప్ప గొప్ప స్థాయిల్లో ఉండేవారే కాదు. లక్షలాది రూపాయల ఫీజులు కట్టి చదివించే స్థోమత లేని నిరుపేద, పేద వర్గాల పిల్లలే ఇందులో చదువుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మరింత పదును పెట్టడంలో ట్రిపుల్ ఐటీలు ఎంతో దోహదపడుతున్నాయి. – కొల్లి మీనాకుమారి -
జర్మనీలో భారతీయ జంటపై దాడి : భర్త మృతి
మ్యూనిచ్ : జర్మనీలో భారతీయ దంపతులపై ఒక వలసదారుడు దాడికి తెగడ్డాడు. కత్తితో దాడి చేయడంతో భర్త ప్రశాంత్ ప్రాణాలు కోల్పోగా, భార్య స్మిత ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. జర్మనీలోని మ్యూనిచ్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ ట్విటర్లో వెల్లడించారు. ప్రశాంత్ సోదరుడిని జర్మనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్వీట్ చేశారు. అలాగే వారి ఇద్దరి పిల్లల భద్రతపై అధికారులకు తగిన సూచనలు చేసినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి సుష్మా సంతాపం వెలిబుచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Indian couple Prashant and Smita Basarur were stabbed by an immigrant near Munich. Unfortunately, Prashant has expired. Smita is stable. We are facilitating the travel of Prashant's brother to Germany. My heartfelt condolences to the bereaved family. /1 — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 30, 2019 -
సార్లార్లక్స్ ఓపెన్ విజేత శుభాంకర్
న్యూఢిల్లీ: ఆద్యంతం సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శుభాంకర్ డే తన కెరీర్లో నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. జర్మనీలోని సార్‌బ్రకెన్ నగరంలో ఆదివారం ముగిసిన సార్లార్లక్స్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో 25 ఏళ్ల శుభాంకర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 64వ ర్యాంకర్ శుభాంకర్ 21–11, 21–14తో ప్రపంచ 37వ ర్యాంకర్, ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన శుభాంకర్ ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌పై సంచలన విజయం సాధించాడు. అదే జోరును టోర్నీ చివరిదాకా కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలిచిన శుభాంకర్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షల 10 లభించింది. గతంలో శుభాంకర్ 2014లో బహ్రెయిన్ ఓపెన్, 2017లో పోర్చుగల్ ఓపెన్, ఐస్‌ల్యాండ్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు. -
70 ఏళ్ల తర్వాత బయటడింది..
ఫ్రాంక్ఫర్ట్ : రెండు ప్రపంచ యుద్ధాలు మానవ జాతిని అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం నేటికి మర్చిపోలేదు. అందుకు ప్రధాన కారణం ఈ యుద్ధంలో వాడిన బాంబులే. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని కాలంలోనే ఆనాడు తయారు చేసిన బాంబులు తీవ్ర మారణహోమాన్ని సృష్టించాయి. అంతటి విపత్తు సృష్టించిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల చేపడుతున్న సమయంలో ఇది బయటపడింది. విషయం తెలుసుకున్న అధికారులు లుడ్విగ్షాఫెన్ నగరంలోని 18500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్ దానిని సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జర్మనీపై అమెరికా దళాలు వేసిన బాంబు ఇది. దీని బరువు సుమారు 500 కిలోలు. బాంబు నిర్వర్యం చేసే క్రమంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కిలోమీటరు మేర పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మరోచోటికి తరలించామని అధికారులు తెలిపారు. అంతేకాక కేవలం గంట సేపట్లోనే ఈ బాంబును నిర్వీర్యం చేశామన్నారు. అనంతరం అధికారులు బాంబును నిర్వీర్యం చేశామని, నగరంలోని ప్రజలంతా మళ్లీ వాళ్ల ఇళ్లకు రావచ్చని ఓ అధికారి ట్వీట్ చేశారు. అంతేకాక ఆ బాంబు తాలూకు ఫొటోను కూడా పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇప్పటికి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా జర్మనీలో ఇలాంటి పేలని బాంబులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. గతేడాది కూడా ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.8 టన్నుల బరువున్న బ్రిటన్ బాంబు బయటపడింది. ఆ సమయంలో నగరంలోని 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మరో బ్రిటిష్ బాంబు కనిపించింది. -
జర్మనీ.. చివరి నిమిషంలో
మాస్కో : ప్రపంచకప్ ఫేవరెట్లలోకెల్లా హాట్ ఫేవరేట్. తొలి మ్యాచ్‌లో సాధారణ జట్టుపై అనుహ్య ఓటమి. ఇకరెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై ఓడిపోతే ఇంటికే.. డ్రా అయినా డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి నాకౌట్ కష్టమే. గ్రూఫ్ ఎఫ్‌లో భాగంగా స్వీడన్‌తో జరిగిన కీలక మ్యాచ్ డ్రా అవుతుందనుకున్న సమయంలో ఎక్సట్రా ఇంజ్యూరి టైమ్‌లో గోల్ చేసి జర్మనీ ఊపిరిపీల్చుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 74 శాతం బంతి జర్మనీ ఆధీనంలో ఉన్నా గోల్ చేయడంలో ఫార్వర్డ్ ప్లేయర్స్ విఫలమయ్యారు. ఆట ప్రారంభమైన 32వ నిమిషంలో స్వీడన్ ఆటగాడు సెంటర్ బాక్స్ నుంచి లెఫ్ట్ కార్నర్ దిశగా గోల్ చేసి జర్మనీకి షాక్ ఇచ్చాడు. ఇక ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవటంతో 0-1తో ప్రథమార్థం ముగిసింది. రెండో భాగం ప్రారంభమైన మూడు నిమిషాలకే మార్కో ర్యూస్(48వ నిమిషంలో) జర్మనీకి తొలి గోల్ అందించారు. ఇక మరో గోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. ఇరు జట్లు అటాకింగ్ గేమ్ ఆడిని రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకోవడంతో మరో గోల్ నమోదుకాలేదు. ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్ ప్రారంభమైన నాలుగు నిమిషాలకు కూడా గోల్ కాకపోవడంతో మ్యాచ్ డ్రా అవుతుందనుకున్న తరుణంలో ఫ్రీకిక్ రూపంలో జర్మనీని అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న టోనీ క్రూస్ (90+5 నిమిషంలో) జర్మనీ ఖాతాలో మరో గోల్ చేర్చి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో జర్మనీ డిఫెండర్ జెరోమ్ బోటెన్గ్కు రిఫరీలు రెండు సార్లు ఎల్లో కార్డు చూపించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జర్మనీ 10 అనవసర తప్పిదాలు చేయగా, స్వీడన్ 11 తప్పిదాలు చేసింది. ప్రపంచకప్‌లో ప్రథమార్థంలో ప్రత్యర్థి గోల్ చేసి, తాను గోల్ చేయకుండా జర్మనీ గెలవటం 1974 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు కూడా స్వీడన్పైనే కావడం గమనార్హం. జర్మనీ జట్టు ప్రపంచకప్ చరిత్రలో చివరి నిమిషంలో గోల్ చేసి గెలవడం ఇదే తొలిసారి -
బోరు కొట్టి 106 మందిని చంపేశాడు
-
బోరు కొట్టి 106 మందిని చంపేశాడు
బెర్లిన్: జర్మనీలో మేల్ నర్సుగా పనిచేసే ఓ మృగాడు తనకు బోరు కొట్టడంతో రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి 106 మందిని చంపేశాడు. పోలీసులు మరిన్ని శవాలను పరిశీలిస్తున్నందున ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1999 నుంచి 2005 మధ్య కాలంలో అతను రెండు వైద్యశాలల్లో ఈ దుష్కార్యానికి ఒడిగట్టాడు. నీల్స్ హొయెగెల్ (41) అనే వ్యక్తి బ్రెమెన్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. రోజూ ఒకేలా పనిచేసి విసిగిపోయిన అతను... గుండె, రక్త ప్రసరణ వ్యవస్థలు విఫలమయ్యేలా రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి ఆరోగ్యం మరింత దిగజారేలా చేసేవాడు. ఆ తర్వాత కాపాడటానికి ప్రయత్నించి ఒకవేళ రోగి బతికితే ఆ ఘనత తనదేనని చెప్పుకోవడం అతనికి అలవాటుగా మారింది. ఇలా ఎంతోమందిని నీల్స్ పొట్టనబెట్టుకున్నాడు. 2005లో ఓసారి రోగికి విషపూరిత మందులను ఇస్తుండగా, మరో నర్సు చూసి విషయాన్ని బయటపెట్టింది. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి విచారించగా ఇలా ఎంతో మందికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చాడని తేలడంతో హత్యాయత్నం నేరం కింద 2008లో అతనికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఓ మహిళ, తన తల్లికి కూడా నీల్స్ విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి ఉంటాడని ఫిర్యాదు చేయడంతో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు చేయగా అదే నిజమని తేలింది. దీంతో అతని చేతుల్లో చనిపోయిన మరింత మంది మృతదేహాలను కూడా వెలికితీసి పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆ లెక్క 106గా ఉండగా మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమంది రోగుల శవాలను పూడ్చకుండా, కాల్చినందువల్ల నీల్స్ కారణంగా చనిపోయిన వారెందరనేది ఎప్పటికీ తెలిసే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. నీల్స్‌పై కొత్త అభియోగాలు కూడా మోపుతామన్నారు. జర్మనీ చరిత్రలో ఇలా వరస హత్యలు చేసిన ఇంతటి క్రూరుడు ఇంకొకరు లేరని పోలీసులు అంటున్నారు. -
మళ్లీ మెర్కెల్‌దే పీఠం
బెర్లిన్: జర్మనీ పార్లమెంటు దిగువసభ బుందేస్టాగ్‌కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఏంజిలా మెర్కెల్ వరసగా నాలుగోసారి చాన్స్‌లర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందారు. అయితే 33 శాతం ఓట్లు, 246 సీట్లు గెలిచిన ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం పొందలేకపోయింది. దీంతో ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (ఎఫ్డీపీ), గ్రీన్ పార్టీలతో కలసి ఆమె అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎఫ్డీపీ 10.7% ఓట్లతో 80 సీట్లను, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 67 స్థానాలను గెలుచుకున్నాయి. సీడీయూ–సీఎస్‌యూ కూటమితోపాటు ఈ రెండు పార్టీల సీట్లను కలిపితే మెర్కెల్‌కు పూర్తి ఆధిక్యం లభిస్తుంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ఈ ఎన్నికల్లో మహా సంకీర్ణం నుంచి బయటకొచ్చి పోటీ చేసిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్పీడీ) 20.5 శాతం ఓట్లు, 153 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రజలు తమను ప్రతిపక్షానికి పరిమితం చేసినందున ఆ పాత్రనే పోషిస్తామని మళ్లీ మెర్కెల్‌కు మద్దతిచ్చి ప్రభుత్వంలో చేరే ప్రశ్నే లేదని ఎస్పీడీ అధినేత మార్టిన్ షుల్జ్ చెప్పారు. అలాగే 12.6% ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనుంది. ‘జమైకా’ సంకీర్ణానికే అవకాశం మెర్కెల్‌తో కలసి సాగడానికి ఎస్పీడీ, ఏఎఫ్‌డీ, లెఫ్ట్ పార్టీలు విముఖత చూపుతున్నందున ప్రభుత్వంలో చేరడానికి అవకాశం ఉన్న పార్టీలు ఎఫ్డీపీ, గ్రీన్స్ మాత్రమే. సీడీయూ–సీఎస్‌యూ కూటమి, ఎఫ్డీపీ, గ్రీన్స్...