మాస్కో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి తాను సిద్దమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. జీ-7 కూటమిలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా పుతిన్ స్వాగతించారు. ట్రంప్‌ని కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ ఆదివారం మీడియాకు తెలిపారు. అమెరికా నుంచి ఎంత త్వరగా స్పందన వస్తే.. అంతే వేగంగా సమావేశం జరుగుతుందన్నారు. ట్రంప్ కూడా ఈ మీటింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్టు పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న ఆయధ పోటీకి సంబంధించి ట్రంప్‌తో జరిగిన సంభాషణ గురించి ఆయన ప్రస్తావించారు. ట్రంప్ నిర్ణయంతో తాను ఏకీభవిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతేకాకుండా వియన్నా ఈ సమావేశానికి అనుకూల ప్రదేశం అని పుతిన్ తెలిపారు. ఇది కేవలం సూచన మాత్రమే దీనిపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ఆస్ట్రియాతో సహా పలు దేశాలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఉన్నాయన్నారు. తిరిగి జీ-8 ఏర్పాడలనే ట్రంప్ నిర్ణయంపై పుతిన్ వేగంగా స్పందించడం చూస్తేంటే భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment