వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత అమెరికాలోని జో బైడెన్ సర్కార్, ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబన్ల మధ్య తొలిసారి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ తాలిబన్లతో రహస్య చర్చలు జరిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌తో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ మాట్లాడినట్లు మంగళవారం వెల్లడించింది.
తాలిబన్లతో కీలక నేతలతో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి చర్చలుగా భావిస్తున్నారు. తాలిబాన్ నియంత్రణలో ఉన్నఅఫ్గాన్‌నుండి నుండి వేలాది మంది ప్రజలను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో సీఐఏ చీఫ్ బర్న్స్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా కాగా తాలిబన్ల కీలక నేతలు, కాబూల్‌లో అధికారం చేపట్టిన అగ్ర నాయకుల్లో బరాదర్ ఒకరు కావడం విశేషం. అయితే ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం స్పష్టత లేదు.మ రోవైపు ఈనివేదిలపై వ్యాఖ్యానించేందుకు సీఐఏ ప్రతినిధి నిరాకరించారు.
చదవండి : Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్!
కాగా అఫ్గానిస్తాన్ కాబూల్ విమానాశ్రయంనుంచి సైనిక బలగాల తరలింపు, అమెరివాసుల తరలింపు ప్రక్రియను ఆగస్ట్ 31లోపు ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు అమెరికా, ఇతర మిత్రదేశాలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజల తరలింపుపై సమీక్షించేందుకు జీ 7 (బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాలు వర్చువల్ గా సమావేం కానున్నారు.
చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది!
Comments
Please login to add a commentAdd a comment