ఈ మూడు పార్టీల రంగులు జమైకా జాతీయ జెండాలో ఉంటాయి. ఈ మూడు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని జమైకా సంకీర్ణం అంటారు. అయితే ఎఫ్డీపీ, గ్రీన్స్ పార్టీలు పరస్పర శత్రువులు. దీంతో వారిని బుజ్జగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెర్కెల్‌కు కొంత సమయం పట్టనుంది. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మెర్కెల్ ఫలితాల అనంతరం చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా ఓటేశారనీ, తమను కాదని మరే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె అన్నారు. ఈసారి సభ్యులెంత మంది... జర్మనీ ఫెడరల్ దిగువసభ బుందేస్టాగ్ సభ్యుల సంఖ్య స్థిరంగా ఉండదు. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించే ఓట్ల ఆధారంగా స్థిర సీట్లకు కొన్ని సీట్లు కలుపుతారు. గత బుందేస్టాగ్‌లో మొత్తం 631 మంది సభ్యులుండగా, ఈసారి ఆ సంఖ్య 709కి పెరుగుతుంది. ఈ లెక్కన చాన్స్‌లర్‌గా ఎన్నికవడానికి మెర్కెల్‌కు 355 మంది సభ్యుల మద్దతు అవసరమౌతుంది. బుందేస్టాగ్‌లోని మొత్తం సభ్యుల్లో 299 మంది నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారైతే, దామాషా పద్ధతిలో మరో 299 మంది సభ్యులుగా నియమితులైనవారుంటారు. వారినే (598 మంది) రెగ్యులర్ సభ్యులంటారు. వారేగాక వివిధ పార్టీలకు మొదటి ఓటు(నియోజకవర్గాల్లో) సీట్లలో వచ్చిన ఓట్లు, రెండో ఓట్ల(దామాషా ఓట్లు) వివరాల ఆధారంగా హేంగోవర్, బ్యాలెన్స్ సీట్ల ప్రతినిధులుగా మరి కొంత మంది సభ్యులుగా చేరతారు. ఈ నాలుగు పద్ధతుల్లో బుందేస్టాగ్ సభ్యులయ్యేవారి సంఖ్య ఈసారి 709 ఉంటుంది. చాన్స్‌లర్‌గా దేశాధ్యక్షుడు నియమించాలంటే కనీసం 312 మంది సభ్యుల మద్దతు అవసరం. నియామకం తర్వాత కొత్త చాన్సలర్‌కు మెజారిటీ (355) ఉన్నదీ లేనిదీ తేల్చడానికి ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుత పాలక కూటమి పార్టీలు సీడీయూ, సీఎస్యూలకు గత ఎన్నికలతో పోల్చితే 65 సీట్లు తగ్గాయి. పాలక కూటమి నుంచి వైదొలగుతున్న ప్రధాన ప్రతిపక్షం ఎస్పీడీ(సోషల్ డెమొక్రాట్లు) 40 సీట్లు కోల్పోయింది. కిందటిసారి ఒక్క సీటూ సాధించని ఏఎఫ్‌డీ 94 సీట్లు కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలోనే కొనసాగుతున్న లెఫ్ట్ పార్టీకి అదనంగా 5 సీట్లు లభించగా, గ్రీన్ పార్టీ మరో నాలుగు సీట్లు సంపాదించింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బెర్లిన్ చేరుకున్న ప్రధాని మోదీ
బెర్లిన్ : విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్‌లో సమావేశం కానున్నారు. ఆరురోజుల పర్యటనలో భాగంగా మోదీ నాలుగు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటన సాగనుంది. ఆర్థిక పరమైన సహకారం, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూక్లియర్, వాణిజ్య రంగాలకు సంబంధించి ఆయా దేశాలతో మోదీ పరస్పర చర్చలు జరుపుతారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని స్పెయిన్‌లో పర్యటించడం ఇదే ప్రథమం ఈ పర్యటనలో భాగంగా మోదీ కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మెక్రాన్‌తో భేటీ కానున్నారు. మోదీతో పాటు మంత్రులు హర్షవర్థన్, పియూష్ గోయిల్, నిర్మలా సీతారామన్‌తో పాటు ఎంజే అక్బర్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. -
హిట్లర్ అసలు గొంతు ఇలా ఉంటుంది!