G7 Summit
-
పోప్‌ను అవమానించడం మా ఉద్దేశం కాదు
తిరువనంతపురం: పోప్–మోదీ భేటీపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. పోప్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచి్చంది. జీ7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మోదీ–పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్.. దానికి ‘‘చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కింది’’ అని క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుపై బీజేపీతోపాటు ఇతర పారీ్టలు విమర్శలు గుప్పించాయి. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించిన కేరళ కాంగ్రెస్, క్రైస్తవులకు క్షమాపణలు చెప్పింది. -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
G7 Summit 2024: మరో ‘మెలోడీ’ క్షణం
బరీ(ఇటలీ): జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆతీ్మయ భేటీని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. మూడు సెకన్ల సెల్ఫీ వీడియోను తీసి ‘ఎక్స్’లో షేర్చేశారు. మెలోనీ, మోదీ పేర్లను కలిపి మెలోడీ అనే కొత్త పదాన్ని సృష్టించి దానికి హ్యాష్‌ట్యాగ్‌ను తగిలించి గతంలోనే ఆమె విస్తృత ట్రెండింగ్ చేసిన విషయం తెల్సిందే. అదే పంథాలో మరోసారి కొత్త వీడియోను తీసి అందరితో పంచుకున్నారు. శుక్రవారం జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ఇటలీలోని అపూలియాలో ఉన్న రిసార్ట్ ఇందుకు వేదికైంది. మోదీని మెలోనీ సాదరంగా ఆహా్వనించినపుడు నమస్కారంతో ఇరువురూ పలకరించుకున్న విషయం తెల్సిందే. తర్వాత ద్వైపాక్షి చర్చలు జరిపాక ఆయనతో కలిసి మెలానీ ‘హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్’ అంటూ ఒక సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోను శనివారం ఆమె ‘ఎక్స్’లో షేర్చేయడంతో అది తెగ వైరల్ అయింది.PM Narendra Modi and Italy's PM Giorgia Meloni's selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq— ANI (@ANI) June 15, 2024 Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024 ‘భారత్–ఇటలీ స్నేహబంధం శాశ్వతంగా కొనసాగాలి’ అని ఆ వీడియోను మోదీ మళ్లీ షేర్ చేశారు. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా మెలోనీ, మోదీ తీసుకున్న సెల్ఫీ ఆనాడూ తెగ వైరల్ అయిన విషయం విదితమే.1. #COP28 summit in Dubai.2. #G7 summit in Italy#Melodi #Selfie #G7Italie #G72024 pic.twitter.com/otVV1YGaMh— Rai Sahab 🇮🇳 (@raiparas) June 15, 2024 The Moment we all have been waiting for ☺️☺️😂 pic.twitter.com/5hdahECYMa— Amit Shah (Parody) (@Motabhai012) June 14, 2024 Had a very good meeting with PM @GiorgiaMeloni. Thanked her for inviting India to be a part of the G7 Summit and for the wonderful arrangements. We discussed ways to further cement India-Italy relations in areas like commerce, energy, defence, telecom and more. Our nations will… pic.twitter.com/PAe6sdNRO9— Narendra Modi (@narendramodi) June 14, 2024 -
ఇటలీలో జీ-7 సదస్సులో పలు దేశాల ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
జీ-7: జర్మన్ ఛాన్సలర్ పుట్టినరోజు.. బర్త్ డే సాంగ్‌తో శుభాకాంక్షలు
ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్‌లో తొలి రోజు దేశాధినేతల రాక.. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిచింది. జీ-దేశాల సమ్మిట్ భారత్ తరఫున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ సైతం పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే తోలి రోజు సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.యురోపియన్ కమిషన్ ప్రెజిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లడాకుంటున్నారు. అంతలోనే లేయన్ అక్కడే ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బర్త్ డే ఈరోజు అని జోబైడెన్‌తో చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ.. అయితే ఆయన కోసం మీరు బర్త్ డే సాంగ్ పాడారా? అని అడిగారు.#G7 Italia 2024: #Biden, #Meloni and other world leaders sing happy birthday song for German Chancellor Catch the day's latest news here ➠ https://t.co/mTNeb6ks1i 🗞️ pic.twitter.com/qYordDWk95— Economic Times (@EconomicTimes) June 14, 2024 బైడెన్ ఫ్యామిలీలో అయితే పుట్టినరోజు వేళ బర్త్ డే సాంగ్ పడుతామని అన్నారు. వెంటనే బైడెన్ బర్త్‌డే సాంగ్ మొదలుపెట్టగా అక్కడికి వచ్చిన దేశాధినేతలు అయనతో పాడుతూ.. ఓలాఫ్ స్కోల్జ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు ఓలాఫ్ స్కోల్జ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ వీడియో కనిపిస్తారు.ఓలాఫ్ స్కోల్జ్ 2021 డిసెంబర్ నుంచి జర్మనీ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. ఆయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD)సభ్యుడు. ఛాన్సలర్ కావడానికి ముందు.. స్కోల్జ్ 2018 నుంచి 2021 వరకు మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకీర్ణ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్, ఆర్థిక మంత్రిగా పని చేశారు. -
G7 Summit 2024: మోదీకి మెలోనీ సాదర స్వాగతం
భేటీకి వస్తున్న మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎదురెళ్లిమరీ సాదర స్వాగతం పలికారు. మోదీ ఆమెకు నమస్కారం చేశారు. తర్వాత ఇద్దరూ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ7 భేటీకి వచి్చన అగ్రనేతలనూ మోదీ కలిశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తోనూ మోదీ మాట్లాడారు. -
G7 Summit 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు
జీ7 సమావేశం కోసం విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తోనూ మోదీ చర్చలు జరిపారు. ‘మా ఇద్దరి మధ్య ఏడాదికాలంలో జరిగిన నాలుగో భేటీ ఇది. అద్భుతంగా జరిగింది. ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్, హారిజాన్ 2047 సహా రక్షణ, అణు, అంతరిక్షం, సముద్రమార్గంలో వాణిజ్యం, విద్య, వాతావరణ మార్పులు, డిజిటల్ మౌలిక వసతులు, కనెక్టివిటీ, కృత్రిమ మేథ రంగాల్లో పరస్పర తోడ్పాటుపై చర్చలు జరిపాం. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలపై మరింత మక్కువ పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదీ మాట్లాడుకున్నాం’ అని మోదీ చెప్పారు. శుక్రవారం ఇటలీకి చేరుకున్నాక మోదీ తొలుత మేక్రాన్‌ను కలిశారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఒక అంతర్జాతీయ నేతతో మోదీ సమావేశంకావడం ఇదే తొలిసారి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
G7 Summit 2024: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష
జీ7 భేటీ కోసం వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్–యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పట్టిష్టంచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పురోగతిపై సునాక్‌తో కలిసి మోదీ సమీక్ష చేశారు. మూడోసారి ప్రధాని అయ్యారంటూ మోదీని సునాక్ అభినందనలు తెలపగా త్వరలో జరగబోయే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటూ సునాక్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు చేయాల్సిన కృషిపై కూలంకషంగా చర్చించారు. ‘‘ రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, కీలక, అధునాతన సాంకేతిక రంగాలతోపాటు ప్రజాసంబంధాల్లోనూ ఇరుదేశాల మధ్య భాగస్వామం మరింత బలపడటంపై ఇరు నేతలు చర్చించారు’’ అని భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. -
G7 Summit 2024: కృత్రిమ మేధపై పోప్ ఆందోళన
బరీ(ఇటలీ): రోజురోజుకూ విశ్వవ్యాప్తంగా విస్తృతమవుతున్న కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ ఒకింత ఆందోళన వ్యక్తంచేశారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో మనిషి గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోవాలని జీ7 శిఖరాగ్ర సదస్సు వేదికగా పోప్ పిలుపునిచ్చారు. ఇంతటి అత్యాధునిక సాంకేతికతలు మితిమీరితే మానవ సంబంధాలు సైతం కృత్రిమంగా మారే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘మానవ భవిష్యత్తుకు కృత్రిమ మేధ(ఏఐ) భరోసా, బెంగ’ అంశంపై పోప్ మాట్లాడారు. అంతర్జాతీయ సమావేశాలు, ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు, కార్పొరేట్ బోర్డుల వంటి అంశాలే ఎజెండాగా సాగే జీ7 వంటి అగ్రస్థాయి కూటమి భేటీలో పోప్ మాట్లాడటం చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘ ఏఐ అనేది మానవ కేంద్రీకృతంగా ఎదిగేలా రాజకీయ నేతలు ఓ కంట కనిపెట్టాలి. మనుషులకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలను మనుషులే తీసుకోవాలిగానీ మెషీన్లు కాదు. మెషీన్ల నిర్ణయాలపై ఆధారపడి, కనీసం మన జీవితాల గురించి కూడా సొంతంగా ఆలోచించలేని పరిస్థితిని మనం కోరుకోవద్దు’ అని అన్నారు. ఓపెన్ఏఐ వారి చాట్‌జీపీటీ చాట్‌బోట్ తరహా ఏఐ వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ఏఐకు పూర్తిగా దాసోహమవడంపై ప్రపంచదేశాలు, అంతర్జాతీయ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. భారత్‌లో పర్యటించండి: పోప్‌కు ఆహా్వనం జీ7 సదస్సుకు విచ్చేసిన పోప్ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. వీల్‌చైర్‌లో కూర్చున్న పోప్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడారు. భారత్‌లో పర్యటించాలని పోప్‌ను మోదీ ఆహా్వనించారు. -
G7 Summit 2024: టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి తెరపడాలి
బరీ(ఇటలీ): సాంకేతికత అనేది కేవలం అతి కొద్ది సంస్థలు, దేశాల చేతుల్లో ఉండకూడదని, ఇలాంటి గుత్తాధిపత్యానికి తెరపడాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జరుగుతున్న జీ7 దేశాల 50వ శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం ప్రధాని మోదీ సాంకేతికత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ మనం వినూత్న టెక్నాలజీని సృష్టించాలేగానీ విధ్వంసకర సాంకేతికతను కాదు. సాంకేతికతో గుత్తాధిపత్యం పోవాలి. సాంకేతికతను ప్రజాస్వామ్యయుతంచేయాలి. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు దానిని చేరువ చేయగలం. సాంకేతికత ఫలాలు అందరికీ అందాలి. అప్పుడే సమ్మిళిత సమాజాభివృద్ధికి బాటలు వేసిన వారమవుతాం. మానవీయ విలువలున్న సాంకేతికత ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ కలలు కంటోంది. కృత్రిమ మేథపై జాతీయ విధానాన్ని రూపొందించి అమలుచేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఏడాది భారత్‌లో ‘ఏఐ మిషన్’కు అంకురార్పణ చేశాం. అందరికీ ఏఐ అనేది దీని మంత్రం. ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఏఐ’లో వ్యవస్థాపక సభ్యునిగా, ఈ కూటమి ప్రస్తుత సారథిగా అన్ని దేశాల మధ్య సహకారాన్ని ఆశిస్తున్నా’’ అని మోదీ అన్నారు. ఏఐపై అంతర్జాతీయ నియమావళి ఉండాల్సిందే‘‘విస్తృతమవుతున్న ఏఐ రంగంపై అంతర్జాతీయంగా ఏకరూప నియమావళి ఉండాల్సిందే. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ భారత్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులోనూ పారదర్శక, స్వేచ్ఛా, సురక్షిత, సులభతర వినియోగ, భాధ్యతాయుత ఏఐ కోసం అన్ని దేశాలతో భారత్ కలిసి పనిచేస్తుంది. ఇంధనం పైనా భారత వైఖరి మారదు. ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ వినియోగించుకోగలగాలి. అందరికీ ఆ స్తోమత ఉండాలి. ఇందుకు అందరి ఆమోదం కూడా ఉండాలి’’ అని అన్నారు.గ్లోబల్ సౌత్ దేశాలపై భారం‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర, ఉద్రిక్త పరిస్థితుల దుష్ప్రభావాలు ఏ పాపం చేయని గ్లోబల్ సౌత్ దేశాలపై పడుతున్నాయి. అందుకే మా సమస్యలు, ప్రాధాన్యాలను ఇలాంటి ప్రపంచ వేదిక సాక్షిగా చాటేందుకు భారత్ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత ఏడాది జీ20 సారథిగా భారత్ ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇప్పించినందుకు గర్వపడుతోంది. ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక, భద్రత, సుస్థిరాభివృద్ధికి భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇక మీదటా ఈ సాయం కొనసాగుతోంది’’ అని అన్నారు.‘లైఫ్’ను పట్టించుకోండి‘‘పర్యావరణహిత జీవితశైలి(ఎల్ఐ ఎఫ్ఈ– లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ని అలవర్చుకోండి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్‌లో ప్రారంభించిన ‘మట్టి మాతృమూర్తికోసం మొక్క’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటండి. అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. ఈ ప్రజాఉద్యమాన్ని అంతర్జాతీయ బాధ్యతను భావించి ప్రపంచ దేశాలు మొక్కలు నాటే కార్య క్రమాన్ని విస్తృతం చేయాలి. మొక్కల పెంపకం భూమిపై పచ్చదనాన్ని పెంచుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2070 ఏడాదికల్లా కర్భన తటస్థత(కార్భన్ నెట్‌జీరో) సాధించేందుకు భారత్ శతథా కృషిచేస్తోంది. హరిత యుగం మళ్లీ సాకారమయ్యేలా మనందరి కలిసి కృషిచేద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. -
G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్‌కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్‌కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్‌లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జీ7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. ఏంటంటే?
రోమ్ : ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుంది. ఈ కీలక సమావేశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జరుగుతోంది. అదే సమయంలో గత రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై జరుపుతున్న కాల్పుల్ని విరమిస్తామని తెలుపుతూనే షరతులు విధించారు. జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయా ప్రపంచ దేశాది నేతలతో కీలక ద్వైపాక్షిక సమావేశాలను కొనసాగిస్తున్నారు. సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, మోదీల మధ్య భేటీ జరిగింది. జెలెన్స్కీ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్,యూకే ప్రధాని రిషి సునక్‌లతో మోదీ భేటీ నిర్వహించారు. ఇక, జెలెన్స్కీతో భేటీ అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ భేటీ ప్రొడక్టీవ్తో కూడుకున్నదని, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడమే శాంతికి మార్గం అని ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై భారత్ వైఖరేంటో చెప్పకనే చెప్పారు మోదీ.ఇక ఈ జీ7 సదస్సులో ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపగా.. జీ7 సదస్సు కొనసాగుతున్న తరుణంలో కాల్పుల విరమణకు ఆదేశిస్తామంటూ పుతిన్.. ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అందుకు రెండు షరతులు విధించారు. యుద్ధ సమయంలో రష్యా నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవడం, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. తుది పరిష్కారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటన చేయడం గమనార్హం.మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, మోదీల భేటీపై ఫ్రాన్స్‌లోని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, వాతావరణ చర్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ టెక్నాలజీలు, కనెక్టివిటీ, సంస్కృతి వంటి అంశాలతో సహా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. కీలకమైన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారని అన్నారు. -
G7 Summit: మోదీకి ఆతిధ్యం ఇచ్చే రెస్టారెంట్ ఇదే..!
ఇటలీలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన బృందంతో కలిసి గురువారమే ఇటలీ చేరుకున్నారు. ప్రపంచనాయకులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పాత్రికేయులకు కూడా ఎంట్రీ ఉంటుంది. ఈ ఏడాది ఇటలీలోని పుగ్లియా నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ఈ సదస్సుకి హాజరుకానున్న మోదీకి ఇటలీలో ఉన్న ఏ భారతీయ రెస్టారెంట్ ఆతిధ్యం ఇవ్వనుందంటే..ఇటీలీలో ఈ జీ7 సదస్సు జూన్ 13 నుంచి జూన్ 15, 2024 వరకు జరుగనుంది. ఈ సదస్సులో ముఖ్యమైన చర్చల తోపాటు ప్రపంచ నాయకులకు ఇచ్చే ఆతిధ్యం కూడా హాటాటాపిక్గా ఉంది. నివేదిక ప్రకారం..ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా ఆహ్వానితుల కోసం అద్భుతమైన సీఫ్రంట్ గాలా డిన్నర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడన్, రిషి సునాక్ వంటి నాయకులు ఇటాలియన్ ప్రెసిడెంట్ బోర్గ్ ఎంగ్నాజియా రిసార్ట్‌లో ఆతిథ్యం ఏర్పాటు చేసినట్లు అదికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనే భారత ప్రధాని మోదీకి ఇటలీలోని బారీలో ఉన్న భారతీయ రెస్టారెంట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని మోదీ అతని బృందానికి రుచికరమైన భారతీయ వంటాకాలను ఈ రెస్టారెంట్ అందించనుంది. ఇటలీలో భారత్‌లోని అద్భుతమైన రుచులను అందించడానికి పేరుగాంచిన భారతీయ రెస్టారెంట్ ఇండియానో నమస్తే ప్రధాని మోదీ, అతని బృందానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇది సుప్రసిద్ద పంజాబీ వంటకాలకు పేరుగాంచింది. ఇక్కడ స్పైసీ ఫుడ్స్, తందూరీ చికెన్, బిర్యానీలు మంచి ఫేమస్. నోరూరించే భారతీయ వంటకాలకు ఈ ఈ రెస్టారెంట్ కేరాఫ్ అడ్రస్ కూడా. ఇక్కడ ప్రతి కస్టమర్ ఆకలిని తీర్చేలా భోజనం ఉంటుంది. ముఖ్యంగా శాకాహార భోజనం కూడా అదరహో అన్న రేంజ్లో ఉంటుందట. గులాబ్జామున్, గజర్ కా హల్వా వంటి దేశీయ డిజార్ట్లు కూడా బాగా ఫేమస్. ఇటలీలోని భారత ప్రధాని మోదీకి సంప్రదాయ శాకాహార వంటకాలను అందించే మహత్తర బాధ్యతను ఈ రెస్టారెంట్ తీసుకుంది. ప్రధాని మోదీ, అతని బృందానికి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని చూపించేలా వంటకాలను అందించనుంది ఇండియానో నమస్తే రెస్టారెంట్. (చదవండి: ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మోదీ 3.0: తొలి విదేశీ పర్యటనకు ప్రధాని పయనం
సాక్షి, ఢిల్లీ: దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మోదీ ఇటలీలోని అపులియా బయలుదేరారు.మోదీ మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశీ పర్యటన కావటం గమనార్హం. జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్‌కు హాజరుకావాలని ఇటలీ.. భారత్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారు. సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.ఇక జీ7 50వ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వారికి ఘనస్వాగతం పలికారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.కాగా, గత ఏడాది జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 దేశాల సదస్సుకు హాజరైన మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ప్రపంచ నేతలతో ఆయన చర్చలు జరిపారు. -
నేడు ఇటలీకి మోదీ.. జీ–7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని
న్యూఢిల్లీ: జీ7 అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం జీ7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీకి గురువారం ప్రధాని మోదీ బయల్దేరనున్నారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదేకావడం విశేషం. గత ఏడాది భారత సారథ్యంలో ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్ 13వ తేదీ నుంచి 15వ తేదీదాకా జరగనుంది. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్‌ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు అధినేతలు సమాలోచనలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. రష్యా భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం ఒక సెషన్లో పాల్గొని రష్యాపై విమర్శల వర్షం కురిపించనున్నారు. మోదీ విదేశీ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. ‘‘ చర్చలు, సంప్రతింపుల ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలకు ముగింపు పలికేందుకు భారత్ ఎప్పటిలాగే సదా సిద్ధంగా ఉంది’ అని ఖ్వాత్రా చెప్పారు. స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అయితే భారత్ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. గాందీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ రాతలు ఇటలీలో మోదీ గురువారం పర్యటన మొదలుకానున్న ఒక్క రోజు ముందే అక్కడి గాంధీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద రాతలు రాశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనుకూల నినాదాలనూ ప్రతిమ పీఠం వద్ద నలుపురంగుతో రాశారు. ప్రతిమను ఆవిష్కరించిన కొద్దిసేపటికే వేర్పాటువాదులు ఈ చర్యలకు తెగబడ్డారు. వేర్పాటువాదుల దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తగిన చర్యలు తీసుకోవాలని ఇటలీ అధికారులకు సూచించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. వెంటనే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని ఖలిస్తానీ రాతలను తుడిచేసింది. -
జీ7సమ్మిట్‌కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
రోమ్: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ విదేశీవ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే విగ్రహ శిథిలాలను ఇటలీ ప్రభుత్వం అక్కడినుంచి తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించింది.ప్రధాని మోదీ జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్న తరుణంలో ఈ దుశ్చర్యకు తీవ్రవాదులు ఒడిగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇటలీలోని ఎపులియాలో జూన్ 13 నుంచి 15దాకా జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీ7లో భారత్ సభ్య దేశం కానప్పటికీ మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్నారు. -
మూడోటర్ము.. మోదీ తొలి విదేశీ టూర్ ఇటలీకి..!
న్యూఢిల్లీ: ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘జీ7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని మంత్రి జార్జియా మెలోని గురువారం(జూన్6) ఫోన్లో మోదీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోదీ ఓకే అన్నారు. తనను ఆహ్వానించినందుకు మెలోనికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు’అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణమార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ,జపాన్, యూకే,అమెరికా జీ7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. జీ7 సదస్సు సైడ్‌లైన్స్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్‌కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్‌లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
ఇది మోదీ ఎక్స్‌ప్రెస్!
గమనించాలి... గ్రహించాలే కానీ సంఘటనలన్నీ ఏదో ఒక సంకేతమిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జరిపిన మూడు దేశాల పర్యటన చూస్తే అదే అనిపిస్తుంది. ప్రపంచ దేశాధినేతల ప్రత్యేక ప్రశంసలు, ప్రవాస భారతీయుల నుంచి జయ జయ ధ్వానాలు మోదీకే కాదు... భారత్‌కు పెరిగిన ప్రాధాన్యాన్నీ, ప్రతిష్ఠనూ సూచిస్తున్నాయి. జపాన్‌లో ‘జీ7’ దేశాల సదస్సులో అతిథిగా హాజరైనప్పుడూ, పాపువా న్యూ గినియా నేత ఏకంగా పాదాభివందనం చేసినప్పుడూ, ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల ‘మోదీ’ నాదాలు చూసినప్పుడూ వెలువడ్డ సంకేతం అదే. కర్ణాటకలో పదే పదే పర్యటించి, భారీ సభలు, ఊరేగింపులు నిర్వహించినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారం చేజార్చుకున్న బీజేపీ నేతగా స్వదేశంలో సన్నాయి నొక్కులు వినిపిస్తూ ఉండ వచ్చు. ప్రధానిగా బాహ్య ప్రపంచంలో మాత్రం మోదీ సమ్మోహన మంత్రానికి తరుగు, తిరుగు లేదని అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అగ్ర రాజ్యాల దాకా అన్నీ.. అతిపెద్ద మార్కెటైన నవభారతంతో భుజాలు రాసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయని తెలుస్తుంది. హిరోషిమాలో ‘జీ7’ సదస్సుకు హాజరైన ప్రధాని ఆ పైన ద్వీపదేశమైన పాపువా న్యూ గినియాను తొలిసారి సందర్శించారు. ‘భారత – పసిఫిక్ ద్వీపదేశాల సహకార వేదిక’ (ఎఫ్ఐపీఐసీ) మూడో సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఆ దేశానికి ఒక భారత ప్రధాని వెళ్ళడం ఇదే ప్రథమం. ఏడాది క్రితం పదవి చేపట్టిన లేబర్ పార్టీ నేత, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానంపై మోదీ సిడ్నీలో పర్యటించారు. అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం, వ్యాపార బృందాల రౌండ్ టేబుల్‌తో తన మూడు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించి, స్వదేశానికి తిరిగొచ్చారు. స్వదేశంలోని రాజకీయ చిక్కులతో అమెరికా అధ్యక్షుడు వైదొలగేసరికి ఆస్ట్రేలియాలో జరగాల్సిన ‘క్వాడ్’ సదస్సును లఘువుగా జపాన్‌లోనే అధినేతలు జరిపేశారు. ఆస్ట్రేలియాతో పటిష్ఠ బంధానికి అవకాశం వదులుకోని మోదీ తన పర్యటనను సమయానికి తగ్గట్టు ద్వైపాక్షిక సందర్శన చేసేశారు. గత ఏడాది కాలంలో ఆరోసారి అల్బెనీస్‌తో భేటీ, ఈ ఆర్థిక, వాణిజ్య సహకార దోస్తీ ప్రాంతీయ శాంతి సుస్థిర తలకూ కీలకమన్నారు. ‘డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ’– ఈ మూడు ‘డి’లు కీలకమంటూ, శరవేగంతో మెరుగవుతున్న ఇరుదేశాల సంబంధాలకు టీ20 మ్యాచ్‌లతో పోలిక తెచ్చారు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులు, వేర్పాటువాద శక్తుల విజృంభణను మార్చిలో అల్బనీస్‌తో ప్రస్తావించినా ఇప్పుడూ ఆ ఊసెత్తడం స్నేహదేశానికి ఒకింత ఇబ్బందికరమే. అది అటుంచితే, భారత ప్రధానికి సాదర స్వాగతం పలుకుతూ ఆ దేశంలోని అతి పెద్ద వినోద, క్రీడా ప్రాంగణంలో సాగిన భారీ సంబరం ప్రవాసుల్లో పెరిగిన జాతీయవాదానికి మచ్చు తునక. ‘మోదీ ఎయిర్వేస్’, ‘మోదీ ఎక్స్‌ప్రెస్’ లాంటి పేర్లతో ఆస్ట్రేలియా నలుమూలల నుంచి ప్రత్యేక విమా నాల్లో, రైళ్ళలో అభిమాన జనం తరలివచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి లక్షల కోట్ల రూపాయలను ప్రవహింపజేస్తున్న ప్రవాస భారత ప్రపంచానికి ఒక భరోసా ఇవ్వాలని ప్రధాని భావించినట్టున్నారు. అందుకే, క్రిక్కిరిసిన స్టేడియమ్లో ముప్పావుగంట సేపు మాటల మోళీ చేశారు. తొమ్మిదేళ్ళలో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రియతమ నేత పట్ల భారతీయ డయాస్పోరా స్పందన చూసి, అక్కడి పాలకులు సైతం అబ్బురపడ్డారు. 2014 నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు ఆయన అప్పుడప్పుడే విశ్వవేదికపై నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని. నాడు బ్రిస్బేన్‌లో ‘జీ20’ సదస్సులో ఇతర దేశాలతో స్నేహానికి ఆయన శ్రమిస్తే, నేడు 2023లో అదే భారత్ ‘జీ20’కి అధ్యక్ష పీఠం దాకా ఎదిగింది. పోటీ దేశాల కన్నా వేగంగా పెరుగుతున్న దేశమైంది. అప్పట్లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో బెరుకుగా మాట్లాడిన అదే వ్యక్తి ఇప్పుడు విదేశీ పర్యటనలు, డజన్ల కొద్దీ శిఖరాగ్ర సదస్సుల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా సహచరుడు ‘మోదీ... ది బాస్’ అని మైకులో అంటే, వచ్చే అమెరికా పర్యటనలో భారత ప్రధాని వైట్‌హౌస్ విందుకు అప్పుడే టికెట్లు అమ్ముడై పోయాయంటూ, ఆటోగ్రాఫ్ కావాలని అగ్రరాజ్య అధినేత బైడెన్ చమత్కరించడం గమనార్హం. మోదీ మాటల్లోనే చెప్పాలంటే, ‘నేను కలసిన నేతలందరూ ‘జీ20’కి భారత సారథ్యం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది భారత్‌కు గర్వకారణం.’ ఇవాళ భారత్ ప్రపంచంలోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. జనాభాలో చైనాను దాటి ప్రపంచంలో ప్రథమ స్థానానికి దూసుకుపోతున్న మన గడ్డపై ఈ మానవ వనరులకు తోడు అపార ప్రతిభ, అరచేతిలో సాంకేతికత ఉన్నాయి. వాణిజ్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, మొబైల్ తయారీ, అందివచ్చిన అంకుర సంస్థల ఉద్యమం లాంటి అనేక సానుకూలతలతో పురోగమిస్తున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నది. హరిత ఉదజని టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఖరారు చేసుకోవడం మొదలు వలసలు – రాకపోకల భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపీఏ) దాకా ఆస్ట్రేలియా – భారత్‌లు తాజాగా సంతకాలు చేయడం ఆ ధోరణికి కొనసాగింపే! ఇవన్నీ విద్యార్థులు, వృత్తి నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తల రాకపోకలను సులభతరం చేస్తాయి. ఆర్థిక, దౌత్య సంబంధాలైనా, అత్యంత కీలకమైన భౌగోళిక వ్యూహాత్మక దోస్తీలైనా బాగుండాలంటే మనుషుల మధ్య ఆత్మీయ బంధాలు ప్రధానం. ప్రజాస్వామ్య దేశాలతో, ప్రవాస భారతీయులతో కలసి అడుగులు వేస్తున్న నమో భారత్ అనుసరిస్తున్న మార్గమూ అదే! -
హిరోషిమాలో నిష్ఠుర నిజాలు
జపాన్‌లోని హిరోషిమా వేదికగా మూడు రోజులు సాగిన జీ7 దేశాల సదస్సు రష్యాపై మరిన్ని ఆంక్షలు, చైనాపై ఘాటు విమర్శలు, ఉక్రెయిన్ అధినేత ఆశ్చర్యకర సందర్శనతో ఆదివారం ముగిసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో కూడిన ‘జీ7’లో భాగం కానప్పటికీ, ఈ 49వ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్న భారతదేశం ప్రాధాన్యం ఈ వేదిక సాక్షిగా మరోసారి వెల్లడైంది. భారత ప్రధానికి అమెరికా, ఆస్ట్రేలియా అధినేతల ప్రశంసల నుంచి పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన పాదాభివందనం దాకా అనేకం అందుకు నిదర్శనాలు. రష్యా దాడి నేపథ్యంలో యుద్ధబాధిత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ఆయన సంక్షోభ పరిష్కారానికి వ్యక్తిగతంగానూ చొరవ చూపుతానడం పెద్ద వార్త. అంతటితో ఆగక ఆ మర్నాడే ఐరాసపై విమర్శల బాణం ఎక్కుపెట్టి, పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరణలు చేయకుంటే ఐరాస, భద్రతా మండలి కేవలం కబుర్లకే పరిమితమైన వేదికలుగా మిగిలిపోతాయనడం సంచలనమైంది. నిష్ఠురమైనా భారత ప్రధాని వ్యాఖ్యలు నిజమే. మూడేళ్ళక్రితం తూర్పు లద్దాఖ్ వెంట భారత్‌తో చైనా ఘర్షణ మొదలు తాజా ఉక్రెయిన్ సంక్షోభం దాకా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సమస్యల్ని చర్చించి, ఘర్షణల్ని నివారించాల్సిన ఐరాస ఆ పని చేయలేక ఇటీవల నామమాత్రంగా మారిన సంగతి చూస్తు న్నదే. సమస్యల్ని ఐరాసలో కాక, ఇతర వేదికలపై చర్చించాల్సి రావడం వర్తమాన విషాదం. అదే సమయంలో అంతర్జాతీయ చట్టం, ఐరాస నియమావళి, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవించి తీరాలంటూ జీ7 వేదికగా భారత ప్రధాని కుండ బద్దలు కొట్టారు. కాదని ఏకపక్షంగా వాస్తవస్థితిని మార్చే ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అన్న మోదీ వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవే. భద్రతా మండలిలో భారత సభ్యత్వానికి జరుగుతున్న సుదీర్ఘ కాలయాపన కూడా మోదీ మాటలకు ఉత్ప్రేరకమైంది. గమ్మత్తేమిటంటే, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం 1945 నాటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న భద్రతామండలిని వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని మీడియా ఎదుట అంగీకరించడం. ఇక, సాధారణ అలవాటుకు భిన్నంగా ఒక రోజు ముందు శనివారమే వెలువడ్డ జీ7 విధాన ప్రకటన డజన్ల కొద్దీ పేజీలున్నా – అందులో ప్రధానంగా చైనాపై విసిరిన బాణాలే ఎక్కువ. కనీసం 20 సార్లు చైనా నామ స్మరణ సాగింది. తైవాన్, అణ్వస్త్రాలు, ఆర్థిక నిర్బంధం, మానవహక్కులకు విఘాతం, అమెరికా సహా పలు దేశాలతో బీజింగ్‌కు ఉన్న ఉద్రిక్తతలు ప్రకటనలో కనిపించాయి. సహజంగానే డ్రాగన్ ఈ ప్రకటనను ఖండించింది. ఇదంతా ‘పాశ్చాత్య ప్రపంచం అల్లుతున్న చైనా వ్యతిరేక వల’ అని తేల్చే సింది. రష్యా సైతం ఈ సదస్సు తమపైనా, చైనాపైనా విద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నమంది. యాభై ఏళ్ళ క్రితం ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఏడు పారిశ్రామిక శక్తుల బృందమైన ‘జీ7’ దేశాలు ప్రపంచ సంపదలో దాదాపు 70 శాతానికి ప్రాతినిధ్యం వహించాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా 44 శాతమే. నిజానికి, 2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ‘జీ20’ కూటమి ఏర్పాటయ్యాక అంతర్జాతీయ ఆర్థిక మేనేజర్‌గా ‘జీ7’ వెలుగు తగ్గింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అగ్రశ్రేణిలో నిలిచిన ఈ దేశాలు ఇప్పటికీ తామే ప్రపంచ విధాన నిర్ణేతలమని చూపాలనుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆ ఆలోచన, ఆకాంక్ష అత్యవసర మయ్యాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని సమర్థించే శక్తులన్నీ ఒక్కచోట చేరి ఈ సదస్సును వినియోగించుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి అంతర్జాతీయ సమాజ విధివిధానాలకే సవాలని జపాన్ ప్రధాని పదే పదే పేర్కొన్నది అందుకే! స్వదేశంలోని రాజకీయ అంశాలతో తన పర్యటనలో రెండో భాగాన్ని రద్దు చేసుకున్నా ‘జీ7’కు మాత్రం అమెరికా అధ్యక్షుడు హాజరైందీ అందుకే! అదే సమయంలో 2.66 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, తమ సభ్యదేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, కెనడాల కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను అనేకానేక కారణాల వల్ల జీ7 విస్మరించే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, సరఫరా వ్యవస్థల్లో చిక్కులతో అనేక పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో పడ్డాయి. అటు రష్యాతో, ఇటు పాశ్చాత్య ప్రపంచంతో సంబంధాల్లో సమతూకం పాటిస్తుండడం భారత్‌కు కలిసొస్తోంది. భవిష్యత్తులో చర్చలు, దౌత్యంతో యుద్ధం ఆగాలంటే – ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్ మధ్యవర్తిత్వం కీలకం. కిందపడ్డా తనదే పైచేయిగా ఉండేలా ‘జీ7’కు భారత్ ఆ రకంగా అవసరమే. భారత్ సైతం ఒకపక్కన చైనా దూకుడును పరోక్షంగా నిరసిస్తూనే, రష్యా సాగిస్తున్న యుద్ధంపై తటస్థంగా ఉంటూ శాంతి ప్రవచనాలు చేయక తప్పని పరిస్థితి. భారత ప్రధాని అన్నట్టు చర్చలే అన్ని సమస్యలకూ పరిష్కారం. సమస్యను రాజకీయ, ఆర్థిక కోణంలో కాక మానవీయ కోణంలో చూడా లన్న హితవు చెవికెక్కించుకోదగ్గదే. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో వెనకబడ్డ దక్షిణార్ధగోళ దేశాలకు భారత్ గొంతుక కావడమూ బాగుంది. ప్రపంచ అధికార క్రమంలో గణనీయ మార్పుల నేపథ్యంలో ఇలాంటి శిఖరాగ్ర సదస్సులు, సమాలోచనలు జరగడం ఒకరకంగా మంచిదే. సమస్యల్ని ఏకరవు పెట్టడం సరే కానీ, సత్వర పరిష్కారాలపై జీ7 దృష్టి నిలిపిందా అంటే సందేహమే! -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
ఆ సిల్లీ బెలూన్ ప్రతిదాన్ని మార్చేసింది! త్వరలో అన్ని సమసిపోతాయ్: బైడెన్
అమెరికా రక్షణ స్థావరంలోని గగన తలంలపై ఎగిరిన చైనా గుఢాచారి బెలూన్ కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతకమునుపు నవంబర్‌లో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ 20 సదస్సులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడ బైడైన్ చర్చలు జరిపారు. అవి జరిగిన నెలరోజుల్లోనే చైనాతో సంబధాలు క్షీణించాయని ప్రకటించారు బైడెన్. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంలో ఎగిరిన స్పై బెలూన్‌తో ఒక్కసారిగా సంబంధాలు భగ్గుమన్నాయి. ఒకరకంగా ఈ స్పై బెలూన్ కారణంగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్యపరమైన విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ సంఘట కారణంగానే.. అమెరికా చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునే అంశంతో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ పర్యటనను కూడా అనూహ్యంగా రద్దు చేసింది. ఈ మేరకు జపాన్‌లోని హిరోషిమాలో జరగతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చైనా యూఎస్‌ల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించగా..బాలి సమావేశంలో తాము ఇరువురం(బైడెన్, జిన్‌పింగ్) సమావేశమయ్యి, చర్చించాలని అనుకున్నాం కానీ ఆ సిల్లీ బెలూన్ ప్రతిదీ మార్చేసింది. ఆ స్పై బెలూన్ రెండు కార్లు రవాణ చేసే పరికరాలను తీసుకెళ్లగల సామర్థ్యం కలది. దీన్ని తాము కాల్చడంతోనే అంతా ఒక్కసారిగా మారిపోయిందని, ఇవన్నీ త్వరలో సమసిపోవాలనే భావిస్తున్నా. అలాగే తమ చర్యని కూడా సమర్థించుకునే యత్నం చేశారు బైడెన్. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ యథావిధికి వచ్చేలా చేయగలిగినదంతా చేస్తానని బైడెన్ చెప్పారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!
జపాన్‌లోని హిరోషిమాలో జీ 7 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్ అడిగారు. ఈ మేరకు ఆ సదస్సులో జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన విషయంలో తాము ఎదుర్కొంటున్న విచిత్రమైన సవాళ్లను పంచుకున్నారు. జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ విషయం గురించి బైడెన్ ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోదీ కార్యక్రమాలకు హాజరుకావడానికి పౌరుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న అభ్యర్థనల వరద తమకు ఎలా సవాలుగా మారిందో వివరించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియ ప్రధాని అల్బనీస్ విజయోత్సవ ల్యాప్‌లో దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికారో గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు ఆయన మోదీతో మాట్లాడుతూ సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కెపాసిటీ 20 వేల మందికి సరిపడేదని, అయినా ఇప్పటికీ అందుత్ను రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయలేకపోతున్నానని అన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణ గురించి అల్బనీస్ సంభాస్తుండగా.. మధ్యలో బైడెన్ జోక్యం చేసుకుంటూ.. ‘నాకు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో సుమారు 22 దేశాలకు చెందిన ప్రతినిధుల పాల్గొన్నారు. (చదవండి: క్లీనర్ సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ
హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు. సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్‌లో జరుగుతోంది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు. సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మోదీకి బైడెన్ ఆత్మీయ ఆలింగనం జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు. అణు విలయపు నేలపై శాంతిమూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్ కూడా భాగస్వామి కావాలని జెలెన్స్కీ కోరారు. -
ఇది ప్రపంచానికే పెద్ద సమస్య: ప్రధాని మోదీ
హిరోషిమా: ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం.. కేవలం ఆ దేశ సమస్య కాదని, ఇది యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ7 సదస్సు కోసం హిరోషిమా(జపాన్) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని కలిశారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య. ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. దీనిని నేను ఓ రాజకీయ లేదంటే ఆర్థిక సమస్యగా పరిగణించను. నా దృష్టిలో ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలేంటో మా అందరికంటే మీకే బాగా తెలుసు. గత సంవత్సరం మా పిల్లలు(భారతీయ విద్యార్థులను ఉద్దేశించి..) ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు.. మీ పౌరుల ఆవేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం, వ్యక్తిగతంగా నేనూ.. మా సామర్థ్యం మేరకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అని ప్రధాని మోదీ, జెలన్స్కీకి హామీ ఇచ్చారు. #WATCH | Japan: Prime Minister Narendra Modi meets Ukrainian President Volodymyr Zelensky in Hiroshima, for the first time since the Russia-Ukraine conflict, says, "Ukraine war is a big issue in the world. I don't consider it to be just an issue of economy, politics, for me, it… pic.twitter.com/SYCGWwhZcb — ANI (@ANI) May 20, 2023 జీ 7 శిఖరాగ్ర సదస్సు కోసం.. జపాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలు హిరోషిమా నగరానికి వెళ్లారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఇరువురు నేతలు వర్చువల్‌గా, ఫోన్లో సంభాషించుకున్నారు. అయితే నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధం ఆగుతుందని, శాంతి నెలకొంటుందని ప్రధాని మోదీ మరోసారి జెలెన్స్కీ వద్ద ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్ ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ గతంలోనే ప్రకటించారు. -
జపాన్ పర్యటనలో ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ
టోక్యో: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. మోదీతో జెలెన్ స్కీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ కోసం, అలాగే శాంతి కోసం భారత్ ఎలాంటి ప్రయత్నానికైనా సిద్ధమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2022, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ-జెలెన్స్కీల తొలిసారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తో రష్యా సంబంధాల దృష్ట్యా .. ఉక్రెయిన్, రష్యాల మధ్య రాజీ చర్చలకు ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి మించిన నాయకుడు ఇంకొకరు లేరు. రెండు పక్షాలు నమ్మదగిన ఏకైక దేశం, వ్యక్తి మోదీనే. ఇప్పటికే యుద్ధం వల్ల లక్షలాది మంది చనిపోవడం, గాయపడడం లేదా శరణార్థులుగా మారిన దృష్ట్యా.. అర్జంటుగా యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమయింది. ఇదిలా ఉంచితే, మోదీపై తన ఆప్యాయతను ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. శనివారం హిరోషిమా(జపాన్)లో జీ7 సదస్సు సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. బైడెన్ రాకను గమనించి కుర్చీలోంచి లేచి మరీ ఆలింగనం చేసుకున్నారాయన. ఈ సందర్భంగా బైడెన్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే వేదికగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను సైతం ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని పలకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో సైతం మోదీ భేటీ అయ్యారు.జీ7 సదస్సు కోసం ఒకరోజు ముందుగానే జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan. pic.twitter.com/bbaYMo1jBL — ANI (@ANI) May 20, 2023 Prime Minister Narendra Modi met Indonesian President Joko Widodo and his wife in Hiroshima, Japan. "India attaches great priority to strong ties with Indonesia," the Prime Minister tweets. pic.twitter.com/l7xcCpC1Uo — ANI (@ANI) May 20, 2023 Ukrainian President Volodymyr Zelensky arrives in Japan's Hiroshima for #G7Summit (Picture source: AFP News Agency) pic.twitter.com/AJc6fJWh7J — ANI (@ANI) May 20, 2023 #G7HiroshimaSummit | British PM Rishi Sunak and PM Narendra Modi share a hug as they meet in Hiroshima, Japan. (Pic source: Rishi Sunak's Twitter handle) pic.twitter.com/fVM91pe4cW — ANI (@ANI) May 20, 2023 -
ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..
పాకిస్తాన్‌తో భారత్ సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటుందని భారత్ ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదం లేని అనుకూలమైన వాతావరణం సృష్టించడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాక్‌నే భాద్యత వహిస్తుందని మోదీ చెప్పారు. జపాన్‌లో జరిగే జీ7 సదస్సుకు గెస్ట్ కంట్రీగా భారత్ హాజరవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అతిపెద్ద స్వతంత్ర వ్యాపార మీడియా గ్రూపులలో ఒక్కటైన నిక్కి ఆసియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాక్ మద్దతుపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాల గురించి ప్రశ్నించిగా..దక్షిణాసియా దేశాల గొంతును, వారి ఆందోళనను తెలియజేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. భారత్ తన సౌర్వభౌమాధికారం, గౌరవం కాపాడుకునేందుకు సిద్దంగానే గాక అందుకు కట్టుబడి ఉందన్నారు. 2020లో చైనా సైన్యంతో చర్యలు తర్వాత తూర్ప లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఈ చర్చలు కొన్ని ప్రాంతాలను విడదీసేలా ఘర్షణ కలిగించాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు, అభివృద్ధి, పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉందన్నారు. అంతేగాదు ఇరు దేశాల విస్తృత సంబంధాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని సంధించిన ప్రశ్నకు..ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం వైఖరి స్పష్టంగా తిరుగులేనిదని మోదీ చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతివైపు నిలుస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్లతో తాము కమ్యూనికేషన్ కొనసాగిస్తామన్నారు. సహాయ సహకారాలతో సమయాన్ని నిర్వచించాలి గానీ సంఘర్షణతో కాదు అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలే జపాన్, భారత్‌ని మరింత దగ్గర చేశాయని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇప్పుడూ ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుతున్న రాజకీయ, వ్యూహాత్మక భద్రత కలయికను చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. ఈ సమ్మిట్‌కు భారత్‌ను అతిధిగా ఆహ్వానించారు. 2003 నుంచే జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది. (చదవండి: నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్‌గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..) -
అపర చాణక్యం
ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఏడింటి అధినేతలు జర్మనీలోని బవేరియాలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, కరోనా అనంతర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో సవాళ్ళు, పర్యావరణ మార్పులు – ఈ మూడు సమస్యల నేపథ్యంలో ‘జీ–7’ దేశాల తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా ఎగుమతులపై ఆధారపడడం సహా కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం లేకున్నా, వర్తమాన సంక్షుభిత కాలంలో ‘జీ–7’ దేశాలు ఐక్యతా రాగం ఆలపించడం విశేషం. మూడు రోజుల ఈ సమావేశానికి భారత్, అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికాల నేతలు అతిథులు. అంటే, పారిశ్రామికీకరణలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న దేశాలు సైతం వాతావరణ సంక్షోభం, ఆహార – ఆరోగ్య భద్రత లాంటి అంశాల పరిష్కారానికి వర్ధమాన ప్రపంచాన్ని సైతం కలుపుకొని పోవడమే మార్గమని గుర్తించాయన్న మాట. ‘బ్రిక్స్’ వర్చ్యువల్ సమావేశం, ఆ వెంటనే ‘జీ–7’ ఆహ్వానం – వరస చూస్తుంటే ఎదుగుతున్న అగ్రదేశంగా భారత్ తన పట్టు చూపుతోంది. అంతర్జాతీయ యవనికపై అందరివాడినని అనిపించుకుంటోంది. కలవరపెడుతున్న ఉక్రెయిన్ అంశం ‘జీ–7’లోనూ చర్చకు వచ్చింది. ఉక్రెయిన్‌లో దీర్ఘకాల యుద్ధం తప్పేలా లేదనీ, ఆ దేశానికి అండగా నిలవాలనీ అమెరికా, మిత్ర దేశాలు భావించాయి. ఇంధనానికై రష్యాపై ఆధారపడడంపై ఈ కూటమిలో అభిప్రాయ భేదాలున్నా, ఆ సంగతి పక్కన బెట్టి, రష్యాపై ఆంక్షలను విస్తరించాలని నిర్ణయించాయి. గతకాల వైభవంగా మిగిలిపోరాదని ‘జీ–7’ ప్రయత్నం. ఈ ధనిక ప్రజాస్వామ్య దేశాల కూటమి ఇప్పటికీ శక్తిమంతమైనదే. ఐరాస, ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల్లో ఈ దేశాలే కీలక సభ్యులు. ఒక పరిశీలకుడిలా మన ‘జీ–7’కి మన ప్రధాని మోదీ ఆతిథ్యం అందుకున్నారు. ఇంధనం తర్వాత రష్యా అత్యధికంగా ఎగుమతి చేసే బంగారంపైన నిషేధం, చమురు ధరలపై నియంత్రణ లాంటి ఆంక్షలను ‘జీ–7’ వేదిక చర్చించింది. రష్యా నుంచి మనం తక్కువ రేటుకు ఇంధనం కొనుగోలు చేస్తుండడం, ఉక్రెయిన్‌పై రష్యా వ్యతిరేక వైఖరిని అవలంబించకపోవడం లాంటివి సహజంగానే అమెరికా సహా ఆ దేశాలేవీ జీర్ణించుకోలేని వ్యవహారం. కానీ, ఎప్పటిలానే ‘జీ–7’లోనూ ఆ ఒత్తిడిని భారత్ సమర్థంగా ఎదుర్కొంది. చర్చల ద్వారా శాంతి స్థాపనే ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారమన్న మన వైఖరిని పునరుద్ఘాటించింది. ‘జీ–7’లో మోదీ పాలుపంచుకోవడం ఇది ముచ్చటగా మూడోసారి. ఈసారి పర్యావరణం, ఇంధనం, ఆరోగ్యం, ఆహార భద్రత, లైంగిక సమానత్వానికి సంబంధించిన సదస్సుల్లో మన దేశం పాల్గొంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ళపై ఎప్పటికప్పుడు అనేక అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన భారత్ ఇప్పుడూ తన మునుపటి మాటనే ప్రస్తావించింది. 2019 నాటి ‘జీ–7’లో లానే ఈసారీ పర్యావరణంపై మనం పెట్టుకున్న లక్ష్యాలను వివరించింది. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని తొమ్మిదేళ్ళు ముందుగానే సాధించినట్టు మోదీ చెప్పుకొచ్చారు. జర్మనీ నుంచి తిరిగొస్తూ మార్గమధ్యంలో అబుధాబీలో ఆగి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త పాలకుడిని కలసి, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ దేశ జనాభాలో 35 శాతమున్న 35 లక్షల భారత ఎన్నారైల రక్షణ, రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని దృఢపరిచారు. ఒకపక్క అమెరికా ఛత్రఛాయల్లోని ‘జీ–7’తో స్నేహంగా ఉంటూనే, మరోపక్క చైనాతో మన కున్న తగాదాలను పక్కనబెట్టి మరీ రష్యాతో సహా అందరితో కలసి ‘బ్రిక్స్’లో నిర్మాణాత్మకంగా అడుగులు వేయడం మన దేశం చేస్తున్న చిత్రమైన సమతూకం. అసలు ‘బ్రిక్స్’ ప్రాసంగికత ఎంత అని పలువురు అనుమానపడ్డారు. కానీ పలు సంస్థా్థగత సంస్కరణలు చేపట్టినందున వర్ధమాన దేశాల అవసరాలను తీర్చడంలో ఈ గ్రూప్ ప్రభావశీలమైనదని మోదీ నొక్కిచెప్పడం గమనార్హం. అదే సమయంలో ప్రపంచ దేశాలన్నిటికీ ఇంధనం అందుబాటులో ఉండాలనీ, అది కేవలం ధనిక దేశాల విశేషాధికారం కాకూడదనీ ‘జీ–7’లోనూ మోదీ మరోసారి ఎలుగెత్తడం విశేషం. రాగల 20 ఏళ్ళలో భారత ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయని భావిస్తున్న వేళ, ఇవాళ్టికీ దేశమంతటా నిరంతరాయ విద్యుత్ సరఫరా లేని పరిస్థితుల్లో ఇది కీలకం. ప్రపంచానికి పర్యావరణ హిత టెక్నా లజీని అందిస్తూ, బాసటగా ఏటా 100 బిలియన్ డాలర్లిస్తామని పాశ్చాత్య ప్రపంచం ఎన్నడో మాట ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోని దేశాల్ని మేలుకొల్పడానికి ‘జీ–7ను భారత్ వాడుకోవడం బాగుంది. గమ్మత్తేమిటంటే, ‘జీ–7’ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ తమ తమ గడ్డపై అంతర్జాలంలోనూ, బయటా భావప్రకటన స్వేచ్ఛ, స్వతంత్ర అభిప్రాయాలనూ పరిరక్షించి, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తామంటూ ప్రతిన బూనడం. ఇది మంచి చర్యే. కానీ, అమెరికా, ఇటలీ మొదలు మన దాకా ప్రతిచోటా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి మైనారిటీల కన్నా మెజారిటేరియనిజమ్ వైపే మొగ్గు ఉంటోందని ఆరోపణలు వస్తున్న వేళ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి. ‘జీ–7’ అయ్యీ అవగానే మ్యాడ్రిడ్‌లో ‘నాటో’ శిఖరాగ్ర సదస్సు. అక్కడ ఉక్రెయిన్‌పై సాగే వ్యూహాత్మక చర్చలకు అమెరికా ఈ ‘జీ–7’లో బాటలు వేసింది. రష్యాతో పాటు చైనా నుంచీ తలెత్తుతున్న భయాలకు తొలిసారిగా కొత్త ప్రతివ్యూహానికి ‘నాటో’ సదస్సు పచ్చజెండా ఊపవచ్చు. ఎక్కడ, ఎవరి అజెండా ఎలా ఉన్నా అపర చాణక్య నీతితో భారత్ తన విధానాన్ని కుండబద్దలు కొడుతూనే, స్వప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేయడం అపురూప విన్యాసమే! -
రష్యాను ఆర్థికంగా దెబ్బతీద్దాం
ఎల్మౌ(జర్మనీ): ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని జి–7 దేశాధినేతలు ప్రతినబూనారు. రష్యా దాడులు కొనసాగినంత కాలం ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలని ఐక్యంగా తీర్మానించారు. జర్మనీలో జరుగుతున్న జి–7 నేతల సదస్సు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నేతలు తుది ప్రకటన వెలువరించారు. ‘‘రష్యాపై తక్షణం, అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని తీర్మానించాం. పెట్రోల్, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాల విక్రయాలతో అందుతున్న నిధులతోనే రష్యా యుద్ధానికి దిగింది. అందుకే, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఈ శిలాజ ఇంధనాలతోపాటు, వాటి ధరలపై పరిమితులు విధించేందుకు వీలు కల్పించే చర్యలపై వచ్చే రానున్న వారాల్లో చర్చించి, కార్యాచరణకు దిగుతాం. రష్యాపై ఆంక్షల కొనసాగింపు విషయంలో కలిసి కట్టుగా సమన్వయంతో ముందుకు సాగేందుకు కట్టుబడి ఉంటాం’అని అందులో పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను కనీస స్థాయికి తేవడం ద్వారా ఇంధన ధరలను అదుపు చేయవచ్చని జి–7 నేతలు భావిస్తున్నారు. ఇంధన సరఫరా నౌకలు, బీమా కంపెనీలు అత్యధికం యూరప్ దేశాలవే కావడం కూడా కలిసివచ్చే అంశమని ఆశిస్తున్నారు. దీంతోపాటు, రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించడంతోపాటు, నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ నుంచి గోధుమల రవాణాను రష్యా నిలువరించడంతో ఆహారం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు సాయం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో సహజవాయు అన్వేషణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కూడా తీర్మానించారు. ఉక్రెయిన్‌లోని క్రెమ్చుక్ షాపింగ్‌మాల్‌పై రష్యా దాడిని జి–7నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది యుద్ధ నేరమేనన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను దీనికి బాధ్యుడిని చేస్తామన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో చైనా ఆవలంభిస్తున్న వైఖరిపై జి–7 నేతలు ఆందోళన వెలిబుచ్చారు. దురాక్రమణను ఆపేలా రష్యాను చైనా ఒప్పించాలని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లను అధిగమించేందుకు చైనాతో కలిసి పనిచేయాలని కూడా అంగీకారానికి వచ్చారు. దీంతోపాటు, గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కొనే విషయంలో ఆసక్తి చూపే దేశాలతో కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కూటమిలో చేరే దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై వాతావరణ సంబంధ పన్నులను రద్దు చేయాలని కూడా తీర్మానించారు. కొత్త కూటమికి సంబంధించిన విధివిధానాలను ఈ ఏడాదిలోనే ఖరారు చేస్తామని జర్మనీ ఛాన్సెలర్ షోల్జ్ చెప్పారు. మాడ్రిడ్‌లో 28–30 తేదీల్లో జరిగే నాటో సమావేశానికి నేతలు తరలివెళ్లారు. యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని భేటీ అబుదాబి: యూఏఈ నూతన అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ అయ్యారు. అబుదాబి విమానాశ్రయంలో షేక్ మొహమ్మద్‌తోపాటు రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు మోదీకి ఘన స్వాగతం పలికారు. షేక్ మొహమ్మద్ తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపం తెలిపారు. పీవీకి మోదీ నివాళులు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ‘ దేశ ప్రగతికి ఆయన చేసిన కృషికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందంటూ ట్వీట్ చేశారు -
మోదీ భుజం తట్టి మరీ పలకరించిన బైడెన్: వీడియో వైరల్
ఎల్మౌ (జర్మనీ): ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మేరకు ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో ఈ సదస్సు అట్టహసంగా జరిగింది. ఈ శిఖరాగ్ర సదస్సులో మోదీ దాదాపు 12 మంది దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. సదస్సు అనంతరం ఫోటో సెషన్ సందర్భంగా..ధేశాధినేతలంతా రెడీ అవుతున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేరుగా మోదీ వద్దకు నడుచుకుంటూ వెళ్లి భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే మోదీ కూడా వెనుదిరిగి కరచలనం చేసి చిరునవ్వులతో పరస్పరం పలకరించుకున్నారు. ఆ సమయంలో మోదీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సంతోషంగా సంభాషిస్తున్నారు. ఇంతలో బైడెనే స్వయంగా మోదీ వద్దకు వచ్చి ఆత్మీయంగా పలకరించడం ఆ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సదస్సులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సహా మరికొద్దిమంది నాయకులతో మోదీ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఐతే రెండోవ రోజు జరిగిన సమావేశంలో జీ 7 దేశాధినేతలు ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించడం పై దృష్టి సారించారు. Biden walks upto PM Modi at G7 Summit, shows bonhomie between leaders of democratic world Read @ANI Story | https://t.co/aKIgknrbsW#JoeBiden #PMModi #G7Summit #PMModiInGermany pic.twitter.com/E9DHcgyorT — ANI Digital (@ani_digital) June 27, 2022 (చదవండి: ఆ పోరులో మాతో కలిసి రండి.. జీ-7కు ప్రధాని మోదీ పిలుపు) -
ఆ పోరులో మాతో కలిసి రండి.. జీ-7కు ప్రధాని మోదీ పిలుపు
ఎల్మౌ (జర్మనీ): పర్యావరణ పరిరక్షణకు, తత్సంబంధిత వాగ్దానాలకు భారత్ పూర్తిగా కట్టుబడిందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్నేళ్లుగా భారత్ కనబరుస్తున్న పనితీరే అందుకు నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులపై పోరులో సంపన్న జీ7 దేశాలు కూడా భారత్‌తో కలిసి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. స్వచ్ఛ ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి భారత్‌లో అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వాటికి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఇక్కడ జీ7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో మాట్లాడారు. ఇంధన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామన్నారు. ‘‘పేద దేశాలు పర్యావరణానికి బాగా హాని చేస్తున్నారన్న అపోహను దూరం చేయడంలో భారత్ చిత్తశుద్ధి ఇతర వర్ధమాన దేశాలకూ స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రపంచ జనాభాలో 17 శాతానికి భారత్ నిలయం. కానీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దేశ వాటా కేవలం 5 శాతం. ప్రకృతితో కలిసి సాగే మా జీవన విధానమే ఇందుకు ప్రధాన కారణం’’ అన్నారు. ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో సోమవారం మోదీకి జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం అధినేతల ఫొటో సెషన్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీ వద్దకు స్వయంగా వచ్చి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు కూడా మోదీతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూ కన్పించారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ తదితరులతో మోదీ భేటీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సులో జి7 దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, కెనడా, జపాన్‌తో పాటు భారత్, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఛాయ్ పే చర్చలో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు జీ7 బాసట రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని జి7 దేశాధినేతలు ప్రతినబూనారు. యుద్ధం కాలంలో, తర్వాత కూడా మద్దతిస్తూనే ఉంటామన్నారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేనందున తమకు సాయంపై పశ్చిమ దేశాలు వెనుకంజ వేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని జి7 దేశాధినేతలు కొట్టిపారేశారు. రష్యా నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌కు నానామ్స్ సిస్టమ్ అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ‘నాసమ్స్’ను ఉక్రెయిన్ అందించాలని అమెరికా నిర్ణయించింది. కౌంటర్–బ్యాటరీ రాడార్లు కూడా ఇవ్వనుంది. 7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయమూ అందజేస్తామని బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి జి7 సహకారం కొనసాగిస్తూనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. -
G7 summit వేళ.. పుతిన్ ప్రకోపం
కీవ్: జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలనుసారం.. కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డాయి రష్యన్ బలగాలు. తూర్పు ఉక్రెయిన్ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొనేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న రష్యా సేనలు రాజధాని కీవ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో నగరాలకు నగరాలే నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కీవ్‌లో కనీసం రెండు రెసిడెంట్ కాంప్లెక్స్లపైన క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ విషయాన్ని స్థానిక మేయర్ విటాలీ క్లిట్స్కో ప్రకటించారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పొగలు వెలువడిన దృశ్యాలు కనిపించాయి. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి, భవనాల్లోని పౌరులను బయటకు తరలించారు. రష్యా బాంబు దాడుల్లో నలుగురు గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. శిథిలాల నుంచి ఏడేళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీశారు. తూర్పు ఉక్రెయిన్‌లో కీలకమైన లుహాన్స్క్పై రష్యా సైన్యం దాదాపు పట్టుబిగించింది. సీవిరోడోంటెస్క్ ఇప్పటికే రష్యా వశమయ్యింది. లీసిచాన్‌స్క్‌లో ఆదివారం రష్యా వైమానిక దాడుల్లో టీవీ టవర్ ధ్వంసమయ్యిందని, ఒక వంతెన తీవ్రంగా దెబ్బతిన్నదని లుహాన్స్క్ గవర్నర్ చెప్పారు. లీసిచాన్స్క్ సిటీ గుర్తుపట్టలేని స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సీవిరోడోంటెస్క్ పరిసర గ్రామాలను పూర్తిగా ఆక్రమించుకున్నారని రష్యా సైన్యం వెల్లడించింది. కీవ్ ప్రాంతంలో రష్యా సైన్యం గంటల వ్యవధిలోనే 14 క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎంపీ ఒలెస్కీ గోంచారెంకో చెప్పారు. స్పెయిన్‌లో త్వరలో జరుగనున్న నాటో సదస్సు నేపథ్యంలో రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని అన్నారు. ఈ నెల 5వ తేదీ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి. నగరంలో మరో రెండు పేలుళ్లు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. పుతిన్‌ను హేళన చేస్తూ.. జీ7 సదస్సులో.. సభ్య దేశాల ప్రతినిధులు పుతిన్‌ను అవహేళన చేసేలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై దాడి చేయిస్తుండడంతో.. జర్మనీలో జరుగుతున్న జీ7 సదస్సుల్లో.. ఏడు సంపన్న దేశాల గ్రూప్ నాయకులు ఆదివారం పుతిన్ ఇమేజ్ను ఎగతాళి చేశారు. కోట్లు, చొక్కాలు విప్పేసి మనమందరం పుతిన్ కంటే కఠినంగా ఉన్నామని చూపించాలి అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కామెంట్ చేశాడు. చొక్కా లేకుండా గుర్రపుస్వారీ చేయాలి అంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో కామెంట్ చేశాడు. గతంలో పుతిన్ చొక్కాలేకుండా గుర్రపు స్వారీ చేసిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక వేలాది మందిని చంపి.. లక్షలాది మందిని ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లి పోయేలా చేసిన.. రష్యాను మరింత ఒంటరిగా చేసే ప్రయత్నాలపై G7 నాయకులు చర్చించారు. G7 సభ్య దేశాలైన బ్రిటన్, కెనడా, జపాన్, అమెరికాలు రష్యా బంగారం దిగుమతులను నిషేధించే చర్యలను ప్రకటించాయి. ఇక G7లో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ కూడా సభ్య దేశాలే. -
జీ-7: ఎట్టకేలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
బెర్లిన్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో(26-28 తేదీలు) జీ-7 దేశాల సదస్సు బవేరియన్ ఆల్ప్స్లో జరుగనుంది. ఈ సదస్సును జర్మనీ నిర్వహిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సందర్భంగా భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఈ జీ-7 సమావేశాలకు జర్మనీ.. ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం లేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఈ వార్తలను తోసిపుచ్చుతూ భారత్‌కు ఆహ్వానం పంపిస్తున్నట్టు జర్మనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే భారత్‌కు ఆహ్వానం అందనున్నట్టు పేర్కొంది. కాగా, యుద్ధం వేళ యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే సమయంలో జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో కూడా భారత్ సానుకూలంగా స్పందించింది. యుద్ధం జరుగుతున్న సయమంలోనే రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇండియాకు పలు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటన్నింటి కారణంగా ఈ ఏడాది భారత్‌కు ఆహ్వానం అందడం లేదనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అన్నింటికి చెక్ పెడుతూ జర్మనీ కీలక ప్రకటన చేసింది. అయితే, 2019 నుండి G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని వరుసగా ఆహ్వానించడం ఇది నాల్గవసారి. 2020 జూన్‌లో సమ్మిట్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా సదస్సు జరగలేదు. 2021లో యూకేలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో యూకేలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా సమ్మిట్‌లో పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు సెనిగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను ఇప్పటికే జర్మనీ ఆహ్వానించింది. -
తాలిబన్లతో సీఐఏ చీఫ్ రహస్య చర్చలు!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత అమెరికాలోని జో బైడెన్ సర్కార్, ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబన్ల మధ్య తొలిసారి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ తాలిబన్లతో రహస్య చర్చలు జరిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌తో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ మాట్లాడినట్లు మంగళవారం వెల్లడించింది. తాలిబన్లతో కీలక నేతలతో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి చర్చలుగా భావిస్తున్నారు. తాలిబాన్ నియంత్రణలో ఉన్నఅఫ్గాన్నుండి నుండి వేలాది మంది ప్రజలను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో సీఐఏ చీఫ్ బర్న్స్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా కాగా తాలిబన్ల కీలక నేతలు, కాబూల్‌లో అధికారం చేపట్టిన అగ్ర నాయకుల్లో బరాదర్ ఒకరు కావడం విశేషం. అయితే ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం స్పష్టత లేదు.మ రోవైపు ఈనివేదిలపై వ్యాఖ్యానించేందుకు సీఐఏ ప్రతినిధి నిరాకరించారు. చదవండి : Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! కాగా అఫ్గానిస్తాన్ కాబూల్ విమానాశ్రయంనుంచి సైనిక బలగాల తరలింపు, అమెరివాసుల తరలింపు ప్రక్రియను ఆగస్ట్ 31లోపు ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు అమెరికా, ఇతర మిత్రదేశాలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజల తరలింపుపై సమీక్షించేందుకు జీ 7 (బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాలు వర్చువల్ గా సమావేం కానున్నారు. చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
భోగం మీది, త్యాగం మాదా?
పేద దేశాల పట్ల ప్రకృతికే కాదు, అభివృద్ధి సమాజాలకూ జాలి ఉండదా? మానవ చేష్టల వల్ల పుట్టిన ‘వాతావరణ మార్పు’ దుష్ప్రభావాలు పేద దేశాలపై ఉన్నంతగా సంపన్న దేశాలపైన లేవు. ప్రకృతి వనరుల్ని అసాధారణ రీతిలో పిండుకొని ఎదిగిన ‘అభివృధ్ధి చరిత్ర’ కొన్ని సమాజాలది! పైగా వాతావరణ మార్పులకు కారణమౌతున్న నేటి కర్భన ఉద్గారాలు, ఇతరేతర కాలుష్యాలు, భూతాపోన్నతి వంటివి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల సృష్టే! అప్పుడు, ఇప్పుడు, తాజా ఆంక్షల వల్ల శీఘ్రప్రగతి కుంటుబడి రేపు.. బలవుతున్నది మాత్రం పేద దేశాలే! సదరు నష్టాన్ని పూడుస్తామని... ఎన్ని అంతర్జాతీయ సదస్సుల్లో వాగ్దానాలిచ్చి చివరకు ఒప్పంద రూపు సంతరింపజేసినా, ఆశించినట్టు అవి ఆచరణకు నోచుకోవు. పేద, మధ్య తరహా దేశాలు వాతావరణ మార్పు విపరిణామాల నుంచి, ప్రకృతి వైపరిత్యాల నుంచి బయటపడలేక... మరింత ప్రాణ, ఆస్తి నష్టాల్ని చవిచూస్తున్నాయి. అభివృద్ధి చెందిన సంపన్నదేశాలకు, అభివృద్ధి చెందని పేద దేశాలకు మధ్య అంతరాలను పూడ్చే సంగతెలా ఉన్నా... మానవ ప్రమేయం వల్ల కాలక్రమంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యల్లోనూ పురోగతి మిథ్య! పేద దేశాలను ఆదుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వెచ్చిస్తామని చెప్పిన ‘వాతావరణ ఆర్థిక సహాయం’ పుష్కర కాలం దాటినా ఇంకా ఓ రూపు సంతరించుకోకపోవడం శాపమే! ప్రపంచంలోని ఏడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జి–7 (అమెరికా, కెనెడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్) దేశాల సదస్సు, ఈ ‘సహాయం’పై మరోమారు చేసిన తాజా వాగ్దానమే ఇందుకు నిదర్శనం! యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కార్బిస్‌బే లో ఆదివారం ముగిసిన ఈ సదస్సు వేదిక నుంచి మరోమారు హామీ అయితే లభించిది కానీ, లిఖిత పత్రంలో స్పష్టత కొరవడింది. ఎవరెంత వెచ్చిస్తారో నిర్దిష్ట ఆర్థిక సహాయం, నగదు గురించిన వివరాలేమీ లేవు. అందుకే పర్యావరణ పోరాట సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఏటా వంద బిలియన్ డాలర్ల (రూ.7.32 లక్షల కోట్లు) వాతావరణ ఆర్థిక వనరుల్ని సమకూర్చే పాత హామీ నెరవేరుస్తామని, ఈ వారమే కార్యాచరణ ప్రారంభిస్తామని సదస్సు పేర్కొంది. ‘ఇది మా బాధ్యత’ అని ఆతిథ్య దేశం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ప్రపంచ కర్బన ఉద్గారాల్లో అయిదో వంతు (20%) జి–7 దేశాల పుణ్యమే! అని కూడా ఆయన అంగీకరించారు. ‘మా వంతు కేటాయింపులు పెంచుతాం, ఇతర అభివృద్ది చెందిన దేశాలనూ పెంచమని అడుగుతూ... ఉమ్మడిగా ఈ హామీ నెరవేర్చడానికి కృషి చేస్తాం’ అని సదస్సు పేర్కొంది. అతిథిగా పాల్గొన్న భారత్ కూడా, హామీ నిలబెట్టుకోవాలని జి–7 ను అంతకు ముందు కోరింది. కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల వల్ల భూతాపోన్నతి పెరిగి, ధృవాల మంచు కరిగి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. పలు దీవులు, సముద్ర తీరనగరాలు మునిగే ప్రమాదంతో పాటు ఇంకెన్నో ప్రకృతి అనర్థాలు ఈ వాతావరణ మార్పు వల్ల ముంచుకొస్తున్నాయి. ఉష్ణాగ్రత తదుపరి పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కే నియంత్రించడం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న లక్ష్యం. వాతావరణ మార్పు వల్ల పుట్టే విపత్తుల్ని తట్టుకునే సన్నద్దత, ఎదుర్కొనే సమర్ధత, మార్పులకు అనుగుణంగా జీవనాన్ని దిద్దుకునే సంసిద్ధత అవసరం! పెట్రోల్, బొగ్గు వంటి శిలాజ ఇంధన వినియోగాల్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పునర్వినియోగ, సుస్థిర ఇంధనాల్ని సమకూర్చుకోవాలి. ఈ క్రమంలో ప్రగతి మందగించినా పేద దేశాలు భరించాలి. అవసరమైన ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకోవాలి. అందుకు గాను అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు సహకారం అందించాలి. ఇదివరకే ప్రకృతిని పిండుకొని ఎదిగిన సమాజాలు కనుక, ‘అందరి కోసం అందరు, కొందరికి ప్రత్యేక బాధ్యత’ నినాదంతో కర్తవ్యాన్ని నెత్తినెత్తుకోవాలి. ఈ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లను ‘క్లైమెట్ ఫైనాన్స్’కి వెచ్చిస్తామని, ఐక్యరాజ్యసమితి 2009 (కొపన్హెగెన్)లో నిర్వహించిన సదస్సులో నిర్దిష్టంగా హామీ ఇచ్చాయి. 2020 నాటికి కేటాయింపులు మొదలు కావాలి. ఆర్థిక సహాయంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పేద దేశాలకు బదలాయించాలి. తర్వాత జరిగిన పలు సదస్సుల్లో ఈ హామీని నొక్కి చెప్పాయి. పారిస్ భాగస్వామ్య పక్షాల సదస్సు (2015)లోనూ ఈ అంశం సుదీర్ఘంగా చర్చించి, ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ మాత్రం లేదు. తాజా హామీ ప్రకారమూ 2025 నాటికి తొలి కేటాయింపులు జరుగొచ్చనేది ఆశ! సంపన్న దేశాల సహాయం లభించినా... మౌలికసదుపాయాలు కల్పించే ఏ పెట్టుబడిదారో, కాంట్రాక్టరో, రాబడి పలు రెట్లు పెంచుకుంటారు. పేదలకు దక్కేది పరోక్ష ప్రయోజనాలే! అసాధారణ ఎండకు వడదెబ్బ తగిలి ఓ నడివయస్కుడు శ్రీకాకుళంలో మరణిస్తాడు. అప్పుతెచ్చిన పెట్టుబడితో పండిన పంట వడగళ్ల వానకు నాశనమైతే మహబూబ్‌నగర్ రైతొకరు ఆత్మహత్య చేసుకుంటాడు. మూడేళ్ల వరుస కరువుకు బతుకు గడువక వలస కూలీగా ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిన అనంతపురం జిల్లా కదిరి పరిధి పల్లె గృహిణి, విధివక్రించి అక్కడ పడుపు వృత్తిలోకి జారి ఎయిడ్స్ సోకి మరణిస్తుంది.... ఇవన్నీ ‘వాతావరణ మార్పు’ మరణాలే! ఏ అభివృద్ధి చెందిన దేశపు ఆర్థిక సహాయం ఈ చావుల్ని ఆపుతుంది? సమాధానం లేని ప్రశ్నలే! -
చైనా దూకుడును అడ్డుకుందాం
కార్బిస్‌బే(ఇంగ్లండ్)/బీజింగ్: పేద దేశాలకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందజేయాలని గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) దేశాల అధినేతలు తీర్మానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత వేగంగా పరుగులు పెట్టడానికి సహకరించాలని నిర్ణయించారు. ప్రపంచ మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. జిన్జియాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్‌లో మానవ హక్కులను చైనా నాయకత్వం నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోందని మండిపడ్డారు. చైనా దూకుడును కచ్చితంగా అడ్డుకుందామంటూ తీర్మానం చేశారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. బాలికల విద్య, భవిష్యత్తులో మహమ్మారుల నివారణ, ‘మళ్లీ మెరుగైన ప్రపంచం నిర్మాణం’లో భాగంగా ఆఫ్రికాలో రైల్వేలు, ఆసియాలో విండ్ ఫామ్స్‌కు సాయం అందించడం, పునరుత్పా దక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం›వంటి వాటిపై తీర్మానాలు చేశారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చారు. -
‘జీ 7’కి భారత్ సహజ మిత్రదేశం
న్యూఢిల్లీ: గ్రూప్ 7(జీ 7) దేశాలకు భారత్ సహజ మిత్రదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిరంకుశవాదం, తప్పుడు సమాచారం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికపరమైన ఒత్తిడి.. తదితరాల నుంచి ఉద్భవించే సవాళ్ల నుంచి సభ్యదేశాల భాగస్వామ్య విలువలను రక్షించుకునే దిశగా భారత్ తన కృషిని కొనసాగిస్తుందన్నారు. ‘జీ 7’ సదస్సులో ‘ఓపెన్ సొసైటీస్ అండ్ ఓపెన్ ఎకానమీస్’ అంశంపై ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులకు భారత్ కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ, జామ్ (జన్‌ధన్–ఆధార్– మొబైల్ ఆనుసంధానం)లను ఉటంకిస్తూ సామాజిక సమ్మిళితం, సాధికారతను సాధించడంలో సాంకేతికతను భారత్ ఎలా విప్లవాత్మకంగా ఉపయోగించుకుందో వివరించారు. స్వేచ్ఛాయుత సమాజాల్లో అంతర్గతంగా దాగి ఉన్న ముప్పులపై హెచ్చరిస్తూ.. టెక్నాలజీ సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు తమ వినియోగదారులకు సురక్షిత సైబర్ వాతావరణాన్ని అందించాల్సి ఉందన్నారు. ప్రధాని ప్రసంగ వివరాలను విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పీ హరీశ్ మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ అభిప్రాయాలను కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు స్వాగతించారన్నారు. ‘స్చేచ్ఛాయుత, అంతర్జాతీయ నియమానుసార ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కృషి చేస్తామని ‘జీ 7’ నేతలు స్పష్టం చేశారు. ఇందుకు ఈ ప్రాంతంలోని మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామన్నారు’ అని హరీశ్ వివరించారు. కోవిడ్ టీకాలకు పేటెంట్ మినహాయింపు కోరుతూ భారత్, దక్షిణాఫ్రికాలు చేసిన ప్రతిపాదనకు జీ7 సదస్సులో విస్తృత మద్దతు లభించిందన్నారు. జీ 7 సభ్య దేశాలుగా యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. గ్రూప్ అధ్యక్ష స్థానంలో ఉన్న యూకే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా ఈ సదస్సుకు ఆహ్వానించింది. చిన్న కూటమి ప్రపంచాన్ని శాసించలేదు: చైనా చిన్న కూటమి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి లేదని చైనా స్పష్టం చేసింది. జీ7 శిఖరాగ్ర సదస్సుపై ఆదివారం స్పందించింది. కరోనా వైరస్ పుట్టుక, మానవ హక్కుల ఉల్లంఘన, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు వంటి విషయాల్లో తమ దేశాన్ని తప్పుపడుతూ జీ7 దేశాల అధినేతలు తీర్మానాలు చేయడాన్ని చైనా ఆక్షేపించింది. -
ముగిసిన జీ-7 దేశాల సదస్సు
బ్రిటన్: బ్రిటన్ వేదికగా 3 రోజులపాటు జరిగిన జీ-7 సదస్సు నేటితో ముగిసింది. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో సాయం చేయాలని సభ్య దేశాలు తీర్మానం చేశాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని సాంకేతికత సహాయంతో ఎదుర్కొంటామని ప్రకటించాయి. చైనాలో మానవ హక్కుల ఎక్కువ జరుగుతుండటంతో మానవ హక్కులను గౌరవించాలని చైనాకు జీ-7 సదస్సు వేదికగా పిలుపునిచ్చాయి. జీవవైవిధ్య నష్టాన్ని తగ్గించడానికి "నేచర్ కాంపాక్ట్" 2010కి సంబంధించి 2030 నాటికి కర్బన ఉద్గారాలను దాదాపు సగానికి తగ్గించడానికి కట్టుబడి కృషి చేస్తామని పేర్కొన్నాయి. "వీలైనంత త్వరగా" శక్తి కోసం స్వచ్ఛమైన బొగ్గును మాత్రమే ఉపయోగించేలా తప్పనిసరి చేయడం, పెట్రోల్, డీజిల్ కార్లను దశలవారీగా తొలగించడం వంటివి ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుత జీ-7 కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా రిపబ్లిక్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ను కూడా బ్రిటన్ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావ సారూప్యం కలిగిన దేశాలను కలిపి ఉంచే ప్రయత్నంలో భాగంగా వీటిని జీ-7 సదస్సుకు అతిథ్య దేశాలుగా ఆహ్వానించారు. ఈ జీ-7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఎలా..? -
చైనాను కట్టడి చేద్దాం: బైడెన్
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు చెక్ పెట్టాలని జీ7 నేతలకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కెనెడా, యూకే, ఫ్రాన్స్ నుంచి మద్దతు లభించింది. అయితే జర్మనీ, ఇటలీ, ఈయూలు బైడెన్ ప్రతిపాదన పట్ల అంతగా సుముఖత చూపలేదు. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాను వేలెత్తిచూపడంపై కూడా తక్షణ ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైడెన్ మాత్రం ఈ అంశాలపై జీ7 దేశాలు ఆదివారం సంయుక్త ప్రకటన చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చైనా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌కు పోటీగా బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ ద వరల్డ్ పేరిట అభివృద్ది చెందుతున్న దేశాల్లో మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని జీ7 దేశాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. చైనా పట్ల అమెరికా అవలంబిస్తున్న కఠినవైఖరిపై మిత్రదేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఎలాగైనా ఈ సదస్సు నుంచి చైనాకు సందేశం పంపాలని అమెరికా భావిస్తోంది. -
Narendra Modi: వన్ ఎర్త్.. వన్ హెల్త్!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడానికి ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్ ఎర్త్.. వన్ హెల్త్)’ అనే సమష్టి భావనతో ప్రపంచం ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ7 సదస్సులో ‘‘బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్’’ పేరిట నిర్వహించిన చర్చాగోష్టిలో శనివారం మోదీ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నివారించడానికి ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని, ప్రపంచస్థాయి నాయకత్వం, సంఘీభావం అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రజాస్వామ్య దేశాలు, పారదర్శక సమాజాలపై ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని ఉద్ఘాటించారు. వ్యాక్సిన్లపై తాత్కాలికంగా మేధో హక్కులను (పేటెంట్లను) రద్దు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్, దక్షిణాఫ్రికాలు ఉమ్మడిగా చేసిన ప్రతిపాదనకు మద్దతుగా నిలవాలని మోదీ జీ7 దేశాధినేతలను కోరారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో సమష్టి కృషికి భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్ ఎర్త్, వన్ హెల్త్) అనేది అందరి మంత్రం కావాలని, జీ7 సమావేశం ఈ సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. జీ7లో యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నాయి. మెర్కెల్ మద్దతు మోదీ అభిప్రాయానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి గట్టి మద్దతు లభించింది. ప్రధాని ప్రతిపాదించిన వన్ ఎర్త్ వన్ హెల్త్‌కు ఆమె అండగా నిలిచారు. ప్రధాని మోదీతో పలు అంశాలపై తాను జరిపిన చర్చలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గుర్తు చేసుకున్నారు. ఇండియా లాంటి భారీ వ్యాక్సిన్ ఉత్పత్తిదేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ముడిపదార్ధాలు సరఫరా చేయాలని ఫ్రాన్స్ అధినేత మాక్రాన్ సూచించారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు జీ7దేశాలు అందించిన సాయానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం సైతం జీ7 సదస్సులో ప్రధాని ఆన్లైన్ ద్వారా ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రధాని నేరుగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. -
Photo Feature: పెద్ద పైథాన్, ఇక్కడి నుంచి వెళ్లిపోండి!
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. అడవులు తరిగిపోతుండటంతో మూగ జీవాలు జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. మరోవైపు గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. అంగారక గ్రహంపై ఝురోంగ్ రోవర్ తీసిన ఫొటోలను తాజాగా చైనా విడుదల చేసింది. -
100 కోట్ల టీకా డోసులిద్దాం
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. కార్బిస్‌బే రిసార్టులో ఏర్పాటు వేదిక నుంచి యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రపంచదేశాల అధినేతలకు అభివాదం చేసి, సదస్సుకు శ్రీకారం చుట్టారు. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపునిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంపై కోవిడ్–19 వైరస్ దాడి మొదలయ్యాక ఇదే మొదటి జీ7 సదస్సు. యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ పాల్గొంటున్నాయి. మళ్లీ మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం (బిల్డింగ్ బ్యాక్ బెట్టర్ ఫ్రమ్ కోవిడ్–19) అన్న నినాదంతో జరుగుతున్న జీ7 సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా భాగస్వాములవుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. జీ7 సదస్సులో మొదటిరోజు దేశాల అధినేతలు ఉల్లాసంగా కనిపించారు. ప్రధానంగా కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందజేయాలని, మహమ్మారి వల్ల నష్టపోయిన దేశాలకు చేయూతనందించాలని ఈ సంపన్న దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. 10 కోట్ల డోసులిస్తాం: బోరిస్ జాన్సన్ తమ వద్ద అవసరానికి మించి ఉన్న 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఏడాదిలోగా ప్రపంచ దేశాలకు ఉదారంగా అందజేస్తామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జీ7 సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన.. కరోనా మహమ్మారిని అంతం చేసే యజ్ఞంలో పాలు పంచుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 10 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు ఇస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆక్స్ఫర్డ్ వర్సిటీ–ఆస్ట్రాజెనెకాకు నిధులు సమకూర్చామని గుర్తుచేశారు. లాభార్జనను పక్కనపెట్టామని, తమ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు ఇప్పటిదాకా 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందాయని వెల్లడించారు. జీ7 సదస్సులో పాల్గొంటున్న దేశాల అధినేతలు సైతం ఇలాంటి దాతృత్వాన్నే ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. 50 కోట్ల టీకా డోసులు అందజేస్తాం సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు 50 కోట్ల కోవిడ్ టీకా డోసులు అందజేస్తామని ప్రకటించారు. బహుళ జాతి కార్పొరేట్ సంస్థలపై కనీసం 15 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదన జీ7 సదస్సులో చర్చకు వచ్చింది. ఈ మేరకు దీనిపై ఆయా దేశాల ఆర్థిక మంత్రుల మధ్య వారం క్రితం ఒక ఒప్పందం కుదిరింది. కాలుష్యం, వాతావరణ మార్పుల అంశం కూడా జీ7 సదస్సు అజెండాలో ఉంది. కాగా, సదస్సు జరుగుతున్న కార్బిస్‌బే రిసార్టు ఎదుట వందలాది మంది వాతావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు గుమికూడారు. వాతావరణ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.సెయింట్ ఇవీస్లో జరిగిన ర్యాలీలో 500 మంది పాల్గొన్నారు. నిరసనకారులు ఆకుపచ్చ, నీలి రంగు దుస్తులు ధరించారు. హామీలతో తుంగలో తొక్కుతున్న జీ7, మాటలే తప్ప చేతల్లేవ్ అని రాసి ఉన్న జెండాలను ప్రదర్శించారు. -
G7 Summit: ఉపేక్షించలేని శక్తిగా భారత్
స్వాతంత్య్రానంతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాశ్చాత్య ప్రపంచంతో భారత్ ఇప్పుడు చాలా సరళమైన సంబంధాలను నెరుపుతోంది. ఇప్పుడు భారత విదేశాంగ విధానం కనీవినీ ఎరుగని క్రియాశీలతతో వ్యవహరిస్తుండటం విశేషం. ఒక బలమైన దేశంగా భారత్ పురోగమన గాథకు ఇది అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సుకు భారత్ హాజరుకావడం అనేది దేశ వారసత్వ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా భారత్‌ను ఇక ఎవ్వరూ తక్కువ చేసి చూడలేరని ఈ సదస్సులో భారత్ భాగస్వామ్యం తేల్చి చెబుతోంది. శుక్రవారం బ్రిటన్‌లో ప్రారంభమైన జీ–7 దేశాల కూటమి సదస్సు ప్రపంచానికి కొత్త ఆశల్ని కల్పిస్తోంది. గత ఏడాది, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ–7 దేశాల కూటమిని కాలం చెల్లిన బృందంగా తోసిపుచ్చారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలతో కూడిన జీ–7 కూటమి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సరిగా ప్రాతినిధ్యం వహించనందున అదొక కాలం చెల్లిన గ్రూప్‌గా ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఈ సంవత్సరం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన దౌత్య విస్తరణకు ప్రారంభ వేదికగా జీ–7 దేశాల కూటమిని ఉపయోగించుకుని ప్రపంచ రాజకీయాలపై తనదైన ముద్రను వేయడానికి ప్రయత్నించండం మరొక భిన్నమైన కథ అనుకోండి. అమెరికా తిరిగి ముందుపీఠికి వస్తోందనీ, మన భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన అంశాలు, కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా ముందుకొస్తున్నాయని పేర్కొనడం ద్వారా బైడెన్ తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజ యవంతంగా ముగించాలని భావిస్తున్నారు. బ్రిటన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గతంలో ట్రంప్ కల్లోల పాలన, బ్రెగ్జిట్ సర్దుబాటు అనంతరం ఇరుదేశాల సంబంధాలను పునరుజ్జీవింప చేసే లక్ష్యంతో ముందుకు సాగవచ్చు. తమ రెండు దేశాల ప్రత్యేక బాంధవ్యం భావనను మరోసారి ముందుకు తీసుకురావడం ద్వారా అట్లాం టిక్ ఒడంబడిక తాజా వెర్షన్‌పై జో, బోరిస్ సంతకం చేశారు. అంతే కాకుండా, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, సామూహిక భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, న్యాయబద్ధమైన, నిలకడైన ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నిర్మించడానికి తగు చర్చలు తీసుకుంటామని ఇరు దేశాల నేతలు ప్రతిజ్ఞ చేశారు. అయితే ఐరిష్ సముద్రం పొడవునా సాగుతున్న వాణిజ్యంపై ఇరుదేశాల మధ్య స్వల్ప భేదాలు ఉంటున్నాయి. గుడ్‌ఫ్రైడే ఒడంబడిక ద్వారా ఇరుదేశాలూ రూపొందించుకున్న స్థిరత్వాన్ని దెబ్బతీసేలా నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్‌ను వాషింగ్టన్ ఉల్లంఘిస్తుండటంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయి. తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో బైడెన్ ముఖ్యమైన ఎజెండాలను పెట్టుకున్నారు. విండ్సార్ కాజిల్‌లో బ్రిటన్ రాణితో సమావేశం, జీ–7 దేశాల సమావేశానికి హాజరవడం, అమెరికా అధ్యక్షుడిగా తొలి నాటో సదస్సులో పాల్గొనడం, తర్వాత జెనీవాలో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావడం.. ఇలా బైడెన్ విదేశీ పర్యటన తీరిక లేని కార్యక్రమాలతో సాగనుంది. చివరిదైన పుతిన్‌తో సమావేశం అత్యంత స్పర్థాత్మకం కావచ్చు కాబట్టే యావత్ ప్రపంచం వీరిరువురి భేటీ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. బ్రిటన్ అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైన జీ–7 దేశాల సదస్సు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించింది. భవిష్యత్తులో మహమ్మారులపై పోరాటానికి ముందే సన్నద్ధమవుతూ, ప్రస్తుత కరోనా వైరస్ ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని బయటపడేయడం; స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యానికి తలుపులు తెరవడం ద్వారా భవిష్య సమాజ సౌభాగ్యానికి ప్రోత్సాహమివ్వడం; పర్యావరణ మార్పును ఎదుర్కొని, భూగ్రహం జీవవైవిధ్యతను పరిరక్షించడం; స్వేచ్చాయుత సమాజాలు, వాటి ఉమ్మడి విలువలను ఎత్తిపట్టడం వీటిలో కొన్ని. వీటిలో కోవిడ్–19 మహమ్మారి నుంచి బయటపడటమే కీలకం. ఇదే ఇప్పుడు యావత్ ప్రపంచానికి కేంద్ర బిందువు. బ్రిటన్‌లో ప్రస్తుత జీ–7 దేశాల సదస్సు మహమ్మారిని ఎదుర్కోవడంపై నూతన ప్రపంచ ఒడంబడికను రూపొందిస్తుందని, తద్వారా మన ప్రపంచం ఇక ఎన్నడూ ఇలాంటి మహమ్మారుల బారిన పడకుండా బయటపడు తుందని బోరిస్ జాన్సన్ దృఢనమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో, యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ నిరోధక వ్యాక్సినేషన్ విషయంలో ఘనమైన అంతర్జాతీయ సమన్వయానికి జీ–7 దేశాల కూటమి పిలుపునిస్తుందని భావిస్తున్నారు. కోవిడ్–19పై పోరుకోసం యావత్ ప్రపంచానికి టీకాలు అందించడమే అమెరికా ప్రాధాన్యతల్లో ఒకటిగా పేర్కొన్న బైడెన్ యంత్రాంగం, ప్రపంచంలోని 90 నిరుపేద దేశాలకు తన వంతుగా వ్యాక్సిన్ డోస్‌లను విరాళంగా అందిస్తానని ఇప్పటికే ప్రకటించింది. ఇది ఎంతగానో స్వాగతించవలసిన అంశం కానీ వచ్చే ఏడాది ప్రారంభానికి అంతర్జాతీ యంగా 180 కోట్ల కరోనా టీకాలను అందించడంలో ఇతర ప్రపంచ శక్తులు కూడా తమవంతుగా గరిష్ట సహాయం ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా జీ–7 దేశాల కూటమి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కలయికగా ఉంటున్నందున ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, నిలకడతో కూడిన అభివృద్ధి వంటి ఉమ్మడి విలువల పరిరక్షణకోసం కట్టుబడి ఉంటున్నాయి. అగ్రదేశాలమధ్య భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జీ–7 దేశాల కూటమి ఉద్దేశాన్ని పునర్నిర్వచించడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుత జీ–7 కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా రిపబ్లిక్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ను కూడా బ్రిటన్ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావ సారూప్యం కలిగిన దేశాలను కలిపి ఉంచే ప్రయత్నంలో భాగంగా వీటిని జీ–7 సదస్సుకు అతిథ్య దేశాలుగా ఆహ్వానించారు. ఇది ప్రపంచ పరిపాలనను మరింత సమర్థతతో నిర్వహించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. చైనా ద్వారా ఎదురవుతున్న భౌగోళిక రాజ కీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ప్రభావాన్ని మరింతగా విస్తరించుకోవలసిన అవసరం ఉందని పారి శ్రామిక సంపన్న దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ మొత్తం క్రమంలో భారత్ ఒక కీలకమైన భాగస్వామిగా ఆవిర్భవించింది. 2014 నుంచి జీ–7 దేశాల సదస్సులో పాలుపంచుకోవడం ప్రధాని నరేంద్రమోదీకి ఇది రెండోసారి. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ సైతం మోదీని ఆహ్వానించాలనుకున్నారు కానీ అమెరికాలో మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు. ఈ ఏడాది మోదీ నేరుగా ఈ సదస్సుకు హాజరు కావలసినప్పటికీ, భారత్‌లో మహమ్మారి తీవ్రత దృష్ట్యా సదస్సు సమావేశాల్లో ఈయన వర్చువల్‌గా మాత్రమే పాలుపంచుకోవలసి ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా జీ–7 దేశాలతో భారత్ నిలకడైన సంబంధాలను సాగిస్తున్నందువల్ల, పశ్చిమదేశాలతో భారత్ బాంధవ్యం మరొక మెట్టు పైకి ఎదగనుంది. అంతర్జాతీయ పాలనలో తన వంతు పాత్రను పోషించాలని, తన సమర్థతలను మరింతగా విస్తరించాలని భారత్ ఆశిస్తున్నందున పారిశ్రామిక సంపన్న దేశాలతో బలమైన భాగస్వామ్యాలకోసం ప్రయత్నిస్తోంది. స్వాతంత్య్ర భారత చరిత్రలో మునుపెన్నడూ లేనివిదంగా పాశ్చాత్య ప్రపంచంతో భారత్ ఇప్పుడు చాలా సరళమైన సంబంధాలను నెరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ భాగస్వాములతో కలిసి పనిచేయడం నుంచి, పాశ్చాత్యదేశాలతో మంచి సబంధాలను ఏర్పర్చుకోవడం వరకు ఇప్పుడు భారత విదేశాంగ విధానం కనీవినీ ఎరుగని క్రియాశీలతతో వ్యవహరిస్తుండటం విశేషం. భారత్ దేశీయంగా ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఉత్తాన పతనాలను చవిచూస్తున్నప్పటికీ ఒక బలమైన దేశంగా భారత్ పురోగమన గాథకు ఇది అద్దం పడుతోంది. తక్కిన ప్రపంచంలో భారత్ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నందున ప్రపంచం కూడా భారత్‌తో మంచి సంబంధాలను ఏర్పర్చుకోగలుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సుకు భారత్ హాజరుకావడం అనేది దేశ వారసత్వ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా భారత్‌ను ఇక ఎవ్వరూ కించపర్చలేరని, తక్కువ చేసి చూడలేరని ఈ సదస్సులో భారత్ భాగస్వామ్యం తేల్చి చెబుతోంది. హర్ష్ వి. పంత్ వ్యాసకర్త ప్రొఫెసర్, డైరెక్టర్, అబ్జర్వేషన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఢిల్లీ -
Corona Vaccination:జో బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్ వ్యాకిన్ డోసులను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యానని, బైడెన్ నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని వైట్‌హౌజ్ ఉటంకించినట్లు అమెరికాలోని ప్రముఖ వెబ్‌సైట్స్ ఒక కథనం ప్రచురించాయి. కాగా, ఫైజర్ బయోఎన్‌టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ 500 మిలియన్ల డోసులు కొనుగోలు చేయాలని బైడెన్ పాలనా విభాగం ప్రణాళిక వేసింది. వీటిని వంద పేద దేశాలకు వీటిని పంచబోతోంది. ఈ ఏడాది చివరికల్లా 200 మిలియన్ డోసులు, మిగిలిన 300 మిలియన్ డోసులు వచ్చే ఏడాది కల్లా అందించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భారీ సాయంపై పోయిన నెలలోనే బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ‘‘కరోనాను అంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో నలుమూలలా. వ్యాక్సిన్ డోసుల డొనేషన్లో మీరు పాల్గొనండి. ముందుకు రండి’’ అని ప్రపంచదేశాలను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ పేర్కొంది. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, అమెరికా ఇదివరకే 300 మిలియన్ల ఫైజర్ డోసుల కోసం ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు సాయం ప్రకటన నేపథ్యంలో అదనంగా 500 మిలియన్ల డోసుల కొనుగోలు కోసం మరో ఒప్పందం చేసుకుంది. యూఎస్, యూకేలో 42 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికాగా, ఆఫ్రికాదేశాల్లో ఒక్క శాతం కంటే తక్కువ జనాభాకు వ్యాకినేషన్ జరిగింది. దీంతో ముందుగా ఆఫ్రికన్ దేశాలకే అందించాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్ ద్వారా 75 శాతం డోసుల్ని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది. ఇక ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్‌వో భావిస్తుండగా.. బైడెన్ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే. జీ7 సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ఏకైక పరిష్కారమిదే -
గడ్డు స్థితిలో జీ–7 అడుగులు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఏటికి ఎదురీదుతున్న వర్తమానంలో అందరూ కొత్త అవకాశాల కోసం, సరికొత్త సాన్నిహిత్యాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని నెలల్లో జరగబోయే జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు రావాల్సిందిగా మన దేశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. కరోనా వైరస్ విరుచుకుపడిన తర్వాత సంపన్న రాజ్యాలు కూడా సమస్యల్లో చిక్కుకున్నాయి. అన్ని దేశాలూ ఈ ఏడాది తెరిపినపడే అవకాశం వున్నదని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. అలాగని కరోనా ముందున్నప్పటి స్థితి ఇప్పట్లో అసాధ్యమని కూడా వివరించింది. అందుకు సుదీర్ఘకాలం పడుతుంది. నిర్దిష్టంగా దాన్ని అంచనా వేయటం కుదర దని ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 5.2 శాతం వృద్ధి నమోదవు కావొచ్చన్నది ఒక అంచనా. ఆ వృద్ధిలో ఎవరికి వారు తాము కూడా భాగస్వాములం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే బోరిస్ జాన్సన్ జీ–7 శిఖరాగ్ర సదస్సు కోసం ఉత్సాహపడుతున్నారు. సదస్సులో ఆయనే అధ్యక్షుడవుతారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ ఇటీవలే తప్పుకుంది. ఈ ఒంటరి ప్రస్థానం నేపథ్యంలో అంతర్జాతీయంగా చురుకైన పాత్ర నిర్వహించాలని, సాధ్యమైనంత త్వరగా స్వీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఆ దేశం ఆత్రంగా వుంది. జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో నేరుగా దేశాధినేతలు పాల్గొని రెండేళ్లవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి బెడద లేకపోతే నిరుడు అమెరికాలో అధినేతలంతా కలిసేవారే. 2019లో ఫ్రాన్స్‌లో జరిగిన సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో బ్రిటన్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు భాగస్వాములు కాగా... దక్షిణ కొరియా, ఆస్ట్రే లియాతోపాటు మనల్ని కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పిలవాలని అటు అమెరికా, ఇటు బ్రిటన్ నిరుడు నిర్ణయించాయి. 45 ఏళ్లనాటి ఈ సంస్థలో సోవియెట్ యూనియన్ పతనానంతరం రష్యాకు కూడా సభ్యత్వం లభించింది. అయితే 2013లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్నాక ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యాలు సంస్థ నుంచి దాన్ని బహిష్కరించాయి. 2019నాటి సదస్సులో ఆ దేశాన్ని మళ్లీ జీ–7లో చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన వాదనను ఇతర దేశాలు ససేమిరా అంగీకరించలేదు. యూరప్ దేశాలకు ముప్పు కలిగిం చేలా వ్యవహరిస్తున్న రష్యా పోకడలు మారకుండా ఎలా చేర్చుకుంటామని అందరికందరూ ఎదురు తిరిగారు. దాంతో ట్రంప్ ఏకాకయ్యారు. వాస్తవానికి అమెరికాలో సదస్సు నిర్వహించి, ఆ సంస్థ సారథ్యాన్ని స్వీకరించి ఎలాగైనా రష్యాకు చోటీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా సదస్సు నిర్వహణ అసాధ్యమైంది. ఇప్పుడు జీ–7 ముందు చాలా సమస్యలే వున్నాయి. వర్థమాన దేశాలు చెల్లించాల్సిన రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేయటం అందులో ఒకటి. సమీప భవిష్యత్తులో ఏ దేశమూ తీసుకున్న అప్పును చెల్లించే స్థితిలో లేదు. పైగా కోలుకోవటం కోసం వాటికి కొత్తగా భారీ రుణాలు అవసరమవుతాయి. ఆదాయాలు దారుణంగా పడిపోయి, వ్యయం అపారంగా పెరిగిన వర్తమానంలో అన్ని దేశాలూ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నాయి. మొన్న డిసెంబర్ మధ్యకు ప్రపంచ దేశాల రుణం 20 లక్షల కోట్ల డాలర్లుంది. ఇది వున్నకొద్దీ మరింతగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్లు ఇవ్వటం మొదలుకాగా, మరోపక్క అది కొత్త రూపంతో కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా తర్వాత విమాన రాకపోకల్ని నిలిపేసిన అనేక దేశాలు ఇప్పుడిప్పుడే వాటిని పునరుద్ధరిస్తుండగా తాజాగా పుట్టుకొ చ్చిన వైరస్ కారణంగా మళ్లీ వెనకడుగేస్తున్నాయి. నిషేధాలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా మారి, ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు ముమ్మరంగా పెరిగితే తప్ప ఆర్థిక వ్యవస్థలు గాడినపడటం సాధ్యంకాదు. ఇదిగాక రష్యాకు సభ్యత్వమిచ్చే సమస్య సరేసరి. సదస్సు నాటికి ఎటూ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వస్తారు గనుక ఆ విషయంలో ఆ దేశం వైఖరి మారుతుంది. జీ–7 దేశాల మధ్య ఆర్థిక రంగంతోపాటు పర్యావరణం, ఆరోగ్యం, వాణిజ్యం, సాంకే తికాభివృద్ధి వగైరా రంగాల్లో సైతం దృఢమైన సహకారం ఏర్పడాలని బోరిస్ జాన్సన్ ప్రతిపాది స్తున్నారు. సభ్య దేశాలతోపాటు సదస్సులో పాల్గొనే మూడు దేశాలనూ కలుపుకొంటే ప్రజాస్వామ్య దేశాల్లోని 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుందని, దీన్ని మరింత మెరుగ్గా వినియో గించుకుంటే అందరూ ఎదగటానికి అవకాశం వుంటుందని బ్రిటన్ విశ్వసిస్తోంది. సంక్షోభంలోనే జీ–7 పుట్టింది. 1975లో ఒపెక్ దేశాల నిర్ణయం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం నుంచి గట్టెక్కటానికి అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు దీన్ని స్థాపించాయి. అన్ని రంగా ల్లోనూ కలిసి కదలాలని, ప్రపంచ దేశాలన్నిటినీ కలుపుకొని తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించాలని భావించాయి. దాంతో పోలిస్తే ఈనాటి సంక్షోభం అనేక రెట్లు పెద్దది. ఒక అంచనా ప్రకారం కరోనా తర్వాత ఉపాధి కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికోట్ల మంది తీవ్ర దారిద్య్రంలో కూరుకు పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు సైతం తీవ్ర నష్టాలను చవిచూశాయి. జీ–7 దేశాల్లోనే తీసుకుంటే ఒక్క జర్మనీ మినహా అన్నిచోట్లా నిరుద్యోగం ఉగ్రరూపం దాల్చింది. ప్రజల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఈ గడ్డు పరిస్థితుల్లో భారీ మొత్తంలో నిధులు పారించి, ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే తప్ప కోలుకోవటం అసాధ్యం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దాదాపు సున్నా శాతానికి తీసుకొచ్చింది. దాన్ని ఇప్పట్లో పెంచబోమని చెబుతోంది. అటు యూరొపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా భిన్న మార్గాల్లో భారీగా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇవన్నీ శిఖ రాగ్ర సదస్సునాటికి సత్ఫలితాలిస్తే సంపన్న దేశాలు ఉత్సాహంగా అడుగులేయటం ఖాయం. -
మోదీజీ.. ‘జీ–7’కు రండి
లండన్: ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం వెల్లడించారు. బ్రిటన్ అధ్యక్షతన ఈ ఏడాది జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న అభివృద్ధి చెందిన దేశాల సమావేశాలకు తీర ప్రాంతమైన కార్న్‌వాల్ వేదికగా మారనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లను ఆతిథ్య హోదాలో ఆహ్వానిం చామన్నారు. గత ఏడాది భారత ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సంభాషణ సమయంలోనే ఈ విషయం తెలిపానన్నారు. జనవరి 26వ తేదీన భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉండగా దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ఆ పర్యటన రద్దయిందని ఆయన చెప్పారు. త్వరలోనే, జీ–7 భేటీలకు ముందే భారత్ సందర్శించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. జూన్‌లో జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60% ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారని బోరిస్ జాన్సన్ తెలిపారు. తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుందన్నారు. జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్)బృందంలో ప్రపంచంలో పలుకుబడి కలిగిన అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి. ఈ ఏడాది ఈ దేశాల మధ్య కోవిడ్ మహమ్మారిపైనే ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్లకు ముఖాముఖి జరగనున్న ఈ భేటీకి ముందుగా బ్రిటన్ వర్చువల్‌గా, నేరుగా వివిధ దేశాలతో మంత్రుల స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపనుంది. యూకే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ప్రపంచ ఔషధాగారం భారత్ ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 50% వరకు సరఫరాచేసిన భారత్ ప్రపంచ ఔషధాగారంగా మారిందని యూకే విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి విషయంలో యూకే, భారత్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చిన పీ–5 దేశాల్లో యూకే మొట్టమొదటిదని పేర్కొంది. 2005లో భారత్‌ను జీ–7 సమ్మిట్‌కు యూకే మొదటగా ఆహ్వానం పంపింది. త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుందంది. -
జీ7 సదస్సుకు జపాన్ అధ్యక్షత, కారణం!
టోక్యో: జీ-7 సదస్సుకు జపాన్ అధ్యక్షత వహిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి షింజోఅబే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైనా నూతన భద్రత చట్టానికి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో జీ-7 సదస్సును తమ దేశంలో జరపాలని భావిస్తున్నట్లు షింజో అబే తెలిపారు. హాంక్‌కాంగ్‌కు సంబంధించిన ఒకదేశం, రెండు విధానాలను కాపాడటానికి జీ-7కు చెందిన ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. చైనా జాతీయ గీతాన్ని ఆ గౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ హాంకాంగ్ పార్లమెంట్ బిల్లు పాస్ చేయడంతో నిరసనలు తారస్థాయిని చేరుకున్నాయి. గత ఏడాది నుంచి చైనా అధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక దేశం రెండు విధానాల విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం వల్లే ఈ అల్లర్లు జరుగుతన్నాయని చైనా వాదిస్తోంది. (చైనా వ్యతిరేక నినాదాలు.. 53 మంది అరెస్టు) -
సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ సంభాషణ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండో-చైనా వివాదం తదితర సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అటు మిత్రుడు ట్రంప్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయనీ, కోవిడ్-19, జీ7 సహా వివిధ అంశాలపై చర్చించామని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం మోహరింపు, ఉద్రిక్తతల నడుమ వీరి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తూర్పు లదాఖ్ ప్రతిష్టంభనపై ఇరువురు నాయకులు చర్చపై ప్రత్యేక వివరణ లేకవడం గమనార్హం. ఇరు దేశాలలో కరోనా పరిస్థితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణల అవసరం లాంటి సమస్యలపై ఇరువురు చర్చించారని ప్రభుత్వ ప్రకటన వివరించింది. జార్జ్ హత్యోందంతపై అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాందోళనలపై మోదీ ఆందోళన వ్య క్తం చేశారని, సమస్య త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారనీ, అలాగే అమెరికాలో జరిగే జీ7 సదస్సుకు మోదీని ట్రంప్ ఆహ్వానించినట్లు పేర్కొంది. ప్రస్తుత సభ్యత్వానికి మించి దీని పరిధిని విస్తరించాలని, భారతదేశంతో సహా ఇతర ముఖ్యమైన దేశాలను చేర్చాలని కోరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. (మోదీపై విశ్వాసం: టాప్-5లో సీఎం జగన్) కాగా చైనా-భారత్ సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిధ్దమని, దీనిపై మోదీకి ఫోన్ చేస్తే ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ గత వారం ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్, మోదీ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. మరోవైపు ఈ సమస్యను సామరస్యపూరకంగా పరిష్కరించుకుంటామని భారత్, చైనా ప్రకటించాయి. అంతేకాదు చైనా మరో అడుగు ముందుకేసి ఈ విషయంలో ట్రంప్ జోక్యం అవసరం లేదని తెగేసి చెప్పింది. అటు కరోనా వ్యాప్తిపైమొదటినుంచీ చైనా మండిపడుతున్న ట్రంప్, డబ్ల్యూహెచ్ఓపై సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం సంబంధాలను తెంచుకున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. (డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్) Had a warm and productive conversation with my friend President @realDonaldTrump. We discussed his plans for the US Presidency of G-7, the COVID-19 pandemic, and many other issues. — Narendra Modi (@narendramodi) June 2, 2020 -
మోదీకి ఆహ్వానం పలికిన ట్రంప్
న్యూఢిల్లీ : జీ-7 సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. మంగళారం ట్రంప్‌తో మోదీ ఫోన్లో సంభాషించినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా అమెరికాలో జరిగే తదుపరి జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా మోదీని ట్రంప్ కోరారని తెలిపింది. అలాగే ఇరు దేశాల్లో కరోనా పరిస్థితి, ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, జీ-7 కూటమి, భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులతోపాటుగా పలు అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టుగా పేర్కొంది. కాగా, ఇటీవల జీ-7 కూటమిని విస్తరించాలని ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. భారత్ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ–10 లేదంటే జీ–11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ–7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. -
జీ–7 కూటమిని జీ–10 చేయాలి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ–7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ–10 లేదంటే జీ–11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు. శనివారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వెళుతూ ట్రంప్ విలేకరులతో ముచ్చటించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ–7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ తరుణంలో అమెరికాలో ఈ సదస్సును ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదొక కాలం చెల్లిన కూటమి ప్రపంచంలో ఏడు అభివృద్ధి చెందిన దేశాలతో జీ–7 కూటమి ఏర్పడింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో ఏర్పాటైన ఈ కూటమి ప్రతీ ఏడాది సమావేశమై అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరుపుతుంది. అయితే ఈ కూటమిని విస్తరించి ఇందులోకి ఆస్ట్రేలియా, భారత్, దక్షిణ కొరియాలను ఆహ్వానించాలని, రష్యాని కూడా తిరిగి కూటమి గూటిలోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ‘‘ప్రపంచంలో ఏం జరుగుతోందో చర్చించడానికి ఇప్పుడు సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సరైనది కాదు. ఈ కూటమికి కాలం చెల్లిపోయింది. కొత్త దేశాలను కలుపుకొనిపోవాల్సిన అవసరం ఉంది’’ అని ట్రంప్ అన్నారు. మళ్లీ మోదీకి ఆహ్వానం జీ–7 దేశాల వార్షిక సమావేశానికి ఈసారి అమెరికా అ«ధ్యక్షత వహిస్తోంది. గత ఏడాది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు అధ్యక్షుడు మేక్రాన్ మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ ఏడాది జరిగే సదస్సుకి ట్రంప్ మోదీని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాభవం పెరుగుతోందని అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. -
జీ7లో భారత్‌ను చేర్చాలి : ట్రంప్
ఫ్లోరిడా : ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సమూహాం (జీ7 సమ్మిట్) కు భారత్, మరికొన్ని దేశాలను చేర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. జూన్12న వైట్ హౌస్‌లో నిర్వహించనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేగాక జీ7ను కాలం చెల్లిన గ్రూప్‌గా ట్రంప్ అభివర్ణించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డిసికి వెళుతున్న సమయంలో తనతో పాటు ఉన్న విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ' సెప్టెంబర్ వరకు జీ7ను వాయిదా వేస్తున్నాం. జీ7 వల్ల ప్రపంచంలో ఏమి ఉపయోగం ఉందని నేను భావించడం లేదు. ఇది కాలం చెల్లిన సమూహం. రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారతదేశాలను ఆహ్వానించాలని యోచిస్తున్నాం. జీ7ను విస్తరించే వరకు సమావేశాలు వాయిదా వేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు. (స్పేస్ ఎక్స్.. నింగిలోకి వ్యోమగాములు) చైనాను భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలో మాట్లాడటానికి ఈ గ్రూప్ ఏ విధంగా ఉపయోగపడుతుందనేది దేశ సాంప్రదాయ మిత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని వైట్ హౌస్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిస్సా అలెగ్జాండ్రా ఫరా అన్నారు. అప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి గతి మారితే తప్ప శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం శనివారం తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, యూకే, కెనడాలు జి. ఈ దేశాల అధిపతులు అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సమస్యలపై ఏటా సమావేశమవుతారు. శిఖరాగ్ర సమావేశంలోజీ7 అధ్యక్షుడు సాధారణంగా ఒకటి లేదా రెండు దేశాల దేశాధినేతలను ప్రత్యేక ఆహ్వానికంగా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానిస్తారు ఈ ఏడాది జీ7 అధ్యక్ష భాద్యతను అమెరికా జూన్ 12న నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. (డబ్ల్యూహెచ్ఓతో అమెరికా కటీఫ్) -
వెనక్కి తగ్గిన ట్రంప్!
వెనకా ముందూ చూడకుండా తోచినట్టు మాట్లాడటం...ఆ తర్వాత సర్దుకోవడం అలవాటైపోయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంలో ఎట్టకేలకు వెనక్కి తగ్గారని తాజాగా ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లోని బియరిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలుస్తున్నప్పుడు కశ్మీర్ విషయంలో ట్రంప్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని భావించినవారిని ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచి ఉంటాయి. పైగా నేతలిద్దరి చర్చల్లో అసలు కశ్మీర్ అంశం ప్రస్తావనకే రాలేదని మన విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెబుతున్నారు. ఈ నెల 5న 370 అధికరణను రద్దు చేస్తూ, జమ్మూ–కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక, అంతకుముందూ కూడా భారత్–పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమేనని ట్రంప్ ఒకటికి రెండుసార్లు చెప్పారు. ఆయన అలా చెప్పిన ప్రతిసారీ మన దేశం దాన్ని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో నేరుగా ఇద్దరు అధినేతలూ కలిసినప్పుడు ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. కానీ ఇద్దరూ 40 నిమిషాలు చర్చించుకున్న తర్వాత సంయుక్తంగా జరిపిన మీడియా సమావేశం దృశ్యాలు వీక్షించాక అంతా సవ్యంగా గడిచిందన్న భావన కలిగింది. కశ్మీర్, ఇతర ద్వైపాక్షిక అంశాలను తామూ, పాకిస్తాన్ పరిష్కరించుకుంటామని ట్రంప్ సమక్షంలో మోదీ చెప్పగా, రెండు దేశాలూ తమంతట తామే ఈ సమస్యను పరిష్కరించుకుంటాయన్న విశ్వాసం ఉందని ట్రంప్ ముక్తాయించారు. కశ్మీర్ విషయంలో తాను ట్రంప్‌ను బాగానే ఒప్పించగలిగానన్న విశ్వాసంతో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బహుశా ఈ పరిణామంతో నీరసించి ఉంటారు. వాస్తవానికి ఈ నేతలిద్దరి సమావేశాన్ని ప్రభావితం చేయడానికి కావొచ్చు...పాక్ ప్రజలనుద్దేశించి ఇమ్రాన్ అదేరోజు మాట్లాడారు. కశ్మీర్ కోసం ఎంతదూరమైనా వెళ్తామని, అణుయుద్ధానికైనా సిద్ధమేనని బెదిరింపులకు దిగారు. జపాన్ లోని ఒసాకాలో జూన్ నెలాఖరులో జరిగిన జీ–20 దేశాల శిఖరాగ్ర సదస్సు తర్వాత ట్రంప్ ఏమన్నారో గుర్తుంచుకుంటే కశ్మీర్‌పై అమెరికా నుంచి ఎన్ని రకాల స్వరాలు వినబడ్డాయో అర్ధమవుతుంది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిగా ఉండమని ఆ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కలిసినప్పుడు మోదీ తనను కోరారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. వెనువెంటనే మన దేశం దాన్ని ఖండించింది. అటు అమెరికా ప్రతినిధి జోక్యం చేసుకుని వివాదం మరింత ముదరకుండా సర్ది చెప్పారు. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. ఆ తదుపరి సైతం ట్రంప్ మధ్యవర్తిత్వం ఉబలాటాన్ని వదలకుండా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంతక్రితం మాట్లాడినదానికి భిన్నంగా ఇప్పుడు బియారిట్జ్‌లో ‘రెండు దేశాలూ సొంతంగానే పరి ష్కరించుకుంటాయన్న విశ్వాసం ఉంద’ని చెప్పిన ట్రంప్ కనీసం తన పాత వ్యాఖ్యలకు వివరణనిచ్చే ప్రయత్నమైనా చేయలేదు. ఫలానా కారణాల వల్ల తన ఆలోచన మారిందని సంజాయిషీ ఇవ్వలేదు. అసలు గతంలో దీన్ని ప్రస్తావించిన సంగతే గుర్తులేనట్టు ప్రవర్తించారు. నిజానికి ఈ కారణం వల్లనే ట్రంప్‌ను విశ్వసించలేం. ఈ తాజా అభిప్రాయం కూడా ఎన్నాళ్లుంటుందో, ఎప్పుడు మారుతుందో చెప్పలేం. పూర్వాశ్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమునకలై ఉండటం వల్లకావొచ్చు...కశ్మీర్ పేచీని ఆయన కేవలం రెండు దేశాల స్థల వివాదంగా చూస్తున్నట్టు కనబడుతోంది. లేదా రెండు అణ్వస్త్ర దేశాల మధ్య తగాదా నివారించానన్న ఖ్యాతిని గడించి నోబెల్ శాంతి బహుమతిని సంపాదించాలన్న లక్ష్యం ఆయనకేమైనా ఉందేమో! ట్రంప్ ఉద్దేశాలేమైనా నరేంద్ర మోదీ ఆయన సమక్షంలోనే ‘అది ద్వైపాక్షిక సమస్య. రెండు దేశాలూ పరిష్కరించుకుంటాయి’ అని నిర్మొహమాటంగా చెప్పడం బాగుంది. అయితే ఈ విషయంలో ట్రంప్‌కు మాత్రమే కాదు...చాలా దేశాలకు ఆసక్తి ఉంది. నిరుడు జూలైలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మన దేశంలో పర్యటించినప్పుడు కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం నెరపడానికి తాము సిద్ధమేనని ప్రకటించడం గుర్తుంచుకోవాలి. చైనా సరేసరి. అది పాక్ వైఖరికి మొదటినుంచీ వంతపాడుతూనే ఉంది. అలాంటి దేశాలు మరికొన్ని ఉన్నాయి. సహజంగానే పాకిస్తాన్ మరిన్ని దేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా జమ్మూ–కశ్మీర్‌పై ప్రపంచ దేశాలకు ఉన్న అవగాహన వేరు. అది భారత్–పాక్‌ల మధ్య విభ జనకాలంలో ఏర్పడిన వివాదంగా అందరూ భావిస్తున్నారు. దానిపై పాకిస్తాన్‌తో సంప్రదింపులకు సిద్ధమేనని సిమ్లా ఒప్పందం మొదలుకొని ఆగ్రా డిక్లరేషన్ వరకూ మన దేశం చెబుతూ వస్తోంది. కానీ 370 అధికరణ రద్దు చేయడం ద్వారా, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ద్వారా దాని రూపురేఖల్ని మోదీ మార్చేశారు. అదిప్పుడు పూర్తిగా ఆంతరంగిక సమస్య అయింది. మారిన ఈ కొత్త పరిస్థితుల విషయమై ప్రపంచ దేశాలను ఒప్పించడానికి ఎంతో ఓపిక అవసరం. ట్రంప్‌కు దేనిపైనా నిలకడ ఉండదు కనుక ఆయన ఏ అభిప్రాయాన్నయినా ఇట్టే మార్చుకున్నట్టు కనబడతారు. తిరిగి పాత అభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారో చెప్పలేం. కానీ వేరే దేశాల అధినేతలకు అవగాహన కలిగించడానికి చాలా సమయమే పట్టవచ్చు. అయితే ఈలోగా మన దేశం కశ్మీర్లో చేయాల్సింది చాలా ఉంది. అక్కడి ప్రజానీకాన్ని విశ్వాసంలోకి తీసుకుని వారి మనసులను గెల్చుకునే ప్రయత్నం చేయాలి. కొత్త విధానాల పర్యవసానంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చునన్న ఉద్దేశంతో కశ్మీర్లో ఆంక్షలు విధించామని కేంద్రం చెబుతోంది. కానీ అవి సుదీర్ఘకాలం కొనసాగడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. కనుక సాధ్యమైనంత త్వరగా అక్కడ ప్రాథమిక హక్కులను పునరుద్ధరించి, సాధారణ పరిస్థితులు ఏర్పర్చగలిగితే... ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటే సత్ఫలితాలొస్తాయి. -
అమెరికా నుంచి మరిన్ని దిగుమతులు!
బియారిట్జ్/లండన్: ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అమెరికా నుంచి దిగుమతులు మరింతగా పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల విలువ చేసే దిగుమతులు తుది దశలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇరువురు భేటీ అయ్యారు. టారిఫ్‌లు, ఆర్థికాంశాలపై వివాదాలతో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో మోదీ, ట్రంప్ వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను, వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. వచ్చే నెల అమెరికాలో మోదీ పర్యటనకు ముందే ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చించాలని నేతలిద్దరూ నిర్ణయించినట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నట్లు గోఖలే చెప్పారు. అలాగే మోదీ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై చర్చించేందుకు ఉన్నతాధికారులను కూడా అవసరమైతే హ్యూస్టన్‌కు పంపేందుకు సిద్ధమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సెప్టెంబర్‌లో అమెరికా వెడుతున్న మోదీ.. 22న హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గోనున్నారు. అలాగే, అమెరికాలోని టాప్ ఇంధన కంపెనీల సీఈవోలతో కూడా భేటీ కానున్నారు. అక్కడ ఇంధన రంగంలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చించనున్నారు. -
మెలానియా, ట్రూడో ఫొటోపై విపరీతపు కామెంట్లు!
పారిస్ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల ఫొటోపై నెటిజన్లు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని...చాలా మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ #మెలానియాలవ్స్ట్రూడో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ 7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు పలువురు వారి జీవిత భాగస్వాములతో హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం దేశాధినేతల కుటుంబాలు ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. ఫొటోలు దిగుతున్న సమయంలో మెలానియా తన పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను మర్యాదపూర్వకంగా ముద్దుపెట్టుకున్నారు. ఇక అదే సమయంలో పక్కనే ఉన్న ట్రంప్ కళ్లు కిందకు వాల్చుకున్నట్లుగా ఉన్న ఫొటోను రాయిటర్స్ ట్విటర్లో షేర్ చేసింది. ‘ జీ7 ఫ్యామిలీ ఫొటోషూట్‌లో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ముద్దాడారు. అప్పుడు ట్రంప్ కిందకు చూస్తుండిపోయారు’ అంటూ జీ 7 సదస్సు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మెలానియా-ట్రూడో-ట్రంప్‌ల ఫొటోపై స్పందించిన నెటిజన్లు...‘ట్రంప్‌నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్ చేయడానికి వెనుకాడటం లేదనుకుంటా’ అంటూ విపరీర్థాలతో కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది గతంలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రూడో పక్కన కూర్చున్న ఫొటోను, ప్రస్తుతం మెలానియా ఫొటోను పోలుస్తూ...‘ ఇవాంకా, మెలానియా ట్రూడో వైపు ఎలా చూస్తున్నారో గమనించండి. మీ జీవితంలో అట్లాంటి వ్యక్తి రావాలని కోరుకోండి. ఎంతైనా ట్రూడో భలే అందగాడు. ఇదే కాదు గతంలో ఎన్నోసార్లు మెలానియా ట్రూడోను ఇలాగే చూశారు. అసలు విషయం ఏమిటో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. First lady Melania Trump kisses Canadian Prime Minister Justin Trudeau during the #G7 family photo as President Trump looks on. More of today’s top photos: https://t.co/xLPy8OSSmW pic.twitter.com/m5285qjAFr — Reuters Top News (@Reuters) August 26, 2019 -
కశ్మీర్‌పై మధ్యవర్తికి తావులేదు : మోదీ
బియార్రిట్జ్/లండన్: కశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్‌తోపాటు ఇతర ద్వైపాక్షిక అంశాలను భారత్, పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో మరో దేశాన్ని ఇబ్బందిపెట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఫ్రాన్సులోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పరిణామాలపై జీ–7 భేటీ సందర్భంగా ట్రంప్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య విబేధాలన్నీ ద్వైపాక్షిక సంబంధమైనవే. ఈ విషయాల్లో ఏ ఇతర దేశాన్ని కూడా ఇబ్బందిపెట్టడం మాకు ఇష్టం లేదు. ద్వైపాక్షిక సమస్యలను మేమే చర్చించి, పరిష్కరించుకుంటాం’ అని తెలిపారు. ‘1947 వరకు రెండు దేశాలు కలిసే ఉన్నాయి. ప్రస్తుతం ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న మేం అన్ని సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామనే నమ్మకం ఉంది. ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యాక పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ఫోన్లో మాట్లాడా. భారత్, పాకిస్తాన్‌లు పేదరికం, నిరక్షరాస్యత, అంటువ్యాధులతో పోరాటం సాగించాల్సి ఉంది. ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని కోరా’ అని తెలిపారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘మోదీతో వాణిజ్యం, సైనిక అంశా లు సహా పలు విషయాలపై చర్చించాం. కశ్మీర్ సమస్యను రెండు దేశాలు సొంతంగానే పరిష్కరించుకుంటాయనే నమ్మకం ఉంది. ఇరు దేశాల నేతలతోనూ నాకు మంచి సంబంధాలున్నాయి. తమంతట తామే ఈ సమస్యను వారు పరిష్కరించుకుంటారని విశ్వసిస్తున్నా’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఈ నెల 5వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే ప్రథమం. ఇద్దరు నేతలు ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం అంశాలపైనే 40 నిమిషాల పాటు చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు కశ్మీర్‌పై అమెరికా విధానంలో వచ్చిన భారత్ అనుకూల మార్పుగా భావిస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రధాని ప్రస్తావన ప్లాస్టిక్ వస్తువులను వాడి పారేసే విధానానికి స్వస్తి పలికేందుకు, నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, పర్యావరణ పరరిక్షణ దిశగా భారత్ చేపడుతున్న చర్యలను జీ–7 భేటీలో మోదీ ప్రస్తావించారు. జీవ వైవిధ్యం దెబ్బతినకుండా భారత్ తీసుకుంటున్న చర్యలు, వాతావరణ మార్పులు, నీటి వనరులపై ఒత్తిడి, సముద్రాల్లో కాలుష్యం’ అంశాలపై మోదీ మాట్లాడారని విదేశాంగ శాఖ తెలిపింది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమ్మిళిత, సాధికారికతల ద్వారా సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సహకారం, ఉగ్రవాదంపై పోరాటంపై చర్చించారు. కాగా, మూడు దేశాల పర్యటన ముగించుకుని మోదీ సోమవారం భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతారు. కానీ..: ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతారనీ, కానీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇష్టపడరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. జీ–7 భేటీ సందర్భంగా ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి, కరచాలనం అనంతరం కలిసి మాట్లాడారు. నేతలకు ప్రైవేట్‌గా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విలేకరులను కోరిన మోదీ వారు అడిగిన పలు ప్రశ్నలకు హిందీలో సమాధానాలు ఇచ్చారు. ‘ఆయన(మోదీ) వాస్తవానికి చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడగలరు. కానీ, ఆయనకు ఇంగ్లిష్ మాట్లాడటం ఇష్టం ఉండదు. మోదీతో సమావేశం గొప్ప విషయం. భారత్ గురించి చాలా విషయాలు తెలిశాయి’ అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్, మోదీ ఒకరి చేతులు మరొకరు చేతులు పట్టుకుని ఉండగా సమావేశం జరుగుతున్న గదిలో ఉన్న నేతలంతా పెద్ద పెట్టున నవ్వారు. స్నేహితుడు ట్రంప్‌తో జరిపిన సమావేశం చాలా ముఖ్యమైందని మోదీ పేర్కొనడం గమనార్హం. ట్రంప్‌తో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ -
జీ7 వేదికగా అమెరికాకు అవమానం!
పారిస్: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో అగ్రరాజ్యం అమెరికాకు అవమానం జరిగింది. ఈ సమావేశం నిర్వహించే బియారిట్జ్ నగరంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ప్రత్యక్షమయ్యారు. ఆయనతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మెక్రాన్ రహస్య సమావేశం నిర్వహించారు. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నో కామెంట్’ అని ఈ అంశాన్ని తేలిక పర్చడానికి ప్రయత్నించినా అమెరికా అధికారులు మాత్రం రగులుతూనే ఉన్నారు. ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తూ, ఇతర దేశాలు ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోరాదని ఒత్తిడి తెస్తున్న సందర్భంలో ఒక మిత్రదేశం ఇరాన్‌తో చర్చలు జరపడం, అది కూడా జీ7 వేదిక నగరంలోనే కావడం అమెరికాకు నిజంగా మింగుడుపడని అంశం. ఈ చర్చలపై ఇరాన్ మంత్రి మాట్లాడుతూ ‘దారి కష్టంగానే ఉన్నా విలువైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా బ్రిటన్, జర్మనీ ప్రతినిధులతో కూడా సమావేశం జరిపాం’ అని తెలిపారు. తాజా వ్యవహారంతో ఇరాన్ విషయంలో అమెరికా రోజురోజుకూ ఒంటరి అవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్‌తో 2015లో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చినా ఒప్పందంలోని మిగతా దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు ఇరాన్‌తో ఒప్పందాన్ని నామమాత్రంగా అయినా కొనసాగిస్తున్నాయి. గత కొంతకాలంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ఇరాన్ విషయంలో అమెరికా తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్ చర్యలపై కూడా అమెరికా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాలని, తాను మధ్యవర్తిత్వం వహిస్తానని మెక్రాన్ కొంతకాలంగా అమెరికాపై తీవ్ర ఒత్తిడి చెస్తున్నారని తెలిపారు. ఇతర దేశాలతో కలసి ఇరాన్‌తో ఒప్పందం కుదరదని, ఇరాన్ విషయంలో సొంత దృక్పథంతోనే ముందుకు వెళ్తామని తమ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్పాంపియో మాట్లాడుతూ ఇరాన్ మంత్రి అమెరికా వ్యతిరేక ఎజెండాను వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మాజీ యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అమెరికాను అగౌరవ పర్చే చర్య’ అని వాపోయారు. ఈ విమర్శలపై ఇరాన్ మంత్రి జరీఫ్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఎప్పటిలాగే ప్రవర్తించింది. నేను ఒక దేశానికి ప్రతినిధిని, వారికి బాధ కలిగించే వాస్తవం ఏంటంటే వారు నన్ను, నా కుటుంబాన్ని, నా ఆస్తులను ఏం చేయలేరు, ఎందుకంటే అవి ఏవీ ఇరాన్‌ను దాటి బయట లేవు’ అని చురకలంటించారు. నన్ను చూసి భయపడుతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానని కూడా వ్యాఖ్యానించారు. ఈ తాజా ఘటనపై ఓ విశ్లేషకుడు.. ‘ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక అగ్రరాజ్యానికి అవమానమా? వినడానికి ఎంత బాగుందో కదా అని ట్విటర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కనీసం కొందరు అంతర్జాతీయ నాయకులకు అయినా ఇరాన్‌తో చర్చలపై సమాచారం ఇవ్వాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. జీ-7 మూడు రోజుల(శని, ఆది, సోమ) పాటు బియారిట్జ్‌లో జరిగే సదస్సులో జీ7 దేశాల అధినేతలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాధినేతలు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీతో సహా పలువురు నేతలు ఆదివారమే ఫ్రాన్స్‌కు బయల్దేరారు. వాతావరణ మార్పులు, పర్యావరణం, డిజిటల్ సేవలు అనే అంశాలపై మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్, అమెజాన్ అడవిలో కార్చిచ్చు మొదలైనవి సదస్సులో ప్రధానాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. (చదవండి: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ) -
బహ్రెయిన్‌కు మీ కోసం వచ్చా
మనామా: బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస భారతీయుల శ్రమను మోదీ ప్రశంసించారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ప్రసంగించారు. ‘నేను భారత ప్రధానిగానే ఇక్కడకు వచ్చాను. కానీ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను కలిసి వారితో మాట్లాడటమే’ అని అన్నారు. బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు. వీరిలోనూ ఎక్కువ మంది కేరళీయులే. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొట్టతొలి భారత ప్రధాని మోదీయే. రూపే కార్డును ఉపయోగించి త్వరలోనే బహ్రెయిన్లోనూ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నామనీ, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ అవార్డు.. బహ్రెయిన్‌తో భారత సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు మోదీకి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ అవార్డును బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆదివారం విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది. బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఖలీఫాతో మోదీ చర్చలు జరిపిన అనంతరం ఓ సంయుక్త ప్రకటనను రెండు దేశాలు విడుదల చేశాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఫ్రాన్స్ చేరుకున్న మోదీ బియారిట్జ్: బహ్రెయిన్ పర్యటనను మోదీ ఆదివారం ముగించుకుని, జీ–7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. జీ–7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాన్సన్‌తో భేటీ అయిన మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ ఆదివారం బియారిట్జ్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు ప్రధానులు చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిం ది. బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ ఎన్నికయ్యాక ఆయనతో మోదీ తొలి భేటీ ఇది. -
మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం
పారిస్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీనివ్స్ లీ డ్రియన్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ, శుక్రవారం యూఏఈకి వెళ్లనున్నారు. అనంతరం బహ్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని.. ఆ దేశపు రాజు షేక్ హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమై చర్చలు జరుపుతారు. చివరగా ఆదివారం ఫ్రాన్స్‌కు తిరిగొచ్చి జీ7 సదస్సులో పాల్గొంటారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్తాన్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దదేందుకు నా వల్ల వీలైనంతమేరకు ప్రయత్నిస్తాను. అవసరమైతే అందుకోసం మధ్యవర్తిత్వం చేస్తాను’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లదాఖ్)గా విభజించింది. దీంతో భారత్–పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్రంప్ ఈ మేరకు స్పష్టం చేశారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్యనీ, ఇందులో మూడోపక్షం జోక్యాన్ని తాము సహించబోమని భారత్ ప్రకటించినప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. మరోవైపు తాలిబన్లతో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలపడకుండా అమెరికా బలగాలు అక్కడే మరికొంతకాలం ఉంటాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం తాము తాలిబన్లతో చర్చలు జరుపుతున్నామనీ, గతంలో ఏ అధ్యక్షుడూ ఈ పనిని చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షికమే: బ్రిటన్ ప్రధాని లండన్: జమ్మూకశ్మీర్ అన్నది భారత్–పాకిస్తాన్ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్ తెలిపింది. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కశ్మీర్, ఉగ్రవాదం, లండన్‌లో భారత హైకమిషన్ దగ్గర విధ్వంసం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బోరిస్ మాట్లాడుతూ..‘కశ్మీర్ సమస్యను భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యగానే బ్రిటన్ గుర్తిస్తోంది. దీన్ని ఇరుదేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. భారత్–బ్రిటన్లు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది’ అని తెలిపారు. ఉగ్రవాదమే పెనుముప్పు: మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌తో పాటు యూరప్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపారు. ‘ఈ ఉగ్రభూతంపై పోరాడేందుకు మనం సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తీవ్రవాదం, హింస అసహనం పెచ్చరిల్లకుండా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్) వంటి ఉగ్రవాద సంస్థలు మన గడ్డపై అడుగుపెట్టకుండా నిలువరించగలం’ అని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా మోదీ, బోరిస్ కలుసుకోనున్నారు. -
2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా
వాషింగ్టన్: తమ దేశంలో ఉన్న 2.5 కోట్ల మంది మెక్సికన్లను జపాన్‌కు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఆదేశ ప్రధాని షింజో అబేను బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. గత వారం కెనడాలో జరిగిన జీ–7 సమావేశం సందర్భంగా ట్రంప్ ఇలాంటి పలు వ్యాఖ్యలు చేశారని భేటీలో పాల్గొన్న యూరప్ దేశాల ప్రతినిధులు వెల్లడించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ‘యూరప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసలు. షింజో, మీకు ఈ సమస్య లేదు. అందుకే మీ దేశానికి నేను 2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా. అప్పుడిక మీరు వెంటనే పదవి కోల్పోతారు’అని ట్రంప్ అనడంతో అబే సహా అక్కడున్న నేతలంతా అసహనానికి గురయ్యారు. ఇరాన్, ఉగ్రవాదం అంశంపై ట్రంప్ మాట్లాడుతూ..‘మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి ఇమ్మానుయేల్, ఎందుకంటే టెర్రరిస్టులంతా పారిస్‌లోనే ఉన్నారు’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్నుద్దేశించి అన్నారు. అమెరికా దిగుమతులపై సుంకం పెంచిన చైనా బీజింగ్: అమెరికా నుంచి దిగుమతయ్యే దాదాపు 50 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా శనివారం సుంకాలు పెంచింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం పెంచిన మరుసటి రోజునే, గట్టి సమాధానమిచ్చేలా చైనా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యయుద్ధం మొదలైంది. -
తొందర్లోనే నీ పదవి ఊడిపోతుంది!
వాషింగ్టన్ : కెనడాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే జీ-7 సదస్సులో ప్రసంగిస్తూ సభ్యదేశాలు, అధినేతల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదం, వలసదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, సదస్సులో ఆయన ప్రవర్తించిన తీరు తోటి సభ్యులకు చిరాకు తెప్పించిందని యూరోపియన్ యూనియన్ అధికారి తెలిపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇమాన్యుయల్ను ఉద్దేశించి ఉగ్రవాదులంతా ప్యారిస్‌లోనే ఉన్నారన్నారు. వలసదారుల వల్ల స్థానికులకు కలుగుతున్న నష్టాల గురించి ప్రస్తావిస్తూ.. యూరోప్‌లో వలసదారులు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో జపాన్ ప్రధాని షింజో అబేకు అసలు ఏ సమస్యా లేదు. కానీ నేను తలచుకుంటే 25 మిలియన్ మంది మెక్సికన్లను జపాన్‌కు పంపించగలను. అదే జరిగితే తొందర్లోనే నీ పదవి ఊడిపోతుందంటూ’ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కథనాలపై స్పందించిన ట్రంప్.. మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని.. జీ-7 దేశాధినేతలతో తనకు సత్సంబంధాలే ఉన్నాయంటూ వరుస ట్వీట్లతో అమెరికన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘నరకంలో స్పెషల్ రూమ్’.. దుమారం!
వాషింగ్టన్ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అనుచిత వ్యాఖ్యలు చేసిందుకుగానూ వైట్‌హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో క్షమాపణలు కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ట్రూడోను ఉద్దేశించి ‘నరకంలో మీకు ప్రత్యేక చోటు’ ఉంటుందని వ్యాఖ్యానించినట్లు ఒప్పుకున్నారు. స్థానిక మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాలను వెల్లడించింది. ‘ఇటీవల జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా ఉద్దేశాన్ని స్పష్టంగా తెలపాలనుకున్నా. కానీ నేను ఉపయోగించిన భాష సరైంది కాదని’ పీటర్ నవరో వివరణ ఇచ్చుకున్నారు ‘కెనడాతో మాకు ఎలాంటి విభేదాలు లేవు. అమెరికా - కెనడాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతాయి. దౌత్య సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటుండదు. పరిశ్రమలు, సంస్థలు, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని’ ట్రేడ్ మినిస్టర్ ఫ్రాన్సిస్ ఫిలిప్ అన్నారు. వైట్‌హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ లారీ కుడ్లో కూడా కెనడా ప్రధాని ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఇటీవల జీ–7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన విషయం తెలిసిందే.‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి పచ్చి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్ (పన్ను)లు ఎక్కువగా ఉన్నాయని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
రెండు సదస్సులు భిన్న దృశ్యాలు
వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టే రెండు చిత్రాలు మీడియాలో సోమవారం ప్రముఖంగా దర్శనమిచ్చాయి. అందులో ఒకటి చైనాలోని చింగ్దావ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిందైతే...రెండోది కెనడాలోని క్యుబెక్‌లో జరిగిన జీ–7 దేశాల అధినేతల సమావేశ దృశ్యం. ఎస్సీఓ సదస్సులో నేతలందరూ వాణిజ్యం, భద్రత రంగాల్లో సమష్టిగా కలిసి పనిచేసి అభివృద్ధి సాధించాలని నిర్ణయించుకోగా...జీ–7లో నేతలు పరస్పర ఆరోపణలతో పొద్దుపుచ్చారు. జీ–7 సదస్సు ముగిశాక కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దేశాధినేతలమధ్య అవగాహన కుదిరిందంటూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయగా అది నిజం కాదని, దాన్ని తాము ఖండిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి సదస్సు పరువు తీశారు. అయితే ఎస్సీఓ సదస్సులోనూ విభేదాలు రాకపోలేదు. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)కు భారత్ మినహా ఎస్సీఓ దేశాలన్నీ మద్దతు ప్రకటించాయని సదస్సు ముగింపు తర్వాత విడుదలైన ప్రకటన తెలిపింది. రెండు సదస్సుల తీరు తెన్నులనూ గమనిస్తే మనం ఎంత మెలకువతో వ్యవహరించాలో అర్ధమవుతుంది. ఎస్సీఓ యూరేసియా దేశాల కోసం చైనా చొరవతో ఏర్పాటైన సంస్థ. అందులో రష్యాతోపాటు మన దేశం, పాకిస్తాన్, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్ సభ్య దేశాలుగా ఉంటే ఇరాన్, అఫ్ఘానిస్తాన్ వంటివి పరిశీలక హోదాలో పాల్గొంటున్నాయి. బీఆర్ఐపై భిన్నాభిప్రాయం మినహా ఆ సదస్సులో చర్చించిన ఇతర అంశాలపై మన దేశానికి ఏకీభావం ఉంది. ఎస్సీఓలో మన దేశానికి పూర్తి స్థాయి సభ్యత్వం రావడం ఇదే ప్రథమం. మనతోపాటు పాకిస్తాన్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. చైనా చొరవతో రూపుదిద్దుకున్న బీఆర్ఐ ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. అమెరికాతో పాటు అగ్ర రాజ్యాలన్నీ స్వీయ మార్కెట్ల రక్షణ కోసం మార్గాలు వెదుక్కుంటున్న వేళ ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాల వాణిజ్యాన్ని అనుసంధానించే బీఆర్ఐ నిస్సందేహంగా బహుళవిధ ప్రయో జనకరమైనదే. ప్రాచీన కాలంలోని సిల్క్ రోడ్‌ను తలపించేలా ఖండాంతరాల్లోని దాదాపు 80 దేశా లను అనుసంధానించే ఈ ప్రాజెక్టు ప్రపంచ జనాభాలో 64శాతం మంది అంటే 450 కోట్ల ప్రజా నీకాన్ని ఏకం చేస్తుంది. ఈ దేశాలన్నిటి మధ్యా వాణిజ్యం అత్యంత సులభమై అన్ని దేశాలూ సంప న్నవంతం కావడానికిది దోహదపడుతుంది. ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా దేశాలతో నేరుగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి, మన మార్కెట్‌ను ఇప్పటికన్నా ఎన్నో రెట్లు విస్తరించు కోవడానికి బీఆర్ఐ నిస్సందేహంగా ఉపయోగపడుతుంది. అయితే మన దేశానికున్న ప్రధాన అభ్యంతరమల్లా అలాంటి ప్రాజెక్టు దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతలను గుర్తించి గౌరవించాలన్నదే. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని గిల్గిత్–బాల్టిస్తాన్‌ల మీదుగా వెళ్తోంది. సారాంశంలో బీఆర్ఐ ప్రాజెక్టును మన దేశం అంగీకరించడమంటే పాక్ దురాక్రమణకు ఆమోదం తెలపడమే, సాధికారత కల్పించడమే అవుతుంది. అగ్రరాజ్యాల మధ్య విభేదాలు ముదురుతూ జీ–7 దేశాల శిఖరాగ్ర సద స్సుల వంటివి కూడా విఫలమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా ఎదగా లని చైనా తహతహలాడుతోంది. పలుకుబడిని విస్తరించుకోవాలని ఆశిస్తోంది. అటువంటప్పుడు దాదాపు 130 కోట్ల జనాభాతో ఆసియాలో తన పొరుగునే అతి పెద్ద మార్కెట్‌గా రూపుదిద్దుకున్న భారత్ మనోభావాలను విస్మరించడం చైనాకు తగని పని. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఏర్పాటైన ప్రాజెక్టులో ఏ దేశమైనా ఎలా పాలుపంచుకోగలదో చైనా ఆలోచించాలి. నిజానికి దాదాపు రెండేళ్లనుంచి ఈ విషయంలో మన దేశం అభ్యంతరం చెబుతూ వస్తోంది. ఎస్సీఓలో భారత్, పాకి స్తాన్లు రెండూ చేరడంతో సంస్థ బలోపేతమైందని చెప్పిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్... సభ్య దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని విడనాడాలని, ఇతర సభ్య దేశాల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలని సూచించారు. మంచిదే. కానీ బీఆర్ఐలో ఉన్న లోపాల మాటేమిటి? తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్న ఇండో–పసిఫిక్ ప్రాంత కూటమిలో మన దేశం పాలు పంచుకుంటున్నదన్న దుగ్ధ చైనాకు ఉంది. భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాల భాగ స్వామ్యంతో ఏర్పాటయ్యే ఆ ‘చతుర్భుజ కూటమి’ ఇంకా శైశవ దశలోనే ఉంది. నాలుగు దేశాల మధ్యా చర్చలు సాగుతున్నా చివరిలో వేర్వేరు ప్రకటనలు వెలువడుతున్నాయి తప్ప ఉమ్మడి ప్రకటనల దశ ఇంకా మొదలు కాలేదు. ఇండో–పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలని, అన్ని దేశాల అభివృద్ధికీ దోహదపడేలా ఉండాలని స్థూలంగా ఆ కూటమి భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని దీవులు తమవేనంటూ సొంతం చేసుకున్న చైనా తీరును మిగిలిన మూడు దేశాలూ పరోక్షంగా తప్పుబడుతున్నాయి. అక్కడి సముద్ర జలాల్లో స్వేచ్ఛా సంచారానికి వీలుం డాలని, అంతర్జాతీయ నిబంధనలు వర్తించాలని ఆ దేశాలు అంటున్నా మన దేశం ప్రకటనలు ఇంత వరకూ వాటి జోలికి పోలేదు. అయినా మనపై చైనా గుర్రుగా ఉంది. అందుకే కావొచ్చు... బీఆర్ఐ విషయంలో మన వాదనను విస్మరిస్తోంది. జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగిన తీరు, అక్కడ భారత్ ప్రస్తావన తెచ్చి విమర్శించిన ట్రంప్ వైఖరి గమనించాక మన విదేశాంగ విధానం మరింత పదునుదేరాలని అర్ధమవుతుంది. అయిదు వారాల క్రితం అనధికార శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, జిన్‌పింగ్‌లు ఇప్పుడు ఎస్సీఓ సదస్సు సందర్భంగా కూడా కలుసుకున్నారు. మరో అన ధికార శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చే ఏడాది మన దేశం వస్తానని జిన్‌పింగ్ చెప్పారు. ఈ పరిణా మాలు ఎంతో ఆశావహమైనవి. ఇవి అపోహలనూ, విభేదాలనూ పటాపంచలు చేసి రెండు దేశాల మధ్యా మరింత సాన్నిహిత్యానికి దోహదపడాలని ఆశిద్దాం. -
ట్రంప్‌తో భేటీకి సిద్ధమన్న పుతిన్
మాస్కో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి తాను సిద్దమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. జీ-7 కూటమిలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా పుతిన్ స్వాగతించారు. ట్రంప్‌ని కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ ఆదివారం మీడియాకు తెలిపారు. అమెరికా నుంచి ఎంత త్వరగా స్పందన వస్తే.. అంతే వేగంగా సమావేశం జరుగుతుందన్నారు. ట్రంప్ కూడా ఈ మీటింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్టు పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న ఆయధ పోటీకి సంబంధించి ట్రంప్‌తో జరిగిన సంభాషణ గురించి ఆయన ప్రస్తావించారు. ట్రంప్ నిర్ణయంతో తాను ఏకీభవిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా వియన్నా ఈ సమావేశానికి అనుకూల ప్రదేశం అని పుతిన్ తెలిపారు. ఇది కేవలం సూచన మాత్రమే దీనిపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ఆస్ట్రియాతో సహా పలు దేశాలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఉన్నాయన్నారు. తిరిగి జీ-8 ఏర్పాడలనే ట్రంప్ నిర్ణయంపై పుతిన్ వేగంగా స్పందించడం చూస్తేంటే భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
డొనాల్డ్ ట్రంప్ ఏకాకి
లామాల్బె(కెనడా): ఊహించినట్లుగానే జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు వాడివేడిగా జరిగింది. మిత్ర దేశాల అల్యూమినియం, ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచిన అంశం చర్చలను కుదిపేసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా అమెరికా ఒక వైపు, మిగిలిన ఆరు దేశాలు మరోవైపు చీలిపోయినట్లు తెలుస్తోంది. వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోలేదని తెలిసింది. సుంకాల పెంపుతో ఇతర దేశాల్లో నెలకొన్న వ్యతిరేకతను ఉమ్మడి ప్రకటన లాంటివి దాచలేవని భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితంగా కెనడాలోని క్యూబెక్‌లో జరిగిన రెండు రోజుల సదస్సు శనివారం ప్రతిష్టంభనతోనే ముగిసింది. విభేదాలు ప్రస్ఫుటం.. వాణిజ్య యుద్ధానికి దారితీసేలా ఉన్న పరిణామాల నడుమ..రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదన పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ సూచనను ఐరోపాకు చెందిన కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఇమాన్యుయేల్ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయని అన్నారు. వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిందని, అయినా అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని తెలిపారు. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని తిప్పికొట్టింది. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ ఒప్పందం తదితరాలపై ట్రంప్ వైఖరిని తప్పుపట్టిన యూరోప్ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి. -
శాంతి కోసం పాటుపడాలి
జీ7 సదస్సులో ఒబామా ఐసే-షిమా(జపాన్): యుద్ధతంత్రాల వల్ల కలిగే నష్టాలను తెలియజెబుతూ శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన అవసరాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నొక్కిచెప్పారు. జపాన్‌లో జరుగుతున్న రెండు రోజుల జీ7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అణుబాంబు దాడికి బూడిదైన హిరోషిమాను శుక్రవారం ఆయన సందర్శించనున్నారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు దాడి తరువాత అక్కడికి వెళుతున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. ఈ చారిత్రక పర్యటన నేపథ్యంలో ఒబామా విలేకరులతో మాట్లాడారు. ‘నాటి యుద్ధం నేటి మనసుల్లో ఉండకపోవచ్చు... కానీ అణుబాంబు ఛాయలు ఇంకా వెనక్కి లాగుతూనే ఉంటాయి’ అని ఒబామా అన్నారు. హిరోషిమాలో అణుబాంబు దెబ్బకు 1.4 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కొందరు రేడియేషన్ సంబంధిత గాయాలతో నేటికీ కోలుకోలేకపోతున్నారు. నాడు మరుభూమిగా మారిన హిరోషిమాలోని స్మృతి చిహ్నం వద్ద ఒబామా శుక్రవారం పుష్పాంజలి ఘటిస్తారు.