ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్‌లో తొలి రోజు దేశాధినేతల రాక.. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిచింది. జీ-దేశాల సమ్మిట్ భారత్ తరఫున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ సైతం పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే తోలి రోజు సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
యురోపియన్ కమిషన్ ప్రెజిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లడాకుంటున్నారు. అంతలోనే లేయన్ అక్కడే ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బర్త్ డే ఈరోజు అని జోబైడెన్‌తో చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ.. అయితే ఆయన కోసం మీరు బర్త్ డే సాంగ్ పాడారా? అని అడిగారు.
#G7 Italia 2024: #Biden, #Meloni and other world leaders sing happy birthday song for German Chancellor
Catch the day's latest news here ➠ https://t.co/mTNeb6ks1i 🗞️ pic.twitter.com/qYordDWk95— Economic Times (@EconomicTimes) June 14, 2024
బైడెన్ ఫ్యామిలీలో అయితే పుట్టినరోజు వేళ బర్త్ డే సాంగ్ పడుతామని అన్నారు. వెంటనే బైడెన్ బర్త్‌డే సాంగ్ మొదలుపెట్టగా అక్కడికి వచ్చిన దేశాధినేతలు అయనతో పాడుతూ.. ఓలాఫ్ స్కోల్జ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు ఓలాఫ్ స్కోల్జ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ వీడియో కనిపిస్తారు.
ఓలాఫ్ స్కోల్జ్ 2021 డిసెంబర్ నుంచి జర్మనీ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. ఆయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD)సభ్యుడు. ఛాన్సలర్ కావడానికి ముందు.. స్కోల్జ్ 2018 నుంచి 2021 వరకు మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకీర్ణ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్, ఆర్థిక మంత్రిగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment